Chardham Yatra
-
చార్ధామ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ చోట్ల కొండచరియలు విరిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. ఎన్‌హెచ్, బీఆర్ఓ బృందాలు ప్రస్తుతం రోడ్డును క్లియర్ చేసే పనులు చేపడుతున్నాయి.చమోలి- నందప్రయాగ్ మధ్య మూడు ప్రదేశాలలో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. చోప్టా మోటర్‌వేపై గోడ కూలిపోవడంతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నందప్రయాగ్ సమీపంలో రహదారి కూడా మూసుకపోవడంతో 700 మంది బద్రీనాథ్ యాత్రికులు చమోలి, పిపల్కోటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, గౌచర్ మరియు ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరికి అధికారులు బిస్కెట్లు, తాగునీరు అందించారు.నంద్‌ప్రయాగ్‌లో హైవే మూసుకుపోయిన కారణంగా, కౌటియల్సైన్ నందప్రయాగ్ మోటార్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాయి. సోన్లా సమీపంలో భారీగా బండరాళ్లు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్-బద్రీనాథ్ హైవేలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్ బృందం జేసీబీతో మట్టిని తొలగించే పనులు చేపడుతోంది. -
Chardham Yatra: తెరుచుకున్న బద్రీనాథ్ .. భారీగా తరలివచ్చిన భక్తులు!
మంగళ వాయిద్యాల నడుమ మధ్య బద్రీనాథ్ తలుపులు ఈరోజు(ఆదివారం) తెరుచుకున్నాయి. ఇకపై భక్తులకు బద్రివిశాల్ స్వామి ఆరు నెలల పాటు దర్శనమివ్వనున్నాడు. బద్రీనాథ్ తలుపులు తెరిచే సమయానికి దాదాపు పది వేల మంది భక్తులు ధామ్ ముందు బారులు తీరారు. అఖండ జ్యోతి దర్శనం కోసం 20 వేల మంది యాత్రికులు నేటి సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకునే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ధామ్ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మే 10న తెరుచుకున్నాయి. బద్రీనాథ్ పుష్ప సేవా సమితి ధామ్‌ను 15 క్వింటాళ్ల బంతి పూలతో అలంకరించింది. ధామ్‌లోని పురాతన మఠాలు, దేవాలయాలను కూడా అందంగా అలంకరించారు.బద్రీనాథ్ ధామ్‌లో పాలిథిన్ వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడి వ్యాపారులు పాలిథిన్ కవర్లను వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయంలో పూజలు ప్రారంభమైనట్లు బీకేటీసీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ హరీశ్‌గౌడ్ తెలిపారు. ముందుగా లక్ష్మీ అమ్మవారిని గర్భగుడి నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించాక, ధామ్‌లో ఆశీనురాలిని చేయించారు. బద్రివిశాల్ స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం.. చతుర్భుజుడైన స్వామివారికి నెయ్యితో అలంకారం చేశారు. ఆరు గంటలకు భక్తుల సందర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. #WATCH | Chamoli, Uttrakhand: The doors of Shri Badrinath Dham were opened for the devotees today at 6 am amidst the melodious tunes of the Army Band, with complete rituals, Vedic chanting and slogans of 'Badri Vishal Lal Ki Jai'. pic.twitter.com/lPSCXxKfvx— ANI (@ANI) May 12, 2024 -
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
చార్ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.రైల్వేశాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఈసారి చార్ధామ్ యాత్రకు సరికొత్త రికార్డులు?
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర 2024, మే 10 నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ చార్ధామ్ యాత్రకు అనూహ్య స్పందన వస్తున్నదని యాత్రా మార్గంలోని జీఎంవీఎన్ అతిథి గృహాల బుకింగ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు.గత ఏడాది 56 లక్షల 31 వేల మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారని, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కానున్నదని సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర మార్గాల్లోని 94 జీఎంవీఎన్ అతిథి గృహాల్లో వసతి కోసం ఆన్లైన్ మాధ్యమంలో 8 కోట్ల 58 లక్షల 39 వేల 892 మంది, ఆఫ్‌లైన్‌లో 3 కోట్ల 70 లక్షల 22 వేల 819 మంది బుకింగ్స్ చేశారన్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదన్నారు.ఇప్పటివరకు యాత్రకు సంబంధించిన జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ, గంగోత్రి ధామ్ సందర్శనకు 2,87,358 మంది, యమునోత్రి ధామ్‌కు 2,60,597 మంది, కేదార్నాథ్ ధామ్‌కు 5,40,999 మంది, బద్రీనాథ్ ధామ్‌కు 4,53,213 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు డెహ్రాడూన్‌లోని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికుల కోసం టోకెన్లు, స్టాళ్ల వ్యవస్థను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈసారి చార్ధామ్ యాత్రలో రవాణా శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. -
చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ!
చార్ధామ్ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఓపెన్ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్ధామ్ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి. పర్యాటక శాఖ వెబ్సైట్ registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. -
మితి మీరితే... మరో ప్రమాదం!
పవిత్ర చార్ధామ్ యాత్ర ఎప్పటి లానే ఈ ఏడూ మొదలైంది. అక్షయ తృతీయ వేళ గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ తెరిచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మొదలవుతూనే ఈ యాత్ర అనేక ప్రశ్నలనూ మెదిలేలా చేసింది. హిమాలయ పర్వతాల్లో కఠోర వాతావరణ పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్రలో కొండచరియలు విరిగిపడి బదరీనాథ్ హైవే తాజాగా మూసుకుపోవడం పొంచివున్న ప్రమాదాలకు ముందస్తు హెచ్చరిక. యమునోత్రి ప్రయాణంలో తొలిరోజే ఇద్దరు గుండె ఆగి మరణించడం యాత్రికుల శారీరక దృఢత్వానికి సంబంధించి అధికారుల ముందస్తు తనిఖీ ప్రక్రియపై అనుమానాలు రేపుతోంది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా యాత్రకు పేర్లు నమోదు చేసుకున్న వేళ... రానున్న కొద్ది వారాల్లో ఈ పర్వత ప్రాంత గ్రామాలు, పట్నాల మీదుగా ప్రయాణంపై భయాందోళనలు రేగుతున్నాయి. ‘దేవభూమి’ ఉత్తరాఖండ్ అనేక హిందూ దేవాలయాలకు ఆలవాలం. చార్‌ధామ్‌గా ప్రసిద్ధమైన యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్‌లు ఇక్కడివే. ఇన్ని ఆలయాలు, ప్రకృతి అందాలకు నెలవైన ఉత్తరాఖండ్‌కు ఆర్థిక పురోభివృద్ధి మంత్రాల్లో ఒకటి – పర్యాటకం. అయితే, అదే సమయంలో హిమాలయాల ఒడిలోని ఈ ప్రాంతం పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతం. ఈ సంగతి తెలిసినా, పర్యావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఉత్పాతాలనూ లెక్క చేయకుండా, చార్ధామ్ ప్రాంతాలను వ్యాపారమయం చేసి, భరించలేనంతగా యాత్రికుల్ని అనుమతిస్తున్నారు. హిమాలయాల్లో పద్ధతీ పాడూ లేక ఇష్టారాజ్యంగా చేపడుతున్న సోకాల్డ్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, అనియంత్రిత పర్యాటకం కలగలసి మానవ తప్పిదంగా మారాయి. ఈ స్వయంకృతాపరాధాలతో వాతావరణ మార్పులకు మంచుదిబ్బలు విరిగిపడుతున్నాయి. జోషీ మఠ్ లాంటి చోట్ల జనవరిలో భూమి కుంగి, ఇళ్ళన్నీ బీటలు వారి మొదటికే మోసం రావడం తెలిసిందే! నియంత్రణ లేని విపరీత స్థాయి పర్యాటకం ఎప్పుడైనా, ఎక్కడైనా మోయలేని భారం. విషాదమేమంటే, ప్రాకృతిక సంపదైన హిమాలయాలను మన పాలకులు, ప్రభుత్వాలు ప్రధాన ఆర్థిక వనరుగా చూస్తుండడం, వాటిని యథేచ్ఛగా కొల్లగొట్టడం! అభివృద్ధి, పర్యాటక అనుభవం పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడం! కనీసం ఆ ప్రాంతాలు ఏ మేరకు సందర్శకుల తాకిడిని తట్టుకోగలవనే మదింపు కూడా ఎన్నడూ మనవాళ్ళు చేయనేలేదు. బదరీనాథ్, కేదార్‌నాథ్‌లు తట్టుకోగలవని పర్యావరణ నిపుణులు అంచనా వేసిన రద్దీ కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా, దాదాపు 15 వేల మందికి పైగా జనాన్ని నిరుడు ప్రభుత్వం అనుమతించడం విచిత్రం. ఒక్క గడచిన 2022లోనే ఏకంగా కోటి మంది పర్యాటకులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్టు లెక్క. కేవలం చార్ధామ్ యాత్రాకాలంలోనే రికార్డు స్థాయిలో 46 లక్షల మంది వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో రోజుకు అనుమతించాల్సిన యాత్రికుల సంఖ్యపై పరిమితిని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం ఏ రకంగా సమర్థనీయం! నిజానికి ‘జాతీయ విపత్తు నివారణ సంస్థ’ (ఎన్డీఎంఏ) 2020 నాటి నివేదికలోనే భారత హిమా లయ ప్రాంతం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్ళను ఏకరవు పెట్టింది. పర్యాటకం, పట్టణ ప్రాంతాలకు వలసల వల్ల పట్నాల మొదలు గ్రామాల వరకు తమ శక్తికి మించి రద్దీని మోయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది. బఫర్ జోన్‌ను సృష్టించడం సహా అనేక నియంత్రణ చర్యలను సిఫార్సు చేసింది. మంచుదిబ్బలు విరిగిపడి, వరదలకు కారణమయ్యే ప్రాంతాల్లో పర్యాటకాన్ని నియంత్రించాలనీ, తద్వారా కాలుష్యస్థాయిని తగ్గించాలనీ సూచించింది. పాలకులు వాటిని వినకపోగా, ఏటేటా ఇంకా ఇంకా ఎక్కువ మందిని యాత్రకు అనుమతిస్తూ ఉండడం విడ్డూరం. జోషీమఠ్‌లో విషాదం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. బీటలు వారిన అనేక ఇళ్ళు కూల్చివేయక తప్పలేదు. గూడు చెదిరి, ఉపాధి పోయి వీధినపడ్డ వారికి ఇంకా పరిహారం అందనే లేదు. తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్న దుఃస్థితి. ఈ పరిస్థితుల్లో గత వారం కూడా కొత్తగా కొన్ని ఇళ్ళు బీటలు వారాయన్న వార్త ప్రకృతి ప్రకోపాన్ని చెబుతోంది. సిక్కు పర్యాటక కేంద్రం హేమ్‌కుండ్ సాహిబ్కూ, చార్ధామ్ యాత్రలో బదరీనాథ్కూ సింహద్వారం ఈ జోషీమఠే. పరిస్థితి తెలిసీ ఈసారి పర్యాటకుల సంఖ్య రికార్డులన్నీ తిరగరాసేలా ఉంటుందని రాష్ట్ర సీఎం ప్రకటిస్తున్నారు. జోషీమఠ్, ఔలీ ప్రాంతాలు అన్ని రకాలుగా సురక్షిత ప్రాంతాలని ప్రచారం చేసేందుకు తపిస్తున్నారు. ప్రమాదభరితంగా మారిన ఆ కొండవాలు ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేసి, విపరీతంగా వాహనాలను అనుమతించడం చెలగాటమే. కనుక తొందరపాటు వదిలి, తగిన జాగ్రత్తలు చేపట్టాలి. హిందువులకు జీవితకాల వాంఛల్లో ఒకటైన ఈ యాత్ర ప్రభుత్వానికీ, స్థానిక ఆర్థిక వ్యవస్థకూ బోలెడంత డబ్బు తెచ్చిపెట్టవచ్చు గాక. ధర్మవ్యాప్తిలో ముందున్నామని పాలక పార్టీలు జబ్బలు చరుచుకొనేందుకూ ఇది భలేఛాన్స్ కావచ్చు గాక. జలవిద్యుత్కేంద్రాలు సహా విధ్వంసకర అభివృద్ధితో ఇప్పటికే కుప్పకూలేలా ఉన్న పర్యావరణ వ్యవస్థపై అతిగా ఒత్తిడి తెస్తే మాత్రం ఉత్పాతాలు తప్పవు. మొన్నటికి మొన్న 2013లో 5 వేల మరణాలకు కారణమైన కేదారనాథ్ వరదల్ని విస్మరిస్తే ఎలా? పర్యావరణం పట్ల మనం చేస్తున్న ఈ పాపం పెను శాపంగా మారక ముందే కళ్ళు తెరిస్తే మంచిది. హిమాలయ పర్వత సానువులు అనేకులకు అతి పవిత్రమైనవీ, అమూల్యమైనవీ గనక వాటిని పరిరక్షించడం మరింత ఎక్కువ అవసరం. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికా రచన తక్షణ కర్తవ్యం. -
Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు
గోపేశ్వర్: ఛార్‌ధామ్ యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం చేపట్టిన మౌలికసదుపాయాలు తదితర సన్నాహక కార్యక్రమాలకు మంచు అడ్డుపడుతోంది. గురువారం భద్రీనాథ్, కేదార్నాథ్ పర్వతప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. లోయ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ ఆలయాలు కొలువుతీరిన ఛమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మంచు, వర్షం, అతిశీతల గాలులు ఉష్ణోగ్రతలను తగ్గించేస్తున్నాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో భక్తులను కేదార్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతించనున్న ఈ తరుణంలో గుడికి వెళ్లే ట్రెక్ మార్గంలో మంచు పడుతోంది. అక్షయ తృతీయను పురస్కరించు కుని ఈనెల 22వ తేదీన గంగోత్రి, యము నోత్రి ఆలయాలు తెరుచు కోను న్నాయి. కేదార్నాథ్ ఆల యాన్ని 25వ తేదీన, భద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 27వ తేదీన భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. లక్షలాది మంది ఛార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న ఈ సమయంలో మంచు ముంచుకురావడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మంగళవారం పైలెట్‌తో సహా ఏడుగురి మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను దించాల్సిన ప్రాంతంలో దట్టమైన మంచు అలుముకుని ఉన్నదని పైలెట్ గ్రహించి, వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించినప్పుడు దాని వెనుక భాగం నేలను తాకడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. కేదార్నాథ్ గగనంలో హెలికాప్టర్ల సందడి మొదలై పదిహేనేళ్లు దాటుతోంది. ఏటా మే నెల మధ్యనుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ సాగే చార్ధామ్ యాత్ర సీజన్లో హెలికాప్టర్లు ముమ్మరంగా తిరుగుతాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలలోని క్షేత్రాలను భక్తులు సందర్శిస్తారు. ఇతర ప్రయాణ సాధనాల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. హెలికాప్టర్ల వినియోగమే వద్దని ఆదినుంచీ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన హిమవన్నగాలతో నిండిన సున్నితమైన పర్యావరణ ప్రాంతం కేదార్నాథ్. ఇక్కడ హెలికాప్టర్ల రొద వన్య ప్రాణులకు ముప్పు కలిగిస్తుందనీ, వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందనీ పర్యావరణవేత్తల అభియోగం. తక్కువ ఎత్తులో ఎగురుతూ చెవులు చిల్లులుపడేలా రొద చేస్తూ పోయే హెలికాప్టర్ల తీరుపై స్థానికులు సైతం తరచు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి చప్పుడు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందనీ, పిల్లల చదువులకు కూడా వాటి రాకపోకలు ఆటంకంగా మారాయనీ చెబుతున్నారు. అయినా వినే దిక్కూ మొక్కూ లేదు. హెలికాప్టర్లు నడిపే సంస్థలకు లాభార్జనే తప్ప మరేమీ పట్టదు. అందుకే లెక్కకుమించిన సర్వీసులతో హడావిడి పెరిగింది. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు కనీసం హెలికాప్టర్ల భద్రతనైనా సక్రమంగా పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. తాజా దుర్ఘటనలో మరణించిన పైలెట్ అనిల్ సింగ్‌కు ఆర్మీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే మొదట్లో హెలికాప్టర్లు నడిపినా మిగిలిన సర్వీసంతా విమానాలకు సంబంధించిందే. అలాంటివారు కొండకోనల్లో హెలికాప్టర్లు నడపాలంటే అందుకు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందటం తప్పనిసరి. పైగా వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే కేదార్నాథ్ వంటిచోట్ల సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు నడపాలంటే ఎంతో చాకచక్యత, ఏకాగ్రత అవసరమవుతాయి. ఆ ప్రాంతంలో అంతా బాగుందనుకునేలోగానే హఠాత్తుగా మంచుతెర కమ్ముకుంటుంది. హెలికాప్టర్ నడిపేవారికి ఏమీ కనబడదు. అదృష్టాన్ని నమ్ముకుని, దైవంపై భారం వేసి ముందుకు కదిలినా, వెనక్కిరావడానికి ప్రయత్నించినా ముప్పు పొంచివుంటుంది. ఆ ప్రాంతం గురించి, అక్కడ హెలికాప్టర్ నడిపేటపుడు ప్రత్యేకించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారైతేనే ఈ అవరోధాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా 600 మీటర్ల (దాదాపు 2,000 అడుగులు) కన్నా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు నడపరాదన్న నిబంధన ఉంది. కానీ చాలా హెలికాప్టర్లు 250 మీటర్ల (820 అడుగులు)లోపు ఎత్తులోనే దూసుకుపోతున్నాయని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన హెలికాప్టర్ సైతం తక్కువ ఎత్తులో ఎగురుతున్నందునే వెనక్కు మళ్లుతున్న క్రమంలో దాని వెనుక భాగం అక్కడున్న ఎత్తయిన ప్రదేశాన్ని తాకి మంటల్లో చిక్కుకుంది. ఈ సీజన్లో ఇంతవరకూ 14 లక్షలమందికిపైగా యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా అందులో దాదాపు లక్షన్నరమంది తమ ప్రయాణానికి హెలికాప్టర్లను ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో హెలికాప్టర్ల వినియోగాన్ని నిషేధించాలని కొందరు పర్యావరణవేత్తలు అయిదేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పుడు దాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్... వాటి నియంత్ర ణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అవి నిర్దేశిత ఎత్తులో ఎగిరేలా చూడాలనీ, సర్వీసుల సంఖ్యపై కూడా పరిమితులు విధించాలనీ ఆదేశించింది. కానీ ఎవరికి పట్టింది? మన దేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏయే స్థాయిల్లో ఉండాలో నిర్దేశించారు. ఈ శబ్దకాలుష్యానికి సంబంధించిన నిబంధనల్లో పగలు, రాత్రి వ్యత్యాసాలున్నాయి. కానీ విషాదమేమంటే దేశానికే ప్రాణప్రదమైన హిమశిఖర ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిమితులు ఏమేరకుండాలో నిబంధనలు లేవు. అక్కడ తిరిగే హెలికాప్టర్ల వల్ల ధ్వని కాలుష్యం సగటున 70 డెసిబుల్స్ స్థాయిలో, గరిష్ఠంగా 120 డెసిబుల్స్ స్థాయిలో ఉంటున్నదని పర్యావరణవేత్తల ఆరోపణ. దీనిపై నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదా? పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలనుకునేవారినీ, ఆ ప్రాంత ప్రకృతిని కళ్లారా చూడాలని తహతహలాడే పర్యాటకులనూ ప్రోత్సహించాల్సిందే. ఇందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటంతోపాటు స్థానికులకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అయితే అంతమాత్రంచేత పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ధోరణి మంచిది కాదు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడపటంలో అనుభవజ్ఞులైనవారిని మాత్రమే పైలెట్లుగా అనుమతించటం, తగిన ఎత్తులో హెలి కాప్టర్లు రాకపోకలు సాగించేలా చూడటం, అపరిమిత శబ్దకాలుష్యానికి కారణమయ్యే హెలికాప్టర్ల వినియోగాన్ని అడ్డుకోవటం తక్షణావసరం. ఈ విషయంలో సమగ్రమైన నిబంధనలు రూపొందిం చటం, అవి సక్రమంగా అమలయ్యేలా చూడటం ఉత్తరాఖండ్ ప్రభుత్వ బాధ్యత. -
‘చార్ధామ్’కు కోవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
డెహ్రాడూన్: ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు, సరిహద్దుల వద్ద వారు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు /వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నిబంధనను ప్రస్తుతానికి తొలగించినట్లు వివరించింది. పర్యాటక శాఖ పోర్టల్‌లో యాత్రికుల సంఖ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
చార్ధామ్ యాత్రకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ ఉధృతి కారణంగా చార్ధామ్ యాత్ర పునఃప్రారంభంపై జూన్ 28న విధించిన స్టేను ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. దీంతో యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. కరోనా నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ యాత్ర సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చార్ధామ్ యాత్రలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు కేదార్‌నాథ్‌లో 800 మంది, బద్రీనాథ్‌లో 1,200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని పేర్కొంది. యాత్రికులు ఈ నాలుగు ధామాల్లో ఎక్కడా కూడా నీటిగుండాల్లో స్నానం చేసేందుకు అనుమతించరాదని సూచించింది. చార్ధామ్ యాత్రకు వెళ్లే ప్రతి వ్యక్తి కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావడాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాల్లో జరిగే చార్ధామ్ యాత్రలో అవసరమైన మేరకు పోలీసు బలగాలను మోహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్ధామ్ యాత్రను పునఃప్రారంభించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యాపారులు, ట్రావెల్ ఏజెంట్లు, పూజారులు యాత్రపై ఆధారపడి ఉపాధి పొందుతుంటారు. -
భారీ పేలుళ్లు.. చార్ధామ్ యాత్రకు ఆటంకం
కాంక్రా : ఉత్తరాఖండ్‌లో ఇండియన్ గ్యాస్‌కు చెందిన ఓ లారీ ప్రమాదానికి గురైంది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న లారీలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో అందులోని మరిన్ని సిలిండర్లకు మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన ఎన్‌హెచ్ 58పై రిషికేష్- బద్రినాథ్ మధ్యలో కాంక్రాలోని ఘాట్ రోడ్డుపై చోటు చేసుకుంది. సిలిండర్ల పేలుళ్లతో లారీ పూర్తిగా దగ్ధమైంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో చార్ధామ్ యాత్రకు ఆటంకం ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఉత్తరాఖండ్‌లో మళ్లీ విలయం!
- విష్ణుప్రయాగ వద్ద విరిగిపడిన కొండచరియలు - నిలిచిన చార్ధామ్ యాత్ర.. చిక్కుకుపోయిన 15000మంది భక్తులు న్యూఢిల్లీ: భక్తులు, యాత్రీకులను గగుర్పాటుకు గురిచేసేలా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం చార్ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో నేటి సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడివారు అక్కడే ఆగిపోవాల్సివచ్చింది. వందలల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి, రహదారిని పునరుద్ధరించేపనిలో నిమగ్నం అయ్యారు. కాగా, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలు తెలియాల్సిఉంది. నాలుగేళ్ల కిందట చార్ధామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
చిక్కుకుపోయిన చార్ధామ్ యాత్రికులు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపోయి పలు రోడ్లు మూసుకుపోయాయి. దాదాపు మూడేళ్ల క్రితం ఇదే సమయంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పెను విలయం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇంచుమించు అదే పరిస్థితిని మళ్లీ ప్రస్తుత వాతావరణం గుర్తుచేస్తోంది. కేదార్నాథ్, బద్రీనాథ్ హైవేలతో పాటు నందప్రయాగ వెళ్లే రోడ్డు కూడా మూసుకుపోయింది. ఆ రోడ్లను క్లియర్ చేసి, ట్రాఫిక్‌ను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చార్ ధామ్ యాత్రకు బయల్దేరిన చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారని, అందువల్ల రోడ్లను పునరుద్ధరించేందుకు సరిహద్దు రోడ్ల సంస్థ ప్రయత్నిస్తోందని స్థానిక అధికారులు చెప్పారు. అయితే, గురువారం నుంచి మరో 72 గంటల పాటు ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్మోరా, పౌరి, ఉత్తరకాశీ, డెహ్రాడూన్, ఉధమ్‌సింగ్‌నగర్, నైనిటాల్ జిల్లాలకు ఈ హెచ్చరికను ప్రకటించారు. -
చార్‌థామ్ యాత్రలో తెలుగువాళ్ల అవస్థలు
చార్దామ్: ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో తెలుగువాళ్లు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ మోసంతో గుంటూరు జిల్లా వాసులు చిక్కుల్లో పడ్డారు. సుమారు 62మంది తెలుగువాళ్లు కేథార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. వీళ్లలో 42మంది గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేట యాత్రికులు ఉన్నారు. ఏజెంట్ మోసంతో చార్ధామ్ యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. శిఖర దర్శనం చేయిస్తానంటూ హెలికాప్టర్ కోసం డబ్బులు తీసుకున్న ఏజెంట్ ఆ తర్వాత పత్తా లేకుండా పోవడంతో యాత్రికులు కష్టాలు పడుతున్నారు. గడ్డకట్టిన చలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లలో 40మందికి పైగా మహిళలు కూడా ఉన్నారు. -
బద్రీనాథా.. ఎంత కష్టమయ్యా..
ప్రొద్దుటూరు : చార్ధామ్ యాత్రకు వెళ్లిన ప్రొద్దుటూరు వాసులు భారీ వర్షాల కారణంగా బద్రినాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో ఆగిపోయారు. వీరికి మూడు రోజుల పాటు సరిగా అన్నపానీయాలు కూడా లభించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పైగా వీరిని తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ పంపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఇంత వరకు రాలేదని యాత్రికులు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులో ఉన్న శ్రీకాశిరెడ్డినాయన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని పోలక శివానందరెడ్డి (సున్నపుబట్టి వీధి)తోపాటు లారీ యజమానులైన అతని మిత్రులు ఉండేల మురళీమోహన్‌రెడ్డి (రామేశ్వరం), ఉండేల మునికుమార్‌రెడ్డి (రామేశ్వరం), కుడుముల గంగిరెడ్డి (మోడంపల్లి), ఆవుల నాగేశ్వరరెడ్డి (బాలాజీనగర్), దోసకాయల ప్రసాద్ (భగత్‌సింగ్ కాలనీ), శెట్టికుమార్ (బాలాజీనగర్), హనుమంతరెడ్డి (వైఎంఆర్ కాలనీ)లు చార్ధామ్ యాత్రకు ఈనెల 21న రాత్రి ఇన్నోవా వాహనంలో బయల్దేరి వెళ్లారు. వీరిలో శెట్టికుమార్ డ్రైవర్ కాగా హనుమంతరెడ్డి మాత్రం ట్రాన్స్‌పోర్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ముందుగా వారి అంచనా ప్రకారం ఈనెల 27వ తేదీ రాత్రికి ప్రొద్దుటూరుకు చేరాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడి.. కాగా ప్రొద్దుటూరు నుంచి వెళ్లిన వీరు గత బుధవారం బద్రినాథ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో భారీ వర్షాలు పడి కొండచరియలు విరిగి వీరి ఇన్నో వా వాహనంపై పడి అద్దం పగిలినట్లు వారు తెలిపారు. వర్షాల కారణంగా నదులు ప్రవహించడంతో రోడ్లు తెగిపో యి రాకపోకలు స్తంభించిపోయాయి. బద్రినాథ్ సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో వీరి ప్రయాణం ఆగిపోయింది. బుధవారం నుంచి శనివారం ఉదయం వరకు వీరు అక్కడే ఆగిపోయారు. విద్యుత్ సరఫరాలేకపోవడంతోపాటు అన్నపానీయాలు కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అ దుపులోకి రావడంతో శనివారం ఉద యం బద్రినాథ్‌కు వెళ్లి తిరుగు ముఖంపట్టారు. వీరి సమాచారాన్ని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులను రక్షించేం దుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తమ వద్దకు హెలికాప్టర్ పం పుతామని ప్రకటించినా ఇక్కడకు రాలేదని శివానందరెడ్డి సాక్షికి తెలిపారు. రాకపోకలు పునఃప్రారంభమైతే తిరిగి ఇంటికి రాగలమని, తమకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వారు ఫోన్లో వివరించారు. కుటుంబ సభ్యుల ఆందోళన చార్ధామ్ యాత్రకు వెళ్లిన వీరు భారీ వర్షాల కారణం గా మధ్యలో ఇరుక్కోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉందోనని సెల్ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కొన్ని మార్లు ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. నా భర్త సురక్షితంగా ఉన్నానని చెప్పాడు పరిస్థితి తెలియడంతో శని వారం నా భర్తకు ఫోన్ చేశా. ఆయన సురక్షితంగా ఉన్నట్లు తెలిపాడు. త్వరగా ఇంటికి వస్తానని చెప్పాడు. లక్ష్మి, దోసకాయల ప్రసాద్ భార్య మిత్రులకు ఫోన్ చేశాను భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలియడంతో నా మిత్రులందరికి ఫోన్ చేశాను. వారు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. - నాగభూషణ్ రెడ్డి, కాశినాయనట్రాన్స్పోర్టు క్లర్క్ -
'చార్ధామ్' బాధలో వ్యక్తి మృతి
జోసెఫ్ నగర్: అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. తన కుటుంబ సభ్యులు ఛార్‌ధామ్ యాత్ర వరదల్లో చిక్కుకున్నారని తెలుసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం పట్టణం లోని జోసెఫ్ నగర్లో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన కుళ్లాయప్ప (68) కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఈ నెల 15న ఛార్ ధామ్ యాత్రకు వెళ్లారు. రెండు రోజుల నుంచి ఉత్తరాఖండ్‌లో భారీగా వరదలు పోటెత్తడంతో తాము అందులో చిక్కుకున్నామని.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉన్న తండ్రి కుళ్లాయప్పకు తెలియజేశారు. దీంతో.. ఆవేదన చెందిన కుళ్లాయప్ప గుండె ఆగి చనిపోయాడు. -
వరదల్లో చిక్కుకుపోయిన ‘అనంత’వాసులు
-
ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం
పలుచోట్ల కూలిన వంతెనలు, దెబ్బతిన్న రోడ్లు * చార్ధామ్ యాత్రికులకు ఇబ్బందులు * వరదల్లో చిక్కుకుపోయిన ‘అనంత’వాసులు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం కేదార్ లోయ, హేమ్‌కుంద్ సాహిబ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి హెలీకాప్టర్ల ద్వారా 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ రాకేశ్ శర్మ కేదార్నాథ్, బద్రీనాథ్ సమీపప్రాంతాలను సందర్శించారు. కేదార్‌నాథ్‌లో యాత్రికులు ఎవరూ లేరని, వారందరినీ సోన్‌ప్రయాగ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. బద్రీనాథ్, హేమ్కుండ్లకు వెళ్తూ చిక్కుకున్న వారిని రక్షించేందుకు శనివారం కూడా హెలీకాప్టర్లను వినియోగిస్తామని చెప్పారు. తరలింపు చర్యలు సాగుతున్నా ఈ ప్రాంతాల్లో సుమారు 9 వేల మంది చిక్కుకుపోయారని చమోలీ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదని ముఖ్యమంత్రి హరీష్ రావత్ తెలిపారు. కాగా, నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. పశ్చిమ రాజస్థాన్‌కు కూడా చేరుకోవడంతో రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లయిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ‘అనంత’వాసుల కష్టాలు చార్ధామ్ యాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లా వాసులు వర్షాల్లో చిక్కుకుపోయారు. వీరిలో అనంతపురం, కర్ణాటకకు చెందిన వారు 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఈ నెల 15, 18 తేదీల్లో యాత్రకు వెళ్లారు. బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన కొందరిని జోషి మఠానికి తరలించారు. కాగా, చార్ధామ్ యాత్రలో తన కుమారుడు, కోడలు, మనవళ్లు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం విని అనంతపురంలోని జీసస్నగర్కు చెందిన కుళ్లాయప్ప గుండెపోటుతో మృతి చెందారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. -
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు
-
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ మళ్లీ వణికిపోతోంది. గత అనుభవాలను గుర్తు తెచ్చుకొని జడుసుకుంటోంది. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో సంభవించిన వరద ఉత్పాతం ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో ఇప్పటికీ మరిచిపోలేని ఉత్తరాఖండ్ వాసులు మళ్లీ భారీ వర్షాలు, వరదలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డెహ్రాడూన్ సహా వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జల మయం కాగా జనజీవనం అస్తవ్యస్తమయింది. మరోవైపు భారీ వర్షాలు, వరదలు పవిత్ర ఛార్‌ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. విస్తారంగా పడుతున్న వానలతో యాత్రా మార్గంలో ప్రయాణానికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పాటు పలు రహదారుల్లో కొండచరియలు విరిగిపడడంతో రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఫలితంగా యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. జోషీమఠ్, హేమ్ కుంద్‌సాహిబ్ సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను రక్షించడానికి వైమానిక దళం రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక విమానంలో జోషీమఠ్, హేమ్ కుంద్‌సాహిబ్‌లకు తరలి వెళ్లాయి. మరోవైపు కేదారీనాధ్ వద్ద యాత్రికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న మందాకినీ నది కేదారీనాధ్‌కు వెళ్లే మార్గంలోని వంతెన ధ్వంసం చేసింది. కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలోని సోన్ ప్రయాగ్, గౌరీ కుంద్ మధ్యలో ఉన్న విఠల్ బ్రిడ్జ్ భారీ వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఫలితంగా కేదారీనాధ్ వద్ద ఉన్న యాత్రికులు అక్కడే ఉండిపోయారని తెలుస్తోంది. దాదాపు 400 మంది యాత్రికులు కేదారీనాధ్ వద్ద చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారిని సురక్షితంగా తీసుకురావడానికి వైమానిక దళం చర్యలు చేపట్టింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనగర్‌లో అలకనందా నది ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుంది. -
బద్రినాథ్‌లో చిక్కుకున్న తెలుగువారు సురక్షితం
న్యూఢిల్లీ: పత్రికూల వాతావరణం కారణంగా బద్రినాథ్‌లో చిక్కుకున్న 32 మంది తెలుగువారిని సహాయ సిబ్బంది కాపాడారు. వారిని చిన్నజీయర్ ఆశ్రమానికి తరలించారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమ నిర్వాహకులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మాట్లాడారు. ఆశ్రమంలో బాధితులు ఉండేందుకు అనుమతించాలని కోరారు. వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయాన్ని కూడా కోరారు. భారీ వర్షాలతో బ్రదినాథ్ యాత్రకు ఆటంకం కలిగింది. వర్షసూచనతో భక్తులను వెళ్లనీయకుండా ఛార్‌దామ్ యాత్రను రద్దు చేశారు. -
ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు.. నిలిచిన యాత్ర
ఉత్తరాఖండ్.. వర్షాలు.. ఈ మాటలు వింటే చాలు ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయానికి అక్కడ భారీ వర్షాలు సృష్టించిన విలయం కళ్లముందు కదలాడుతుంది. తాజాగా మరోసారి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. దాంతో చార్ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం కలిగింది. కొండచరియలు, పెద్దపెద్ద చెట్లు విరిగి పడటంతో కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. గడిచిన రెండు రోజులుగా చంపావత్, చమోలి, నైనిటాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చమోలి జిల్లాలోని లాంబాగఢ్, చిరోబాగఢ్, విజయ్‌నగర్, అగస్తముని లాంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాబోయే 24 గంటల్లో కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రుద్రప్రయాగ, ఉత్తరకాశీ, పితోరాగఢ్ లాంటి ప్రాంతాలకు విపత్తు నివారణ బృందాలను పంపారు. హిమాలయ క్షేత్రాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ హెచ్చరించింది. గత సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వేలాదిమంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. -
కేదార్నాథ్ యాత్రకు బ్రేక్!
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ యాత్రకు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో తాజాగా మంచు కురవడంతో యాత్ర నిలిచిపోయింది. కేదార్నాథ్ వ్యాలీ అంతటా ఆదివారం ఉదయం మంచు కురిసిందని, దాంతో యాత్ర నిలిపివేసినట్లు రుద్రప్రయాగ ఎస్పీ బరీందర్‌జిత్ సింగ్ తెలిపారు. యాత్రీకులను సోన్ప్రయాగ వద్దే ఆగిపోయి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తిరిగి భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు చార్ధామ్ (కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రా మార్గంలో, హిమాలయాల్లోని 3,500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్థానిక కార్యాలయం అంచనా వేస్తోంది. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి భీమశంకర్‌లింగ కూడా వారం రోజుల పాటు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు. రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో యాత్రను కొనసాగించడం ప్రమాదకరమని చెప్పారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మతు, నిర్మాణ పనులను చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆదివారం మందిరం వద్ద తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన డెహ్రాడూన్లోనే ఉండిపోయారు. గతేడాది చార్ధామ్ యాత్రా సమయంలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో సుమారు 5వేల మంది భక్తులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. -
మళ్లీ చార్ధామ్ యాత్ర...
గత ఏడాది ఆకస్మిక వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ క్రమంగా తేరుకుంటోంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్ర పర్యటన అయిన చార్ధామ్ యాత్రను ఆ రాష్ట్ర పర్యాటకశాఖ పునఃప్రారంభించింది. ఈ ఏడాది మే 2న గంగోత్రి, యమునోత్రి, 4న కేదారనాథ్, 5న బదరీనాథ్‌లలో భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. యాత్రికుల సౌకర్యార్థం యాత్రామార్గంలో ప్రతి 10-20 కి.మీ పరిధిలో సంచార హెల్త్ యూనిట్స్ ప్రారంభిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ టవర్స్‌ను ఏర్పాటు చేసి, మొబైల్ ఫోన్ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తున్నారు. అత్యవసర హెలికాప్టర్ సేవలను ప్రయాణమార్గంలో యాత్రికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఏడాది 50 లక్షల నుంచి కోటి మంది దాకా చార్ధామ్ యాత్ర చేస్తారని అంచనా.