Central Govt.
-
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్‌తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్‌తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
ఏపీకి రూ 7,211 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 28 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన రూ.1,78,173కోట్ల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తంలో 2024 అక్టోబరులో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా రూ.89,086.50కోట్లు కూడా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211కోట్లు, తెలంగాణకు రూ.3,745కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్కురూ.31,962కోట్లు ఉండగా, అత్యల్పంగా గోవాకు రూ.688కోట్లు ఇచ్చింది. పండుగల సీజన్ దృష్ట్యా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడం, అభివృద్ధి, సంక్షేమ తదితర వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందస్తు వాయిదాలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. -
మీరు వెళ్లాల్సిందే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఏఎస్‌ల కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించినవారు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణకు కేటాయించినా ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సృజన(ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్), శివశంకర్ లోతేటి (వైఎస్సార్ జిల్లా కలెక్టర్), సీహెచ్ హరికిరణ్(వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్)లను వెంటనే తెలంగాణకు వెళ్లాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ అధికారులను ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ చేస్తూ వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తెలియజేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే... రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. అలాగే తెలంగాణకు కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు.. తమను ఏపీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరినా అంగీకరించలేదు. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వారికి అనుకూలంగా క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. గత మార్చిలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి వారి అభ్యర్థనలు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారుల అభ్యంతరాల పరిశీలనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దీపక్‌ను కేంద్రం నియమించింది. దీపక్ ఇచ్చిన నివేదిక మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను తిరస్కరించింది. కచ్చితంగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
Dalavai Shivamma: అమ్మ గీసిన బొమ్మ
దళవాయి శివమ్మ... తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూప చిత్రాలను గీస్తూ ‘శిల్పగురు’ జాతీయ పురస్కారానికి ఎంపికైన తెలుగు మహిళ శివమ్మ.దళవాయి శివమ్మది ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మల కుంట గ్రామం. తోలుబొమ్మలపై అద్భుతమైన చిత్రాలను సృజనాత్మకంగా చిత్రీకరిస్తోంది. శ్రీకృష్ణ చరిత్ర, విశ్వరూప హనుమ ఘట్టాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు అందించే శిల్పగురు అవార్డుకు ఈ ఏడాది శివమ్మను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక మహిళ ఆమె. కేంద్ర చేనేత, జౌళి, హస్త కళల శాఖ ఆమెకు శిల్పగురు అవార్డును ప్రకటించింది. ఈమె ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు ప్రధానం చేసింది.తోలుబొమ్మల తయారీ దళవాయి శివమ్మ కుటుంబవృత్తి. భర్త ్ర΄ోత్సాహంతో ఆమె తోలుబొమ్మలను తయారు చేయడంలో నైపుణ్యాన్ని సాధించారు.. తాతముత్తాతల కాలం నాటినుండి వారికి ఈ కళపై పట్టు ఉండటంతో మారుతున్న ఫ్యాషన్ ΄ోటీ ప్రపంచానికి ధీటుగా వైవిధ్యమైన బొమ్మలను చిత్రిస్తున్నారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న ల్యాంప్సెట్లు, పెయింటింగ్స్, డోర్హ్యాంగర్స్, రామాయణ ఘట్టాలు, సుందరకాండ, శ్రీకృష్ణలీలలు, విశ్వరూప హనుమల ఘట్టాలు ్ర΄ాచుర్యం ΄÷ందాయి.విదేశాల్లో మన బొమ్మలుశివమ్మ తయారు చేస్తున్న తోలుబొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో΄ాటు యూరప్, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కళ తనతో ΄ాటే అంతరించి ΄ోకుండా నాలుగు తరాల ΄ాటు కొనసాగాలని ఆమె ఆకాంక్ష. అందుకోసం కొత్తతరానికి శిక్షణ ఇస్తోంది. గ్రామీణ మహిళలకు ఉ΄ాధిని కల్పిస్తోంది. ఈ తోలుబొమ్మలను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. దళవాయి శివమ్మ కుమారుడు కుళ్లాయప్ప తోలుబొమ్మల తయారీలో జాతీయ స్థాయి అవార్డులు, వియత్నాం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వీరి కుటుంబం ఎంతో మంది కళాకారులకు ప్రేరణగా నిలుస్తోంది. ఇది కళకు దక్కిన గౌరవంకేంద్ర ప్రభుత్వం తనకు శిల్పగురు అవార్డును ప్రకటించడం యావత్ హస్తకళలకు, కళాకారులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వందల యేళ్లనాటి పురాతన కళ అయిన తోలుబొమ్మలను తాతల కాలం నుండి తయారు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో తమ ఉత్పత్తులకు ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా కళ అంతరించి ΄ోకుండా ఎంతో మందికి నేర్పాలన్నదే నా జీవిత లక్ష్యం. – దళవాయి శివమ్మ, తోలుబొమ్మల చిత్రకారిణి, జాతీయ అవార్డు గ్రహీత – కొత్త విజయ్‌భాస్కర్‌రెడ్డి, సాక్షి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా -
వైద్యుల భద్రతపై కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ ఈ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని, అభిప్రాయాలు తెలియజేయవచ్చని వెల్లడించింది. వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని, రోగులకు చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్న సమయంలో డాక్టర్లు అందుబాటులో వైద్య సేవలు నిలిపివేయడం సరైంది కాదని సూచించింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఐఎంఏ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలియజేసింది. అ న్ని రాష్ట్రాల్లోని తమ ప్రతినిధులతో చర్చించి, తమ నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టంచేసింది. హాస్పిటల్స్‌ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బందిపై హింస జరగకుండా ఒక చట్టం తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల విషయలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది. రెండో రోజు విచారణకు హాజరైన సందీప్ ఘోష్ జూనియర్ డాక్టర్ పట్ల జరిగిన అమానవీయ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అనుమానితులను పిలిపించి ప్రశి్నస్తోంది. ఘాతకం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వరుసగా రెండో రోజు శనివారం కూడా సీబీఐ ఎదుట హారయ్యారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్‌కి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అదికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల కోసం ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం కోల్‌కతాకు చేరుకుంది. దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం రోడ్డెక్కారు. తమకు భద్రత కలి్పంచాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అత్యవసరం కాని ఇతర వైద్య సేవలను నిలిపివేశారు. ఢిల్లీ, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడి శా తదితర రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలావరకు నిలిచిపోయాయి. -
శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా తిరుపతి ఎయిర్పోర్ట్ పేరు !
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్‌పోర్ట్‌ల పేర్ల మార్పునూ ప్రతిపాదించింది. 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. దర్బంగా ఎయిర్‌పోర్ట్‌ను విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్ కోరింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నాయి. -
కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు NDA సిద్ధం
-
‘బోర్న్‌విటా’ పై కేంద్రం కీలక ఆదేశాలు.. తక్షణమే అమల్లోకి
న్యూఢిల్లీ: చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పలు తయారీ కంపెనీల వెబ్సైట్లు, ఇతర మాద్యమాల్లో పలు చాక్లెట్ మాల్ట్ డ్రింక్ ఉత్పత్తులపై ‘హెల్త్ డ్రింక్’ అనే పదాన్ని తొలగించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈకామర్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. వాటిల్లో బోర్న్‌వీటా సైతం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ)కి సబ్మిట్ చేసిన మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ (బోర్న్‌వీటా తయారీ కంపెనీ) సమర్పించిన నియమాలు, నిబంధనల్లో బోర్న్‌వీటా ‘హెల్త్ డ్రింక్’గా నమోదు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ అయితే నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సీపీసీఆర్) చట్టం 2005 సెక్షన్ (3) సీఆర్పీసీ చట్టం 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్సీపీసీఆర్ చేసిన పరిశోధన నేపథ్యంలో ఈ కీలక ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. పవర్ సప్లిమెంట్లను సైతం అంతకుముందు, భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్లను 'హెల్త్ డ్రింక్స్'గా విక్రయాలు జరుపుతున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ (FSSAI)ని కోరింది. ముఖ్యంగా, రెగ్యులేటరీ బాడీ ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో ‘హెల్త్ డ్రింక్’ అని ఎక్కుడా వినియోగించకూడదు. కాదని హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తే సదరు కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. కాగా, ఈ నెల ప్రారంభంలో, డైరీ ఆధారిత లేదా మాల్ట్ ఆధారిత పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’గా లేబుల్ వినియోగించడాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తుంటే వెంటనే వాటిని నిలిపివేయాలని ఈ-కామర్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతెను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31దాకా ఈ పదవిలో కొనసాగుతారు. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) నూతన సారథిగా 1991 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి పీయూశ్ ఆనంద్‌ను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా 1995 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్.సురేశ్‌ను నియమించారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్ ప్లాంట్ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్ కేఏ పాల్‌ను ఆదేశించింది. ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నరేందర్ ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్‌కు స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
అమల్లోకి సీఏఏ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డా దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం తాలూకు నియమ నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కలి్పస్తున్న తొలి చట్టమిది! పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం కలి్పంచడం దీని ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు ఆ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధ్రువీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. వీటిని పౌరసత్వ (సవరణ) నిబంధనలుగా పిలుస్తారని కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘సీఏఏ చట్టం–2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఆన్లైన్లో సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక విండో అందుబాటులో ఉంచాం’’అని ఆయన వెల్లడించారు. బీజేపీ హర్షం, విపక్షాల ధ్వజం సీఏఏ అమలు, నిబంధన జారీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వెలిబుచ్చారు. రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చి చూపారంటూ అభినందించారు. పాక్, బంగ్లా, అఫ్గాన్లలో మతపరమైన ఊచకోతకు గురైన ముస్లిమేతర మైనారిటీలు భారత పౌరసత్వం పొందేందుకు ఈ నిబంధనలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయంపై మండిపడ్డాయి. ఇది దేశ సమగ్రతకు సీఏఏ విఘాతమంటూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఆప్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, మజ్లిస్ తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. దీన్ని కేవలం బీజేపీ ఎన్నికల లబ్ధి ఎత్తుగడగా అభివరి్ణంచాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, అసోంలలో మతపరమైన విభజన తెచ్చి ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ చర్యకు దిగిందని ఆరోపించాయి. ఆమ్నెస్టీ ఇండియా కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించనందుకు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వైనం మీడియా హెడ్లైన్లలో రాకుండా చూసేందుకు బీజేపీ ఈ పని చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. సీఏఏను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఇది సమాజంలో మతపరంగా విభజనకు దారి తీస్తుందదన్నారు. ప్రజల హక్కులను హరించే ఎలాంటి మత, కుల, సామాజికపరమైన వివక్షనైనా తుదికంటా వ్యతిరేకించి తీరతామని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అసోంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. పాక్ తదితర దేశాల నుంచి వచి్చన ముస్లిమేతర శరణార్థులు మాత్రం దీన్ని స్వాగతించారు. ముస్లింల పట్ల సీఏఏ పూర్తిగా వివక్షపూరితమంటూ ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019లోనే దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఏఏ అమలు నిర్ణయం వెలువడ్డ నిమిషాల్లోనే సంబంధిత ఇ–గెజిట్ వెబ్సైట్ క్రాషైంది. దాన్ని కాసేపటికి పునరుద్ధరించారు. సీఏఏలో ఏముంది...! ► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. ► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కలి్పస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు. ► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది. ► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వం డీఏ (Dearness Allowance)ను 4 శాతం పెంచే నిర్ణయానికి ఈ రోజు (గురువారం) ఆమోదం తెలిపినట్లు. ఈ పెంపు తరువాత డియర్నెస్ అలవెన్స్ & డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) 50 శాతానికి చేరుతుంది. ఈ పెంపు వల్ల కేంద్రం రూ.12,868.72 కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వచ్చే నెల నుంచే జీతాలు, పెన్షన్ వంటివి భారీగా పెరుగుతాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపుతో పాటు, రవాణా అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్‌లలో కూడా 25 శాతం పెరుగుదల ఉంటుందని సమాచారం. #WATCH | Union Cabinet approves hike in Dearness Allowance to govt employees and Dearness Relief to pensioners by 4% from January 1, 2024, announces Union Minister Piyush Goyal. pic.twitter.com/IsWUnwBGHW — ANI (@ANI) March 7, 2024 -
ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, నిర్వహణపై నిశిత పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. రెండేళ్ల క్రితమే ఉత్తర రింగుకు సంబంధించి కసరత్తు ప్రారంభించి అలైన్‌మెంటు ఖరారు చేసినా, ఇప్పటివరకు టెండర్ల దశకు రాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం కదలిక వచ్చింది. 162 కి.మీ. నిడివి ఉండే ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం చెల్లింపు ప్రక్రియలో భాగంగా గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేసేందుకు అంతా సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఉత్తర భాగానికి సంబంధించిన పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 4 వరసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అవసరం ఉందని కేంద్రం తేల్చింది. ఈ భాగంలో రోడ్డు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని సొంతంగా భరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈ పీసీ) పద్ధతిలో టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థను గుర్తించాలని నిర్ణయించింది. రోడ్డు నిర్మాణం తర్వాత ఏర్పాటు చేసే టోల్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మరో టెండరు పిలిచి కాంట్రాక్టు సంస్థను గుర్తించనుంది. కేంద్రమే టోల్ రుసుమును వసూలు చేసుకుంటుంది. బీఓటీ కాకుంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్! దక్షిణ భాగానికి వచ్చే సరికి ఈపీసీ టెండరింగ్‌కు వెళ్లొద్దని ప్రాథమికంగా నిర్ణయించింది. దాదాపు 180 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగాన్ని నిర్మించే ప్రాంతంలో ఉండే పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే దక్షిణ భాగం పరిధిలో వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. దీంతో అసలు దక్షిణ భాగానికి నాలుగు వరసల రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరకు రింగురోడ్డులా ఉండాలంటే రెండు భాగాలూ ఒకే తరహాలో ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అయితే ఈపీసీ పద్ధతిలో కాకుండా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో దక్షిణ భాగానికి టెండర్లు పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పద్ధతిలో.. నిర్మాణ సంస్థ సొంత నిధులతో రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధారిత కాలం ఆ రోడ్డుపై టోల్‌ను వసూలు చేసుకోవటం ద్వారా ఆ ఖర్చును రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పని తలకెత్తుకునేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాని పరిస్థితి నెలకొంటే.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో టెండర్లు పిలవాలని భావి స్తోంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 40% మొత్తాన్ని పది వాయిదాల్లో చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. వచ్చే జూన్, జూలైలలో దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంటుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. -
కేంద్రం దెబ్బకు దిగొచ్చిన గూగుల్
సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ మొబైల్ యాప్‌లను తొలగించిన గూగుల్ అప్పుడే యాప్‌లను పునరుద్ధరించే (Restore) ప్రక్రియను ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్'తో కంపెనీ అధికారులు సమావేశం జరగకముందే టెక్ దిగ్గజం ఈ చర్యకు పూనుకుంది. గత శుక్రవారం గూగుల్ భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను తొలగించి.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వివాదానికి కారణమైంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ కారణంగానే కంపెనీ ప్రముఖ యాప్‌లను తొలగించింది. తొలగించిన యాప్‌లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్‌లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఈయనే లేకుంటే భారత్‌లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని.. మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. -
గూగుల్ చర్యను అనుమతించలేము.. యాప్స్ తొలగింపుపై కేంద్రం
గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్‌లను తొలగించే చర్యను అనుమతించలేమని కేంద్రం తెలిపింది. టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్‌ల ప్రతినిధులను సోమవారం (మార్చి 4) రావాలని ఐటి మంత్రి 'అశ్విని వైష్ణవ్' ఆహ్వానించారు. సర్వీస్ ఫీజు చెల్లింపులపై వివాదాలను పేర్కొంటూ గూగుల్ నిన్న (మార్చి 1) భారతీయ కంపెనీల యాప్‌లను తొలగించడానికి సిద్ధమైంది. ఇందులో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. అయితే గూగుల్ చేపట్టిన ఈ చర్యకు కంపెనీలు అసహనం వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, గూగుల్ అధికారులతో చర్చ జరిపిన తరువాత సానుకూలమైన ఫలితం రావచ్చని, తప్పకుండా ఈ కంపెనీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి 'అశ్విని వైష్ణవ్' వెల్లడించారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం! సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా యాప్ డెవలపర్లు నిబంధలను ఉల్లగించినట్లు, ఈ కారణంగానే ఆ యాప్‌లను తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం త్వరలో ఐటి మంత్రిని కలిసిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలుస్తుంది. -
పేటీఎంకు కేంద్రం భారీ షాక్
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (ppbl)కు భారీ షాక్ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా(FIU-IND) పీపీబీఎల్‌కు భారీ జరిమానా విధించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది . కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్లైన్లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టిసారించాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్‌లోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘీక కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పలు అకౌంట్లకు మళ్ళించిటన్లు తాము గుర్తించామని’, కాబట్టే చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐయూ-ఐఎన్డీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక వెల్లడించింది. -
ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ
న్యూఢిల్లీ: రాబోయే ఖరీఫ్ సీజన్(ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30)లో ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఎప్పటిలాగే రూ.1,350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అలాగే దేశంలో కొత్తగా మూడు సెమీ–కండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టాటా గ్రూప్, జపాన్‌కు చెందిన రెనిసస్ వంటి కంపెనీలు కలిసి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. రక్షణ, అటోమొబైల్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలకు అవసరమైన సెమీ–కండక్టర్లను తయారు చేస్తారు. -
ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కిసాన్ స్టూడియో, కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ కాల్ సెంటర్)’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి లో కిసాన్ అవుట్‌బౌండ్ కాల్ సెంటర్‌తో పాటు కిసాన్ స్టూడియోలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం జాతికి అంకితం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఓ కాల్ సెంటర్ ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లోనూ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పరిశీలించారు. వారిచ్చిన సూచనలతోనే కేంద్రం జాతీయ స్థాయిలో కాల్ సెంటర్, స్టూడియోలను కేంద్రం తీసు కొచ్చిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదీ కేంద్ర కాల్ సెంటర్ ఈ కేంద్రం ద్వారా నిపుణులైన సిబ్బంది రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. సీనియర్ అధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఇందులో ఉంటారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ కాల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ప్రధాన పంటలు సాగయ్యే ప్రాంతాల రైతులకు ఈ కాల్ సెంటర్ మార్గదర్శకంగా నిలుస్తుంది. రైతుల కు ఫోన్ చేసి పంటల స్థితిగతులు, అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వాటి తీవ్రతను బట్టి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపిస్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై రైతుల సూచనలు తీసుకుని అమలు చేస్తారు. కార్పొరేట్ స్థాయిలో గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 67 మంది సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ రైతులకు సాగులో, క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారానికి చక్కని వేదికగా నిలిచింది. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లో బృందాలను గ్రామాలకు పంపి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల మన్నననలు చూరగొంది. ఛానల్ ద్వారా సీజన్లో పంటలవారీగా అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలతో కూడిన వీడియోలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలతో రైతులకు దగ్గరైంది. ఐసీసీ ద్వారా 8.26 లక్షల కాల్స్, 12,541 వాట్సప్ సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఆర్బీకే ఛానల్ ను 2.81 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకోగా, 57.12 లక్షల మంది వీక్షించారు. వ్యవసాయ అను బంధ రంగాలకు చెందిన 1,698 వీడియోలను అప్లోడ్ చేసుకొన్నారు. ఐసీసీ సేవలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నో రాష్ట్రాలు వాటి ప్రతినిధులను పంపి అధ్యయనం చేశాయి. బ్రిటిష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, యూఎన్వోకు చెందిన ఎఫ్ఏవో కంట్రీ హెడ్ చి చోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ప్రముఖులు ఈ కేంద్రం పనితీరును ప్రశంసించారు. మన విధానాలు కేంద్రం అనుసరిస్తోంది సీఎం జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. పలు రాష్ట్రాలు కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి. గన్నవరంలోని ఐసీసీ కాల్ సెంటర్ నాలుగేళ్లుగా రైతుల సేవలో తనదైన ముద్ర వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఏపీ స్ఫూర్తితో కేంద్రం కేసీసీను తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఐసీసీ కాల్ సెంటర్‌ను మరింత పటిష్ట పరిచి సేవలను మరింత విస్తృతం చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోందా?
న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ తొలగింపులంటూ వస్తున్న ఆరోపణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ డేటా బేస్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని, తమ నుంచి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపింది. అంతే తప్పా.. ఆధార్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాల కోసం ఆధార్ కార్డ్ అత్యవసరం. కాబట్టే, ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ, కార్డు దారులు మార్పులు చేసుకుంటుంటే సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర సమాచారం డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ ఆధార్ కార్డ్ దారులు సమస్యలు తలెత్తితే యూఐడీఏఐకి ఫిర్యాదు చేయాలని కోరింది. రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉండేలా యూఐడీఏఐ ద్వారా కేంద్రం ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తుందన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో యూఐడీఏఐ పై విధంగా స్పందించింది. కుట్రపూరితంగా కేంద్రం కేంద్రం కుట్రపూరితంగా తమ రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డ్ లను నిరుపయోగం చేస్తుందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూఐడీఏఐపై పలు ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజలు వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందకుండా నిరోధించేలా వారి ఆధార్ కార్డ్ లను డీయాక్టీవ్ చేసిందని అన్నారు. బీర్ భూమ్ జిల్లాలో జరిగిన ప్రజా పంపిణీ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఆధార్ కార్డు లేని లబ్ధిదారులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్వహించే సంఓేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. ఆందోళన వద్దు..మీకు నేనున్నా బెంగాల్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కోసం నేను ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి. వారు (కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తున్నారు. బెంగాల్ లోని అనేక జిల్లాల్లో అనేక ఆధార్ కార్డ్ లు డీయాక్టీవేట్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలు ఉచిత రేషన్, బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ పథకం ప్రయోజనాలను పొందకూడదనేదే కేంద్రం ఉద్దేశమని, దీనిని తెలుసుకోవాలని ప్రజలను కోరారు. తన ప్రభుత్వం ఆధార్ కార్డు లేనివారికి సైతం పథకాలను అందించడం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. పుర్బా బర్ధమాన్ జిల్లా పరిధిలోని జమాల్‌పూర్‌లో 50 మంది, బీర్భూం, నార్త్, సౌత్ 24 పరగణాలు జిల్లాతో పాటు ఉత్తర బెంగాల్లో అనేక మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు డీలింక్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
రైతు ప్రధానికి సముచిత గౌరవం
పేదవర్గాలకు ఎనలేని సేవలందించిన భారత మాజీ ప్రధానమంత్రి దివంగత చరణ్ సింగ్‌కు ఆయన చనిపోయిన 45 ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డుకు ఎంపిక చేయటం హర్ష ణీయం. అదే విధంగా తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఎన్టీ రామా రావుకు కూడా భారతరత్న ఇస్తే సముచితంగా ఉంటుంది. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఓడించటంలో చరణ్ సింగ్‌ది ప్రధానపాత్ర. వాస్త వానికి 1971 ఎన్నికలలో రాయబరేలీలో ఇందిరమ్మపై పోటీచేసిన రాజ్ నారాయణ్ ఎన్నికల పిటిషన్ వేసి, అలహాబాద్ హైకోర్టులో నెగ్గడం వెనుక కూడా చరణ్‌సింగ్ చాణక్యం లేకపోలేదు. మధు లిమాయే 1977లో ఒక మాటన్నారు: ‘ఉత్తరభారతంలో రామ్ మనోహర్ లోహియా విఫలం కాగా చరణ్ సింగ్ సమర్థంగా వ్యవ సాయ కులాలను, మైనార్టీలను, వెనుకబడిన వర్గాలను గుదిగుచ్చి మాల తయారు చేయటంలో విజయం సాధించారు.’ 1937లో చరణ్ సింగ్ రెవిన్యూ మంత్రిగా ఉత్తరప్రదేశ్‌లో రైతురుణ విమోచన చట్టం తెచ్చి, రైతాంగాన్ని ఆనాడే అప్పుల బాధ నుండి బయట పడేశారు. 1979లో చరణ్‌సింగ్ ఆర్థికశాఖను చేపట్టి 1979–80 ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ సందర్భంలో ఓ రోజు ఉదయం ఫిబ్రవరి మొదటివారంలో చరణ్‌సింగ్‌ను కలుద్దామని తుగ్లక్ రోడ్డుకెళ్ళాను. అప్పట్లో ఆయన ఉప ప్రధానిగా కూడా ఉన్నారు. చరణ్ సింగ్ ఇంటి ముందు మూడు కార్లున్నాయి. వాటినిండా ఫైళ్ళు మూట గట్టి నింపేస్తున్నారు. వ్యక్తిగత భద్రతాధికారి కర్తార్ సింగ్ నన్ను చూడగానే, ‘చౌధరీ సాబ్ బడ్జెట్ రూపొందించేందుకై హరియాణాలోని సూరజ్‌కుండ్‌కు వెళ్తు న్నారు. నీవు ఇక్కడే ఉండు, చౌధరీసాబ్ బయటకు రాగానే కనపడ’ మని సలహా చెప్పారు. వాకిలి వద్దే నిలుచున్నాను. చౌధరీ బయటకు రాగానే నన్ను చూసి ‘ఏమిటింత ప్రొద్దున్నే వచ్చావు. గొడ్డుచలిలో?’ అని వాకబు చేశారు. ‘రెండు, మూడు సమస్యలున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరచాలి’ అని వివరించాను. కారు ఎక్కమన్నారు. వెనుక సీటులో చౌధరీసాబ్ పక్కన కూర్చున్నాను. ముందు సీటులో కర్తార్ సింగ్ కూర్చున్నారు. రైతులు పండించే పొగాకుపై ఎక్సైజ్ సుంకం రద్దుచేయవలసిన అవసరాన్ని వివరించాను. అదే మాదిరి పేదవారు వాడుకొనే అల్యూమినియం పాత్రలపై కూడా సుంకం తొలగించాలని వివరించాను. దానికి సంబంధించిన వివరాలతో, ముసాయిదా పత్రాన్ని కూడా తయారు చేశానని చెప్పాను. ఆ పత్రాలు లాక్కొని తన ఫైలులో పెట్టుకొన్నారు. ఆ రెంటినీ బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరిచారు. చాలా ఆశ్చర్యమేసింది. అంతకు ముందు బడ్జెట్లు రూపొందించే కసరత్తులో భాగంగా సలహాల కోసం బొంబాయి వెళ్ళి ఆర్థికవేత్తలు, ప్రణాళికా నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వారు, పాలనాదక్షులతో చర్చలు జరిపితే బడ్జెట్ మరింత నాణ్యంగా రూపొందించడానికి ఉపయోగపడగలదని సూచించాను. సరేనన్నారు. బొంబాయి సమావేశంలో పాల్గొన్న పెద్దలు చెప్పినవన్నీ జాగ్రత్తగా రికార్డు చేయించి, ఆ కాగితాలు తీసుకొని ఆ సూచనలలో ప్రతి ఒక్కదానికీ పూర్తి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రతిపాద నల్లో చేర్చారు. ‘బొంబాయిలోని వారంతా బడా బాబులు. వారు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తే, మనం సరైన మార్గంలో ఉన్నట్లు! మనం చేసిన పని బాగుందని వారు కితాబిస్తే మనం ఎక్కడో తప్పు చేశామని అర్థం! అని గీతోపదేశం చేశారు. 1979 జులైలో జనతాపార్టీ చీలిపోయింది. మొరార్జీ స్థానంలో చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన కాలంలో లోక్ సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు ప్రకటించారు. డీసీఎం అధిపతి అయిన భరత్ రామ్ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షులుగా చరణ్ సింగ్ దగ్గరకు వెళ్లి ఆయనకు ఎన్నికల నిధి ఇవ్వజూపారు. ఏమిటిదని అడిగారు చరణ్ సింగ్. ‘ఏమీ లేదు – ఇది మామూలే. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రధానమంత్రు లందరికీ మేము ఇలాగే సమర్పించుకొంటుంటాం. ఇందులో కొత్త ఏమీలేదు. ఇప్పుడు ప్రధాని కుర్చీలో మీరు కూర్చున్నారు గనుక మీకు సమర్పిస్తున్నాం’ అన్నారు. ‘ఏమిటీ నాకు డబ్బులిస్తావా? పోలీసులకు అప్ప జెబుతాను. నేను రైతుల దగ్గరికెళ్ళి రూపాయి – రూపాయి అడుక్కొంటాను గానీ, పారిశ్రామికవేత్తల విరాళాలతో ఎలక్షన్‌కు వెళ్తానా?’ అని కోపగించారు చరణ్ సింగ్. భరత్ రామ్ రాష్ట్రపతి భవన్ కెళ్ళి రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డిని కలిసి ‘భలేవాడిని ప్రధాన మంత్రిగా చేశారు సార్. ఎన్నికల నిధికి ఏదో పదిరూపాయలిద్దామని వెడితే, అరెస్ట్ చేయిస్తానని వెంటబడతాడే మిటి సార్’ అని వాపోయారు. ఎమ్వీఎస్ సుబ్బరాజు, గణపా రామస్వామి రెడ్డి, దొడ్డపనేని ఇందిర జనతాపార్టీ శాసనసభ్యులు, నీలం సంజీవరెడ్డికి ఆత్మీయులు. వారు వాస్తవానికి మానసికంగా లోక్ దళ్‌కూ, చరణ్ సింగ్ భావజాలానికీ దగ్గర. వారిని పిలిపించారు సంజీవరెడ్డి. ‘ఇదెక్కడ గోలయ్యా. తుండు, తుపాకీ లేకుండా యుద్ధానికి వెళతానంటాడు. ఎవరో పెద్దమనిషి పది రూపాయ లిస్తానంటే అరెస్టు చేయిస్తానంటాడు. ఈ సిద్ధాంత మూర్ఖుడితో కూడుగాదు, మీరు కాంగ్రెస్‌లో చేరిపోండి’ అని సలహా ఇచ్చారు. అలాగే చేశారు వారు ముగ్గురూ. ప్రధానమంత్రిగా నుండగా 1979 అక్టోబరులో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ. చౌధరీ సాబ్ ఉపన్యా సాన్ని తెలుగులోకి నేనే తర్జుమా చేశాను. ‘శివాజీ, నా ఉపన్యాసం కన్నా, నీ తర్జుమా మరింతగా శ్రోతలను ఆకట్టుకొంది. లేకుంటే సభ అంత రక్తికట్టేది కాదు’ అని సభానంతరం మనసారా అభినందించారు చరణ్ సింగ్. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్ల చీలిక వల్లనే కాంగ్రెస్ నెగ్గు కొస్తున్నదనీ, ఆ పార్టీలన్నీ ఐక్యం అయితే కాంగ్రెస్ పాలన ముగు స్తుందనీ చరణ్ సింగ్ విశ్వాసం. ఆ దిశగా ఆలోచన చేసే 1974 ఆగస్టు 29న భారతీయ క్రాంతిదళ్, సోషలిస్టుపార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీలు, ముస్లిం మజ్లిస్, స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, మజ్దూర్ పార్టీ, పంజాబ్ ఖేతీ భారీ జమీందారీ యూనియన్లను విలీనం గావించి భారతీయ లోక్‌దళ్‌ను రూపొందించారు. జాతీయ స్థాయిలో నిరంతరం రైతుల కోసం పరితపించిన చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వటం ఎంతో సముచితం. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రైతులందరూ స్వాగతిస్తున్నారు. డా‘‘ యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు ‘ 98663 76735 -
1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం - కారణం ఇదే..
డిజిటల్ మోసాలను నియంత్రించేందుకు, ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.4 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ 'వివేక్ జోషి' శుక్రవారం 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్' (CFCFRMS) ప్లాట్‌ఫారమ్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్‌బోర్డింగ్‌తో సైబర్ దాడులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. CFCFRMS ప్లాట్‌ఫారమ్‌ను నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)తో అనుసంధానం చేయడం కోసం పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య సమర్థవంతమైన సహకారాన్ని అందించడం, సరైన సమయంలో పర్యవేక్షించడం, మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం వంటి విషయాలను కూడా చర్చించినట్లు సమాచారం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణ 10 అంకెల సంఖ్యల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని TRAI సూచించిన విధంగా వాణిజ్య లేదా ప్రచార కార్యకలాపాల కోసం ప్రత్యేకించిన నెంబర్ సిరీస్‌లను ఉపయోగించాలని చర్చించుకున్నారు. అంతే కాకుండా నకిలీ డాక్యుమెంట్లతో తీసుకున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు టెలికామ్ శాఖ ఏఐ టెక్నాలజీ తీసుకురానుంది. ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.40 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిన సంస్థల మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 3.08 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసిన కేంద్రం, ఈ నేరాలకు పాల్పడుతున్న 500 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే.. సైబర్ మోసాలకు గురైన ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం, మోసపోయిన డబ్బును మోస పూరిత ఖాతాల నుంచి తిరిగి ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళికలు చేపడుతున్నారు. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే.. రాబోయే రోజుల్లో సైబర్ దాడుల నుంచి ప్రజలను విముక్తి లభిస్తుంది. -
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Plastic Currency: దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? చాలా కాలంగా చర్చ సాగుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు పార్లమెంటులో ఎదురైన ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. అలాగే పేపర్ కరెన్సీ , ప్లాస్టిక్ నోట్లు ప్రింటింగ్ ఖర్చుపైనా పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022-23 నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు మొత్తం రూ. 4682.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్! కాగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ఆలోచనను సెంట్రల్ బ్యాంక్ కొన్నేళ్ల కిందటే చేసింది. ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం.. రూ.10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు పది లక్షల నోట్లను కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని భావించారు. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును అటకెక్కించింది. -
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని ఆదేశించింది. ‘వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ.. బియ్యం రిటైల్, టోకు ధరలు సంవత్సరానికి 13.8 శాతం నుంచి 15.7శాతం పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేలా వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్‌ను కిలో రూ.29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు. భారత్ రైస్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్లలో భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ అందుబాటులో ఉంచనుంది కేంద్రం. తొలి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ కిలో గోదుమ పిండిని రూ. 27.50, భారత్ దాల్ (చనా) కిలో రూ. 60కి విక్రయిస్తోంది . బియ్యంపై స్పష్టత ఇవ్వాల్సిందే ట్రేడర్ల వద్ద అన్నీ రకాల బియ్యం బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్, వరి ఇలా ఎంత మేరకు నిల్వ ఉన్నాయో తెలపాలని, ఇందుకోసం ప్రతి వారం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పోర్టల్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా చెప్పారు. -
ట్రాయ్ చైర్మన్‌గా అనిల్ లాహోటీకి బాధ్యతలు
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా అనిల్ లాహోటీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కాల్ సర్వీసుల నాణ్యత పెంచడం, కాల్ డ్రాప్‌ల నియంత్రణ, అన్ని సంస్థలకు సమాన స్థాయిలో అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్, ఇతర ట్రాయ్ అధికారులతో సమావేశమయ్యారు. పీడీ వాఘేలా పదవీ కాలం ముగిసిన తర్వాత గత నాలుగేళ్లుగా ట్రాయ్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్‌గా రైల్వే బోర్డు మాజీ చీఫ్ అయిన లాహోటీ పేరును సోమవారం ప్రకటించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజినీర్స్ 1984 బ్యాచ్‌కి చెందిన ఆయన రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా 2023 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. -
కామన్ సర్వీస్ సెంటర్లుగా పీఏసీఎస్‌లు
సాక్షి, అమరావతి: ‘సహకర్ సే సమృద్ధి’ అనే నినాదంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)గా తీర్చిదిద్దేందుకు సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. దేశవ్యాప్తంగా 30 వేల పీఏసీఎస్‌లను సీఎస్‌సీలుగా మార్చనుండగా, ఏపీలో ఇప్పటికే 1,810 పీఏసీఎస్‌లు అంగీకారం తెలియజేశాయి. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించింది. గ్రామస్థాయిలో 300కు పైగా పౌరసేవలు యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ–సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య పౌరులతో పాటు రైతులకు 300కు పైగా వివిధరకాల పౌరసేవలను ఈ సీఎస్సీల ద్వారా అందించనున్నారు. రాష్ట్ర పరిధిలో 500కు పైగా పీఏసీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పీఏసీఎస్‌ల్లో కూడా దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్‌సీలుగా మారనున్న పీఏసీఎస్‌లను పౌరులకు బ్యాంకింగ్, బీమా, పాన్ కార్డులు, రైళ్లు బస్సులు, విమానాలకు సంబంధించిన ట్రావెల్ బుకింగ్స్, ఆధార్ అప్డేట్, న్యాయ సలహాల వరకు అనేక రకాల సేవలను వన్‌స్టాప్ షాపులుగా తీర్చిదిద్దనున్నారు. పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న సీఎస్‌సీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సాధనాలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ.. సీఎస్సీల్లో సేవలందించేందుకు వీలుగా పీఏసీఎస్‌ల సిబ్బందికి నేషనల్ కౌన్సిల్ ఫర్ కో ఆపరేటివ్ ట్రైనింగ్ (ఎన్‌సీసీటీ) ద్వారా ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ పొందిన 80 మంది మాస్టర్ ట్రైనర్స్ దేశంలోని 28 రాష్ట్రాల్లోని 570 జిల్లాల్లో ఎంపిక చేసిన పీఏసీఎస్‌ల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 13కోట్ల మంది రైతులకు లబ్ధి ïపీఏసీఎస్‌లను దశల వారీగా సీఎస్సీలు తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది. ఇప్పటికే 30వేల పీఏసీఎస్‌లను గుర్తించింది. ఈ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇవ్వనుంది. సీఎస్సీల ద్వారా అందించే సేవలతో 13 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ మార్పుతో అదనపు ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కానున్నాయి – డాక్టర్ ఎస్ఎల్ఎన్టీ శ్రీనివాస్ స్టేట్ కో–ఆర్డినేటర్, ఎన్‌సీసీటీ -
రాష్ట్రానికి 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ సేవల్లోని మొత్తం 1,132 మంది అధికారులకు కేంద్రప్రభుత్వం నాలుగు కేటగి రీల్లో పతకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 మంది పోలీసులకు ప్రతిభా సేవాపతకాలు, ఇద్దరు జైలు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు, ఆరుగురికి మెడల్ ఫర్ గ్యాలెంట్రీ లభించాయి. అడిషనల్ డీజీపీలు దేవేంద్ర సింగ్ చౌహాన్, సౌమ్యా మిశ్రాకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు దక్కాయి. మెడల్ ఫర్ గ్యాలెంట్రీ వీరికే వాడిచెర్ల శ్రీనివాస్, నలివేణి హరీశ్, గడ్డిపోగుల అంజయ్య, బూర్క సునీల్ కుమార్, ఎండీ.అయూబ్, పి.సతీష్‌లు గ్యాలెంట్రీ పతకాలకు ఎంపికయ్యారు. ప్రతిభా సేవా పతకాలు వీరికి డీఐజీ జాకబ్ పరిమళ హన నూతన్, ఏఎస్పీ డి.చంద్రయ్య, 8వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ కొక్కు వీరయ్య, కమాండెంట్ నరుకుళ్ల త్రినాథ్, ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు, ఏసీపీ పింగిళి నరేష్ రెడ్డి, ఏసీపీ శ్రీరాముల మోహన్ కుమార్, ఎస్ఐ బెల్లం జయచంద్ర, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ ఎనుముల వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ గండిపూ డి ఏసుపాదం, హెడ్ కానిస్టేబుల్ జంగయ్య, ఎస్ఐ మంచిరేవుల సురేందర్ రెడ్డికు పోలీసు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు.. కరెక్షనల్ సర్వీసు కేటగిరీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ అర్కోట్ శ్రీధర్, జైలర్ యాదరి రమణయ్య ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. మొత్తం 1,133 పతకాలు: కాగా ఈఏడాది ప్రకటించిన మొత్తం 1,132 పతకాల్లో బీఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు వారి మరణానంతరం లభించాయి. మిగతా 275 మందికి శౌర్యపతకాలు, 102 మందికి రాష్ట్ర పతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి ప్రతిభా సేవా పతకాలను గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గ్యాలెంట్రీ పతకా లు దక్కించుకున్న 275 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 72 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 26, ఝార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది పోలీసులు ఉన్నారు. సీ ఆర్పీఎఫ్ నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది శౌర్య పతకాలకు ఎంపికయ్యారు. ఏపీకి చెందిన 9మంది అధికారులకు ప్రతిభా సేవా పతకాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తొమ్మిదిమంది పోలీసు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. కమాండెంట్ కోటనాని వెంకట ప్రేమ్‌జిత్, ఆర్ఎస్ఐ ఆవుల చెన్నయ్య, ఏఎస్ఐ ఆర్.రమణారెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అద్దంకి, ఏఎస్ఐ బి.ప్రకాశ్‌రావు, ఏఎస్ఐ కరి మస్తాన్రావ్, అసిస్టెంట్ కమాండెంట్ పుల్లభొట్ల వెంకట సత్య అనంత దుర్గ ప్రసాద్ రావు, ఇన్స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరి రావు, డీఎస్పీ కోటిరెడ్డి పోలీసు ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పెనికలపాటి వెంకట రమణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జాస్తి రమణయ్య, లీడింగ్ ఫైర్‌మ్యాన్ షేక్ ఘనీలకు ఫైర్ సర్వీసెస్ కేటగిరీలో ప్రతిభా సేవా పతకాలు దక్కాయి. చౌహాన్‌కు డబుల్ ధమాకా రాష్ట్రపతి మెడల్‌తో పాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ పోలీస్ అధికారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు ఒకేసారి రెండు అవార్డులు లభించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే రాష్ట్రపతి మెడల్‌కు డీఎస్ చౌహాన్ ఎంపికయ్యారు. దీంతోపాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు(2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును గురువారం జేఎన్టీయూలో జరిగిన ఓటర్స్డే సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతులమీదుగా డీఎస్ చౌహాన్ అందుకున్నారు. ఒకే రోజు రెండు అవార్డులు రావడం పట్ల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆయ నకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యం అయిందని ఈ సందర్భంగా డీఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట
సాక్షి, ఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆలిండియా రెండో ర్యాంకు, గ్రేటర్ విశాఖపట్నం ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆలిండియా 8వ ర్యాంకు సాధించాయి. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషికి ఈ అవార్డులు ఈ అవార్డులు చిహ్నమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారు. సమ్మె వల్ల కొంత ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. కాగా, 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది. సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనం. ఇదీ చదవండి: ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం -
గుడ్‌న్యూస్.. మహిళా రైతులకు రూ.12,000? ఈ బడ్జెట్లోనే..!
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పబోతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు అంటే రూ. 12,000 లకు పెంచాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని, దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు సమాచారం. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పురుష, మహిళా రైతులిద్దరికీ రూ.6,000లను అందిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్ వరకు 15 విడతల్లో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు సాయాన్ని రెట్టింపు చేసే ప్రణాళిక ఇంతకు ముందు ఎప్పుడూ చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించే ఈ చర్యగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రణాళికపై అటు వ్యవసాయ శాఖ గానీ, ఇటు ఆర్థిక శాఖ గానీ స్పందించలేదు. -
రైతులకు శుభవార్త.. ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం?
ఏప్రిల్- మే 2024 నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్ సమ్మాన్ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతుకు ప్రస్తుతం అందించే రూ.6,000 మొత్తాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని నివేదికలు పేర్కొన్నాయి. 16 విడుత విడుదల ఎప్పుడంటే? ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలలో పీఎం కిసాన్ పథకం 16వ విడుతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారికంగా తెలపలేదు. ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023న కేంద్రం విడుదల చేసింది. ఎంఎస్ఎంఈలకు అండగా ఇదిలా ఉండగా, 2024 మధ్యంతర బడ్జెట్లో పేదలు, రైతులు, యువత, మహిళలకు అదనపు సహాయక చర్యలను అందించాలని కేంద్రం భావిస్తోంది. నివేదిక ప్రకారం.. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (msme) అందించే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం. 2018 నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6 వేల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 5 కిలలో ఆహార ధాన్యాలు 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. -
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
#Maldives.. మాలె/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చంది. మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువుపట్టు. పైగా భారత్‌తో వ్యూహత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు’’ అని పేర్కొంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సస్పెండైన మంత్రులు మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అని తెలుస్తోంది. అసలేమైంది...? ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు»ొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ‘‘భారత్ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు’’ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ పిలుపునిస్తున్నారు! సెలబ్రిటీల ఖండన మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణం. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం కానీ ఇలాంటి ద్వేషాన్ని మనమెందుకు సహించాలి? నేనెన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ఆ దేశాన్ని ప్రశంసించా. కానీ మన ఆత్మగౌరవమే ఫస్ట్. ఇకపై మన దీవుల్లో పర్యటిస్తూ మన పర్యాటకానికి దన్నుగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచుల్లో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుంది. మన దేశంలోనే ఇంత అద్భుతమైన బీచ్లుండటం గర్వకారణం’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే అద్భుతమైన ఆతిథ్యం, విస్తారమైన మన సముద్ర తీరాలను చూడాలే తప్ప వరి్ణంచలేం. ఇందుకోసం లక్షద్వీప్‌కు వెళ్లాల్సిందే’’ అంటూ జాన్ అబ్రహం బీచ్ ఫొటోలను షేర్ చేశారు. సుందరమైన లక్షద్వీప్ బీచ్‌ల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. సచిన్ కూడా ఇటీవలి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ తాను క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోలను షేర్ చేశారు. -
ఫేమ్ 3 పేరుతో కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ!
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఫేమ్ 3' (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)ను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ కోసం రూ.26,400 కోట్లు కేటాయించాలని మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్రం కేటాయించనున్న రూ.26400 కోట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రూ.8158 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సులు కోసం రూ. 9,600 కోట్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్ల కోసం రూ.4,100 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లపై అందించే రాయితీ మాత్రమే కాకుండా టెక్నాలజీ డెవలప్మెంట్, ట్రయల్ రన్ వర్క్స్ కోసం ఈ పథకంలో భాగంగానే నిధులు కేటాయించాలన్నది కేంద్రం ఆలోచన. మొత్తంగా రూ.33వేల కోట్లను మూడో దశకు కేటాయించే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలను ప్రోత్సహించడానికి.. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్ 1న తీసుకువచ్చింది. ఈ సబ్సిడీ కింద టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్‌కు వర్తించేలా చేశారు. ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లెక్కకు మించిన వాహనాలు సేల్ అయ్యాయి. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు కొన్ని సంస్థలు చేసిన అవకతవకల వల్ల.. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ 2 సబ్సిడీ నిలిపివేశారు. కాగా 2024 మార్చి 31 నాటికి ముగుస్తుంది. దీనిని సృష్టిలో ఉంచుకుని ఫేమ్ 3 స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది కూడా రెండు దశల్లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఫేమ్ 3 స్కీమ్ కింద వాహనాలను మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తే 10 శాతం అదనపు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం యోచిస్తోంది. -
పింఛను నామినీలుగా ఉద్యోగినుల పిల్లలు
న్యూఢిల్లీ: భర్త నుంచి వేరుగా ఉండే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. కుటుంబ పింఛను కోసం నామినీలుగా ఇకపై తన పిల్లల పేర్లను పేర్కొనవచ్చని తెలిపింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పింఛను)నిబంధనలు–2021లోని 50వ క్లాజ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భాల్లో కుటుంబ పింఛను మంజూరవుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు మరణించినప్పుడు ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి కుటుంబపింఛను అందుతుందని తెలిపింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామి కుటుంబ పింఛనుకు అనర్హులైనప్పుడు లేదా చనిపోయినప్పుడు కుటుంబ పింఛను ఇతర కుటుంబసభ్యులకు అందుతుందని వివరించింది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ పింఛనుకు నామినీలుగా భర్త కంటే ముందుగా సంతానాన్ని పేర్కొనేందుకు వీలు కలి్పస్తూ తాజాగా నిబంధనలను మార్చినట్లు కేంద్ర పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం పేర్కొంది. తాజా సవరణ.. మహిళా ప్రభుత్వోద్యోగి విడాకుల పిటిషన్, గృహ హింస కేసు, మహిళల రక్షణ చట్టం కింద కేసులను దాఖలు చేసిన అన్ని సందర్భాల్లో, ఆమె భర్త కంటే ముందు అర్హత ఉన్న బిడ్డకు కుటుంబ పెన్షన్‌ను పంపిణీ చేయడానికి అనుమతిస్తుందని విభాగం కార్యదర్శి వి శ్రీనివాస్ పిటిఐకి తెలిపారు. -
సుకన్య సమృద్ధి పథకంలో మరింత రాబడి
న్యూఢిల్లీ: కుమార్తెల భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకునే ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని పొదుపు సొమ్ముపై 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటే, దీన్ని 8.2 శాతానికి పెంచింది. అలాగే, మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ పథకంలో రేటు 7 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది. 2024 జనవరి 1 నుంచి మార్చి 31 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుతమున్న రేట్లనే కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటు 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగుతాయి. కిసాన్ వికాస్ పత్ర పథకం రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో డిపాజిట్ 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 7.4 శాతంగా కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకోమారు చిన్న మొత్తాల పొదుపు పథకాలను సమీక్షించి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. ఆర్బీఐ కీలక రెపో రేటును ఏడాది కాలంలో 2.5% మేర పెంచి 6.5 శాతానికి చేర్చడం తెలిసిందే. కొన్ని విడతలుగా రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లలోనూ పెద్దగా మార్పులు ఉండడం లేదు. -
భారత్ రైస్ వస్తోంది.. కేజీ ధర ఎంతంటే?
రోజు రోజుకి పెరుగుతున్న బియ్యం ధరలను పరిష్కరించడానికి ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించినట్లు సమాచారం. భారత్ రైస్ అనేది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ అట్టా, భారత్ దాల్ (పప్పు) వంటి వాటిని విక్రయిస్తున్న ప్రభుత్వం రైస్ విభాగంలోకి అడుగుపెట్టింది. బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. -
పాత మూస... కొత్త చట్టం
మారుతున్న కాలానికీ, అవసరాలకూ తగ్గట్టు అన్నీ మారాల్సిందే. ఆ దృష్టితో చూసినప్పుడు బ్రిటిషు కాలపు పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు నేర సంబంధ చట్టాలను తీసుకురావడం అభిలషణీయమే. అయితే, ప్రతిపక్షాలకు చెందిన 140 మందికి పైగా సభ్యులను వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన అనంతరం పెద్దగా చర్చ లేకుండానే గత వారం పార్లమెంట్ ఈ కొత్త చట్టాలను ఆమోదించడంపై సహజంగానే విమర్శలు వచ్చాయి. ఎవరేమన్నా కొత్త చట్టాలకు భారత రాష్ట్రపతి ఈ సోమవారం ఆమోదముద్ర వేయడంతో ఒక తతంగం ముగిసింది. కేంద్ర హోమ్ శాఖ ప్రభుత్వ రాజపత్రంలో నోటిఫై కూడా చేయడంతో, ఇక ఈ సరికొత్త నేర శిక్షాస్మతులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది. వెరసి, బ్రిటీషు కాలం నాటి ‘ఇండియన్ పీనల్ కోడ్’, ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్’, ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872’ స్థానంలో కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య చట్టం’ ప్రవేశించాయి. తెచ్చిన మార్పులేమిటి, వీటి ప్రభావం ఎలాంటిదన్నదే ఇప్పుడిక ప్రజాక్షేత్రంలో వివిధ వర్గాలలో చర్చగా మారింది. భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారతీయ పార్లమెంట్ తెచ్చిన చట్టాలంటూ హోమ్ మంత్రి ప్రకటించారు. బ్రిటిషు వలసవాద అవశేషాలను తొలగించే చర్యగా అధికార పక్షం వీటిని అభివర్ణించింది. అయితే, పేరుకు ఇవి కొత్త క్రిమినల్ చట్టాలే కానీ, బ్రిటిషు కాలపు పాత చట్టాలలోని భాష, అంశాలే ఎక్కువగా వీటిలో ఉన్నాయని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పాత చట్టాల్లోని సెక్షన్లనే వరుస మార్చడం తప్ప ఈ కొత్త వాటిల్లో చేసినది తక్కువనే విమర్శలూ ఉన్నాయి. అంతే కాక, అరెస్టు, పోలీస్ కస్టడీలకు సంబంధించి కొత్త చట్టాల్లోని అంశాల పట్ల అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. కొత్త చట్టాల ఫలితంగా కస్టడీని 60 నుంచి 90 రోజుల దాకా పొడిగించే వీలుండడం లాంటివి అందుకు కారణం. ఇలాంటి అంశాలు పౌరహక్కులకు భంగకరంగా పరిణమించే ప్రమాదం ఉంది. నిజానికి, కొత్త చట్టాలు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలన తర్వాతే సభ ముందుకొచ్చాయి. అయితే, శతకోటి భారతీయుల జీవితాలను శాసించే చట్టాలు గనక వీటిపై సభ క్షుణ్ణంగా చర్చించడం విధాయకం. అది లేకుండానే అవి చట్టం కావడం విషాదం. అలాగని ఈ చట్టాల్లో అసలంటూ ఆహ్వానించదగినవి ఏమీ లేవనలేం. వివాహ వ్యవస్థను దెబ్బ తీస్తుందనే మిషతో వ్యభిచారాన్ని మళ్ళీ శిక్షార్హంగా మార్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసినా, ప్రభుత్వం అందుకు తలూపలేదు. లింగమనే నిర్వచనంలో ట్రాన్స్జెండర్లను కూడా చేర్చడమూ మంచి నిర్ణయమే. మూకదాడి హత్యలను మరణశిక్షకు అర్హమైనవిగా చేర్చడమూ మంచి పనే. అయితే, 2017 తర్వాత మూకదాడి హత్యల డేటాను క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించడం మానేసింది. అలాంటి దాడుల లెక్కలే లేకుండా కొత్త చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? ప్రయోజనం ఏమిట నేది సందేహం. ఇక, రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. వాస్తవంలో పేరు మార్చారే తప్ప, అది మరింత కర్కశంగా మారిందని నిపుణుల ఆందోళన. దేశ సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించినట్టు భావిస్తే చాలు, సెక్షన్ 150 కింద యావజ్జీవ కారాగారవాస శిక్ష వేసే వీలుండడం భయపెడుతోంది. కొత్త చట్టాల్లో అసలు సిసలు మార్పులు కేవలం 20 శాతమేనని ఒక అంచనా. అదే గనక నిజమైతే, ఈ మొత్తం ప్రక్రియ ప్రచారానికే తప్ప, ప్రయోజనకరం అనిపించుకోదు. అలాగే, ప్రభుత్వానికీ, పోలీసులకూ మరిన్ని అధికారాలు కట్టబెడుతున్న ఈ చట్టాల్లో జవాబుదారీతనం ఆ మేరకు కనిపించట్లేదు. ప్రజాస్వామ్యంలో అది సమర్థనీయం కాదు. వలసవాద చట్టాల్లో లాగానే ఇప్పుడూ ఉంటే జనాన్ని ఏమార్చడమే తప్ప ఏం మార్చినట్టు అన్నది ప్రశ్న. క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలంటే ఆశించేది ఇది కాదు. నిజానికి, సమాజంలోనూ, సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తున్నవేళ... నేర చట్టాలను సవరించడం, నవీకరించడం చట్టబద్ధ పాలన అందించే ఏ దేశానికైనా తప్పనిసరి. అయితే, ఆ మార్పులు నిర్దేశిత సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చడం కీలకం. అలాగే, ఆ సవరించిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టుండడం అత్యవసరం. 150 ఏళ్ళ పాత వలసవాద చట్టాలను వదిలించుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పుడు, ఆపాటి ఆశలు, చర్చ ముఖ్యమైనవి. కానీ, వాస్తవంలో కొత్త చట్టాలు అలా లేవంటే నిరాశ మిగులుతుంది. చట్టాల్లో అవసరమైన అనేక ప్రాథమిక సవరణలు చేసే చరిత్రాత్మక అవకాశం చేజారిపోయింది. ఐపీసీ స్థానంలో తెచ్చిన బీఎన్ఎస్ లాంటివి శిక్షలతో భయపెట్టేదిగా కాక, సంస్కరించేదిగా ఉండాలి. 1975 నుంచి 2013 మధ్యకాలంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 33 ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత పాలకులు కొత్త పేర్లతో తమవిగా చెప్పుకుంటున్నారనీ, కొత్త పేర్లతో కొత్త నేర చట్టాలు కూడా ఆ కోవలోవే అనీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిందారోపణల మాటెలా ఉన్నా, ఇప్పటికీ మించి పోయింది లేదు. ప్రతిపక్షాలు, పౌరసమాజం తాలూకు భయాందోళలను పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అన్ని వర్గాల అనుమానాలనూ నివృత్తి చేయాలి. చట్టాలు తేవడంలో లేకున్నా, కనీసం అమలులోనైనా సర్వజనామోద వైఖరి శోభనిస్తుంది. అవసరమైతే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు సరికొత్త చట్టాల్లోనూ ఎప్పటికప్పుడు సవరణలు చేయాల్సిందే. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య మూలమే అది. ఒక్కమాటలో... కొత్త చట్టాలతో దేశంలోని 17.5 వేల పోలీస్ స్టేషన్లు బలోపేత మవడం సరే కానీ, 140 కోట్ల జనాభా నిస్సహాయులుగా మారిపోతేనే కష్టం. -
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల రిటైల్ ధరలను అదుపు చేసేందుకు గత కొన్నేళ్లలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తాజాగా పేర్కొన్నారు. వెరసి దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి భరోసానిస్తూ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగిన స్థాయిలో నియంత్రించనున్నట్లు తెలియజేశారు. నేషనల్ కన్జూమర్ డే సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ఒక వేడుకలో గోయల్ ఇంకా పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం అత్యంత వేగవంతంగా వృద్ధి సాధిస్తున్న భారీ ఎకానమీగా భారత్ నిలుస్తున్నట్లు ప్రస్తావించారు. భవిష్యత్‌లో వృద్ధిని కొనసాగించడంతోపాటు.. ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచేందుకు చర్యలు కొనసాగించనున్నట్లు తెలియజేశారు. కాగా.. అధికారిక గణాంకాల ప్రకారం గత(నవంబర్) నెలలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 5.55 శాతాన్ని తాకింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. అక్టోబర్‌లో 4.87 శాతంగా నమోదైంది. అయితే ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం 6.83 శాతానికి చేరాక క్షీణిస్తూ వస్తోంది. -
దేశంలో కొత్త సిమ్ కార్డ్ రూల్స్!, నిబంధనలు అతిక్రమిస్తే 3ఏళ్ల జైలు శిక్ష
దేశంలో పెరిగే పోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది నుంచి సిమ్ కార్డ్ పొందేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని అంగీకరిస్తూ ప్రవేశ పెట్టిన టెలికమ్యూనికేషన్ బిల్-2023ను రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ఆమోదించారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయాల్సి ఉంటుంది. ఆమోద ముద్ర అనంతరం కొత్త సిమ్ కార్డ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మూడేళ్ల జైలు శిక్ష టెలికమ్యూనికేషన్ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత నకిలీ సిమ్ కార్డ్ తీసుకున్న వినియోగదారుల్ని కఠినంగా శిక్షలు విధించే అవకాశం ఉంది. మూడేళ్లు జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కేవైసీ జనవరి 1,2024 నుంచి సిమ్ కార్డ్‌ను ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారులు కేవైసీ వివరాల్ని అందించాలి. ఇక సిమ్ కార్డ్‌ను అమ్మే డిస్ట్రిబ్యూషన్ సంస్థలు వెరిఫికేషన్ తప్పని సరి. పెద్ద సంఖ్యలో సిమ్‌కార్డ్‌లు అమ్మడాన్ని కేంద్రం నిషేధం విధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. బయోమెట్రిక్ తప్పని సరి సాధారణంగా మనం ఆధార్ కార్డ్‌ను తీసుకునేందుకు ఎలా బయోమెట్రిక్ (వేలి ముద్రలు) ఇస్తామో, రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమలయ్యే సిమ్ కార్డ్ నిబంధనల్లో భాగంగా ఎవరైతే సిమ్ కార్డ్ కొనుగోలు చేస్తారో వారు తప్పని సరిగా బయోమెట్రిక్ విధానాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ విధానంలో సైబర్ నేరస్తులు ఎక్కువ సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే వీలుండదు. ఆమోదం తప్పని సరి ఇకపై టెలికం ఫ్రాంచైజీ తీసుకున్నవారు, లేదంటే సిమ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవాలి. లేదని నిబంధనల్ని అతిక్రమిస్తే రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై పరిశీలించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. వివరాల ప్రకారం.. దేశంలో ప్రతీ ఒక్కరి ఆస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. కాగా, విచారణ సందర్బంగా ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. అయితే, అవినీతి, నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర, స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో, జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పైవిధంగా ఆదేశించింది. [Linking property with #Aadhar] Delhi High Court says it is a policy decision, asks Centre and Delhi governments to take decision on the issue within three months. Court asks the authorities to treat BJP leader Ashwini Upadhyay's plea as a representation. — Lawstreet Journal (@LawstreetJ) December 21, 2023 -
కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాలు కోవిడ్ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది. అలాగే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్దంగా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే, పాజిటివ్ శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కోరింది. ఇక, జెన్-1 వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. అయితే, ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు. Centre issues advisory to States in view of a recent upsurge in COVID-19 cases and detection of first case of JN.1 variant in India. States urged to maintain a state of constant vigil over the COVID situation. States to report & monitor district-wise SARI and ILI cases on a… pic.twitter.com/NpS1wAQLM8 — ANI (@ANI) December 18, 2023 -
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..!
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..! -
బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు.. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తుందా?
బ్యాంకు ఉద్యోగుల ఐదురోజుల పనిదినాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పనిదినాల్ని తగ్గించి బ్యాంకు ఉద్యోగుల రోజూవారి పనిగంటలు పెంచమని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులు పనిచేయనున్నాయా? ఇదే అంశంపై తాజా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పందించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాల్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అయితే దీనిని కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అని అంశంపై స్పందించలేదు. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి రెండవ శనివారం, నాలుగవ శనివారం రోజు మాత్రమే సెలవు దినాలు. ఒకవేళ కేంద్రం ఐబీఏ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కాగా.. రోజూవారి పనిగంటలు పెరిగే అవకాశం ఉందంటూ బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఉల్లి ఎగుమతులు నిషేధించిన భారత్.. కారణం ఇదే..
దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుదలవైపు దూసుకెళ్తున్న ఉల్లి ధరలు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ. 50) దాటేశాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నట్లు భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరల పెరుగుదలను నియంత్రణలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వెల్లడించింది. ప్రజలకు తక్కువ ధరలోనే ఉల్లి అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి (డిసెంబర్ 8) నిషేధం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్దమైన ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని, కొత్తగా ఎగుమతి చేయడం కుదరదని డీజీఎఫ్టీ ప్రకటించింది. ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆ దేశాలకు మాత్రమే ఉల్లి ఎగుమతి జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కేంద్రం అనేకసార్లు ఎగుమతులను నిషేదించింది. అయితే 2024 మార్చి 31 తరువాత ఎగుమతులు యధాతధంగా కొనసాగుతాయా? లేదా నిషేధం ఇంకా పొడిగించబడుతుందా అనేది తెలియాల్సి ఉంది. -
నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ.10 లక్షలు ఫైన్
సిమ్ కార్డుల విక్రయానికి సంబంధించిన డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నట్లు గత ఆగష్టు నెలలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. దీని ప్రకారమే ఈ రోజు (23 డిసెంబర్ 1) నుంచి ఆ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధల ప్రకారం, పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్‌దారు ఒప్పందంపై సంతకం చేయాలి. నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా వారి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుడు తప్పనిసరిగా వ్యక్తిగత వివరాలను అందించాలి. సిమ్ కార్డు అందించే ఏజెంట్ కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు క్యూఆర్ స్కాన్ చేసి వివరాలు సేకరిస్తాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి మరో విషయం ఏమిటంటే ఒక సిమ్ డిస్కనెక్ట్ అయిన 3 నెలలు లేదా 90 రోజుల తర్వాత కొత్త కస్టమర్‌కు ఆ మొబైల్ నెంబర్ కేటాయించాలి. ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి, ఒక ఐడీ మీద గరిష్టంగా 9 సిమ్ కార్డులకంటే ఎక్కువ కొనుగోలు చేయకూడదు. అయితే కమర్షియల్, బిజినెస్, కార్పొరేట్ ఖాతాలకు ఈ నియమం వర్తించదు, కానీ ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చనే విషయం వెల్లడి కాలేదు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త!
రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్ కార్డ్ దారులకు మరో ఐదేళ్లు రేషన్‌ను ఉచితంగా అందిచనుంది. ఇటీవల ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్న పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేఏవై పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. ఈ స్కీంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా.. తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
భారత్‌లో.. ఈ నాలుగు అరుదైన వ్యాధులకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు భారీగా తగ్గనుంది
భారత్ ఔషదాల తయారీలో అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ సంస్థల సహాయంతో భారతీయ ఔషధ కంపెనీలు కేవలం ఏడాదిలోనే నాలుగు అరుదైన వ్యాధులకు మందులను తయారు చేశారు. తద్వారా ఆ అరుదైన వ్యాధ్యులను నయం చేయించుకునేందుకు అయ్యే ఖర్చు దాదాపూ 100 రెట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు టైరోసినిమియా టైప్ 1 చికిత్సకు ఏడాదికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.2.2 కోట్ల నుండి రూ.6.5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే ఖర్చు రూ. 2.5 లక్షలకు చేరింది. ఒకవేళ ఈ అనారోగ్య సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే 10 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఈ వ్యాధితో మరణిస్తారు. మూడు ఇతర అరుదైన వ్యాధుల్లో..గౌచర్స్ వ్యాధి. ఈ అనారోగ్య సమస్య తలెత్తితే రక్తాన్ని ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే ప్లీహము పరిమాణం పెరిగేలా చేస్తుంది. దీంతో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. విల్సన్స్ వ్యాధి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, నరాల కణాలను నిర్మించడంలో, రోగనిరోధక వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాగి తగ్గుతుంది. మెదడు పని తీరును ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. డ్రావెట్/లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్.. దీని వల్ల బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఖర్చులు కోట్ల నుంచి లక్షల్లోకి ఇప్పుడీ ప్రమాదకరమైన ఎలిగ్లుస్టాట్ క్యాప్సూల్స్‌తో గౌచర్స్ వ్యాధికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ. 1.8-3.6 కోట్ల నుండి రూ. 3.6 లక్షలకు, విల్సన్స్ వ్యాధికి వినియోగించే ట్రియంటైన్ క్యాప్సూల్స్‌తో సంవత్సరానికి రూ.2.2 కోట్ల నుండి రూ. 2.2 లక్షలకు, డ్రావెట్‌కు కన్నబిడియోల్ (Cannabidiol) అనే సిరప్ ఖరీదు రూ. 7లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు అయ్యే సిరప్ రూ.1లక్షల నుంచి 5 లక్షల లోపు వరకు లభ్యమవుతుంది. 10 కోట్ల మందికిపైగా అరుదైన వ్యాధులు మన దేశంలో.. అంచనా ప్రకారం.. 8.4 కోట్ల నుంచి 10 కోట్ల మంది అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులలో దాదాపు 80 శాతం జన్యుపరమైనవి కాగా.. చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. జన్ ఔషద కేంద్రాల్లో మెడిసన్ ఏడాది క్రితం బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలైన జెనారా ఫార్మా, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లు 13 రకాల అరుదైన వ్యాధుల నివారణకై మెడిసిన్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. నాలుగు వ్యాధులకు సంబంధించిన మందులు అభివృద్ధి చేశామని, మిగతా వాటికి సంబంధించిన మందులు త్వరలో అందజేస్తామని, జన్ ఔషధి కేంద్రాలకు కూడా మందులను అందజేసే యోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫెనిల్‌కెటోనూరియా, హైపెరమ్మోనిమియా వ్యాధులకు ఇప్పటికే చౌకైన మందులు తయారు చేశారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి గురైన బాధితులు కండరాల కదలికను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వెన్నుపూసలో ఉండే ఈ కణాల్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన బాధితులు ఏ పని చేసుకోలేరు. దీన్ని నయం చేసేందుకు వినియోగించే ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఖర్చును తగ్గించే పనిలో ఉన్నాయి భారత ప్రభుత్వం, ఫార్మా సంస్థలు పనిచేస్తున్నాయి. -
ఐడీబీఐ బ్యాంక్ వేల్యుయర్ బిడ్డింగ్ ప్రక్రియ రద్దు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసే అసెట్ వేల్యుయర్ ఎంపికకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం రద్దు చేసింది. బిడ్డింగ్‌కు అంతగా స్పందన లభించకపోవడమే ఇందుకు కారణం. బిడ్డర్లను ఆకర్షించే విధంగా బిడ్డింగ్ నిబంధనలను మెరుగుపర్చి, త్వరలోనే కొత్త ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ని జారీ చేయనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి 94.72 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా, రెండు కలిసి సుమారు 61 శాతం వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసేందుకు అసెట్ వేల్యుయర్‌ను నియమించడానికి సెప్టెంబర్ 1న దీపమ్ .. బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల సమర్పణకు అక్టోబర్ 9 గడువు అయినప్పటికీ అక్టోబర్ 30 వరకు పొడిగించారు. అయినప్పటికీ ఒకే ఒక్క బిడ్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఆర్ఎఫ్పీని జారీ చేయాలని దీపమ్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. వాటాల విక్రయం తర్వాత బ్యాంకులో ప్రభుత్వానికి 15 శాతం, ఎల్ఐసీకి 19 శాతం వాటాలు ఉండనున్నాయి. -
Subrata Roy : వేల కోట్ల ‘సహారా గ్రూప్’ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం!
కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్(75) మంగళవారం ముంబయిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత సహారా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహారా -సెబీ అకౌంట్స్‌లో ఉన్న అన్‌క్లయిమ్డ్ నిధుల మొత్తాన్ని ప్రభుత్వ అకౌంట్‌కు (Consolidated Fund of India) ట్రాన్స్ఫర్ చేయాలనే అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 11ఏళ్ల క్రితం సహారా గ్రూప్ సామాన్యుల నుంచి సేకరించిన రూ.25 వేల కోట్లకు పైగా డిపాజిట్లను సెబీకి అందించింది. అందులో తమ డబ్బులున్నాయని, అందుకు సహారా ఇచ్చిన రిసిప్ట్‌లను సెబీకి (ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో) అప్లయ్ చేసుకుంటే.. వాటిని పరిశీలించిన సెబీ కేవలం రూ.138.07 కోట్లని తిరిగి వెనక్కి ఇచ్చింది. సెబీ నుంచి కేంద్ర బ్యాంక్ అకౌంట్‌కు ఇప్పుడు సెబీ వద్ద ఆ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు రీఫండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మార్చేందుకు కేంద్రం అన్వేషిస్తుందని ఈ అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. అన్‌క్లయిమ్డ్ డిపాజిట్లన్నీ ప్రజా సంక్షేమానికే అయితే, సెబీ అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్‌కు నిధులు ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం కేంద్రం నిజమైన డిపాజిటర్లను గుర్తించి, వారికి తిరిగి డబ్బులు చెల్లించనుంది. మిగిలిన అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను ప్రజా సంక్షేమం కోసం కేంద్రం వినియోగించాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది. వేల కోట్ల డిపాజిట్లు సహారా నుంచి సెబీకి సెబీ ఈ ఏడాది మార్చి 31 నాటికి 17,526 దరఖాస్తులకు గాను 48,326 ఖాతాల్లో రూ.138 కోట్లు జమ చేసింది. సహారా గ్రూప్ నుండి రికవరీ చేసి.. ఆయా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం రూ.25,163 కోట్లుగా ఉంది. ప్రత్యేక పోర్టల్ నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన బకాయిలకు సంబంధించి రూ.5,000 కోట్లు సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది జులై నెలలో పోర్టల్‌ను ప్రారంభించారు. సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్ సొసైటీలు అయిన సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లిస్తున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్ ‘ఏపీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఏపీని దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు అవార్డును ప్రదానం చేయనున్నారు. కాగా గతంలోనూ మన రాష్ట్రం ఇదే అవార్డును దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ అధికారులు, సిబ్బందికి ట్విట్టర్ ద్వారా శనివారం అభినందనలు తెలిపారు. Govt. of AP, Agriculture Dept. - e-Crop Application gets SKOCH Award 2023. Hearty Congratulations to all concerned officers in the Department. pic.twitter.com/oLkr4BWYuB — Gopal Krishna Dwivedi IAS (@GKDwivediIAS) November 18, 2023 -
బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి
న్యూఢిల్లీ: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 2070 నాటికి 50 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎనిమిదో విడత వాణిజ్య స్థాయిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని మంత్రి బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 240 గిగావాట్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ఇంధన వనరుల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గొచ్చు. కానీ, మొత్తం మీద బొగ్గు విద్యుదుత్పత్తి ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుంది’’అని వివరించారు. బొగ్గు మైనింగ్‌లో సుస్థిరతాభివృద్ధి సూత్రాలను అమలు చేయడంతోపాటు సంయుక్త కృషి ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోగలమన్నారు. 3 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం వేలం వేస్తున్న బొగ్గు గనులకు సంబంధించి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ‘‘వాణిజ్య బొగ్గు మైనింగ్ ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభిస్తున్న నేడు ప్రత్యేకమైన రోజు. మొత్తం 39 బొగ్గు గనులను వేలానికి ఉంచాం. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే నేడు గిరిజనుల గౌరవ దినోత్సవం’’అని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బొగ్గు రంగానికి, గిరిజనులకు లోతైన అనుబంధం ఉందన్నారు. వేలంలో ఉంచిన బొగ్గు గనుల్లో ఉత్పత్తి మొదలైతే గిరిజనులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు విడతల వేలంలో మొత్తం 91 బొగ్గు గనులను వేలం వేసినట్టు గుర్తు చేశారు. -
రూ.20,000 కోట్లు సమీకరించిన రిలయన్స్
న్యూఢిల్లీ: భారీ వ్యాపార వృద్ధి ప్రణాళికలతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో నిధులు సమీకరించింది. 7.79 శాతం రేటుపై పదేళ్ల కాల బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.20,000 కోట్లు సమకూర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం రుణ సమీకరణ రేటు కంటే రిలయన్స్ 0.40 శాతం ఎక్కువ ఆఫర్ చేసింది. 20,00,000 సెక్యూర్డ్, రెడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్సీడీలు), రూ.1,00,000 ముఖ విలువపై ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. కనీస ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు కాగా, స్పందన ఆధారంగా మరో రూ. 10,000 కోట్లను గ్రీన్ షూ ఆప్షన్ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధుల సమీకరణ చేసింది. రిలయన్స్ బాండ్ల ఇష్యూకు మొత్తం రూ.27,115 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్సీడీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. -
చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కొన్నింటికి సంబంధించినిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తెచి్చంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), టైమ్ డిపాజిట్ల పథకాల నిబంధనల్లో మార్పులు చేసింది. నూతన నోటిఫికేషన్ ప్రకారం.. పదవీ విరమణ ప్రయోజనాలు (నిధులు) చేతికి అందిన రోజు నుంచి మూడు నెలల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతా ప్రారంభించడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఇది ఒక నెలగానే అమల్లో ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటని వారికే ఇది వర్తిస్తుంది. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్ ఐదేళ్ల కాల వ్యవధి ముగిసిన అనంతరం రెన్యువల్ చేసుకునే వారికి అప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటును అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర, రాష్ట్ర) అయి, 50 ఏళ్లు నిండిన అనంతరం మరణించినట్టయితే, అప్పుడు వచ్చే ప్రయోజనాలను జీవిత భాగస్వామి ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే డిపాజిట్లో ఒక శాతాన్ని మినహాయిస్తారు. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్‌ను ఐదేళ్లు ముగిసిన తర్వాత మరో మూడేళ్ల కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక నుంచి అలా ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌ను నాలుగేళ్లు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు అమలయ్యే వడ్డీ రేటునే చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగేళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే మూడేళ్ల కాలానికి అమలయ్యే రేటును ఇస్తున్నారు. -
తమిళనాడు పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది. -
ఎట్టకేలకు .. ఎలాన్ మస్క్ నిరీక్షణ ఫలించింది?
శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ వంటి ఇంటర్నెట్ సేవలు భారత్‌లో అందించాలన్న స్టార్ లింక్ అధినేత ఎలాన్ మస్క్ నిరీక్షణ ఫలించింది. డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ వంటి అంశాల్లో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానంతో కేంద్రం సంతృప్తి చెందింది. త్వరలో స్టార్‌లింక్ సేవలందించేలా అనుమతి ఇవ్వనుందని సమాచారం. గతంలో స్టార్‌లింక్ సేవల్ని అందించాలని భావించిన మస్క్ కేంద్ర అనుమతి కోరారు. ఆ సమయంలో తమ సంస్థ డేటా బదిలీ, స్టోరేజీ పరంగా అంతర్జాతీయంగా ఉన్న చట్టాలను అనుసరిస్తామని చెప్పారు. అయితే దీనిని భారత్ వ్యతిరేకించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్‌కు స్పష్టంచేసింది. దీంతో చేసేది స్టార్ లింక్ సేవల కోసం మరోసారి ధరఖాస్తు చేసుకుంది. తాజాగా, స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి వ్యక్తంచేసింది. భద్రతతో పాటు పలు అంశాలను పరిశీలించిన తర్వాతే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (జిఎమ్పీసీఎస్) లైసెన్స్ ఇవ్వనుందని కేంద్ర అధికారులు తెలిపారు. జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్‌కి చెందిన వన్‌వెబ్ ఇప్పటికే దేశంలో జీఎంపీపీసీఎస్ లైసెన్స్‌ను పొందాయి. స్టార్ లింక్ ఆమోదం పొందితే.. ఈ లైసెన్స్‌ని పొందిన మూడవ శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్‌కామ్) కంపెనీగా అవతరించనుంది. స్టార్‌లింక్‌కు జీఎంపీడీఎస్ లైసెన్స్‌పై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం షెడ్యూల్ జరిగినట్లు సమాచారం. త్వరలో అందుబాటులోకి లైసెన్స్ కోసం ప్రభుత్వ అనుమతితో పాటు, శాట్‌కామ్ ప్లేయర్లు స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) నుండి కూడా అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ అనుమతులు లభిస్తే వెంటనే భారత్‌లో స్టార్ లింక్ అందుబాటులోకి వస్తాయి. -
మహిళా రిజర్వేషన్లపై కవిత మరో డిమాండ్.. కేంద్రానికి వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు చేయాలనే డిమాండ్‌తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత స్పష్టం చేశారు. కాగా, తాజాగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక, ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు. ఇక, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్‌తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు. ఇది కూడా చదవండి: సీపీఎం అభ్యర్థుల ప్రకటన.. కాంగ్రెస్‌కు షాక్ -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక!
క్యాలెండర్లో పేజీ ఎప్పుడు మారుతుందా? ఆశగా ఎదురుచూస్తాడు మధ్యతరగతి వ్యక్తి. నెలంతా కష్టపడి పనిచేసినందుకు గానూ ప్రతిఫలం దక్కేది ఆరోజే కాబట్టి. తీరా జీతం వచ్చాక ఖర్చైపోయిందంటూ నిట్టూరుస్తూ యథావిధిగా తన పనిలో నిమగ్నమైపోతాడు. అయితే, ప్రతి నెలా చోటుచేసుకునే కొన్ని మార్పులు మన జేబుపై ప్రభావం చూపేవి అయితే.. మరికొన్ని ఊరట కల్పిస్తాయి. అలా నవంబర్ 1 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. దీపావళికి ముందే వచ్చే కొన్ని మార్పులు సామాన్యుడికి తీపిని పంచేనా..? చేదు గుళికను అందిస్తాయా? చూసేయండి. గ్యాస్ ధరలు : చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) ధరల పెంపు, తగ్గుదలపై ప్రకటన చేస్తాయి. ఈ-చలాన్ : నేషనల్ ఇన్ఫ్రమెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ప్రకారం.. వ్యాపార లావాదేవీల విలువ రూ.100 కోట్లుంటే తప్పని సరిగా ఈ-పోర్టల్‌లో రానున్న 30 రోజుల్లోపు జీఎస్టీ చలాన్‌ను అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ల్యాప్‌ట్యాప్‌లపై ఆంక్షలు : ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఆయా సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే 7 రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆంక్షలు విధించింది. హెచ్ఎస్ఎన్ 8741 విభాగం కింద ల్యాప్‌ట్యాప్, పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్లెట్స్లు ఉన్నాయి. కేంద్రం విధించిన ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పైన పేర్కొన్న 7 రకాల ఉత్పత్తులపై వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవారికే పరిమిత సంఖ్యలో దిగుమతులు ఉంటాయని పేర్కొంది ల్యాప్స్డ్ ఎల్ఐసీ పాలసీలు : ఎల్ఐసీ 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన పాలసీదార్ల కోసం నిలిచిపోయిన (ల్యాప్స్డ్) పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎవరైతే ఏళ్ల కేళ్లు ప్రీమియం చెల్లించకుండా వదిలేస్తారో.. వాళ్లు ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాన్ని అక్టోబర్ 31వరకు కల్పిచ్చింది. ఆ గడువు నేటితో ముగియనున్న తరుణంలో ఖాతా దారులు తమ పాలసీలను పునరుద్ధరించుకోవాలని ఎల్ఐసీ అధికారులు చెబుతున్నారు. లావాదేవీలపై అదనపు ఛార్జీలు: అక్టోబర్ 20న బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది.స్టాక్ మార్కెట్లోని ఈక్విటీ డెరివేటివ్‌లపై నిర్వహించే లావాదేవీలపై విధించే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఏపీ సర్కారు పనితీరుపై కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావ్ కరాద్ ఏపీ సర్కారు తీరును మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి బుగ్గన అధ్యక్షతన 224వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లడుతూ.. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.1.68 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా బ్యాంకర్లను ప్రత్యేకంగా బుగ్గన అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40 లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా అంటే.. రూ.1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభపరిణామమన్నారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. పీఎం ముద్ర, స్టాండప్ ఇండియా తదితర పథకాలకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని కోరారు. వీధి, చిరు వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు, ఆత్మనిర్భర్ నిధి, పీఎం ఎఫ్ఎమ్ఈ పథకాల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చేందుకు మరింత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆయా పథకాల అమలులో ఎక్కువ జాప్యం లేకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకానికి 8వ తరగతి అర్హత, ఒక జిల్లా ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి అంశాలను సరళతరం చేసిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ రుణ సదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు. ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇందులో పాలుపంచుకోవాలన్నారు. కౌలు రైతులకు మరింత సహకారం జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగనన్న నగర్లలో గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు. సిబిల్ స్కోర్, వయసు తదితర కారణాలతో ఎక్కువ దరఖాస్తులు పక్కన పెడుతున్నారని.. బ్యాంకర్లు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. రైతులకు మరిన్ని రుణాలివ్వాలి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులకు మరిన్ని రుణాలందించడం ద్వారా చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న పాలవెల్లువ పథకంలో పాడి రైతులకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను విజయవంతగా అమలు చేస్తోందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు మరింత తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు మరింత సహకరించాలని కోరారు. జగనన్న గృహ నిర్మాణ కాలనీలకు రానున్న నాలుగైదు నెలల్లో నూరు శాతం రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం ఎం.రవీంద్రబాబు, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, యూబీఐ జీఎం గుణానంద్ గామి, ఏసీఎం రాజుబాబు పాల్గొన్నారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించండి స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకూ రూ.4,286 కోట్లను రుణాలుగా ఇచ్చినట్టు మంత్రి బుగ్గన చెప్పారు. దీనిని మరింత పెంచాలని కోరారు. రూ.3 లక్షల వరకూ డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవ చూపాలన్నారు. -
AP: డిసెంబర్ నాటికి రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047
సాక్షి, అమరావతి: వికసిత్ భారత్–2047లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో రాష్ట్ర ను డిసెంబర్ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల వృద్ధికి ఆయా శాఖలవారీగా దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు అందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం వర్క్‌షాప్ ప్రారంభమైంది. మూడు రోజులపాటు దీన్ని నిర్వహిస్తారు. తొలి రోజు వర్క్‌షాప్ నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్–2047 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీని ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు ఆధునిక భారతదేశ నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులను కేంద్రం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పురోగతిపైనే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షలపైన కూడా దృష్టి సారించిందన్నారు. అందుకనుగుణంగా రాష్ట్ర విజన్ ప్రణాళిక – 2047ను రూపొందించేందుకు రాష్ట్ర అధికారులకు అవసరమైన శిక్షణను నీతి ఆయోగ్ అందిస్తోందని చెప్పారు. దీన్ని రాష్ట్ర అధికారులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర విజన్ ప్రణాళికను సమగ్రంగా సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని కోరారు. వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు కాగా తొలి రోజు వర్క్‌షాప్‌లో ఉదయం సామాజిక రంగం, మధ్యాహ్నం ప్రాథమిక రంగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను ఆయా శాఖల అధికారులు నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో హరీందిర ప్రసాద్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం తదితరులతోపాటు నీతి ఆయోగ్ సలహాదారు సీహెచ్ పార్థసారధి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ – మూల్యాంకన నిపుణులు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ డైరెక్టర్ అంకష్ వథేరా తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలను రూపొందిస్తున్నాం.. రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్–2047 కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల్లో వ్యూహాత్మక వృద్ధిని సాధించేందుకు అవసరమైన దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక రంగంలో.. వ్యవసాయం, పశుసంవర్థకం, డెయిరీ, ఫిషరీస్, ఉద్యానవనం, సెరికల్చర్, మార్కెటింగ్, సహకారం, అటవీ, జలవనరులు, భూగర్భ జలాలు, చిన్ననీటి పారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి వంటి అంశాల్లో దృక్కోణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ద్వితీయ రంగంలో.. ఇంధనం, రవాణా, ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, ఆహార శుద్ధి, గనుల తవ్వకం, చేనేత–జౌళి, గృహ నిర్మాణం, టిడ్కో తదితర అంశాలపైన సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. సామాజిక రంగం అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, పౌర సరఫరాలకు సంబంధించిన అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. -
గోదావరి–కావేరి అనుసంధానంపై మళ్లీ కదలిక
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 3న హైదరాబాద్‌లో ఇందుకు సంబంధించిన రెండు కీలక సమావేశాలను నిర్వహించతలపెట్టింది. ఉదయం 11.30 గంటలకు నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఆధ్వర్యంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై వేసిన స్టాండింగ్ కమిటీ ఐదో సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కూడా చైర్మన్ వెదిరే శ్రీరామ్ అధ్యక్షతన జరగనుంది. ఉదయం జరిగే సమావేశంలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ)ముసాయిదాను ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నారు. చివరిసారిగా జరిగిన 4వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గోదావరిపై ఎక్కడ బ్యారేజీ నిర్మించి నీళ్లను తరలించాలనే అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో అధ్యయనం జరపా లని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి వద్దే గోదావరిపై బ్యారేజీ నిర్మించాలని తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై నవంబర్ 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ, టాస్క్‌ఫోర్స్ సమావేశాల్లో విస్తృతంగా చర్చించి అన్ని రాష్ట్రాల సమ్మతి పొందాలని ఎన్‌డబ్ల్యూడీఏ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వినియోగించుకోని 141 టీఎంసీల గోదావరి జలా లను గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా తరలించాలని గతంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆ పరిమాణాన్ని 151 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కర్ణాటక కోటాను 19 టీఎంసీలకు పెంచనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోని 151 టీఎంసీల నీళ్లను తరలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేస్తేనే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలని ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కోరాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 3న జరగనున్న సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనన్నది ఆసక్తికరంగా మారింది. -
బలమైన ప్రభుత్వం ఓ అపోహే!
ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనేది అపోహ. సంకీర్ణ ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ ఈ అపోహ జనాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత లేదా సంకీర్ణ ప్రభుత్వాల మధ్య ఎటువంటి తేడా లేదని చరిత్ర చెబుతోంది. అమెరికాలో మహా మాంద్యం తర్వాత, ‘న్యూ డీల్’(1933)లో భాగంగా సంక్షేమ విధానాలను అమలు చేశారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. భారత్ వంటి విశాలమైన దేశానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనే అపోహ ఆధారంగా, ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనను తిరిగి ఎన్నుకోవడం అనే ప్రబలమైన కథనం ఆధారపడి ఉంది. ‘బలమైన ప్రభుత్వం’ అనే ఈ అపోహ– బహుళ పార్టీ, సంకీర్ణ ఆధారిత ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ లేదా చట్టాలను ఆమోదించలేవనీ నమ్మేలా చేస్తుంది. అయితే, రాజనీతి శాస్త్ర రంగంలోని పరిశోధనలు మనకు భిన్నమైన చిత్రణను చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానంగా మూడు రకాల ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అవి: అధ్యక్ష తరహా, పార్ల మెంటరీ, సంఘటిత (కాన్సోషియేషనల్) ప్రభుత్వాలు. ఈ ప్రతి ప్రభుత్వ రూపంలోనూ, బహుళ పార్టీ ప్రభుత్వాలు లేదా సంకీర్ణ ప్రభు త్వాలు స్థిరంగా ఉండటమే కాకుండా పౌరుల సంక్షేమం విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాయని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి. అమెరికా, అధ్యక్ష వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థలో అధ్య క్షుడిని నేరుగా కార్యనిర్వాహక అధిపతిగా ఎన్నుకుంటారు. అయితే పన్నులు పెంచడం, డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం అనే ఖజానా అధికారాలను ప్రతినిధుల సభకు కట్టబెట్టారు. డేవిడ్ మేహ్యూ రాసిన ‘డివైడెడ్ వియ్ గవర్న్: పార్టీ కంట్రోల్, లా మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, 1946–2002’ అనే పుస్తకంలో, ఒకే రాజకీయ పార్టీ అటు అధ్యక్ష పదవినీ, ఇటు కాంగ్రెస్‌నీ నియంత్రించినప్పుడు మాత్రమే అమెరికన్ జాతీయ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే సాధారణ అపోహను తొలగించారు. చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత పార్టీ లేదా వివిధ పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) తర్వాత, అంటే 1933లో కొత్త ఒప్పందం (న్యూ డీల్)లో భాగంగా సంక్షేమ ఆధారిత విధానాలు అమలు చేశారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో ఇటీవలే తీసుకొచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, 2022 వంటి సంక్షేమ ఆధారిత విధానాల్లో భాగంగానే ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడం, మందుల ధరలను తగ్గించడం, క్లీన్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడం వంటివాటిని ఆమోదించారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాల హయాంలోనే ఇవి ఆమోదం పొందాయి. దీనికి విరుద్ధంగా, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) లేదా ఒబామా కేర్ చట్టంగా ప్రసిద్ధి చెందిన యాక్ట్‌ను, 2009లో డెమొక్రాటిక్ పార్టీ అటు అధ్యక్ష పదవినీ నిర్వహిస్తూ, ఇటు ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీని కలిగి ఉన్నప్పుడు ఆమోదించారు. అయినా ఈ చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి చట్టంలో భాగం కాలేనప్పుడు, తమ నియోజకవర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఇది సూచిస్తోంది. పశ్చిమ ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాలను ఎక్కువగా వామపక్ష లేదా సంప్రదాయ వాద పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తుంటాయి. 1945 నుండి జర్మనీని రైట్ వింగ్ లేదా ఉదారవాద సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ‘క్రిస్టియన్ డెమో క్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ’ మితవాద పక్షానికీ, ‘సోషల్ డెమో క్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ’ మధ్యస్థ–వామపక్ష ప్రభుత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ‘సంఘటిత’ ప్రభుత్వాలను పార్లమెంటరీ విధానంలోని ఉప విభాగంగా చూడవచ్చు. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇటలీ, లెబనాన్, ఇథియోపియా వంటి దేశాలలో, వివిధ రకాలైన జాతి, మత, భాషా సమూహాలు సహజీవనం చేయవలసి వస్తోంది. సంఘటిత ప్రభుత్వాలు ఈ సమూహాలలోని అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ఏర్పడతాయి. వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక సమూహం ఏదైనా విషయంపై మరొకరిని అడ్డుకుంటే,రెండోది ప్రతిగా ఆ సమూహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే దేశ అణ్వాయుధ ప్రయోగాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక పౌరుల, హక్కుల ఆధారిత చట్టాలను రూపొందించింది. వీటిలో 2005లోని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), 2006లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, 2009లోని విద్యా హక్కు చట్టంతో పాటు, 2013లో తెచ్చిన ఆహార హక్కు చట్టం; భూ సేకరణ, పునరా వాసం, రీసెటిల్మెంట్ (ఎల్ఏఆర్ఆర్) చట్టం ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి... బలహీ నమైన, కీలుబొమ్మ ప్రభుత్వం అనే అపోహను ప్రచారం చేయడంతో అది 2014లో బీజేపీ విజయానికి దారితీసింది. అయితే, 2014 నుండి ‘బలమైన నాయకత్వం’ మనకు ఏమి అందించిందో చూద్దాం. హక్కుల ఆధారిత చట్టాలు వేటినీ ఈ ప్రభుత్వం ఆమోదించలేదు. పాలనా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి ఏ ఆధారాలూ లేవు. బదులుగా మోదీ ప్రభుత్వం ప్రజలను జవాబుదారీగా ఉంచాలనుకుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా మీ డబ్బును నాకు చూపించమంది; జీఎస్టీ ద్వారా మీ పన్నులు నాకు చెల్లించమంది. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని తేవడం వంటివి జరిగాయి. నిరసనల తర్వాత మాత్రమే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినాయి. గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం లేదా స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం వంటివి అమలులో ఉన్న సంక్షేమ విధానాలకు పొడిగింపు మాత్రమే. ఏ కొత్త ఆవిష్కరణా లేదా కొత్త దిశనూ ఈ ప్రభుత్వం చూపలేదు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సుమారు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అయితే ఇందులో 4.12 కోట్ల మంది జూలై 2023 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. కాగా, జనవరి 2018 నుండి 6 కోట్ల ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు. హక్కుల ఆధారిత చట్టాలు ఈ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గాయి. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ప్రభుత్వం తనను సూక్ష్మశోధనకు అతీతంగా ఉంచుకుంది. వివిధ పథకాలు లేదా ప్రభుత్వ వైఖరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఒక రకమైన భూస్వామ్య పరాధీనతను సృష్టించడంలో భాగమే. అన్ని గ్యాస్ స్టేషన్లపై, మనందరి కోవిడ్ టీకా సర్టిఫికేట్లపై భూస్వామ్య ప్రభువైన ప్రధాని స్వయంగా కనిపిస్తుంటారు. ఏకవ్యక్తి ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి చరిత్ర పొడవునా సమీక్షించినప్పుడు, బలమైన నాయకుల అహంకారం వారి ప్రజలకు ఎల్లప్పుడూ మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఇస్లా మిక్ చట్టంలో ఇజ్మా అనే భావన ఉంటుంది. అంటే ఏకాభిప్రాయం. అతి పెద్ద సమాజం తరపున నిర్ణయాలు తీసుకోవడానికి పండితుల సంఘం కలిసి వస్తుందనే అవగాహనపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ రూపంలో మనం ఒక సంభా వ్యతకు సాక్ష్యులుగా ఉన్నాం. భారత దేశంలోని భిన్న సమూహాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్లకు ఓటర్లు ఒక అవకాశం ఇస్తారని ఆశించవచ్చు. డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి వ్యాసకర్త ‘జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ -
మనసుకూ జబ్బులొస్తాయి!
మన దేశ జనాభాలో దాదాపు రెండు కోట్ల మందికి పైగా పలురకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మానసిక వైద్యుల సంఖ్య చాలా తక్కువే. అర్హత పొందిన మానసిక వైద్యులు కేవలం పదివేల మంది మాత్రమే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య నాలుగు వందల లోపే! శరీరంలో ఏదైనా భాగా నికి జబ్బు చేస్తే, వెంటనే ఆయా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాము. కానీ ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించినా, మాట్లాడినా, కుంగిపోయినా, అది కూడా ఒక జబ్బేననీ, దానికి కూడా శాస్త్రీయమైన చికిత్స ఉందనీ, వైద్యనిపుణులు కూడా ఉన్నారనీ ఇప్పటికీ చాలామందికి తెలి యదు. ఒకవేళ తెల్సినా, మానసిక డాక్టరు దగ్గరికి వెళ్తే పిచ్చిపట్టిందని చులకనగా చూస్తారనే భయంతో తొలి దశలోనే చికిత్స చేయించుకోక, ముదర పెట్టుకుంటారు. ఇంతేకాకుండా, దయ్యం, గాలి సోకిందనో, చేతబడి చేశారనో, మందు పెట్టారనో అపోహలతో, మూఢనమ్మకాలతో నాటు వైద్యులు, మంత్రవైద్యులతో వైద్యం చేయించుకొని వ్యాధి బాగా ముదిరిన తర్వాత డాక్టర్ల దగ్గరకి వెళ్తుంటారు. ఇతర శరీర భాగాల్లాగా కాకుండా మనసనేది కంటికి కనబడని ఒక ప్రత్యేకమైన అవయవం. మనసనేది మెదడు లోని అంతర్భాగమేనని శాస్త్రీయంగా నిర్ధారించిన విష యమే! మెదడు ‘హార్డ్‌వేర్’ అయితే మనసు ‘సాఫ్ట్వేర్’.‘కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కనబడకపోయినా, దాని పనితీరు తెలిసినట్లే, మనసనేది కనబడకపోయినా, దాని ప్రవర్తన, ఆలోచనాతీరు, భావోద్వేగాలు, నిర్ణయాత్మక శక్తి లాంటి వన్నీ బయటికి తెలుస్తూనే ఉంటాయి. శరీరానికి, మనసుకు అవినాభావ సంబంధ ముంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటే, శారీరక జబ్బులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. మానసిక వ్యాధులు వచ్చే ముఖ్య కారణాల్లో వారసత్వంగా వచ్చేవి, మెదడు లోపాలు, మద్యం, మత్తు, మందుల అలవాటు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం లేకపోవడం, తల్లితండ్రుల పెంపకంలో లోపాలు ముఖ్య మైనవి. మానసిక వ్యాధులంటే కేవలం ‘పిచ్చి’ అనే అపోహ చాలామందికి ఉంది. వందల రకాల మానసిక వ్యాధుల్లో ‘పిచ్చి’ (ఉన్మాదం) కేవలం ఒక రకమే! ఆందోళన, టెన్షన్, నిద్రలేమి, దిగులు, మనోవేదన, లేనిపోని భయాలు, అతిశుభ్రత లాంటి చాద స్తాలు, మద్యపానం, డ్రగ్స్‌కు బానిసలు కావడం, ఆత్మహత్యా ప్రయత్నాలు, మన స్పర్ధలతో దంపతులు సర్దుకుపోలేకపోవడం, లైంగిక సమస్యలు. భ్రమలు,భ్రాంతులు, అకారణంగా ఇతరులను అనుమానించడం, దయ్యం–గాలిసోకినట్లు ఊగి పోవడం, ఇంకా చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజవ్ు, హైపరాక్టివిటీ, మొండితనం, అతికోపంతో తిట్టడం, కొట్టడం లాంటి పలురకాల లక్షణాలన్నీ మానసిక రుగ్మతలే నంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగవచ్చు. మానసిక వైద్యులు కేవలం నిద్రమాత్రలే ఇస్తారనే అపోహ ప్రజల్లో ఉంది. అది పూర్తిగా తప్పు. నిద్ర రావడమనేది ఆ మందుల ఫలితాల్లో ఒక లక్షణమే తప్ప అవి నిద్రమాత్రలు కాదు. ఆ యా జబ్బుల్లో ఉన్న మూల కారణాలను సరి చేసి, ఆ వ్యక్తిని మానసిక ఆరోగ్యవంతుడిని చేస్తాయి. ఒకప్పటి కరెంటు చికిత్సతో పాటు, ఇటీవలే వచ్చిన ఆర్టీఎమ్ఎస్ అనే మేగ్నటిక్ చికిత్స కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కౌన్సెలింగ్ పద్ధతుల్లో, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్‌ఫుల్‌నెస్ థెరపీ, డీబీటీ, సీఆర్టీ, వర్చువల్ రియాలిటీ థెరపీ లాంటి ఆధునిక చికిత్సా పద్ధతులు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి ఎలాంటి చికిత్స అవసరమన్నది అర్హత గల మానసిక వైద్య నిపుణులే నిర్ణయిస్తారు. ఎంబీబీఎస్ తర్వాత మానసిక వైద్యశాస్త్రంలో మూడేళ్ళు ఎమ్డీ లేదా డీఎన్బీ కోర్సు చేసిన వారినే ‘సైకియాట్రిస్టు’ లంటారు. రోగ నిర్ధారణకు తగిన పరీక్షలు చేసి మందులతోపాటు కౌన్సిలింగ్ చేసే శిక్షణ సైకియాట్రిస్టులకే ఉంటుంది. ‘సైకాల జిస్టు’లంటే సైకాలజీలో ఎమ్మెస్సీ లేదా ఎమ్‌ఫిల్ క్లినికల్ సైకాలజీ చేసినవారు. వీరు మానసిక రోగులకు కౌన్సెలింగ్‌తో పాటు తెలివితేటల నిర్ధారణ, వ్యక్తిత్వ నిర్ధారణ లాంటి మానసిక పరీక్షలు మాత్రమే చేస్తారు. రోగనిర్ధారణ,మందులు ఇవ్వడం లాంటివి వీరు చేయకూడదు. మానసిక రోగుల సంక్షేమం కొరకు, కేంద్రప్రభుత్వం 2017లో ‘మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్’ అనే ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయిలో ‘స్టేట్ మెంటల్ హెల్త్ అధారిటీ’నీ, జిల్లా స్థాయిలో ‘రివ్యూ బోర్డ్స్’ను ఏర్పాటు చేశారు. దేశంలో మానసిక వైద్యం అవసరమైన ప్రతి వ్యక్తికీ చికిత్స చేయించి, ఆ ఖర్చు భరించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఈ చట్టంలో పేర్కొన్నారు. అలాగే ఆదరణ, కూడు, గూడు లేకుండా వీధుల్లో తిరిగే అనాథ మానసిక రోగులను కూడా చేరదీసి వైద్యం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! ప్రతి సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకొంటూ, ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించే ప్రయత్నాన్ని మానసిక నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్’ పిలుపు ఇచ్చిన సందర్భంగా, సమాజంలో మానసిక అనారోగ్యంపై, మూఢనమ్మకాలపై పోరాడ దామని అందరం ఈ సందర్భంగా ప్రతిన బూనుదాం! డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ సైకియాట్రిస్ట్ (రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
సీఐసీ పోస్టుకు 76 దరఖాస్తులు
న్యూఢిల్లీ: ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ) పదవిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహా్వనించగా, ఇప్పటిదాకా 76 దరఖాస్తులు వచ్చాయి. సీఐసీ వైకే సిన్హా పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ పోస్టు కోసం ముగ్గురు సమాచార కమిషనర్లు హీరాలాల్ సమారియా, సరోజ్ పున్హానీ, ఉదయ్ మహూర్కర్ పోటీ పడుతున్నారు. మాజీ సమాచార కమిషనర్ అమిత్ పాండోవ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. -
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం తీపికబురు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధి దారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 గతంలో రూ.200 ఇప్పుడు.. గతంలో కేంద్రం పీఎంయూవై పథంలోని లబ్ధి దారులు గ్యాస్ సిలిండర్‌పై రూ.200 రాయితీ అందించేది. ఇప్పుడు మరో రూ.100 పెంచింది. దీంతో ఇంతకు ముందు ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.703 ఉండగా, తాజాగా, కేంద్రం నిర్ణయంతో పీఎంయూవై పథకం కింద సిలిండర్ ధర రూ.603కే లభ్యమవుతుంది. రూ.1650 కోట్లు విడుదల గత నెలలో కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను అందించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1,650 కోట్లను విడుదల చేసింది. ఉజ్వల కనెక్షన్ పెంపుతో పీఎంయూవై పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 10.35 కోట్లకు పెరిగింది. -
యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై కుట్రలెందుకు?
సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌కు కావాలనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. అనుమతులు ఇవ్వడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై మండిపడ్డారు. తొమ్మిది నెలల్లో టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తోందని, థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా అనుమతులు రావడం లేదన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకొని కేంద్ర మంత్రికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మోదీ అడుగుపెట్టే ముందు ఆదేశాలు ఇచ్చి రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారుతుందనే యాదాద్రి ప్లాంట్‌పై కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని, మూడు గంటలు చాలు అన్న కాంగ్రెస్ నాయకులు...కరెంట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వరిచేను, ఒక్క వరి కంకి ఎండిపోలేదని, ప్రతిపక్షాలది పసలేని ప్రచారం అని ఎద్దేవా చేశారు. -
రూ. 2,000 వేల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు!
రూ.2000 నోట్లను మార్చుకున్నారా? లేదంటే ఇప్పుడే ఆ పని చేయండి. ఎందుకంటే నోట్ల మార్పిడికి ఆర్బీఐ విధించిన గడువు నేటితో (సెప్టెంబర్ 30) ముగియనుంది. ఈ రోజు దాటితే మీ వద్ద ఉన్న 2వేల నోట్లు ఎందుకు పనికి రావు. ఆర్బీఐ సైతం నోట్ల ఎక్ఛేంజ్ గడుపు పెంచడం లేదని స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది మే 19వ తేదీన భారతీయ కరెన్సీలో అతిపెద్ద నోటు 2వేల నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. మే 23వ తేదీ నుండి 2వేల నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది.ఈ నోట్ల మార్పిడికి చివరి గడువు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చింది. రూ.2,000 మార్పిడి.. ఆర్బీఐ స్పష్టత ఆ గడువును ఆర్బీఐ మరింత పొడిగిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ తరుణంలో ఆర్బీఐ రూ.2,000 మార్పిడిపై స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30, 2023లోగా మార్చుకోవాలని సూచించింది. నోట్ల ఎక్ఛేంజ్ కోసం గడువు పొడిగించే అవకాశం లేదని తెలిపింది. కాబట్టే, మీ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే ఈ శనివారం లోగా ఎక్ఛేంజ్ చేసుకోవాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. 93 శాతం వరకు రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మే నుంచి గత ఆగస్టు నెల వరకు మొత్తం 93 శాతం నోట్లు బ్యాంకుల్లో జమైనట్లు తెలిపింది. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లు. ఇంకా రూ.24,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. రూ.2,000 ఎక్కడ మార్చుకోవచ్చు ప్రజలు తమ రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖలు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బ్యాంకు అకౌంట్ లేని వ్యక్తి ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు రూ. 2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పిచ్చింది. వినియోగంలోకి రూ.2,000 నోట్లు ఆర్బీఐ రూ.2000 నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది. ప్రాథమికంగా ఆ సమయంలో చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది. -
వచ్చే ఆరు నెలల్లో రూ.6.55 లక్షల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24 ద్వితీయార్థంలో (2023 అక్టోబర్– మార్చి 2024) డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ. 6.55 లక్షల కోట్లు రుణం తీసుకోనున్నట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇందులో సావరిన్ గ్రీన్ బాండ్ల (ఎస్‌జీఆర్‌బీ) జారీ ద్వారా సమీకరణల మొత్తం రూ. 20,000 కోట్లు. మార్కెట్ రుణ సమీకరణల ద్వారానే ప్రభుత్వం తన ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను పూడ్చుకునే సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరంలో రూ.15.43 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ద్వితీయార్థం వాటా (రూ.6.55 లక్షల కోట్లు) రూ.42.45 శాతం. దీర్ఘకాలిక సెక్యూరిటీల కోసం మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో మొదటిసారి 50 సంవత్సరాల సెక్యూరిటీ (బాండ్) కూడా ఈ దఫా జారీ చేస్తుండడం గమనార్హం. 20 వారాల పాటు జరిగే వేలం ద్వారా రూ.6.55 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలు పూర్తవుతాయి. మార్కెట్ రుణం 3, 5, 7, 10, 14, 30, 40, 50 సంవత్సరాల సెక్యూరిటీలలో ఉంటుంది. -
ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు శుభవార్త ఇది. పట్టణాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు తక్కువ (సబ్సిడీ) వడ్డీ రేట్లలో గృహ రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గానికి చెందిన 20.5 లక్షల మంది రుణ దరఖాస్తుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. రాయిటర్స్ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రాబోయే నెలల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. వడ్డీ రాయితీని ముందుగానే లబ్ధిదారుల హౌసింగ్ లోన్ ఖాతాలో జమ చేస్తారు. 2028 వరకు ప్రతిపాదించిన పథకం దాదాపు ఖరారైందని, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలను రాయిటర్స్ ఉటంకిస్తూ పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. "రాబోయే సంవత్సరాల్లో కొత్త పథకాన్ని తీసుకువస్తాం. ఇది ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో, మురికివాడల్లో, అనధికార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని మోదీ చెప్పారు. -
చరిత్ర అంటే బోర్డు మీది రాతా?
చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు. ఎలా అంటే అలా చెరపడం, కొత్తది రాయడం కుదరదు. చరిత్ర తెలియనివాళ్లే ఇప్పుడు ‘ఇండియా’ స్థానంలోకి ‘భారత్’ను తెస్తున్నారు. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునేవాళ్లు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామవాచకాన్ని మార్చడం అహేతుకం. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సంస్కృతీకరణకు గురి చేస్తోంది. దీనికి కారణం పాలకులకు భారతదేశ చరిత్ర తెలియకపోవడమే. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు డి.డి. కోశాంబి, రొమిల్లా థాఫర్, ఆర్.ఎస్. శర్మా, ఝూ, బి.ఎస్.ఎల్.హనుమంతరావు వంటి వారంతా తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. మనం ఒకసారి ప్రపంచ దేశాలలో ఉన్న లైబ్రరీలను వీక్షిస్తే... ముఖ్యంగా లండన్ మ్యూజియం లైబ్రరీలో హిస్టరీ మీద ఒక శాఖ ఉంటుంది. కన్నెమెరా లైబ్రరీ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ దేశాల నుండి పరిశోధకులందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఇండియా అంటేనే స్పందిస్తారు. ‘భారత్’ శబ్దం ఎక్కడా కనపడదు. యక్షులు, కింపురుషులు, గంధర్వులు భారతదేశంలో ప్రాచీన జాతులు. ఈనాటి దళితులు వారి వారసులే. వారు నదీ దేవతలను సృష్టించారు. వెన్నెలను ఆరాధించారు. ఆర్యులు అంతకుముందు ఉన్నటువంటి జాతుల మొత్తం వారసత్వాన్ని తమదిగా చెప్పు కొన్నారు. దళితులకు సంబంధించిన అనేక చారిత్రక అంశాలను ఆర్యులు సొంతం చేసుకున్నారు. మనది ‘సింధూ నాగరికత’ అంటారు. సింధూ శబ్దం అతి ప్రాచీనమైనది. ఇండియాలో మానవ జాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్టు మానవజాతి పరిణా మంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహనిర్మాణం, సంపద కీలకపాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ దళితుల జీవన విధానంలో ఉండడం వలన, బి.ఆర్.అంబేడ్కర్ నిర్వచించినట్లుగా వీరు ఇండియన్స్ అనేది నిర్ధారణ అవుతుంది. హిందువుల మత సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్య కాలు, ఉపనిషత్తులు, సూత్రాలు, ఇతిహాసాలు, స్మృతులు, పురాణాలు ఉన్నాయి. వేద బ్రాహ్మణులు వేదాలకూ, ఇతర రకాల మత సాహిత్యానికీ మధ్య ప్రత్యేకత చూపాలని అభిప్రాయపడ్డారు. వేదాలను ఉన్నతమైనవిగా మాత్రమే కాకుండా పవిత్రమైనవిగా, తిరుగులేనివిగా చేశారు. చరిత్రకు మూలమైన శాసనాలు, వ్రాత ప్రతుల వంటి వాటిని పేర్కొనకుండా కేవలం వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునే సనాతన భావజాలకర్తలు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు. దక్షిణ భారత భాషల్లో ఏ భాషలోనూ భారత శబ్దం లేదు.ఇండియన్ లాంగ్వేజెస్ పుట్టు పూర్వోత్తరాల మీద కృషి చేసిన వారెవ్వరూ భారత్ శబ్దాన్ని పేర్కొనలేదు. నిజానికి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. వాఙ్మయ దృష్టితో కాకుండా, భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ ప్రాచీనమైనది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగలమీద ఉండటాన్ని గమనించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలున్నాయి. కోయ భాషమీద పరిశోధన చేసిన జె.కాయన్ ఈ విషయాన్ని చెప్పారు. కోయ జాతి అతి ప్రాచీనమైనదని సామాజిక శాస్త్ర చరిత్ర చెప్తున్న సత్యం. ఈ కోయ భాషలో విశేషంగా తెలుగు ఉండడం వల్ల రాతలేని తెలుగు అతి పురాతన కాలంలోనే ఉందని మనకు అర్థమౌతుంది. తెలుగు భాష ప్రాచీనతను తెలుసుకోవాలంటే, మనం తెలుగులో అతి ప్రాచీనులైన తెగలను పరిశీలించవలసిందే. ఇకపోతే ఆంధ్రజాతిని నాగులుగా పిలవడం, నాగజాతికీ, ఆర్య జాతికీ ఉన్న వైరుధ్యం భారతంలో వర్ణించబడింది. ప్రసిద్ధ చరిత్ర కారులు బి.ఎస్.ఎల్. హనుమంతరావు తన ఆంధ్రుల చరిత్రలో ఆంధ్రులు ఋగ్వేద కాలం నాటివారనీ, వారు నాగులుగా ఆర్యులతో పోరాడారనీ, ఖాండవ వన దహనం, సర్పయాగం తరువాత వింధ్య పర్వతాల ఇవతలికి వచ్చారనీ, వారే ఆంధ్రులుగా పిలువబడ్డారనీ రాశారు. నాగులకు, ఆర్యులకు జరిగిన తీవ్ర సంఘర్షణలో ‘ఖాండవ దహనం’, జనమేజయుడి ‘సర్పయాగం’ రెండు ముఖ్య ఘట్టాలు. ఈ ప్రమాదం నుండి తప్పించుకొన్న నాగులు దక్షిణంగా వలసవచ్చి కృష్ణా ముఖద్వారంలో స్థిరపడి ఉంటారు. అమరావతీ శిల్పాలలోని రాజులకు, రాణులకున్న సర్ప కిరీటాలు వారి జాతీయతకు చిహ్నాలే. ఈ చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే, భారత్ కంటే ‘ఇండియా’యే పురాతనమైనది. భారత్ శబ్దం వలన ఇండియా తన ఐడెంటి టీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది మనకు చాలా నష్టం. భారత దేశం, హిందూదేశం, ఇండియా... ఈ మూడు పేర్లలో జాతి, మత, లింగ, కుల, వర్ణ, ప్రాంతాలకు అతీతమైన పేరు ఇండియా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్ ఈ దృక్పథంతోనే తమ గ్రంథాలు రాశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇండియాను వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది వారికి కూడా నష్టమే. అందరికీ నష్టమే. చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు.ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తున్నా, సంస్కృతీకరణ ద్వారా దేశీయ ప్రజలను అవమానిస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామ వాచకాన్ని మార్చడం అహేతుకం. దేశంలోని ప్రజా స్వామ్య, లౌకికవాద, సామ్యవాద శక్తులందరూ ఇండియాను బలపరు స్తున్నారు. అధిక జనుల అభిప్రాయమే చారిత్రక సత్యం. పేర్లు మార్చడం ద్వారా చరిత్ర మారదు. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు!
న్యూఢిల్లీ: దేశంలో మహిళల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, వారి ఆకాంక్షను నెరవేరుస్తూ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు, పార్లమెంట్ నూతన భవనంలో ఉభయసభలు కొలువుదీరిన తొలిరోజు మంగళవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’ను దిగువ సభలో ప్రవేశపెట్టారు. ముందు రోజే.. అంటే సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమోదముద్ర వేశారు. బిల్లుపై బుధవారం లోక్‌సభలో కీలక చర్చ జరుగనుంది. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ నూతన భవనంలో లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు రికార్డుకెక్కింది. ఉభయసభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారనుంది. మహిళా కోటా ఇప్పుడే కాదు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి రానుంది. అంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేదు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2027 తర్వాతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. మహిళల కోటా బిల్లు చట్టంగా మారిన తర్వాత 15 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కాల వ్యవధిని పొడిగించవచ్చు. 1996 నుంచి.. గత 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభిస్తుండడం పట్ల ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు పలు విపక్షాలు సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్లో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందడం ఖాయమేనని చెప్పొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముమ్మాటికీ తమదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత లోక్‌సభలో 82 మంది మహిళలున్నారు. రిజర్వేషన్ల చట్టంతో ఈ సంఖ్య 181కి చేరుతుందని మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఉభయ సభలు వాయిదా పార్లమెంట్ నూతన భవనంలో మంగళవారం ఉభయ సభల కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదేవిధంగా, రాజ్యసభలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసగించారు. సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాలకు జీఎస్టీటీకి సంబంధించిన చెల్లింపులపై ఖర్గే లేవనెత్తిన అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. బిల్లులో ఏముంది? ► మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఆరు పేజీల బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ► లోక్‌సభలో, శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజ్యసభలో, రాష్ట్రాల శాసన మండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించవు. ► మహిళల కోటాలో మూడో వంతు సీట్లను ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తారు. ► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారి మహిళల రిజర్వ్డ్ సీట్లు రొటేషన్ అవుతుంటాయి. అంటే మహిళకు కేటాయించిన నియోజకవర్గాలు స్థిరంగా ఉండవు. ► బిల్లులో ఓబీసీ(ఇతర వెనుకబడిన తరగతులు)లను చేర్చడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండవు. ► ఆంగ్లో–ఇండియన్ మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండవు. ► ప్రస్తుతం లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య కేవలం 14 శాతం ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇలా చాలా తక్కువ. ► రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లును కనీసం 50 శాతం రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
కేంద్రానికి కాసుల వర్షం! భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్..
కార్పొరేట్ల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ( Direct Tax Collection) 23.51 శాతం పెరిగి రూ.8.65 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) సెప్టెంబర్ 16 నాటికి నికరంగా రూ. 8,65,117 కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలయ్యాయి. ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను (సీఐటీ) రూ. 4,16,217 కోట్లు. వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) కలిపి రూ. 4,47,291 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్ ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు రూ. 3.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేసిన రూ. 2.94 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 21 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 16 నాటికి వసూలైన రూ. 3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రూ. 2.80 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 74,858 కోట్లు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్లను ట్యాక్స్ పేయర్స్‌కు ప్రభుత్వం జారీ చేసింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) -
ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఎల్ఐసీ ఏజెంట్ల (LIC agents) గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ.10,000 స్థాయిలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూ. 25,000 నుంచి రూ.150,000 స్థాయికి పెంచేందుకు అంగీకరిచింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఈ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో ఎల్ఐసీ వృద్ధి, బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) -
ఈడీ ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
సాక్షి, ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియామకమయ్యారు. కాగా, ప్రస్తుతం రాహుల్ నవీన్.. ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే, పూరిస్థాయి డైరెక్టర్ నియామకం వరకు ఇన్‌ఛార్జ్‌గా రాహుల్ కొనసాగనున్నారు. రాహుల్ 1993 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఈడీ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా.. ఈడీ, సీబీఐ ఉమ్మడి కొత్తగా బాస్‌గా సంజీవ్‌ను నియమించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పదవి సృష్టించే దిశగా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. President Droupadi Murmu appointed an Indian Revenue Service (IRS) officer of the 1993 batch, #RahulNavin, as the incharge Director of #EnforcementDirectorate. #ED #cliQIndia pic.twitter.com/pVf7RM6TS9 — cliQ India (@cliQIndiaMedia) September 16, 2023 ఇది కూడా చదవండి: కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు.. -
New Parliament Dress Code: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదురోజులపాటు ఈ సమావేశాలు పార్లమెంట్లో నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాత భవనంలోనే సమావేశం నిర్వహించి, రెండో రోజు (ఈ నెల 19న) వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెడతారు. కొత్త భవనానికి తరలివెళ్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉద్యోగులు, సిబ్బంది ధరించే యూనిఫామ్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు సిసలైన భారతీయత ఉట్టిపడేలా ఈ దుస్తులు ఉంటాయని సమాచారం. నెహ్రూ జాకెట్లు, ఖాకీ రంగు ప్యాంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) నిపుణులు ఈ యూనిఫామ్‌లను డిజైన్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ధరించే నెహ్రూ జాకెట్ ముదురు గులాబీ రంగులో కమలం పువ్వు డిజైన్‌తో ఉంటుందని సమాచారం. ఉభయ సభల మార్షల్స్ డ్రెస్‌ను కూ డా మారుస్తున్నారు. వారు మణిపురి తలపాగాలు ధరిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది ధరించే సఫారీ సూట్లలోనూ మార్పులుంటాయి. సైని కులు ధరించే డ్రెస్ లాంటిది వారికి ఇవ్వబోతున్నారు. NIFT designed New dress code for Parliament staff includes 1. Modi Jacket 2. Cream shirt with Lotus emblem 3. Khaki trousers 😂😂 pic.twitter.com/RWlP93mNha — Mac (@pattaazhy) September 12, 2023 ఎన్నికల గుర్తు ముద్రించడం ఏమిటి?: కాంగ్రెస్ పార్లమెంట్ సిబ్బంది యూనిఫామ్‌పై ‘కమలం’ను ముద్రించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి బొమ్మ కాకుండా కమలం గుర్తు ముద్రించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ ఎన్నికల గుర్తు కాబట్టే కమలాన్ని ముద్రిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. ఇది కూడా చదవండి: జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా -
ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతులపై కేంద్రం మరో ముందడుగు!
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతుల విషయంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అడుగు ముందుకేసింది. దిగుమతిదారులకు లైసెన్సులను సజావుగా అందించడానికి కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నిమగ్నమైంది. ల్యాప్‌టాప్, కంప్యూటర్లపై ప్రభుత్వం దిగుమతి ఆంక్షలు విధించడంతో దిగుమతిదారులు నవంబర్ 1 నుండి డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. తయారీ కంపెనీ గత పనితీరును ప్రామాణికంగా తీసుకుని గతంలో లైసెన్సు జారీ చేసేవారు. దిగుమతుల ఆంక్షల కారణంగా భారత్‌కు ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై నిశితంగా నిఘా ఉంచేందుకు దోహదపడతాయి. భవిష్యత్ వృద్ధి ఆశయాల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీని కీలక ప్రాధాన్యతగా భారత్ గుర్తించింది. చైనా వెలుపల తమ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణ యం దేశీ య తయారీని ప్రోత్సహిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, సర్వర్స్ తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఫాక్స్‌కాన్ గ్రూప్, హెచ్‌పీ, డెల్, లెనోవోతో సహా 38 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల విలువ 2022–23లో 8.8 బిలియన్ డాలర్లు. ఇందులో పీసీలు/ల్యాప్‌టాప్‌ల వాటా 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పీసీలు/ల్యాప్‌టాప్‌ల ఎగుమతులు 163 బిలియన్ డాలర్లు. ఇందులో చైనా ఏకంగా 81 శాతం వా టా దక్కించుకుంది. లెనోవో, యాపిల్, డెల్, హెచ్ పీ అత్యధికంగా చైనాలో తయారు చేస్తున్నాయి. -
కేంద్రం అనూహ్య నిర్ణయం.. హిస్టరీ క్రియేట్ చేసిన జయవర్మ సిన్హా
ఢిల్లీ: దేశ చర్రితలోనే మొదటిసారిగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా తొలిసారిగా మహిళను నియమించింది. జయవర్మ సిన్హాను కేంద్రం రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశ చరిత్రలోనే రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయవర్మనే కావడం విశేషం. కాగా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయవర్మ.. ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా(ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) ఉన్నారు. Congratulations 🌹🎉🙂 Jaya Verma Sinha, Indian Railway Management Services (IRMS), Member (Operations & Business Development), Railway Board appointed as Chairman & Chief Executive Officer (CEO), Railway Board: Govt of India. @RailMinIndia #WomenEmpowerment #RakshaBandangift pic.twitter.com/3kRFq3OesJ — Uppal Shah (@uppalshah) August 31, 2023 ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జయవర్మ సీఈవోగా కొనసాగనున్నారు. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో సిన్హా చేశారు. నార్తర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, ఈస్టర్న్ రైల్వేలో ఆమె పని చేశారు. ఆమె అలహాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం విశేషం. కాగా, నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లహాటీ కొనసాగారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయం సందర్భంగా మహిళల శక్తి గురించి ప్రత్యేకంగా చర్చించారు. మహిళలను అభినందించారు. మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. అటు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మహిళా సాధికారతపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయవచ్చు అని చెప్పారు. ఇది కూడా చదవండి: జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో.. -
కులగణన సర్వేపై నాలుక కరుచుకున్న కేంద్రం
పాట్నా: బీహార్‌లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో సవరణలపై బీహార్‌లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు. ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది. ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత -
దేశ ప్రజలకు శుభవార్త.. రూ. 200 తగ్గిన గ్యాస్ ధరలు
రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' గ్యాస్ ధర తగ్గింపుపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎల్పిజి సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌పై రూ. 200 తగ్గనుంది. అంతే కాకుండా పీఎంయూవై వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తించనుంది. ఫలితంగా పీఎంయూవై వినియోగదారులు ప్రస్తుతం ఉన్న సబ్బిడీతో కొత్త తగ్గింపు పొందుతారు. కావున వీరికి రూ. 400 తగ్గింపు లభిస్తుంది’ అని తెలిపారు. ఎల్పిజి సిలిండర్లపై అదనపు సబ్సిడీ 33 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనకారిగా ఉంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2023-24 సంవత్సరానికి ఎల్పిజి సిలిండర్‌పై రూ. 200 తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 7,680 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతే కాకుండా ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్) కుటుంబాల మహిళల కోసం 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లను పంపిణీ చేయడానికి ప్రారంభించారు. #WATCH | "PM Modi has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders, for all users...this is a gift from PM Narendra Modi, to the women of the country, during the occasion of Raksha Bandhan", says Union Minister Anurag Thakur pic.twitter.com/QTy6YB0x4u— ANI (@ANI) August 29, 2023 -
బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..
India additional safeguards on basmati rice: బాస్మతి ముసుగులో నిషేధిత సాధారణ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటి కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిషేధిత కేటగిరీ కింద ఉన్న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిరోధించడానికి బాస్మతి బియ్యం ఎగుమతులపై అదనపు భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని తప్పుగా వర్గీకరించి అక్రమ ఎగుమతి చేస్తున్నట్లు విశ్వసనీయ క్షేత్ర నివేదికలు అందినట్లు ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొంది. దేశీయంగా ధరలను కట్టడి చేయడానికి, ఆహార భద్రత కోసం గత జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై పరిమితులు విధించినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గమనించింది. బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA)కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చని, అలాగే వాటి పరిశీలనకు ఏపీఈడీఏ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది. ఇదీ చదవండి: రేట్లు పెంచాల్సి ఉంటుంది.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు -
కేంద్రం కీలక నిర్ణయం.. మేనేజింగ్ డైరెక్టర్ల రీటైర్మెంట్ వయస్సును
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలు, బ్యాంకుల్లో మేనేజింగ్ డైరక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి రిటైర్మెంట్ వయస్సును పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ, ఎస్బీఐ చైర్మన్ల రీటైర్మెంట్ వయస్సును 65కి పొడిగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రం సంబంధిత శాఖలతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చీఫ్‌ల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పీఎస్‌బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దినేష్ ఖారా రీటైర్మెంట్ పొడిగింపు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖరా పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని ప్రస్తుత 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని యోచిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2020 నుంచి దినేష్ ఖారా ఎస్బీఐ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత నిబందనల ప్రకారం.. ఖరా వచ్చే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం అతని వయస్సు 63 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పదవీ విరమణ వయస్సు పెంపుతో ఆయన ఎస్బీఐ చైర్మన్‌గా మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇతర సంస్థల్లో డైరెక్టర్లగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సు పొడిగింపుపై ప్రణాళికలు, చర్చలు మినహా, మిగిలిన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్రానిదే. ఎల్ఐసీ చైర్పర్సన్ జూన్ 29, 2024 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్‌పర్సన్‌గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత, జూన్ 7, నుంచి 2025 వరకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన పదవిలో కొనసాగనున్నారు. ఎల్ఐసీకి ఎం జగన్నాథ్, టేబల్ష్ పాండే, మినీ ఐపీ అనే ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. ఎండీల పదవీ విరమణ వయస్సు పొడిగింపు వారి పదవీకాలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. -
అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్
పాట్నా: బీహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన పూర్తయినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ డేటా సంకలనం జరుగుతోందని అతి త్వరలోనే ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ కులగణన సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన కులగణన అన్ని కులాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దీని వలన ఎంతోకాలంగా నష్టపోయిన వారితో పాటు సమాజంలో ఆయా వర్గాల వారికి కూడా మేలు చేస్తుందని అన్నారు. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఏయే అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందో స్పష్టంగా తెలుస్తుందని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులగణన జరిపితే బాగుంటుందని అన్నారు. కొంతమంది ఈ కులగణనను వ్యతిరేకిస్తున్నారు కానీ అఖిలపక్షాల అభిప్రాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యతిరేకించే వారి అభిప్రాయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ సర్వే ద్వారా సాంఘిక, ఆర్ధిక అసమానతలకు గురైన వారికందరికీ సంక్షేమ పథకాలు అందించి మెరుగైన సేవ చేయడానికి వీలుంటుందని తెలిపారు. మొదటి నుంచి కులాల ప్రాతిపదికన సంక్షేమం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే కులగణన చేశామని అన్నారు. కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతి కోరడంపై స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను నిలిపివేయమని ఎప్పుడూ చెప్పదు. ఇక పాట్నా హైకోర్టు అయితే ఇదే అంశంపై నమోదైన అనేక పిల్లను కొట్టి పారేసిందని గుర్తు చేశారు. మరి 2021లోనే పూర్తి కావాల్సిన కులగణన జాప్యం విషయమై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కేంద్రం ఈ కులగణన కార్యక్రమంలో జోక్యానికి అనుమతి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇందులో ఉన్న చట్టపరమైన సమస్యలు తెలుపుతూ తదుపరి వాయిదా తేదీ ఆగస్టు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఈలోపే ఈ సర్వే పూర్తి కావడం విశేషం. ఇది కూడా చదవండి: మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్