భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఫేమ్ 3' (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)ను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ కోసం రూ.26,400 కోట్లు కేటాయించాలని మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కేంద్రం కేటాయించనున్న రూ.26400 కోట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రూ.8158 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సులు కోసం రూ. 9,600 కోట్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్ల కోసం రూ.4,100 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లపై అందించే రాయితీ మాత్రమే కాకుండా టెక్నాలజీ డెవలప్‌మెంట్, ట్రయల్ రన్ వర్క్స్ కోసం ఈ పథకంలో భాగంగానే నిధులు కేటాయించాలన్నది కేంద్రం ఆలోచన. మొత్తంగా రూ.33వేల కోట్లను మూడో దశకు కేటాయించే అవకాశం ఉంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలను ప్రోత్సహించడానికి.. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్ 1న తీసుకువచ్చింది. ఈ సబ్సిడీ కింద టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్‌కు వర్తించేలా చేశారు. ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లెక్కకు మించిన వాహనాలు సేల్ అయ్యాయి.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
కొన్ని సంస్థలు చేసిన అవకతవకల వల్ల.. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ 2 సబ్సిడీ నిలిపివేశారు. కాగా 2024 మార్చి 31 నాటికి ముగుస్తుంది. దీనిని సృష్టిలో ఉంచుకుని ఫేమ్ 3 స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది కూడా రెండు దశల్లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఫేమ్ 3 స్కీమ్ కింద వాహనాలను మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తే 10 శాతం అదనపు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment