essentials prices
-
ఆకాశమే హద్దుగా ధరాభారం
-
‘అమ్మో’రికా!
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే ఏకైక సూపర్ పవర్.. ఏకధ్రువ ప్రపంచంలో ఒకే ఒక్క అగ్రరాజ్యం.. ఆ దేశ పౌరులంటే ఇంటా బయటా గౌరవం, ఆకాశహర్మ్యాల్లాంటి భవంతులు.. బహుళజాతి సంస్థలు.. వాటిలో మంచి ఉద్యోగాలు.. భారీ వేతనాలు.. అద్భుతమైన కెరీర్.. మనకు తెలిసిన, ఊహించుకునే అమెరికా ఇది. అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయి.. అక్కడా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో అమెరికన్లను తీవ్ర ‘ఆర్థిక’ ఒత్తిడి చుట్టుముడుతోంది. దీంతో వారిలో మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్నాయి.బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవడానికి కూడా.. అమెరికాలో మాంద్యం ప్రభావంతో ‘ఆర్థిక’ ఒత్తిడులు పెరుగుతున్నాయి. సగం మంది అమెరికన్లు తమ జీవితంలో అత్యంత ఆర్థిక భయాన్ని అనుభవిస్తున్నారు. డబ్బులు లేని స్థితిని పదేపదే గుర్తు చేసుకోలేక బ్యాంకు ఖాతాలను కూడా తనిఖీ చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. తమ జీవన వ్యయంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులకు సర్దుబాటు కాలేక తీవ్ర మానసిక సమస్యల బారినపడుతున్నారు. ఈ మేరకు మార్కెట్ వాచ్ గైడ్స్ చేపట్టిన సర్వేలో నిత్యావసరాల కోసం అవుతున్న అధిక ఖర్చులు తమ బడ్జెట్‌ను తారుమారు చేస్తున్నట్టు అమెరికన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల తొలగింపు (లేఆఫ్స్), కొత్త ఉద్యోగాలు రాకపోవడం వంటి కారణాలతో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. కొంతమంది ఉన్న కొద్ది మొత్తాన్నే జాగ్రత్తగా ఖర్చు చేయాలనే ఆలోచనతో కుటుంబ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండిపోతున్నట్టు తేలింది. ఇలా మానసిక ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టాల్సి వస్తోంది. అమెరికన్లలో ‘ఆర్థిక’ ఒత్తిడికి ప్రధాన కారణాలు..⇒ నిత్యావసరాల ధరల పెరుగుదల ⇒ పొదుపు లేకపోవడం ⇒ తగినంత ఆదాయం లేకపోవడం ⇒ దేశ ఆర్థిక వ్యవస్థ బాగోకపోవడం ⇒ ఇంటి అద్దె ఖర్చు 8 అధిక వడ్డీలు ⇒ పదవీ విరమణకు సంబంధించిన అనిశ్చితి‘ఆర్థిక’ ఒత్తిడి ఇలా..⇒ కొంత స్థాయిలో ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తున్నవారి 88%⇒ ఆర్థికాంశాలే తమ ఒత్తిడికి అతిపెద్ద కారణమని చెప్పినవారు 65%⇒కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ఒత్తిడిని దాచిపెట్టిన వారు 58%⇒ ఆర్థిక సమస్యను సంక్షోభంలా మారే వరకు విస్మరిస్తున్నవారు 44%⇒ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం తమ మానసిక ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నవారు 94%⇒ ఆర్థిక సమస్యను సంక్షోభంలా మారే వరకు విస్మరిస్తున్నవారు 44%⇒ ఆర్థిక ఒత్తిడితో ప్రతికూల శారీరక ప్రభావాలను ఎదుర్కొంటున్నవారు 92%ఒత్తిడికి మూలకారణం ఇదే.. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ఆర్థికాంశాలే ఒత్తిడికి ప్రధాన కారణమని చెప్పారు. ముఖ్యంగా యువ అమెరికన్లలో ఒత్తిడి తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ముందు తరాలతో పోలిస్తే 1981–1996 మధ్య జన్మించిన వారిలో ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో నివసించేవారు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తక్కువ వేతనాలు ఉండటంతో నిత్యం ఆర్థిక సమస్యల బారినపడుతున్నారు. మరోవైపు కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టడం కూడా ప్రతికూలంగా మారుతోంది.ప్రభుత్వ, సాంకేతిక రంగాల్లో 14 నెలల గరిష్ట స్థాయికి ఉద్యోగుల తొలగింపు చేరుకుంది. చాలా మంది ఆర్థిక సమస్యలు సంక్షోభంగా మారేవరకు జాగ్రత్త పడకపోవడంతో తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నారు. అతిగా ఖర్చు చేసే అలవాటు ఉన్నవారు ఇంకా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్న వారి కంటే.. తిరిగి తీర్చే ప్రణాళిక లేకుండానే అప్పులు చేస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు.మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..సర్వేలో దాదాపు 41 శాతం మంది ఆర్థిక పరిస్థితులు తమ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు అంగీకరించారు. మరో 57 శాతం మంది ఆర్థిక/మానసిక ఆరోగ్యానికి మధ్య ప్రాధాన్యతను తేల్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో పురుషులు నిర్ణీత పని గంటలకు మించి వర్క్ చేస్తుంటే.. మహిళలు సమయానికి తిండిలేక, సెలవులు కూడా తీసుకోకుండా పని చేయడంతో శారీరక సమస్యల బారిన పడుతున్నారు. సర్వేలో సగం కంటే ఎక్కువ మంది ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిద్రను కోల్పోతున్నామని, తలనొప్పితోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.భయపెడుతున్న నిత్యావసరాల ఖర్చు..అమెరికాలో వ్యవసాయ విభాగం నివేదికల ప్రకారం.. 2022తో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు 11 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. కొన్ని వస్తువుల ధరలు ఇప్పటికీ పెరుగుదలలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది గుడ్డు ధరలు మరో 4.8 శాతం, బీఫ్ మాంసం ధరలు 3 శాతం కంటే ఎక్కువగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం.. మరోవైపు అందుకు తగ్గట్టు ఆదాయం లేకపోవడంతో అమెరికన్లు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
ధరల దాడి
సాక్షి, అమరావతి: నిత్యావసరాలు వంటింటిని హడలెత్తిస్తున్నాయి. పొయ్యి వెలిగించకుండానే భగభగమంటున్నాయి. కందిపప్పు పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. ఉప్పు, పప్పు, చింతపండు, ఎండుమిర్చితో పాటు కూరగాయల వరకు రేట్లు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరల్లో జాతీయ సగటుతో పాటు దక్షిణాది సగటుతో పోలి్చనా ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు అధికంగా ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నిత్యావసరాల రేట్లు బాగా పెరిగాయి. బియ్యం (కామన్ రకం) 12 శాతం, పెసరపప్పు 54 శాతం, ఆటా 67%, కందిపప్పు 61 శాతం, పంచదార 15 శాతం, బంగాళదుంప 21 శాతం, ఉల్లిపాయాలు 87 శాతం, టమాటాలు 50 శాతం, పాలు 6 శాతం, ఉప్పు ధరలు 30 శాతానికిపైగా పెరగడంతో జనం జేబులు గుల్లవుతున్నాయి. ప్రతి నెలా బడ్జెట్ గాడి తప్పుతోంది.నాడు ఫోరి్టఫైడ్ గోధుమపిండిగోధుమ పిండి సగటున కిలో రూ.48 నుంచి రూ.70కిపైగా పలుకుతోంది. దేశ వ్యాప్తంగా తమిళనాడు తర్వాత ఏపీలోనే గోధుమ పిండి రేటు ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని కిలో ప్యాకెట్ల రూపంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.11కే అందించింది. బియ్యం బాబోయ్! గత కొన్నేళ్లుగా బియ్యం ధరలు వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. 2019లో సాధారణ బియ్యం కిలో రూ.36 చొప్పున ఉండగా ఇప్పుడు కిలో రూ.55కిపైగా పలుకుతోంది. సూపర్ ఫైన్ బియ్యం రూ.65 – రూ.70కిపైగా ఎగబాకింది. బాస్మతి, దావత్ బియ్యం ఏకంగా కిలో రూ.230కిపైగా ఉంది. తాజాగా బియ్యం రేట్లు తొమ్మిది రాష్ట్రాల్లో కిలో రూ.50 దాటింది. అత్యధిక బియ్యం రేట్లలో ఏపీ 5వ స్థానంలో ఉంది. బియ్యం నిల్వలను నల్ల బజారుకు తరలించడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఈ ఖరీఫ్‌లో నాట్లు వేసిన తర్వాత కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో బియ్యాన్ని బ్లాక్ చేసి రేట్లు పెంచే ఆలోచనలో వ్యాపారులున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా బియ్యం నిల్వలపై పరిమితులు విధించకుండా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ నామమాత్రంగా రూ.1, రూ.2 తగ్గించి వినియోగదారులుకు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటోంది. వరి అధికంగా పండే పంజాబ్‌లో కిలో బియ్యం రూ.39.58 మాత్రమే ఉండగా అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.ఉడకని కందిపప్పు! రాష్ట్రంలో గత ఫిబ్రవరిలో కిలో రూ.163 చొప్పున ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180కిపైగా చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా పీడీఎస్‌లో కందిపప్పు ఇవ్వకపోవడంతో బయట మార్కెట్లో వ్యాపారులు ధరలు పెంచేశారు. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే కందిపప్పు రేటు అధికంగా ఉంది. ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.తాజాగా రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో రూ.150కే ఇస్తామంటున్నా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ‘‘కిలో రూ.160 ఉన్నప్పుడు కొన్న కందిపప్పును రెండు సార్లు కుక్కర్లో ఉడికించి మిక్సీలో తిప్పినా మెత్తగా కావడం లేదు. చేసేది లేక ప్యాకెట్ కందిపప్పు రూ.224 పెట్టి కొనుక్కెళ్లా. ఉడకని పప్పులు తక్కువ రేటుకు ఇచ్చినా ఏం చేసుకోవాలి? ఇది వినియోగదారులకు నష్టం కాదా?’’ అంటూ విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్లో వినియోగదారుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయల కల్లోలం..రాష్ట్రంలో రెండు నెలల క్రితం అధిక వేడి కారణంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో వాటి ధరలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. రైతు బజార్లలో అన్నీ కిలో రూ.50 నుంచి రూ.80కి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో నిత్యావసరాలకు తోడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. మార్కెట్లో కాకరకాయల ధర కిలో ఏకంగా రూ.70, క్యారెట్ ధర రూ.90 వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల కారణంగా టమాటా, ఉల్లి, పచి్చమిర్చి, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికం, అల్లం ధరలు పెరుగుతున్నాయి.ఏపీలోనే ద్రవ్యోల్బణం ఎక్కువ.. ధరల పెరుగుదల కొంతవరకు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా ఏపీలో ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతోంది. జాతీయ సగటు 5.08 శాతంతో పోలిస్తే ఏపీలో ధరల పెరుగుదల సూచీ 5.87 శాతంతో భయపెడుతోంది. ధరల పెరుగుదల సూచీ ఒడిశాలో అత్యధికంగా 7.22 శాతం, దాద్రానగర్ హవేలీలో 6.49 శాతం, బిహార్‌లో 6.37 శాతం, కర్నాటకలో 5.98 శాతం తర్వాత ఏపీ ఐదో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 5.49 శాతం, తమిళనాడులో 4.75 శాతం. కేరళలో 5.83 శాతం ద్రవ్యోల్బణం రేటు ఉంది. నిన్నటి రేట్లు ఇవాళ ఉండట్లేదు.. నిత్యావసరాల ధరలు చూస్తుంటే భయం వేస్తోంది. ఒకరోజు ఉన్న రేటు మరుసటి రోజు ఉండటం లేదు. ఊహించని విధంగా మారిపోతున్నాయి. కందిపప్పు కొనలేని పరిస్థితి. పోనీ కూరగాయలైనా వండుకుందామంటే ఏది చూసినా కిలో రూ.50, రూ.100 పలుకుతున్నాయి. ఆదాయానికి, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది. చివరకు చింతపండు రసం చేసుకోవాలన్నా రేట్లు చూస్తే కొనేలా లేవు. – అద్దంకి మౌనిక, పెదరావూరు, తెనాలి మండలంనలుగురికి సంతోషంగా వడ్డించలేం.. పప్పులు, ఉప్పుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంటగదిలో కూర్చుని నలుగురికి ఆనందంగా వండిపెట్టే రోజులు ఇప్పట్లో రావేమో. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. సంపాదించే కొద్ది మొత్తంలో నిత్యావసరాలకే సగం ఖర్చయితే సామాన్యులు ఎలా బతకాలి? బియ్యం రేట్లు కూడా విపరీతంగా పెరుగుతుంటే ఇంకేం తినాలి? – యాదల అన్నపూర్ణ, తెనాలి -
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి:కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది. వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీ సాగు తగ్గడంతో బంగాళదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమోటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి: కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది.వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీసాగు తగ్గడంతో బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమాటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది. ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్‌హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్‌లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్‌ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
గరం మసాలా!
సాక్షి, హైదరాబాద్: సగటుజీవి నెలవారీ ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా.. నిత్యావసరాల ధరలు మాత్రం నింగినంటుతున్నాయి. వంటింట్లోకెళదామంటే కాసింత ధైర్యం కూడగట్టుకోవాల్సిన పరిస్థితి. కుటుంబాన్ని నెట్టుకురావాలంటే బడ్జెట్ ఏ మూలకూ సరిపోవడంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదు. కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఘాటెక్కి.. హీటెక్కి.. కొన్ని నెలలుగా గరం మసాలా ఘాటెక్కింది. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి ఇతర మసాలాల దినుసుల దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్ని మసాలాల ధరలు విపరితంగా పెరిగాయని హోల్‌సెల్ వ్యాపారులు అంటున్నారు. దీంతో యాలకుల ధర కేజీ రూ. 2,600కు చేరింది. మిరియాలు రూ. 800, లవంగాలు రూ.900, జీలకర్ర రూ.220కు చేరాయి. వామ్మో.. వెల్లుల్లి.. ♦ నగరంలో వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. నగర మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ప్రస్తుతం కిలో వెల్లుల్లి రూ.480కి చేరుకుంది. హోల్‌సేల్ మార్కెట్‌కు వెల్లుల్లిని రవాణా చేసే ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది, సుమారు 15 వాహనాలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్‌కు 24 నుంచి 30 వాహనాలు వస్తాయని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. పర్యవసానంగా దాదాపు 40 శాతం వెల్లుల్లి సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రాథమిక కారణమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ♦ గతేడాది మే నెల తొలినాళ్లలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు పలికింది. పోయిన నెల వరకు కూడా కేజీ రూ. 160 ఉందని వర్షాకాలంలో దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు సమాచారం. అక్టోబర్, నవంబర్లలో కురిసిన అ కాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ము ఖ్యంగా వెల్లుల్లి అధికంగా పండించే రాజస్థాన్‌లో వెల్లుల్లి ధర పెరిగింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా పడిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో వెల్లుల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. రైస్.. రైజ్.. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలోకు రూ. 65 నుంచి రూ. 70కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్ కంటే ఎక్కువ బియ్యం మార్కెట్‌కు వచ్చినా ధరలు మాత్రం తగ్గడం లేదు. కూర‘గాయాలే’.. నగరంలో అన్ని కూరగాయలు (టమాటాలు మినహా) కిలోకు రూ.80– 120 వరకు రిటైల్ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో రాజధాని అవసరాలకు సరిపడా కాయగూరలు, ఆకు కూరలు రావడంలేదు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీ నగర్, మాదన్నపేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్లకు కూరగాయల సరఫరా 60 శాతానికి పడిపోయింది. కొన్ని రకాల కూరగాయలు మండీల జాబితా నుంచి కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
చంద్రబాబు, రామోజీ, ఎల్లో బ్యాచ్ సమర్పించు.. 'అసత్యం.. నిత్యావసరం'
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ చేరుతున్న సంక్షేమాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని టీడీపీ–ఈనాడు సహిత ఎల్లో కూటమి సరికొత్త కుట్రలకు తెరతీస్తోంది. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పెరిగిన ధరలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారానికి దిగుతున్నారు. మరోవైపు వారు చేస్తున్న ప్రచారాన్నే ‘ఈనాడు’ కూడా పతాక శీర్షికల్లో అచ్చువేస్తోంది. నిజానికి ధరల పెరుగుదల చాలావరకూ రవాణా రంగంపై ప్రభావం చూపించే ముడి చమురు, బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కేంద్రం నియంత్రణలోనే ఉంటాయి. కొన్నేళ్లుగా వీటి ధరలు అటు అంతర్జాతీయంగా... ఇటు దేశీయంగా పెరుగుతూనే వస్తుండటంతో వీటి ప్రభావం వల్ల నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిణామం. ఇవన్నీ రామోజీరావుకు తెలియక కాదు. ఆయన అజెండా వేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో ఏదో ఒకరకంగా వ్యతిరేకత పెంచేసి... అర్జెంటుగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలన్నది ఆయన ముప్పొద్దులా కంటున్న కల. దానికోసమే ఈ ప్రయాస అంతా. వాస్తవానికి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా చాలా సరుకుల ధరలు మన రాష్ట్రంలోనే తక్కువ. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చినా అదే పరిస్థితి. కాకపోతే బాబును గద్దెనెక్కించటమే లక్ష్యంగా రోజూ ‘ఈనాడు’లో ప్రతి పేజీలోనూ విషం కక్కుతున్న రామోజీరావుకు వాస్తవాలతో పనే లేదు. అందుకే ధరల విషయంలోనూ అదే చేశారు. ప్రజాదరణలో ‘ఈనాడు’దీ బాబు పరిస్థితే! అబద్ధాల చంద్రబాబును గత ఎన్నికల్లో జనమంతా ఛీకొట్టి ఓడించినట్లే రామోజీరావు పత్రిక ‘ఈనాడు’నూ పాఠకులు ఛీకొడుతున్నారు. ఈ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో ప్రజలకు మేలు జరుగుతున్న పనులను కూడా వక్రీకరిస్తూ కాలకూట విషం చిమ్మటాన్ని జనం సహించటం లేదు. దీంతో చంద్రబాబు మాదిరిగానే ‘ఈనాడు’ ప్రజాదరణ కూడా దారుణంగా పడిపోయింది. పత్రికను కొనుక్కుని చదివేవారు చాలామంది దాన్ని మానేశారు. ఎన్నికల వేళ పాఠకులు తగ్గిపోతే ఎలాగని మథనపడ్డ రామోజీరావు... చివరకు రాష్ట్రంలో ఇంటింటికీ ‘ఈనాడు’ను ఫ్రీగా పంచిపెట్టడం మొదలెట్టారు. పత్రికను కొనుక్కుని చదివేవారికి ఈ సంగతి తెలిసి... ఎలాగూ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని సబ్్రస్కిప్షన్లకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఈ పరిస్థితి అంతకంతకూ పెరుగుతోందని, కొనుక్కుని చదివేవారంతా మానేసి ఫ్రీగా అడుగుతున్నారని, దీన్ని తట్టుకోవటం కష్టమవుతోందని ‘ఈనాడు’ వర్గాలే వాపోతుండటం గమనార్హం. దేశ సగటు ధరలతో పోలిస్తే ఏపీలోనే తక్కువ.. నిత్యావసర సరుకుల ధరలకు వస్తే... దేశ వ్యాప్తంగా సగటు ధరలతో ఆంధ్రప్రదేశ్‌లోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణలోనూ ఒకటి రెండు మినహా నిత్యావసరాల రేట్లు అధికంగానే ఉన్నాయి. జాతీయ స్థాయిలో కిలో సాధారణ బియ్యం రూ.43.17 ఉంటే ఏపీలో స్థానికంగా 39.84గా ఉంది. జాతీయంగా ధరలు ఏపీ కంటే సన్‌ఫ్లవర్ నూనెపై రూ.11.61, వేరుశనగా రూ.20, పామాయిల్ రూ.10, ఉల్లి రూ.6, టామాటా రూ.10 ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో చూసినా కందిపప్పుపై రూ.14.65, మినపప్పు రూ.11, పెసరపప్పు రూ.5.33, శనగపప్పు రూ.5.42, ఉల్లి రూ.6.74 రేటు ఎక్కువే. కానీ, రామోజీరావు ఈ ప్రభుత్వం వచ్చాకే రేట్లు పెరిగిపోతున్నట్టు తప్పుడు కథనాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లై ఆధారంగా మార్కెట్లో రేట్ల హెచ్చుతగ్గులు సహజం. దీనికి తోడు ఏటా పంటలకు మద్దతు ధర పెరుగుతోంది. ఆ ప్రభావం కూడా మార్కెట్‌పై పడుతోంది. ఈ వాస్తవాలను దాటిపెట్టి ‘ఈనాడు’ సోమవారం నాడు ‘నిప్పుల్లా నిత్యావసరాలు’ అంటూ ప్రజలను మభ్యపెట్టే కథనాన్ని వండివార్చటం వెనక పెద్ద కథే ఉంది. ఎందుకంటే ‘ఈనాడు’ కథనానికి ముందే టీడీపీ డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు జనమంతా తమకు అందుతున్న పథకాలపై సంతృప్తిని వ్యక్తం చేయటంతో... పథకాల ద్వారా అందిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరగటం వల్ల కోల్పోతున్నారంటూ వారి మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేశారు ఎల్లో బ్యాచ్. దీన్ని సహించలేక చాలాచోట్ల జనం ఎదురుతిరిగారు. అలాంటి సంఘటనే ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ చోటు చేసుకుంది. దీంతో తమ కుట్రలో భాగంగా సోమవారం ‘ఈనాడు’లో కథనాన్ని రాయించింది ఎల్లో ముఠా. దీన్నే సోషల్ మీడియాలోనూ పలువురు టీడీపీ బ్యాచ్ వైరల్ చేయటం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగాయనే వాస్తవాన్ని కావాలని మరుగునపరిచి వైఎస్సార్సీపీ విధానాల వల్లే పెరుగుతున్నాయని ప్రచారం చేస్తుండటంపై టీడీపీలోనే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు చెప్పుకునేందుకు తమ పార్టీ తరఫున ఏ అంశాలు దొరక్క చివరికి ఇలాంటి అపోహలపైనే తమవారు ఆధారపడ్డారంటూ ఓ టీడీపీ కార్యకర్తే అసహనం వ్యక్తం చేయటం గమనార్హం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి... ఏ వస్తువు ధరలైనా దెబ్బతింటే రైతును ఆదుకోవటంలోను... ధరలు పెరిగిపోతే వినియోగదారుకు సాంత్వన కలిగించటంలోను దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఏపీ ముందుంటోంది. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే, మార్కెట్లో జోక్యం చేసుకుని ఈ నిధితో వాటిని కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. ఊహించని రీతిలో ధరలు పెరిగినపుడు ఆ సరుకుల్ని అందుబాటు ధరల్లో వినియోగదారుకు అందించటానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వంటనూనెల ధరలు కొండెక్కిన పరిస్థితుల్లో వాటిని రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరలకే విక్రయించింది. ఇక రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు గ్రామ స్థాయిలో మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తోంది. ఇలా పొగాకు సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలకు ధరలు పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.7712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిజానికి టీడీపీ తన ఐదేళ్ల పాలనలో ఇలా ధరలు పతనమైన సమయంలో రైతుల కోసం వెచ్చించింది కేవలం రూ.3322 కోట్లు. ధరల నియంత్రణలో భాగంగా తాజాగా రైతు బజారాల్లో సుపర్ఫైన్ బియ్యం, కందిపప్పు విక్రయాలకు ఈ ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 8,990 క్వింటాళ్ల బియ్యం, 1206 క్వింటాళ్ల కందిపప్పును విక్రయించారు. ఈ మూడేళ్లలో రూ.69.10 కోట్లు విలువైన 9462.49 టన్నుల ఉల్లిపాయలను సేకరించి రైతు బజార్లలో విక్రయించారు. దేశం కంటే మిన్నగా.. ఏపీలోనే మిల్లెట్ల పంపిణీ ప్రస్తుతం రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు ఎమ్మెస్పీ కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉంది. ఆరోగ్య రీత్యా ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు చిరుధాన్యాలను ఆహారం తీసుకోవడంతో డిమాండ్ పెరిగింది. అయితే వినియోగానికి తగినంత పంట ఉత్పత్తులు లేకపోవడంతో చిరుధాన్యాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పేదలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ ద్వారా జొన్నలు, రాగులు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మే నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలో పైలెట్ ప్రాజెక్టుగా కార్డుదారులకు గరిష్టంగా రెండు కిలోల చొప్పున జొన్నలు, రాగులను సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 3,303 టన్నుల జొన్నలు, 13,052 టన్నుల రాగులను అందించింది. చిరు ధాన్యాలకు మార్కెట్లో మంచి రేటుండటంతో కావలసిన సరుకును సేకరించడం సవాల్‌గా మారింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది. రైతులు పండించిన పంటను స్థానికంగానే పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసి వాటిని పీడీఎస్‌లో ప్రజలు అందించేలా కార్యచరణ రూపొందింది. ఈ ఖరీఫ్‌లో జనవరి నుంచి జొన్నలు, రాగులను నేరుగా రైతుల నుంచి సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరల జాబితాలో లేని కొర్రలను సైతం రాష్ట్రంలో రైతుల నుంచి సేకరించేలా ప్రత్యేక అనుమతులు సైతం తీసుకుంది. తొలిసారిగా కొర్రలను మద్దతు ధరకు అవసరమైతే మార్కెట్ ధరకు కొనుగోలు చేయనుంది. కిలో రూ.67కే కందిపప్పు.. పేదలకు నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసరాలు అందిస్తోంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రైస్ కార్డులుంటే రేషన్ తీసుకునే వారి శాతం 90కిపైగా చేరింది. మార్కెట్లో లభించే సన్నబియ్యం మాదిరే రేషన్ బియ్యం ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు సైతం సబ్సిడీపై కిలో రూ.67కు పంపిణీ చేస్తోంది. గడిచిన 4 నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో సరఫరాల అవరోధం ఏర్పడింది. తాజాగా హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ద్వారా పౌరసరఫరాల శాఖ సుమారు 10వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దశల వారీ సరఫరాలో భాగంగా నవంబర్ నుంచే సరుకును అందించడంతో కార్డుదారులకు ఊరటలభించింది. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్డుదారులుందరికీ పంపిణీ చేయనుంది. ఇకపై కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా డిసెంబర్ చివరినాటికి నుంచి స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేయడంతో పాటు ప్రాసెసింగ్ చేసి అందించనుంది. అంతేకాక కేంద్రం కంటే మిన్నగా గడిచిన మూడు నెలల నుంచి పౌరసరఫరాల శాఖ ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరాల చేస్తోంది. కేంద్రం మాత్రం తాజాగా భారత్ బ్రాండ్ పేరుతో కిలో గోధుమ పిండిని రూ.27.50 ఇస్తున్నట్టు ప్రకటిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.16కే అందిస్తోంది. ఇప్పటి వరకు 10,625 టన్నులు పంపిణీ చేయగా డిసెంబర్‌లోనూ 4వేల టన్నులకు పైగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే... వైఎస్ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారమే నిత్యావసరంగా మారిపోయిన ‘ఈనాడు’కు ఈ వాస్తవాలతో పనేముంది!!. -
నిరుపేదలు, మధ్యతరగతిని మర్చిపోయిన కేంద్రం: రాహుల్
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుపేదలు, మధ్యతరగతిని మోదీ సర్కార్ మర్చిపోయిందన్నారు. పెట్టుబడిదారుల సంపద పెంచడంలో మునిగిపోయిన కేంద్రం మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తోందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ వేసే ఎత్తుల్ని సాగనివ్వమని రాహుల్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘టమాటా కేజీ రూ.140, కాలీఫ్లవర్ కేజీ రూ.80, కందిపప్పు కేజీ రూ.148, గ్యాస్ సిలిండర్ రూ.1100 పై మాటే. ధరలు ఇలా పెంచుకుంటూ పోతూ పెట్టుబడుదారుల ఆస్తుల్ని పెంచుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రయోజనాలనే విస్మరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారని అన్నారు. -
Republic Day Sale: ఈ ఆఫర్లు అస్సలు మిస్ చేసుకోవద్దు!
దేశంలో ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు అందిస్తున్న భారీ డిస్కౌంట్ సేల్ కొనసాగుతుంది. రిపబ్లిక్‌డే సందర్భంగా జనవరి 17 నుంచి ప్లిప్ కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్', అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై 70 నుంచి 80 శాతం భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో అమెజాన్ ఫ్యాషన్‌పై 80 శాతం, గృహోపకరణాల వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపుతో అందిస్తుంది. ప్లిప్‌కార్ట్ సైతం అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్‌లు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈజాబితాలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్స్పీకర్లు, స్ట్రీమింగ్ ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఎంపిక చేసిన వస్తువులపై గరిష్టంగా 10శాతం తగ్గింపు పొందవచ్చు. 43అంగుళాల స్క్రీన్ 4కే రిజల్యూషన్‌తో స్మార్ట్ టీవీల కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో షియోమీ, శాంసంగ్ నుండి చాలా టీవీలు తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవచ్చు. టీవీలు ఎంఐ 4ఎక్స్ 108 సీఎం(43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999 శాంసంగ్ క్రిస్టల్ 4కే 108 సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే ) ఎల్ఈడీ స్మార్ట్ టీవీ: రూ. 36,999 రియల్మీ 108 సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999 వీయూ ప్రీమియం 108 సెం.మీ (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 25,999 స్మార్ట్ స్పీకర్లు యాపిల్ హోమ్ పాడ్ మినీ ధర రూ. 7,999 గూగుల్ నెస్ట్ హబ్ ధర రూ. 5,999 గూగుల్ నెస్ట్ ఆడియో ధర రూ. 5,999 లెనోవో స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ ధర రూ. 3,999 స్ట్రీమింగ్ పరికరాలు అదేవిధంగా ప్రస్తుత టీవీని అప్ డేట్ చేయాలనుకుంటే బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు హెచ్డీఎంఐ పోర్ట్ లేదా యూఎస్బీ పోర్ట్ ద్వారా హార్డ్‌వేర్‌ను మీ టీవీకి కనెక్ట్ చేయవచ్చు. ఎంఐ బాక్స్ 4కే మీడియా స్ట్రీమింగ్ ధర రూ.3,499 రియల్మీ 4కే స్మార్ట్ గూగుల్టీవీ స్టిక్ ధర రూ. 3,499 ఇంటర్నల్ క్రోమాకాస్ట్తో నోకియా మీడియా స్ట్రీమర్ ధర రూ. 2,999 యాపిల్ టీవీ 4కే 32జీబీ ధర రూ.17,999 స్మార్ట్ఫోన్లు యాపిల్ ఐఫోన్ 12మినీ (64జీబీ) రూ. 41,999 మోటరోలా జీ60 (128జీబీ) ధర రూ.17,999 వివో ఎక్స్60 (128జీబీ) ధర రూ.34,990 మి11 లైట్ (128జీబీ) రూ.23,999 రియల్మీ జీటీ 5జీ ధర రూ.37,999గా ఉంది. చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
ధరల స్పీడ్ కట్టడికి కేంద్రం చర్యలు దోహదం
ముంబై: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో సానుకూల అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కట్టడిలోనే ఉన్నప్పటికీ, మొత్తంగా అన్ని విభాగాలూ చూస్తే, ద్రవ్యోల్బణం పెరుగుదల కనబడుతోందని ఆయన అన్నారు. అయితే సరఫరాల సమస్య భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణమని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. పప్పు దినుసులు, వంట నూనెల వంటి నిత్యావసరాల విషయంలో సరఫరాల సమస్యలను తొలగించంతోపాటు, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ఇటీవల తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కదలికలను ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ సదస్సులో ఆయన ఈ మేరకు ఒక కీలక ప్రసంగం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి కీలకమైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధర ణకు దోహదపడుతుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. క్రిప్టో కరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై గవర్నర్ మరోసారి తన ‘‘తీవ్ర ఆందోళన’’ను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వం కోణంలో పరిశీలిస్తే, రెగ్యులేటర్‌గా తమకు క్రిప్టో కరెన్సీలపై ఆందోళన ఉందని వివరించారు. క్రిప్టో మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్యను భారీగా పెంచి చూపిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయితే పరిమాణం పరంగా సంఖ్య పెరుగుతోందని మాత్రం అంగీకరించారు. క్రిప్టో మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని గవర్నర్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సవివరమైన నివేదికను సమర్పించిందని, ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్బీఐ నిర్వహి స్తుందా? అన్న ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్ నిరాకరించారు. ఈ ఏడాది మేల్లో కూడా దాస్ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రవ్య స్థిరత్వానికి ప్రతికూలమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఫైనాన్షియల్ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగు తోందని ఈ వార్తల కథనం. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై దాస్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది. -
స్వీయ నిర్బంధమే కరోనాకు మందు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ముందు చూపుతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ కరోనాను కట్టడి చేయడంలో, సమాచార సేకరణలో ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. వలంటీర్లకు ట్యాబ్‌లు అందించి అందులో ఒక యాప్‌ను ఇన్స్టాల్ చేసి ఎప్పటికప్పుడు అందులో నమోదు చేసి.. ట్రాక్ చేస్తామన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని, వారి కుటుంబాన్ని అవమానించడం, అనుమానించడం సరైన విధానం కాదన్నారు. మంత్రి నాని ఇంకా ఏం చెప్పారంటే.. - నిత్యావసర వస్తువుల ధరలు, మెడిసిన్ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు. - ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్ష ఎన్–95 మాస్కులు, 25 వేల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్తో పాటు 5 వేల లీటర్ల శానిటైజర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. - 50 వేల నుండి లక్ష వరకు కొత్త మాస్క్‌లకు ఆర్డర్ ఇచ్చాం. 150 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 200 వెంటిలేటర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. - సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవ వార్తలను షేర్ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర, జిల్లా అధికారులకు అధికారం. - కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో ఐదుగురు ఐఏఎస్‌లతో బృందం ఏర్పాటు. అన్ని మార్గాల ద్వారా ప్రజలకు అవగాహన. - కరోనా కట్టడిలో భాగంగా గుంటూరు మిర్చి యార్డు మూసివేత. ప్రజలు గుమిగూడకుండా జనాభాను బట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అదనంగా రైతు బజార్ల ఏర్పాటు. -
నిత్యావసరాల ధరలు తగ్గించండి: అక్బర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాటిని నిలువరించాల్సిన అవసరం ఉందని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత నెలలో కూరగాయల ధరలతో పోలిస్తే ఈ నెల ధరలు రెట్టింపయ్యాయన్నారు. సామాన్య, మధ్య తరగతిపై నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందన్నారు. ధరల పెరుగుతున్నా పౌర సరఫరాల శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఈటల రాజేందర్ ప్రతిస్పందిస్తూ, ధరల తగ్గింపు చర్యలు తీసుకుంటామన్నారు. సర్దార్ పటేల్ జయంతి నిర్వహణకు అడ్డుపడిందెవరు? ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని దేశమంతా జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. నిజాం నియంతృత్వ పాలన నుంచి విముక్తి కల్పించిన పటేల్‌ను ఎందుకు విస్మరించారు. పటేల్‌కు నివాళులు అర్పించడంలో ప్రభుత్వానికి అడ్డుపడుతున్న అదృశ్య శక్తి ఎవరు?. ఆ శక్తి కారణంగానే పటేల్ జయంతిని ప్రభుత్వం జరపలేదు.’ – జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత నారాయణ, శ్రీచైతన్య ఆత్మహత్యలపై చర్యలు తీసుకోండి ‘నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ఫీజులు పెంచడంతో భారం భరించలేక చనిపోతున్నారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.’ – ఆర్. కృష్ణయ్య, టీడీపీ సఫాయి కార్మికులకు వేతనాలివ్వాలి ‘గ్రామాల్లో పని చేస్తున్న సఫాయి కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారికి భరోసానిచ్చే చర్యలు చేపట్టాలి’. – రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ ఉస్మానియా క్యాంపుల్లో సమస్యలు పరిష్కరించండి ‘ఉస్మానియా యూనివర్సిటీపరిధిలోని క్యాంపుల్లో మొహర్రం, దీపావళి, దసరా పండగ సమయాల్లో విద్యుత్ నిలిపివేశారు. ఇతర అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలి.’ –ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ -
ధరల మంట!
కిలో కందిపప్పు రూ.120కి చేరిన వైనం సన్నబియ్యం రూ.40లకు పైమాటే కాగుతున్న వంటనూనెలు అక్రమ నిల్వల వల్లే ధరలు ఆకాశానికి బతుకు బరువైన కరువు జిల్లా ప్రజలపై తాజాగా నిత్యావసరాల ధరలు పిడుగులై కురుస్తున్నాయి. అవసరమైనప్పుడు చినుకు కురవక అవసరంలేనప్పుడు గాలివాన పంటలపై దాడులు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పప్పులు, బియ్యం, కూరగాయల ధరలు సైతం ఆకాశం కేసి చూస్తున్నాయి. కొనాలని వెళ్లిన సామాన్యుడికి ధరలు వింటే వణుకు పుడుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు స్వార్థపరులు అక్రమంగా నిల్వ చేసి ధరల కృత్రిమపెరుగుదలకు కారణమవుతున్నారు. జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టకపోతే ఈ ధరలు ఇప్పుడిప్పుడే దిగేలా లేవు. అనంతపురం అర్బన్ : రైస్ మిల్లల యాజమానులు, వర్తకులు ఒక్కటై ధరల మంటలకు ఆజ్యం పోస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు సరిపడా బియ్యం, కందిపప్పు ఉన్నా వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముందస్తుగా రైతుల నుండి కొనుగోలు చేసి గోడౌన్లో, రైస్ మిల్లుల్లో నెలల తరబడి అక్రమ నిల్వలు చేసి ధరల భారాన్ని ప్రజల నెత్తిపై మోపుతున్నారు. రోజు రోజుకు నిత్యావసర సరుకులైన కందిపప్పు, మినపప్పు, చింతపండు, సన్నబియ్యంపై ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రతి సరుకుపైన రూ. 15 నుండి రూ. 20ల వరకు ధరలు పెరిగాయి. కిలో కందిపప్పు అప్పుడు రూ. 80లు ఉండగా.. ప్రస్తుతం రూ. 120లకు విక్రయిస్తున్నారు. అదే విధంగా కేజీ సన్నబియ్యం రూ. 30లు ఉండగా.. ప్రస్తుతం రూ. 40లకు పెంచేశారు. ఇక నూనెల విషయానికొస్తే రోజు రోజుకు నూనె మంటలు రేగుతున్నాయి. మార్చి నెలలో రూ.55లు ఉన్న పామాయిల్ ధరలు ప్రస్తుతం రూ.60లు ఉంది. ఇక వేరుశనగ నూనె అయితే ఏకంగా రూ. 120లకు చేరుకుంది. అక్రమ నిల్వలు ఇలా.. జిల్లాలో రైతు పండించే ప్రధాన పంటలను కొందరు మిల్లర్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. మూడు నెలల క్రితం క్వింటాళ్లు వరిధాన్యాన్ని వ్యాపారులు రైతుల నుంచి రూ. 1200లకు, కందులను క్వింటాల్ రూ. 5 వేలకు, వేరుశనగ కాయలను రూ. 3,500లకు కొనుగోలు చేశారు. వాటిని మిల్లు ఆడించి సిద్ధం చేసి పెట్టుకున్నారు. కొంతమంది ఈ సరుకును అక్రమంగా నిలువ ఉంచారు. వ్యాపారులు కొనుగోలు చేసిన ధరలు ప్రకారం బహిరంగ మార్కెట్లో వేరుశనగ నూనెను రూ. 75ల నుండి రూ. 80ల వరకు విక్రయించాలి. అయితే ప్రస్తుతం రూ. 120లకు వేరుశనగ నూనెను విక్రయిస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, తదితర ప్రాంతాల్లో వీటిని అధిక శాతంలో వ్యాపారులు అక్రమ నిల్వలు చేసినట్లు తెలుస్తోంది. మండుతున్న కూరగాయల ధరలు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల మార్కెట్ ధరలు మండుతున్నాయి. రూ.200లు బజార్‌కు తీసుకెళ్తే.. కనీసం మూడు రోజులకు సరిపడే కూరగాయలు కూడా రావడం లేదని గృహిణిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి మార్చిలో రూ. 12లు ఉండగా.. ప్రస్తుతం రూ. 20లకు ఎగబాకింది. అలాగే ఉల్లిపాయలు రూ. 12లు నుంచి రూ. 25ల వరకు ధర పెరిగింది. బంగాళదుంప రూ. 16ల నుండి రూ. 24లకు, టమోట రూ. 20 నుంచి రూ. 35లకు ఎగబాకింది. క్యారెట్ ధర కూడా రూ. 16ల నుండి రూ. 24ల వరకు పెరిగింది. ఇలా కాయగూరలు, ఆకుకూరలు సైతం ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. -
చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు
డిచ్పల్లి : తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. ఇంటిల్లిపాదికీ కొత్త బట్టలు కొనడం, వివిధ రకాల పిండివంటలు చేసుకోవడం, ప్రత్యేక పూజలు, బంధుమిత్రులకు విందు భోజనాలు, శరన్నవరాత్రుల సంబురాలు, సరదాలు ఉంటాయి. అలాంటి దసరా జోరు ఈసారి తగ్గనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో ఆనందంగా ఉన్నా, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి తోడు ఈసారి సకాలంలో వానలు కూడా కురియలేదు. చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నా యి. పంటలు ఆలస్యంగా వేయడంతో ఇంకా దిగుబడి చేతికందలేదు. ఓ వైపు చేతికందని పంట, మ రోవైపు పెరిగిన ధరలు, అదే సమయంలో పండుగలు రావడం సామాన్యులను కలవరపెడుతున్నా యి. దసరా వచ్చిందంటే చాలు ఇంట్లో ఉండే చిన్నా, పెద్దా అందరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా ఇం ట్లో అందరికీ కొత్తబట్టలు కావాల్సిందే. ఎంత చిన్న కుటుంబమైనా కనీసం నలుగురికి తక్కువ ఉండని ఈ కాలంలో పిల్లలు రెడిమేడ్ దుస్తులే కావాలని పట్టుబడుతుంటారు. పం డుగ సీజన్లలో దుస్తుల రేట్లు పెరిగిపోతాయి. ఒకవైపు మార్కెట్లో డిస్కౌంట్ల పేరు చెప్పినా, పిల్లల డ్రస్సుకు ఎంత లేదన్నా రూ. 1,500 నుంచి రూ. 2,000కు తగ్గకుండా ఉన్నాయి. ఈ లెక్కన కుటుంబ ఖర్చు రూ. పది వేలు దాటుతోంది. ఆనవాయితీ తప్పుతుందా? దసరా పండుగకు పిండివంటలు చేసుకుని బంధు,మిత్రులను పిలిచి భోజనాలు పెట్ట డం తెలంగాణలో అనవాయితీ. పప్పుల ధర లు కిలో రూ. 90 నుంచి రూ. 100కుచేరుకున్నాయి. పల్లి నూనె ధర రూ. 100 నుంచి రూ. 120కి చేరుకుంది. కిలో చికెన్ రూ.140, కిలో మటన్ రూ. 400 నుంచి రూ.450కి చేరుకుంది. కొత్త దుస్తులు, పిండివంటలు, మాం సాహారంతో పండుగ గడవాలంటే రూ. పది వేల నుంచి రూ. 15 వేలు వరకు ఖర్చు తప్పదని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. చేతికందని పంటలు ఖరీఫ్ సీజన్లో ఈ ఏడు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు ఆలస్యంగా నాట్లు వేశారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరడగంతో సాగు కోసం రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. జిల్లాలో ఈ సారి సోయా, మొక్కజొన్న సాగు శాతం పెరుగగా, వరి సాగు శాతం తగ్గింది. వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. సోయా, మొక్క జొన్న పంటలు చేతికందే సమయంలో వర్షాలు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో దసరా పండుగ ఖర్చులు రైతులకు భారంగా మారాయి. కరెంట్ కోతలు ఎక్కువ కావడంతో మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలో చిరు వ్యాపారాలు చతికిల పడ్డాయి. వెల్డింగ్ షాపులు, జిరాక్స్ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, పిండి గిర్నీలు, రైస్‌మిల్లులు, కార్పెంటర్లు కరెంట్ కోసం పడిగాపులు గాయాల్సి వస్తోంది. సరైన గిరాకీ లేక రోజుకు రూ. 500 వర కు సంపాదించుకునే చిరువ్యాపారులు కనీసం రూ. వంద కూడా కళ్ల చూడలేకపోతున్నారు. దీంతో దసరా ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.