సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ సేవల్లోని మొత్తం 1,132 మంది అధికారులకు కేంద్రప్రభుత్వం నాలుగు కేటగి రీల్లో పతకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 మంది పోలీసులకు ప్రతిభా సేవాపతకాలు, ఇద్దరు జైలు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు, ఆరుగురికి మెడల్ ఫర్ గ్యాలెంట్రీ లభించాయి. అడిషనల్ డీజీపీలు దేవేంద్ర సింగ్ చౌహాన్, సౌమ్యా మిశ్రాకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
మెడల్ ఫర్ గ్యాలెంట్రీ వీరికే
వాడిచెర్ల శ్రీనివాస్, నలివేణి హరీశ్, గడ్డిపోగుల అంజయ్య, బూర్క సునీల్ కుమార్, ఎండీ.అయూబ్, పి.సతీష్‌లు గ్యాలెంట్రీ పతకాలకు ఎంపికయ్యారు.
ప్రతిభా సేవా పతకాలు వీరికి
డీఐజీ జాకబ్ పరిమళ హన నూతన్, ఏఎస్పీ డి.చంద్రయ్య, 8వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ కొక్కు వీరయ్య, కమాండెంట్ నరుకుళ్ల త్రినాథ్, ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు, ఏసీపీ పింగిళి నరేష్ రెడ్డి, ఏసీపీ శ్రీరాముల మోహన్ కుమార్, ఎస్‌ఐ బెల్లం జయచంద్ర, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్‌ఐ ఎనుముల వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్‌ఐ గండిపూ డి ఏసుపాదం, హెడ్ కానిస్టేబుల్ జంగయ్య, ఎస్‌ఐ మంచిరేవుల సురేందర్ రెడ్డికు పోలీసు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు.. కరెక్షనల్ సర్వీసు కేటగిరీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ అర్కోట్ శ్రీధర్, జైలర్ యాదరి రమణయ్య ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు.
మొత్తం 1,133 పతకాలు: కాగా ఈఏడాది ప్రకటించిన మొత్తం 1,132 పతకాల్లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు వారి మరణానంతరం లభించాయి. మిగతా 275 మందికి శౌర్యపతకాలు, 102 మందికి రాష్ట్ర పతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి ప్రతిభా సేవా పతకాలను గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గ్యాలెంట్రీ పతకా లు దక్కించుకున్న 275 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 72 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 26, ఝార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది పోలీసులు ఉన్నారు. సీ ఆర్పీఎఫ్ నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది శౌర్య పతకాలకు ఎంపికయ్యారు.
ఏపీకి చెందిన 9మంది అధికారులకు ప్రతిభా సేవా పతకాలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తొమ్మిదిమంది పోలీసు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. కమాండెంట్ కోటనాని వెంకట ప్రేమ్‌జిత్, ఆర్‌ఎస్‌ఐ ఆవుల చెన్నయ్య, ఏఎస్‌ఐ ఆర్.రమణారెడ్డి, ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు అద్దంకి, ఏఎస్‌ఐ బి.ప్రకాశ్‌రావు, ఏఎస్‌ఐ కరి మస్తాన్‌రావ్, అసిస్టెంట్ కమాండెంట్ పుల్లభొట్ల వెంకట సత్య అనంత దుర్గ ప్రసాద్ రావు, ఇన్‌స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరి రావు, డీఎస్పీ కోటిరెడ్డి పోలీసు ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పెనికలపాటి వెంకట రమణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జాస్తి రమణయ్య, లీడింగ్ ఫైర్‌మ్యాన్ షేక్ ఘనీలకు ఫైర్ సర్వీసెస్ కేటగిరీలో ప్రతిభా సేవా పతకాలు దక్కాయి.
చౌహాన్‌కు డబుల్ ధమాకా
రాష్ట్రపతి మెడల్‌తో పాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ పోలీస్ అధికారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు ఒకేసారి రెండు అవార్డులు లభించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే రాష్ట్రపతి మెడల్‌కు డీఎస్ చౌహాన్ ఎంపికయ్యారు. దీంతోపాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు(2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును గురువారం జేఎన్‌టీయూలో జరిగిన ఓటర్స్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతులమీదుగా డీఎస్ చౌహాన్ అందుకున్నారు. ఒకే రోజు రెండు అవార్డులు రావడం పట్ల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆయ నకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యం అయిందని ఈ సందర్భంగా డీఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment