న్యూఢిల్లీ: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుపేదలు, మధ్యతరగతిని మోదీ సర్కార్ మర్చిపోయిందన్నారు. పెట్టుబడిదారుల సంపద పెంచడంలో మునిగిపోయిన కేంద్రం మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తోందన్నారు.
ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ వేసే ఎత్తుల్ని సాగనివ్వమని రాహుల్ బుధవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘టమాటా కేజీ రూ.140, కాలీఫ్లవర్ కేజీ రూ.80, కందిపప్పు కేజీ రూ.148, గ్యాస్ సిలిండర్ రూ.1100 పై మాటే. ధరలు ఇలా పెంచుకుంటూ పోతూ పెట్టుబడుదారుల ఆస్తుల్ని పెంచుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రయోజనాలనే విస్మరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment