child care leave
-
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు!
Child Care Leave Rules For AIS: ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) అర్హత కలిగిన సభ్యులు వారి మొత్తం సర్వీస్‌లో సెలవులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం ఇటీవల సవరించింది. ఈ కొత్త సవరణ ప్రకారం ఇప్పుడు ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి గరిష్టంగా రెండు సంవత్సరావుల పాటు సెలవులు తీసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1995 ప్రకారం సవరించిన చైల్డ్ కేర్ లీవ్ నియమాలను నోటిఫై చేసింది. దీని ప్రకారం రెండు సంవత్సరాలు సెలవులు తీసుకున్నప్పటికీ వేతనాలు అందుతాయి. అంటే సెలవుల్లో ఉన్నప్పటికీ జీతం లభిస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS)లోని ఒక మహిళ లేదా పురుషుడు తమ ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి వారి మొత్తం సర్వీసులో 730 రోజులు సెలవు తీసుకోవచ్చు. వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు లోపు విద్య, అనారోగ్యం, సంరక్షణ వంటి వాటి కోసం సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: భారత్‌లో పెరగనున్న నియామకాల జోరు - ఇదిగో సాక్ష్యం! చైల్డ్ కేర్ లీవ్ సమయంలో ఉద్యోగి సెలవులు తీసుకుంటే మొదటి సంవత్సరం (మొదటి 365 రోజులలో) 100 శాతం జీతం లభిస్తుంది, ఆ తరువాత ఏడాదిలో 80 శాతం వేతనం లభిస్తుంది. అయితే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 స్పెల్‌ల కంటే ఎక్కువ కాలం చైల్డ్ కేర్ లీవ్ లభించదు. కానీ సర్వీస్‌లో ఉన్న ఒంటరి మహిళకు సంవత్సరంలో 6 స్పెల్‌ల వరకు లీవ్ లభిస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ కింద తీసుకునే సెలవులు ఇతర లీవ్స్లో కలిపే అవకాశం లేదు. దీనికి ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది. -
మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్‌ను పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని నిబంధన ఉంది. దీనిని సవరించి.. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టీచర్ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి అలాగే ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఏపీ: ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్స్ పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం అరవై రోజులు ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్‌ను కాస్త.. 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సెలవులను పది విడతల్లో ఉపయోగించుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవులు
న్యూఢిల్లీ: ఒంటరిగా ఉంటున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇకపై శిశు సంరక్షణ(చైల్డ్ కేర్) సెలవులు పొందవచ్చని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తోమర్ సోమవారం చెప్పారు. అలాంటి వారిని సింగిల్ మేల్ పేరెంట్‌గా పరిగణిస్తామన్నారు. అవివాహితులు, భార్య మరణించిన వారు, విడాకులు తీసుకున్న వారు పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ఉంటే ఈ సెలవులకు అర్హులని పేర్కొన్నారు. చైల్డ్ కేర్ లీవ్‌లో ఉన్నవారు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) కూడా పొందవచ్చని సూచించారు. శిశు సంరక్షణ సెలవులో ఉన్నవారికి మొదటి 365 రోజులు పూర్తి వేతనం చెల్లిస్తారు. మరో 365 రోజులు కూడా ఈ సెలవులో ఉంటే 80 శాతం వేతనం చెల్లిస్తారు. చదవండి: బీమా ప్రకటనల నిబంధనల్లో మార్పులు -
మగాళ్లకు 180 రోజుల సెలవులు!
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా సంతానం పొందే దంపతులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు మార్చాలని యోచిస్తోంది. సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రెటర్నిటీ లీవు ఇవ్వాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ప్రతిపాదించింది. సరోగసీతో తండ్రులయ్యే పురుషులకూ ఆరు నెలలు ప్రెటర్నిటీ సెలవు ఇవ్వాలని సిఫారసు చేసింది. 'సరోగసీ ద్వారా సంతానం పొందే మహిళలకు లేదా అద్దెగర్భం మోసే తల్లులకు ప్రెటర్నిటీ సెలవులు ఇవ్వడం అనేది ఇప్పటివరకు సర్వీసు రూల్స్ లో లేదు. నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకునేందుకు సరోగసీ దంపతులకు 180 సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించామ'ని డీఓపీటీ పేర్కొంది. ప్రతిపాదిత నిబంధనలను డీఓపీటీ తన వెబ్ సైట్ లో పెట్టింది. వీటిపై అభిప్రాయాలు తెలపాలని కోరింది. చైల్డ్ కేర్ లీవు(సీసీఎల్) నిబంధన సడలించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. వికలాంగ చిన్నారుల సంరక్షణకు తల్లికి రెండేళ్లు(730 రోజులు) చైల్డ్ కేర్ లీవు ఇస్తున్నారు. అయితే సదరు చిన్నారి మైనారిటీ అయివుండాలన్న వయసు నిబంధనను సడలించాలని సిఫారసు చేసింది. సీసీఎల్ లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులకు ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. -
మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలి
ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో పీఆర్సీ సిఫారసుల మేరకు మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిల్లల సంరక్షణ కోసం రెండేళ్లు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) డిమాండ్ చేసింది. పీఆర్సీ సిఫారసు చేసినా ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతో మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో పడ్డారని ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ఇచ్చిన 7వ పీఆర్సీ చేసిన సిఫారసుల్లో ఒంటరి తండ్రికి కూడా(ఉద్యోగి పురుషుడు) రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని సిఫారసు చేసిందని, అలాంటిది మన రాష్ట్రం లో మహిళలకు కూడా దానిని అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అంతర్జిల్లా బదిలీలు జరుగలేదని, వెంటనే చేపట్టాలని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా టీచర్లలో భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో పని చేస్తుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.