టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్‌మెంట్ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులనే కాకుండా యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని షాక్‌కు గురిచేశాడు.
అయితే టెస్టు క్రికెట్‌లో భారత తరపున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన అశ్విన్ కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్ అవ్వడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.
అతడికి బీసీసీఐ ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాకయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే అశ్విన్ పట్ల భారత జట్టు మెనెజ్‌మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విడ్కోలు పలకాలని అశ్విన్ నిర్ణయించకున్నాడని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే చెప్పాడు.
తొలి టెస్టులో తనను కాదని వాషింగ్టన్ సుందర్‌ను ఆడించిన తర్వాతే అశ్విన్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడన్న అంశాన్ని ఆ విషయం చెబుతోంది. నిజం చెప్పాలంటే.. తమిళనాడు నుంచి ఓ క్రికెటర్ ఈ స్ధాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం.
అందుకు చాలా కారణాలున్నాయి. భారత క్రికెట్‌లో కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే మంచి అవకాశాలు లభిస్తాయి. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, అశ్విన్ 500 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి లెజెండ్ అయ్యాడు. అశ్విన్ కూడా చాలా సార్లు పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అలా జరిగినా ప్రతిసారీ అతడు పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బద్రీనాథ్ పేర్కొన్నాడు.
చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment