breaking news
rains
-
ఈ రాష్ట్రంలో మరో 5 రోజులు భారీ వర్షాలు
-
ఎల్ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అనూహ్యంగా నిలిచిపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు ముందుకు సాగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికే దేశమంతటా రుతుపవనాల విస్తరణ వేగంగా జరగాలి. కానీ ఈసారి ఆ సహజ గమనంలో అంతరాయం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ఎల్ నినోనే ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అయితే లోతైన అధ్యయనాలు కొనసాగుతున్న కొద్దీ, శాస్త్రవేత్తలు ఈ మార్పు వెనుక ఒకే కారణం కాకుండా.. ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు..పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ అస్థిరతలు, భారత మహాసముద్రంలో తేమ ప్రవాహాల్లో మార్పులు, అలాగే ఖండాల మధ్య గాలుల సమతుల్యతలో వచ్చిన వ్యత్యాసాలు కలిసి ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు ముందుకు సాగడానికి అవసరమైన తక్కువ పీడన వ్యవస్థలు ఈసారి సమయానికి ఏర్పడకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తక్కువ పీడన కేంద్రాలు లేకపోవడం వల్ల వర్ష మేఘాలు లోపలికి చొచ్చుకుపోవడం తగ్గిపోయింది.ఇక ఉత్తర భారతంపై తరచూ ప్రభావం చూపే పశ్చిమ దిశ వాతావరణ వ్యవస్థలు ఈసారి అసాధారణంగా క్రియాశీలంగా మారాయి. ఇవి పొడి గాలులను దక్షిణ దిశకు తీసుకువచ్చి, తేమను తగ్గించడంతో మేఘాల ఏర్పాటుకు అనుకూలం కాని పరిస్థితిని సృష్టించాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు సాగాల్సిన దారి మధ్యలోనే బలహీనపడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడితే మరొక వ్యవస్థ దాన్ని పూరిస్తుంది. కానీ ఈసారి అన్ని సహజ చక్రాలు ఒకేసారి అనుకూలంగా లేకపోవడం వల్ల సమతుల్యత దెబ్బతింది.అలాగే భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ప్రభావితం చేసే సహజ చక్రం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీని వల్ల వర్ష మేఘాల సమూహాలు బలపడకుండా విడిపోయి, నిర్దిష్ట ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం తగ్గింది. దీంతో విస్తృత స్థాయిలో వర్షాలు కురవాల్సిన అవకాశం తగ్గిపోయింది.కాబట్టి ఎల్ నినో ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. అది ఒక్కటే ఈ స్థాయి విఘటనకు కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం మొత్తం వాతావరణ సమీకరణంలో ఒక భాగం మాత్రమేనని, కానీ అసలు సమస్య అనేక వ్యవస్థల సమకాలీన అసమతుల్యతతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అంటే రుతుపవనాల కదలికను ఎల్ నినో అనే ఒకే కారణంతో వివరించడం ఇప్పుడు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ చివరి వారంలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల గాలులు తిరిగి బలపడడం, భూమధ్యరేఖ నుంచి వచ్చే తేమ ప్రవాహం పెరగడం, పై స్థాయిలో గాలుల దిశ అనుకూలంగా మారడం వంటి అంశాలు కలిసి రుతుపవనాలకు మళ్లీ ఊపునివ్వవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వేగంగా జరుగుతుందన్నదే కీలకంగా మారింది.మొత్తానికి ఈసారి రుతుపవనాల నిలకడ వెనుక ఒకే కారణం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. సహజ వాతావరణ చక్రాల్లో చిన్న మార్పు కూడా దేశవ్యాప్తంగా వర్షాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. రైతుల ఆశలు వర్షాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ వాతావరణ సమతుల్యత ఎంత త్వరగా తిరిగి వస్తుందన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. -
నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయా? మాన్ సూన్ ఎందుకు ఆగింది
-
ఏపీకి భారీ వర్ష సూచన మరో 5 రోజులు వానలే వానలు
-
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటలు అత్యంత కీలకమని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బుధవారం సాయంత్రంలోపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వర్ష ప్రభావం కారణంగా విద్యుత్ అంతరాయాలు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశాలు ఉండటంతో స్థానిక యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.🔴 రెడ్ అలర్ట్:విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.🟡 ఎల్లో అలర్ట్:తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించింది. అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించింది. మొత్తం పరిస్థితిని చూస్తే రాబోయే గంటలు రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్:వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఎండలు సైతం తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది. -
ఏపీలో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు
-
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో హైఅలర్ట్... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
-
రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు
-
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం అన్నమయ్య జిల్లా కలికిరిలో 3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా నిమ్మనపల్లెలో 2.9, చిత్తూరు జిల్లా పలమనేరులో 2.4, కార్వేటినగరంలో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆవర్తనం ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారమున్నట్లు పేర్కొంది. గంటకు 40– 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండ విజృంభించింది. ప్రకాశం జిల్లా కారేడులో 43.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా గూడూరులో 43, మన్యం జిల్లా భామినిలో 41.7, అనకాపల్లి జిల్లా చీడికాడలో 41.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతిలో కుండపోత వర్షం.. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ఉకిరిబిక్కిరికి గురైన తిరుపతి జిల్లా ప్రజలను వరుణుడు కరుణించాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు పెద్ద ఎత్తున చేరడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. -
వచ్చే ఐదు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: రాబోయే ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కొవ్వూరులో అత్యధిక ఉష్ణోగ్రతఇదిలా ఉండగా గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం, విశాఖ జిల్లా గాజువాక, విజయనగరం జిల్లా రాజాంలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. కోనసీమ జిల్లా శివలలో 43.3, శ్రీకాకుళం జిల్లా రావివలసలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతంమరోవైపు బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 5.7 సెంటీ మీటర్లు, ఏలూరు జిల్లాలో 3.7 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లాలో 3.49 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 3.2, గుంటూరు జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
-
భిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురవగా.. అనేక చోట్ల ఎండ, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2, తణుకులో 43.9, ఇంకొల్లు, కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మి.మీ, లావేరులో 64.5 మి.మీ. వర్షం కురిసింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలతో పాటు పలు కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
అటు మండే ఎండలు.. ఇటు పిడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పన్టీమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటొచ్చు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం 41–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జైన్ తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40–41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా.. మంగళవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4, మన్యం జిల్లా భామినిలో 42.2, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 42, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం 41.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
దంచికొడుతున్న వర్షం.. చెరువులైన రోడ్లు
-
హైదరాబాద్ లో భారీ వర్షం...
-
తెలంగాణను తాకిన రుతుపవనాలు ఏపీకి ఎప్పుడంటే...?
-
కేరళ, కర్ణాటకలో అలర్ట్ ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక
-
కొనసాగుతున్న ఎండ తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.7, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.3, కృష్ణా జిల్లా కానుమోలులో 43.1, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.1, ప్రకాశం జిల్లా కరేడులో 43, విజయనగరం జిల్లా రాజాంలో 42.7, అనకాపల్లి జిల్లా రాజాంలో 42.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లా పి.కోటకొండలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లా హంద్రీకైర్వాడిలో 4.2, బాపట్ల జిల్లా గూడవల్లిలో 4.2, కర్నూలు జిల్లా గూడూరులో 2.7, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1.7, ఎర్రమంచిలో 1.3, అనంతపురం జిల్లా సలకంచెరువులో 1.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నేడు ఎండ తీవ్రత ఉండే ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
నైరుతి ఎంట్రీ.. ఏపీ, తెలంగాణలో వర్ష్పాల జోరు
-
ఎండ.. వాన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం ఎండ, వానతో విభిన్న వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం ఎండ, వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని పలుచోట్ల 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలుమరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 3 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా తాడేపల్లి 2.7, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 1.8, విజయనగరం జిల్లా గుర్లలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఇదే విధంగా ముందుకు కదలితే 7, 8 తేదీల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు వచి్చనా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. -
Weather Updates: వచ్చేసిన రుతుపవనాలు.. ఇక వానలే.. వానలు
-
కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఒక్కసారిగా పెరిగి, అనేక జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత పెరగడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ప్రవేశాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.కేరళలోని సుమారు 15 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు, తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదే సమయంలో కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ తమిళనాడు, చెన్నై ప్రాంతాల్లో కూడా వర్ష సూచనలు వెలువడుతున్నాయి. అక్కడ కూడా మేఘావృత వాతావరణం నెలకొని, రాబోయే గంటల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఆలస్యంగా, దాదాపు పది రోజుల ఆలస్యంతో కేరళ తీరాన్ని తాకినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి తీవ్రత ఆశించినంత బలంగా లేదని భారత వాతావరణ శాఖ ప్రాథమిక విశ్లేషణలో పేర్కొంది. రుతుపవనాల ప్రస్తుత దశ బలహీనంగానే కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది.ఇక రాబోయే వారం రోజుల్లో ఈ రుతుపవనాలు క్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. మరో వారం తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే చాన్స్ కనిపిస్తోంది. దక్షిణ భారతంలో వర్షపాతం పెరుగుతుందా లేదా అన్నది రుతుపవనాల బలం, దిశపై ఆధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కేరళలో వర్షాలు మొదలైన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో రుతుపవనాల వేగం ఎలా మారుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఒకవైపు ఎండ ప్రభావం మరోవైపు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 19, మన్యం 14, అల్లూరి 1, పోలవరం 1 మండలం మొత్తంగా 46 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 79 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం 85 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని చెప్పారు. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వెల్లడించారు. -
రెండ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 నుంచి 1డిగ్రీ సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తోందని, రానున్న నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉడికిన రాష్ట్ర ప్రజలకు ఐఎండీ తాజా సూచన కాస్త ఉపశమనం ఇచ్చినట్లైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది.నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అలాగే నైరుతి, పశ్చిమ–మధ్య, తూర్పు– మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి గురువారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.0 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. -
ఓ వైపు పిడుగులు.. మరోవైపు వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, తీవ్ర ఎండల ప్రభావంతో విభిన్న పరిస్థితులు నెలకొన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40–44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 6, పార్వతీపురంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 28 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయన్నారు. మంగళవారం గూడూరులో 45.4 డిగ్రీలు, పిడుగురాళ్లలో 44.9, ప్రకాశం జిల్లా కొండపిలో 44.6 డిగ్రీల∙గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. -
ఎండలు రివర్స్ గేర్, భారీ ఈదురు గాలులతో ఏపీకి వానలు
-
మరో 24 గంటల్లో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రైన్ అలర్ట్
-
నేడు పిడుగులతో కూడిన వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వివరించారు. దీని ప్రభావంతో ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ చెదురు మదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యధికంగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి అనంతపురం జిల్లా హుస్సేన్‌పురంలో 51 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కడప జిల్లా పెద్దపసుపల్లెలో 45, చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7, అనంతపురం జిల్లా వెన్నపూసపల్లెలో 31.5, కడప జిల్లా ఉప్పలూరులో 29, తొర్రివేముల 26, పొత్తిపాడులో 26, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. వర్షాల ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆదివారం 17 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. -
వానలు ఇప్పట్లో కష్టమే..!
-
భారీ వర్షం లోయలో ఇరుక్కుపోయిన బొలెరో
-
ఏపీకి రెయిన్ అలర్ట్ ఆ జిల్లాల్లో వర్షాలు
-
మేఘ సందేశం... మే 26 న కేరళకు నైరుతి రుతుపవనాలు
-
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు
-
ఏపీకి అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు. -
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు మే లోనే వర్షాలు..?
-
చల్లటి కబురు చెప్పిన ఐఎండీ
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి.. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణంగా మే రెండో వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్నాయి. వడగాడ్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి.ఈ నెల 14 లేదా 15న అండమాన్ తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణాది, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లో మే 7 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, 30-40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మే 4 నుండి మే 7 మధ్య వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.రేపు, ఎల్లుండి(మే 3,4) జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్-మణిపూర్-మిజోరం-త్రిపుర ప్రాంతాల్లో మే 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో మే 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.తెలంగాణలో సాధారణంగా మే రెండో వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు వరుసగా నమోదు కావడాన్ని హీట్‌వేవ్ (వడగాడ్పులు)గా పరిగణిస్తారు.ఈ లెక్కన రాష్ట్రంలో ఏప్రిల్ 14 నుంచి వరుసగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్‌లోనే ఏకంగా 14 రోజులపాటు హీట్‌వేవ్ ప్రభావం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక మేలో తొలిరోజునే 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రతలు నమోదవగా ఈ నెలలో ఇంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడగాడ్పుల రోజులు సైతం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నవాతావరణంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. ఈ లోపు వాతావరణ శాఖ ఇరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. వడగాలులు ముప్పు కూడా పొంచి ఉందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఏపీలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే.. ఇటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వర్షాలతో ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరో మూడు రోజులపాటు..ఏపీలోని కృష్ణా జిల్లా పాలకాయతిప్ప వద్ద సముద్రంను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. గత రెండు రోజులుగా వెయ్యి మీటర్లు ముందుకు చొచ్చుకుని వచ్చింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున సమద్రుపు అలలు ఎగసిపడుతున్నాయి. ఇన్నేళ్లలో.. ఈ సీజన్లో ఎప్పుడూ సముద్రాన్ని ఇలా చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. చల్లటి కబురువాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే రెండో లేదంటే మూడో వారం తీరాన్ని తాకుతాయని తెలిపింది. -
భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)
-
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు
సాక్షి,అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
మండిన ఎండ.. అక్కడక్కడ వాన
రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన ఎండలు కాస్తుండగా.. మరోవైపు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ సీజన్లోనే గరిష్టంగా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అన్నమయ్య జిల్లా పుంగనూరు, అనకాపల్లి జిల్లా రావికమతం, విశాఖ జిల్లా ఆనందపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
ఓ పక్క కుండపోత.. మరోపక్క ఎండల వాత!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క వరుణుడు కాలం కాని కాలంలో వర్షాలు కురిపిస్తుండగా, మరో పక్క భానుడు భగభగమంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 5.9 సెంటీమీటర్ల వర్షం కురవగా, దక్షిణ కోస్తాలోని మార్కాపురంలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురం, నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో 42.6, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 42.2, ఎన్టీఆర్ జిల్లా చందాపురం, కడప జిల్లా ఒంటిమిట్టలో 41.9, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 41.2, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 155 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు అనకాపల్లి జిల్లా రాజంలో 5.4, చూచుకొండలో 3.9, అనకాపల్లిలో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.️ -
ఆంధ్రప్రదేశ్ అకాల వర్షాలు
-
ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు ,తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది. -
వాతావరణంలో మార్పులు సూర్యాపేటలో భారీ వర్షం
-
Delhi: మళ్లీ కృత్రిమ వర్షం.. సక్సెస్ అయ్యేనా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కృత్రిమ వర్షం కురిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసే అత్యవసర చర్యల్లో భాగంగా, ఈ వేసవిలో (ఏప్రిల్ - జూన్ 2026 మధ్య) ‘క్లౌడ్ సీడింగ్’ ప్రయోగాలను నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ సన్నాహాలు చేస్తోంది.ఈ ప్రయోగాల కోసం ఐఐటీ కాన్పూర్ ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి కోరింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఢిల్లీ పర్యావరణ శాఖ, ఐఐటీ కాన్పూర్ మధ్య 2025 సెప్టెంబర్ 25న ఒక కీలక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే గత ఏడాది అక్టోబర్‌లో రెండుసార్లు ప్రయోగాలు నిర్వహించినప్పటికీ నగరంలో వర్షం కురవలేదు.మేఘాల్లో తేమ శాతం తక్కువగా (కేవలం 15 నుంచి 20 శాతమే) ఉండటం కారణంగానే నాటి ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. అయితే ఆ వైఫల్యం ద్వారా భవిష్యత్తు ప్రయోగాలకు పనికొచ్చే కీలక వాతావరణ పరిస్థితుల గురించి నేర్చుకున్నామని తెలిపింది.క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి?మేఘాల నుంచి వర్షం పడే అవకాశాలను కృత్రిమంగా పెంచే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. విమానాల ద్వారా మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ వంటి రసాయనాలతో కూడిన ఫ్లేర్లను వదులుతారు. ఇవి మేఘాల్లో మంచు స్ఫటికాలు లేదా నీటి బిందువులు త్వరగా ఏర్పడేలా చేసి, వర్షం కురిసేలా చేస్తాయి. దీనివల్ల గాలిలోని కాలుష్య కణాలు కిందికి చేరి గాలి శుభ్రపడుతుంది.గత అక్టోబర్ ప్రయోగాల వల్ల వర్షం పడకపోయినా, లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల్లో కాలుష్య కారకాలు (పర్టిక్యులేట్ మ్యాటర్) తగ్గాయని ఢిల్లీ ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది. ఇటీవలే విడుదలైన ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఢిల్లీ 2025-26’ సైతం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సహకారంతో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, చేయబోయే ఈ ప్రయోగం సక్సెస్ అయి, ఢిల్లీవాసులకు కాలుష్యం నుంచి ఊరటనిస్తుందేమో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం -
హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)
-
Andhra Pradesh: మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని పేర్కొంది.మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది -
వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆదివారం కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
బిగ్ అలర్ట్.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు
-
ఆ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..
సాక్షి, అమరావతి: ఏపీలో రానున్న మూడు రోజుల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల క్రింద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.కాగా కుండపోత వర్షంతో పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా నిన్న(బుధవారం) నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగు పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వీరపాలెంలో మిర్చి కోతలకు పొలానికి వెళ్లిన కాటూరి సుబ్బరత్నమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో పెరవలి వనజ మృతి చెందింది. వైఎస్సార్ కడప జిల్లా చిన్నాయపల్లెకి చెందిన గుర్రాల నారాయణ రెడ్డి(55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. -
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ఇన్సాపూర్‌లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి, వరి పంట నేల రాలుతోందని రైతులు అంటున్నారు.కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సోమవారం రాత్రి కూడా హైదరాబాద్. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.తెలంగాణలోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద వాహనాలు ఆపి వర్షం వెలిసేదాక ఎదురుచూశారు.మరోవైపు మెదక్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. తూప్రాన్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగలులతో కూడిన భారీ వర్షం పడింది. పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురిసింది. అర్ధ గంటపాటు కురిసిన వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షాలతో వరి పంటతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతన్నలు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టి సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నారాయణ ఖేడ్, ఆందోలులోనూ జోరుగా వర్షం కురిసింది. -
2026లో కుండపోత.. 40 రోజులుగా ఆ దేశంలో వర్షాలే
ఒక్క రోజు వర్షం కురిస్తేనే ఎక్కడైనా సరే జనజీవనం స్తంభించిపోతుంది. అలాంటిది యూకేలో ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి వర్షాలు ఆగడం లేదు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 40 రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ పశ్చిమ ఇంగ్లాండ్, తూర్పు స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కార్న్‌వాల్‌లో చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదవగా.. దేశవ్యాప్తంగా 26 వాతావరణ కేంద్రాలు ఈ వర్షాలతో సరికొత్త రికార్డులు సృష్టించాయి.ఇక ఫిబ్రవరి 8వ తేదీ నాటికి యూకేలో సగటు వర్షపాతం 37 శాతంగా నమోదైంది. ఇంగ్లాండ్‌లో ఇది 59 శాతం, దక్షిణ ఇంగ్లాండ్‌లో అయితే ఏకంగా 72 శాతానికి చేరింది. అబెర్డీన్లో ఫిబ్రవరి సగటు 180 శాతం దాటేయడం ఆందోళన కలిగిస్తోంది.వర్షాలు ఎప్పుడు తగ్గొచ్చు?వాతావరణ శాఖ డిప్యూటీ చీఫ్ స్టీవెన్ కీట్స్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ వారం చివరలో స్థిరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ మధ్య అట్లాంటిక్ నుంచి వచ్చే బలమైన గాలులు.. యూకేలోకి ప్రవేశించొచ్చు. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కీట్స్ హెచ్చరించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి తొలివారాల్లో కాస్త ఎండ కనిపించినా.. మళ్లీ భారీ వర్షాల ముప్పు ఉండొచ్చని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. -
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి
సాక్షి, అమరావతి/నెల్లూరు/వెంకటాచలం/తొట్టంబేడు: వాయుగుండం ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఇదగలిలో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్‌లో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు రూరల్, సైదాపురం, నాయుడుపేట, అల్లూరు, మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తిరుపతి జిల్లా గూడూరు, చింతవరం, సూళ్లూరుపేట, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా తొట్టంబేడులో 4.7, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 3.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 3.2, చిత్తూరు జిల్లా నిండ్రలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారగా.. బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.జలదిగ్బంధంలో నెల్లూరు హైవే వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. వాగులు, వంకలు, పంట పొలాలు సముద్రాన్ని తలపించాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు తదితర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. బుజబుజ నెల్లూరు, చెముడుగుంట ప్రాంతాల్లో జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంకటాచలం–మనుబోలు మధ్య జాతీయ రహదారిలో ఒక వరుస రోడ్డు మునిగిపోయింది. ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి వెంకటాచలం చేరుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. నెల్లూరు అయ్యప్పగుడి నుంచి హైవే రోడ్డు కలిసేచోట రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటాచలంలో 3 వేల ఎకరాల్లో మునిగిన నారు మళ్లు, నాట్లు మునిగినట్లు ప్రాథమిక అంచనా.నీట మునిగిన కాలనీలు భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో సగం ప్రాంతాలు నీటమునిగాయి. చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, మల్లయ్యగుంట, బుజబుజ నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, తల్పగిరి కాలనీ, శివగిరి కాలనీ, జనార్దన్‌రెడ్డి నగర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్డీటీ కాలనీ, సుందరయ్య కాలనీ డి–బ్లాకులోని కొన్ని ప్రాంతాలు, హరనాథపురం విస్తరిత(ఎక్స్టెర్ననల్) ప్రాంతాల్లో పెద్దఎత్తున వరద నీరు చేరింది. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలు నీటమునిగాయి.గోడ కూలి వృద్ధురాలి మృతి తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కానవరంలో బుధవారం కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడకూలి నిద్రదిస్తున్న రేణుకమ్మ(59)పై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
వరదల కారణంగా 1,300 మందికి పైగా మృతి
టాంగ్ టోరు: ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో భారీ వర్షాలతో గత వారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1,300 దాటింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండోనేషియాలో 712 మంది, శ్రీలంకలో 410 మంది, థాయ్‌లాండ్‌లో 181 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇండోనేషియాలో.. ఇండోనేషియాలోని సుమత్రా దీవులు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. 507 మంది గల్లంతైనట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తప్పిపోయారు. ఉత్తర సుమత్రాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షలాది క్యూబిక్ మీటర్ల కలప కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. చెట్లను అక్రమంగా నరికివేయడం విపత్తుకు కారణమై ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, మానవ నిర్మిత సంక్షోభమని ఇండోనేషియా పర్యావరణ ఫోరం ఆరోపించింది. తక్షణ పునరుద్ధరణ, కట్టుదిట్టమైన రక్షణ లేకపోతే వరదలు సాధారణమవుతాయని హెచ్చరించింది. ప్రాణ నష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేం: శ్రీలంక అధ్యక్షుడు ఇది దేశాన్ని ముంచెత్తిన అత్యంత దారుణమైన విపత్తని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అన్నారు. ప్రాణనష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వరదల్లో, కొండ చరియలు విరిగి పడటంతో చిక్కుకుపోయినవారిని చేరుకోవడానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కొందరు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. థాయ్‌లాండ్‌లో పబ్లిక్ కిచెన్లు.. థాయ్‌లాండ్‌లో భారీ వరదలు 15 లక్షలకు పైగా ఇళ్లను మంచెత్తాయి. 39 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వారికి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని అందించడానికి పబ్లిక్ కిచెన్లను ఏర్పాటు చేస్తామని థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో రూ.74 లక్షల నష్టపరిహారం 26,000 మందికి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సిరిపోంగ్ అంగ్కసకులి్కయాట్ తెలిపారు. -
Ditwah Cyclone: నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
-
మరింత బలహీన పడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/నెల్లూరు (అర్బన్)/తిరుమల/సాక్షి, చెన్నై: తీవ్ర వాయుగుండం తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సోమవారం సాయంత్రానికి ఇది చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130, కడలూరుకు 150, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. స్తంభించిన ‘నెల్లూరు’ నెల్లూరు జిల్లాను దిత్వా తుపాను వణికిస్తోంది. వాయుగుండం బలహీన పడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మూడు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకువచి్చంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనికితోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి.చేజర్ల మండలంలోని నల్లవాగుకు ప్రవాహం పెరగడంతో యనమదల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి తదితర ఐదు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్దవాగుకు నీటి ప్రవాహం పెరిగింది. బొగ్గేరు, బీరాపేరుకు ఓ మోస్తరు వరద పెరిగింది. విడవలూరు మండలంలోని మలిదేవి డ్రైన్, పైడేరులకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే పలుచోట్ల చెరువులు నిండిపోయాయి.అవి ఎక్కడ తెగిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమశిల నుంచి పెన్నానదిలోకి 35 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల నిండా నీరు చేరడంతో నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయేమోనని రైతులు భయపడుతున్నారు. నెల్లూరు శివారు ప్రాంతాలైన ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, పడారుపల్లి, కల్లూరుపల్లి, రాజీవ్ గృహకల్ప, సాయినగర్, జనార్ధన్రెడ్డినగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలబడిపోయింది. తిరుమలలో వర్షం తుపాను కారణంగా తిరుమలలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది. చెన్నైలో కుండపోత బలహీన పడ్డ దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారడంతో చెన్నైలో సోమవారం అనేక చోట్ల భారీ వర్షం పడింది. మంగళవారం మరింతగా భారీ వర్షాలు పడుతాయనే హెచ్చరికలతో చెన్నై, శివారు జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో చెన్నై తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా రూపంలో చిరు జల్లుల వాన మొదలైంది.ఇది చెన్నైకు 50 కి.మీ దూరంలో ఏడు గంటలకు పైగా కేంద్రీకృతం కావడంతో క్రమంగా వర్షం ప్రభావం పెరిగింది. చెన్నై, శివారులలోని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో లేదా మంగళవారం ఉదయం చెన్నె తీరానికి 30 కి.మీ దూరంలోకి తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా సమీపిస్తుందని, ఈసమయంలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు మంగళవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
Rain ALERT: మరో మూడురోజులపాటు ఏపీకి వర్ష సూచన
-
Cyclone Ditwah: బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను
-
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/వాకాడు: ‘దిత్వా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను ఉత్తర–వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ శుక్రవారం రాత్రి సమయానికి పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101లను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, శ్రీలంక తీర సమీపంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయవ్య దిశలో కదులుతోంది. ఈ తుపాను శుక్రవారం ఉదయం ఎనిమి దిన్నర గంటల ప్రాంతంలో పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను క్రమంగా ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా ఆంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని నిపుణులు చెబుతు న్నారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం దక్షిణ ప్రాంత జిల్లాలు, సెంట్రల్ తెలంగాణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రెండ్రోజులు మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 30.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 13.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 10వ తేదీ వరకు మినుములు, పెసర విత్తుకోవచ్చువర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు వరి కోసే ముందు ఆకాశంలోని మేఘాలను గమనించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వి శ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి, ప్ర ధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.లీలారాణి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ⇒ మినుములు, పెసర పంటలను వచ్చే నెల 10వ తేదీ వరకు విత్తుకోవచ్చు.⇒ మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు.⇒ యాసంగి వరినారు మడులను డిసెంబర్ 20 లోగా పోసుకోవాలి.⇒ ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింక్ ధాతువు లభ్యతను తగ్గిస్తాయి. జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.⇒ చలి ప్రభావం వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపంతో ఆకులు ఊదారంగులోకి మారుతాయి. భాస్వరం లోపనివారణకు 10 గ్రాముల19–19–19 లేదా డీఏపీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.⇒ మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. ⇒ పత్తిలో బూడిద తెగులు, కాయకుళ్లు తెగులు, గులాబీ రంగు పురుగు ఆశించడానికి అనుకూలం. కాబట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలి. ⇒ కందిలో శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి.⇒ వేరుశనగలో ఆకుముడత పురుగు నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిపాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ⇒ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. నివారణకు టీకాలు వేయించాలి.⇒ గొర్రెలకు పీపీఆర్, చిటుకు, ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి సోకటానికి చలి వాతావరణం అనుకూలంగా ఉంది. వీటి నివారణకు టీకాలు వేయించాలి.⇒ గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి. -
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్
-
బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తుపానుకు యెమెన్ దేశం ‘దిత్వా’(అక్కడి ప్రసిద్ధ జలాశయం దిత్వా లగూన్ పేరు మీద)గా నామకరణం చేసినట్లు పేర్కొంది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరాలపై ఉంటుందని తెలిపింది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో తుపాను ముందుకు కదులుతోందని వెల్లడించింది. ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. కాగా, ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి తుపాను నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ధాన్యం తడవకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ధాన్యం తడిచిపోయి.. తక్కువ ధరకు రైతులు బయట విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడాలని ఆదేశించారు. -
Heavy Rain: దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి,అమరావతి: అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
AP: ముంచుకొస్తున్న వాయుగుండం 48 గంటల్లో పెను తుఫానుగా..
-
AP: 30 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతోపాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
AP: దూసుకొస్తున్న సెన్యార్ రెండు రోజుల్లో భారీ తుఫాన్
-
బలపడిన అల్పపీడనం
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారానికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వీటి ప్రభావంతో సోమవారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
అండమాన్‌లో అల్పపీడనం
సాక్షి, అమరావతి: మలక్కా జలసంధిపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. 26 నాటికి మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ️దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని.. ధాన్యం వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని కోరారు. -
అయ్యప్ప భక్తులకు అలర్ట్..! శబరిమలలో మళ్లీ..
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, పతనం తిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శబరిమల యాత్ర ప్రాంతంతో సహా మొత్తం ఆరు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ భారీ వర్షాలకి కారణం అని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ రోజు, రేపు శబరిమల సన్నిధానం, పంప, నీలక్కల్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతల్లో తప్పనిసరిగా..సన్నిధానం, పంబా, నీలక్కల్‌లలో ఇవాళ, రేపు 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉందిఅలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో 24 గంటల్లో 64.5 మిమీ నుంచి 115.5 మిమీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అయ్యప్ప భక్తులకు భద్రతా సూచనలుభారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యాత్రికులకు ప్రత్యేక హెచ్చరిక సూచనలు జారీ చేసింది.కొండచరియలు విరిగిపడటం, బురదజల్లులు, పర్వత వరదలకు గురయ్యే ప్రాంతాలలో నివసించేవారు, అలాగే నదుల వెంబడి, ఆనకట్టల దిగువన నివసించేవారు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.విపత్తు సంభవించే ప్రాంతాల్లో నివసించేవారు పగటిపూట సమీపంలోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లాలి. వాటి సమాచారం కోసం ప్రజలు స్థానిక స్వపరిపాలన, రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, భద్రత లేని ఇళ్లు లేదా బలహీనమైన పైకప్పులు ఉన్న ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.వర్షపు రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు, పర్వతారోహణను నివారించాలి.శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే భద్రతాధికారుల సూచనల మేరకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉందన స్పష్టం చేసింది కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ.(చదవండి: శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!) -
25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
మనీ లేదు.. మట్టి పోద్దాం!
ఇది రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షించే రాష్ట్ర రహదారి. తాండూరు–జహీరాబాద్ రోడ్డులో రావులపల్లి గ్రామ శివారులో పరిస్థితి ఇది. ఎక్కడా తారు ఆనవాళ్లు అనేవి లేకుండా ఇలా మారింది. వాన కురిస్తే ఇక్కడ రాకపోకలు నిలిచిపోతాయి. గతేడాది వానాకాలంలో రోడ్డు కొట్టుకుపోగా, మరమ్మతులు చేయకపోవడంతో స్థానిక నేత ఒకరు సొంత ఖర్చుతో మట్టిపోయించి తాత్కాలికంగా రాకపోకలు జరిగేలా చేశారు. ఈసారి మళ్లీ కొట్టుకుపోయి అదే పరిస్థితి పునరావృతం అయింది. మళ్లీ స్థానిక నేతలు సొంత ఖర్చుతో మట్టి పోయించారు. దీంతో రోడ్డు ఈ మాత్రం కనిపిస్తోంది. కొత్త రోడ్డు నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితమే మంజూరైనా.. ఇప్పటివరకు పనుల జాడే లేదు. కనీసం టెండర్లు కూడా పిలవలేదు. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురిసినప్పుడు దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతు చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తేనే వాహనాలు సాఫీగా ముందుకు సాగుతాయి. కానీ రాష్ట్రంలో చాలాచోట్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక వానాకాలం ముగిసే సరికి రోడ్లకు సగటున రూ.2 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అంటే వాటిని పునరుద్ధరించాలంటే అంతమేర నిధులు ఖర్చు చేయాలన్న మాట.కానీ నిధుల లేమి రోడ్ల మరమ్మతుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతోంది. రోడ్ల మరమ్మతులకు భారీ మొత్తంలో నిధులు వెచి్చంచే పరిస్థితి లేకపోవటంతో కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ కేంద్రం.. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాలను పంపటం తప్ప నిధులు ఇవ్వటం లేదు. గతేడాది రూ.2,300 కోట్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లినందున అంతమేర నిధులు ఇవ్వాలని కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమరి్పంచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కేంద్ర మంత్రుల ముందు కూడా ప్రస్తావించింది. కానీ నయా పైసా రాలేదు. బాగా దెబ్బతిన్న రోడ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మోంథా తుపాను కంటే ముందు కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు వచ్చాయి. 1,400 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.1,278 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తాత్కాలిక మరమ్మతులకు రూ.78 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆ తర్వాత మోంథా తుపాను ప్రభావంతో నష్టం మరింత పెరిగింది.ఈ రెండు నష్టాలు కలిపి దాదాపు రూ.1,600 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 1,500 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, మొత్తం 1,641 కి.మీ మేర రోడ్ల ఉపరితలం దెబ్బతిన్నదని పేర్కొంటూ కేంద్రానికి మరోసారి నివేదించింది. కానీ ఈ రెండు నివేదికలపైనా అక్కడి నుంచి స్పందన రాలేదు. రాష్ట్రం సొంత నిధులు ఇవ్వలేక పోవడం, కేంద్రం నుంచి నిధులపై స్పష్టత లేకపోవడంతో రోడ్లు రోజురోజుకూ మరింత దెబ్బతింటున్నాయి. తాత్కాలికంగా గుంతల్లో మట్టి నింపిన అధికారులు..పూర్తిస్థాయి మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంపై చేతులెత్తేశారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా రోడ్ల మీద ప్రయాణాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇటీవలి తుపాను ప్రభావం ఇలా.. జిల్లా దెబ్బతిన్న ప్రాంతాలు మరమ్మతులకు కావాల్సిన నిధులు (రూ.కోట్లలో) కరీంనగర్ 16 6 వరంగల్ 50 86.34 హనుమకొండ 12 2.50 ములుగు 3 4.40 మహబూబాబాద్ 38 14.94 ఖమ్మం 63 54 భద్రాద్రి 15 22.95 నల్లగొండ 26 10.10 సూర్యాపేట 4 6.82 యాదాద్రి 11 4.31 జనగామ 21 13 సిద్దిపేట 27 40.19 రంగారెడ్డి 10 3.88 నాగర్‌కర్నూలు 86 49.44 -
గంగమ్మ... గలగల
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పాతాళగంగ పైపైకి ఉబికి వచ్చింది. గత దశాబ్దకాలంతో పోలిస్తే సగటున 1.7 మీటర్ల మేర భూగర్భ జలాల్లో వృద్ధి నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సగ టున 4.42 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో కి వచ్చాయని.. కనిష్టంగా 2 మీటర్లు, గరిష్టంగా 7.93 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నుంచి అక్టోబర్‌కు 5.65 మీటర్ల వృద్ధి మేలో వేసవి తీవ్రతతో భూగర్భ జలాల రాష్ట్ర సగటు 10.07 మీటర్లకు పడిపోగా వర్షాకాలం మొదలయ్యాక జూన్‌లో 9.47 మీటర్లకు, జూలైలో 8.37 మీటర్లకు, ఆగస్టులో 5.78 మీటర్లకు, సెప్టెంబర్‌లో 4.41 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షలకుపైగా బోరుబావుల కింద వానాకాలం పంటల సాగు కోసం భారీగా భూగర్భ జలాలను తోడేస్తున్నప్పటికీ అక్టోబర్‌లోనూ నిలకడగా 4.42 మీటర్ల లోతుకే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. మేతో పోలిస్తే అక్టోబర్ నాటికి భూగర్భ జలాలు 5.65 మీటర్ల మేరకు వృద్ధి చెందాయి. 2024 అక్టోబర్‌లో సగటున 5.38 మీటర్ల లోతులో లభ్యమైన భూగర్భ జలాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 4.42 మీటర్ల వరకు ఉబికి వచ్చాయి. గత నెలలోనూ సాధారణంకన్నా అధిక వర్షాలు కురవడమే దీనికి కారణం. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,778 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి తర్వాతి నెలలో నివేదికలను ఆ శాఖ విడుదల చేస్తోంది. మహబూబాబాద్‌లో 2 మీటర్ల లోతుల్లోనే.. మహబూబాబాద్ జిల్లాలో 2 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభిస్తుండగా మెదక్ జిల్లాలో మాత్రం 7.84 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల సగటు భూగర్భ జలమట్టాలను 0 నుంచి 5 మీటర్లు, 5 నుంచి 10 మీటర్లు, 10 మీటర్లకన్నా ఎక్కువ లోతు అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0 నుంచి 5 మీటర్ల లోతులోనే ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. మొత్తం 33 జిల్లాలకుగాను 19 జిల్లాల్లో 0 నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 14 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో, 2 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్లు తేలింది. 10 మీటర్లకన్నా ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాలు సురక్షిత స్థాయిల్లోనే ఉన్నట్లు ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. సాధారణం కంటే 95% అధిక వర్షపాతం ఏటా అక్టోబర్‌లో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 9.01 సెం.మీ. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం ఏకంగా 17.57 సెం.మీ. రికార్డు వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 95 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని స్పష్టమవుతోంది. 28 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురవగా 4 జిల్లాల్లో సాధారణం, ఒక్క మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే లోటు వర్షపాతం కురిసింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలో 83.1 సెం.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా ఏకంగా 116.4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 40 శాతం అధికం కావడం విశేషం. -
రైతన్న వెన్ను విరిచిన వాన
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ వచ్చిన వర్షాలు ‘మోంథా’తుపానుతో రైతుల నడ్డి విరిచాయి. గత సెప్టెంబర్ నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో పత్తి పంట ఇప్పటికే చాలా వరకు దెబ్బతింది. చేలల్లో నీరు నిలిచి పత్తి గింజలు బలహీనంగా ఎదిగాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదటి విడత పత్తి ఏరడం పూర్తయ్యింది. రెండోదశ పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న చేలకు ‘మోంథా’తుపాను తీవ్ర నష్టం కలిగించింది. పత్తి గింజలు విచ్చుకుంటున్న సమయంలో కురిసిన వర్షాలతో పత్తి మరింత దెబ్బతింది. పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వర్ష ప్రభావం అధికంగా లేకపోవడంతో ఇక్కడ నష్టం కొంత తక్కువగానే ఉంది. వరి పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు పూర్తయిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోయగా, చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఇక కోతకు వచ్చిన వరి వర్షాలకు చాలా జిల్లాల్లో నేలకొరిగింది. పొట్టకొచ్చిన వరి నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో అధిక నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో మోంథా తుపానుతో నష్టం ఎక్కువగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పత్తి పంట నష్టం అధికంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా పత్తి దెబ్బతింది. వరంగల్ ప్రధాన వ్యవసాయ మార్కెట్లో వడ్లు, మక్కలు వర్షం నీటిలో నానిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం మహబూబాబాద్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 2,15,723 ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఈ వర్షాల కారణంగా 50 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 62,751 ఎకరాల్లో సాగు చేసి, కంకులను కోసి రైతులు విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఆరబోసుకు న్నారు. మొక్కజొన్నలకు 70 నుంచి 80 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. పత్తి 86,224 ఎకరాల్లో సాగు కాగా, పంట కోతదశకు చేరుకున్న సందర్భంలో 60 శాతానికి పైగా నష్టం చేకూర్చనుంది. మిర్చి 38,289 ఎకరాల్లో సాగు చేయగా, పూత 40% వరకు రాలిపోతున్నట్టు ప్రాథమికంగా అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో... ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఈసారి అత్యధికంగా 6,85,262 ఎకరాల్లో పత్తి సాగైంది.భారీ వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి సగానికి పడిపోవడం, ప్రస్తుత తుపాను కారణంగా పంట మరింత దెబ్బతినడంతో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు చేతికంది వచ్చిన పంట ఆగమైందిరెండున్నర ఎకరాల్లో వరిసాగు చేయగా రూ.లక్షకుపైగా ఖర్చు అయ్యింది. ప్రస్తుతం వరి పొట్టదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో వరి కోతలు అనుకున్నాం. అంతలోనే తుపాను కారణంగా చేతికి అంది వచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. –భూక్యా శాంతి, సోమ్ల తండా మహబూబాబాద్ పత్తి ఏరకుండా వదిలేశానునాకున్న 3 ఎకరాల్లో పత్తి పంట వేశా. ఇప్పటివరకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చు అయ్యింది. ఈసారి భారీ వర్షాలకు పత్తి దిగుబడి సగానికి తగ్గింది. కూలీలతో పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న సమయంలో తుపాను కారణంగా పంట మరింత దెబ్బతింది. కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం పత్తి తీయడం మానేశాను. – లాల్యా, పోచమ్మతండా, వెల్దండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా) రైతులు అప్రమత్తంగా ఉండాలిమోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. కోసిన వరి, మొక్కజొన్న, పత్తిని సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. వరి, మొక్కజొన్నను తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కోయాలి. పత్తి ఏరవద్దు. తొందరపడి కోస్తే తడిసే అవకాశం ఉంది.అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలి. – శ్రీనివాస్, డీఏవో పెద్దపల్లి -
ప్రాజెక్టులకు మళ్లీ జలకళ
కేతేపల్లి/నాగార్జునసాగర్/బాల్కొండ/జగిత్యాల అగ్రికల్చర్: విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రాగా, బుధవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 1,94,845 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 20 క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా 1,94,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వ, వరద కాల్వకు, ఏఎమ్మార్పికి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్ జలాశయ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగుల మేర నీరు ఉంది. మోంథా తుపాను ప్రభావంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాగర్ శివారులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని ఎత్తిపోతల వద్ద జలపాతం ఉధృతంగా పారుతోంది. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. బాబ్లీ గేట్ల మూసివేత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రి సభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మూసివేశారు. ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి ఏటా అక్టోబర్ 29న మూసివేస్తారు. అయితే ప్రాజెక్టుకు 14 గేట్లు ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పది గేట్లను మాత్రమే మూసి వేసి మిగతా నాలుగు గేట్లను తెరిచి ఉంచి ఎస్సారెస్పీలోకి నీటి విడుదల చేస్తున్నారు. వరద నీటి ఆధారంగా నాలుగు గేట్ల మూసి వేత, ఓపెన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ప్రాంక్లిన్, ఎస్సారెస్పీ ఎస్ఈ జగదీశ్, నాందేడ్ ఈఈ సీఆర్ బన్సద్, ఏఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. -
Adimulapu Suresh: తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వరా? అధికారులపై ఆదిమూలపు సురేష్ ఫైర్
-
ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ గుబులు
సాక్షి, అమరావతి: ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు కోతదశకు చేరుకున్న పంటచేలు నేలకొరిగాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరికంకులు దెబ్బతింటున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన ఈ తుపాను ప్రభావం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తాం«ధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుపాను తర్వాత దాదాపు మూడురోజులు కురిసే వర్షాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో పంటలపై ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా వరితోపాటు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర పంటలకు అపారనష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 72.87 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా, అందులో 38.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సాగైన వరి విస్తీర్ణంలో దాదాపు 31.14 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇందులో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట తీవ్ర ప్రభావానికి గురవుతుందని వ్యవసాయశాఖ ముందస్తు అంచనా వేసింది. ఇతర పంటలన్నీ కలుపుకొంటే 20 లక్షల ఎకరాల్లో పంటలపై తుపాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దిగుబడులపై ప్రభావం తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో వరిపైరు తీవ్రంగా దెబ్బతింటుంది. ముంపునీరు దిగిపోయిన తర్వాత సత్వర యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ తుపాను ప్రభావం దిగుబడులపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎకరాకు కనీసం 5 నుంచి 8 బస్తాలు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధాన్యం రంగుమారడం, తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మొలకలొచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. బిహార్ ఎన్నికల విధుల్లో వ్యవసాయశాఖ డైరెక్టర్ వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బిహార్‌లో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు. గతంలో ఉన్నతాధికారులు ఎన్నికలతోపాటు ఇతర సేవల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారి బాధ్యతలను ఇతర అనుబంధ శాఖల అధికారులకు అప్పగించేవారు. ఇప్పుడు వ్యవసాయశాఖ డైరెక్టర్ బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. దీంతో లాగిన్స్ అన్నీ ఆయన వద్దే ఉన్నాయి. విపత్తు వేళ ఆ శాఖలో విభాగాధిపతులు ప్రతి చిన్న విషయాన్ని బిహార్‌లో ఉన్న డైరెక్టర్‌కి ఫోన్ ద్వారా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఈరోజు రాత్రికే.. కాకినాడకు 270KMల దూరంలో తుఫాన్
-
‘మోంథా’ పెను ముప్పు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రచండ వేగంతో.. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ బీచ్‌లో కోస్టల్ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా కుండపోతే..! ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి అజయ్‌జైన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆందోళన.. అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలుతుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో పోలీసులు, మెరైన్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్ రోడ్డులో కృష్ణ మందిర్ వద్ద కోతకు గురైన తీరం కోనసీమకు పెను గండం..!సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. భయం గుప్పెట్లో కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్‌లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రెడ్ అలెర్ట్ జిల్లాలివే..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాలఎల్లో అలెర్ట్ జిల్లాలుచిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురంతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్ వార్నింగ్ సిగ్నల్–4 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఒడిశాలో.. తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
Cyclone Montha: కోనసీమ జిల్లాలో మోంథా తుఫాన్ ఎఫెక్ట్
-
Cyclone Montha: ఏపీకి భారీ హెచ్చరిక
-
Heavy Rains: రేపటికి తుఫాన్‌గా మారనున్న అల్పపీనడనం
-
‘పొట్ట’ కొడుతున్న వానలు
సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల పొట్ట కొడుతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి సంకటంగా మారాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో లక్షలాది ఎకరాలు నీటమునిగాయి. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప.గో., గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరితోపాటు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో వరి చేలు పడిపోయాయి. నంద్యాలలో మొక్కజొన్న రైతును దెబ్బతీసింది. భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వాస్తవానికి రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. రైతుల కష్టాలుకుండపోత వర్షాలకు పొట్ట దశకు చేరుకున్న వరి పంట నేలకొరగడంతో రైతులు పడరాని పాట్లు పడుతన్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉండడంతో పాటు గింజలు రంగుమారే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నూర్పిడి పనులు మొదలు పెట్టిన ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. అన్ని పంటలకూ నష్టం రబీ సీజన్లో మినుము, జొన్న, వేరుశనగ, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో భారీ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. చాలా చోట్ల మళ్లీ విత్తుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వరి, కూరగాయలు, చెరకు, ఆరుతడి పంటలకు అధిక నష్టం వాటిల్లగా, రాయలసీమ జిల్లాల్లో అపరాలు, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి రైతును తేమ ముప్పు వణికిస్తోంది. పత్తి తీసి అమ్మకాలకు సిద్ధపడుతున్న తరుణంలో భారీ వాన రైతుల ఆశలను చిదిమేసింది. వరిపైనే అధిక ప్రభావం వరిపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గింజల్లో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీపీటీ 5204, పీఎల్ 1100 వంటి రకాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆకు మచ్చ, పాముపొడ, కాటుక తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల వరి దిగుబడులు 15–25 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అపరాలకు 10–20 శాతం, కూరగాయలకు 20–30 శాతం,మిరపకు 15–30 శాతం, మొక్కజొన్నలో 10–18 శాతం, చెరకులో 8–15 శాతం మేర దిగుబడులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వరిలో...యాజమాన్య పద్ధతులిలా..వరి పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి. చిన్న కమతాలలో పంటను నిలబెట్టవచ్చు. పెద్ద కమతాలలో డ్రెయినేజీ మురుగు నీరు పోయే సదుపాయం చేయాలి.గింజ రంగు మారడాన్ని నివారించడానికి, పాము పొడ ,కాటుక తెగులు వ్యాప్తిని అరికట్టడానికి ఎకరానికి 200 ఎంఎల్ ప్రాపికోనజోల్ పిచికారి చేయాలి » ధాన్యం గట్టిపడే నుంచి కోత దశలో ఉన్న పంట పొలాల్లోని నీటిని లోపలి కాలువల ద్వారా తొలగించాలి. కంకుల గింజలపై మొలకలు కనిపిస్తే (వాలిన లేదా నిలిచిన పంటలో) 5% ఉప్పు ద్రావణం (50 గ్రాముల గళ్ళ ఉప్పు / లీటరు నీరు) పిచికారీ చేయాలి.» ఆలస్యంగా నాటిన పంట (పిలకలు తొడిగే దశ) వర్షపు నీరు పొలాల్లో సాధారణ రకాలలో 7 రోజుల్లో తగ్గితే ఎకరాకు యూరియా 20 కేజీలు + పొటాష్ 20 కేజీలు/ బూస్టర్ డోసుగా వేయాలి.» నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో నర్సరీ దశలో ఉన్న పంట పొలాలకు నీరు తగ్గిపోయిన తర్వాత ప్రతి 5 సెంట్ల నారుమడికి యూరియా 1 కిలో + పొటాష్ 1 కిలో కలిపి బూస్టర్ డోసుగా వేయాలి. నారుమడులు కుళ్లిపోకుండా ఉండేందుకు కార్బెండాజిం 1 గ్రాము లేదా కార్బెండాజిం + మాంకోజెబ్ 2 గ్రాములు/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.పత్తి, వేరుశనగలో యాజమాన్య పద్ధతులిలా..ఈ వర్షాలకు ఆకుమచ్చ తెగులు నివారణకు హెక్సా కొనజోల్ 2 మి.లీ లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రామ్ లీటరు నీటికి కలిపి15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయ్యాలి » పత్తిలో పూత, గూడ రాలే అవకాశం ఉంది కాబట్టి నివారణకు బోరాక్స్‌ను లీటర్ నీటికి 1.5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.» 2 శాతం యూరియ లేదా నీటిలో కరిగే ఎరువులైన 19–19–19 లేదా 17–17–17 లేదా పొటాషియం నైట్రేట్‌ను పిచికారి చేయాలి.» కాయ దశలో కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు మరియు 2 గ్రాముల ప్లాంటో మైసిన్ 10లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.సజ్జ పంట: కోత దశలో గింజ మొలక రాకుండా కంకులపై గళ్ళ ఉప్పు 50 గ్రాములను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మెట్ట ప్రాంతాల్లో అయితే... అన్ని పంటలకు ఒకే రీతిలో పొలం నుంచి నీళ్లను పూర్తిగా దిగిపోయిన తర్వాత బూస్టర్ డోస్ గా 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ను మొక్కల మొదట్లో వేయాలి. ఆకుమచ్చ, పొడ తదితర శిలీంద్ర తెగుళ్లకు హెక్సాకొనజోల్ 2 గ్రాములు లీటరు నీటికి లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని వల్ల రానున్న మరో నాలుగు, ఐదు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ప్రఖర్ జైన్ గురువారం తెలిపారు. శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో అల్ప పీడనం వల్ల రానున్న నాలుగు, ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 120.5మిల్లీ మీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 85.5మిమీ, నెల్లూరు జిల్లా రాపూర్‌లో 78.5మిమీ వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. కాగా, ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని, ఈ తుపాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు
-
AP: ఐదు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు
-
రాష్ట్రానికి వాయు‘గండం’
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల మధ్య వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిలమనూరులో 7.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 7.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 6.9, గొల్లగుంటలో 6.8, పాపమాంబాపురంలో 6.4, కొండూరులో 6.3, వెంకటగిరిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఏపీకి వారం రోజులపాటు భారీ వర్ష సూచన
-
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత కూడా పెరగవచ్చని తెలిపారు. 20న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడొచ్చు. 21న పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది. 22న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలోని మెరకముడిదాం, అన్నమయ్య జిల్లా గాలివీడు, విజయనగరం జిల్లా గొల్లపాడులో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, అమరావతి: ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తిరుపతి జిల్లా తడ మండలం భీములవారిపాలెంలో 4.5 సెంటీమీటర్లు, చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో 3.5, సోమల మండలం పెద్దఉప్పరపల్లిలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదిలి.. 26వ తేదీన వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. -
ఏపీపై ఉపరితల ఆవర్తన ప్రభావం
-
మరో నాలుగు రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
-
ద్రోణి ప్రభావం.. పలుచోట్ల వర్షాలు
సాక్షి, అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఈ ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే రెండు రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం తిరుపతి జిల్లా డక్కిలిలో 8.4 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. -
మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో ఉపసంహరణ ప్రక్రియ పూర్తవు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు వేగంగా ఉండటంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడుల మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రానున్న రెండు రోజులు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుసాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్1 నుంచి)లో రాష్ట్రవ్యాప్తంగా 77.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 102.37 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 16 జిల్లాల్లో అధిక వర్షపాతం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే ఈసారి 4 శాతం అధికవర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి యాచారం/మాడ్గుల: వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. యాచారం మండలం నల్లవెల్లికి చెందిన జోగు మనీశ్ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మాడ్గుల మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లికి చెందిన బుచ్చయ్య (56) పశువులకు మేత వేయడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. -
తెలంగాణలో ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వానలు, ఏపీలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా భిన్నవాతావరణం నెలకొంటోంది. పగలంతా ఎండ ఉంటూ.. సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో.. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది(Telangana Yellow Alert). భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదుపు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రేపు మాత్రం మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో, అలాగే రేపు కుండపోత కురిసే అవకాశముందని(Hyderabad Rains) వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఏపీలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని ఇక్కడి వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(AP Rains News). ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ నెలలో 10+10+11.. అక్టోబర్ నెలలోనూ మొత్తం మూడు దశల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 1–10 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు.. అక్టోబర్ 10–20 మధ్య ఓ మోస్తరు వర్షాలు, అక్టోబర్ 21–31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ పాస్‌లు -
ఉత్తరాంధ్ర అతలాకుతలం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికింది...! ఎడతెరిపి లేని భారీ వర్షంతో తడిసి ముద్దయింది...! మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది...! విజయనగరం విలవిల్లాడింది...! విశాఖపట్నంలోనూ తీవ్రత కనిపించింది..! ఏకధాటిగా కురిసిన వానకు నదులు, వాగులు పొంగి ప్రవహించాయి...! గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అనేకచోట్ల చెట్లు రోడ్లపై కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునగడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాగా, వేర్వేరు ఘటనల్లో గోడకూలి వృద్ధ దంపతులు సహా ముగ్గరు మృతిచెందారు. నది ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రికార్డు స్థాయిలో 18.03 సెంటీమీటర్ల వర్షం కురవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ పట్టణాలు చెరువుల్లా మారాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. – సాక్షి, అమరావతిశ్రీకాకుళం జిల్లా అంతటా కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. మెలియపుట్టి మండలం చుట్టూ నీరు చేరింది. మందసలో 13.9, హరిపురం (13.7), నందిగం (13.4), కంచిలి మండలం ఎంఎస్ పల్లె (13.1), టెక్కలి మండలం రావివలస (10.1), సోంపేట మండలం కొర్లాం (9.6), మెలియపుట్టి (9.3), కోట»ొమ్మాళి (9), సంత»ొమ్మాళి (8.9), పార్వతీపురం మన్యం సీతంపేటలో (8), సిరిగం (7.9), రాస్తకుంటబాయి (7.4), నిమ్మాడ (6.8), గార (6.7) వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పాఠశాలలకు స్థానికంగా ఎక్కడికక్కడ సెలవు ప్రకటించారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం శ్రీకాకుళం జిల్లా రణస్థలం, కవిటి, పొలాకి, బుర్జ, ఆమదాలవలస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, లావేరు, నరసన్నపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, విజయనగరం జిల్లా మెరకముడిదం, గరివిడి, పైడి భీమవరం, రాజాపురం, పార్వతీపురం మన్యం జిల్లా పచి్చపెంట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. విజయనగరం విలవిల విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగాయి. పొలాలను వరద ముంచెత్తింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరటి, చెరకు, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఏసూరిగెడ్డ ఉధృతికి రావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వంద ఎకరాల వరి ముంపునకు గురైంది.గొట్టా, భగీరథపురం, నీలాదేవిపురం, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు, పాతహిరమండలం, జిల్లోడిపేట, కల్లట, గులుమూరు గ్రామాల్లో వందల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. పొట్ట, వెన్ను దశలో ఉన్న సమయంలో వరదతో పంటంతా పోయింది. వీరఘట్టం మండలంలో 850 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.వట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో కురుపాం–రావాడ గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుముఠాలో ఉన్న సుమారు 30 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.తీరం దాటిన వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఒడిశాలోని గోపాల్పూర్–పారదీప్ మధ్య తీరం దాటింది. శుక్రవారానికి అతి బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.ఈపీడీసీఎల్‌కు రూ.1.78 కోట్ల నష్టంవాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వెల్లడించారు. గాలుల కారణంగా ఆరు సర్కిళ్లలోని విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయని తెలిపారు. 33 మండలాలకు గాను 25 మండలాల్లో విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు.వంశధార ఉధృతిభీతిల్లిన పరివాహక గ్రామాల ప్రజలు గొట్టాకు మూడో ప్రమాద హెచ్చరిక జారీవర్షాల దెబ్బకు నాగావళి, వంశధార నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంశధార ఐదారేళ్లుగా చూడని స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో నదీ తీర గ్రామాల ప్రజలు భీతిల్లారు. శుక్రవారం సాయంత్రం నుంచి వంశధార శాంతించింది. తోటపల్లి, మడ్డువలస, జంఝావతి, పెదంకలాం, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది.ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజీలోకి నీటి మట్టం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ధాటికి నదీ తీర ప్రాంత ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. బాహుదా నది కూడా పొంగి ప్రవహించడంతో తీర గ్రామాలు, పొలాలు నీట మునిగాయి. మహేంద్రతనయకూ వరద ఉధృతి కొనసాగుతోంది.నేలకొరిగిన చెట్లు ఈదురుగాలులు విశాఖను వణికించాయి. దసరా రోజున భారీ గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. 80 ప్రాంతాల్లో 170 పైగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. అల్లూరి జిల్లాలో కూలిన బడులు భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకుల షెడ్డు గురువారం సాయంత్రం పడిపోయింది.మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా ముూడు జిల్లాల్లో నలుగురు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.వృద్ధ దంపతులను బలిగొన్న గోడమరో రెండు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం క్యాబేజీ పంటంతా పోవడంతో రైతు ఆత్యహత్యాయత్నంశ్రీకాకుళం జిల్లా మందస మండలం హంసరాలి పంచాయతీ చిన్నటూరులో గురువారం రాత్రి మట్టి గోడ కూలి పెళ్లలు మీద పడడంతో వృద్ధ దంపతులు సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) ప్రాణాలు కోల్పోయారు. హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా బయట ఉంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు వీరి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురంలో వర్షాలకు నానిన గోడ కూలడంతో అరవింద్ మృతి చెందాడు. ఇతడి సోదరుడు వినయ్‌ను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.శ్రీకాకుళం జిల్లా పలాస మొగిలిపాడు గ్రామానికి చెందిన సైని గోపాలరావు (47) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురువారం జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండగా... అవతల ఉన్న పొలాన్ని చూసేందుకు వెళ్లిన గోపాలరావు తిరిగి రాలేదు. పొలం దగ్గర ఉన్న ఖానాలో పడిపోయి చనిపోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జె.రంగరాయపురంలో వేగావతి నదిలో యోగేశ్వరరావు (22) గల్లంతయ్యాడు.పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన కౌలు రైతు బి.రాంబాబు క్యాబేజీ పంట మొత్తం నీట మునగడంతో పురుగుమందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
Visakha Weather: అర్థరాత్రి భీకర గాలులతో..!
-
ఉత్తరకోస్తా, దక్షిణకోస్తాకు భారీ వర్ష సూచన
-
వాయుగుండం ప్రభావం.. వచ్చే రెండురోజులు వర్షాలు
సాక్షి,అమరావతి/విజయపురిసౌత్/ధవళేశ్వరం/పోలవరం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర–వాయువ్య దిశగా కదిలి బుధవారం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపటా్ననికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 420, పూరికి 450, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
మురిపించిన ‘నైరుతి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఈసారి నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలనిచ్చాయి. జోరు వానలతో సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత వారానికి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్ నెలంతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై మూడోవారం వరకు అదే పరిస్థితి కొనసాగింది. తర్వాత రుతుపవనాలు రాష్ట్రంపై అత్యంత చురుకుగా కదలటంతో మోస్తరు నుంచి భారీ, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో వర్షపాతం గణాంకాలు అమాంతం పైకి ఎగబాకాయి. సీజన్ ముగిసేనాటికి సాధారణాన్ని దాటి అధిక వర్షపాతానికి చేరింది.33 శాతం అధిక వర్షపాతంజూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్లో నాలుగు నెలల్లో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. సీజన్ ముగిసే నాటికి ఈసారి 98.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు కంటే 33 శాతం అధికంగా నమోదైంది. గతేడాది నైరుతి సీజన్లో 96.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా... ఈ సీజన్లో 3 శాతం అధికంగా నమోదైంది. నైరుతి సీజన్ తొలి రెండు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిశాయి. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో గణాంకాలు భారీగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. 84 శాతం నీటి వనరులతో పూర్తిగా నిండినట్లు నీటిపారుదల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రెండోవారంలోగా ఉపసంహరణప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల నుంచి ఉపసంహరణ పూర్తయింది. ఈ నెల రెండోవారం నాటికి రాష్ట్రం నుంచి నైరుతి విరమణ పూర్తవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విరమణ సమయంలోనూ వర్షాలు ఆశాజనకంగా ఉండనున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ వరకు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని చెబుతోంది.33 జిల్లాల్లో వానలు సంతృప్తికరంగా కురిశాయి. 7 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, మరో 8 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదయ్యాయి. 128 మండలాల్లో అత్యధిక వర్షాలు, 299 మండలాల్లో అధికం, 191 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 3 మండలాల్లో మాత్రం సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి. అత్యధిక వర్షాలు: మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, వనపర్తిఅధిక వర్షాలు: నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిర్మల్, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం.సాధారణ వర్షాలు: నిజామాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి -
Andhra Pradesh: రాష్ట్రాన్ని కమ్మేసిన మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో మంగళవారం రాత్రి అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య బంగాళాఖాతంలో గురువారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్ర, ఉమ్మడి కృష్ణాలో వర్షాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా పెడనలో 3.9, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.4, నర్సీపట్నం, కాకినాడలో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా.. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. 3 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో ఉంచినట్టు పేర్కొన్నారు. శాంతించని నదులు కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిపై రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 6,22,504 క్యూసెక్కుల కృష్ణా జలాలను నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇంత అధికంగా నీరు విడుదలవుతోంది.కాగా.. నాగార్జున సాగర్ నుంచి 6,17,678 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు 6,41,247 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రం 6 గంటలకు 6,69,188 క్యూసెక్కులకు చేరింది. ఇందులో 6,53,828 క్యూసెక్కుల వదర సముద్రంలోకి వదిలేశారు. మిగిలిన 15,360 క్యూసెక్కుల వరద నీటిని పంట కాల్వలకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 16.1 అడుగులకు చేరింది. వరద ప్రభావంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.మళ్లీ పెరుగుతున్న గోదావరి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సమీపాన కాటన్ బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 12.60 అడుగులకు చేరింది. 10,96,937 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా.. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద గోదావరి నీటిమట్టం 33 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 10.73 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద 50.30 అడుగులకు నీటిమట్టం చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఉగ్ర గోదారి.. మహోగ్ర కృష్ణా
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్/బోధన్/బాల్కొండ/కాళేశ్వరం/దోమలపెంట/ధరూర్: నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఉపనదులు ఉప్పొంగి కృష్ణమ్మ మహోగ్రరూపం..గోదావరి ఉగ్రరూపం దాచ్చాయి. ప్రధానంగా నారాయణపూర్, తుంగభద్ర డ్యాం దిగువన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా ఉపనదులు మూసీ, హంద్రీ, తుంగభద్ర, బీమా వరదెత్తుతున్నాయి. దీనికి ప్రధాన పాయ నుంచి వస్తున్న వరద తోడుకాగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జూరాల ప్రాజెక్టులోకి 5.10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్లన్నీ ఎత్తేసి 5.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర, సుంకేశుల బరాజ్‌ల నుంచి తుంగభద్ర ద్వారా 79,268 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 27 వేల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయలోకి చేరుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,93,680 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 5,18,650 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి 6,25,511 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా, 26 గేట్లు ఎత్తి అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు. » హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీనది కూడా మహోగ్రరూపం దాల్చింది. కృష్ణా వరదకు మూసీ ఉధృతి తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 6,86,906 క్యూసెక్కుల నీరు చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 6.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. దీంతో 6,39,737 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరి ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి వరదెత్తుతున్నాయి. తెలంగాణలో మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఎగువ నుంచి కూడా వరద వస్తుండంతో 19 గేట్లు ఎత్తి 4.59 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5.72 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 6.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీనికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి 8.03 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన ఉన్న సీతమ్మ సాగర్‌లోకి 8.94 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు శబరి ప్రవాహం తోడవుతుండటంతో పోలవరం ప్రాజెక్టులోకి 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బరాజ్‌లోకి భారీ వరద రాగా, 10,09,208 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. అంత్రరాష్ట్ర రవాణా నిలిపివేత బోధన్ మండలంలోని ఖండ్గాం వద్ద మంజీర వంతెన మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి రవాణాను నిలిపివేశారు. కందకుర్తి వద్ద గోదావరి నది వంతెన మీదుగా వరద నీరు ప్రవహించడంతో కందకుర్తి – ధర్మాబాద్ (మహారాష్ట్ర) మధ్య రవాణాను అధికారులు నిలిపివేశారు. » గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉధృతికి నిజామాబాద్–పండరీపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు ఆదివారం తాత్కాలికంగా రద్దు చేశారు. నవీపేట మండలంలోని యంచ శివారులో గల గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జికి మూడడుగుల వ్యత్యాసంలో నది ప్రవహిస్తోంది.ఏడుపాయలను ముంచెత్తిన వరద పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు పెరిగింది. వరద ఉధృతికి ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల నీరు దిగువకు పయనిస్తోంది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఎదుట గల క్యూలైన్లు, షెడ్డు రేకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆలయాన్ని ముంచెత్తుతూ సమీపంలో గల యాగశాల నుంచి వరద పోటెత్తుతోంది. -
1న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతం, దానికి సమీపంలోని మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మంగళవారం నాటికి అదే ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడుతుందని, ఆ తర్వాత ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర, మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని, మంగళవారం నాటికి ఈశాన్యం అరేబియన్ సముద్ర ప్రాంతంలో మరో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ఒకటి పశి్చమ విదర్భ, దాని సమీపంలోని మధ్య మహారాష్ట్ర ప్రాంతంలోని అల్పపీడన కేంద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్రా నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రెండ్రోజుల్లో ముగియనున్న నైరుతి సీజన్ నైరుతి రుతు పవనాల సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకున్న మధ్య కాలాన్ని నైరుతి రుతు పవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నైరుతి రుతు పవనాల ఉపసంహరణ పూర్తి కాగా, వచ్చేనెల రెండో వారం చివరి నాటికి భారత భూభాగం నుంచి పూర్తిగా తిరోగమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈసారి నైరుతి రుతు పవనాల సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. తొలి అర్ధభాగం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదైనా, ఆ తర్వాత రుతు పవనాల కదలికలు అత్యంత చురుగ్గా ఉండడంతో వానలు జోరందుకున్నాయి. నైరుతి సీజన్లో రాష్ట్రంలో సగటున 74.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 98.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 35 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో కురిసే వర్షాలతో సీజన్ వర్షపాతం 100 సెంటీమీటర్లు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే... 147 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 291 మండలాల్లో అధిక వర్షపాతం, 181 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 2 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
Heavy Rain: ఏపీకి భారీ హెచ్చరిక
-
Garam Garam Varthalu: శభాష్ అన్నలు
-
రాత్రి ఒక్కసారిగా పొంగిన మూసీ నది
-
నేడు కోస్తాలో వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఉన్న తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం విజయనగరంలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 5.4, శ్రీకాకుళంలో 4.8, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 4.2, డెంకాడ, ప్రకాశం పెద్దారవీడులో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. శనివారం కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన!
విశాఖ:: వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగానికి (IMD) చెందిన విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం (Visakha Cyclone Warning Center) వెల్లడించింది. అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఇవాళ(శుక్రవారం) రేపు(శనివారం) ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 కి.మీ నుంచి 50 కి.మీ గరిష్ఠ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఐదు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని పేర్కొంది. కృష్ణపట్నం మినహా మిగిలిన అన్ని ఓడరేవుల్లోనూ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీనిలో భాగంగా 9 జిల్లాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. జారీ చేసింది. అదే సమయంలో అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్. హెచ్చరికలు జారీ చేసింది. మూసీ డేంజర్ బెల్స్.. ముసారంబాగ్ బ్రిడ్జి మూసివేత -
TS: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
-
ఏపీలో పలుచోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
-
HYD: ఇవాళ వర్క్‌ఫ్రం హోమ్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది(Hyderabad Heavy Rains). ఇవాళ, రేపు అతిభారీ వర్షం కురవొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు సైతం జారీ చేశారు. అయితే..హైదరాబాద్ వర్షాలకు రోడ్లు ఎలా మారతాయో తెలిసిందే. పైగా సాయంత్రం సమయంలో ట్రాఫిక్ చిక్కులతో వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఐటీ కంపెనీలకు హైదరాబాద్ పోలీసు శాఖ ఓ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులకు ఇవాళ ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు(Work From Home)కల్పించాలని కోరింది. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఉద్యోగులను ఇంటి నుంచే పనులు చేసుకునేందుకు అనుమతిస్తే ఊరట ఉంటుందని సైబరాబాద్ పోలీసులు కోరారు. అదే సమయంలో.. ఉద్యోగులు సైతం కంపెనీలకు, మేనేజర్లకు వర్క్‌ఫ్రం హోం(WFH) ఇవ్వాలంటూ సందేశాలు పెడుతున్నారు. దూర ప్రయాణాలకు బదులు ఈ వెసులు బాటు కల్పించాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు రూట్లలో రోడ్లపై వరద నీరు చేరగా.. ట్రాఫిక్ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: వానలు కదా.. అతని ఆన్సర్‌తో కంగుతిన్న హెచ్ఆర్! -
శంషాబాద్‌లో దిగని విమానాలు!
హైదరాబాద్: వెదర్ ఎఫెక్ట్ పలు విమాన విమాన ప్రయాణాలపై పడుతోంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో(Shamsha Bad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అనుమతి లభించడం లేదు. ఎయిర్ పోర్ట్ మొత్తం అల్లకల్లోల వాతావరణం ఉండడంతో విమానాలను దింపట్లేదు. పుణే-హైదరాబాద్ విమానాలు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు(Vijayawada Gannavaram Airport) వైపునకు దారి మళ్లుతున్నాయి. అలాగే.. ముంబై, కోల్‌కతా విమానాలను కూడా అటువైపే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో(Hyderabad Airport) వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఈ మళ్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.శంషాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్జామ్కెమికల్ ట్యాంకర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో.. శంషాబాద్ వద్ద శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్లపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వర్షంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మూడు గంటలుగా ట్రాఫిక్ పోలీసులు ఎవరూ అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ సినిమాతో ప్రజలకు ఒరిగేది ఏమైనా ఉందా?: హైకోర్టు -
అల్పపీడనం.. 27కి వాయు‘గండం’
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తొలుత బుధవారమే ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించగా, తాజా బులెటిన్‌లో గురువారం ఏర్పడినట్లు తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని శుక్రవారానికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. శనివారం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. శనివారం ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. -
మళ్లీ వాన గండం.. అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణను వరుణుడు ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించడం లేదు. రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపధ్యంలో అధికారులు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని ప్రాంతాలలోని కాజ్ వేలను పరిశీలించాలని, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.వేలాడే విద్యుత్ తదితర వైర్లను తొలగించటంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
నేడు అల్పపీడనం
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది శుక్రవారానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే ఆస్కారం ఉందని పేర్కొంది. శనివారం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో మాత్రం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉండొచ్చు.. గురువారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి,విశాఖ: ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్,ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురియనున్నట్లు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు.రాష్ట్రంలో 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడొద్దని, ప్రతి కూల వాతావరణంలో ఇంట్లోనే ఉండాలని తగు జాగ్రత్తలు చెప్పారు. -
హైదరాబాద్ పై వరుణ ప్రతాపం
-
25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/ఒంగోలు సిటీ/మహానంది: తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. 26వ తేదీన దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచనలున్నాయి. అనంతరం ఇది స్థిరంగా కొనసాగుతూ 27న దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 25వ తేదీ నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో 25 నుంచి 27వ తేదీ వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరోవైపు.. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, పలు చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాగా, ప్రకాశం జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వరా్షలతో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరు మండలం దిగువమెట్ట వద్ద సగిలేరు, అర్థవీడు, కంభం మండలాల్లో జంపలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.మహానంది జలదిగ్బంధంకర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలపాటు భారీ వర్షం కురిసింది. మహానంది ఆలయంలోని రాజగోపురం ముందు కుడివైపు ఉన్న చిన్న గేటు వరకు వర్షం నీరు ప్రవహించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. లోపల ఉన్న బ్రహ్మగుండం, విష్ణుగుండం రెండు చిన్న కోనేరుల్లో భారీగా వర్షం నీరు చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరకు పరిస్థితి అలాగే కొనసాగింది. మహానంది సమీపంలోని ఎంసీ ఫారం గ్రామంలోని వ్యవసాయ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఒంగోలు జాతి పశు పరిశోధనా స్థానం, ఉద్యాన పరిశోధనా స్థానాలు జలమయమయ్యాయి. పశు పరిశోధన కేంద్రం చుట్టూ నీరు ఉండటంతో బయటకి రాలేక ఒంగోలు జాతి ఆవులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కలచివేశాయి. వ్యవసాయ కళాశాల హాస్టల్ ప్రాంగణంలోనూ వర్షం నీరు చేరడంతో విద్యర్థులు ఆందోళన చెందారు. గాజులపల్లె రైల్వేస్టేషన్‌లోకి నీళ్లు రావడంతో గిరిజనులు అవస్థలు పడ్డారు. మహానంది–గాజులపల్లె మార్గంలోని ఎంసీ ఫారం వద్ద ఉన్న పాలేరు వాగు పొంగి రోడ్డుపై సుమారు పది అడుగుల ఎత్తులో ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.‘పశ్చిమ’లో పంటలకు నష్టంఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, ఉండి, వీరవాసరం, పాలకొల్లు, ఆకివీడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాడేపల్లిగూడెం మండలంలో వరి చేలు నేలవాలాయి. ఎల్.అగ్రహారం, కొండ్రుప్రోలు రహదారిలో కోతలు పూర్తయి నెట్టులు కట్టిన ధాన్యం బస్తాలు, రాశులుగా పోసిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందారు. పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడ్డారు. -
దయనీయుడు కాకూడదు!
‘మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయు’డంటాడు కవి ఆరుద్ర ఒక సినీ గీతంలో! సందేహమేముంది? ఆయనే అన్నట్టు, మంచిని తలపెడితే మనిషికి అడ్డే లేదు, దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే, సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే; చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన బొందితో జయించి భువికి తిరిగి రాగలిగినవాడూ మానవుడే! కానీ, అంతటి మహనీయుడు కూడా ఒక్కోసారి దయనీయుడైపోతాడు. ఎంతో ముందుకు చూడగలిగి కూడా తరచూ హ్రస్వ దృష్టికి లోనవుతాడు. పదిమందికీ మంచిని తలపెట్టేవాడు కూడా స్వప్రయోజనాన్ని మరిగి చివరికి సొంతానికే చేటు తెచ్చుకుంటాడు. సర్వతోముఖ వికాసం మనిషికి వరమే కానీ, తనకు తనే చెరుపు చేసుకునే బహుముఖ వైఫల్యం పెనుశాపం. అసాధారణ వర్షాల కారణంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. హఠాత్తుగా అతివృష్టి, మెరుపు వరదలు, మట్టిపెళ్ళలు విరిగిపడటం వగైరా ఉత్పాతాల కారణంగా ఈ సంవత్సరం ఇప్పటికి దాదాపు మూడు వేల మంది మరణించారు, లక్షల కోట్ల విలువైన ఆస్తినష్టం సంభవించింది. అడ్డూ అదుపూ లేని పట్టణాభివృద్ధి, అడవుల నిర్మూలన, రోడ్ల నిర్మాణం, విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అభివృద్ధి చర్యలను ఇందుకు కారణంగా పర్యావరణ వాదులు ఎత్తిచూపుతున్నారు. ఇటువంటివి లేని రోజుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సంగతిని కొందరు ఉదాహరిస్తున్నారు. కారణమేమైనా ప్రాణనష్టం, ఆస్తినష్టం కళ్లముందు కటిక నిజాలు. పటిష్ఠమైన ముందస్తు హెచ్చరిక యంత్రాంగాన్ని ఇప్పటికీ ఏర్పరచుకోలేక పోవడం – దీనంతటి వెనుకా మహనీయుడైన మానవుడి పరంగా చెప్పుకోవలసిన ఒకానొక వైఫల్యం. దీనికితోడు, దేశంలో ప్రకృతి విపత్తులకు గురికాగల ప్రాంతాల గురించిన గణాంకాలు గుండె గుభేలుమనిపిస్తాయి. ఏకంగా 27 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులోకి వస్తాయి. వ్యవసాయ యోగ్యమైన 68 శాతం భూమి ఏ క్షణంలోనైనా అనావృష్టికి గురికావచ్చు, 15 శాతం ప్రాంతంలో ఉన్నట్టుండి రాళ్ళవర్షం కురవచ్చు, 12 శాతం ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించవచ్చు. ఈ విపత్తులు ఏటా పెరగడమే తప్పే తగ్గే అవకాశం లేదట! శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో మానవుడి బుద్ధి ఎంతో చురుగ్గా పని పనిచేయడం ఎంతైనా శ్లాఘనీయమే; అభివృద్ధిని ప్రజలకు మరింత సుఖమయ జీవన యోగ్యంగా మలచే దిశగా శరవేగంతో కదలడమూ అభినందనీయమే; కానీ, దానిని అంటిపెట్టుకుని వచ్చే సమస్యల నివారణలో మాత్రం అతని అడుగు చురుగ్గా పడటం లేదు. దాంతో అభివృద్ధి అస్తవ్యస్తానికీ, అభద్రతకూ చిరునామా అవుతోంది. దేశంలోని మహా నగరాలలో రోడ్ల పరిస్థితే ఇందుకు మరో ఉదాహరణ. ఆయా నగరాలలో జనాభా పెరుగుదలా, కొత్త జనావాసాల విస్తరణా, రాకపోకల అవసరాలూ, వాహనాల పెంపూ విమాన వేగాన్ని అందుకున్నాయి; కానీ, ఆ దామాషాలో రోడ్ల నిర్వహణా, ఇతర వసతుల కల్పనలో ప్రభుత్వాల ప్రణాళికలు ఎడ్లబండి వేగంతో నడుస్తున్నాయి. అనేక నగరాలలో రాకపోకల రద్దీ ఎంతటి సమస్యాత్మక స్థాయికి చేరిందంటే, జనం గంటల తరబడి కాలాన్ని ట్రాఫిక్ జామ్ లోనే గడపవలసి వస్తోంది, ఎంతో విలువైన ఉత్పాదక సమయం రోడ్లపాలైపోతోంది. రకరకాల జీవనోపాధి పనుల మీద తిరిగే జనాలను అది మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది తొలి అయిదారు మాసాల్లోనే దేశవ్యాప్తంగా నగరాల రోడ్లపై సంభవించిన దుర్ఘటన మరణాలు వేలసంఖ్యను దాటిపోయాయి. అయినాసరే, పౌరరవాణా సదుపాయాల అభివృద్ధీ వగైరాలు కాగితాల దశను దాటి కార్యరూపం ధరించడానికి ఏళ్లూపూళ్లూ పట్టిపోతోంది. మొత్తంమీద కవి చెప్పినట్టు గ్రహరాశుల నధిగమించి ఘనతారల పథము తొక్కగలిగిన మహనీయుడే తన లోకాన్ని సర్వతోభద్రంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాడు. మనిషి జైత్రయాత్రలో ఎక్కడో అడుగు తడబడి అపజయపు దారి పడుతోంది. తనను దయనీయుడిగా రూపుకట్టే ఆ తడబాటును సరిదిద్దుకుని మహనీయుడన్న ఖ్యాతి నిలుపుకోవడం మనిషి తక్షణావసరం -
తెలంగాణలో రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు(సెప్టెంబర్ 21, ఆదివారం) తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో కుండపోత తప్పదంటూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. మహబూబ్‌నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, కొత్తగూడెం, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, పిడుగులతో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉపరితల ఆవర్తనం (surface circulation) ప్రభావంతో.. వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి ఎండలు దంచి కొడుతూ.. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి.ఐంఎడీ అంచనా ప్రకారం ఈ నెలలో సాధారణం కంటే 109% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో రాగల 10 రోజులూ ఈ తరహా వర్షాలు తప్పవని, ఇవి ఆకస్మిక వరదల ముప్పు దారి తీయొచ్చని హెచ్చరిస్తోంది. -
Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
-
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 18) నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన ధాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, మారేడ్‌పల్లి, ఉప్పల్, సుల్తాన్‌బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, మణికొండ, షేక్‌పేట, రాయదుర్గంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఫలితంగా రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి..నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది.భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. మోకాళ్లలోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తిరుపతిలో కుండపోత వర్షం
-
మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు
-
Pune: మూతపడిన స్కూళ్లు.. రేపు కూడా సెలవు?
పూణె: మహారాష్ట్రలోని పూణెలో నిన్న(ఆదివారం) రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజాజీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పూణేలోని పాఠశాలలకు ఈ రోజు(సెప్టెంబర్ 15) సెలవు ప్రకటించారు. Pune Rains: Heavy Downpour Triggers Traffic Jams, Waterlogging Across City🔗 https://t.co/ibQExSolWN#punenews #punerains #Rain #weatheralert pic.twitter.com/9HCdtVz3w0— Free Press Journal (@fpjindia) September 15, 2025వాతావారణశాఖ అధికారుల సూచనల మేరకు సెప్టెంబర్ 16న కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షపాతం కారణంగా పూణేలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పూణే మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. భారత వాతావరణ శాఖ పూణేతో పాటు సమీప జిల్లాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ పూణే, ముంబై, థానే, రాయ్‌గడ్, బీడ్, అహల్యానగర్, లాతూర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్నాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. -
గ్లోబల్ వార్మింగ్.. ప్రజలకు వార్నింగ్
సాక్షి, అమరావతి: గ్లోబల్ వార్మింగ్ రుతుపవనాల వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ.. ప్రజలకు వార్నింగ్ ఇస్తోంది. ప్రధానంగా వ్యవసాయాధారితమైన మన దేశంలో వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థలకు పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మన దేశంలో ఎక్కువమంది ప్రజలకు వ్యవసాయమే ఆధారం. సేద్యానికి జీవం పోసేది వర్షం. ఆ వర్షాలను సమకూర్చేవి రుతుపవనాలు. అవి లేకపోతే పంటలే లేవు. పంటలు లేకపోతే అన్నదాతే లేడు. అందుకే రుతుపవనాలను దేశ ఆర్థికవ్యవస్థకు ఊపిరిగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ రుతుపవనాల వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. వర్షాలు ఎక్కడ పడతాయో, ఎప్పుడు పడతాయో అంచనా వేయడం కష్టమవుతోంది. ఎండాకాలంలో ఆకస్మిక వర్షాలు, వరదలు.. వర్షాకాలంలో ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన రాష్ట్రంలో గత వేసవిలో విపరీతమైన వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంలేదు. అదే సమయంలో వేసవిలో తరహాలో ఎండలు కాస్తున్నాయి. రెండు ప్రధాన రుతుపవన వ్యవస్థలు భూభాగం వేడెక్కి తక్కువ పీడనం ఏర్పడినప్పుడు సముద్రం నుంచి భూమివైపు వచ్చే తేమగాలులు విస్తారంగా వర్షాలు కురిపిస్తాయి. ఈ వ్యవస్థనే రుతు పవనాలుగా పిలుస్తారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు వర్షాలు కురిపిస్తాయి.నైరుతి రుతుపవనాలు: ఈ సీజన్ జూన్ నుంచి సెపె్టంబర్ వరకు ఉంటుంది. దేశం మొత్తం వార్షిక వర్షంలో సుమారు 75 శాతం ఈ కాలంలోనే కురుస్తుంది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి క్రమంగా దేశమంతా విస్తరిస్తూ జూన్ చివరినాటికి ఉత్తర భారతం వరకు చేరతాయి. జూలైలో గరిష్ట వర్షాలు పడతాయి. ఆగస్టు వరకు కొనసాగి, సెపె్టంబర్ చివర్లో ఇవి వెనుదిరుగుతాయి.ఈశాన్య రుతుపవనాలు: అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ఈ వర్షాలు ప్రాణాధారం. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయిన తరువాత ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తగ్గిన ఎల్‌నినో ప్రభావం ఇప్పటివరకు రుతుపవనాలపై ఎల్‌నినో, లానినో ప్రభావం బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభావం బలహీనమైంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలే వర్షాలపై ప్రధానంగా ఉంటోంది. ఎల్‌నినో, లానినో అనేవి పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కడం, చల్లబడటం వల్ల జరిగే వాతావరణ మార్పులు. ఎల్‌నినోలో సముద్రం వేడెక్కుతుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఎండలు, కరువు పరిస్థితులు, కొన్నిచోట్ల వరదలు వస్తాయి. లానినోలో సముద్రం చల్లబడుతుంది. వర్షాలు ఎక్కువై తుపాన్లు కూడా రావచ్చు. ఈ రెండు వ్యవస్థలు ప్రపంచంలోని వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.రుతుపవనాల ప్రభావం » దేశంలో 51 శాతం వ్యవసాయ భూమి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. » మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం ఈ రుతువుల వల్ల కురిసే వర్షాల ద్వారానే వస్తుంది. » గ్రామీణ జనాభాలో 47 శాతం మంది జీవనోపాధి వ్యవసాయమే. » చెరువులు, బావులు, నదులు నిండిపోవడం నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకు అన్నింట్లో రుతుపవనాలు కీలకం. భవిష్యత్తు అంచనాలు » 2040 నాటికి వర్షపాతం 12 శాతం నుంచి 22 శాతం వరకు పెరిగే అవకాశం. » వర్షం కురిసే రోజులు తగ్గి, తక్కువ రోజుల్లోనే విపరీతంగా వర్షాలు కురుస్తాయి. » దీనిఫలితంగా వరదలతో పాటు కరువు పరిస్థితులు ఎదురవుతాయి. » ఈ శతాబ్దం చివరినాటికి రుతుపవనాల అసమానత మరింత తీవ్రం అవుతుంది.వాతావరణ వైపరీత్యాలు.. క్లౌడ్‌బరస్ట్‌ల ముప్పు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రుతుపవనాల్లో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది. గుజరాత్, పశ్చిమ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. భారీ వర్షపాతం సంఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము–కశ్మీర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసే ఆకస్మిక వర్షాలు (క్లౌడ్ బరస్ట్‌లు) పెరుగుతున్నాయి. గంటలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురవడం వల్ల గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. అపారమైన ప్రాణ, ఆస్తినష్టం జరుగుతున్నాయి. వర్షాలు అసహజంగా కురవడం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో నీటినిల్వలు పెరుగుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్య వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీనికితోడు రుతుపవన ద్రోణుల ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షం కురుస్తుందని పేర్కొంది. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా నవగంలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/మెదక్ మున్సిపాలిటీ/తాండూరు రూరల్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. హైదరాబాద్‌తోపాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్‌లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వాన కురిసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పట్టణంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యా ర్థులు అవస్థలు పడ్డారు. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజధానిలో... హైదరాబాద్‌లో ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం మూడు తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో 11.2 సెం.మీ., డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెం.మీ, వర్షపాతం నమోదైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్దుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం వరకు ఉన్న ఇన్నర్ రింగ్‌రోడ్డు సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వాగులో ఒకరి గల్లంతు వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్తంపల్లి మొగులప్ప(40) ఆవుల కాపరిగా పని చేస్తున్నాడు. గురువారం అతను ఊరి శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో వృథాగా పడేసిన టార్ఫాలిన్, ప్లాస్టిక్ కవర్ల కోసం దిడ్డివాగు దాటి వెళ్లాడు. ఎగువ ప్రాంతంలో కరిసిన వర్షానికి వరద ఉధృతమైంది. అవతలి ఒడ్డున ఉన్న గ్రామస్తులు వద్దని వారిస్తున్నా వినకుండా కవర్ల మూటను నెత్తిపై పెట్టుకుని వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. అతని భార్య లలితమ్మ, ఇద్దరు కొడుకులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మొగులప్ప ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగించింది. రెండ్రోజులు మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం గురువారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5 కి.మీ. ఎత్తువరకు కొనసాగుతోంది. మరో ద్రోణి సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతం నుంచి జార్ఖండ్, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటివరకు సగటున 64.05 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 78.52 సెం.మీ. నమోదైంది. -
మరో వారం రోజుల పాటు ఢిల్లీకి వాతావరణ శాఖ వర్ష సూచన
-
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/వాకాడు: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయంది. బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 5. 4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లా గాజువాకలో 5.3, అనకాపల్లి జిల్లా వేంపాడులో 4.4, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 4.4, విజయనగరం జిల్లా మెరకముడిదంలో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీరంలో అలల ఉధృతి..అల్పపీడనం బలపడటంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి అధికమైంది. ఒక్కో సమయంలో సముద్రం నిశ్చలంగా, ఒక్కోసారి అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. సాధారణంగా అల్పపీడనం సమయంలో సముద్రంలో అలలు ఎక్కువగా ఉండడంతోపాటు తీరం దాటే వరకు నిరంతరం కెరటాలు ఎగసి పడుతుంటాయి. ఈసారి అలా కాకుండా సముద్రం గంట గంటకు మార్పు చెందుతూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం వినాయక విగ్రహ నిమజ్జనాల పర్వం తూపిలిపాళెం సముద్ర తీరంలో కొనసాగుతోంది. అలలు లేని సమయం కోసం భక్తులు ఎదురు చూసి నిమజ్జనం చేస్తున్నారు. వాకాడు పోలీసులతోపాటు దుగ్గరాజపట్నం మెరైన్ పోలీసులు భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేట నిలిపివేశారు. -
ఇక పడేదంతా బోనస్సే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు సంతృప్తికర స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతానికి మించి వానలు పడ్డాయి. అయితే ఈ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంది కాబట్టి.. ఇకపై కురిసే వర్షాలు అదనమేనని, వర్షాలు కురిస్తే సగటు సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్ కాగా.. ఈ 4 నెలల కాలంలో రాష్ట్రంలో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 59.30 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా,... ఏకంగా 75.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు ∙ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలోని 6 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో అధిక వర్షపాతం, 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 60 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 55, ములుగులో 51 రోజుల పాటు వర్షాలు కురిశాయి. నిర్మల్‌లో 48, వరంగల్‌లో 47, మహబూబాబాద్‌లో 44, మెదక్, సంగా రెడ్డి జిల్లాలో 43 రోజుల పాటు వర్షాలు కురిశాయి. నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో 42 రోజులు చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో 41 రోజుల చొప్పున వర్షాలు కురిశాయి. మండలాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే..119 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 271 మండలాల్లో అధిక వర్షపాతం, 218 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో మాత్రం ఇంకా లోటు ఉంది. సీజన్ ముగిసే నాటికి ఈ మండలాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. సెపె్టంబర్లో రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనాలు విడుదల చేసింది.» అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: మెదక్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, కామారెడ్డి » అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు : సిద్దిపేట, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్, నల్లగొండ, మేడ్చల్–మల్కాజిగిరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ » సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: ములుగు, మహబూబా బాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, పెద్దపల్లి. -
ఉత్తరాదిన వర్ష బీభత్సం కొనసాగుతున్న DDMA రిలీఫ్ ఆపరేషన్
-
68 రైళ్లు నెల్లాళ్లు క్యాన్సిల్.. రైల్వే చెబుతున్న కారణమిదే..
శ్రీనగర్: భారీ వర్షాల నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఏకంగా 68 రైళ్లను క్యాన్సిల్ చేసింది. వర్షాల తాకిడి జమ్ముకశ్మీర్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపధ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.భారీ వర్షాల కారణంగా జమ్ము- కత్రా స్టేషన్ల నుండి రాకపోకలు సాగించే 68 రైళ్లను సెప్టెంబర్ 30 రద్దు చేసినట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా, జమ్ము రైల్వే డివిజన్లో గత ఎనిమిది రోజులుగా టైల్ ట్రాఫిక్ నిలిపివేశారు. పఠాన్‌కోట్-జమ్ము సెక్షన్‌లోని పలు చోట్ల ట్రాక్‌లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆగస్టు 26 నుండి జమ్ము ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వేలాది మంది, ముఖ్యంగా యాత్రికులు ఇక్కడ చిక్కుకుపోయారు. కాట్రాలోని మాతా వైష్ణో దేవి మందిరం సమీపంలో కొండచరియలు విరిగిపడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు.జమ్ములో చిక్కుకుపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతోంది. మరోవైపు లోయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం సాయంత్రం కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ సూచన దృష్ట్యా విభాగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. జీలం నది, ఇతర నీటి వనరులు వరద హెచ్చరిక స్థాయి కంటే ప్రస్తుతానికి తక్కువగానే ప్రవహిస్తున్నాయని తెలిపారు. -
Himachal: విపత్తుల్లో ఐదుగురు మృతి.. అంతటా జల దిగ్బంధం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. తాజాగా రాష్ట్రంలో సంభవించిన కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా పలు చోట్ల ఇళ్లు కూలిపోయిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. నాలుగు జాతీయ రహదారులు సహా 1,337 రోడ్లు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు.రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో భారత వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోలన్ జిల్లాలోని సామ్లో గ్రామంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో ఒక మహిళ మృతిచెందింది. మృతురాలిని హేమలతగా గుర్తించారు. ప్రమాదంలో ఆమె భర్త హీమ్ రామ్, నలుగురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.కులులోని ధల్పూర్లో వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడంతో శిథిలాల నుంచి ఒక పురుషుడు, ఒక మహిళను సహాయక సిబ్బంది రక్షించారు. ఆ మహిళ తరువాత మృతిచెందింది. మండి జిల్లాలోని సుందర్‌నగర్‌లోని జంగం బాగ్ బీబీఎంబీ కాలనీ సమీపంలో కొండచరియలు విరిగిపడి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. -
ఐదు రోజులూ వర్షాలే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 3వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలివేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురవొచ్చు. 4వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమురంభీంఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురవొచ్చు. 5వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు (వేగం గంటకు 30–40 కి.మీ.) జనగాం, ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా వీచే అవకాశం ఉంది. 6వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (వేగం 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. హనుమకొండ, హైదరాబాద్, జనగాం, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్– మల్కాజ్గిరి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా బలమైన ఉపరితల గాలులు (వేగం 30–40 కి.మీ.) వీచే అవకాశం ఉంది.7వ తేదీ: అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Heavy Rains: ఏపీకిహై అలర్ట్ రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు
-
నీటితో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?
మనం తినే ఆహారంలో 95% మట్టిలోనే పండుతోంది. వ్యవసాయానికి, ఆహార భద్రతకు నేలపైన ఉండే 6 అంగుళాల మట్టే (టాప్ సాయిల్) మూలాధారం. మానవాళికి ఎంతో విలువైన ఈ వారసత్వ సంపద వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతోంది. మేటలు వేసిన ఇసుక ఆ మట్టిలోనిదే. పంట నష్టం, ఆస్తి నష్టం కన్నా మట్టి నష్టం చాలా పెద్దది. మనం ఎవరూ పట్టించుకోని విపత్తు ఇది.ఇలా భూముల్లోనుంచి కొట్టుకెళ్లిన మట్టి, ఇసుకతో రిజర్వాయర్లు, చెరువులు పూడుకుపోతున్నాయి. పైమట్టిని కోల్పోతున్న సాగు భూములు నిస్సారమవుతున్నాయి. ఫలితంగా 1960లో కిలో రసాయనిక ఎరువు వేస్తే 16.5 కిలోల పంట వచ్చేది. ఇప్పుడు 3.5 కిలోలకు తగ్గిపోయింది. మన దేశంలో ప్రతి సంవత్సరం హెక్టారుకు సగటున 21 టన్నుల టాప్ సాయిల్ కొట్టుకుపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలకు కోల్పోతున్న మట్టి ఎంత? మట్టి కొట్టుకుపోకుండా ఏమైనా చెయ్యగలమా? ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవాలి? వ్యవసాయ పద్ధతుల్లో ఏం మార్పులు తేవాలి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? చదవండి.. – సాక్షి సాగుబడిమట్టి.. మనకు పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు, తేమతో కూడి ఉండే నేల పైపొర వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది. మట్టి కోతకు గురికావటం వల్ల భూమి ఉత్పాదకశక్తి, పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. భూమి పైపొరలో 6 సెం.మీ. లోతు మట్టిలోనే పంటలు పండించుకొని తిని మనం బతుకుతున్నాం. 95% ఆహారాన్ని ఇస్తున్నది ఈ మట్టే. రాళ్లు రప్పలు, ఆకులు అలముల కారణంగా మట్టి సహజసిద్ధంగా నిరంతరం ఏర్పడుతూనే ఉంటుంది. 6 సెం.మీ. మందాన మట్టి ఏర్పడటానికి 1,000 సంవత్సరాలు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. అయితే, అంతకన్నా అతివేగంగా కొట్టుకుపోతున్నది. ఎక్కువగా దున్నే భూములు, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ.తెలుగు రాష్ట్రాల్లో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?తెలుగు రాష్ట్రాల్లో ఏటా హెక్టారుకు సగటున 14–15 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. తెలంగాణలో సగటున హెక్టారుకు ఏడాదికి 14 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో సగటున 15 టన్నుల మట్టి వర్షానికి, వరదలకు కొట్టుకుపోతున్నదని ఐఐటీ ఢిల్లీ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వేల టన్నుల్లోనే మట్టి కోతకు గురై కొట్టుకుపోతోంది.కొండ ప్రాంతాలు, వాలు ఎక్కువగా ఉన్న భూములు, అడవులు నరికివేసిన నేలలు, తవ్వకాలు జరిగే ప్రాంతాలు, ఎక్కువగా దుక్కి లేదా దమ్ము చేసే ఎటువంటి ఆచ్ఛాదనా లేని వ్యవసాయ భూముల్లో నుంచి నమ్మలేనంత ఎక్కువ మొత్తంలో హెక్టారుకు ఏడాదికి వేల టన్నుల్లోనే మట్టి కొట్టుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4,407 టన్నులైతే, తెలంగాణలో కొంచెం తక్కువగా 3,498 టన్నులు కొట్టుకుపోతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.పెద్దపల్లిలో అత్యధికంతెలంగాణ జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : పెద్దపల్లి– 22, నల్లగొండ– 20, కుమురంభీం ఆసిఫాబాద్– 18, ములుగు– 18, జయశంకర్ భూపాలపల్లి– 18, ఆదిలాబాద్ – 17, జగిత్యాల– 17, భద్రాద్రి కొత్తగూడెం– 17, మంచిర్యాల– 17, ఖమ్మం– 16, సూర్యాపేట– 16, వరంగల్ రూరల్– 16, మహబూబాబాద్– 13, కరీంనగర్ – 13, వరంగల్ అర్బన్– 13, యాదాద్రి భువనగిరి– 13, వనపర్తి– 12, జనగాం– 12, నిర్మల్– 12, నిజామాబాద్– 12, వికారాబాద్– 12, కామారెడ్డి– 11, రాజన్న సిరిసిల్ల– 11, మహబూబ్‌నగర్– 11, నాగర్ కర్నూల్– 11, సంగారెడ్డి– 10, నారాయణపేట– 10, సిద్ధిపేట– 9, మెదక్– 9, రంగారెడ్డి– 9, జోగుళాంబ గద్వాల– 8, మేడ్చల్–మల్కాజిగిరి– 6, హైదరాబాద్– 0. జనావాసాలతో కిక్కిరిసి ఉండే హైదరాబాద్ జిల్లా నుంచి వర్షానికి మట్టి పెద్దగా కొట్టుకుపోవట్లేదు! అత్యధికంగా మట్టి కొట్టుకుపోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటని ఇస్రో అధ్యయనం తెలిపింది.ఆరు వర్గీకరణలుఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం దాదాపు 300 చదరపు కిలోమీటర్లు లేదా దాని ఉపరితల నేలలో 31 శాతం ‘విపత్కర’ స్థాయిలో కోతకు గురవుతోంది. ‘దేశంలో నేల కోతపై సమగ్ర అవగాహన కలిగించేందుకు నేల కోత ఏయే జిల్లాల్లో ఏయే దశల్లో ఉందో అధ్యయనం చేశాం’ అన్నారు సహారియా. ఒక సంవత్సరంలో హెక్టారు భూమి నుంచి టన్నుల కొద్దీ మట్టి కొట్టుకుపోతోంది. ఒక సంవత్సరంలో ఒక హెక్టారులో 100 టన్నులకు పైగా మట్టి కోతకు గురైనట్లు తేలితే, ఆ ప్రాంతాన్ని ‘విపత్తు’ ప్రాంతంగా వర్గీకరిస్తారు.జాతీయ సగటు హెక్టారుకు 21 టన్నులుదేశంలో వానలు, వరదలకు సగటున సంవత్సరానికి హెక్టారు భూమి నుంచి 21 టన్నుల మేరకు మట్టి నీటితో పాటు కొట్టుకుపోతోందని ఢిల్లీ ఐఐటీ అధ్యయనంలో తేలింది. భౌగోళిక స్థితి, జీవవైవిధ్య పరంగా హిమాలయాలు, బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాలు నేల కోతకు అతిపెద్ద హాట్‌స్పాట్. అక్కడితో పోల్చితే భిన్నంగా ఉండే ఒడిశా లో కూడా ‘విపత్కర’ స్థితిలో నేల కోతకు గురవుతోంది.జిల్లాల వారీగా చూస్తే, దేశంలో నేల కోతకు గురయ్యే అవకాశం ఉన్న 20 జిల్లాల్లో తొమ్మిది అస్సాంలోనే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. అడవుల నరికివేత, రసాయనిక/పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చెయ్యటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ‘నేల కోతకు సంబంధించి పాన్–ఇండియా స్థాయిలో రాష్ట్రాలు, జిల్లాల వారీగా అధ్యయనం చేసి గణాంకాలను ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచాం. భవిష్యత్తులో నేల సంరక్షణ ప్రణాళికల అమలుకు ఈ సమగ్ర అవగాహన దోహదపడుతుందని ఆశిస్తున్నాం అన్నారు సహారియా.వర్షపాతం ఇంకా పెరుగుతుంది!వర్షపాతం వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2050 నాటికి ఖరీఫ్ కాలంలో 5–10 శాతం, రబీ కాలంలో 12–17 శాతం వర్షపాతం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో పార్లమెంటులో చెప్పారు. అంటే, నివారణ చర్యలకు మనం ఉపక్రమించకపోతే రానున్న రోజుల్లో మరింత మట్టి కొట్టుకుపోతుందన్నమాట. 2050 నాటికి హెక్టారుకు మరో 10 టన్నుల మట్టి కొట్టుకుపోతుందని కూడా మంత్రి హెచ్చరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ సమస్యను కొంత వరకు అధిగమించవచ్చు.100 టన్నుల మట్టి పోతే విపత్తు!మన దేశంలో భూముల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఢిల్లీలోని ఇండియన్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) అధ్యయనం వెల్లడించింది. దాదాపు 30 శాతం భూభాగం ‘స్వల్పంగా’ కోతకు గురవుతూ ఉంటే, కీలకమైన 3 శాతం భూభాగం ‘విపత్కర’ స్థితిలో మట్టిని వర్షాలు, వరదల వల్ల నష్టపోతోందని ఈ పరిశోధన తెలిపింది. జియోస్పేషియల్ మోడలింగ్ – మ్యాపింగ్’ పేరిట జరిగిన ఈ అధ్యయనం మన దేశం అంతటా నేల కోతను లెక్కగట్టింది. ఢిల్లీ ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైడ్రోసెన్స్ ల్యాబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డా. మనబేంద్ర సహారియా, రవిరాజ్ అధ్యయనం చేశారు.ఉత్తరాంధ్రలో అత్యధికంఏపీలోని పాత జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : శ్రీకాకుళం– 27, విశాఖపట్నం– 27, విజయనగరం– 25, తూర్పు గోదావరి– 16, చిత్తూరు– 16, అనంతపురం– 15, వైఎస్సార్ కడప – 14, పశ్చిమ గోదావరి– 13, కృష్ణా– 13, ప్రకాశం– 13 (782), గుంటూరు– 12, కర్నూలు– 12, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు– 10 .భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?హెక్టారు భూమిలో 1 సెం. మీ. వర్షం కురిస్తే లక్ష లీటర్ల నీరు పడుతుంది. అధిక వర్షాలకు పొలంలోని మెత్తని మట్టి నీట కరిగి వరదతో వెళ్లిపోతుంది. ఆ మట్టి నీటి అడుగుకు చేరాలంటే పది గంటలు పడుతుంది. కాబట్టి, రిజర్వాయర్లు, చెరువుల్లోకి వరద నీటి ద్వారా ఆ మట్టి చేరుతుంది. ఇసుకైతే దగ్గర్లోని పొలాల్లో మేట వేస్తుంది. నేల పైపొర మట్టి వర్షానికి కొట్టుకుపోతే అడుగున మొరం, రాళ్లు, రప్పలు పైకి తేలతాయి. ఒక మోస్తరు వర్షపు నీరు పొలం నుంచి బయటకు పోకుండా భూమిలోకి ఇంకాలంటే పంట పొలాల్లో కందకాలు, కుంటలు తవ్వుకోవాలి. నీరు ఇంకటంతో పాటు మట్టి కూడా పొలం దాటి బయటకు పోకుండా కందకాలు లేదా కుంటల్లో ఆగుతుంది. మట్టిని తర్వాత తీసి మళ్లీ పొలంలో వేసుకోవచ్చు. మట్టిని పరిరక్షించుకునేందుకు అందరూ శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?– డా. అల్లూరి పద్మరాజు, ఆంగ్రూ మాజీ వైస్ఛాన్సలర్మట్టిని జాతి సంపదగా చూడాలిఏటా హెక్టారు భూమిలో 1.5 టన్నుల మట్టి కొత్తగా ఏర్పడుతుంది. 200 ఏళ్లకు గానీ ఒక అంగుళం ఎత్తు మట్టి ఏర్పడదు. అయితే, అంతకు 8 రెట్ల మట్టి ప్రతి ఏటా వాన నీటితో, గాలితో కొట్టుకు పోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పొలం రైతు సొంతదైనా మట్టిని జాతి సంపదగా చూడాలి. మట్టిని కాపాడుకోవటానికి, భూసారాన్ని పెంపొందించుకోవటానికి ప్రభుత్వం ఈ 4 పనులు చెయ్యాలి: 1. భూమిని వీలైనంత మేరకు ఆచ్ఛాదన పంటలతో, గడ్డితో కప్పి ఉంచటం. 2. అతిగా దున్నటం, దమ్ము చెయ్యటం తగ్గించటం. 3.సాగు పద్ధతి ఏదైనా భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా కలిసేలా పచ్చిరొట్ట పంటలు సాగు చేసి కలియదున్నాలి. 4. ప్రతి సీజన్లోనూ దున్నాల్సిన అవసరం ఉన్న వరి వంటి పంటలకు బదులు తోటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.– డా. జీవీ రామాంజనేయులు, ఈడీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవస్థాపకులు -
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
-
Devastating Monsoon Rains: దేశాన్ని ముంచేస్తోన్న వరద
-
విజయవాడలో భారీ వర్షం
-
రాష్ట్రంలో రెండ్రోజులపాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నైరు తి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వచ్చే రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 26 మండలాల్లో ఇంకా లోటు... జూన్, జూలై, ఆగస్టులలో 57.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 72.06 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జిల్లాలవారీగా చూస్తే 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 10 జిల్లాల్లో అధికం, 15 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో 90 శాతం అధిక వర్షాలు నమోద య్యాయి.136 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 238 మండలాల్లో అధికం, 221 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా 26 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నిలకడగా గోదావరి కాళేశ్వరం: గోదావరినది నిలకడగా ప్రవహిస్తోంది. ఆదివారం కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్లను తాకుతూ 12.500 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహించింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాళేశ్వరానికి ఎగువ ఉన్న అన్నారం బరాజ్ నుంచి వద్ద 3.56 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మొత్తం 66 గేట్లు ఎత్తి ఉంచడంతో అక్కడి నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహితనదితో కలిసి పరవళ్లు తొక్కుతోంది. మేడిగడ్డ బరాజ్‌కు 8.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 85 గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. -
Punjab: భీకర వరదలు.. లక్షల ఎకరాల్లో పంట నష్టం.. 1,018 గ్రామాలు నీట మునక
చండీగఢ్: పంజాబ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా మూడు లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 1,018 గ్రామాలు నీట మునిగాయి. 1988లో సంభవించిన వరదల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో వరదలు పంజాబ్‌ను చుట్టుముట్టాయి. పంజాబ్‌లో తాజాగా సంభవించిన వరదలు వెయ్యికి పైగా గ్రామాలను ప్రభావితం చేశాయి. మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద విపత్తులకు ముగ్గురు మరణించినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, జమ్ముక కశ్మీర్లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృత్సర్, తర్న్ తరణ్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, కపుర్తలా హోషియార్పూర్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. On one hand, Indian Punjab is drowning, people are starving & struggling but the lapdog media is only staging pictures to show that it is “helping.” The truth is, this disaster is the very fire it ignited itself which has now come back to haunt it.#PunjabFloods2025 #FloodAlert pic.twitter.com/llwTgL9LzY— Noor Fatima (@Fatima_Zahra120) August 29, 2025ప్రాథమిక నివేదికల ప్రకారం సరిహద్దు జిల్లా ఫాజిల్కాలో 41,099 ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. పంజాబ్ జల వనరుల మంత్రి బరీందర్ కుమార్ గోయల్ మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న గ్రామాలలో దాదాపు మూడవ వంతు గ్రామాలు గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్నాయన్నారు. గురుదాస్‌పూర్‌లో 2,571 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఫజిల్కాలో 1239 మందిని తరలించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 77 సహాయ శిబిరాల్లో 4,729 మంది ఆశ్రయం పొందుతున్నారు. Reality of Punjab Floods Full Report Linkhttps://t.co/xktLuLGoLb pic.twitter.com/zzrD89WfWd— Rattandeep Singh Dhaliwal (@Rattan1990) August 27, 2025 -
గంటకు 400 కిలోమీటర్లు!
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. గుజరాత్‌లోని స్టేషన్ ్సలో సివిల్ పనులు పూర్తి అయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేస్తున్న ‘ఈ–10’ షింకన్సెన్ బుల్లెట్ రైలు 2030లో పట్టాలెక్కనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం ఈ ట్రైన్ ప్రత్యేకత.జపాన్ పర్యటనలో భాగంగా షింకన్సెన్ బుల్లెట్ రైలులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ సహకారంతో ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హై స్పీడ్ రైల్ నడపడం కోసం అక్కడ శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతోనూ మోదీ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో దేశంలోని తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది.508 కి.మీ. కారిడార్బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీల గుండా పోతుంది. మొత్తం కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. వీటిలో మహారాష్ట్రలో నాలుగు, గుజరాత్లో ఎనిమిది రానున్నాయి. మహారాష్ట్రలో ముంబై స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, అలాగే గుజరాత్‌లోని వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్ ్స రానున్నాయి.⇒ మొత్తం 8 స్టేషన్లలో ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. ⇒ 395 కి.మీ పీయర్ పనులు, 407 కి.మీ. ఫౌండేషన్, 337 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి. ⇒ 17 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మరో 9 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికావచ్చింది. ⇒ 317 కి.మీ. వయడక్ట్ నిర్మాణం కూడా పూర్తయింది. ⇒ గుజరాత్లో 198 కిలోమీటర్ల ట్రాక్ సిద్ధమైంది.ట్రయల్ రన్ 2027లో..గుజరాత్లో మొదటి 50 కిలోమీటర్ల మార్గంలో 2027లో బుల్లెట్ రైలు పరుగు తీయనుంది. గుజరాత్‌లోని స్టేషన్ల నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి, మొత్తం ప్రాజెక్టు 2029 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.రూ.78,839 కోట్ల వ్యయంముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.78,839 కోట్లు ఖర్చు చేశారు.⇒ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 81 శాతం మొత్తాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్ ప్రభుత్వం సమకూరుస్తోంది. ⇒ ఈ ప్రాజెక్టులో రైల్వే శాఖకు 50 శాతం; మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు చెరి 25 శాతం వాటా ఉంది. ఆర్థిక సహాయంతోపాటు భారత్‌లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సన్ రైళ్లను జికా ఉచితంగా సరఫరా చేస్తోంది.స్థల సేకరణ పూర్తిమహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం, కోవిడ్–19 మహమ్మారి.. తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం అయింది. ప్రాజెక్టుకు కావాల్సిన 1,389.5 హెక్టార్ల భూ సేకరణ పూర్తి అయినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని అనుమతులూ పొంది, సివిల్ కాంట్రాక్టులన్నీ నిర్మాణ సంస్థలకు అప్పగించారు.80 నిమిషాల్లో...గంటకు 400 కి.మీ. వేగంతో పరిగెత్తే ఈ–10 బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి సబర్మతికి మధ్య ఉన్న 508 కిలోమీటర్ల దూరాన్ని నాన్ –స్టాప్‌గా అయితే 80 నిముషాల్లో పూర్తి చేస్తుంది.ఈ–5 కాదు.. ఈ–10 రైళ్లుఒప్పందంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ‘ఈ–5’ షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మనదేశానికి పంపాలి. కానీ, ఇప్పుడు అత్యాధునికమైన ‘ఈ–10’ రైళ్లు ఆ దేశం తయారుచేస్తోంది. వాటినే మనకు పంపనుంది. ఇవి జపాన్ తోపాటు భారత్‌లోనూ 2030 ప్రారంభంలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ‘ఈ–5’ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు గరిష్టంగా 320 కి.మీ. కాగా, ఈ–10 రైలు వేగం 400 కి.మీ. ఈ రైళ్లను భారత్‌లోనూ తయారు చేసే అవకాశం ఉంది. సముద్రగర్భ రైల్ టన్నెల్ఈ కారిడార్‌లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముంబై–థానే మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్లో భారత్‌లో మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్‌లు ఉంటాయి. మహారాష్ట్రలోని 4 కి.మీ. టన్నెల్ పనులు, గుజరాత్‌లోని ఒకే ఒక్క టన్నెల్ నిర్మాణం పూర్తయ్యాయి.⇒ హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 508 కి.మీ.⇒ నర్మద, తపతి వంటి నదులపై నిర్మిస్తున్న మొత్తం 25 రివర్ బ్రిడ్జిలలో 17 పూర్తి⇒ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,08,000 కోట్లలో ఇప్పటికే రూ.78,839 కోట్ల వ్యయం⇒ గుజరాత్లో 2027లో 50 కిలోమీటర్లలో పాక్షిక కార్యకలాపాలు⇒ 2030లో పూర్తిస్థాయిలో పరుగులు తీయనున్న బుల్లెట్ రైల్ -
jammu Kashmir: రంబన్‌లో క్లౌడ్ బరస్ట్.. అంతటా హాహాకారాలు.. ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఫలితంగా ఆకస్మిక వరదలు తలెత్తాయి. అనేక ఇళ్లు జల సమాధి అయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. నలుగురు గల్లంతయ్యారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.రంబన్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలు ఇళ్లు జలమయమయ్యాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనకు సంబంధించిన హెచ్చరిక జారీ చేసింది.ఆగస్టు 14న చిసోటిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులకు 65 మంది మృతిచెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులున్నారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇదేవిధంగా కథువా జిల్లాలో ఆకస్మిక వరదకు ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. మంగళవారం రియాసి జిల్లాలోని వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 24న జమ్మూను సందర్శించారు. J&K| Cloudburst in Rajgarh area of Ramban district. 3 bodies recovered, 2 more reportedly missing⁰Rescue operation underway#Ramban #Cloudburst #JammuAndKashmir pic.twitter.com/oACzmLMy7B— Saahil Suhail (@SaahilSuhail) August 30, 2025


