పత్రికూల వాతావరణం కారణంగా బద్రినాథ్‌లో చిక్కుకున్న 32 మంది తెలుగువారిని సహాయ సిబ్బంది కాపాడారు.
న్యూఢిల్లీ: పత్రికూల వాతావరణం కారణంగా బద్రినాథ్‌లో చిక్కుకున్న 32 మంది తెలుగువారిని సహాయ సిబ్బంది కాపాడారు. వారిని చిన్నజీయర్ ఆశ్రమానికి తరలించారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమ నిర్వాహకులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మాట్లాడారు.
ఆశ్రమంలో బాధితులు ఉండేందుకు అనుమతించాలని కోరారు. వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ సహాయాన్ని కూడా కోరారు. భారీ వర్షాలతో బ్రదినాథ్ యాత్రకు ఆటంకం కలిగింది. వర్షసూచనతో భక్తులను వెళ్లనీయకుండా ఛార్దామ్ యాత్రను రద్దు చేశారు.