Poor People
-
పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీకటాక్షం
సాక్షి, న్యూఢిల్లీ: పేదలు, మధ్య తరగతి ప్రజలపై సంపదల దేవత లక్ష్మీదేవి కటాక్షం చూపాలని తాను ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాలకు లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ బడ్జెట్లో పేదలు, మధ్య తరగతితోపాటు మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నారు. వారిపై వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. మహిళల గౌరవాన్ని పెంచే చర్యలు చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే మహిళల సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరంచారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించబోతున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. దేశాన్ని మరింత బలోపేతం చేసే చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. యువ ఎంపీలే విధాన రూపకర్తలు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఎదిగేందుకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు విశ్వాసాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఈ తీర్మానాన్ని సమష్టిగా నెరవేరుస్తారని ఆయన నొక్కి చెప్పారు. మూడో దఫా ప్రభుత్వంలో భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా సమగ్ర అభివృద్ధి దిశగా మిషన్ మోడ్‌లో ముందుకు సాగుతోందని, ఆవిష్కరణలు, చేరికలు, పెట్టుబడులు స్థిరంగా దేశ ఆర్థిక రోడ్‌మ్యాప్‌కు పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేసే చట్టాలకు దారితీసే అనేక చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలు ఈ సెషన్లో చర్చిస్తామన్నారు. స్త్రీల గౌరవాన్ని పెంచేలా, ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించడంతోపాటు మతపరమైన చిచ్చుల , వర్గ విభేదాలు లేకుండా చేయడం.. తమ ప్రా«థామ్యాలని ఆయన నొక్కిచెప్పారు. ఈ లక్ష్య సాధన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వేగవంతమైన అభివృద్ధిని సాధించడంలో సంస్కరణలు, పనితీరు, మార్పు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. దేశం అపారమైన యువశక్తితో తొణికిసలాడుతోందని, ఈ రోజు 20–25 సంవత్సరాల వయస్సు గల యువత 45–50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అభివృద్ధి చెందిన భారతదేశంలో అతిపెద్ద లబి్ధదారులు అవుతారని అన్నారు. వారంతా విధాన రూపకల్పనలో కీలక స్థానాల్లో ఉంటారని, అభివృద్ధి చెందిన భారతాన్ని రాబోయే శతాబ్దంలో గర్వంగా నడిపిస్తారన్నారు. 1930, 1940లలో స్వాతంత్య్రం కోసం పోరాడిన యువతతో వారిని పోల్చారు. యువ ఎంపీలకు ఇది సువర్ణావకాశమని, సభలో వారి చురుకైన భాగస్వామ్యంతో వికసిత్ భారత్‌కు సాక్షులుగా ఉంటారని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ఎంపీ, ముఖ్యంగా యువ ఎంపీలు వికసిత్ భారత్ ఎజెండాకు ఇతోధికంగా కృషి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సంస్కరణలు, పనితీరు, పరివర్తన’ తమ మంత్రంగా ఉంటుందన్నారు. వేగంగా అభివృద్ధిని సాధిస్తామని, సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో విదేశీ జోక్యం లేని సమావేశాలివే గడిచిన పదేళ్లలో విదేశీ జోక్యం లేకుండా జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి సమావేశాలకు ముందు విదేశాల నుంచి అగ్గిరాజేయడం పరిపాటిగా వస్తోందని, ఈసారి మాత్రం అలాంటిదేమీ జరుగలేదని విపక్షాలకు చురకలు వేశారు. ‘‘2014 నుంచి నేను గమనిస్తున్నాను. ప్రతి సమావేశానికి ముందు ఇక్కట్లు సృష్టించేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇక్కడ దేశంలో ఈ ప్రయత్నాలను ఎగదోసే వారికి కొదవలేదు. విదేశీ మూలాల నుంచి ఎలాంటి జోక్యం లేని మొదటి సమావేశం ఇదే’’ అని వ్యాఖ్యానించారు. -
దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం
తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం.. అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇందులోనూ ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది వృద్ధులకు సహాయం చేస్తే, మరి కొందరు అనాథలకు, పేద పిల్లలకు సహకారం అందిస్తారు. ఇలా పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథ వృద్ధుల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు తోచిన సేవలు అందించడమే కాకుండా, తన లాంటి ఎంతో మందికి దక్సూచిలా నిలుస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి భరోసా కల్పిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 200 మంది విద్యార్థులు, 150 మంది దివ్యాంగులకు అండగా ఉన్నారు డాక్టర్ సారథామురుగన్. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ సేవకురాలు.. – అడ్డగుట్ట కేరళకు చెందిన ఈమె పదిహేను ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని తన బంధువులతో కలిసి ఉంటున్నారు. మొదట ఐటీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించిన సారా అనంతరం, ఉద్యోగం మానేసి పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవకు 2016లో సెవెన్ రేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె సేవలను గుర్తించి ఇటీవల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెలలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు డాక్టర్ సారా. దివ్యాంగుల్లో స్ఫూర్తి నిపుతూ.. దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో చిరు వ్యాపారాలు పెట్టించడం, కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఉపాధి మార్గాలను కల్పిస్తున్నారు. మురికివాడల్లోనూ, రోడ్లపైనా ఎలాంటి ఆసరా లేని వారికి ఆహారం పంపిణీ చేస్తారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కుట్టు మిషన్లతో పాటు 200 వీల్ చైర్లు పంపిణీ చేశారు. 30 వేల గ్రాసరీ కిట్ల పంపిణీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ద్వారా 30 వేల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలిచారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. ప్రస్తుత సమాజంలో ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఉండాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్ముతాను. అందుకే మా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించే దాతల సహాయంతో విద్యార్థులను చదివిస్తాం. ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. – డాక్టర్ సారా, సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పేదలకు ఉన్నత విద్య లక్ష్యంగా..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు సారా నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఓల్డ్ సఫీల్‌గూడ, మౌలాలి ప్రాంతాల్లోని 6 ప్రభుత్వ పాఠశాలను సెవెన్‌రేస్ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ప్రతి ఏడాదీ ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, విద్యారి్థనులకు శానిటరీ కిట్స్ పంపిణీ చేస్తుంటారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సెవెన్‌రేస్ సంస్థ సొంతంగా చదివిస్తుంది. -
ఆర్థిక అసమానతలకు కారణం ఏమిటంటే..
దేశంలో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రజల్లో ఆర్థిక అసమానతలను సృష్టిస్తుందని ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్‌బసు అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలు తమ ఆదాయంలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘సామాన్య ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ద్ర్యవ్యోల్బణం 5.1 శాతంగా ఉంది. దీన్నిబట్టి ఆహార ద్రవ్యోల్బణం 30 శాతంగా ఉంటుంది. నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఆహారానికే ఖర్చు చేసే కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టవేయబడుతున్నాయి. దానివల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. భారత్‌లో కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఏఐలో ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయ కార్మిక రంగంపై దీని ప్రభావం పడుతోంది. విద్య ఒక్కటే పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలకు పరిష్కారం కాదు. ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా నైపుణ్యాలు పెంచుకోవాలి. భారత్‌లో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టింది. అయినా మరిన్ని సంస్కరణలు రావాలి’ అని బసు సూచించారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’ -
పేదలపై అక్కసు.. అసైన్డ్ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం
అసైన్డ్ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం దళిత, పేద రైతులకు యాజమాన్య హక్కులివ్వడం తప్పా? దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్ చట్టం తెచ్చిన జగన్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం ఇదివరకెన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు ప్రయోజనం తమ భూములపై హక్కులొచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ?అసైన్డ్ భూముల రైతులకు చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను ప్రశ్నించేలా ఎల్లో మీడియా.. ప్రధానంగా ‘ఈనాడు’ వింత ధోరణి ప్రదర్శిస్తోంది. వారి భూములపై వారికి హక్కులు ఇవ్వడమే నేరమన్నట్లు వక్ర భాష్యాలు చెబుతోంది. పేద రైతులు, దళితులు ఇంకా బానిసత్వంలోనే బతకాలని కోరుకుంటోంది. వారి భూములకు వారు యజమానులుగా మారడం సరికాదంటూ ఏడుపుగొట్టు రాతలతో దుష్ప్రచారం చేస్తోంది. పేదలు, దళితులు ఆరి్థకంగా ఎదగడానికి వీల్లేదంటూ పెడబొబ్బలు పెడుతూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక రాష్ట్రంలో లక్షలాది మంది అసైన్డ్ రైతులు అష్టకష్టాలు అనుభవించారు. ఏళ్ల తరబడి ఆ భూములకు హక్కులివ్వాలని ప్రాధేయపడినా ఏ ప్రభుత్వం కనికరించడంలేదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళిత, ఇతర పేద రైతులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు యాజమాన్య హక్కులు లభించాయి. తద్వారా 20 ఏళ్లకు పైబడి తమ ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములపై పేద, దళిత రైతులకు సంపూర్ణ అధికారాలు దఖలు పడ్డాయి. లక్షలాది మంది పేద రైతులు వారి భూములపై యాజమాన్య హక్కులు పొంది సంపూర్ణ రైతులుగా మారారు. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. ఆ సొమ్ము ద్వారా పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు, ఇతరత్రా ఆరి్థక ఇబ్బందుల నుంచి గట్టెక్కారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్‌ను వెనకేసుకొస్తున్న ‘ఈనాడు’కు ఇది ఏమాత్రం గిట్టడం లేదు.సాక్షి, అమరావతి: ఏపీలో అసైన్డ్ భూముల చట్టాన్నే అపహాస్యం చేసేలా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా దిగజారి వ్యవహరిస్తోంది. అసైన్డ్ భూములకు ఎసరు పెట్టేశారంటూ పేద, దళిత రైతులు తమ భూములపై నిర్ణయం తీసుకోవడాన్ని అవమానకరంగా వక్రీకరిస్తోంది. ఆ భూములను అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారని నిరాధారంగా నిందిస్తోంది. పేద రైతులు కొత్తగా వచ్చిన యాజమాన్య హక్కుల ఆధారంగా తమ భూమిని అమ్ముకుంటే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ విపరీత అర్థాలు తీస్తోంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తల్లికి మాత్రమే ఇస్తామని బొంకుతున్న విషయం బయట పడటంతో.. తమ మోసాన్ని ప్రజలు గ్రహించకుండా దృష్టి మళ్లించడానికి ‘బాబు అండ్ కో’ అసైన్డ్ హక్కుల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా, ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా తొలగించాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లో మీడియా, ప్రధానంగా ఈనాడు శకుని పాత్ర పోషిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలించి.. ఇంకా ఎలా మంచి చేయొచ్చు అని చెప్పే బాధ్యత పత్రికలకు ఉంటుంది. కానీ మేలు చేస్తున్న కార్యక్రమాలను ఎత్తివేయాలని, తీసివేయాలంటూ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాయడం దారుణం. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పేదవాళ్లు. పేదలకు నష్టం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం, ఎల్లో మీడియా ఉన్నట్టు మరోసారి రుజువైంది. చంద్రబాబు, తాము బాగుంటే చాలని ఈనాడు కిరణ్ అనుకోవడం దుర్మార్గం. అసైన్డ్ భూములు దోచిందెవరు? నిజంగా అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాదా? రాజధాని పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1,100 ఎకరాలు కొట్టేశారు. వాళ్ల చేతిలో ఉంటే పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి లాగేసుకున్నారు. ఆ తర్వాత జీవో ఇచ్చి చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకుని టీడీపీ బినామీలకు ప్లాట్లు కేటాయించి కోట్లు కొల్లగొట్టారు. 1,336 మంది బినామీలు ఇంకా ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోందిం. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఇదే ఈనాడు ఏనాడైనా నాలుగు వాక్యాలు రాసిందా? అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. పేదలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నాం కష్టం వస్తే.. దాన్ని ఏదోలా ఉపయోగించుకుందామన్నా.. చేసుకోలేని పరిస్థితి. పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకునే పరిస్థితి. రికార్డుల్లో ఒక పేరు.. భూమి దగ్గరకు వస్తే మరొకరి పేరు. దేనికీ పొంతన లేదు. ఒకరేమో కష్టం తీర్చుకోవడం కోసం అమ్ముకుంటే, దాన్ని కొనుక్కున్నవాడికీ కంటిమీద కునుకులేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేసింది. గతేడాది అక్టోబరు 27న దీనికి గెజిట్ జారీ అయ్యింది. నిజంగా ఎవరో ఒకరికి లబ్ధి చేకూర్చాలనుకుంటే.. ఎవరి ఆధీనంలో భూమి ఉంటే వారికే ఇచ్చేయండి అని చెప్పేవారు. కాని అలా జరగలేదు. ఏ పేదవాడు అయితే లబ్ధిదారో, ఒరిజనల్ అసైనీగా ఉన్నాడో, వారు లేకపోతే వారసులు ఎవరున్నారో వారికే సర్వహక్కులూ ఇవ్వండని చెప్పింది. ఇందులో తప్పు ఏముంది? ఇప్పుడు వీరందర్నీ రోడ్డు మీదకు ఈడ్చాలని చూస్తున్నారా? పేదల పొట్టకొట్టాలని చూస్తున్నారా? ఇదీ అసైన్డ్ భూముల నేపథ్యం వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు వ్యవసాయం కోసం భూమి అసైన్డ్ చేసే విధానం కొన్ని దశాబ్దాల క్రితం మొదలైంది. 1954కు ముందు అసైన్ చేసిన భూములది ఒక కేటగిరీ, 1954 తర్వాత మరో కేటగిరీ. 1954కు ముందు అసైన్డ్‌దారులకు ఇచ్చిన పట్టాల్లో ఎక్కడా అమ్ముకోకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ పట్టాల్లో మాత్రం ఈ నిబంధన పెట్టారు. దీంతో ఆ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. వాటిని అమ్ముకునే అవకాశం లేదు. గతంలో బాబు ప్రభుత్వం చేసిన వెబ్‌ల్యాండ్ దుర్మార్గాల వల్ల 1954కు ముందు అసైన్డ్ చేసిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. వాటిని తొలగించుకోవడానికి రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిం, లంచాలు ఇచ్చిం విసిగిపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. 1954 నుంచి కూడా పేదలకు భూములు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఆ భూముల మీద వారికి హక్కులు లేవు. అదే స్వాతంత్య్ర సమరయోధులో, ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే అసైన్ చేసిన తర్వాత పదేళ్లకు అమ్ముకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఈ విషయంలో వారికి పూర్తి హక్కులు ఉన్నాయి. భూమి లేని నిరుపేదలకు మాత్రం హక్కులు లేవు. 2, 2.5 ఎకరాల వరకూ అసైన్మెంట్ పట్టా ఉన్న వాళ్లు తమ అవసరాలకు ఒక అరెకరం అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోవడం కుదరదు. దీంతో సాదా బైనామా పద్ధతిలో భూముల అమ్మకాలు జరిగాయి. దీనివల్ల నిరుపేదలైన అసైనీలకు రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా వచ్చేది కాదు. భూమిని అమ్ముకోకుండా సాగు చేసుకున్న వారు కూడా టైటిల్ లేకపోవడం వల్లం రెవిన్యూ శాఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు వస్తాయని, ఆ భూమిని ప్రభుత్వం ఎక్కడ తీసేసుకుంటుందోనని, ఎక్కడ రిజర్వ్ చేస్తుందోనని భయాందోళనలు ఉండేవి. ఇటు అసైనీకి.. అటు కొనుక్కున్న వారికి లబ్ధి లేదు.రెవెన్యూ రికార్డులు క్షేత్ర పరిస్థితిని తెలియజెప్పేలా లేవు. రికార్డులు ఒకరి పేరు మీద ఉంటే.. భూములు మరొకరి ఆదీనంలో ఉన్నాయి. ఇప్పటివరకు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలను ప్రభుత్వాలు అసైన్మెంట్ చేస్తే.. ఆ రికార్డులేవీ క్షేత్ర స్థాయికి అనుగుణంగా లేవు. పూర్తి అధ్యయనం తర్వాతే అసైన్డ్ చట్ట సవరణ జిల్లా కలెక్టర్లు పలుమార్లు జగన్ ప్రభుత్వం దృష్టికి అసైన్డ్ భూముల సమస్యను తీసుకు వచ్చాక రెవెన్యూ మంత్రి నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30వ తేదీన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించిం అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కేరళలో అయితే అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని తమిళనాడులో నిబంధన ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసలైన ఒరిజనల్ లబ్ధిదారులకు, లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, దానికి అనుగుణంగా ఏపీ అసైన్మెంట్ చట్టం (పీఓటీ) 1977కు సవరణలు చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. అంటే అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేయగా, దీనికి అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపి, చట్టానికి సవరణలు చేసింది. అదే సందర్భంలో 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎలాంటి హక్కులూ రావు. వారి విషయంలో 1977 నాటి పీఓటీ చట్టం అమల్లో ఉన్నట్టే. 2007,2008 నాటి సవరణలు కూడా వర్తిస్తాయి. దీనివల్ల అసైన్మెంట్ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకు అసైన్మెంట్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకే మేలు కలుగుతుంది. అంటే ఒరిజనల్ అసైనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అందులో తప్పులు జరిగాయని, రద్దు చేయాలనే వాదనలో ఏమైనా అర్థం ఉందా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలనుకుంటే ఒరిజనల్ అసైనీలకే హక్కులు ఇవ్వాలనే షరతు చట్టంలో ఎందుకు పెడతారు? 27 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులువైఎస్ జగన్ హయాంలో జరిగిన అసైన్డ్ చట్ట సవరణ ద్వారా సుమారు 15,21,160 మంది భూమిలేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. 20 సంవత్సరాలకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. అలాగే ప్రభుత్వం వ్యవసాయ భూములే కాకుండా ఇళ్ల పట్టాలు కూడా నిరుపేదలకు ఇచ్చింది. జగన్ ప్రభుత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరుమీద నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చారు. గతంలో 20 సంవత్సరాల తర్వాత ఇళ్ల పట్టాలపై సర్వ హక్కులు కల్పించేలా ఉన్న చట్టాన్ని, జగన్ హయాంలో 10 సంవత్సరాలకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేశారు. ఫలితంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందినవారితోపాటు, మిగిలిన వారికీ ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క సెంటు భూమి పేదలకు ఇచ్చారా? పైగా అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుపడటం వాస్తవం కాదా? భూముల పేరుతో అన్యాయం చేసింది చంద్రబాబు కాదా? 2016లో ఒక్క మెమో ద్వారా 2,06,171 ఎకరాల చుక్కల భూములను ఉద్దేశ పూర్వకంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఎలో పెట్టి ఆ రైతులను సర్వనాశనం చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక చుక్కల భూముల విషయంలో నష్టపోయిన 97,472 రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పుడు వారిని కూడా రోడ్డుకు లాగేస్తారా? షరతులు గల పట్టా భూములున్న వేల మంది రైతులకు సంబంధించిన 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి వైఎస్ జగన్ మేలు చేశారు. ఇప్పుడు వీరిని కూడా రోడ్డున పడేస్తారా? గిరిజనులకు 2.83 లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చారు. వాళ్లనూ రోడ్డున పడేస్తారా? ఇవన్నీ పేద రైతులకు మంచి చేస్తూ తీసుకున్న నిర్ణయాలు. వాళ్లందరినీ రోడ్డున పడేయాలన్న చంద్రబాబు కోరికకు ఎల్లో మీడియా అక్షర రూపం ఇస్తోంది. దళిత రైతులను అవమానిస్తారా? అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడాన్ని ఎల్లో మీడియో ఓర్వలేకపోతోంది. తమ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి దళితులు ఎదురుచూశారు. భూములపై హక్కు వస్తే తమకు సమాజంలో గౌరవం పెరుగుతుందని భావించారు. దాన్ని వైఎస్ జగన్ నెరవేర్చారు. దీన్ని తప్పు పట్టడం అన్యాయం. హక్కులు వచ్చిన కొందరు రైతులు తమ భూములను అమ్ముకోవడం తప్పెలా అవుతుంది? వారి అవసరాల కోసమో, లేక ఆ భూమికి ఎక్కువ రేటు రావడం వల్లో అమ్ముకుని ఉండవచ్చు. ఆ భూములన్నింటినీ వైఎస్సార్సీపీ వాళ్లు కొన్నారనడం నిరాధారం. దళితులను అవమానించడానికే ఇలాంటి రాతలు రాస్తున్నారు. – జూపూడి ప్రభాకర్‌రావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుపెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? అసైన్డ్ భూములపై 20 సంవత్సరాల తర్వాత హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ జగన్ దళితులు, పేద రైతుల తల రాతను మార్చారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని ఆయన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధైర్యంగా ఈ పని చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. సమాజంలో వారికి గౌరవం పెరిగింది. మావి అసైన్డ్ భూములు కావు, పట్టా భూములని చెప్పుకుంటున్నారు. అవసరమైతే ఎవరైనా అమ్ముకుంటున్నారు. దాని కోసమే, ఆ హక్కు కోసమే వారు పోరాడారు. సాధించుకున్న భూమిపై వారికి హక్కు ఉండదా? దళితులు పెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? – మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడులక్షల మంది అసైన్డ్ రైతులకు లబ్ధి దళిత, పేద రైతులకు మేలు చేయడాన్ని కూడా తప్పు పట్టడం దారుణం. అసైన్డ్ భూములకు హక్కులివ్వడం వల్ల లక్షల మంది పేద, దళిత రైతులు ప్రయోజనం పొందారు. అసైన్డ్ భూములంటేనే వివాదాస్పద భూములుగా చిత్రీకరించిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా ఆ భూమిపై వారికి హక్కు ఉండేది కాదు. తమకు హక్కు ఇస్తే ఆ భూమిని అవసరానికి ఉపయోగించుకుంటామని, అవసరమైతే రుణాలు తీసుకుంటామని రైతులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. ఎవరూ వినలేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ మాత్రమే విన్నారు. ఆయన ప్రభుత్వం మాత్రమే పట్టించుకుంది. అసైన్డ్ రైతులకు యాజమాన్య హక్కులిచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. దాన్ని వక్రీకరించి ఇష్టానుసారం మాట్లాడడం తగదు. – నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, మాల మహానాడు -
Bharat Ratna: నిరుపేదలకు గౌరవం: అమిత్ షా
న్యూఢిల్లీ: బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలు, వెనకబడ్డ వర్గాలు, దళితులకు నిజంగా గొప్ప గౌరవమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ద్వారా వందలాది ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. బుధవారం ఇక్కడ ఠాకూర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కర్పూరి స్ఫూర్తితో అన్ని వర్గాలనూ సమాదరిస్తూ మోదీ ప్రభుత్వం సాగుతోందన్నారు. ముఖ్యంగా ఓబీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలేనన్నారు. -
పేదల గుండెల్లో ‘గూడు’..
పేదలే సీఎం జగనన్నకు నేస్తాలు.. వారి ఆనందాలే ఆయనకు సంతృప్తి నిస్తోంది.. వారికి కూడు, గుడ్డ, నీడ నివ్వడం.. వారిని ప్రేమతో చూసుకోవడమే ఆయనకు తెలిసిన పని.. అందుకే ఇళ్లు లేని నిరుపేదలు పైరవీకారులను ఆశ్రయించే పనిలేకుండా చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలకు చెక్ పెట్టారు. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న బడుగులకు సొంతింటి కల సాకారం చేశారు. ఆర్థిక స్తోమత లేని అభాగ్యులకు అండగా నిలిచారు. అందుకే ఆయన పేదల పక్షపాతి అయ్యారు. పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో అర్హులందరికీ స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఈ పథకం లబ్ధిదారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – చిత్తూరు కలెక్టరేట్ జగన్న పుణ్యంతో ఇల్లు కట్టుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో ఇంటి పని పూర్తి చేశాం. మంచి ప్రాంతంలో ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయంతో పనులు పూర్తి చేశాం. ఇల్లు మంజూరు కోసం గతంలో లెక్కలేనన్ని సార్లు అధికారులకు వద్దకు వెళ్లి అర్జీలు ఇచ్చాం. అప్పట్లో ఏ మాత్రం సమస్యను పట్టించుకోలేదు. తిరిగి తిరిగి వేశారిపోయి ఆశలు వదులుకున్నాం. సీఎం జగనన్న పుణ్యమాని ఇల్లు కట్టుకున్నాం. మా ఇంటిల్లిపాది సీఎంకు రుణపడి ఉంటాం. – గౌరి, పచ్చికాపల్లం. వెదురుకుప్పం. విలువైన స్థలంతో పాటు ఇల్లు కట్టించారు విలువైన స్థలం ఉచితంగా ఇచ్చారు. ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేశారు. మా మండలంలో ప్రధాన రహదారి పక్కనే స్థలం కేటాయించారు. టీడీపీ పాలనలో ఇంటి స్థలం కోసం జన్మభూమి కమిటీ సమావేశాల్లో లెక్కలేనన్ని సార్లు అర్జీలు ఇచ్చాం. అయినా న్యాయం జరగలేదు. జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీరు మా వద్దకు వచ్చి వివరాలు తీసుకుని వెళ్లి ఇంటి స్థలంతో పాటు, ఇళ్లు మంజూరు చేయించారు. సీఎం జగనన్న లాంటి ప్రజానాయకుడిని ఎన్నటికీ మరిచిపోము. –కుమారి, టీకెఎంపురం. సొంత గూడు దొరికింది రోజు కూలీ పనులకు వెళితేగానీ మాకు పూట గడవదు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత మాకు లేదు. అప్పులు చేయాలన్నా అప్పు పుట్టదు. కూలీ నాలీ చేస్తే వచ్చే డబ్బులతో అద్దె ఇంట్లో సంవత్సరాలు గడిపాం. సీఎం జగనన్న ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మాకు సొంతింటి కల నెరవేర్చారు. ఉచితంగా ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇల్లుని నిర్మించి ఇచ్చారు. దీంతో మాకు సొంత గూడు దొరికింది. సీఎం జగనన్న మేలు ఎన్నటికీ మరువలేము. –వనమ్మ, కోణంగిపల్లె, వెదురుకుప్పం మండలం మా కల సాకారం చేశారు సీఎం జగనన్న మా కల సాకారం చేశారు. సొంతింటి కోసం సంవత్సరాలుగా కలలు కన్నాం. గత సర్కారులో ఎవరూ మా సమస్యను పట్టించుకోలేదు. సొంతిల్లు ఇస్తామని మాటలు చెప్పి, మాయ చేశారే తప్ప న్యాయం చేయలేదు. కొన్ని సామాజిక వర్గాలకే గతంలో న్యాయం చేసేవారు. ఇప్పుడు అలా కాదు నాలాంటి పేదలందరికీ జగనన్న న్యాయం చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి మేలును ఎప్పటికీ మరిచిపోము. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యింది. –జమున, చిన్నపోటుచేను. వెదురుకుప్పం మండలం -
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్‌తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్‌లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్‌లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
నిరుపేద కుటుంబాలకు సీఎం ఆపన్న హస్తం
కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నిరుపేదలు పడుతోన్న కష్టాలను విని స్పందించి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం సీఎంను హెలిప్యాడ్ వద్ద పలువురు కలిసి తమ గోడు విన్నవించారు. వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్లో 17 మంది బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లా అందజేశారు. ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలిచ్చారన్నారు. శస్త్ర చికిత్సల కోసం కొందరు, ఇతర ఆరోగ్య సేవల కోసం మరికొందరు తమకు సహాయం చేయాలని సీఎంను అడగ్గా ఆ వెంటనే తదనుగుణంగా సీఎం ఆదేశాలిచ్చారని, దీంతో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు లబి్ధదారులు ధన్యవాదాలు తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఆర్థిక సహాయం పొందిన వారిలో ఈ సత్య సుబ్రహ్మణ్యం (పెద్దాపురం), టీ.ఆనంద్‌కుమార్ (కిర్లంపూడి), కృష్ణకాంత్ (పెద్దాపురం), బుర్రా రాజు (పెద్దాపురం), లక్ష్మి ఆకాంక్ష (పెద్దాపురం), సింగం శ్యామల భాను (కాకినాడ), ఐ సాయి వెంకట్ (పెద్దాపురం), డి నవీన్ (పెద్దాపురం) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పి.మాధురి నవ్య, ఐ.నైనిక, జె.వీరవెంకట సాయి, సిహెచ్ హర్షిత, వి.శశిశ్రీనేత్ర, జి.సుజాత, ఎన్.సతీష్, పి.ప్రేమ్ చంద్, కె.మార్తమ్మ (నంద్యాల)ఉన్నారు. -
Oxfam: దేశంలో 77శాతం సంపద ఎక్కడుందంటే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత జీడీపీ వృద్ధి ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఒక వైపు మన జీడీపీ పెరుగుతుంటే, మరోవైపు ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం దేశ సంపదలో 77శాతం కేవలం 10శాతం ధనవంతుల చేతిలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో 119 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద గత పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. రోజుకు కనీసం 70 మంది కొత్తగా మిలియనీర్లు అవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు విద్య, వైద్య ఖర్చులు భరించలేక దేశీయంగా ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. ఇండియాలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపైనా సరైన దృష్టి సారించాలి. లేకుంటే, ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయి, దేశ ఆర్థిక పురోగతి దెబ్బతింటుందని నివేదిక చెబుతుంది. -
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
వరదలా విదేశీ డబ్బులు.. ప్రపంచంలోనే తొలి స్థానంలో ప్రవాస భారతీయులు
వంద బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో సుమారు 8 లక్షల కోట్లు! గతేడాది విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తమిది! ఇలాంటి చెల్లింపుల్లో ప్రవాస భారతీయులు ప్రపంచంలోనే టాప్! అయితే ఏంటి? చాలా ఉంది! ఈ మొత్తం అనేక మందికి అన్నం పెడుతోంది! పేదరికం తగ్గేందుకు, ప్రజల ఆరోగ్యం మెరుగయ్యేందుకు, నవజాత శిశువులు పుష్టిగా ఉండేందుకూ కారణమవుతోంది..ఎలా? ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022–23లో ప్రపంచం మొత్తమ్మీద అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు పంపిన మొత్తం 80,000 కోట్ల డాలర్లు. ఈ విషయంలో అన్ని దేశాల కంటే తొలి స్థానంలో ఉన్న భారత్‌కు విదేశాల్లోని భారతీయులు వంద బిలియన్ డాలర్లు పంపితే, అరవై బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది. విదేశాల్లో ఉన్న మన బంధువులు లేదా మిత్రులు ఇంటికి పంపే డబ్బుల్ని ఇక్కడ రకరకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదులుతూ ఉంటాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయమూ లభిస్తుంటుంది. పైగా మధ్యవర్తి లేకుండా నేరుగా డాలర్లు భారత్‌కు వస్తుంటాయి. ఈ డాలర్లను ప్రభుత్వం ముడిచమురు, తదితర కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఎగువన ఉన్న వారికీ... దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారినే కాకుండా ఎగువన ఉన్న వారికీ ఈ చెల్లింపులు ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దారిద్య్రరేఖకు కొంచెం ఎగువన ఉన్న వారు కూడా కిందకు పడిపోతారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని బంధుమిత్రులు పంపే అదనపు మొత్తాలు బాధితులు పుంజుకునేందుకు ఉపయోగపడతాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2018 ఆగస్టు నాటి భారీ వరదల సమయంలో భారత్‌కు చెల్లింపులు దాదాపు 14 శాతం వరకూ పెరిగాయి. అంతెందుకు 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినా, విదేశీ పెట్టుబడులు తగ్గిపోయినా ఈ రకమైన చెల్లింపులు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వాలకు నమ్మకంగా వచ్చిపడే విదేశీ మారక ద్రవ్యం ఇది. వ్యయం తడిసిమోపెడు! అంతాబాగానే ఉంది కానీ.. ఇటీవలి కాలంలో చెల్లింపుల కోసం అయ్యే వ్యయం తడిసిమోపెడు అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ అధ్యక్షతన ప్రస్తుతం జరుగుతున్న జీ20 సమావేశాల్లోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరగడం గమనార్హం. డాలర్ మారకం విలువల్లోని తేడాలు, పంపేందుకు, అందుకునేందుకు చెల్లించాల్సిన కమీషన్లు ఎక్కువగా ఉండటం వల్ల చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం. ప్రస్తుతం ఈ కమీషన్లు, మారక విలువల్లోని తేడాలనీ కలిపి ప్రతి చెల్లింపునకూ 6.24 శాతం మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తోంది. చదవండి: మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ? అయితే మూడేళ్ల క్రితం ఇది ఏడు శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో దీనిని మూడు శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బులు మార్పిడి చేసే కంపెనీలు మరిన్ని అందుబాటులో ఉండేలా చేసి వాటి మధ్య పోటీ పెంచాలన్నది ఈ దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఒకటి. ఆయా దేశాలు ఈ చెల్లింపులపై విధిస్తున్న పన్నులను తగ్గించేందుకు, వీలైతే పూర్తిగా మాఫీ చేసేలా కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యయం తగ్గించుకునేందుకు వలస కార్మికులు లేదా ఉద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించడం వల్ల కొన్నిసార్లు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని ఈ వ్యయాన్ని వీలైనంతగా తగ్గిస్తే వినియోగదారులకు లాభం చేకూరడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. విదేశాలకూ పెరుగుతున్న చెల్లింపులు దశాబ్దాలుగా విదేశాల నుంచి భారత్‌కు ‘‘చెల్లింపులు’’ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో విదేశాలకు వెళుతున్న మొత్తం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం గత ఏడాది ఈ మొత్తం 2,710 కోట్ల డాలర్లకు చేరుకుంది. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు తమ వ్యక్తిగత అవసరాల కోసం (పర్యాటకం, విద్య, అనుమతులు అవసరం లేని పెట్టుబడులు) ఏటా దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. 2004లో ఇది రూ.24 లక్షలు మాత్రమే. 2015లో ఈ పరిమితిని పెంచారు. దీంతో 2004లో విదేశాలకు వెళ్లే మొత్తం 460 బిలియన్ డాలర్లు కాగా 2022 నాటికి 2,710 కోట్ల డాలర్లకు చేరింది. 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే.. గత ఏడాది చెల్లింపుల్లో దాదాపు 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే అందుకున్నాయి. కొన్ని దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఈ చెల్లింపులు ఉండటం గమనార్హం. కాగా ఈ డబ్బులు పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై మూడేళ్ల క్రితం మారియా ఫాషోలిన్సే అనే శాస్త్రవేత్త ఒక అధ్యయనం నిర్వహించారు. కార్మికులను ఇతర దేశాలకు పంపే 25 ఆసియా దేశాలను ఎంచుకుని ఈ అధ్యయనం చేశారు. వలసలు, చెల్లింపులపై ప్రపంచబ్యాంకు వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆయా దేశాల్లోని పేదల సంఖ్య, వారిలో ఉండే అంతరం (కటిక పేదలు.. ఓ మోస్తరు పేదలు) వంటి వివరాలు సేకరించారు. వీటిద్వారా ఆయా దేశాల్లో పేదరికం ఎంతమేరకు ఉందన్నది నిర్ధారించుకున్నారు. రోజుకు రెండు డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ప్రపంచబ్యాంకు పేదల కింద లెక్కవేస్తుంది. ఈ వివరాలను పొందుపరిచి గణితశాస్త్ర సూత్రాల ప్రకారం లెక్క వేస్తే విదేశాల నుంచి వీరికి అందే చెల్లింపుల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమైంది. ఒకొక్కరికి అందే డబ్బులు పది శాతం పెరిగినా ఆ దేశంలో పేదరికంలో ఉన్న వారి శాతం (వంద మందిలో పేదల సంఖ్య) 0.4 శాతం తగ్గుతుందని తేలింది. చెల్లింపుల డబ్బులతో పేదలు మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. పిల్లలను చదివించుకునేందుకూ వీలేర్పడుతోంది. ఆపత్కాలాన్ని కూడా తట్టుకుని వీరు బతకగలుగుతున్నారు. - (కంచర్ల యాదగిరిరెడ్డి) -
నిరుపేదలు, మధ్యతరగతిని మర్చిపోయిన కేంద్రం: రాహుల్
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుపేదలు, మధ్యతరగతిని మోదీ సర్కార్ మర్చిపోయిందన్నారు. పెట్టుబడిదారుల సంపద పెంచడంలో మునిగిపోయిన కేంద్రం మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తోందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ వేసే ఎత్తుల్ని సాగనివ్వమని రాహుల్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘టమాటా కేజీ రూ.140, కాలీఫ్లవర్ కేజీ రూ.80, కందిపప్పు కేజీ రూ.148, గ్యాస్ సిలిండర్ రూ.1100 పై మాటే. ధరలు ఇలా పెంచుకుంటూ పోతూ పెట్టుబడుదారుల ఆస్తుల్ని పెంచుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రయోజనాలనే విస్మరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారని అన్నారు. -
టిడ్కో ఇళ్ల పథకాన్ని బాబు ప్రభుత్వం గాలికొదిలేసింది
-
పేదల సొంతింటి కల సాకారం..ఉగాదికి సాముహిక గృహ ప్రవేశాలు
పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మెటీరియల్, సకాలంలో బిల్లులను కూడా చెల్లిస్తూ అండగా నిలుస్తోంది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు సొంతిళ్లలోకి చేరిపోయారు. తుదిదశకు చేరిన వాటిని ఉగాది పండుగ నాటికి పూర్తి చేయించి సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సాక్షి, పుట్టపర్తి: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగం పెరిగింది. పేదలు తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలను చేపట్టి వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో పడ్డ అవస్థలు తీరుతుండటంతో సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సొంతింటి కల సాకారం దిశగా పాలన సాగిస్తున్నారని లబ్ధిదారులు కొనియాడుతున్నారు. అవసరమైన నిధులు కేటాయింపులు జరిగేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి, బీడుపల్లి, జగరాజుపల్లి, ఎనుములపల్లి వద్ద జగనన్న కాలనీలు వెలిశాయి. అలాగే ధర్మవరం పట్టణ సమీపంలోని కాలనీలో చాలా ఇళ్లు నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయి. పనుల పరుగులు.. ప్రభుత్వ మార్గదర్శకాలతో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 168 జగనన్న లేఅవుట్లలో 24,643 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పేదలకు నివాసయోగ్యం కింద ఇల్లు మంజూరు చేశారు. జిల్లాకు సంబంధించి మొత్తం 62,716 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా.. మిగిలిన వాటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇబ్బందుల్లేకుండా చర్యలు.. ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు ఇంటి నిర్మాణానికి రూ.35 వేల రుణం బ్యాంకుల ద్వారా అందేలా చర్యలు చేపట్టారు. ఈ రుణంతో లబి్ధదారులు బయటి వ్యక్తుల ద్వారా అప్పులు చేయకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికితోడు ఇబ్బందిలేకుండా ఇసుక, మెటీరియల్ అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మౌలిక వసతుల కల్పన.. జిల్లా వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 168 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఆయా లేఅవుట్లలో విద్యుత్ లైన్లు, రహదారులు, కరెంటు మీటర్లు, తాగునీటి వసతుల కల్పన వంటి పనులు చేపట్టారు. ఫలితంగా కాలనీలు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు షహీనా. హిందూపురం పట్టణ సమీపంలోని మణేసముద్రం. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు అయింది. మెటీరియల్ దగ్గరి నుంచి బిల్లుల దాకా అన్ని విధాలా సహకారం లభించడంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేశామని షహీనా హర్షం వ్యక్తం చేశారు. ఈమె మల్లీశ్వరి. ధర్మవరం పట్టణం శాంతినగర్ వాసి. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించడంతో ఇంటి నిర్మాణం పూర్తయిందని మల్లీశ్వరి తెలిపారు. జగనన్న ప్రభుత్వంలోనే తమ సొంతింటి కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి ఇలా.. జిల్లాకు మంజూరైన ఇళ్లు 62,716 జగనన్న లేఅవుట్లు 168 నిర్మాణాలు పూర్తి చేసుకున్నవి 5,750 పైకప్పు పూర్తయినవి 3,713 పైకప్పు వరకు 2,742 పునాది వరకు 12,403 పునాది పనుల్లో.. 22,230 ప్రారంభం కానివి 15,878 (చదవండి: స్నేహితులని హామీ ఉన్నందుకు..చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని..) -
సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ
సంక్షేమ పథకాలూ, వాటిని అమలుచేసే ప్రభుత్వాలపై విమర్శ పెరిగింది. తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలు చేస్తున్నారనీ, అలగా జనానికి మా సొమ్ము ఖర్చవుతోందనీ, తమకు అన్యాయం జరుగుతోందనీ మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజల వాదన. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తి సంస్థలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, బియ్యం, ఉప్పు పప్పుల పన్నులు ఇలాంటివి. వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి చాలా పొందుతాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా, వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు. శ్రమ శక్తి మాత్రమే కలిగిన కార్మికులు సమాజ సౌకర్యాలను తక్కువ వాడుతారు. వాళ్ళు స్థానిక ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువ చేస్తారు. చదువుకోనివారు విద్యాలయాలను వాడరు. తులనాత్మకంగా ఆస్పత్రులను కూడా తక్కువ వాడుతారు. చదువరులు, అందులో వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తి విద్యలను అభ్యసించినవారు ఎక్కువగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. సమాజం నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించ వలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. అందుకే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము, మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న వీరి ప్రచారంలో వాస్తవం లేదు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలు, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తమ వాణిజ్యంలో ప్రజలకు భాగస్వామ్య కల్పనలో భాగంగా ప్రజల సొమ్మును సేకరిస్తారు. నామమాత్రపు సొంత డబ్బుతో లాభాలు సంపాదిస్తారు. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమ శక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, నిపుణత, ఉత్పత్తి స్థాయి, వారు పని చేసే సంస్థల యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి సాధనాలు. ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడేవారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు. సెల్ ఫోన్ రోజు కూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పని స్థలాల నిర్ణయంలో సహాయపడుతుంది. నగరాల్లో పనిస్థలాలకు చేరుకోడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసిందే. అటువంటి కార్యక్రమాలకు ఎవరూ అడ్డు తగలకూడదు. (క్లిక్ చేయండి: తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి.. లేకపోతే ఉద్యమమే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్‌లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్‌లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్‌ను మాత్రం ఔట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పడుకున్న కేసీఆర్‌ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు పడుకున్న కేసీఆర్‌ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
పేదల పట్ల జగన్ తీరును దగ్గరగా చూసిన వ్యక్తి నేను
-
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆల్విన్‌కాలనీ/భాగ్యనగర్‌కాలనీ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్, ఆల్విన్ న్కాలనీ, హైదర్‌నగర్, కూకట్పల్లి డివిజన్ల పరిధిలో పలువురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్దిపొందిన 14 మందికి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరు గాంచిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ యాదగిరి, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడ ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, హఫీజ్‌పేట్ అధ్యక్షుడు గౌతమ్‌గౌడ్, నాయకులు కాశీనాద్ యాదవ్, యాదగిరి గౌడ్, వెంకటేష్‌గౌడ్, దాత్రి గౌడ్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
అత్యాధునిక టెక్నాలజీతో అంతరిక్షయానం చేసి జయహో నరుడా అనిపించుకున్నప్పటికీ ఈ పేదరికం నుంచి బయటపడలేకపోవడవ బాధకకరం. కారణాలు ఏవైనా ప్రపంచ దేశాల్లో ఇంకా ఇప్పటికీ పేదరికంలో మగ్గిపోతున్న వాళ్లు ఎందెందరో అభాగ్యులు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసే కావలిసినవి సాధించుకున్నాం గానీ. ఇప్పటికీ పేదవాడు ఎప్పుడు ఆకలి పోరాటం చేస్తునే ఉన్నాడు. (చదవండి: బలశాలి బామ్మ) అయితే ప్రభుత్వాధి నేతలు, దేశాధి నేతలు ఎన్ని పథకాలను తీసుకువచ్చిన పేదవాడికి చేరకపోవడమే మింగుడుపడిన విషయంగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలనకై తీసుకోవల్సిన చర్యల పై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది. నేపథ్యం ఫ్రెంచ్ మతాధికారి, మానవతవాది అయిన జోసెఫ్ వ్రెసిన్స్కీ పేదరికంతో బాధితులను పట్ల వివక్షకు తావు లేకుండా వారిని గౌరవప్రదంగా చూడాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాదు పారిస్‌లోని ట్రోకాడోరోలో లక్షలాది మంది తన మద్దతుదారులతో కలిసి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ల సమస్యల దేశాధినేతలకు అర్ధమయ్యేలా ఒక ఉద్యమాన్ని తీసుకురావడమే కాక అక్టోబర్ 17, 1987న పారిస్ ప్లాజా ఆఫ్ లిబర్టీ మానవ హక్కుల స్మారక శిలను ఆవిష్కరించారు. పైగా ఆ శిలపై మహిళలు, పురుషులు పేదరికంలో ఉన్నారంటే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి అనే వాక్యాలను చెక్కించారు. ఈ క్రమంలో 1988లో జోసెఫ్ మరణాంతరం నాలుగు సంవత్సరాల తర్వాత 1992 డిసెంబర్ 22 ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలన కోసం ప్రపంచదేశాలన్ని ఏకతాటిపై కృషి చేయాలంటూ ఒక తీర్మానాన్ని తీసుకురావడమే కాక ఆమోదించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి పేదల కోసం ఆహర్నిసలు కృషి చేసిన జోసెఫ్ వ్రెసిన్స్కీని పేద ప్రజల తండ్రిగా కొనియాడుతూ ఆయన ఆవిష్కరించిన స్మారక శిల రోజునే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది థీమ్ "పేదరికాన్ని అంతం చేసేలా అందరూ కలిసి ముందుకు సాగాలి, ఈ భూమి పై నివశించే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించాలి" మళ్లీ పేదరికంలోకి నెట్టిన కోవిడ్ -19 మహమ్మారి..... 2020 లో ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి 88 నుండి 115 మిలియన్ల మంది ప్రజలను పేదరికంలోకి నెట్టిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు పేదరికం రేటు ఇప్పటికే ఉన్న దక్షిణ ఆసియా, ఉప-సహారా దేశాలలో అధికంగా ఉన్నట్లు తెలిపింది. పైగా ఈ సంవత్సరం పేదరికం ప్రపంచ దేశాల్లో 143 మిలయన్ల నుంచి 163 మిలియన్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ " ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పెద్ద విధ్వంసం సృష్టించింది. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) -
వర్షం పడిందంటే భయం భయంగా.. మొత్తం 290 మంది మృతి
సాక్షి, ముంబై: గడిచిన 29 ఏళ్లలో ముంబై నగరం, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో కొండచరియలు విరిగిపడిన సుమారు 290 మందికిపైగా మృతి చెంది నట్లు తెలిసింది. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో కొందరి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో వికలాంగులుగా మారారు. ఏటా ఇలాంటి ప్రమాదాలు జరగ్గానే కొండలపై, వాటి కింద గుడిసెల్లో ఉంటున్న పేద కటుంబాల అంశం తెరమీదకు వస్తుంది. ఆ తరువాత షరా మామూలే అవుతుంది. ప్రమాదం జరగ్గానే ఆగమేఘాల మీద మంత్రులు, ప్రభుత్వ, బీఎంసీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించడం, మృతు లకుటుంబాలకు సానుభూతి ప్రకటించడం, ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపేసుకుంటున్నా రు. అవసరమైతే గుడిసెలను ఖాళీచేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కనుగొనడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆదివారం ముంబైలో కురిసిన భారీ వర్షానికి వేర్వేరు సంఘటనలో దాదాపు 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అందులో కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య అధికంగా ఉంది. 25 నియోజకవర్గాల్లో ప్రమాదకర కొండలు.. 1991 నుంచి 2021 వరకు కొండచరియలు విరిగిపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఏకంగా 25 నియోజక వర్గాలలో ప్రమాదకర కొండలున్నాయి. ఇప్పటికే ఆ కొండలపై, వాటికి ఆనుకుని అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. కొండల కింద ప్రమాదకరంగా ఉన్న 22,483 గుడిసెల్లో 9,657 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి స్థలాంతరం చేయాలని ఇదివరకే ‘ముంబై జోపడ్‌పట్టి సుధార్ మండలి’ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదేవిధంగా మిగతా గడిసెలపై కొండ చరియలు విరిగిపడకుండా ఇళ్ల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని సిఫార్సు చేసింది. కానీ, ఇంతవరకు ప్రమాదకరంగా ఉన్న కొండలు, వాటికి ఆనుకున్న ఉన్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా కొండచరియలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. ఇదిలాఉండగా కొండ పరిసర ప్రాంతా ల్లోని మురికివాడల్లో నివాసముంటున్న పేద కుటుంబాలు స్వయంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. లేదంటే బలవంతంగా తరలించే ఏర్పాట్లు చేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం సంబంధిత అధికారులకు నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఏటా వర్షాకాలంలో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే ప్రమాదముంటుంది. కొండల కింద, కొండలపైన, చుట్టుపక్కల ఉన్న గుడిసెల్లో వేలాది కుటుంబాలున్నాయి. అందులో లక్షలాది మంది పిల్ల, పాపలతో నివాసముంటున్నారు. వర్షా కాలంలో పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు వచ్చి ఇళ్లపై పడతాయి. దీంతో వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు పేద కుటుంబాలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తారు. భారీ వర్షం కురి సిందంటే చాలు రాత్రులు నిద్ర లేకుండా గడుపుతా రు. దీంతో ప్రమాదం జరగకముందే సురక్షిత ప్రాం తాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. వర్షాకాలం భయం భయం.. ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల కొండలున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు భయంభయంగా బతుకీడుస్తారు. ముంబైలో మలబార్ హిల్, వర్లీ సీ ఫేస్, అంటాప్ హిల్‌లో ప్రాంతాల్లో, ఉప నగరాల్లో ఘాట్కోపర్, విద్యావి హార్, ఎం–తూర్పు వార్డు పరి«ధిలోని దిన్క్వారి మార్గ్‌పై గౌతం నగర్, పాంజర్పోల్, వాసి నాకావద్ద ఓం గణేశ్ నగర్, రాహుల్ నగర్, నాగాబాబా నగర్, సహ్యాద్రి నగర్, అశోక్ నగర్, భారత్‌నగర్ తదితరా ప్రాంతాల్లో కొండల కింద ఉంటున్న ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. లేదంటే బలవంతంగా తరలించాల్సి వస్తుం దని హెచ్చరించింది. అయినప్పటికీ బలవంతం గా అక్కడే ఉంటే ఆ తరువాతే జరిగే పరిణామాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి వారే బాధ్యులవుతారని హెచ్చరించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదానికి కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, బీఎంసీ ఎలాంటి బాధ్యత వహించదని పరిపాలనా విభాగం స్పష్టం చేసింది. అయినప్పటికీ వేలాది కుటుంబా లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే కా లం వెల్లదీస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరగడం పరిపాటిగా మారింది. #MumbaiRains UPDATE 20:30-18/7/21#VikhroliLandslide & #ChemburLandslide 🔸@5Ndrf OPS END 🔸After final search 🔸@ Both sites 🔸Chembur-21 dead 2 inj 🔸Vikhroli-10 dead 🔸All missing actd for 🔸@NDRFHQ prays for 🔸Departed souls@HMOIndia @PIBHomeAffairs @ANI @PIBMumbai pic.twitter.com/UFmiWrYStu — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) July 18, 2021 Landslide at Gholai Nagar in Kalwa, Thane district. 5 dead and 2 injured, Rescue and Search Operation is underway. #mumbairains #MumbaiRainUpdate #KalwaLandslide pic.twitter.com/rTwaKHza7H — Ankita Gupta (@ankitagupta102) July 19, 2021 Another land slide video coming from vikroli west parksite near kailash complex #MumbaiRains #MumbaiRainUpdate @IndiaWeatherMan @MumbaiRainApp @Mumbairain pic.twitter.com/XsfyAEePhN — Rahul Pandey (@scriberahul) July 19, 2021 -
అల్ప ఆదాయ వర్గాల కోసం ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ!
దినసరి ఆదాయం తక్కువగా ఉన్న కార్మికుల కోసం ఎల్ఐసీ ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకొచ్చింది. తక్కువ ఆదాయం గల వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీ తీసుకోని వచ్చింది. ఈ పాలసీ పేరే ఎల్ఐసీ మైక్రో బచత్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడానికి భారీ మొత్తం అవసరం లేదు. చాలా తక్కువ డబ్బుతో ఇందులో చేరవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఇది. ఎల్ఐసీ అంటే ఇప్పటికీ ప్రజల్లో నమ్మకం ఉంది. ఇది నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల రెండు బెనిఫిట్స్ పొందొచ్చు. రక్షణతోపాటు రాబడి కూడా లభిస్తుంది. ఆకారణం చేత పాలసీదారుడు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ డబ్బులు వస్తాయి. ఇంకా ఈ పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీ ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. 18 ఏళ్లు నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50 వేలకు పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.2 లక్షల మొత్తానికి పాలసీ పొందొచ్చు. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు కలిగిన వారు రూ.2 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఇప్పుడు సంవత్సరానికి రూ.10,320 ప్రీమియం చెల్లించాలి. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.2 లక్షలకు పైగా లభిస్తాయి. చదవండి: పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ -
పేదలకు ఆహార భద్రత.. రైతులకు కనీస మద్దతు ధర
సాక్షి, అమరావతి: పేదలు పస్తులుండకుండా.. ఆహార భద్రత ప్రమాదంలో పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. మరోవైపు మానవాళి మనుగడకు వ్యవసాయం కీలకమని గ్రహించి రైతుల పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తోంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఒకవైపు పేదలకు ఆహార భద్రత కింద భరోసా కల్పించడం.. మరోవైపు రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటంతో పేదలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం) ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,868 ప్రకారం కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వమే రైతుల కళ్లాల వద్దకు వెళ్లి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు.. ఆహార భద్రత చట్టం అమలుకు వేల కోట్లు ఖర్చు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకాడటం లేదు. వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు బియ్యం కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున కిలో రూ.1కే బియ్యం పంపిణీ చేస్తోంది. అంత్యోదయ అన్నయోజన కార్డున్న కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్వాడీల ద్వారా ఉచిత పౌష్టికాహారం అందిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) ప్రతి నెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఆహార భద్రత చట్టం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 1.52 కోట్లకు పైగా బియ్యం కార్డులున్నాయి. వీటి కోసం ప్రతి నెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రత చట్టం ప్రకారం.. పట్టణాల్లో 40 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం కార్డుదారులకు మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన వారికి సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. దీంతో ఏటా రూ.5 వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతోంది. కొనసాగుతున్న ఉచిత సరుకుల పంపిణీ కోవిడ్ సమయంలో ఉపాధి లేక పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నెలకు ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యం, కుటుంబానికి రెండు కిలోల పప్పు దినుసులు ఏప్రిల్ నుంచి ఉచితంగా పంపిణీ చేస్తోంది. బియ్యం కార్డుల్లో నమోదై ఉన్న 4.47 కోట్లకు పైగా కుటుంబ సభ్యులకు ఉచితంగా సరుకులు అందుతున్నాయి. ఇప్పటికే రూ.13 వేల కోట్ల విలువ చేసే బియ్యం, రూ.1,500 కోట్ల విలువ చేసే పప్పు దినుసులు పేదల ఇళ్లకు ఉచితంగా చేరాయి. ప్రస్తుతం 15వ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 20 నుంచి 16వ విడత ఉచిత సరుకులను పంపిణీ చేస్తారు. -
కోవిడ్ పేదలు వంద కోట్లు
న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం బారిన పడతారని, అందులోనూ దక్షిణాసియాలో భారీ స్థాయిలో పేదలుగా మిగులుతారని ఓ సర్వేలో తేలింది. కింగ్స్ లండన్ కాలేజీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ కలసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వే నివేదిక తాజాగా వెల్లడైంది. 100 కోట్ల మంది కలసి రోజుకు 50 కోట్ల డాలర్ల రాబడి కోల్పోతున్నారని నివేదిక పేర్కొంది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే దిగజారవచ్చని తెలిపింది. దక్షిణాసియాలో భారీగా పేదలు పెరగనున్నారని పేర్కొంది. భారత్, సబ్ సహారన్ ఆఫ్రికాలోనే పేదరికం 30 శాతం వరకూ ఉంటుందని నివేదిక వెల్లడించింది. తూర్పు ఆసియా, పసిఫిక్, చైనాలు కలిపి 41 శాతం పేదలకు ఆవాసాలుగా మారనున్నాయంది. అల్పాదాయ దేశాలైన నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇండోనేíసియాలు కలిపి 18 శాతం పేదరికాన్ని చవి చూస్తాయని అంచనా వేసింది. డీఆర్ కాంగో, టాంజానియా, పాకిస్తాన్, కెన్యా, ఉగాండా, ఫిలిప్పీన్స్ దేశాలు 11–12 శాతం పేదలకు కేంద్రాలుగా ఉంటాయని తెలిపింది. అత్యంత నిరుపేదలు ఉండే దేశాల్లో ఇథియోపియా, భారత్, నైజీరియా దేశాలు టాప్ 10లో ఉంటాయంది. -
పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగం, లాక్డౌన్ పొడిగింపు పరిణామాలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ట్విటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్నక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని స్వాగతించిన చిదంబరం, పేదలు, వలస, రోజువారీ కార్మికుల జీవనోపాధి, మనుగడపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను ప్రకటించేముందు ప్రధాని మోదీ పేదల జీవనంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.ఈ సంక్షోభ సమయంలో పేదలకు కనీస నగదు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, అదే మొదటి ప్రాధాన్యతగా వుండాల్సి వుందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన మండి పడ్డారు. డబ్బు, ఆహారం ఉన్నా ప్రభుత్వం పేదలకు కేటాయించడంలో సుముఖత చూపలేదు. దీంతో వారి జీవితాలు, మనుగడ లాంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేవని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీంతో పేదలు 21+19 రోజులు ఆకలితో అలమటిస్తూ లాక్డౌన్ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. నా ప్రియమైన దేశమా శోకించు అని ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని నాల్గవసారి జాతికిచ్చిన సందేశంలో కొత్తగా ఏమీలేదని మాజీ ఆర్థికమంత్రి విమర్శించారు. లాక్డౌన్ సంక్షోభం నుంచి పేదలు ఎలా బయటపడతారనే దాని గురించి ప్రధాని ఏమీ చెప్పలేదు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన ఆర్థిక సాయంపై ఎలాంటి స్పందన లేదు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా అదనంగా జోడించలేదని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన చర్యలేవీ మోదీ ప్రస్తావించలేదని నిరాశ వ్యక్తం చేశారు. రాష్ట్రాలు రుణాలు తీసుకుంటే, ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం, కేంద్రం అప్పు తీసుకొని రాష్ట్రాలకు రుణాలు ఇవ్వాలని చిదంబరం సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా, జీన్ డ్రేజ్, ప్రభాత్ పట్నాయక్, అభిజిత్ బెనర్జీ లాంటి ఆర్థిక నిపుణుల సలహాలేవీ ప్రధాని చెవికి చేరకపోవడం శోచనీయమన్నారు. (కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం) కాగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. పౌరులు సహకరించి క్రమశిక్షణను కొనసాగిస్తేనే కోవిడ్-19 వ్యతిరేక పోరాటం విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) The poor have been left to fend for themselves for 21+19 days, including practically soliciting food. There is money, there is food, but the government will not release either money or food. Cry, my beloved country. — P. Chidambaram (@PChidambaram_IN) April 14, 2020 -
సాఫ్ట్వేర్ ఉద్యోగి సగం జీతం పేదలకే..
సాక్షి, తిరుమలగిరి (నాగార్జునసాగర్) : సొంతలాభం కొంత మానుకో పొరుగువారికి తోడ్పడవోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. దీనిని అక్షరాల నిజం చేస్తున్నాడు తిరుమలగిరి మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కట్టెబోయిన అనిల్‌కుమార్ యాదవ్. మంచి మనస్సు ఉంటే పొరుగువారికి సాయం అందించడం కష్టమేమి కాదని నిరూపిస్తున్నాడు. ఆయనది దిగువ మధ్య తరగతి కుటుంబం. తన తల్లిదండ్రులు కూలిపనులు చేస్తూ అనిల్‌ను ఉన్నత చదువులు చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఒమ్ముచేయకుండా పట్టుదలతో చదివిన అనిల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫ్యాక్‌సెట్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్నాడు. తాను సంపాదించిన దానిలో కొంచమైనా తనను ప్రయోజకుడిని చేసిన పాఠశాలకు, గ్రామానికి, నేటికీ మౌలిక వసతులకు దూరంగా ఉన్న పాఠశాలలకు, నిరుపేద విద్యార్థులకు పంచాలనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పమే నేడు వేల మంది విద్యార్థులకు సాయం చేసేలా చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు అనిల్. చిన్ననాటి నుంచే తాపత్రయం.. సమాజం మనకు ఏమిచి్చందనే ఆలోచనతో కాకుండా మనం సమాజ వికాసానికి ఏం చేస్తున్నామనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు. మనకున్న దానిలో కొంతైనా ఇతరులకు సాయం చేయాలని అనిల్ చిన్ననాటి నుంచే తాపత్రయపడుతుండేవాడు. దీనిలో భాగంగానే 2011 తన స్వగ్రామమైన శిల్గాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన సొంత డబ్బులతో నోట్‌బుక్స్, బ్యాగులు, పెన్నులు, పెన్సిల్, టైబెల్ట్లతోపాటు వివిధ రకాల సామగ్రిని అందజేశాడు. ఈ క్రమంలోనే మరికొంత మంది పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఆలోచనతో తాను పనిచేసే ఫ్యాక్‌సెట్ కంపెనీని భాగస్వామ్యం చేసి తన గ్రామంతోపాటు కొంపల్లి, తిరుమలగిరి, ఎల్లాపురం, ఎల్లాపురంతండా, ఆంజనేయతండా, చల్మారెడ్డిగూడెం, అనుములచ శ్రీరాంపల్లి, ఊట్లపల్లి, పులిచర్ల, వెనిగండ్ల, ముప్పారం, గుడిపల్లి, నేరేడుచర్ల నాయనేనికుంట, బొత్తలపాలెం, తెప్పలమడుగు తదితర గ్రామాల్లోని పాఠశాలలకు బీ రువాలు, నోట్‌పుస్తకాలు, బెంచీలు తదితర వస్తువులతోపాటు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు, పాఠశాలల్లో దంత వైద్యపరీక్షలు చేయించి ఉచితంగా బ్రెష్‌లు, పేస్టులు అందజేశారు. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం.. వీటితోపాటు పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన ప్రతి ఏటా నగదు ప్రో త్సాహకాలు అందజేస్తున్నారు. తనకున్న అనుభవాలను, చదువులో ఎలాంటి మెళకువలు నేర్చుకొని జీవితంలో ముందుకు సాగాలనే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు. నేను సంపాదించిన దాంట్లో సగం పేదలకు ఖర్చుచేయాలని నిర్ణయించుకున్నా. అందులో భాగంగానే ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్‌బుక్, లైబ్రరీ, బెంచీలు తదితర సామగ్రిని అందజేశా. నాతోపాటు నేను పనిచేసే సంస్థను కూడా భాగస్వామ్యం చేసి, ఎక్కువ మంది విద్యార్థులకు సాయపడుతున్నాం. భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ మందిని, సంస్థలను భాగస్వామ్యం చేసి నిరుపేద విద్యార్థులకు సాయ పడుతాం. – కట్టెబోయిన అనిల్‌కుమార్ యాదవ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి -
‘సీఎం జగన్ మరో రికార్డు సాధిస్తారు’
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు లబ్ధిదారులను గుర్తిస్తున్నామని.. ఇప్పటివరకు 13 జిల్లాల్లో 20.50 లక్షల లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని.. గ్రామాల్లో 8.5 లక్షలు, పట్టణాల్లో 7 లక్షల లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులను 5 లక్షల మందికి పైగా గుర్తించామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కోసం రూరల్ ప్రాంతాల్లో 19 వేలు, పట్టణాల్లో 2,500 వేల ఎకరాలను గుర్తించామని..ఇంకా 19వేల ఎకరాలు భూమి అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. దాదాపు 10వేల ఎకరాల్లో భూమిని సమీకరిస్తున్నామని వెల్లడించారు. ఒకేసారి లక్షల సంఖ్యలో పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అవుతుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కచ్చితంగా రికార్డు సాధిస్తారని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
పేదలకూ టౌన్షిప్
సాక్షి, తిరుపతి : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి అభివృద్ధిపై వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుపతి నగరాన్ని విస్తరించడంతో పాటు మంచినీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొట్టచేతబట్టుకుని వలస వచ్చిన వారందరికీ టౌన్‌షిప్‌లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహకారంతో తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వీసీ గిరీషా రంగంలోకి దిగారు. అందులో భాగంగా తుడా కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. జేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు. వారి నుంచి తిరుపతి, తుడా అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, తుడా మాజీ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నగరంలో మంచినీటి సమ స్య పరిష్కారానికి శాశ్వత ప్రణాళికలు రూపొందించనున్నారు. కపిలతీర్థం నుంచి వృథాగా వెళ్లే నీటిని ఒడిసి పట్టాలని నిర్ణయించారు. భూ గర్భ జలాలు మెరుగుపరిచేందుకు ఆక్రమణలకు గురైన చెరువులను అభివృద్ధి చేయనున్నారు. తుడా పరిధిలో విస్తారంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. నగరంలో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మరిన్ని ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శెట్టిపల్లి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు శెట్టిపల్లివాసులు కొన్నేళ్లుగా భూ సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడున్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అక్రమార్కులు కొందరు ఒకే ప్లాటును ముగ్గురు, నలుగురుకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీంతో సమస్యలు తీవ్రమయ్యాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక తుడా ఆధ్వర్యంలో శెట్టిపల్లివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. దేశంలోనే అత్యాధునికి టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆరు నెలల్లో శెట్టిపల్లివాసుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయం నుంచి పద్మావతి ఫ్లోర్మిల్లుకు వెళ్లే మార్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెయ్యనున్నారు. రైల్వేగేటు వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించాలని, అది పూర్తయితేనే రింగ్‌రోడ్డు సంపూర్ణమవుతుందని తుడా చైర్మన్ వెల్లడించారు. అత్యాధునికమైన టౌన్‌షిప్‌లు సూరప్పకశం, కరకంబాడి వద్ద ఉన్న తుడా భూముల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని వసతులతో ఈ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చెయ్యనున్నారు. బస్‌స్టేషన్, కళాశాల, పాఠశాలలు, సినిమా థియేటర్లు, పార్క్‌లు వంటి సకల సౌకర్యాలతో టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. తిరుపతి–శ్రీకాళహస్తి, చంద్రగిరి–తిరుపతి మధ్యలో కూడా టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజకీయ నాయకులు సూచించారు. అందుకు ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. తిరుపతికి వలస వచ్చిన వేలాది మంది నివాసాలు లేక అద్దె ఇళ్లల్లో ఉన్న విషయాన్ని తుడా చైర్మన్ ప్రస్తావించారు. అర్హులైన వారికి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నివాస స్థలాలు మంజూరు చేయడం లేదా ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి గృహ సముదాయాన్ని నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నారు. రుయాలో మరో అత్యవసర విభాగం రుయాకు రాయలసీమ జిల్లాల నుంచి వేలాది మంది రోగులు, క్షతగాత్రులు వస్తుంటారు. రుయాలో ఒక్కటే అత్యవసర విభాగం ఉండటంతో ఆస్పత్రికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని రుయాలో మరో అత్యవసర విభాగాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. అందుకు తుడా పూర్తి సహకారం అందిస్తుందని చైర్మన్ చెవిరెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుదారులు చెట్ల కింద వేచి ఉండేపని లేకుండా ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రాలను నిర్మించనున్నారు. అక్కడ వారికి మంచినీరు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఇలా తుడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం, సూచనలు తీసుకునేందుకు తుడా ఆధ్వర్యం లో మూడు నెలలకోసారి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ నాయకుడు, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్‌కుమార్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు కందారపు మురళి, వందవాసి నాగరాజ, రామానాయుడు, పెంచలయ్య పాల్గొన్నారు. -
పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తాం
సాక్షి, పెడన: సొంత ఇల్లు లేని ప్రతిపేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తామని, తన సొంత ఇంటి కలను నేరవేరుస్తామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారం కట్టబెట్టాలని ఆ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం 8వ వార్డులో ‘గడపగడపకు వైఎస్సార్’ ద్వారా నవరత్నాలకు సంబం దించిన సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. తొలుత విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని, ఇప్పుడు ఆయన తనయుడు పేదలను ఆదుకోవడానికి మీ ముందకు వచ్చారన్నారు. వైఎస్సార్ సీపీని ఆదరించి నవరత్నాలు గురించి చెబుతూ ఫ్యాన్ గుర్తు ద్వారా అధికారం కట్టబెట్టాలని కోరారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబునాయుడికి తగిన గుణపాఠం చెప్పాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే డ్వాక్రా రుణమంతా ఒకేసారి మాఫీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీల్లోని అక్కాచెల్లెళ్లకు 45 సంవత్సరాలకే వైఎస్సార్ చేయూత ద్వారా రెండో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలపాటు విడతల వారీగా రూ.75వేలు ఉచితంగా కార్పొరేషన్ ద్వారా ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు.. పేద పిల్లలు ప్రాథమిక స్థాయిలో ఏటా రూ.15వేలు ఉపకారవేతనం అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20వేలు ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు ఇంటిని కట్టించి ఇచ్చే బాధ్యత నాదంటూ ముస్లింలకు హామీ ఇస్తూ నవరత్నాల కరపత్రాలను అందజేస్తూ ముందుకు సాగారు. పింఛను వయస్సు 65 నుంచి 60 తగ్గించడమే కాకుండా రూ.3వేలు ఇస్తామన్నారు. నవరత్నాలు గురించి పూర్తిగా తెలుసుకుని మరిచిపోకుండా వైఎస్సార్సీపీని గుర్తుపెట్టుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తామని, రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామన్నారు. నవరత్నాలు వంటి మంచి పథకాలు అమలు అయ్యేం దుకు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మీపై ఉందని చెబుతూ ముందుకు కదిలారు. ఈయనతో పాటు పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మున్సి పల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపీప్రసాద్, పిచ్చిక సతీష్, గరికిముక్కు చంద్రబాబు, దొంతుమాధవి, పోతర్లంక నాని, ముస్లిం మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్, భళ్ల గంగయ్య, బట్ట దివాకర్, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి మహంకాళరావు, వార్డు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎజెండా..
సాక్షి, పాన్‌గల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మెనిఫెస్టోను రూపొందించిందని డీసీసీ సభ్యులు రాంమూర్తినాయుడు, బీసీ సెల్ జిల్లా నాయకులు యుగంధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని రేమద్దుల, గోప్లాపూర్, కిష్టాపూర్, శాగాపూర్ గ్రామాలల్లో మెనిఫెస్టో కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదు పర్యాయాలు పనిచేసిన జూపల్లి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్ఎస్కు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్లు పెంపు, రేషన్ ద్వారా సన్నబియ్యం, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు వంటి పథకాలు అమలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, ప్రతాప్‌రెడ్డి, వహీద్, దామోదర్‌రెడ్డి, రాముయాదవ్, రమేష్, వెంకట్, నర్సింహ్మ, కృష్ణతేజ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించండి చిన్నంబావి: పేదల అభ్యున్నతికి కృషి చేసిన కాంగ్రెస్‌ను గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బీరం హర్షవర్దన్‌రెడ్డి సతీమణి విజయమ్మ కోరారు. శుక్రవారం ఆమె మండలంలోని దగడపల్లి, అమ్మాయిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. నిరుద్యోగభృతి, ఏడాదికి ఆరు సిలిండర్లు, రైతు రుణమాఫీ తదితర కార్యక్రమాలు అమలవుతాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, చిదంబర్‌రెడ్డి, లొంకహర్షవర్ధన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా కిరణ్‌కుమార్, సాయిబాబు. మల్లికార్జున్, ఆంజనేయులు, వేంకటస్వామి, చక్రధర్గౌడు. శంకర్ పాల్గొన్నారు. -
బాల కార్మికులు లేని సమాజం కోసం..
‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ.) జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినంగా జరపాలని తీర్మానించింది. పిల్లలను దొంగ తనంగా రవాణా చెయ్యడాన్ని ఆపడం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం బాలకార్మికులు బడిబాట పట్టేలా చూడటం ఈ దినోత్సవ లక్ష్యం. 2002 నుంచి ప్రతియేటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అభి వృద్ధి చెందిన దేశాలలో కూడా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 27.6 కోట్ల మంది పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారని సర్వేలు, గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు అనాధలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలవల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు. కర్మాగారాలలో, హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్లు, వీధులలో బాల కార్మికులు కని పిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడు తున్నా ఫలితాలు శూన్యం. సరైన సమయానికి తిండి దొరకక పస్తులు ఉంటూ రోగాలపాలవుతున్నారు బాల కార్మికులు. వీధులలో తిరుగుతూ పడేసిన వాటర్ బాటిళ్లు, చిత్తు కాగితాలు, కవర్లు ఏరుకుంటూ జీవితం గడుపుతు న్నారు. గ్రామాలలో బడి ఈడు గల పిల్లలు బడికి వెళ్లకుండా పశువులను మేపడానికి వెళ్లడం, లారీలు, ట్రాక్టర్లు, ప్రైవేటు బస్సులలో క్లీనర్లుగా పనిచేస్తూ బాల కార్మికుల సంఖ్య పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నారు. చట్టాలను అమలు చేస్తున్న నాయ కుల ఇళ్లలో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు పత్రిక లలో కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వివిధ దేశాలలో బాల కార్మి కుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమా జంలో భాగస్వాములైన మనమందరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. బాల కార్మి కులతో మాట్లాడి పాఠశాలల్లో చేర్పిద్దాం. అనాథ లైన బాల కార్మికులను ప్రభుత్వ వసతి గృహాలలో ఉండేలా ప్రవేశం కల్పిద్దాం. దేశ అభివృద్ధికి అవరో ధంగా నిలుస్తున్న బాలకార్మిక వ్యవస్థను తరిమి కొట్ట డానికి ప్రతి ఒక్కరం ముందుకు వద్దాం. (నేడు ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం) కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘ మొబైల్ : 98484 45134 -
కేటాయింపు బారెడు.. వ్యయం మూరెడు
సాక్షి, అమరావతి: పేదలు, రైతులు, పారిశ్రామిక రంగాలకు చెందిన ఆస్తుల కల్పన వ్యయంలో భారీగా కోతలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు కమీషన్లు దండుకునే సాగునీటి రంగ వ్యయాన్ని మాత్రం భారీగా పెంచేసింది. అంతే కాకుండా గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, యువత, వైద్య రంగాల కేటాయింపుల్లోనూ కోతలు విధించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు, సవరించిన అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. బడ్జెట్ కేటాయింపులకు, వాస్తవ వ్యయానికి పొంతన లేని విషయం దీంతో స్పష్టమైంది. ప్రధానంగా క్యాపిటల్ వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి సంబంధించి కేటాయింపులను సవరించిన అంచనాల్లో భారీగా తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యాపిటల్ పద్దులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఆస్తుల కల్పన కోసం 1,126.92 కోట్ల రూపాయలను కేటాయించగా.. సవరించిన అంచనాల్లో రూ.742 కోట్లకే పరిమితం చేశారు. అలాగే రైతులకు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు క్యాపిటల్ పద్దులో రూ.300.53 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో రూ.226.47 కోట్లకు కుదించారు. పారిశ్రామిక రంగానికి క్యాపిటల్ పద్దులో రూ.383.01 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో రూ.71.01 కోట్లకే పరిమితం చేశారు. అలాగే రవాణా రంగంలో సవరించిన అంచనాల్లోనూ రూ.200 కోట్లకు పైగా కోత పెట్టారు. ఇతర రంగాలకు క్యాపిటల్ పద్దులో రూ.818 కోట్లను కోత పెట్టారు. క్యాపిటల్, రెవెన్యూ పద్దులు కలిపి సంక్షేమ రంగానికి సవరించిన అంచనాల్లో రూ.652 కోట్లు కోత విధించారు. అలాగే క్యాపిటల్, రెవెన్యూ పద్దుల్లో కలిపి పట్టణాభివృద్ధి రంగానికి సవరించిన అంచనాల్లో కేటాయింపులను బాగా తగ్గించేశారు. గ్రామీణాభివృద్ధి, ఇంధన, పరిశ్రమలు, రవాణా, సాధారణ విద్య, యువజన, క్రీడలు, సాంకేతిక విద్య, వైద్య, కుటుంబ సంక్షేమం తదితర రంగాల కేటాయింపుల్లోనూ సవరించిన అంచనాల్లో కోతలు విధించారు. మరోపక్క సాగునీటి పనుల అంచనాలతో పాటు బడ్జెట్ కేటాయింపులను కూడా భారీగా పెంచేశారు. ప్రభుత్వ పెద్దలకు కమీషన్ల రూపంలో ఈ రంగం నుంచి భారీగా ప్రయోజనం కలుగుతున్నందునే ఈ రంగానికి కేటాయింపులు, సవరించిన అంచనాల్లో రూ.2వేల కోట్ల మేర పెంచేశారని, మిగతా రంగాల నుంచి కమీషన్లు రానందునే ఆ రంగాల్లో కోతలు విధించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
అక్రమ దందా
పేదల ఇళ్లను అడ్డుపెట్టుకుని కాసుల పంట పండించుకుంటున్నారు.. మౌలిక వసతుల కోసం మంజూరైన నిధులు బొక్కేయాలని చూస్తున్నారు.. ప్రారంభోత్సవం పేరుతో అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేటలో గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమార్కుల దందాపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట: గృహకల్ప ఇళ్లలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గూడు లేని పేద, దిగువ మధ్యతరగతి వారి కోసం నిర్మించిన గృహాలూ వారి దోపిడీకి వరప్రదాయనిగా మారాయి. మరోవైపు తాగునీరు, పక్కా రోడ్లు వంటి మౌలిక వసతులు సమకూర్చకుండానే గృహసముదాయానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి ప్రారంభోత్సవం నిర్వహించటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇళ్లు పూర్తయినా... 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం సమీపంలో ఎన్ఆర్టీ రోడ్డు పక్కన సొంత ఇళ్లు లేని వారి కోసం రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా అపార్ట్మెంట్ల తరహాలో మూడు బ్లాకులుగా 72 గృహాల నిర్మాణం ప్రారంభించారు. లబ్ధిదారు వాటాగా రూ.8250, ప్రభుత్వ సబ్సిడీ రూ.10 వేలు, బ్యాంకు రుణం రూ.74,250గా నిర్ణయించి ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అయితే తలుపుల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అదే ప్రాంగణంలో 2008లో ఇందిరమ్మ ఇళ్లు జీ ప్లస్ 2 ప్రాతిపదికన ఎనిమిది బ్లాకులుగా 192 గృహాలు నిర్మించేందుకు అనుమతి లభించింది. వాటిని పేద, దిగువ మధ్యతరగతి ఆర్యవైశ్యులకు కేటాయించారు. అయితే బ్యాంకు రుణాలు అన్ని ఇళ్లకూ లభించకపోవటంతో ఒక్కో బ్లాకుకు 24 ఇళ్ల చొప్పున 120 ఇళ్ల నిర్మాణం శ్లాబుల వరకు పూర్తయి ఆగిపోయింది. మరో 72 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. వీటిలో ఇళ్ల నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.28 లక్షలుగా నిర్ణయించగా లబ్ధిదారు వాటాగా మొత్తం 192 మంది రూ.20 వేల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని అప్పటి ప్రభుత్వమే కేటాయించింది. వైఎస్సార్ మరణంతో గృహ నిర్మాణం మధ్యలో నిలిచిపోవటంతో రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ జీ ప్లస్ 2 లబ్ధిదారులు కలిసి బాపూజీ పౌరసేవా కేంద్రంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు, పాలకుల చుట్టూ అనేక పర్యాయాలు తిరిగారు. అనంతరం రూ.3.85 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో రాజీవ్ గృహకల్ప 72 ఇళ్లు, ఇందిరమ్మ జీ ప్లస్ 2కు సంబంధించిన 120 ఇళ్లు వెరసి మొత్తం 192 ఇళ్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి ఇవ్వాల్సి ఉంది. వసూళ్ల పర్వం ఇలా... లబ్ధిదారులే ఒక సంఘంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి కోసం కృషి చేయగా, నిధులు మంజూరైన అనంతరం లబ్ధిదారు కూడా కాని టీడీపీ పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు, మంత్రికి అనుంగు అనుచరుడైన వెల్లంపల్లి రవిశంకర్ అధ్యక్షుడు గృహ సముదాయం పేరును ఆదర్శ గృహకల్ప, ప్రత్తిపాటి నగర్‌గా మార్చేశారు. గృహ ప్రవేశాలకు ఖర్చులు అవుతాయంటూ 192 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.5 వేలు చొప్పున చెల్లించాలని చెప్పారు. సొమ్ము ఎందుకు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు ప్రశ్నించటంతో ఒక్కొక్కరు రూ.2500 చొప్పున చెల్లించాలని అందరికీ ఫోన్ మెసేజ్‌లు పెట్టి మరీ వసూలు చేశారు. బ్యాంకు రుణం ఇవ్వకపోయినా... జీ ప్లస్ 2 గృహాలకు సంబంధించి 120లో 96 గృహాలకు మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. మిగిలిన 24 ఇళ్లకు రుణాలు మంజూరు కాలేదు. రుణాలు మంజూరైన 96 మంది వన్‌టైం సెటిల్మెంట్గా ఒక్కొక్కరు రూ.26 వేల చొప్పున ఆయా బ్యాంకులకు ఇప్పటికే చెల్లించేశారు. రుణం మంజూరుకాని 24 ఇళ్లు కూడా అంతకు ముందే శ్లాబు దశ వరకు పూర్తయి ఉండటంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దీంతో 96 మంది లబ్ధిదారులు బ్యాంకుకు రూ.25 వేలు చెల్లించిన విధంగా తమకూ చెల్లించాలని ఆదర్శ గృహకల్ప అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న మంత్రి అనుచరుడైన టీడీపీ నాయకుడు వెల్లంపల్లి రవిశంకర్ డిమాండ్ చేస్తున్నాడని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తం 24 మంది వద్ద నుంచి రూ.6 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇలా అక్రమంగా వసూలు చేసిన డబ్బు ఎవరి కొంగున ముడిపడతాయన్నది జగమెరిగిన సత్యమేనని మండిపడుతున్నారు. మౌలిక వసతులేవీ? ఆర్భాటంగా ప్రారంభించిన ఆదర్శ గృహకల్పలో మౌలిక వసతులు సమకూరలేదు. మంచినీటి పైపులైన్ కూడా ఏర్పాటు చేయలేదు. పక్కా రోడ్లు నిర్మించలేదు. విద్యుత్ పనులు పూర్తికాలేదు. దీనిపై లబ్ధిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు కట్టమంటున్నారు జీ ప్లస్ 2 గృహ సముదాయంలో బ్యాంకు రుణం లేకుండా ఇల్లు వచ్చింది. బ్యాంకు రుణం తాలూకు డబ్బులు తమకు చెల్లించాల్సిందిగా వెల్లంపల్లి రవిశంకర్ అడుగుతున్నాడు. అసలు రుణం మంజూరుకాకుండా డబ్బులు ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వ శాఖల రసీదు ఉంటే కడతానన్నాను. – కొత్త వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు తాళాలు ఇవ్వలేదు ప్రారంభ ఖర్చులకని రూ.2500 అడిగారు. నేను మసాలా బండి వేసుకొని జీవనం వెళ్లదీస్తాను. డబ్బులు ఇవ్వలేనన్నాను. దీంతో రవిశంకర్ నాకు తాళాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బులు చెల్లిస్తేనే ప్లాటు తాళాలు ఇస్తామంటున్నారు. – కె.వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు డీడీ చెల్లించాం జీ ప్లస్ 2లో ఇంటి కోసం నా భార్య జయలక్ష్మి పేరున రూ.20 వేలు డీడీని 2008లో చెల్లించాం. మాకు అప్పట్లోనే ప్రభుత్వం స్థల కేటాయింపు పత్రం ఇచ్చింది. అయితే మాకు ప్లాటు రాలేదు. ఇళ్లు నిర్మించని 72 మంది జాబితాలో మా పేరు ఉంది. మా డబ్బు, ఇంటి స్థలం ఏమైనట్టు? – పోలిశెట్టి సాంబశివరావు, లబ్ధిదారుడు -
నిరుపేదలకు అండగా ప్రభుత్వం
దిలావర్పూర్(నిర్మల్): ఆడపిల్లల వివాహానికి ఆర్థికసాయం అందిస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్డీవో ప్రసూనాంబా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆడపిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయా లని సూచించారు. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రిని రైతులు సన్మానించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పాల్దె లక్ష్మి, సర్పంచ్ నంద అనిల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మండల కన్వీనర్ రాజేశ్వర్, నాయకులు రమణారెడ్డి, సంభాజీరావు, నర్సారెడ్డి, రేఖ, కవిత, రవి, నర్సయ్య, భూమన్న, మనేశ్, సుధాకర్‌రెడ్డి, గుణవంత్‌రావు, అనిల్, గంగారాం, భుజంగ్‌రావు, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల కోసం బ్యాంక్
సాక్షి, డెహ్రాడూన్: ఆపన్నులకు సాయం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. పేదలకు సేవ చేసే సదాశయంతో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ హ్యాపీనెస్ ఏర్పాటైంది. పేదలు, అణగారినవర్గాలకు చేయూత అందించేందుకు ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేశానని, ఎవరైనా తమ పాత, కొత్త బట్టలను డొనేట్ చేయవచ్చని, బ్యాంక్ కన్వీనర్ ప్రవీణ్ భట్ చెప్పారు. కార్మికులు, కాయకష్టం చేసుకునే పేద వర్గాలు సంతోషంగా జీవించేందుకు సహాయం చేసే ఉద్దేశంతోనే బ్యాంకును ఏర్పాటు చేశామని భట్ అన్నారు. తనకు పలు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. డెహ్రాడూన్, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచీ విరాళాలు సమకూరుతున్నాయని చెప్పారు. -
మళ్లీ ‘మైక్రో’.. గద్దలు!
కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని వందలాది కుటుంబాలు ఇలా మైక్రోఫైనాన్స్ ఊబిలో చిక్కి నరకయాతన పడుతున్నారు. 3 నెలల వ్యవధిలో కోరుట్లలోని అల్లమయ్యగుట్ట కాలనీ, కథలాపూర్ మండలం కల్వకోట గ్రామా ల్లో ఇదే రీతిలో మైక్రోఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టినా మార్పులేదు. పేదల కాలనీలు లక్ష్యంగా ‘మైక్రో గద్దలు’ జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో యథేచ్ఛగా వడ్డీలకు డబ్బులు ఇస్తూ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. టార్గెట్.. స్లమ్ ఏరియాలు.. ఏపీలోని పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొంత మంది నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాలుగా మైక్రోఫైనాన్స్‌లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతులు లేకుండా.. కనీసం మనీ లెండింగ్ లైసెన్సులు లేకుండా అడ్డగోలు వడ్డీలకు అప్పులు ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలను టార్గెట్‌గా చేసుకుని బ్యాంకులు.. ఇతరత్రా సంస్థల నుంచి అప్పులు పుట్టని పేదలకు అప్పుల ఎర వేస్తారు. ఇదీ.. అప్పు తీరు పట్టణ ప్రాంతాల్లోని పేదలు నివాసముండే కాలనీల్లో రోజువారీ పనిచేసుకునే మహిళలను పది మందిని గ్రూపుగా ఏర్పాటుచేస్తారు. ఈ గ్రూపులో ఒక్కొక్కరికి అప్పుగా రూ.5 వేల నుంచి 25 వేలవరకు ఇస్తారు. అప్పు తీసుకున్న వారిలో ఏ ఒక్కరు డబ్బులు చెల్లించకున్నా గ్రూపులోని మిగిలినవారు ఆ డబ్బులు చెల్లించాలన్న నిబంధన పెడతారు. అప్పు ఇవ్వడానికి ముందే వడ్డీ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత వారానికి ఓసారి వచ్చి డబ్బులు వసూలు చేసుకుంటారు. రూ.12వేలు వడ్డీకి తీసుకున్న వారు మూడు నెలల్లో రూ. 14,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వడ్డీ రూ.8 శాతం వరకు పడుతోంది. ఒకవేళ మూడు నెలల్లోగా తీసుకున్న అప్పు తీర్చని వారికి మిగిలిన డబ్బులతో కలుపుకుని మళ్లీ అప్పు ఇస్తారు. ఇలా వరసబెట్టి అప్పు మీద అప్పులు ఇస్తూ అడ్డగోలు వడ్డీతో తీరని రుణాలను మిగుల్చుతారు. ఇక వసూళ్ల కోసం పగలు..రాత్రి తేడా లేకుండా ఇళ్లకు వచ్చి మహిళలను వేధిస్తారు. ఈ రీతిలో రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు రాత్రి వేళ తన ఇంటికి వచ్చి వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేశారు. నియంత్రణ కరువు.. అప్పుల పేరిట పేదలను వడ్డీల ఊబిలోకి దించుతున్న మైక్రోఫైనాన్స్ నిర్వాహకులపై నియంత్రణ కరువైంది. మూడు నెలల క్రితం కోరుట్లలోని అల్లమయ్యగుట్టకాలనీలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మైక్రోఫైనాన్స్ నిర్వాహకులపై కేసు పెట్టి అరెస్టు చేశారు. అయినా, ఎప్పటిలాగే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కోరుట్ల లోని మాదాపూర్ కాలనీలో సుమారు నాలుగేళ్లుగా 120 మంది మహిళలు మైక్రో ఉచ్చులో పడి ఆందోళన చెందుతున్నారు. మెట్పల్లి, జగిత్యాల పట్టణాల్లోనూ రెండు కాలనీల్లో మైక్రో నిర్వాహకులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ పేదలను అప్పుల ఊబిలోకి దించుతున్నట్లు సమాచారం. అప్పు కట్టాలని సతాయిస్తున్నారు మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు అప్పుల కోసం రోజు కాలనీకి వచ్చి వేధిస్తున్నారు. దీపావళి రోజూ కాలనీకి వచ్చి చాలామంది మహిళలను డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టారు. పండుగ రోజు వేధింపులతో చాలా మంది అవస్థలు పడ్డారు. వడ్డీల లెక్క చెప్పడం లేదు.. ఎంత కట్టినా మళ్లీ ఎంతో కొంత అప్పు ఉందని తేలుస్తారు. – రేష్మా, మాదాపూర్కాలనీ, కోరుట్ల ఈ యువకుడి పేరు అఫ్రోజ్(18). తొమ్మిదో తరగతి చదివి ఆపేశాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. ఇతని తల్లి ఇర్ఫానా బీడీలు చుడుతుంది.. తండ్రి ఆసిఫ్ ఐస్‌క్రీం అమ్ముతాడు. ఏడాది క్రితం మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు ఇంటికి వచ్చి రూ. 6 వేలు అప్పు ఇచ్చారు. వారానికి రూ.600 చొప్పున 12 వారాల్లో రూ.7,200 కట్టాలన్నారు. అయితే, ఆ కుటుంబం ఇప్పటికీ ఆ అప్పు తీర్చలేకపోతోంది. పొద్దస్తమానం పనిచేసి సంపాదించిన డబ్బులు పొట్ట కూటికే సరిపోతుండగా.. మైక్రో అప్పుల ఊబి నుంచి బయటపడటానికి అఫ్రోజ్‌ను సెంట్రింగ్ పనులకు పంపుతున్నారు. ఈమె పేరు సుజాత కోరుట్లలో నివాసముంటుంది. భర్త కిషన్ వంటలు చేస్తాడు. రెండేళ్ల క్రితం మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు ఇచ్చిన రూ.5 వేల అప్పు కట్టలేక అవస్థలు పడుతోంది. వడ్డీల భారంతో తీసుకున్న రుణం తీరకపోవడంతో కూతుర్ని కాలేజీ బంద్ చేయించి తనతోపాటు బీడీలు చేయిస్తోంది. -
పంటలను ధ్వంసం చేయడం తగదు
వరంగల్ చౌరస్తా : పేదలు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పంట లను హరితహారం పేరుతో ధ్వంసం చేయడం తగదని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ 2006 అటవీ హక్కు లచట్ట ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకుండా.. ఉన్న భూముల్లో మొక్కలు నాటడమేమిటని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు భూములను లాక్కోవడం సరికాదన్నారు. నాయకులు చిర్ర సూరి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పసునూటి రాజు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పైండ్ల యాకయ్య, నాయకులు మైదం పాణి, మోహన్, కార్తీక్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
ఆత్మకూరు(అనుమసముద్రంపేట) : అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందించేందుకు అధికారులు కషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ హక్కుల సంఘం కన్వీనర్ చిట్టిబాబు అన్నారు. ఆత్మకూరు మండలంలోని ఏపీ ప్రోడక్టివిటీ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నూతన ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ చట్టం తెలియక పలువురు బాధితులు ఇబ్బందిపడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. జిల్లా కన్వీనర్ పెంచలనరసయ్య, ఆత్మకూరు నాయకులు వాగాల శ్రీహరి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి.లక్ష్మీపతి, మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు దావా పెంచలరావు, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ జె.వెంకట్ పాల్గొన్నారు. -
వామ్మో ఇవేం ధరలు..
ఆకాశాన్నంటుతున్న ఎండుమిర్చి, నూనెలు, పప్పుల ధరలు ఆత్మకూరు : నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు వస్తువులు కొనలేక విలవిలలాడుతున్నారు. పచ్చడిలో వేసుకునే తెల్లగడ్డలు రూ.160కు చేరుకున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఎండుమిర్చి ఓ రకం రూ.180 ఉండగా మేలురకం రూ.230గా ఉంది. కందిపప్పు రూ.160, మిన పప్పు రూ.150, పెసర రూ.120, పచ్చెనగపప్పు రూ.130, గోధుమలు రూ.35, సాయిపప్పు రూ.150, చింతపండు రూ.150 పలుకుతుంది. ఇక నూనెల విషయానికొస్తే పామాయిల్ రూ.60, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.80, వేరుశెనగ నూనె రూ.120 ఉంది. ఈ రేట్లు చూసి మహిళలు వామ్మో ఇవేం రేట్లని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కూలీనాలీ చేసుకుని జీవించేవారి పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యావసరాల ధరలు దించుతామని చెప్పిన ప్రభుత్వం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పేదలు పచ్చడి మెతుకులకు కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. -
పేదింటికి రూ.3,100 కోట్లు
ఆర్థిక మంత్రికి గృహనిర్మాణ శాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు రెండు పడక గదులతో ఇళ్లను నిర్మించి ఇచ్చే గృహనిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో తమకు రూ.3100 కోట్లను కేటాయించాలని గృహ నిర్మాణశాఖ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిర్వహించిన సన్నాహక సమావేశంలో గృహ నిర్మాణశాఖ పక్షాన ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్యతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలను అందజేశారు. గతంలో ప్రారంభించి అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్లను (నిర్మాణదశలో ఉన్నవి) కొనసాగించేందుకు రూ.1650 కోట్లు, కేసీఆర్ ఎన్నికల హామీలో పేర్కొన్న రెండు పడకగదుల ఇళ్ల కోసం రూ.1450 కోట్లను కేటాయించాల్సిందిగా ఇందులో కోరారు. -
కష్టాలు, కన్నీళ్లే.. తోడూనీడ!
వంగర(లక్ష్మీపేట):శుష్కించిన శరీరాలతో అస్థిపంజారాల్లో కని పిస్తున్న ఆ పండుటాకులను చూసే వారెవరికైనా గుండె బరువెక్కక మానదు. వారు పడుతున్న కష్టాలు వింటే కన్నీరు పెట్టక మానరు. అందులో ఒక పండుటాకు పేరు దూబ అప్పారావు(85), రెండో పండుటాకు పేరు పారమ్మ(80). వంగర మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన ఈ భార్యాభర్తలను చూస్తే.. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అంటే ఇదేనని స్పష్టమవుతుంది. నిరుపేదలైన ఈ దంపతులకు పిల్లలు లేరు. వెనకాముందూ ఆస్తులు లేవు.. ఆదరించే వారూ లేరు. వయసులో ఉన్నప్పుడు కులవృత్తి అయిన చేనేత పని చేసుకుంటూ జీవనం సాగించారు. తర్వాత వయసు మీద పడింది. శ్రమకు శరీరం సహకరించలేదు. దాంతో పదేళ్ల నుంచి పని చేయలేకపోతున్నారు. తిండికి తిప్పలు పని చేయలేరు.. ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఫలితంగా నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడం కష్టంగా మారింది. అంత్యోదయ కార్డు ఉండటంతో నెలకు 35 కేజీల బియ్యం, అప్పారావుకు నెలకు 200 రూపాయులు వృద్ధాప్య పింఛను వస్తున్నాయి. ఈ రెండే వీరికి జీవనాధారం. వాటితోనే ఒక పూట తింటూ రెండోపూట నీళ్లతో సరిపెట్టుకుంటున్నారు. దీంతో వారి శరీరాలు చిక్కి శల్యమయ్యాయి. ఆరోగ్యాలు క్షీణించాయి. పొట్టకొట్టిన సదరం పారమ్మకు పదేళ్ల క్రితం కళ్లు పని చేయకపోవడంతో చూపు కోల్పోయింది. దాంతో ఆమెకు వికలాంగ పింఛను వచ్చేది. అయితే సదరం ద్వారా వికలాంగులు గుర్తింపు పొందాలన్న నిబంధనతో ఆమె పెన్షన్ నిలిచిపోయింది. సదరం శిబిరానికి తీసుకువెళ్లేవారు లేక పోవడంతో లబ్ధిదారుల జాబితా నుంచి ఆమె పేరు తొలగించి ఏడాది క్రితం పింఛను నిలిపివేశారు. గూడూ కరువే ఉండేందుకు ఇళ్లంటూ లేదు. ఇంతకుముంద పగటి పూట చెట్టు నీడలో కాలక్షేపం చేసి రాత్రి పూట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తలదాచుకునేవారు. అయితే లక్ష్మీపేట మారణకాండ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రత్యేక కోర్టుగా మార్చింది. దీంతో వృద్ధ దంపతులు ఆశ్రయం కోల్పోయారు. గ్రామం నుంచి కొందరు వలస వెళ్లగా ఖాళీగా ఉండి పాడుబడిన ఒక ఇంట్లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. శరీరం సహకరించకున్నా భార్యకు సపర్యలు జవసత్వాలు ఉడిగిపోయాయి. సరైన తిండి లేదు. శరీరాలు అస్థిపంజరాల్లా తయారయ్యాయి. పైగా పారమ్మకు చూపు లేదు. అడుగు కూడా ముందుకు వేయలేని దుస్థితి. దాంతో అప్పారావుపై మరింత భారం పడింది. తన పనులతోపాటు భార్యకు అన్నీ తానే అన్నట్లు సేవ చేస్తున్నాడు. ప్రతి రోజు ఆమెకు కాలకృత్యాలు చేయించడం నుంచి అన్నం తినిపించడం వరకు అన్నీ తనే చేస్తున్నాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ఏ ఆధారం లేని అప్పారావు దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఏ కష్టం వచ్చినా చిల్లిగవ్వ కూడా చేతిలో లేని పరిస్థితి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వారిని ఆదుకోవాలని వీరిని దుస్థితిని చూసిన గ్రామస్తులు కోరుతున్నారు. -
పేదలకు కరెంట్ షాక్
న్యూఢిల్లీ: దేశరాజధానిలో తక్కువ విద్యుత్ వినియోగించే వారికి కరెంట్ షాక్ తగలనుంది. నిర్ణీత చార్జీల బిల్లులను పెంచాలన్న విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్)ల డిమాండ్‌ను రెగ్యులేటరీ అంగీకరించినట్లయితే కొద్దిరోజుల్లోనే చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదముంది. అతి తక్కువ విద్యుత్ అనగా రెండు కిలోవాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుల కేటగిరీని పూర్తిగారద్దుచేసి... ఐదు కిలోవాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్న కేటగిరీలోకి మార్చాలని డిస్కంలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఆ రెండు కిలోవాట్ల కనెక్షన్లకు నిర్ణీత బిల్లుగా 40 రూపాయలు, ఐదు కిలోవాట్ల కనెక్షన్లకు నిర్ణీత బిల్లుగా 100 రూపాయలు వసూలు చేస్తున్నాయి. రెండు కిలోవాట్ల కేటగిరీని రద్దు చేసి, ఐదు కిలోవాట్ల పరిధిలోకి మార్చడం వల్ల టీవీ, కూలర్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు వంటి సౌకర్యాలు లేని కుటుంబాలు బిల్లు కింద కనీసం రూ. 100 రూపాయల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. రోజుకూలీపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు ఈ చెల్లింపు భారంగా పరిణమిస్తుంది. డిస్కంల డిమాండ్‌ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) అంగీకరించినట్లయితే రెండు కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉపయోగిస్తున్న కుటుంబాలు చెల్లించే బిల్లులు ఒకేసారి 150 శాతం పెరుగుతాయి. డిస్కమ్‌ల ఒత్తిడి మేరకు డీఈఆర్సీ పవర్ టారిఫ్‌ను పునఃసమీక్షిస్తోందని రెగ్యులేటర్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసమస్యపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తరువాత జూన్ ఆఖరుకల్లా డీఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. దేశరాజధాని ప్రజల వార్షికాదాయం బాగానే ఉందని, రెండు కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుతున్నవారి సంఖ్య అతి స్వల్పమని డిస్కమ్‌లు చెబుతున్నాయి. ప్రస్తుతం మురికివాడల్లో నివసిస్తున్నవారికి సైతం టీవీ, కూలర్, ఫ్యాన్లు, లైట్లు ఉంటున్నాయని, అలాంటి వారిని ఇంకారెండు కిలోవాట్ల పరిధిలోనే ఉంచడం నష్టమేనన్నది డిస్కమ్‌ల వాదన. అంతేకాదు.. రెండు కిలోవాట్ల నిర్ణీత రేట్ల పరిధిలో ఉన్న ఢిల్లీ వాసులు, దానికంటే మూడు రెట్లు ఎక్కువ విద్యుత్‌నే వినియోగిస్తున్నారని కూడా డిస్కమ్ కంపెనీ అధికారి ఒకరు చెబుతున్నారు. డిస్కమ్‌ల డిమాండ్ ప్రకారం రెండు కిలోవాట్ల పరిధిని రద్దు చేస్తే ఐదు కిలోవాట్ల పరిధిలోకి 60 శాతం మంది వినియోగదారులు వస్తారు. ఇదిలా ఉంటే వినియోగదారుల అభిప్రాయాలను సేకరించిన తరువాతే పవర్ డిస్కమ్‌ల డిమాండ్‌పై నిర్ణయం తీసుకుంటామని డీఈఆర్సీ అధికారులు చెబుతున్నారు.