Amazon & Flipkart Republic Day Sale 2022: Up to 70% Off on Appliances Essentials - Sakshi
Sakshi News home page

Republic Day Sale: ఈ ఆఫర్లు అస్సలు మిస్‌ చేసుకోవద్దు!

Published Mon, Jan 17 2022 3:54 PM | Last Updated on Mon, Jan 17 2022 5:03 PM

Amazon Flipkart Republic Day Sale Up To 70percent Off On Appliances Essentials - Sakshi

దేశంలో ఈకామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు అందిస్తున్న భారీ డిస్కౌంట్‌ సేల్‌ కొనసాగుతుంది. రిపబ్లిక్‌డే సందర్భంగా జనవరి 17 నుంచి ప్లిప్‌ కార్ట్‌ 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌', అమెజాన్‌ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌'  నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై 70 నుంచి 80 శాతం భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. 

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో అమెజాన్ ఫ్యాషన్‌పై 80 శాతం, గృహోపకరణాల వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపుతో అందిస్తుంది. ప్లిప్‌కార్ట్‌ సైతం అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు, బ్యాంక్‌లు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈజాబితాలో టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌స్పీకర్‌లు, స్ట్రీమింగ్ ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు ఎంపిక చేసిన వస్తువులపై గరిష్టంగా 10శాతం తగ్గింపు పొందవచ్చు. 43అంగుళాల స్క్రీన్ 4కే రిజల్యూషన్‌తో స్మార్ట్ టీవీల కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో షియోమీ, శాంసంగ్ నుండి చాలా టీవీలు తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవచ్చు. 

టీవీలు

ఎంఐ 4ఎక్స్‌ 108 సీఎం(43-అంగుళాల) అల్ట్రా హెచ్‌డీ (4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999

శాంసంగ్‌ క్రిస్టల్ 4కే 108 సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్‌డీ (4కే ) ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ: రూ. 36,999

రియల్‌మీ 108  సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్‌డీ  (4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999

వీయూ ప్రీమియం 108 సెం.మీ (43-అంగుళాల) అల్ట్రా హెచ్‌డీ(4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 25,999

స్మార్ట్ స్పీకర్లు 

యాపిల్‌ హోమ్‌ పాడ్‌ మినీ ధర రూ. 7,999

గూగుల్ నెస్ట్ హబ్ ధర రూ. 5,999

గూగుల్‌ నెస్ట్‌ ఆడియో ధర రూ. 5,999

లెనోవో స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ ధర రూ. 3,999

స్ట్రీమింగ్ పరికరాలు

అదేవిధంగా ప్రస్తుత టీవీని అప్ డేట్‌ చేయాలనుకుంటే బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.  మీరు హెచ్‌డీఎంఐ పోర్ట్ లేదా యూఎస్‌బీ పోర్ట్ ద్వారా హార్డ్‌వేర్‌ను మీ టీవీకి కనెక్ట్ చేయవచ్చు.

ఎంఐ బాక్స్‌ 4కే మీడియా స్ట్రీమింగ్ ధర రూ.3,499

రియల్‌మీ 4కే స్మార్ట్ గూగుల్‌టీవీ స్టిక్ ధర రూ. 3,499

ఇంటర్నల్‌ క్రోమాకాస్ట్‌తో నోకియా మీడియా స్ట్రీమర్ ధర రూ. 2,999

యాపిల్‌ టీవీ 4కే 32జీబీ ధర రూ.17,999

స్మార్ట్‌ఫోన్‌లు 

యాపిల్‌ ఐఫోన్‌ 12మినీ (64జీబీ) రూ. 41,999

మోటరోలా జీ60 (128జీబీ) ధర రూ.17,999

వివో ఎక్స్‌60 (128జీబీ) ధర రూ.34,990

మి11 లైట్‌ (128జీబీ) రూ.23,999

రియల్‌మీ జీటీ 5జీ ధర రూ.37,999గా ఉంది. 

చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్‌ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement