Republic Day
-
ఢిల్లీలో ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలు
-
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు
ఢిల్లీ: రిపబ్లిక్ డే-2025 వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియా బృందం పాల్గొనుంది. యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించనున్నారు. 300 మంది కళాకారులతో సారే జహాసే అచ్చా సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించనున్నారు.స్వర్ణీం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించిన రెండు ప్రత్యేక శకటాలను రూపకల్పన చేశారు. కర్తవ్య పత్‌లో 11 నిమిషాల పాటు జయ జయ భారతం సాంస్కృతిక నృత్య ప్రదర్శన, ఈనెల 29న విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్, వివిధ బెటాలియన్లకు సంబంధించిన మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన, భారతీయ మ్యూజిక్ బ్యాండ్‌ను బెటాలియన్లు ప్రదర్శించర్శించనున్నారు. -
పుష్ప ప్రదర్శనలో సినీ నటి ప్రేమ సందడి (ఫొటోలు)
-
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌కు పిలుపు..
ఘనం.. వారిరువురూ వృత్తి రిత్యా నగిషీ కళాకారులు.. వారసత్వంగా వచ్చిన వృత్తిపై మామకారాన్ని పెంచుకున్నారు. అంతటితో ఆగకుండా తమ వృత్తికి కళాత్మకతను జోడించి వివిధ కళారూపాలను తీర్చిదిద్దారు. తమ కళతో అందరినీ మెప్పించి అనేకమందిని ఆకర్షించారు. తమలోని భిన్నమైన కళతో ప్రముఖుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు. వారే హైదరాబాద్‌లోని అంబర్‌పేట డీడీ కాలనీలో నివసించే కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు.. గత 30 ఏళ్లుగా వెండితో ఫిలిగ్రీ కళారూపాలను తయారు చేస్తూ తమదైన ముద్ర వేసుకున్నారు. వీరి కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించి అభినందించింది. వీరి ఫిలిగ్రీ కళలో చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిప్పుడు గుర్తించి పలు అవార్డులను అందించి సత్కరిస్తున్నాయి. గణతంత్ర వేడుకలకు.. ఫిలిగ్రీ కళలో వీరి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు వీరిని ఆహా్వనించింది. 2025 జనవరి 26న జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కబురు అందింది. ఈ నెల 23న ఢిల్లీకి చేరుకోవాల్సిందిగా కోరింది. దీంతో కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ గణతంత్ర వేడుకలకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ఢిల్లీ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని వారు సాక్షితో వెల్లడించారు. వివిధ కళారూపాలు.. వెండితో గత 30 ఏళ్లుగా వివిధ కళారూపాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథుల జ్ఞాపికలు అందించేందుకు తమను సంప్రదించి ప్రత్యేక కళారూపాలను తయారు చేయించుకుని వెళ్తారన్నారు. వెండితో చార్మినార్, హైటెక్ సిటీ, చారిత్రాత్మక గుర్తులు, వీణ, రాట్నం, వెండి బుట్టలు వంటి కళారూపాలను రూపొందించామన్నారు. అవసరమైన వారికి తాము చెప్పిన రీతిలో అందిస్తామంటున్నారు. కళను గుర్తించి.. కృష్ణాచారి శ్రమ, కళను గుర్తించి 2006 అప్పటి రాష్ట్రపతి ప్రతిభపాటిల్ జాతీయ అవార్డు అందజేశారు. తన సతీమణ గౌరిదేవికి 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ అవార్డు అందజేశారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులను ఈ దంపతులు అందుకున్నారు. ఫిలిగ్రీ కళ తరపున రాష్ట్ర, దేశ బృందాల్లో వీరు చోటు సంపాదించుకుని తమదైన ముద్ర వేస్తున్నారు. మహేశ్వరం బీసీ హాస్టల్ విద్యార్థి గొల్ల అక్షయ్ మహేశ్వరం : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కర్తవ్య ఫరేడ్ విక్షించడానికి ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీసీ హస్టల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి గొల్ల అక్షయ్ ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కారులు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలిచన వారిని, ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి 31 మందిని ఎంపిక చేశారు. ఇందులో మహేశ్వరం బీసీ హస్టల్లో ఉంటూ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న గొల్ల అక్షయ్‌ని ఎంపిక చేశారు. అక్షయ్ స్వగ్రామం కొల్పూరు, మండలం మగనూర్, నారాయణపేట్ జిల్లా. నీరుపేద కుటుంబానికి చెందిన అక్షయ్ తల్లి చిన్న తనంలో మరణించడంతో గొర్లకాపరి అయిన తండ్రి రంగప్ప కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరి పిల్లలనూ 2021లో మహేశ్వరం బీసీ హస్టల్లో చేర్పించారు. అక్షయ్ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్నాడు. హస్టల్ వార్డెన్ కృష్ణ ప్రోత్సాహంతో ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద ఆర్థిక సాయాన్ని సంవత్సరానికి రూ.2 లక్షల ఉపకారవేతనం ప్రత్యేకంగా అందిస్తోంది. అక్షయ్ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొయినాబాద్ నుంచి బాత్కు అశ్విని.. మొయినాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నుంచి బాత్కు అశ్విని ముఖ్య అతిథిగా ఆహా్వనితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ హోంశాఖ విడుదల చేసిన స్పెషల్ కేటగిరి తెలంగాణ జాబితాలో 31 మంది ప్రత్యేక అతిథుల పేర్లల్లో అశ్విని ఆహా్వనం పొందారు. వివిధ రంగాలు, ప్రభుత్వ పతకాల వినియోగదారుల జాబితాలో మొయినాబాద్ మాడల్ మండల సమైక్యకు చెందిన బాత్కు అశ్విని ఆహా్వనం పొందడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీనిలో భాగంగా 2025 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.సుబియాంటో భారతదేశం-ఇండోనేషియా సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు చేయడంతోపాటు పలు రక్షణ ఒప్పందాలపై ఆయన దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా అవతరిస్తుంది.1950లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాటి ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి ప్రబోవో భారత గణతంత్ర వేడుకలకు హాజరైన పక్షంలో ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటుంది. ఈ నెలాఖరులో బ్రెజిల్లో జరగనున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రబోవో, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్ -
న్యూయార్క్ లో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు
-
AP: రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి అవార్డు
న్యూఢిల్లీ: భారత 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్అగర్వాల్, ఏపీ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ గణతంత్ర శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు తృతీయ బహుమతి లభించింది. పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటం మూడో స్థానంలో నిలిచింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్,ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ శకటం అకట్టుకుంది.ఇక.. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం, ద్వితీయ స్థానంలో ఉత్తర ప్రదేశ్ చెందిన శకటం నిలిచాయి. -
దేశంలోనే తన సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ
-
డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం -
రిపబ్లిక్ డే కి రిలయన్స్ జియో అద్దిరిపోయే ఆఫర్
-
సందడిగా రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని రాజ్‌భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ప్రముఖులకు రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గుడియా ఠాకూర్ దంపతులతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులకు గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు వివిధ అంశాలపై కొద్దిసేపు సంభాíÙంచుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించిన దేశ స్వాతంత్య్ర పోరాట చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు జోగి రమేశ్, ఆర్ కే రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. -
‘గ్యారంటీ’గా ముందుకెళ్తున్నాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మిగతా గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పాలకుల నిర్వాకంతో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితి, వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించినప్పుడు.. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి, హక్కులతోనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, దీనికి చరమగీతం పాడే అవకాశాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చింది. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం.. ఇటీవలి ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం గత పదేళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం. సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల అమలు కోసం 1,25,84,383 దరఖాస్తులను స్వీకరించగా.. అందులో ఐదు గ్యారెంటీల కోసం దరఖాస్తులు 1,05,91,636, ఇతర దరఖాస్తులు 19,92,747 వచ్చాయి. వీటిని శాఖలవారీగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. యువతలో అపోహలు వద్దు గత పదేళ్లు యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్ర పురోగమనానికి సంకేతం. ముఖ్యమంత్రి, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. రూ.2లక్షల రుణమాఫీకి చర్యలు రైతులకు మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాం. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమచేశాం. రూ.2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాన్యులు సైతం సీఎంను కలవచ్చు గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రభుత్వం ప్రజాసమస్యలను వింటోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాస్వామ్య పాలన తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన మొదలైంది. అంబేడ్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని, సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నాను..’’ అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయం, ఏపీ సచివాలయం, మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఆర్టీసీ హౌస్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన: మోషేన్‌రాజు, తమ్మినేని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగడం చాలా సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో వారిద్దరూ జాతీయ జెండాలను ఎగురవేశారు. మోషేన్‌రాజు, తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నేడు పరిపాలన ఇంత సాఫీగా సాగుతోందంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, ఉప కార్యదర్శులు సుబ్బరాజు, విజయరాజు, చీఫ్ మార్షల్ డి.ఏడుకొండలరెడ్డి, లీగల్ అడ్వైజర్ ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం: సీఎస్ సమాజంలోని అందరం కలిసి బాధ్యతతో మెలుగుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె.కృష్ణమూర్తి, జీఏడీ ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో... తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ భవన్లో... విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 24 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బహ్మానందరెడ్డి, కోటేశ్వరరావుతోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధలో... విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ ట్రాన్స్‌కో మాజీ (థర్మల్) జి.విజయకుమార్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విద్యుత్ సౌధ వద్ద నిర్మించిన 100 కిలోవాట్ల సోలార్ పార్కింగ్‌ను విజయానంద్ ప్రారంభించారు. ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, చీఫ్ ఆఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ టి.పనాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏపీ భవన్లో గణతంత్ర వేడుక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ పాల్గొన్నారు. హెచ్ఆర్సీ కార్యాలయంలో... కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో హెచ్ఆర్సీ చైర్మన్ సీతారామమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. లోకాయుక్తలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ నరసింహారెడ్డి, డిప్యూటీ రిజి్రస్టార్ పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకం రిపబ్లిక్‌డే వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ సాక్షి, అమరావతి: రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. హైకోర్టులో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవానికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల కారణంగా ప్రజలకు న్యాయ సేవలను, సత్వర న్యాయాన్ని అందించడం సవాళ్లతో కూడుకున్న పని అని అన్నారు. సవాళ్లను అధిగమించి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పేదరికం, అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని వర్గాలకు న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాన్ని పేదల ముంగిటకు తీసుకువెళ్లేందుకు న్యాయసేవాధికార సంస్థ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. మన న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 8,960 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రజలకు అవగాహన కలిగించిందని వివరించారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం న్యాయమూర్తులు హైకోర్టు వద్ద మొక్కలు నాటారు. -
రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రాత్మక పాలన
మా ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ 99.5 శాతం హామీలను అమలు చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపింది. విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో మా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనను పునరుద్ఘాటించింది. సామాజిక సాధికారత నినాదం కాదు.. మార్గదర్శక విధానమని నిరూపించింది. – గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ ప్రగతి దిశగా పయణిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గత 56 నెలలుగా లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలను ప్రతిబింబిస్తూ పాలన సాగిస్తోందన్నారు. అణగారిన వర్గాల్లో ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలను చేరవేస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పౌర సేవలను చేర్చి గ్రామ స్వరాజ్య భావనకు జీవం పోశామన్నారు. ఇప్పటివరకు డీబీటీ ద్వారా రూ.2,52,943.48 కోట్లు, నాన్–డీబీటీ ద్వారా మరో రూ.1,68,151.08 కోట్లు కలిపి మొత్తం రూ.4,21,094.56 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు సామాజిక విప్లవాన్ని తెస్తూ నామినేటెడ్ పనులు, పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో చరిత్రాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. పుష్కలమైన వనరులు, అపార అవకాశాలతో ఏపీ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా నిరుద్యోగం రేటు వేగంగా తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్వరాజ్యం సాకారం.. రాష్ట్రంలో 15,004 గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గొప్ప పాలన సంస్కరణలు తెచ్చాం. 540కిపైగా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దే అందుతున్నాయి. సొంత ఊరిలోనే యువతకు 1.35 లక్షలకుపైగా శాశ్వత ఉద్యోగాలు, 2.66 లక్షల మందికి వలంటీర్లుగా పని చేసే అవకాశం దక్కింది. 9,260 ఎండీయూలతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరుగుతుండగా వలంటీర్ల ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నాం. రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లు అందిస్తూ ఏపీ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ప్రతి నెలా 66.34 లక్షల మంది లబ్దిదారులకు రూ.1,968 కోట్లు అందిస్తోంది. గత 56 నెలల్లో సామాజిక భద్రతా పింఛన్ల కోసమే రూ. 84,731 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న సురక్ష ద్వారా కోటి సర్టిఫికెట్లను పౌరులకు ఉచితంగా అందచేసింది. ప్రపంచ స్థాయి విద్య.. మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. జగనన్న అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున 44 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు అందించాం. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ బోధనా పద్ధతులను ప్రవేశపెడుతూ నాడు–నేడు ద్వారా రూ.17,805 కోట్లతో 56,703 ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక కిట్లను ఉచితంగా అందిస్తున్నాం. దీని కోసం ఇప్పటి వరకు రూ.3367 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు రోజుకో మెనూతో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ.4,417 కోట్లు వ్యయం చేసింది. జగనన్న విద్యాదీవెన కింద 26,98,728 మంది లబ్దిదారులకు రూ.11,901 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించగా వసతి దీవెన కింద 25,17,245 మంది లబ్ధిదారులకు రూ.4,276 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో మన విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు రూ.107.08 కోట్లు వెచ్చించింది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌ల పంపిణీకి రూ.1,306 కోట్లు ఖర్చు చేసింది. 62 వేలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45 వేల స్మార్ట్ టీవీలను సమకూర్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు టోఫెల్‌కు సన్నద్ధం చేస్తూ శిక్షణ అందిస్తోంది. ఉన్నత విద్యలో సమున్నతం.. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ విద్యా వేదిక ఎడెక్స్‌తో ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీల్లో లభించే 2 వేల వర్టికల్స్‌ను మన విద్యార్థులకు అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు జాబ్ ఓరియెంటెడ్ మాడ్యూల్స్, 30 శాతం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కరిక్యులమ్‌లో ప్రవేశపెట్టింది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఒకే ఏడాది ఇంటర్న్‌షిప్‌లలో 3 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 18 విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రజారోగ్యానికి పెద్ద పీట.. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు క్యాన్సర్ లాంటి క్లిష్టమైన వ్యాధులకు పరిమితి లేని వైద్యాన్ని అందిస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ను 1,059 నుంచి 3,257కి పెంచింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద రూ.12,150 కోట్లు ఖర్చు చేయగా 4.25 కోట్ల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరికి విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.1,366 కోట్లు్ల అందించింది. వైద్య రంగంలో ఖాళీలు లేకుండా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించింది. రూ.1,208 కోట్లతో 1,704 వాహనాలు (108, 014లు), రూ.71 కోట్లతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు, డబ్ల్యూహెచ్ఓ/జీఎంపీ ప్రమాణాలతో 562 ఔషధాలను ప్రతి పీహెచ్సీలో అందుబాటులో ఉంచింది. నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చింది. 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటి వరకు 5 నూతన కళాశాలల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రారంభించింది. రూ.700 కోట్లతో ‘వైఎస్సార్ సుజలధార’ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలను తీర్చింది. 5 గిరిజన ప్రాంతాల్లో మల్టిస్పెషాలిటీ ఆస్పత్రులు, తిరుపతి (చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్), కడప (మానసిక ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్) పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.96 కోట్ల మందికి ఇంటి వద్దే నాణ్యమైన వైద్యాన్ని అందించింది. హృద్రోగ బాధితులకు సేవలందించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్లు నెలకొల్పుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్యులను గ్రామాలకే పంపిస్తుండగా ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌లో కొత్త అధ్యాయంగా జగనన్న ఆరోగ్య సురక్షను చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలలో రక్తహీనత నివారణకు రూ.6,688 కోట్లతో 35.70 లక్షల మంది లబ్దిదారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కిట్లను అందిస్తోంది. సులభతర వాణిజ్యంలో అగ్రస్థానం దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రూ.30 వేల కోట్లతో 3.94 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.2,087 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందించింది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే వద్ద రూ.16 వేల కోట్లతో 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో 4 కొత్త ఓడరేవులను నిర్మిస్తోంది. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రూ.3,200 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుండగా గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్‌పోర్టులను విస్తరిస్తోంది. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 56 నెలల్లో 311కి పైగా భారీ, మెగా పరిశ్రమలు స్థాపించగా 1.30 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. విశాఖలో జరిగిన జీఐఎస్ సదస్సులో రూ.13.11లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయానికి ‘భరోసా’ సొంత భూమిని సాగుచేసుకుంటున్న రైతులకే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ (అటవీ), ఎండోమెంట్ భూముల సాగుదారులకు సైతం వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.33,300 కోట్లు జమ చేమ చేసింది. 10,778 ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనం నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్ని వ్యవసాయ సేవలను అందిస్తోంది. ఉచిత పంటల బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు అందించగా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1977 కోట్లు అందించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1835 కోట్లు వడ్డీ రాయితీ జమ చేసింది. మరో 25ఏళ్ల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత వ్యవసాయ విద్యత్ అందించేందుకు సెకీతో ఒప్పందం చేసుకుంది. ఉచిత విద్యుత్‌తో 39.77లక్షల మంది రైతులు రూ.43,066 కోట్లు లబ్ధి పొందారు. ఆక్వా రంగంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా ఏకంగా 30 శాతం ఉంది. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందించేందుకు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను నిర్మించింది. 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న ఆక్వా రైతులకు యూనిట్‌కు కేవలం రూ.1.50 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తూ 3,250 కోట్లు సబ్సిడీ భారాన్ని భరించింది. రూ.1,052 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను రూపుమాపి ఇప్పటి వరకు 36.60లక్షల మంది రైతుల నుంచి రూ. 63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సంపూర్ణ మద్దతు ధర అందించింది. మూతపడిన సహకార డెయిరీలను పునరుజ్జీవం పోస్తూ అమూల్ సహకారంతో జగనన్న పాలవెల్లువను కొత్త పుంతలు తొక్కిస్తోంది. మహిళకు సాధికారత.. ఎన్నికల హామీలో భాగంగా స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. నాలుగు దశల్లో 78.94 లక్షల మంది మహిళలకు మొత్తం రూ.25,571 కోట్లను జమ చేసింది. సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు అందించింది. వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలకు రూ.14,129 కోట్ల సాయాన్ని అందించింది. కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ.1257 కోట్లు పంపిణీ చేసింది. మహిళల భద్రత కోసం దిశ యాప్, సచివాలయాల్లో మహిళా పోలీసు కానిస్టేబుళ్లను నియమించింది. నిరుపేదల కలను నెరవేరుస్తూ 31.19 లక్షల మందికి మహిళల పేరిట ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు 22 లక్షల గృహాలను నిర్మిస్తోంది. సుమారు రూ.మూడు లక్షల కోట్ల సందపను సృష్టించి మహిళలకు అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అండగా నిలుస్తోంది. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాలకు కనీసం 10వ తరగతి విద్యార్హతను ప్రామాణికంగా నిర్ణయించి ఇప్పటివరకు 46,062 మంది లబ్దిదారులకు రూ.349 కోట్లు పంపిణీ చేసింది. జలయజ్ఞం ఫలాలు.. నీటిపారుదల రంగంలో ప్రభుత్వ దార్శనికత కోట్లాది మంది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తోంది. కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల్లో చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు పూర్తి కాగా రూ.600 కోట్లతో బ్రహ్మం సాగర్ లీకేజీ సమస్యను పరిష్కరించింది. చిత్రావతి కోసం రూ.280 కోట్లతో భూసేకరణ, ఆర్అండ్ఆర్ పూర్తి చేసి 10 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని సాధించింది. గండికోట నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం రూ.925 కోట్లు వెచ్చించింది. అవుకు 2వ సొరంగం పనులు పూర్తి చేసి ఎస్ఆర్బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో లక్కసాగరం ఎత్తిపోతల పూర్తి కావడంతో కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఖరీఫ్ వర్షాలతో నల్లమల సాగర్‌లో నీటిని నిల్వ చేయనుంది. రూ.240 కోట్లతో మడకశిర బైపాస్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీటి పంపిణీ దిశగా అడుగులు వేస్తోంది. కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసింది. రూ.340 కోట్లతో వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించింది. మార్చి నాటికి నాగావళి, వంశధార అనుసంధానం, జూన్ నాటికి వంశధార ప్రాజెక్ట్ 2వ దశ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తాం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి 800 అడుగుల్లో 3 టీఎంసీల నీటిని మళ్లిస్తాం. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కుందూ నది, నిప్పుల వాగు సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాం. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ధర్మవరం నియోజకవర్గానికి నీరందించేందుకు జిల్లెడు బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపట్టాం.హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ప్రారంభించగా తారకరామ తీర్థ సాగర్, తోటపల్లి కెనాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ♦ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంగా దేశంలో వందేళ్ల తర్వాత చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 17,460 రెవెన్యూ గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయడంతో పాటు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ♦ వర్క్‌ఫ్రమ్ హోమ్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం వైఎస్సార్ గ్రామ డిజిటల్ లైబ్రరీలను 12,979 పంచాయతీల్లో నిర్మిస్తూ అపరిమిత బ్యాండ్‌విడ్త్ సౌకర్యం కల్పిస్తోంది. ♦ వైఎస్సార్ వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు, నేతన్న నేస్తం కింద రూ.983 కోట్లు, జగనన్న చేదోడు కింద నాయీబ్రహ్మణులు, దర్జీలకు రూ.1268 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.540 కోట్లు అందించింది. ♦ జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.3374 కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు రూ.88.33 కోట్లు రీయింబర్స్ చేసింది. ♦ ప్రమాదాల్లో మరణించినవారు, దివ్యాంగులకు వైఎస్సార్ బీమా ద్వారా రూ.1582 కోట్లు అందించింది. ♦ ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతో పారదర్శకంగా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందిస్తోంది. ♦ టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్‌తో కలిసి రూ.1,695 కోట్లతో 3,967 ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా 3వేల మంది అర్చకులకు రూ.48.33 కోట్ల మేర ఆర్థిక భరోసా అందించింది. ధూపదీప నైవేద్యం పథకం కింద ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేస్తోంది. 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించింది. ♦ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసింది 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించింది. ♦ గ్రామాల్లో యువతను క్రీడలవైపు ప్రోత్సహించడం, సమాజంలో ఆరోగ్యకర జీవనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏటా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టింది. -
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పొడవైన జాతీయ జెండా!
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని గార్డెన్ నంబర్ 95 శ్రీవేణుగోపాలస్వామి టెంపుల్ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 54 అడుగుల ఎత్తైన జాతీయ పతాక పోలుపై 12 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నైతిక నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గణతంత్ర వేడుకల్లో పిల్లలు ,మహిళలకు ఆట పోటీలు నిర్వహించి వారికి సంస్థ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం పిల్లల్లో దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని నైతిక నిర్వాహణ సభ్యుడు ఆడిటర్ జగన్నాథం, ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త నర్ర భూపతి రెడ్డి, సామాజిక కార్యకర్త పూస యోగేశ్వర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా స్వాతంత్ర, గణతంత్ర కార్యక్రమాల్ని నిర్వహిస్తామని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని సౌకర్యాలు కల్పించిన కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్‌కు నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: తల్లిగా కవితకు ఆ బాధ తెలియదా..? జీవన్ రెడ్డి ఫైర్ -
రిపబ్లిక్ డే స్పెషల్.. 'మూడు రంగుల ముస్తాబు'
దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్‌లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్ కాన్సెప్ట్‌తో స్పెషల్‌గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్‌ను ఎంపిక చేసుకునే స్పెషల్ డే కి స్పెషల్ లుక్. యాక్ససరీస్.. ► ఔట్ఫిట్స్లో ట్రై కలర్స్‌కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్ గాజులు, బ్రేస్లెట్స్ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్‌లో నెయిల్‌పాలిష్ డిజైన్‌నూ ఎంచుకోవచ్చు. ► వైట్ కుర్తా మీదకు ట్రై కలర్ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది. ► పూర్తి వైట్ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు. ► ఆరెంజ్ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజ్ లేదా సేమ్ ఆల్ ఓవర్ ఒకే కలర్‌ని ఎంచుకోవచ్చు. ► జీన్స్ మీదకు గ్రీన్ కలర్ కుర్తా లేదా లాంగ్ ఓవర్ కోట్, ట్రై కలర్ జాకెట్ ధరించినా చాలు. ప్రఖ్యాత డిజైనర్స్ సైతం తమ డిజైన్స్‌లో తెలుపు, పచ్చ, ఆరెంజ్‌ల ఒకే కలర్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఔట్‌ఫిట్‌ను మనమే సొంతంగా రీ డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
రిపబ్లిక్ డే వేడుకలు: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన
న్యూఢిల్లీ: కర్తవ్యపథ్‌లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్‌లో వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వీక్షకులను ఆకట్టుకుంది. సీటింగ్ ఏరియాలో సుమారు 1900 చీరలను ప్రదర్శించారు. ‘అనంత్ సూత్ర’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన చీరలను ప్రదర్శనకు పెట్టారు. Here’s a special look at the 'Anant sutra- The Endless Thread' textile installation at #KartavyaPath as a part of the 75th #RepublicDay celebrations!#CultureUnitesAll #AmritMahotsav #BharatKiNariinSaree #RepublicDay2024 pic.twitter.com/DoFQCJuFRm — Ministry of Culture (@MinOfCultureGoI) January 26, 2024 చెక్క ఫ్రేమ్స్‌కు రంగరంగు చీరలను అమర్చి ప్రదర్శించారు. దీంతో సీటింగ్ ఏరియాలో కూర్చన్న వీక్షకులను వాటిని చూసి సందడి చేశారు. ఇక.. ఆ చిరలను ఎక్కడ నేశారో? వాటి వెరైటీ ఎంటో? చీరల ఎంబ్రైడరీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చీరకు యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయటం విశేసం. దీనికి సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తన ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకేసారి దేశంలో ఉన్న పలు వెరైటీ చీరలు చూడటం బాగుంది.. యూఆర్ కోడ్ ఐడియా సూపర్’ అని కామెంట్లు చేస్తున్నారు. -
'ఇంటింటా ఇన్నోవేటర్' అవార్డుల ప్రదానం
హైదరాబాద్: 'ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024' కార్యక్రమంతో తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్ స్ఫూర్తి ప్రతిధ్వనించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంతో గ్రామ పంచాయితీల పరిధిలో 44 మంది ఆవిష్కర్తలకు గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది. 2023 ఏడాదికి 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమం కింద టీఎస్ఐసీ ద్వారా స్థానిక ఆవిష్కర్తలకు గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సన్మానాలు అందించారు. ఈ కార్యక్రమం స్థానికంగా సవాళ్లను గుర్తించి పరిష్కరించడంలో గ్రామస్తులను ప్రోత్సహించడమే కాకుండా యువ తరాలకు స్ఫూర్తినిస్తుంది. 44 మంది ఆవిష్కర్తల్లో గృహిణులు, పాఠశాల పిల్లలు, కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారి వినూత్న సహకారానికి నేడు(జనవరి 26)న అవార్డులు లభించాయి. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఉజ్వల భవిష్యత్తు వైపు తమ సొంత మార్గాన్ని రూపొందించుకోవడానికి సమాజాన్ని చైతన్యపరుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 'విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులు' అందించారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఆహార సాంకేతికత, పర్యావరణం, ఆటోమొబైల్స్, ఆక్వాకల్చర్, సాంకేతికత, పారిశుధ్యం వంటి వివిధ రంగాలలో విస్తృతమైన ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే అద్భుతమైన సాధనాల నుండి నీటి సంరక్షణ కోసం తెలివిగల పరిష్కారాల వరకు, సమస్యలను పరిష్కరించడంలో అట్టడుగు స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం గుర్తిస్తుంది. "ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024" ద్వారా కేవలం ఆవిష్కర్తల గుర్తింపు మాత్రమే కాదు.. సమాజాన్ని పురోగతి వైపు నడిపించే స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని టీఎస్ఐసీ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ అన్నారు. ప్రతి గ్రామం సృజనాత్మకతతో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మూసీ సుందరీకరణే లక్ష్యం -
భారత్‌లో ఆ దేశాధ్యక్షుడు.. కీలక ప్రకటన చేసిన టీసీఎస్
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశంలో పర్యటిస్తున్న వేళ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతిపెద్ద భారతీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌కు ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్‌కు యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. యూరప్‌లోని ఇతర దేశాల కంటే ఫ్రాన్స్‌లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ సప్తగిరి చాపలపల్లి పీటీఐతో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో టీసీఎస్ మూడు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉందని రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత వేగవంతంగా వృద్ధి చేసేందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధమైనట్లు సప్తగిరి చెప్పారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని ప్రధాన రంగాలలో 80 ఫ్రెంచ్ క్లయింట్లతో టీసీఎస్ పని చేస్తోందని, పారిస్‌లో ఒక ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా నడుపుతోందని వివరించారు. టీసీఎస్‌కు ఫ్రాన్స్‌లో ఉన్న 1,600 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది పారిస్‌లో ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు ఫ్రెంచ్ పౌరులు. కాగా అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రత్యర్థి కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెంచ్ మార్కెట్లో బలంగా ఉంది. అయితే టీసీఎస్ తన సొంత బలంతో అభివృద్ధి చెందుతుందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ పేర్కొన్నారు. -
ఎర్రకోట వద్ద రిపబ్లిక్ డే వేడుకలు
-
భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. "ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్రెంచ్ రాని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా.. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తామని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం జైపుర్ శివారులోని ఆమెర్ కోటను మాక్రాన్ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. ఇదీ చదవండి: Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో -
విజయవాడ గణతంత్ర వేడుకల్లో ఉత్సాహంగా సాగిన మార్చ్ ఫాస్ట్
-
'రిపబ్లిక్ డే' పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా ఏఐ శకటం!
'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.' శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్‌ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది. శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్ల ద్వారా ఏఐ అప్లికేషన్ల ఉపయోగం, నావిగేషన్‌కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా!
రిపబ్లిక్‌డే జనవరి 26న ఎందుకు జరుపుకుంటామో తెలుసా?’ అనే ప్రశ్నకు...‘1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి’ అని చెబుతాం. ఇది నిజమే అయినప్పటికీ అసలు కారణం వేరు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. అయితే రాజ్యాంగాన్ని అమలు చేసే తేదీకి ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో జనవరి 26ని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు. జనవరి 26 ప్రాముఖ్యత ఏమిటి? 1930 జనవరి 26న లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ‘జనవరి 26’కి చిరస్థాయి కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారి నారాయణ్ రైజాదా తన అందమైన చేతి రాతతో హిందీ, ఇంగ్లీష్లలో రాశారు. రాయడానికి ఆరు నెలల సమయం తీసుకుంది. తొలి రిపబ్లిక్ పరేడ్ (1950) దిల్లీలోని ఇర్విన్ యాంఫీథియేటర్ (ప్రస్తుతం మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో జరిగింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి విదేశీ సైనిక బృందం...ఫ్రెంచ్ ఆర్మీ సైనికులు (2016). ఫస్ట్ రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరైన ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ణో. (చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!)