Badrinath
-
'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు'
టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులనే కాకుండా యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే టెస్టు క్రికెట్లో భారత తరపున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన అశ్విన్ కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్ అవ్వడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అతడికి బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాకయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే అశ్విన్ పట్ల భారత జట్టు మెనెజ్‌మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విడ్కోలు పలకాలని అశ్విన్ నిర్ణయించకున్నాడని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే చెప్పాడు.తొలి టెస్టులో తనను కాదని వాషింగ్టన్ సుందర్‌ను ఆడించిన తర్వాతే అశ్విన్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడన్న అంశాన్ని ఆ విషయం చెబుతోంది. నిజం చెప్పాలంటే.. తమిళనాడు నుంచి ఓ క్రికెటర్ ఈ స్ధాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం.అందుకు చాలా కారణాలున్నాయి. భారత క్రికెట్లో కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే మంచి అవకాశాలు లభిస్తాయి. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, అశ్విన్ 500 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి లెజెండ్ అయ్యాడు. అశ్విన్ కూడా చాలా సార్లు పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అలా జరిగినా ప్రతిసారీ అతడు పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బద్రీనాథ్ పేర్కొన్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
అయోధ్య, బద్రీనాథ్‌లో ఓడిన బీజేపీ కేదార్నాథ్ కోసం ఏం చేస్తోంది?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో కేదార్నాథ్ ధామ్ ఒకటి. త్వరలో కేదార్నాథ్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. సోమవారం ఇరు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. యూపీలోని అయోధ్య, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ స్థానాల్లో ఓడిపోయిన దరిమిలా బీజేపీకి ఇప్పు కేదార్నాథ్ కీలకంగా మారింది. 2013లో సంభవించిన భారీ విపత్తు తర్వాత, కేదార్నాథ్ ధామ్, కేదార్నాథ్ లోయలో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పని ప్రారంభమైంది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక కేదార్నాథ్ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ తరచూ కేదార్‌నాథ్‌ను సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్రలో అత్యధిక సంఖ్యలో యాత్రికులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 2002 నుంచి ఉనికిలోకి వచ్చిన కేదార్నాథ్ అసెంబ్లీలో బీజేపీ మూడుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి.కేదార్‌నాథ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ మృతి చెందడంతో ఇక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఏడాది అయోధ్యతో కూడిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ, బద్రీనాథ్‌లో కాంగ్రెస్ విజయం సాధించాయి. అయోధ్య, బద్రీనాథ్ రెండూ కూడా హిందువుల ఆదరణకు నోచుకున్న ప్రాంతాలు. అందుకే వీటిపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్పుడు కేదార్నాథ్ సీటును దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది.బీజేపీ తన సంప్రదాయాలకు భిన్నంగా దివంగత ఎమ్మెల్యే శైలారాణి రావత్ కుటుంబంలో ఎవరికీ టిక్కెట్ ఇవ్వకుండా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా నౌటియాల్‌ను ఎన్నికల్లో పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. కుల సమీకరణల విషయానికి వస్తే ఠాకూర్ ఓటర్ల సంఖ్య ఈ ప్రాంతంలో అత్యధికం. బీజేపీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెట్టగా, కాంగ్రెస్ ఠాకూర్ అభ్యర్థికి ప్రాధాన్యతనిచ్చింది.ఇది కూడా చదవండి: 19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు -
రూ. 5 కోట్ల అప్పు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన టీచర్
అనంతపురం ఎడ్యుకేషన్: మరో టీచరు అప్పుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మొన్న రాప్తాడు జెడ్పీహెచ్ఎస్లో బయాలజీ టీచరుగా పని చేస్తున్న రమేష్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఉడాయించారు. నిన్న అనంతపురం ఆర్‌ఎంహెచ్‌ఎస్ స్కూల్లో తెలుగు టీచరు దివాకర్‌నాయుడు చీటీలు, వడ్డీ పేరుతో రూ. 12 కోట్ల దాకా అప్పులు చేసి ఉడాయించారు. చివరకు కోర్టులో లొంగిపోవడంతో సబ్‌జైల్‌కు తరలించారు. తాజాగా రూ. 5 కోట్లకు పైగా అప్పులు చేసి అదృశ్యమైన మరో టీచరు బాగోతం వెలుగు చూసింది. విడపనకల్లు మండలం హావలిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగా పని చేస్తున్న కె.బద్రీనాథ్ కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులే ఉన్నారు. వీరి వద్దే రూ. 3.5 కోట్ల అప్పులు చేశారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోరూ. 25 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈయన దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉండటంతో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకున్న డబ్బును బద్రీనాథ్‌కు ఇచ్చామని కొందరు చెబుతుండగా, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును ఇచ్చామని మరికొందరు చెబుతున్నారు. చాలామంది బాధితులు వడ్డీకి ఆశపడి ఇచ్చారు.రెండు నెలలుగా రావడం లేదు గణితం టీచరు బద్రీనాథ్ దాదాపు రెండు నెలలుగా పాఠశాలకు రావడం లేదు. ఆయన ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. వీఆర్ఎస్ తీసుకుంటాడని మరికొందరు అంటున్నారు. ఆయనైతే నేరుగా నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. – మధురవాణి, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, హావలిగి -
చార్ధామ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ చోట్ల కొండచరియలు విరిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. ఎన్‌హెచ్, బీఆర్ఓ బృందాలు ప్రస్తుతం రోడ్డును క్లియర్ చేసే పనులు చేపడుతున్నాయి.చమోలి- నందప్రయాగ్ మధ్య మూడు ప్రదేశాలలో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. చోప్టా మోటర్‌వేపై గోడ కూలిపోవడంతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నందప్రయాగ్ సమీపంలో రహదారి కూడా మూసుకపోవడంతో 700 మంది బద్రీనాథ్ యాత్రికులు చమోలి, పిపల్కోటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, గౌచర్ మరియు ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరికి అధికారులు బిస్కెట్లు, తాగునీరు అందించారు.నంద్‌ప్రయాగ్‌లో హైవే మూసుకుపోయిన కారణంగా, కౌటియల్సైన్ నందప్రయాగ్ మోటార్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాయి. సోన్లా సమీపంలో భారీగా బండరాళ్లు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్-బద్రీనాథ్ హైవేలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్ బృందం జేసీబీతో మట్టిని తొలగించే పనులు చేపడుతోంది. -
Badrinath Highway: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న కార్మికులు
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో దేవుడుని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు, వరదలతో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్లు, రహాదారులను అధికారులు ముందు జాగ్రత్తగా మూసేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.చమోలీ జిల్లాలో బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.హైవేపై కొండచరియలు విరిగిపడటంతో శిథిలాక కారణంగా రహదారిని అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.కాగా బద్రీనాథ్ హైవేను తిరిగి తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై పడిన శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా పర్వతం నుంచి ఒక్కసారిగా బండరాళ్లు కిందపడ్డాయి. అయితే ఈ ప్రమాదం నుంచి కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. రాళ్లు జారడం చూసిన కార్మికులు కొండపైకి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.ఇక బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ వద్ద రహదారిని క్లియర్ చేసేందుకు సుమారు 241 ఎక్స్కవేటర్లను అక్కడ మోహరించారు. ఉత్తరాఖండ్‌లో వర్షం, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 260కి పైగా రోడ్లు మూసేశారు. . రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
పాతాళగంగ లైన్ క్లియర్.. తెరుచుకోని జోషిమఠ్ రహదారి
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రెండు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిలో ఒకటి బద్రీనాథ్ జాతీయ రహదారిలోని జోషిమఠ్‌లో, మరొకటి పాతాళగంగ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. అయితే తాజాగా చార్ధామ్ యాత్రికుల కోసం పాతాళగంగ రహదారిని క్లియర్ చేశారు. దీంతో 40 గంటల తరువాత ఈ రహదారిలో వెళ్లేవారికి ఉపశమనం లభించినట్లయ్యింది. జోషిమఠ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన రహదారి ప్రాంతాన్ని ఇంకా క్లియర్ చేయలేదు.48 గంటలు గడిచినా జోషిమఠ్-బద్రీనాథ్ హైవేలో ఇంకా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడటంతో, బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ మొదలైన ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రికులు పలు అవస్థలు పడుతున్నారు.రెండు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ హైవేపై చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు జోషిమఠ్‌లో రహదారిని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో 260కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. వాటిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేసేందుకు 241 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు. -
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు..
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. గౌచర్– కర్ణప్రయాగ్ మార్గంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై చట్వాపీపల్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని మోటారు సైకిల్‌పై వస్తున్న నిర్మల్ షాహి(36), సత్యనారాయణ(50)లపై పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి పడటంతో చనిపోయా రన్నారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్ హైవేపై సుమారు డజను చోట్ల రహదారి మూసుకుపోయిందని పోలీసులు వివరించారు. కొండచరియలు విరిగి పడటంతో రుద్రప్రయాగ్– కేదార్నాథ్ జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలోని కుమావ్, గఢ్వాల్ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. -
Chardham Yatra: తెరుచుకున్న బద్రీనాథ్ .. భారీగా తరలివచ్చిన భక్తులు!
మంగళ వాయిద్యాల నడుమ మధ్య బద్రీనాథ్ తలుపులు ఈరోజు(ఆదివారం) తెరుచుకున్నాయి. ఇకపై భక్తులకు బద్రివిశాల్ స్వామి ఆరు నెలల పాటు దర్శనమివ్వనున్నాడు. బద్రీనాథ్ తలుపులు తెరిచే సమయానికి దాదాపు పది వేల మంది భక్తులు ధామ్ ముందు బారులు తీరారు. అఖండ జ్యోతి దర్శనం కోసం 20 వేల మంది యాత్రికులు నేటి సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకునే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ధామ్ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మే 10న తెరుచుకున్నాయి. బద్రీనాథ్ పుష్ప సేవా సమితి ధామ్‌ను 15 క్వింటాళ్ల బంతి పూలతో అలంకరించింది. ధామ్‌లోని పురాతన మఠాలు, దేవాలయాలను కూడా అందంగా అలంకరించారు.బద్రీనాథ్ ధామ్‌లో పాలిథిన్ వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడి వ్యాపారులు పాలిథిన్ కవర్లను వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయంలో పూజలు ప్రారంభమైనట్లు బీకేటీసీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ హరీశ్‌గౌడ్ తెలిపారు. ముందుగా లక్ష్మీ అమ్మవారిని గర్భగుడి నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించాక, ధామ్‌లో ఆశీనురాలిని చేయించారు. బద్రివిశాల్ స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం.. చతుర్భుజుడైన స్వామివారికి నెయ్యితో అలంకారం చేశారు. ఆరు గంటలకు భక్తుల సందర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. #WATCH | Chamoli, Uttrakhand: The doors of Shri Badrinath Dham were opened for the devotees today at 6 am amidst the melodious tunes of the Army Band, with complete rituals, Vedic chanting and slogans of 'Badri Vishal Lal Ki Jai'. pic.twitter.com/lPSCXxKfvx— ANI (@ANI) May 12, 2024 -
Badrinath In Hyderabad: హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
-
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
దేశంలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్‌కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్‌లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్‌ను సందర్శించిన తర్వాతే చార్‌ధామ్‌కు వెళ్లేవారు. రిషికేశ్కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్ బద్రీనాథ్ ధామ్‌కు నడక మార్గంగా ఉండేది.రిషికేశ్‌లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్‌లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్‌కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.కొన్నాళ్ల క్రితం రిషికేశ్ అడవిలా ఉండేదని రామేశ్వర్ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్ధామ్ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు. -
Lok sabha elections 2024: దేవభూమిలో ఈసారీ... కమల వికాసమే!
హిమాలయ పర్వత సిగలో బద్రీనాథ్, కేధార్నాథ్ వంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన ‘దేవభూమి’ ఉత్తరాఖండ్. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాంచల్‌గా ఏర్పాటైన ఈ రాష్ట్రం పేరు 2006లో ఉత్తరాఖండ్గా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెసే చక్రం తిప్పుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచిన ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ (యూకేడీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా కాస్త ప్రభావం చూపుతున్నాయి. పదేళ్లుగా ఉత్తరాఖండ్ పూర్తిగా కాషాయమయమైంది. అటు అసెంబ్లీలో, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవాయే నడుస్తోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన కమలనాథులు ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం చేతులు మారింది. 2012 నుంచీ మాత్రం రాష్ట్రం బీజేపీ గుప్పిట్లోనే ఉంది. 2002లో కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీ తివారీ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి చేపట్టిన తొలి, ఏకైక నేతగా చరిత్ర సృష్టించారు. 2007లో ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ, యూకేడీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ బహుగుణ, హరీశ్ రావత్ రూపంలో ఆ ఐదేళ్లలో ఇద్దరు సీఎంలను మార్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, రాష్ట్రపతి పాలన, సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ విశ్వాస పరీక్షలో నెగ్గడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 5 సీట్లను దక్కించుకున్న బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచి్చంది. మొత్తం 70 సీట్లలో ఏకంగా 57 స్థానాలను కొల్లగొట్టింది! 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ 47 సీట్లతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 19 సీట్లతో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పూర్వ వైభవం కోసం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 5 ఎంపీ సీట్లలో ఒకటి ఎస్సీ రిజర్వుడు స్థానం. సర్వేలు ఏం చెబుతున్నాయి... రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యంతో బీజేపీ మంచి జోరు మీదుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలతో హోరెత్తిస్తోంది. కాంగ్రెసేమో ఇండియా కూటమి దన్నుతో మొత్తం ఐదు స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ సర్కారు కుమ్మక్కు వంటివాటిని ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. కులగణన, సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు వంటి హామీలను గుప్పిస్తోంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా 5 సీట్లూ గెలుచుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్‌తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్‌లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్‌లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూత
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(నవంబర్ 21) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామ సుగంథన్ ధృవీకరించారు. కాగా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 1996లో భారత ప్రభుత్వం బద్రీనాథ్‌ను పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే అత్యుతమ కంటి వైద్యులుగా ఎస్ఎస్ బద్రీనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలలలో ఒకటైన శంకర్ నేత్రాలయ స్థాపకుడు. విదేశాలలో విద్యనభ్యసించిన బద్రీనాథ్ అనేక అధ్యయనాలు పరిశోధనలను పూర్తి చేసి భారత్‌కు వచ్చిన తర్వాత 1978లో చెన్నైలో ఈ కంటి ఆసుపత్రిని స్థాపించారు. చాలాకాలంపాటు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. My Prayers and condolences to family and friends on demise of Dr Badrinath Founder Sankar nethralaya , a premier eye care hospital in chennai and that has served many poor patients ! 🙏🏽#sankarNethralaya #eyecare pic.twitter.com/ZO6dwIImqI — 𝗥𝗮𝗺𝗮 𝗦𝘂𝗴𝗮𝗻𝘁𝗵𝗮𝗻 (வாழப்பாடி இராம சுகந்தன்) (@vazhapadi) November 21, 2023 బద్రీనాథ్ మృతిపై శంకర నేత్రాలయ సంస్థ స్పందిస్తూ.. ‘మా లెజెండ్, శంకర నేత్రాలయ స్థాపకుడు డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. మా నాయకుడి మరణంపై శంకర్ నేత్రాలయ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నైలో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్.. యుక్తవయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. తల్లిదండ్రుల మృతి అనంతరం వచ్చిన భీమా డబ్బుతో వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్‌లో డాక్టర్ వృత్తిని ప్రారంభించి.. అనేక నేత్ర వైద్య కేంద్రాలలో శిక్షణ పొందాడు. తిరిగి భారత్‌కు వచ్చి 1978లో డాక్టర్ బద్రీనాథ్, వైద్యుల బృందం సాయంతో చెన్నైలోని శంకర నేత్రాలయ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత వైద్య చికిత్సను అందించడానికి కృషి చేశారు. ఆయన స్థాపించిన శంకర నేత్రాలయ సంస్థ ప్రతిరోజూ వందల మంది పేదలకు ఉచిత వైద్య చికిత్స కేంద్రంగా మారింది. కాగా బద్రీనాథ్ సతీమణి వాసంతి పీడియాట్రిషియన్, హెమటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. -
Mukesh Ambani Visits Badrinath Dham: బద్రీనాథ్ తీర్థయాత్రలో ముఖేష్ అంబానీ కుటుంబం (ఫొటోలు)
-
బద్రీనాథ్‌ను సందర్శించిన ముఖేష్ అంబానీ, కాబోయే చిన్న కోడలు సందడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం బద్రీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కూడా ఉండటం విశేషం. అలాగే RIL డైరెక్టర్ మనోజ్ మోడీ ఈసారి ముఖేష్ అంబానీకి తోడుగా ఉన్నారు. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ), సీఈవో బీడీ సింగ్, ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం కేదార్‌నాథ్‌ను కూడా సందర్శించారు అంబానీ. ఈ సందర్బంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC)కి అంబానీ 5 కోట్ల రూపాయలli విరాళంగా ఇచ్చారు. కాగా అంబానీ కుటుంబం దేవాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలలో నిత్యం సందర్శిస్తుంటారు. గతంలో కూడా ఈ కమిటీకి విరాళాన్ని ప్రకటించారు అంబానీ. అంతేకాదు 2019లో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడిగా అనంత్ అంబానీ నియమితులయ్యారు. అలాగే అనంత్ అంబానీ, రాధిక వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారు. చిన్ననాటి స్నేహితుడితో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆమె తన అత్తమామలతో కలిసి అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించడం, తన సింప్లిసిటీతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో, అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా , మనవడు పృథ్వీ అంబానీతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. గతేడాది అక్టోబర్‌లో అంబానీ బద్రీనాథ్ ధామ్, కేదార్నాథ్ ధామ్‌లను సందర్శించారు. అలాగే కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి, ఆలయ 'అన్నదానం' నిధికి 1.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తిరుపతి ఆలయాన్ని సందర్శించినప్పుడు దాదాపు రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో అంబానీ రాజస్థాన్‌లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే #WATCH | Reliance Industries Chairman, Mukesh Ambani offered prayers at Badrinath Dham in Uttarakhand. pic.twitter.com/fUUvdljevr — ANI (@ANI) October 12, 2023 -
ఆస్తి కోసం అమానుషం
వనపర్తి: ఆస్తి ముందు అన్నదమ్ముల అనుబంధం, చిన్నప్పటి నుంచి కలసి ఉన్న సోదర ప్రేమ చిన్నబోయాయి. నడిరోడ్డుపై సొంత తమ్ముళ్లే తోడబుట్టిన అన్నను కత్తులతో వేటాడి హత్య చేశారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి మండలం రాజపేట పెద్దతండాకు చెందిన మంగ్లీ, పూల్య నాయక్‌లకు ఐదుగురు కుమారులున్నారు. 20 ఎకరాల భూమిని తండ్రి తన కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. రెండో కుమారుడు బద్రీనాథ్ నాయక్ (51) వీపనగండ్లలో ఏపీఓగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే ఉండడంతో వంశోద్ధారకుడు లేడని.. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని పేదలైన తమ్ముళ్లకు ఇవ్వాలనే ప్రతిపాదన కుటుంబంలో తెచ్చారు. అందుకు బద్రీనాథ్ ఒప్పుకోకపోవడంతో, తాను పంచి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని తండ్రి డిమాండ్ చేయడంతో పాటు కోర్టుకు సైతం వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పదేళ్లుగా ఈ ఆస్తి వివాదం కోర్టులో కొనసాగుతుండగానే.. చాలాసార్లు ఘర్షణపడ్డారు. సోదరుల నుంచి ప్రాణభయం ఉండటంతో బద్రీనాథ్ కొంతకాలంగా బయట తిరిగే సందర్భంలో హతీరాం అనే వ్యక్తిని వెంటబెట్టుకునేవారు. బుధవారం విధి నిర్వహణలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చిన బద్రీనాథ్ తిరిగి వెళుతుండగా.. ఇద్దరు తమ్ముళ్లు సర్దార్ నాయక్, కోట్యా నాయక్‌తో పాటు సర్దార్ నాయక్ కుమారుడు పరమేశ్‌లు కాపుకాసి మరికుంట సమీపంలో కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా నరకడంతో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న హతీరాంకు కత్తి గాయం కావడంతో భయంతో పరారయ్యాడు. అనంతరం రెండు బైక్‌లపై నిందితులు అక్కడి నుంచి పారిపోయి.. వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితులు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేశ్వర్‌రావు తెలిపారు. -
కేదార్ నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
-
మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం
డెహ్రాడూన్: మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు. మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్లూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్లే. మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్లే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్‌కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు. కేదార్‌నాథ్‌లో కొన్నేళ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వీలవుతోందని చెప్పారు. ‘‘కేదార్‌నాథ్‌కు గతంలో ఏటా మహా అయితే నాలుగైదు లక్షల మంది మాత్రం వచ్చేవాళ్లు. ఈ ఏడాది గత రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ ఇప్పటికే ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారు’’ అని అన్నారు. ఉపాధికీ మార్గాలు హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే. పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీని కూడా నేను మన గ్రామంలోనే జరిపాను. కొండ సానువుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి భేటీకి వచ్చేందుకు అప్పట్లో మావాళ్లు గొణుక్కున్నారు కూడా. కానీ పర్వత ప్రాంతీయులు కష్టజీవులు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. అభివృద్ధి వారికి అందని ద్రాక్ష కాకూడదు. మిగతా దేశవాసులకందే అన్ని సౌకర్యాలూ అందుకునే హక్కు వారికి ఉంది’’ అన్నారు. అంతకుముందు ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మోదీ పూజలు జరిపారు. కేదార్‌నాథ్‌లో ఆది శంకరుల సమాధి స్థలిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి బద్రీనాథ్‌లో గడిపారు. ప్రధాని హోదాలో మోదీ కేదార్‌నాథ్‌ను దర్శించడం ఇది ఆరోసారి. కాగా బద్రీనాథ్‌కు రావడం రెండోసారి. రోప్‌వే ప్రాజెక్టుల విశేషాలు... కేదార్నాథ్ రోప్‌వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది. హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్‌కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్‌వే అనుసంధానించనుంది. -
బద్రినాథ్‌యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి
సాక్షి, వరంగల్: బద్రినాథ్ యాత్రకు వెళ్లిన ఓ వైద్యురాలు గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన చామర్తి ఉషారాణి(52), భర్త డాక్టర్ నందకిషోర్లు శ్రీనివాస నర్సింగ్‌హోం నిర్వహిస్తున్నారు. ఓ వైపు డాక్టర్‌గా పనిచేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దంపతులిద్దరు 12 యాత్రల దర్శనంలో భాగంగా ఈ నెల 9వ తేదీన వెళ్లారు. శనివారం ఉదయం బద్రినాథ్‌లో ఉషారాణికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె మృతదేహం రాత్రి నర్సంపేటకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డాక్టర్ ఉషారాణి కుటుంబ సభ్యులతో ఫొన్లో మాట్లాడి ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస నర్సింగ్‌హోంలో ప్రత్యేకంగా ఉషారాణి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో డాక్టర్ మనోజ్‌లాల్, డాక్టర్ భారతి, గుడిపూడి అరుణ, నల్ల భారతి, చిలువేరు రజినిభారతి, పెండెం రాజేశ్వరి, గుర్రపు అరుణ, వాసం కరుణ తదితరులు ఉన్నారు. -
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ
గోపేశ్వర్ (ఉత్తరాఖండ్): హిమాయాల్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను ప్రధాన నరేంద్ర మోదీ మేలో సందర్శించనున్నారు. గంగోత్రి, యమునోత్రిలతో కూడిన చార్ ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఏటా శీతాకాలంలో ఆర్నెల్లు మూతబడి ఉంటాయన్నది తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మే 3న, కేదార్నాథ్ మే 6, బద్రీనాథ్ మే 8న తెరుచుకోనున్నాయి. చదవండి: (మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి) -
చార్ధామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చొద్దు: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మరోసారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగం గాడిన పడుతుందనుకున్న సమయంలో, గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయ వృద్ధి కనిపించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఈ ఏడాది జరుగబోయే చార్ధామ్ యాత్రపై పడింది. మే 14 న అక్షయ తృతీయ రోజున యమునోత్రి ధామ్, మే 15 న గంగోత్రి ధామ్ తెరుచుకున్న అనంతరం చార్ధామ్ యాత్ర అధికారికంగా భక్తుల కోసం ప్రారంభమౌతుంది. అదే సమయంలో మే 17 న కేదార్నాథ్, మూడవ కేదార్ తుంగ్నాథ్, మే 18న బద్రీనాథ్ ధామ్ ద్వారా లు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. దీంతో ఈసారైనా పర్యాటక రంగం గాడిన పడుతుందని భావించిన స్థానిక వ్యాపారులకు తాజా పరిస్థితులు మరో ఏడాది దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. ఇప్పటికే చార్ధామ్ యాత్రలో పాల్గొనాలనుకున్న భక్తులు, పర్యాటకులు గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ (జిఎంవిఎన్) ఏర్పాటు చేసిన హోమ్ స్టే, హట్స్, కాటేజీలు, రెస్టారెంట్లకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు చేసుకుంటున్నారు. ఊగిసలాటలో భక్తులు కేదర్‌ఘాటితో సహా ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ మహమ్మారి వారి ఆశలను దెబ్బతీసింది. గఢ్వాల్ మండల్ వికాస్ నిగం వద్ద జరిగిన సుమారు మూడు కోట్ల బుకింగ్స్‌లో, గత ఒక వారంలో ఎనిమిది లక్షల బుకింగ్స్ రద్దు అయ్యాయి. అంతేగాక కేదర్‌ఘాటి, తుంగ్నాథ్ ఘాటి, మద్మాహేశ్వర్ ఘాటిల్లో హోమ్ స్టే ఆపరేటర్లకు చెందిన సుమారు రెండు లక్షల బుకింగ్‌లు సైతం రద్దు చేసుకున్నారు. వీటితోపాటు జీఎంవీఎన్ కార్యాలయానికి తమ బుకింగ్‌ను పోస్ట్‌పోన్ చేయాలనే భక్తుల మెయిల్స్ ప్రతీరోజు 15 నుంచి 20 వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు అవుతున్నాయి. అయితే కరోనాకు సంబంధించి గత 15 రోజుల్లో తలెత్తిన పరిస్థితుల కారణంగా, చార్ధామ్ యాత్ర ప్రారంభంపై భక్తుల్లో సందేహాలు ఉన్నాయని గౌరికుండ్ ట్రేడ్ అసోసియేషన్ భావిస్తోంది. విధివిధానాలు ప్రచురించండి దేశంలో పెరుగుతున్న కోవిడ్–19 కేసులను దష్టిలో ఉంచుకొని చార్ధామ్ యాత్రకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలను వెంటనే ప్రకటించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్ధామ్ యాత్రను మరో కుంభ్‌మేళాలా మార్చేందుకు అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తూ ఆ ఆదేశాలు జారీచేసింది. -
సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు లేరు..
సిడ్నీ : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ వరుస పరాజయాల పట్ల అభిమానులతో పాటు మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూసుడైన ఆటతీరుకు చిరునామాగా ఉన్న ఆసీస్ గడ్డపై సరైన ప్రణాళిక లేకుండా టీమిండియా బరిలో నిలిచిందనే విమర్శ వినిపిస్తోంది. ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడిచేయకపోగా.. అనుభవజ్ఞులైన పేసర్లు సైతం ధారాళంగా పరుగులు సమర్పించడం ఆందోళన కలిగిస్తోంది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రాతో పాటు ఐపీఎల్ ద్వారా జట్టులో చోటుదక్కించుకున్న నవదీప్ సైనీ సైతం చేతులెత్తేశాడు. ఓవైపు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లో పసలేకపోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పసలేని భారత్ బౌలింగ్‌ను చితకబాదిన ఆసీస్ ఆటగాళ్లు.. తొలి వన్డేలో 375, రెండో వన్డేలో 390 పరుగులు సాధించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమిచెంది సిరీస్‌ను కోల్పోయిన భారత్.. చివరిదైన మూడే వన్డేకు సిద్ధమయ్యింది. (రవి శాస్త్రిని టీంనుంచి బయటకు పంపాలి) ఈ నేపథ్యంలో గత మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శపై టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ స్పందించాడు. భారత్ టాప్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్ వంటి ఆటగాళ్ల లేరని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘ఆసీస్ సీరిస్‌లో భారత బౌలర్ల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చారు. వికెట్ల వేటలో వెనుకబడ్డారు. అయితే అన్ని పిచ్‌లు బౌలర్లుకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. భారత టాప్ఆర్డర్లో సెహ్వాగ్, సచిన్, గంగూలీ వంటి ఆటగాళ్ల లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. వీరు బ్యాటింగ్‌తో పాటు వీలైన సందర్భాల్లో బౌలింగ్ కూడా చేయగలరు. బౌలర్లు అలసిపోయినప్పుడు, పిచ్‌కు పేస్‌కు అనుకూలించనప్పుడు వీరు బౌలింగ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. (ఆసీస్ గడ్డపై ఇదే తొలిసారి..) వీరు ముగ్గురు కలిసి 10 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. భారమంతా బౌలర్ల మీదే పడుతోంది. వారు విఫలమైన సందర్భాల్లో ఆదుకోవడానికి టీంలో ఒక్కరు కూడా పార్ట్‌టైం బౌలర్లు లేరు. ధావన్, అగర్వాల్, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, వీరిలో ఎవరూ కూడా బౌలింగ్ చేయలేరు. గతంలో రోహిత్ స్పిన్నర్‌గా జట్టుగా అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా సైతం బౌలింగ్ చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది.’ అని అభిప్రాయపడ్డాడు. కాగా చివరి వన్డే బుధవారం జరుగనున్న విషయం తెలిసిందే. -
నా కూతురి ఆత్మ శాంతించింది!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని, ఇప్పుడు భద్రంగా ఉన్నామని మహిళలు భావిస్తారని వ్యాఖ్యానించారు. శిక్ష అమలు ఇంతగా వాయిదా పడటానికి కారణమైన చట్టపరమైన లోపాలపై ఇకపై తాము పోరాటం చేస్తామన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని ఆశాదేవి వ్యాఖ్యానించగా, తమ కూతురికి న్యాయం జరిగిందని, ఇలాంటి అన్యాయానికి గురైన బాధితుల కోసం ఇకపై పోరు కొనసాగిస్తామని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ.. శిక్ష అమలును వాయిదా వేసేందుకు చేసే ఇలాంటి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు. ‘ఇప్పటికైనా మిగతా బాధితులకు సకాలంలో న్యాయం జరగాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరగాలి. ఆ దిశగా పోరాటం సాగిస్తాం’ అన్నారు. ఈ రోజు తన కూతురి ఆత్మ శాంతించిందని భావిస్తున్నానని భావోద్వేగంతో ఆశాదేవి వ్యాఖ్యానించారు. మా ఊరి ప్రజలు ఈ రోజే హోళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ శిక్ష తరువాతైనా.. తల్లిదండ్రులు మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తమ కుమారులకు నేర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘గురువారం రాత్రి సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఇంటికి వచ్చి నా కూతురు ఫొటోను హత్తుకుని, బేటీ.. నీకు న్యాయం జరిగింది’ అని విలపించానని ఆశాదేవి తెలిపారు. రాత్రంతా తామిద్దరికి కంటి మీద కునుకు లేదన్నారు. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోవాలని, ఈ రోజును ఏటా ‘నిర్భయ న్యాయ దివస్’గా జరుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశాదేవి ఇంటి వద్ద తెల్లవారు జామున గుమికూడిన ప్రజలు ఉరిశిక్ష అమలుపై ‘కౌంట్ డౌన్’ నిర్వహించారు. -
కేధార్‌నాథుడిని దర్శించుకున్న మోదీ
కేధార్నాథ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేధార్‌నాథుడిని సందర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో శనివారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయన ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం బద్రీనాథ్ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి