ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు! | 7th pay commission new child care leave rules notified for ais employees | Sakshi
Sakshi News home page

7th Pay Commission: గుడ్‌న్యూస్‌.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు - వారికి మాత్రమే!

Published Thu, Aug 24 2023 2:51 PM | Last Updated on Thu, Aug 24 2023 3:49 PM

7th pay commission new child care leave rules notified for ais employees - Sakshi

Child Care Leave Rules For AIS: ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) అర్హత కలిగిన సభ్యులు వారి మొత్తం సర్వీస్‌లో సెలవులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం ఇటీవల సవరించింది. ఈ కొత్త సవరణ ప్రకారం ఇప్పుడు ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి గరిష్టంగా రెండు సంవత్సరావుల పాటు సెలవులు తీసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1995 ప్రకారం సవరించిన చైల్డ్ కేర్ లీవ్ నియమాలను నోటిఫై చేసింది. దీని ప్రకారం రెండు సంవత్సరాలు సెలవులు తీసుకున్నప్పటికీ వేతనాలు అందుతాయి. అంటే సెలవుల్లో ఉన్నప్పటికీ జీతం లభిస్తుంది.

ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS)లోని ఒక మహిళ లేదా పురుషుడు తమ ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి వారి మొత్తం సర్వీసులో 730 రోజులు సెలవు తీసుకోవచ్చు. వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు లోపు విద్య, అనారోగ్యం, సంరక్షణ వంటి వాటి కోసం సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: భారత్‌లో పెరగనున్న నియామకాల జోరు - ఇదిగో సాక్ష్యం!

చైల్డ్ కేర్ లీవ్ సమయంలో ఉద్యోగి సెలవులు తీసుకుంటే మొదటి సంవత్సరం (మొదటి 365 రోజులలో) 100 శాతం జీతం లభిస్తుంది, ఆ తరువాత ఏడాదిలో 80 శాతం వేతనం లభిస్తుంది. అయితే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 స్పెల్‌ల కంటే ఎక్కువ కాలం చైల్డ్ కేర్ లీవ్ లభించదు. కానీ సర్వీస్‌లో ఉన్న ఒంటరి మహిళకు సంవత్సరంలో 6 స్పెల్‌ల వరకు లీవ్ లభిస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ కింద తీసుకునే సెలవులు ఇతర లీవ్స్‌లో కలిపే అవకాశం లేదు. దీనికి ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement