సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్‌తో కేంద్రం సత్క రించింది.
అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్‌లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్‌లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment