snow effect
-
Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు
గోపేశ్వర్: ఛార్‌ధామ్ యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం చేపట్టిన మౌలికసదుపాయాలు తదితర సన్నాహక కార్యక్రమాలకు మంచు అడ్డుపడుతోంది. గురువారం భద్రీనాథ్, కేదార్నాథ్ పర్వతప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. లోయ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ ఆలయాలు కొలువుతీరిన ఛమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మంచు, వర్షం, అతిశీతల గాలులు ఉష్ణోగ్రతలను తగ్గించేస్తున్నాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో భక్తులను కేదార్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతించనున్న ఈ తరుణంలో గుడికి వెళ్లే ట్రెక్ మార్గంలో మంచు పడుతోంది. అక్షయ తృతీయను పురస్కరించు కుని ఈనెల 22వ తేదీన గంగోత్రి, యము నోత్రి ఆలయాలు తెరుచు కోను న్నాయి. కేదార్నాథ్ ఆల యాన్ని 25వ తేదీన, భద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 27వ తేదీన భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. లక్షలాది మంది ఛార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న ఈ సమయంలో మంచు ముంచుకురావడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. -
పొగమంచు తెచ్చిన తంటా.. ఒకదాన్నొకటి ఢీకొన్న పది వాహనాలు
నాదెండ్ల: పొగ మంచు కారణంగా జాతీయ రహదారిపై కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిన ఘటన బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన సుదర్శనరావు గుంటూరు సమీపంలోని పొత్తూరు టుబాకో కంపెనీలో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై డ్యూటీకి బయలుదేరాడు. జాతీయ రహదారిపై గణపవరం వద్ద ప్రసన్న వంశీ స్పిన్నింగ్ మిల్లు సమీపానికి రాగానే పొగమంచు కారణంగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం లారీ టైర్ల కింద నుజ్జునుజ్జవగా సుదర్శనరావు స్వల్ప గాయాల పాలయ్యాడు. వెనుక వస్తున్న వాహనాలు నెమ్మదించి రోడ్డుపై నిలిచాయి. పొగమంచు ఉండటంతో ముందు నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో వాహనం, అశోక్‌లేలాండ్ మినీ లారీలు, కారు, ట్యాంకర్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో జనాలు గుమిగూడటంతో ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ బస్సును కొద్దిదూరంలో నిలిపాడు. ఆ వెనుకే మరో ఆర్టీసీ బస్సు నిలిచింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న లోడ్ లారీ వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో ముందు ఆర్టీసీ బస్సులోని ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. పది వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనటంతో రెండు గంటలపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదంలో రాజమమస్త్రంద్రవరానికి చెందిన లారీ క్లీనర్ ప్రసాద్ గాయాలపాలయ్యాడు. క్షతగాత్రులను 108లో చిలకలూరిపేట వైద్య శాలకు తరలించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. మొదట ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. -
నందిగామలో మంచు ఎఫెక్ట్
-
ఎవరైనా వణకాల్సిందే.....
హిమాచల్ ప్రదేశ్ మారుమూల మంచు దుప్పట్లో నిరంతరం మునగీదసుకుంటున్న ఆ గ్రామాలకు వెళ్లాలంటే రాజకీయ పార్టీల అభ్యర్థులే కాదు, ఎన్నికల సిబ్బంది సైతం వణకాల్సిందే! దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి తాకిడి మొదలవుతున్నా, హిమాచల్‌లోని కిన్నౌర్, సిమ్లా జిల్లాల్లోని దాదాపు వెయ్యి కుగ్రామాలు ఇంకా మంచు తాకిడిలోనే ఉన్నాయి. ఎన్నికలతో దేశమంతా వేడెక్కుతున్నా, ఈ ప్రాంతాల్లో మాతం రాజకీయ పార్టీలు ప్రచారం చేసే పరిస్థితులే లేవు. లాహౌల్-స్పితి, కిన్నౌర్ జిల్లాలతో పిగు చంబా జిల్లాలోని కొన్ని పాంతాలు మండీ లోక్‌సభ స్థానాల్లో మే న పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి 9వేల నుంచి 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి.