Subsidy
-
కందిపప్పు హుష్‌కాకి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. ప్రభుత్వం రేషన్ ఇస్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గడిచిన ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి. ఒక నెలలో వచ్చిన రేషన్ సరుకులు మరుసటి నెలలో ఇస్తారో లేదో తెలియని దుస్థితి. ఎన్నికల్లో పేదల ఓట్లను దండుకోవడమే పరమావధిగా తాము అధికారంలోకి వస్తే రేషన్‌లో 18 రకాల సరుకులు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు.. పీఠం ఎక్కిన తర్వాత పత్తా లేకుండా పోయారు. పేదల నోటికి అందాల్సిన తిండిని లాగేస్తున్నారు. కార్డుదారులకు కిలో కంది పప్పు కూడా ఇవ్వలేక ముఖం చాటేస్తున్నారు. కార్డు తీసుకుని ఎండీయూ వాహనందగ్గరకు వెళ్లిన ప్రతిసారీ లబ్దిదారులకు కందిపప్పు లేదనో, రాలేదనో, వచ్చింది సరిపోలేదనో సమాధానమే ఎదురవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెప్టెంబర్ లో అసలు పంపిణీ ఊసే లేదు. అంటే తొలి మూడు నెలల్లో 1.48 కోట్లకుపై రేషన్ కార్డులు ఉండగా కేవలం 2 శాతం (2.50 లక్షల) కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందించారు. అక్టోబర్‌లో 2,981 టన్నులు, నవంబర్, డిసెంబర్లో 10,800 టన్నుల చొప్పన, జనవరిలో 8,700 టన్నులు, ఫిబ్రవరిలో 3,100 టన్నుల సరఫరాతో సరిపెట్టేశారు. వాస్తవానికి నెలకు కార్డుదారులు అందరికీ కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేయాలంటే 15 వేల టన్నులు అవసరం. సగటున 7 వేల టన్నులకుపైగా కార్డుదారుల నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ, గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం 36 వేల టన్నులు మాత్రమే. పండుగ పూట కూడా పప్పన్నం లేదు.. పండుగల సమయంలో కందిపప్పు అసలే పంపిణీ చేయలేదు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.180–220 వరకు ధర పలుకుతున్న సమయంలో పేదలు కందిపప్పు కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం నిరాశే మిగిల్చారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల్లో 14 వేల టన్నుల కందులను మద్దతు ధరపై ఏపీకి కేటాయిస్తే వాటిని మరాడించగా వచ్చిన కంది పప్పును మాత్రమే పంపిణీ చేశారు. టెండర్ల ప్రక్రియలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేస్తున్నారన్న కారణంతో కొనుగోలుకు ముందుకు వెళ్లడం లేదు. దీంతో నిల్వలు ఖాళీ అయిపోవడంతో మార్చి నుంచి కందిపప్పు పంపిణీ నిలిచి పోయింది. రాజధాని ప్రాంత జిల్లాల్లోనే ఒక్క ఎంఎల్ఎస్ పాయింట్‌కు కూడా కిలో కంది పప్పు చేరని దుస్థితి. సబ్సిడీ భారం తగ్గించుకునే కుట్ర కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సబ్సిడీ రేషన్‌లో కోత పెట్టేందుకే కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే కందిపప్పు పంపిణీని కావాలనే నిలిపి వేస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా కందిపప్పు ధర కిలో రూ.180–220కి పైగా పలికింది. ఆ సమయంలో ప్రభుత్వం పేదల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఎంత రేటు పెరిగినప్పటికీ (రూ.170కిలో) కిలో కందిపప్పును రాయితీపై రూ.67కే అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని భారంగా భావిస్తోంది. రేటు పెంచితే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, దీనికి బదులు ఎక్కువ రేటు పెట్టి కొని కందిపప్పును ఇవ్వడం కంటే పంపిణీని ఎత్తేస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే.. దేశీయంగా కందిపప్పు ధరలు కొంతమేర దిగి వచ్చాయి. హోల్ సేల్‌లో కిలో రూ.100 (సాధారణం), క్వాలిటీ రకం రూ.110–118 పలుకుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు సబ్సిడీపై కందిపప్పును అందించక పోవడం శోచనీయం. మరో వైపు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో పౌర సరఫరాల సంస్థపై ఆర్థిక భారం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అసలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపి వేయడం కొత్తేమీ కాదు. 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93 లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం. కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వస్తువులు ఇస్తామన్న ప్రభుత్వం ఒకటి రెండు సరుకులతోనే సరిపెడుతోంది. బియ్యం, చక్కెర తప్ప మిగిలినవి ఏవీ పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. కందిపప్పు చూద్దామంటే కనిపించకుండా పోతోంది. ప్రభుత్వం ఇలాగే వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తే కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి. – హుసేనమ్మ, కానాల గ్రామం, నంద్యాల జిల్లా స్టాక్ రాలేదని చెప్పారు తిరుపతి జిల్లాలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డుదారులకు కందిపప్పును సక్రమంగా ఇవ్వడం లేదు. మొదటి మూడు నెలలు స్టాక్ రాలేదని చెప్పారు. ఆ తర్వాత కొంత మేరకు మాత్రమే వచ్చిందని తెలిపారు. తాజాగా మళ్లీ రాలేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం కందిపప్పు వస్తుందని.. అయితే కొందరు డీలర్లు డీడీ కట్టడం లేదని చెబుతున్నారు. మొత్తంగా అయితే కందిపప్పు 50 శాతం మంది కార్డుదారులకు సక్రమంగా ఇవ్వడం లేదు. చౌకదుకాణాల్లో కేజీ కందిపప్పు రూ.67కే లభిస్తుంది. మార్కెట్లో రూ.120 నుంచి రూ.130 వరకు చెల్లించాల్సి ఉంటుంది. – గురవయ్య, వాకాడు, తిరుపతి జిల్లా జనవరి నెలలో సగం మందికే పంపిణీ ప్రతినెలా రేషన్ డిపోల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, గోధుమ పిండి తదితర వస్తువులను సరఫరా చేయాల్సి ఉన్నా ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది. జనవరి నెలలో కందిపప్పు కొంత మందికి మాత్రమే మా ప్రాంతంలో అందజేశారు. మిగిలిన వారు రేషన్ దుకాణదారుడిని అడిగితే నిల్వలు అయిపోయాయని సమాధానం ఇచ్చారు. – ఉరిటి అప్పలనాయుడు, ఎమ్మార్ నగరం, పార్వతీపురం మండలం సరిగా ఇవ్వడం లేదు నేను ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నా. మా కుటుంబంలో నలుగురం ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపు నుంచి బియ్యం, బ్యాళ్లు (కంది పప్పు), చక్కెర తదితరాలు వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రెండు నెలల నుంచి బ్యాళ్లు ఇవ్వడం లేదు. దీంతో బయటి మార్కెట్లో కేజీ రూ.150 పెట్టి కొనుగోలు చేస్తున్నాం. – రాజశేఖర్, గణేష్‌నగర్, కర్నూలు ఒకటి, రెండు నెలలే.. కూటమి ప్రభుత్వం రేషన్ సరుకులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, గోధుమ పిండి, రాగిపిండి, రాగులు తదితర సరుకులు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లో ఒకటి రెండు నెలల్లో మాత్రమే అదీ కొద్ది మందికే సరఫరా చేశారు. – హయగ్రీవాచారి, రాయపాడు గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా నమ్మించి మోసం చేయడమేకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి నెల పేదలకు అందించాల్సిన కంది పప్పును సక్రమంగా అందించడం లేదు. ప్రస్తుతం ప్రతి నెల బియ్యం, పంచదారతో సరిపెడుతున్నారు. పేద ప్రజలకు కంది పప్పు ఇవ్వడమే మానేశారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. – డి.రాజ్యలక్ష్మి, రంకిణి గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా -
సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఖరారు
సాక్షి, అమరావతి: కేంద్ర రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై)–పెర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) స్కీమ్‌లో భాగంగా అమలు చేస్తోన్న సూక్ష్మ సాగునీటి పథకం కింద బిందు, తుంపర పరికరాలను అమర్చేందుకు 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీలు ఖరారయ్యాయి. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు ఇవ్వనున్నారు. ⇒ ఎస్సీ, ఎస్టీ యేతర సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.2.18 లక్షలు) ఉంటుంది. ⇒ రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.3.14 లక్షలు) ఇవ్వనున్నారు.⇒ కోస్తా జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం (రూ.3.10 లక్షలు), 10 ఎకరాలకు పైబడిన రైతులకు 50 శాతం (రూ.4లక్షలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.⇒ఇక తుంపర పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం (రూ.19వేలు), 12.5 ఎకరాల్లోపు భూమి కలిగిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు కూడా 50 శాతం (రూ.19వేలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసినట్లుగానే...కాగా, 2024–25 సీజన్ వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ధేశించిన సబ్సిడీల మేరకే బిందు, తుంపర పరికరాలు ఇస్తున్నారు. రూ.2,700 కోట్లతో 7.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించగా, 7.95 లక్షల ఎకరాల్లో విస్తరణకు రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం లక్ష ఎకరాల్లో బిందు పరికరాల అమరికకు పరిపాలనా ఉత్తర్వులిచ్చారు. -
‘పీఎం–ఈ–డ్రైవ్’ పథకంతో ఈవీ రంగానికి ప్రోత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ: ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవని, ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల పార్లమెంట్లో తెలిపింది. ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘ప్రధాన మంత్రి–ఈ–డ్రైవ్’ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చిoదని తెలిపింది. ఈ పథకం ద్వారా ఈ–కార్లకు జీఎస్టీ, పన్ను, పర్మిట్‌లో మినహాయింపు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు చెప్పింది. 2030 నాటికి ప్రైవేటు ఎలక్ట్రిక్ కార్లలో 30శాతం, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలలో 80శాతం వృద్ధిని సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఛార్జింగ్ పాయింట్లను, ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,266, తెలంగాణలో 1,289.. ‘ఫాస్టెర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్’(ఎఫ్ఏఎంఈ) సబ్సిడీ పథకం కింద దేశవ్యాప్తంగా 4,523 ఛార్జర్లు ఉండగా, 251 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ‘ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్’(ఓఎంసీఎస్) పథకం కింద దేశవ్యాప్తంగా 20,035 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్ఏఎంఈ పథకం కింద 354 ఛార్జర్లు ఇన్స్టాల్ జరగగా, 20 ఛార్జింగ్ స్టేషన్లు, ఓఎంసీఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా 912 ఛార్జింగ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎఫ్ఏఎంఈ కింద 238 ఛార్జర్లు ఇన్స్టాల్ చేయగా, ఒకే ఒక్క ఛార్జింగ్ స్టేషన్ ఉండగా, ఓఎంసీఎస్ కింద 1,051 స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16.14లక్షల ఈవీలు.. దేశవ్యాప్తంగా ఎఫ్ఏఎంఈ పథకం సెకెండ్ ఫేజ్‌లో 16,14,737 లక్షల ఈవీలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీటిలో టూవీలర్లు 14, 28,009లక్షలు, త్రీవీలర్లు 1,64,180, ఫోర్ వీలర్లు 22,548 ఉన్నట్లు తెలిపింది. ఈసంఖ్యను రానున్న రోజుల్లో పెంచేదిశగా తాము ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వివరించింది. -
ఉత్తుత్తి గ్యాసేనా?
రాంనగర్‌కు చెందిన గృహిణి ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలనలో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి , ఇందిరమ్మ.. ఇలా ఇతరత్రా పథకాల వర్తింపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె అర్హత సాధించడంతో గృహజ్యోతి కింద విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. కానీ.. రూ.500 వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించలేదు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఆమె భర్త పేరుపై ఉండటంతో ఈ పథకం వర్తించదని ప్రచారం జరగడంతో.. సరిగా ఐదు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తును సవరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో కలెక్టరేట్లోని మీ సేవ కేంద్రానికి వెళ్లి మార్పు చేసుకుంది. అయినా.. ఆమెకు ఇప్పటి వరకు రూ. 500 గ్యాస్ పథకం వర్తించని పరిస్థితి నెలకొంది. అయితే.. దీనిపై గ్యాస్ ఏజెన్సీలతో పాటు పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది గడిచింది. కానీ.. అర్హులందరికీ రూ.500కు వంటగ్యాస్ అందని ద్రాక్షగా మారింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్ కుటుంబాలకు వర్తించడం లేదు. బీపీఎల్ కింద ఒకే కుటుంబం గృహజ్యోతి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకానికి మాత్రం అర్హత సాధించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దీంతో పూర్తి స్థాయి బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయక తప్పడం లేదు. లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ వర్తింపు అమలు ప్రారంమైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించారు. మిగతా పథకాల మాదిరిగా మహాలక్ష్మి పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ పథకం కొందరికే వర్తించడంతో పేద కుటుంబాలు నిరాశలో ఉన్నాయి. ఒక్క శాతం సైతం దాటలేదు.. నగర పరిధిలో వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 31.18 లక్షలు ఉండగా అందులో కేవలం ఒక శాతం కనెక్షన్‌దారులకు మాత్రమే రూ.500 సబ్సిడీ వంటగ్యాస్ వర్తిస్తోంది. సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. అయితే.. సబ్సిడీ గ్యాస్ మాత్రం మూడు లక్షలలోపు కనెక్షన్‌దారులు మాత్రమే ఎంపికైనట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా సుమారు 16 లక్షల కనెక్షన్‌దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా మారింది. ⇒ నగర పరిధిలో సుమారు 52,65,129 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో ప్రజాపాలనలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ కోసం 24 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 11 లక్షల కటుంబాలు జీరో బిల్లుకు అర్హత సాధించాయి. మిగతా కుటుంబాలు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి.కేంద్రం సబ్సిడీ ఓకే.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వినియోగదారులకు బ్యాంక్ ఖాతాలో నగదు బదిలీ కింద రూ. 40.71 జమ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా వినియోగదారు బ్యాంక్ ఖాతాలో పరిమితంగా నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం ‡14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855. పలుకుతోంది. గృహ వినియోగదారులందరూ సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది. -
100 రూపాయల టికెట్ రూ.54కే.. మంత్రి కీలక వ్యాఖ్యలు
రైల్వే టికెట్ల తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి 'అశ్విని వైష్ణవ్' లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రతి టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ ప్రభుత్వం అందించిన మొత్తం సబ్సిడీ రూ.56,993 కోట్లు అని స్పష్టం చేశారు.ఒక టికెట్ ధర రూ.100 అయినప్పుడు.. ప్రభ్యుత్వం దీనిని 54 రూపాయలకు అందిస్తుంది. అంటే ఒక టికెట్ మీద అందిస్తున్న రాయితీ 46 శాతం. ఇది అన్ని కేటగిరీ ప్రయాణికులను వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు. వేగవంతమైన ట్రైన్ సర్వీసులకు సంబంధించిన ప్రశ్నకు జావాబిస్తూ.. అటువంటి సర్వీస్ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు.వేగవంతమైన ట్రైన్ సర్వీస్.. భుజ్ & అహ్మదాబాద్ మధ్య ప్రారంభమైంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్ భుజ్ - అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో అధిగమించడం ద్వారా ఇంటర్సిటీ కనెక్టివిటీని మెరుగుపరిచిందని వివరించారు. ఈ సేవ ప్రయాణికులకు చాలా సంతృప్తికరంగా ఉందని కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.ఎలాంటి జాప్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మేము ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సరసమైన ధరలతో సులభమైన ప్రయాణం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. రైలు ప్రమాదాల సంఖ్య కూడా బాగా తగ్గిందని.. 2014లో రూ.29,000 కోట్లుగా ఉన్న రైల్వే బడ్జెట్‌ను రూ.2.52 లక్షల కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. -
కార్గో ఈ-త్రీవీలర్లకు రాయితీల పొడిగింపు
న్యూఢిల్లీ: కార్గో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ల కొనుగోలుపై రాయితీలకు సంబంధించి పీఎం ఈ–డ్రైవ్ పథకం రెండవ దశను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 80,546 యూనిట్లకు రాయితీ మంజూరు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే నిర్ధేశించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందే నవంబర్ 7 నాటికే చేరుకుంది.దీంతో 2025 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన రెండవ దశను ముందుగానే ప్రారంభించాల్సి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎల్5 విభాగంలో 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలకు రాయితీ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నవంబర్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2024 నవంబర్ 8 నుంచి 2026 మార్చి 31 మధ్య మొత్తం 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్గో త్రీ–వీలర్లకు కిలోవాట్ అవర్‌కు రూ.2,500 సబ్సిడీ ఉంటుంది.రాయితీ కింద గరిష్టంగా ఒక్కో వాహనానికి రూ.25,000 అందిస్తారు. గతంలో ఈ మొత్తం కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ ఇచ్చేవారు. గరిష్టంగా రూ.50,000 ఉండేది. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. -
1.57 కోట్ల దీపాలు ఎప్పుడు వెలిగిస్తారు?
ఏవమ్మా దీపం ఇచ్చాను నేను. దీపం పెట్టాను మీకు జ్ఞాపకం ఉందా? చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని. ఇంటిలో వంట చేస్తే కళ్లలో నీళ్లు వచ్చేవి. కడుపు నిండా పొగపోయేది. నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డా పడకూడదని ‘దీపం’ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్లు అందించిన పార్టీ తెలుగుదేశం. ఈ రోజు గ్యాస్ రేట్లు పెరిగి పోవడంతో మళ్లీ కట్టెల పొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. – మే 28న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు సభలో చంద్రబాబుసాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు సూపర్–6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీపై చంద్రబాబు మైకులు పగిలేలా ప్రసంగాలు చేశారు. ఇప్పుడు “సూపర్–6 చూస్తుంటే భయమేస్తోందం’టూ కుంటిసాకులు వెదుకుతున్నారు. రాష్ట్రంలో 1.57 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక కుటుంబం ఏడాదికి 5–6 గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తోంది. ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.900గా ఉంది. ఈ లెక్కన ఏడాదికి పేద కుటుంబం సగటున రూ.1000 చొప్పున రూ.5 వేల నుంచి రూ.6వేల వరకు గ్యాస్ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలు తమకు 3 ఉచిత సిలిండర్లు ఇస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావించారు. తద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.2,700 మిగులుతుంది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి 1.57 కోట్ల కనెక్షన్లపై రూ.4,239 కోట్లు, ఐదేళ్లలో రూ.21 వేల కోట్లు వెచ్చించాలి. అయితే ఇప్పటి వరకు ఈ పథకం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నోరు విప్పలేదు. ఎగ్గొట్టడంపైనే బాబు దృష్టి 2019 ఎన్నికల ముందు వరకు రూ.800గా ఉన్న గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ.400 సబ్సిడీ ఇచ్చేది. అలాంటింది 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి సబ్సిడీని పూర్తిగా తగ్గించేయడంతో పాటు సిలిండర్ ధర క్రమంగా రూ.1200కు పెంచేసింది. సబ్సిడీ రూపంలో రూ.15 మాత్రమే జమ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కార్ అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచాయి. తర్వాత 2024 ఎన్నికలకు ముందు కేంద్రం అదే గ్యాస్ ధరను రూ.900కు తగ్గించింది. అయినప్పటికీ చంద్రబాబు గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఆ రేటు తగ్గడంతో ఆనందంగా పథకాన్ని అమలు చేయాల్సిందిపోయి ఎగ్గొట్టడంపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.2.69 లక్షల కోట్లు, ఇతర సంక్షేమ పథకాల (నాన్–డీబీటీ) రూపంలో రూ.1.84 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసింది. వీటన్నింటి ఫలితంగానే కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదలు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఫలితంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా కనిపించని ఆర్థిక స్థిరత్వం (రూరల్ సస్టైనబులిటీ) నాలుగేళ్లలోనే సాధ్యపడింది. కానీ, అధికార దాహంతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలతో పేదల ఆర్థిక సూచీ స్థిరత్వాన్ని కోల్పోనుంది. మహిళలను డీఫాల్టర్లు చేసిన బాబు 2014లో పొదుపు సంఘాల మహిళలకు చెందిన రూ.14,204 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లేదు పొమ్మన్నారు. ఫలితంగా మహిళలు బ్యాంకులకు రుణం చెల్లించలేక వడ్డీలపై వడ్డీలు పెరిగిపోయాయి. ఆ రుణ భారం రూ.25,571 కోట్లకు చేరుకుంది. 18.36% సంఘాలు బ్యాంకుల వద్ద డిఫాల్టు అయ్యాయి.అలాంటి సమయంలో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వైఎస్సార్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు వాళ్ల అప్పు మొత్తం చెల్లించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. దేశంలో మొత్తం పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో 30% ఏపీలో పొదుపు సంఘాలకే పంపిణీ చేయించారు. -
ఈ–టూవీలర్‌కు సబ్సిడీ రూ. 10,000
న్యూఢిల్లీ: పీఎం ఈ–డ్రైవ్ పథకం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) కొనుగోలుపై రూ.10,900 కోట్ల మేర సబ్సిడీలను కేంద్రం అందించనుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడమే ఈ పథకం ఉద్దేశ్యం. 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) కింద సబ్సిడీలను అందించగా.. దీని స్థానంలో పీఎం ఈ–డ్రైవ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. 24.79 లక్షల ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల త్రిచక్ర వాహనాలు, 14,208 ఈ–బస్సులకు సబ్సిడీలు అందనున్నాయి. సబ్సిడీలు ఇలా.. ఈ పథకం కింద తొలి ఏడాది కాలంలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంపై రూ.5,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం రెండు కిలోవాట్ అవర్‌కు మించి ఉన్నా కానీ, ఒక ఎలక్ట్రిక్ టూవీలర్‌కు గరిష్టంగా రూ.10,000 వరకే సబ్సిడీ ప్రయోజనం లభిస్తుంది. రెండో ఏడాది కిలోవాట్ అవర్‌కు రూ.2,500కు (ఒక టూవీలర్‌కు గరిష్టంగా రూ.5,000) తగ్గిపోతుంది.ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనం (ఈ రిక్షాలు సైతం) కొనుగోలుపై మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.12,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఎల్5 కేటగిరీ త్రిచక్ర వాహనాలపై మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 చొప్పు న సబ్సిడీ అందుతుంది. ఈ–ట్రక్కులకు రూ. 500 కోట్ల సబ్సిడీ కేటాయించారు. ఎలక్ట్రిక్ 4 చక్రాల వాహనాల కోసం 22,100 ఫాస్ట్ చార్జర్లు, ఈ బస్సుల కోసం 1,800 ఫాస్ట్ చార్జర్లు, ద్విచక్ర /త్రిచక్ర వాహనాల కోసం 48,400 ఫాస్ట్ చార్జర్లను ఈ పథకం కింద ఏర్పాటు చేయనున్నారు. ఓచర్ల రూపంలో..పథకం ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సెక్రటరీ హనీఫ్ ఖురేషీ మాట్లాడుతూ.. సబ్సిడీ పొందేందుకు మొబైల్ యాప్‌ను తీసుకొస్తామని, దీని ద్వారా సబ్సిడీ ఈ–ఓచర్లు జారీ అవుతాయని ప్రకటించారు. ఒక ఆధార్ నంబర్‌పై ఒక వాహనాన్నే సబ్సిడీ ప్రయోజనానికి అనుమతిస్తున్నట్టు చెప్పారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే ఆధార్ ఆధారిత ఈ–ఓచర్ కొనుగోలుదారుకు జారీ అవుతుంది. ఈ–ఓచర్‌ను డౌన్లోడ్ చేసుకుని, దానిపై కొనుగోలుదారు సంతకం చేసి డీలర్‌కు ఇవ్వాలి. డీలర్ సైతం దీనిపై సంతకం పెట్టి పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఓఈఎం (వాహన తయారీ సంస్థ) రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌కు ఈ–ఓచర్ అవసరం. -
ఆలూ.. సబ్సిడీ ఇస్తే మేలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆలూ రైతులపై విత్తన భారం పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు విత్తనాల ధరలను అమాంతం పెంచడంతో ఈ పంట సాగుచేసే రైతులకు సాగు ఖర్చు తడిసిమోపెడవుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,400 వరకు ఉన్న ఆలు విత్తనం ఇప్పుడు ఏకంగా రూ.3,500 దాటింది. క్వింటాలుపై సుమారు రూ.వెయ్యికిపైగా ధర పెరిగింది. ఎకరానికి కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. దీంతో ఈ పంట సాగుచేసే రైతులకు విత్తన దశలోనే సాగు ఖర్చు రూ.8 వేలు పెరుగుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట కావడం, దీనికి తోడు విత్తన భారం పెరగడంతో ఆలురైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తెరపైకి సబ్సిడీ సీడ్ డిమాండ్ పెరిగిన ఆలూ విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని సరఫరా చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. గతంలో రెండుసార్లు ఈ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సబ్సిడీపై ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసిందని, ఈసారి కూడా సబ్సిడీ విత్తన పంపిణీని పునరుద్ధరించాలని ఆలూ రైతులు కోరుతున్నారు.పంజాబ్ నుంచి కొనుగోలు.. ఏటా రైతులు పంజాబ్‌లోని జలంధర్, యూపీలోని ఆగ్రా నుంచి విత్తనం కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. పెద్ద రైతులైతే స్వయంగా అక్కడి వెళ్లి కొనుగోలు చేసి లారీల్లో తెచ్చుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. గతేడాదితో పోలిస్తే ఆలూ విత్తన వ్యాపారులు ధరను అమాంతం పెంచారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఆలుగడ్డల ధర కాస్త ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు విత్తన రూపంలో మాత్రం భారం తప్పడం లేదు. ఏటా రైతులు సెపె్టంబర్ చివరి వారం నుంచి ఆలూను విత్తుకోవడం ప్రారంభిస్తారు. ఈ విత్తనాల కోసం రైతులు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఆలుగడ్డలు అత్యధికగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌తో పాటు, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగు చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. ఇక్కడి నేలతో పాటు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో దీన్ని రైతులు సాగు చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావడంతో ఈ పంటకు మంచి దిగుబడి వస్తుంది.విత్తనాన్ని సబ్సిడీపై అందించాలి ఆలూ విత్తనం రేటు పెరిగినందున ప్రభు త్వం సబ్సిడీపై రైతులకు అందించాలి. గతేడాది ఆలూ విత్తనం క్వింటాల్ రూ.2,400 – రూ.2,600 ఉండగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.3 వేలు – రూ.3,500 పలుకుతోంది. కాబట్టి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని అందిస్తే బాగుంటుంది. – దిలీప్‌కుమార్, రైతు, అత్నూర్ఆలూ సాగు ఖర్చు పెరిగింది ఆలుగడ్డ విత్తనం ధర భారీగా పెంచారు. విత్తన ఖర్చు ఎకరానికి 8 వేల వరకు అదనంగా అవుతోంది. గతంలో మాదిరిగా ఆలూ విత్తనాన్ని సబ్సిడీపై సరఫరా చేసి ఆదుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆలూ విత్తనం సబ్సిడీపై ఇచ్చేవారు. దీన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఎం.ఏసురత్నం, ఆలూ రైతు, మాచిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లాసబ్సిడీ విత్తన సరఫరా పథకం లేదు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం లేదు. గతంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసినట్లు నాకు తెలియదు. ఉద్యానవనశాఖ కిందకు వచ్చే ఈ పంటకు సబ్సిడీ వర్తించదు. ఒకవేళ సబ్సిడీ కిందకు చేరిస్తే రైతులకు సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం వీలవుతుంది. – సోమేశ్వర్రావు, డిప్యూటీ డైరెక్టర్, హారి్టకల్చర్ -
ఈ–టూవీలర్లపై 10 వేలు
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు తొలి ఏడాదిలో గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీని పొందవచ్చని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎలక్ట్రిక్ టూ–వీలర్ల విషయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యూహెచ్) సబ్సిడీని రూ. 5,000గా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, తొలి ఏడాది ఇది మొత్తమ్మీద రూ. 10,000కు మించదు. రెండో ఏడాది ఇది కిలోవాట్ అవర్‌కు సగానికి తగ్గి రూ. 2,500కు పరిమితమవుతుంది. మొత్తమ్మీద సబ్సిడీ రూ. 5,000కు మించదు. ఇక, ఈ–రిక్షా కొనుగోలుదారులు తొలి ఏడాది రూ. 25,000 వరకు, రెండో ఏడాది రూ. 12,500 వరకు సబ్సిడీ ప్రయోజనాలు పొందవచ్చని కుమారస్వామి చెప్పారు. కార్గో త్రీ వీలర్లకు తొలి ఏడాది రూ. 50,000, రెండో ఏడాది రూ. 25,000 సబ్సిడీ లభిస్తుంది. స్కీమ్ ప్రకారం పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ఈ–వోచర్ జారీ అవుతుంది. కొనుగోలుదారు, వినియోగదారు దానిపై సంతకం చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ప్రోత్సాహకాన్ని పొందేందుకు కొనుగోలుదారు సెల్ఫీని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 25 లక్షల టూ–వీలర్లకు.. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ. 3,679 కోట్ల మేర సబ్సిడీలు/ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. మొత్తం మీద 24.79 లక్షల ఈ–టూవీలర్లు, 3.16 లక్షల ఈ–త్రీ వీలర్లు, 14,028 ఈ–బస్సులకు స్కీముపరమైన తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఓలా, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, హీరో విడా, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల శ్రేణి రూ. 90,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంది. ఈవీల వినియోగానికి ప్రోత్సాహం.. పీఎం ఈ–డ్రైవ్ స్కీమును ఆటోమొబైల్ దిగ్గజాలు స్వాగతించాయి. ఈవీల వినియోగం జోరందుకుంటుందని, ఫాస్ట్ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం కూడా ఈవీలపై వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందిస్తుందని మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. ఉద్గారాల విషయంలో వేగంగా తటస్థ స్థాయిని సాధించేందుకు స్కీమ్ ఉపయోగపడుతుందని టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వాఘ్ చెప్పారు. ఈవీ రంగం వేగంగా విస్తరించేందుకు పథకం తోడ్పడుతుందని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ తెలిపారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.10,900 కోట్లు.. కేంద్రం ఆమోదం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ‘ఫేమ్’ పథకం స్థానంలో రెండు సంవత్సరాలకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఏయే వాహనాలకు ఎంతెంత?పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్లు, 14,028 ఈ-బస్సులకు మద్దతు ఇస్తుంది. అలాగే 88,500 ఛార్జింగ్ సైట్లకు కూడా ఈ స్కీమ్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం కింద రూ.3,679 కోట్ల విలువైన సబ్సిడీలు/డిమాండ్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.ఇదీ చదవండి: న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్14,028 ఈ-బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రజా రవాణా సంస్థలకు రూ.4,391 కోట్లు అందిస్తారు. రోగుల తరలింపు కోసం ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చొరవను తీసుకుంది. ఈ-అంబులెన్స్‌ల విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే ఈ-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.500 కోట్లు అందించనుంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని, వినియోగదారులు స్వచ్ఛమైన ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోలు వైపు మొగ్ చూపుతున్న క్రమంలో విక్రయాలను ప్రోత్సహించడానికి ఇక ప్రోత్సాహకాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు."నా అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇకపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఎన్ఈఎఫ్ సమ్మిట్‌లో వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన్నారాయన.శిలాజ ఇంధన వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ జీఎస్టీ విధించడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఇప్పటికే ప్రయోజనాన్ని అందిస్తోందన్నారు. ఇక భారీగా జరుగుతన్న పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధన దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఉందన్నారు.అయితే ఇది పెట్రోల్, డీజిల్ కార్లపై అధిక పన్నులకు దారితీయదని స్పష్టం గడ్కరీ చేశారు.త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు"ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించడం కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడానికి దోహదపడుతుంది" అన్నారు. త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కూడా మంత్రి తెలిపారు. -
ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహం
ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)–3 పథకం కింద రూ.10,000 కోట్లను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరంభంలో రెండేళ్ల కాలానికి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. ఫేమ్ –2 కింద 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వగా.. ఫేమ్–3లో ఇంతకంటే అధిక సంఖ్యలో బస్సులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు సమాచారం. ఫేమ్–2లో ఎలక్ట్రిక్ కార్లకు సైతం ప్రోత్సాహకాలు లభించగా.. ఫేమ్–3లో వీటి ప్రోత్సాహకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పథకం నుంచి కార్లను మినహాయించనున్నట్టు తెలుస్తోంది. ఫేమ్ –2 పథకం గడువు 2024 మార్చితో ముగిసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు విక్రయ ధరపై 15 శాతం సబ్సిడీ లభించడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్)ను తాత్కాలికంగా అమల్లోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్ఈఎంపీఎస్ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు ఈ ఏడాది జూలై వరకు ప్రోత్సాహకాల కింద రూ.500 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రతి ద్విచక్ర ఈవీపై రూ.10,000 చొప్పున సబ్సిడీ కేటాయించింది. కానీ ఫేమ్–2లో ఇది రూ.22,500గా ఉంది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనంపై రూ.50,000 సబ్సిడీని ఈఎంపీఎస్ కింద ఇచ్చారు. ఫేమ్–2లో ఇది రూ.1,11,505గా ఉంది. కిలోవాట్ హవర్‌కు రూ.5,000 చొప్పున ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. -
చేలకు డబ్బులు కాయాలి!
ప్రపంచంలోని 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయ ఉత్పత్తిదారుకు సబ్సిడీ మద్దతును రూపొందించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తాజా ప్రపంచ విశ్లేషణ చూపిస్తోంది. భారతదేశం విషయానికి వస్తే మాత్రం, రైతులు తమ నష్టాలను పూడ్చుకోవడానికి తగిన బడ్జెట్ మద్దతు లేకుండా ఉన్నారు. 2000 సంవత్సరం నుండి భారతీయ రైతులు ఏటా నష్టాలను చవిచూస్తూనే ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. కాబట్టి, మన వ్యవసాయ రంగ విధానాలపై పునరాలోచన అవసరం. సమాజంలోని ఇతర వర్గాలతో ఆదాయ సమానత్వాన్ని తీసుకురావాలంటే వ్యవసాయ రంగంలో జీవనోపాధి సమస్యను పరిష్కరించి, రైతులు ఆదాయాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి ఉన్న ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పడం ద్వారానే గత 25 సంవత్సరాలుగా, దాదాపు ప్రతి ఆర్థిక మంత్రీ తన బడ్జెట్ సమర్పణను ప్రారంభిస్తూ వస్తున్నారు. ‘కిసాన్ కీ ఆజాదీ’నుండి దేశ ఆర్థిక వ్యవస్థ జీవనాధారం వరకు, బడ్జెట్ ప్రతిపాదనలదృష్టిని ఎత్తిపట్టడానికి అనేక విశేషణాలను ఉపయోగిస్తూ వచ్చారు. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం గురించి అరుణ్ జైట్లీ మాట్లాడారు. ప్రభుత్వ ఐదు ప్రాధాన్యాలలో దాన్ని అగ్రస్థానంలో ఉంచారు. నిర్మలా సీతారామన్ కూడా వ్యవసాయానికి తగిన గుర్తింపును కల్పించారు. ఆమె పేర్కొన్న తొమ్మిది ప్రాధాన్యాలలో వ్యవసాయ ఆదాయ పెంపు దల అగ్రస్థానంలో ఉంది. దాదాపు ప్రతి బడ్జెట్లోనూ ఇలా వ్యవసాయానికి ఊతమివ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే మార్పు వచ్చి ఉండాలి. అయితే దీనిపై నిశితంగా దృష్టి సారించినప్పటికీ ఒక్కసారి కూడా వ్యవసాయం పునరుద్ధరణ మార్గం పట్టినట్లు కనిపించలేదు. ఎందుకంటే అధిక ధరలు లభిస్తాయనీ, రైతుల ఆదాయం పెరుగుతుందనే ఆశాభావంతో పంటల ఉత్పాదకత పెంపుదల గురించి అంతర్లీనంగా ఉద్ఘాటిస్తున్నప్పటికీ దేశంలో వ్యవసాయ కష్టాలు మరింత పెరిగాయి. విజయవంతమైన హరిత విప్లవం తర్వాత కూడా వ్యవసాయ కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం దాదాపు రూ. 10,218 గానే ఉంటు న్నప్పుడు, బడ్జెట్లో ఇంత మద్దతు ఉన్నప్పటికీ వ్యవసాయంలో తీవ్రమైన సంక్షోభాన్ని కొట్టిపారేయలేము.వాస్తవాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్ణాటకలో, అధికారిక అంచనా ప్రకారం గత 15 నెలల్లో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఈ సంవత్సరం జనవరి–జూన్ మధ్య 1,267 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు, విదర్భలోని ఒక్క అమరావతి డివిజ¯Œ లోనే 557 కేసులు నమోదయ్యాయి. రైతుల ఆత్మహత్యలు కొత్త విషయం కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా సంకలనం గత 27 ఏళ్లలో రైతుల ఆత్మహత్యల సంఖ్యను చూపిస్తోంది. ఈ కాలం వ్యవసాయానికి సంబంధించి 25 సంవత్సరాల బడ్జెట్ హామీలకు సమానంగా ఉంది. 1995–2014 మధ్య కాలంలో 2,96,438 మంది సాగుదారులు తీవ్రాతితీవ్రమైన ఆత్మహత్యా సదృశ చర్యలకు పాల్పడ్డారు. 2014 నుండి 2022 వరకు 1,00,474 మంది రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. సరళంగా చెప్పాలంటే, వ్యవసాయాన్ని మలుపు తిప్పుతామని వార్షిక బడ్జెట్లు వాగ్దానం చేస్తూ ఉన్న సమయంలోనే 1995–2022 మధ్య దాదాపు నాలుగు లక్షల మంది రైతులు తమ జీవితాలను ముగించారు. అంటే బడ్జెట్ కేటాయింపులకు, కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభానికి మధ్య అసమతుల్యత అత్యంత స్పష్టంగా ఉంది.తెలంగాణ ఇప్పుడు వ్యవసాయ రుణమాఫీ రెండో దశను పూర్తి చేసుకుంది. ఇది 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,198 కోట్ల బకాయి రుణాలను మాఫీ చేసింది. అప్పుల్లో ఉన్న సాగుదారుల్లో ప్రతి ఒక్కరికి రూ. 1.5 లక్షల మాఫీ లభిస్తుంది. మొదటి దశలో 11.34 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ నెల 15న ప్రారంభం కానున్న మూడో దశలో 17.75 లక్షల మంది రైతులకు రూ. 12,224 కోట్ల రుణమాఫీ అందనుంది. రాష్ట్రంలో మొత్తం 35.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నా రన్నమాట. అయితే దీనర్థం పెరుగుతున్న వ్యవసాయ రుణాలు ఇతర రాష్ట్రాల్లో సమస్యాత్మకం కావని కాదు.ప్రపంచంలోని 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయ ఉత్పత్తి దారుకు సబ్సిడీ మద్దతును రూపొందించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తాజాప్రపంచ విశ్లేషణ చూపిస్తోంది. భారతదేశం విషయానికి వస్తే, రైతులు తమ నష్టాలను పూడ్చుకోవడానికి తగిన బడ్జెట్ మద్దతు లేకుండా ఉన్నారు. 2000 సంవత్సరం నుండి భారతీయ రైతులు ఏటా నష్టా లను చవిచూస్తూనే ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఇన్ని నష్టాల నుండి మరే ఇతర రంగం అయినా బయటపడుతుందా?మనం ఈ విశ్లేషణా పద్ధతిని తప్పుబట్టినప్పటికీ, ఉత్పాదకతకు, ఉత్పత్తిని పెంచడం కోసం సాంకేతికతకు మద్దతు ఇవ్వడం లేదా ఇతర పథకాలకు డబ్బును నింపడం వల్ల రైతుల ఆదాయం పెరగదు అనేది వాస్తవం. ఇది ఎక్కడా జరగలేదు. ఓఈసీడీ అధ్యయనమే ఇందుకు నిదర్శనం.దీనినే నేను ’వయా బటిండా’ విధానం అని పిలుస్తాను. ఇన్ పుట్ సప్లయర్లు లేదా టెక్నాలజీ ప్రదాతల ద్వారా వ్యవసాయ ఆదా యాన్ని పెంచడానికి బదులుగా, ప్రత్యక్ష ప్రయత్నం ఎందుకు చేయ లేరు? ఇలాంటి పరోక్ష ప్రయత్నం గతంలో పని చేయలేదు. భవి ష్యత్తులో కూడా పని చేయదు. రైతులు అట్టడుగు స్థానంలో ఉన్న సమయంలోనే ఇన్పుట్ సప్లయర్లు లాభాల్లో ఎలా దూసుకు పోతు న్నారో అనేక అధ్యయనాలు చూపించాయి. సప్లయ్ చెయిన్ల విషయంలో కూడా అంతిమ లాభాలలో పెంపకందారుల వాటా దాదాపు 5–10 శాతం లేదా అంతకంటే తక్కువగానే ఉంటోంది. 2021లో స్ట్రాబెర్రీలను, రాస్బెర్రీలను మార్కెటింగ్ చేయడం ద్వారా రిటైల్ లాభాలు 27 పెన్నీల వరకు పెరిగాయని, కానీ రైతుల వాటా 3.5 పెన్నీలు మాత్రమే అని బ్రిటన్‌లో ఒక అధ్యయనం తెలిపింది. వినియో గదారులు ఆధారపడిన ఆరు రోజువారీ అవసరాలకు గానూ, రిటైల్ లాభంలో కేవలం 1 శాతం మాత్రమే రైతులకు లభిస్తుందని ఇంతకు ముందు అధ్యయనాలు చూపించాయి. అందువల్ల, తాజా బడ్జెట్లో పేర్కొన్నట్లుగా, ప్రాథమిక ఉత్పత్తిదారు అయిన రైతు వాటాకు హామీ ఇచ్చినప్పుడు మాత్రమే సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అనేది దోహదకారిగా ఉంటుంది.దేశంలోని దాదాపు సగం జనాభా వ్యవసాయ రంగంలో నిమ గ్నమై ఉంటున్నప్పుడు, వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో కేవలం 3.15 శాతం మాత్రమే కేటాయిస్తే, అసాధారణంగా ఏమీ ఆశించలేం. ఈ సంవత్సరం వ్యవసాయ బడ్జెట్ రూ. 1.52 లక్షల కోట్లు, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రూ. 26,000 కోట్లు పెరిగి, ముందుగా సూచించినట్లుగా ప్రణాళికేతర వ్యయాన్ని కవర్ చేస్తుంది. వ్యవసాయం కోసం బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకా నికి రూ. 60,000 కోట్లు కేటాయించారు, ఇది భూమిని కలిగి ఉన్న ప్రతి రైతుకు నెలవారీ రూ. 500లను అందిస్తుంది, ఇక మిగిలింది వ్యవసాయానికి రూ. 92,000 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కేవలం రూ. 3,268గా ఉందని 2022–23 గృహæ వినియోగ వ్యయం మనకు చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వ్యవసాయం లాభసాటిగా లేకపోతే, గ్రామీణ వ్యయం ఇప్పటికీ తక్కువగానే ఉంటుంది.కాబట్టి, వ్యవసాయంపై పునరాలోచన అవసరం. సమాజంలోని ఇతర వర్గాలతో ఆదాయ సమానత్వాన్ని తీసుకురావడానికి మొదట జీవనోపాధి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల ఆదాయం, సంక్షేమం కోసం జాతీయ కమిష¯Œ ను ఏర్పాటు చేయాలనేది నా సూచన. ఈ కమిషన్ నిర్దిష్ట కాల వ్యవధిలో వ్యవ సాయ ఆదాయాన్ని పెంచడానికి నిర్దిష్ట మార్గాలతో ముందుకు రావాలి. కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన విధానాన్ని నిర్ధారించడం ద్వారా దీన్ని ప్రారంభించాలి.వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
విత్తనాల పంపిణీ హుళక్కే
సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్‌సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడేసింది. పురుగుమందుల సరఫరా ఇక ఉండబోదని తేల్చి చెప్పింది. ఏటా సబ్సిడీ విత్తనాలతో పాటు నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగుమందులను కూడా ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచేవారు. రైతుల డిమాండ్ మేరకు.. నాన్‌సబ్సిడీగా వారు కోరుకున్న కంపెనీల విత్తనాలు, పురుగుమందులను బుక్ చేసుకున్న 24 గంటల్లో నేరుగా వారి ముంగిటకు సరఫరా చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా వీటి పంపిణీ అవసరం లేదని స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు విత్తనాలు, పురుగుమందుల కోసం ఇబ్బందులు పడకూడదని రైతుభరోసా కేంద్రాల్లో నాన్‌సబ్సిడీ కింద వాటిని అందుబాటులో ఉంచింది. నిఘా చాలంటున్న ప్రభుత్వం గత సీజన్ నుంచి నాన్‌సబ్సిడీ విత్తనాల పంపిణీతో పాటు పురుగుమందుల సరఫరాను నోడల్ ఏజెన్సీగా ఏపీ సీడ్స్‌ను నియమించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విత్తన, పురుగుమందుల కంపెనీలతో అవగాహన ఒప్పందం కోసం ఏర్పాట్లు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగుమందుల పంపిణీ బాధ్యత ప్రభుత్వానిది కాదని, ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మార్కెట్లోకి వచ్చే విత్తనాలు, పురుగుమందులపై నిఘా పెడితే సరిపోతుందని చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు, పురుగుమందుల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీలు, బ్లాక్ మార్కెట్‌కు చెక్పూర్వం నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారినపడి ఏటా రూ.వేలకోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాలను చవిచూసేవారు. పైగా డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీకి మించి అమ్మేవారు. రైతులు బ్లాక్ మార్కెట్లో రెట్టింపు ధరలకు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోయేవారు. నకిలీ విత్తన విక్రయదారులతో పాటు బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిమాండ్ ఉన్న కంపెనీలకు చెందిన విత్తనాలతోపాటు పురుగుమందులను నాన్‌సబ్సిడీగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేది. దీంతో రైతులకు అవి ఎమ్మార్పీకే లభించేవి. ఇందుకోసం ఏటా సీజన్‌కు ముందే విత్తన కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, పురుగుమందుల కంపెనీలతో ఏపీ ఆగ్రోస్ అవగాహన ఒప్పందాలు చేసుకునేవి. ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 305.43 క్వింటాళ్ల నాన్‌సబ్సిడీ విత్తనాలను రైతులు ఆర్బీకేల్లో కొనుగోలు చేశారు. రూ.14.25 కోట్ల విలువైన 1,39,443 లీటర్ల పురుగుమందులను 1.57 లక్షలమంది రైతులు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు. -
భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..
ఎలక్ట్రానిక్ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్ఫేమ్3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్ ఇండియా1ను 2015, ఏప్రిల్1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. -
వాస్తవ ఖర్చులే ట్రూ అప్ చార్జీలు
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినవే.ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్‌కు ఎంత వసూలు చేయాలని ఈఆర్సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రతి రోజూ కొనే విద్యుత్‌కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్‌ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.ఖర్చు చేసినంతా కాదుడిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది. అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
-
చేనేతకు సంక్షేమ అద్దకం
సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది, నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఊతం చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, లూమ్‌ఫోక్స్, పేటీఎం, గోకూప్ వంటి ఈ– కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్‌లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్)) చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి. ఉప్పాడకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం. నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. – శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం జగన్‌కు రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి. –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్. బాబు దగా, జగన్ అండబాబు హయాంలో ► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్ ఫండ్‌ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. ► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు, ► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు. జగన్ హయాంలో ► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు. ► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు. ► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ఏర్పాటు. ► 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్డబ్ల్యూసీఎస్) రూ.250.01కోట్ల సాయం. ► వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత. -
రైతులకు విత్తన సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వరి, మొక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, మినుములు, జీలుగ, జనపనార, పిల్లి పెసర తదితర విత్తనాలను సబ్సిడీపై అందజేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా ఇతర విత్తనాలకు మూడేళ్ల క్రితమే సబ్సిడీ ఎత్తేయగా ఇప్పుడు సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కేవలం వానాకాలం సీజన్లో అందించే విత్త నాల సబ్సిడీ కోసమే దాదాపు రూ. 170 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 25 కోట్ల మేరకు విత్తన సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 35–65 శాతం వరకు సబ్సిడీ... గతంలో మాదిరిగానే విత్తనాలకు 35 నుంచి 65 శాతం వరకు సబ్సిడీని అందించనున్నారు. సోయాబీన్‌కు 37 శాతం, జీలుగ, పిల్లి పెసర, జనపనార విత్తనాలకు 65 శాతం సబ్సిడీ... కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలకు 35 శాతం వరకు సబ్సిడీ అందించాలని భావిస్తున్నారు. వరి పదేళ్లలోపు పాత విత్తనాల ధర ఎంతున్నా రూ. వెయ్యి సబ్సిడీ ఇవ్వాలని... పదేళ్లకుపైగా ఉన్న వరి విత్తనాలకు రూ. 500 సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తం విత్తన సరఫరాలో వ్యవసాయశాఖ అధికంగా వరి విత్తనాలనే రైతులకు సరఫరా చేయనుంది. రైతు కోరుకొనే విత్తనాలే కీలకం... ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకొనే పరిస్థితి ఉండదు. గత అనుభవాల ప్రకారం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు అధికం. ఆ విత్తనాన్ని ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. కానీ మొక్కజొన్నలో అనేక హైబ్రీడ్ రకాల విత్తనాలున్నాయి. వాటిలో కొన్ని రకాలకు మరింత డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్న విత్తనాలను పెద్దగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడని రైతులు.. ప్రైవేటు డీలర్ల వద్ద తమకు అవసరమైన డిమాండ్ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో యథాలాపంగా టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతులు కోరుకొనే రకాల విత్తనాలు ఇవ్వకపోవడం వల్ల గతంలో అనేక సబ్సిడీ విత్తనాలు వ్యవసాయశాఖ వద్ద మిగిలిపోయాయి. దీనివల్ల ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. 1.21 కోట్ల పత్తి విత్తనాలు అవసరం: మంత్రి తుమ్మల వచ్చే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 60.53 లక్షల ఎకరా లలో పత్తి సాగు కానుందని... అందుకు 1.21 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. అధికారులు, విత్తన కంపెనీలతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. అన్ని ప్రైవేటు విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. వరి 16.50 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 48,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరమన్నారు. ప్రస్తుత లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
సబ్సిడీ ఇచ్చాకే ‘జీరో బిల్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సబ్సిడీ నిధులను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విడుదల చేయాలని.. అలా చేస్తేనే వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం–2003లోని నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ‘గృహజ్యోతి’ పథకానికి షరతులతో ఆమోదం తెలిపింది. ముందుగా ఇవ్వాలి.. లేదా రిఫండ్ చేయాలి.. అర్హులైన పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు జీరో బిల్లుల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం ప్రకారం.. ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది. ఫ్రంట్ లోడెడ్ విధానంలో.. డిస్కంలు బిల్లింగ్ చేపట్టడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని వివరించింది. సకాలంలో రాబట్టుకోవాలి.. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈఆర్సీ ఆమోదించింది. ఒక నెలకు సంబంధించి అందాల్సిన సబ్సిడీ వివరాలను తదుపరి నెల 20వ తేదీలోగా డిస్కంలు అందజేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మార్గదర్శకాల్లో ఇంధన శాఖ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదనలను కూడా సత్వరమే సమర్పించాలని కోరింది. -
కేంద్రం శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ స్కీమ్ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు మాత్రమే కాకుండా ఎల్పీజీ సబ్సిడీ పథకాన్ని కూడా ఏడాది పాటు పొడిగించింది. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్పీజీ సబ్సిడీని సిలిండర్‌పై రూ.300కి పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తిస్తుంది. రానున్న మూడేళ్లలో అదనపు ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తామని, దీనికి రూ.1650 కోట్ల ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. జనపనారకు కూడా కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపింది. జనపనార మద్దతు ధర ఇప్పుడు ఉన్నదానికంటే కూడా 285 రూపాయలు పెంచింది. దీంతో క్వింటాల్ జనపనార ధర రూ. 5,335కు చేరింది. -
సీఎం జగన్ కు మనమందరం అండగా నిలవాలి: విశ్వేశ్వర్ రెడ్డి
-
4.61 లక్షల మందికి రూ. 442.36 కోట్ల సబ్సిడీ
-
ఏపీలో రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ
-
ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ
న్యూఢిల్లీ: రాబోయే ఖరీఫ్ సీజన్(ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30)లో ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఎప్పటిలాగే రూ.1,350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అలాగే దేశంలో కొత్తగా మూడు సెమీ–కండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టాటా గ్రూప్, జపాన్‌కు చెందిన రెనిసస్ వంటి కంపెనీలు కలిసి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. రక్షణ, అటోమొబైల్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలకు అవసరమైన సెమీ–కండక్టర్లను తయారు చేస్తారు. -
అర్హతగల ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం స్పష్టంచేశారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆక్వా సాధికారికత కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కన్‌క్షన్లకు మార్చి ఒకటో తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో 4,68,458 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దానిలో 3,33,593.87 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్నట్టుగా ఈ–ఫిష్ సర్వే ద్వారా నిర్ధారించినట్లు మంత్రులు తెలిపారు. మొత్తం 66,993 విద్యుత్ కనెక్షన్లలో ఇప్పటికే ఆక్వా జోన్ పరిధిలో అర్హత పొందిన 50,605 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తుండగా, తాజాగా కమిటీ ఆమోదంతో ఆ సంఖ్య 54,072కు పెరిగిందన్నారు. ఆక్వా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా రూ.3,306.5 కోట్లు విద్యుత్ సబ్సిడీని డిస్కమ్‌లకు చెల్లించిందన్నారు. తాజాగా అర్హత పొందిన కనెక్షన్లకు ఏటా రూ.55 కోట్లు అదనపు భారం పడనుందన్నారు. ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన సీడ్ సరఫరా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వడ్డీ రఘురాం చెప్పారు. ఇక నుంచి అప్సడా అనుమతి పొందిన తర్వాతే విదేశాల నుంచి బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకోవాలని, అలా చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందేవారిలో అర్హులను గుర్తించి సబ్సిడీ వర్తింపజేసేందుకు మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. ఏపీలోనే వంద కౌంట్ రూ.245 ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటిస్తూ, దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు వివరించారు. వంద కౌంట్ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోందన్నారు. గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటు రైతుకు దక్కుతోందన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేది, నీరబ్‌కుమార్ ప్రసాద్, కె.విజయానంద్ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే..
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్ స్కీంకు రేషన్‌కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మహానగర పరిధిలోని గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్ అర్హతకు సమస్యగా తయారైంది. 10 లక్షల కనెక్షన్లకే సబ్సిడీ వర్తింపు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్రా కోసం వలస వచి్చన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కనెక్షన్ దారులు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. ఉజ్వలకు వర్తింపు ? ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్ యోజన పథకం కింద గల కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.300ల సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద లక్ష వరకు కనెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. కొత్త పథకం వర్తిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రెండు విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా? లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం సబ్సిడీ ఇలా కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం రూ.40.17 పైసలు సబ్సిడీ అందిస్తోంది. గత రెండేళ్లుగా వంట గ్యాస్ ధరతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఏలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్‌పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసే డీబీటీఎల్ పథకం 2014 నవంబర్ 10న అమల్లో వచి్చంది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం అమలు తొలిరోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేంది. తాజాగా సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ రూ 40.71 పైసలకు పరిమితమైంది. -
గృహలక్ష్మీ: సిలిండర్‌కు పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం(రూ.500కే గ్యాస్ సిలిండర్) కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో రీయింబర్స్ చేయనుంది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు అందజేస్తే, సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత.. ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాయి. అలాగే తెల్ల రేషన్‌కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీని ఆధారంగా లబ్ధిదారు లను గుర్తిస్తారు. అర్హత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరు మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తించనుంది. కాగా రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.300లకు పైగా సబ్సిడీ అందిస్తోంది. ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకురానున్నట్టు సమాచారం. -
పవర్ లూమ్ చేనేతలకు ఏపీ సర్కార్ భారీ ఊరట
సాక్షి, విజయవాడ: పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌కి 94 పైసలు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గించింది. పవర్ లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: ఒక్క హామీతో...మారిన జీవన రేఖ -
మనకు భారత్ రైస్ భాగ్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరతో దేశవ్యాప్తంగా అవసరమైన వారందరికీ నాణ్యమైన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బృహత్తర పథకం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ ధరలు అదుపులోకి రాకపోవడంతో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రూ.29కే విక్రయించాలని నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో ఈ బియ్యం అమ్మకాలను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో కూడా భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించారు. ఆమెజాన్, జియో మార్ట్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా కూడా 5 కిలోలు, 10 కిలోల భారత్ రైస్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.29 కిలోల బియ్యం బ్యాగులు విక్రయిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్ రైస్ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు. కేటాయింపులు జరిపినప్పటికీ... ఫిబ్రవరి 6వ తేదీ నాటికే రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరపాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ భావించింది. ఈ మేరకు నాఫెడ్ ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం అందించింది. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరించి 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో నింపి విక్రయించే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తొలి విడతగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌కు ఒక్కో సంస్థకు 2 వేల టన్నుల చొప్పున బియ్యం కేటాయించింది. అయితే ఇప్పటివరకు బియ్యం బ్యాగ్‌లు రిటైల్ అవుట్లెట్లకు చేరలేదు. డిపోలలోని బియ్యం ఇతర రాష్ట్రాలకే! భారత్ రైస్ బ్యాగ్‌లకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నాఫెడ్‌కు సరఫరా చేయాలి. అయితే రాష్ట్రంలో నాఫెడ్‌కు అవసరమైన మేర బియ్యాన్ని ఎఫ్‌సీఐ పంపించలేదని సమాచారం. రాష్ట్రంలోని 52 ఎఫ్‌సీఐ డిపోలలో సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, ఆ బియ్యం మొత్తం సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ రైస్ కోసం నాఫెడ్‌కు ఎఫ్‌సీఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోవాలని ఎఫ్‌సీఐ వర్గాలు చెపుతున్నాయి. బియ్యం రాలేదు రిటైల్ అమ్మకాల కోసం రైస్ బ్యాగులు మా దగ్గరికి రాలేదు. భారత్ రైస్ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. రోజూ ఎంక్వైరీలు వస్తున్నాయి. నాఫెడ్ ద్వారా ఈ బ్యాగులు రావలసి ఉంది. ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్ ఆటా పేరుతో పంపిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయించాం.- రమణమూర్తి, ఆర్.ఎం,కేంద్రీయ భండార్ -
Budget 2024: సబ్సిడీలకు కోతలు.. తగ్గిన కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పలు సబ్సిడీలకు కేటాయింపుల్లో కోతలు పెట్టింది. రైతులకు అందించే ఎరువులు, ఆహార, పెట్రోలియం ఉత్పత్తులకు సబంధించిన కేటాయింపులను ఈ బడ్జెట్లో గణనీయంగా తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే 13.2 శాతం తగ్గించారు. అలాగే 2023-24 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్రం యూరియాపై సబ్సిడీ, ఇతర ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం, బయో, సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం , నానో-యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎరువు సబ్సిడీకి కేటాయింపు తగ్గుదల కనిపించింది. దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం ఉంటోంది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తోంది. దీనికి పన్నులు, వేప పూత ఛార్జీలు అదనం. అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రూ.2,200 ఉంది. ఇక ఆహార, పెట్రోలియ ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తగ్గించింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.2,12,332 కోట్లతో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ కోసం గతేడాది కేటాయించిన రూ. 12,240 కోట్ల కంటే 2.6 శాతం తక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11,925 కోట్లు కేటాయించింది. -
CM Jagan: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.16,927 కోట్లు
31 లక్షల పేద అక్కచెల్లెమ్మలకు స్వగృహయోగం రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీలు.. 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు.. వారు ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు సాయం.. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలు ఇది. – సాక్షి, అమరావతి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కావాల్సిన భూమి కొనుగోలుకు భారీ ఎత్తున ప్రభుత్వం వ్యయం చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాక 2019 నుంచి ఇప్పటివరకు వారి ఇళ్ల నిర్మాణానికి ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేసింది. ఈ వ్యయాలు కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరింత ఖర్చు పెట్టనుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పేదింటి అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తూ కనిష్టంగా 1.50 లక్షల కోట్ల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల కోట్ల సంపదను వారి చేతుల్లో ప్రభుత్వం పెడుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు పేదలకు ఇంత పెద్ద ఎత్తున స్థలాలు, ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆర్థిక సాయంతోపాటు నిర్మాణ సామగ్రిపై సబ్సిడీ 2019లో అధికారంలోకి వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణాల కోసమే ఇప్పటివరకు ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో లబ్దిదారులకు చకచకా ఇంటి బిల్లులను చెల్లించారు. అంతేకాకుండా 4.70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సిమెంట్, 33 వేల టన్నులకుపైగా స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేశారు. ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌కు రూ.1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంక్ రుణాన్ని సమకూరుస్తోంది. బ్యాంక్‌లు 9 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండగా లబ్దిదారులు పావలా వడ్డీనే కడుతున్నారు. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా రూ.15 వేల విలువ చేసే ఇసుకను ఉచితంగా అందిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మేలు చేస్తోంది. రూ.20 లక్షల విలువైన ఆస్తి ఇంటి స్థలం, ఇల్లు రూపంలో రూ.20 లక్షలు, అంతకంటే విలువైన స్థిరాస్తిని అక్కచెల్లెమ్మల పేరిట ప్రభుత్వం అందిస్తోంది. తద్వారా పేదింటి మహిళలను లక్షాధికారులుగా మారుస్తోంది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన స్థలాల విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మార్కెట్లో పలుకుతోంది. ఇంటి నిర్మాణం కూడా పూర్తయితే ఆ ఆస్తి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు, అంతకు పైమాటే. -
ఫేమ్ 3 పేరుతో కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ!
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఫేమ్ 3' (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)ను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ కోసం రూ.26,400 కోట్లు కేటాయించాలని మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్రం కేటాయించనున్న రూ.26400 కోట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రూ.8158 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సులు కోసం రూ. 9,600 కోట్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్ల కోసం రూ.4,100 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లపై అందించే రాయితీ మాత్రమే కాకుండా టెక్నాలజీ డెవలప్మెంట్, ట్రయల్ రన్ వర్క్స్ కోసం ఈ పథకంలో భాగంగానే నిధులు కేటాయించాలన్నది కేంద్రం ఆలోచన. మొత్తంగా రూ.33వేల కోట్లను మూడో దశకు కేటాయించే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలను ప్రోత్సహించడానికి.. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్ 1న తీసుకువచ్చింది. ఈ సబ్సిడీ కింద టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్‌కు వర్తించేలా చేశారు. ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లెక్కకు మించిన వాహనాలు సేల్ అయ్యాయి. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు కొన్ని సంస్థలు చేసిన అవకతవకల వల్ల.. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ 2 సబ్సిడీ నిలిపివేశారు. కాగా 2024 మార్చి 31 నాటికి ముగుస్తుంది. దీనిని సృష్టిలో ఉంచుకుని ఫేమ్ 3 స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది కూడా రెండు దశల్లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఫేమ్ 3 స్కీమ్ కింద వాహనాలను మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తే 10 శాతం అదనపు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం యోచిస్తోంది. -
FAME-3: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తారా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూ వీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారబోతోంది.. ఎందుకు.. ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - FAME) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది స్కీమ్ మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత కూడా ప్రస్తుతం ముగింపు దశ వచ్చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో మొత్తానికే ఎత్తేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కీమ్ మూడో విడత (ఫేమ్-3)ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు సమాచారం. ఇదీ చదవండి: ‘ఆ కార్లు భారత్‌లోకి ఎప్పటికీ రావు.. రానీయను’ ఆర్థిక శాఖ వ్యతిరేకత దేశంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫేమ్-3 అమలును కేంద్ర ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వంలోని ఇతర శాఖలు సైతం దీనిపై అయిష్టతను కనబరుస్తున్నాయి. ఇప్పటికే సబ్సిడీలో కోత ఫేమ్-2 స్కీములో సబ్సిడీని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో తగ్గించింది. దీంతో అప్పట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గింది, కానీ ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి వాహనదారులు సబ్సిడీ కోసం కాకుండా క్లీనర్ ఎనర్జీ వాహనాలపై ఆసక్తితో క్రమంగా అటువైపు మళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతోపాటు ఫేమ్-2 స్కీములో ఎలక్ట్రిక్ వాహన సంస్థలు అక్రమాలకు పాల్పడటం కూడా ఈ స్కీము ముగింపునకు కారణంగా భావిస్తున్నారు. -
విపత్తులోనూ విత్తనాలు సిద్ధం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై అవసరమైన విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 16 జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం 85,885 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వరి విత్తనాలు పంపిణీకి శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా అందిన సమాచారం మేరకు 85,885 క్వింటాళ్ల విత్తనాల కోసం అధికారులు ఇండెంట్ పంపారు. వాటిలో ప్రధానంగా 48,913 క్వింటాళ్ల శనగ, 21,064 క్వింటాళ్ల వరి, 12,407 క్వింటాళ్ల మినుము, 2,445 క్వింటాళ్ల వేరుశనగ, 894 క్వింటాళ్ల పెసర విత్తనాలతోపాటు 98 క్వింటాళ్ల నువ్వులు, 51 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 14 క్వింటాళ్ల రాగులు, ఉలవలు, జొన్న విత్తనాల కోసం ఇండెంట్లు వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా బాపట్ల జిల్లాలో 20,850 క్వింటాళ్లు, గుంటూరులో 16,040 క్వింటాళ్లు, నెల్లూరు జిల్లాలో 14,384 క్వింటాళ్లు, పల్నాడులో 10,280 క్వింటాళ్లు, కృష్ణాలో 8,456, తిరుపతిలో 6,377, ప్రకాశంలో 5,005, ఏలూరు జిల్లాలో 1,096 క్వింటాళ్ల చొప్పున, మిగిలిన జిల్లాల్లో వెయ్యి క్వింటాళ్లలోపు విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు ఆర్బీకేల్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. విత్తనాలపై సబ్సిడీ రూపంలో రూ.64.45 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదలైన పంపిణీ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో నారుమళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా మళ్లీ నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా రైతులకు 80 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయాలని సంకల్పించారు. నెల్లూరులో 80 శాతం సబ్సిడీపై వరి విత్తన పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లాలో కూడా వరి విత్తన పంపిణీ చేపట్టారు. ఆందోళన వద్దు తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. తుపాను ప్రభావిత జిల్లాల్లో నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్న రైతులకు ఏ విత్తనం కావాలన్నా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
రేషన్ తో పాటు రూ.2,500 ప్రతి ఇంటికి అందిస్తున్నాం: సీఎం జగన్
-
కౌలు రైతులకు భరోసానిస్తున్నా బాధేనా రామోజీ?
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వారికి మేలు జరుగుతుంటే విషపురాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు.. సీసీఆర్సీల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం అందిస్తున్నారు. అంతేకాదు కౌలురైతులకు ఈక్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు మేలు చేసే ఊసేలేదు. వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో రామోజీరావు నిత్యం బురదజల్లడమే పనిగాపెట్టుకున్నారు. వ్యవసాయాన్ని పండుగలామార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ‘కౌలురైతు నోట్లో మట్టి’ అంటూ ఈనాడు పత్రికలో రోతరాతలు రాశారు. ఆరోపణ: కౌలు రైతులను ఆదుకోవడంలో 100 శాతం విఫలం వాస్తవం: భూయజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కుల రక్షణకల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25.82 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు చేశారు. ఆరోపణ: కౌలురైతులకు పంట రుణాలేవి వాస్తవం: వాస్తవ సాగు దారులందరికి పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ లేని కౌలు రైతులతో జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటు చేసి ఈ గ్రూపుల ద్వారా వారికి రుణాలు అందేలా చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 13.49 లక్షల మంది కౌలుదారులకు రూ. 7,959.49 కోట్ల రుణాలు అందించారు. ఆరోపణ: రైతు భరోసాకు మొండిచేయి వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా రూ. 13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతు భరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు. మెజార్టీ కౌలు దారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ 50 నెలల్లోనే దాదాపు 5.38 లక్షల మంది కౌలు రైతులకు రూ. 697.32 కోట్లు, 3.99 లక్షల అటవీ భూములు (ఆర్వోఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ. 522.36 కోట్లు కలిపి మొత్తం 9.38 లక్షల మందికి రూ. 1,219.68 కోట్లు పెట్టుబడి సహాయంగా అందించారు. ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూయజమానులకు వర్తింçప చేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింప చేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు. ఈ క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. అలాగే 3.55లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్ట పరిహారం బాబు హయాంలో కౌలురైతులను ఆదుకున్నదేది? చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు కనీసంగా అంటే కనీసంగా కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఏటా అరకొరగా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎల్ఈసీ కార్డులు జారీ చేయడం తప్ప ప్రభుత్వ పరంగా ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందించిన జాడే లేదు. కౌలుదారుల్లో 80 శాతం మందికి పైగా భూయజమానులతో ఎలాంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు. అధీకృత ఒప్పందాల్లేక పోవడం వలన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహాకాలు, రాయితీలే కాదు కనీసం పంట రుణాలు కూడా దక్కేవి కావు. టీడీపీ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ దీన్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచడమే కాదు. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్పడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది. కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో చనిపోతే దేశంలో రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నది ఒక్క మన రాష్ట్రంలోనే. కౌలుదారుల కుటుంబాలకునేరుగా పరిహారం వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలుదారులకు సీసీఆర్సీ కార్డు ఉంటే రూ. 7 లక్షలు, లేకుంటే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కౌలురైతు కుటుంబ సభ్యుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 1,270 కేసులకు సంబంధించి రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలురైతులుండగా, ఆ కుటుంబాలకు రూ. 33.95 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ. 23.70 కోట్ల పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలురైతులున్నారు. వీరికి రూ. 10.60 కోట్ల పరిహారం చెల్లించారు. -
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: రబీ సీజన్లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు. రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు. -
‘ఉజ్వల’ లబ్దిదారులకు మరో రూ.100 రాయితీ
న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ కింద వంట గ్యాస్ సిలిండర్లపై రాయితీని మరో రూ.100 పెంచాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. దీంతో ఒక్కో సిలిండర్‌పై మొత్తం రాయితీకి రూ. 300కు చేరుకుంది. ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచి్చన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 12 రాయితీ సిలిండర్లు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ (14.2 కిలోలు)పై రూ.200 చొప్పున కేంద్రం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీని మరో రూ.100 పెంచినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 9.6 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలియజేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రస్తుతం ఒక్కో సిలిండర్ కోసం రూ.703 ఖర్చు చేస్తున్నారు. ఇకపై రూ.603 చొప్పున వెచి్చంచాల్సి ఉంటుంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఉజ్వల యోజన లబి్ధదారులకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మరో రూ.100 పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
రూ.60కే కేజీ శనగపప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా(హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్) తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘భారత్ దాల్’ పేరుతో రాయితీపై పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శనగపప్పు ధర రూ.90 ఉండగా హాకా మాత్రం వినియోగదారులకు రాయితీపై రూ. 60కే అందించనుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కలిసి ప్రారంభించనున్నారు. ఇక్కడ పంపిణీని ప్రారంభించిన అనంతరం హాకా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పంపిణీ చేపట్టనుంది. డీ–మార్ట్, మెట్రో, రిలయన్స్మార్ట్, టాటామార్ట్తో పాటు చిన్న పెద్ద స్టోర్స్‌లలోనే కాకుండా ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన జొమాటో, స్విగ్గి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటోలలో కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీటిల్లో కూడా కేజీ రూ.60కే అందించనున్నారు. కాగా 30కేజీల బ్యాగ్ తీసుకుంటే కేజీ రూ.55కే చొప్పున రూ.1650కే అందజేస్తారు. రాయితీపై అందిస్తున్న ఈ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పప్పు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌ను సేకరించనున్నారు. అధికారులు కోనుగోలుదారుల్లో ఎవరికైనా ఫోన్ చేసి నిర్ణీత ధరకే పప్పు అందిందా లేదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేయనున్నారు. 18 రాష్ట్రాలు... 180 పట్టణాలు రాయితీ శనగ పప్పును హాకా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రాష్ట్రంలో కనీసంగా 10 పట్టణాలను ఎంపిక చేసింది. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 180 పట్టణాల్లో పంపిణీ చేయడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. తెలంగాణతో పాటు ఏపీ, బీహార్, చత్తీస్గడ్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది. -
శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం
సాక్షి, అమరావతి: ముందస్తు రబీకి సిద్ధమైన రైతులకు అవసరమైన విత్తన సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించగా.. మిగిలిన విత్తనాలను అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రబీలో 10.92 లక్షలు ఎకరాల్లో శనగ సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగువైపు మొగ్గు చూపుతుండటంతో ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు రబీ కోసం 3 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా 36,121 క్వింటాళ్ల వరి, 14,164 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 142 క్వింటాళ్ల కందులు, 833 క్వింటాళ్ల ఉలవలు, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 367 క్వింటాళ్ల నువ్వులు, 727 క్వింటాళ్ల వేరుశనగ, 1,697 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీకి సిద్ధం చేశారు. పకడ్బందీగా విత్తన పంపిణీ ముందస్తు రబీ సీజన్‌కు సిద్ధమైన రైతులకు శనగ విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టాం. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేయగా.. ఈ సారి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వరితో సహా మిగిలిన విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనం గడిచిన సీజన్లో ఎంపిక చేసిన రైతు క్షేత్రాల్లో శనగ విత్తనాన్ని సేకరించారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించారు. 3.44 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎకరం లోపు రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేయనున్నారు. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేసిన శనగ విత్తనాలపై ఈ సారి 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్టతో పాటు చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుండగా.. వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం సబ్సిడీ, మినుము, పెసలు, కందులు, అలసందల విత్తనాలను 30 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. వరి విత్తనాలను క్వింటాల్‌కు ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో రూ.1000, వర్తించని జిల్లాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 58 కోట్లు భరించగా, ఈసారి రూ.120 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. -
హార్టీకల్చర్ హబ్‌గా ఏపీ
సాక్షి ప్రతినిధి కర్నూలు: వర్షాలపై ఆధారపడి అదృష్టాన్ని పరీక్షించుకునే రైతులకు ఏటా కచ్చితమైన ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొడి భూముల్లో ఉద్యాన పంటలు (డ్రై ల్యాండ్ హార్టీకల్చర్) కార్యక్రమం కింద రైతులకు మొక్కలు నాటే సమయం నుంచి 100 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు సాగు ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో రాష్ట్రంలో పండ్ల తోటలు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులు స్థిరంగా లాభాల పంటను పండిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను చూసి సంప్రదాయ పంటలు సాగు చేసే పొరుగు రైతులు కూడా పండ్ల తోటల సాగువైపు మళ్లుతున్నారు. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వమే దన్నుగా నిలుస్తుండటంతో దేశంలోనే ‘హార్టీ కల్చర్ హబ్’గా ఏపీ అభివృద్ధి చెందుతోంది. నాలుగేళ్లలో 2.35 లక్షల ఎకరాల్లో.. 2018–19 వరకూ రాష్ట్రంలో 17,62,240 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యేవి. ఆ విస్తీర్ణం ప్రస్తుతం 19,97,467.5 ఎకరాలకు సాగు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో 2,35,227.5 ఎకరాల్లో పండ్ల తోటల సాగు పెరిగింది. 2018–19లో 1,76,43,797 టన్నుల పండ్ల దిగుబడులు రాగా.. ప్రస్తుతం 2,03,70,557 టన్నులకు పెరిగింది. అంటే 27,26,760 టన్నుల దిగుబడి పెరిగింది. పండ్ల తోటలతో పాటు పూలు, కూరగాయలు కలిపి మొత్తం రాష్ట్రంలో 47.02 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిద్వారా 3.63 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత ఏడాది 2023–24లో రికార్డు స్థాయిలో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల అభివృద్ధికి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా పండ్ల తోటల సాగు, అభివృద్ధి మోతుబరి రైతులు మాత్రమే చేసేవారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుండటంతో సన్న, చిన్నకారు రైతులు కూడా పండ్ల తోటలను సాగు చేయగలుగుతున్నారు. ఆ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పండ్ల తోటల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుండటం విశేషం. ఈ జిల్లాల్లో ప్రత్యేకంగా 10 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేస్తున్నారు. కాగా.. పొండి భూములు అధికంగా ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 వేల ఎకరాల్లోను, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది. ఇక ‘లక్ష’ణంగా ఆదాయం! కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నర్సిరెడ్డి. ఈయనకు అర ఎకరం పొడి భూమి ఉంది. వర్షాధారంగా పత్తి, మిరప వంటి పంటలు సాగు చేసేవాడు. అన్నీ అనుకూలిస్తే.. ఏటా రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేది. వర్షాలు మొహం చాటేస్తే నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. 2020 వరకు ఇదే పరిస్థితి. 2021–22లో డ్రైలాండ్ హార్టీకల్చర్ స్కీమ్ కింద డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇచ్చింది. పొలంలో గుంతలు తవ్వడం నుంచి మొక్కల వరకూ పూర్తిగా ప్రభుత్వమే రూ.1.70 లక్షల ఖర్చు భరించింది. తొలి ఏడాది రూ.22 వేలు, రెండో ఏడాది రూ.55 వేల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.లక్ష దాటుతుందని నర్సిరెడ్డి చెప్పాడు. ఈ పంట సాగువల్ల ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంటుందంటున్నాడు. రూ.750 కోట్లతో తోటల అభివృద్ధి పండ్ల తోటల అభివృద్ధికి ఎకరాకు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ.2.44 లక్షల వరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. ఎకరాకు సగటున రూ.లక్ష వరకూ సబ్సిడీ ఇస్తోంది. 2023–24లో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది. మామిడి, చీనీ, నిమ్మ, కొబ్బరి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలను రైతులు అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హార్టీకల్చర్ అభివృద్ధికి ఈ ఏడాది రూ.750 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి 64,544 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి అంచనాలు రూపొందించగా.. 63,250 ఎకరాలకు పరిపాలన అనుమతులు లభించాయి. మరోవైపు పండ్ల మొక్కలు నాటే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండెకరాల్లో మామిడి సాగు మాకు 2 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వర్షాధారం కింద ఆముదం, సజ్జ, కంది సాగు చేశాం. ఏ పంట వేసినా నష్టం తప్ప లాభం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో మామిడి మొక్కలు అందించింది. 2 ఎకరాల్లో 140 మామిడి మొక్కలు నాటుకున్నాం. కాపు వచ్చేదాకా 3–4ఏళ్లు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఏ ఖర్చు లేకుండా పండ్ల తోటలు సాగు చేశాం. సంతోషంగా ఉంది. కాపు వస్తే మా బతుకు మారుతుంది. – వై.లక్ష్మీదేవి, ప్యాపిలి, నంద్యాల జిల్లా -
ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం!
New Housing Loan Subsidy Scheme: పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. “మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కొనాలని, కట్టుకోవాలని కలలు కంటున్నాయి. నగరాల్లోని మురికివాడల్లో, అద్దె ఇళ్లల్లో నివసిస్తూ కాలం వెల్లదీస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని రాబోయే సంవత్సరాల్లో తీసుకురాబోతున్నాం. వారు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు వడ్డీ రాయితోపాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం ” అని మోదీ చెప్పారు. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు సెప్టెంబర్ నెలలో తీసుకొచ్చే కొత్త పథకం ఇప్పుడున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి పొడిగింపు. అయితే కొత్త పథకంలో వడ్డీ రాయితీని పొందే అర్హతను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలను సచివాలయంలోని ఆప్కో విక్రయశాల ద్వారా ఈ నెలాఖరు వరకు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత ప్రకటించారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వ్రస్తాలను తప్పనిసరిగా ధరించాలనే విధానాన్ని అమలు పరిచారని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వ్రస్తాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. చేనేత వ్రస్తాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత వ్రస్తాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సరళ, కనకదుర్గ, సునీత, ఇమామ్ వలీ, మోహనరావు, ప్రసాద్‌కు బహుమతులను అందజేశారు. నేతన్నలను ఆదుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ప్రధానంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ఊతమిచ్చారని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత స్పష్టం చేశారు. చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో చేనేత వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సునీత మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతుల్లో తయారైన చేనేత వస్త్రాలకు విదేశాల్లో సైతం మంచి ఆదరణ ఉండటంతో ఆ దిశగా పత్తి రైతులు, చేనేత కార్మికులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలో వినియోగిస్తున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశంలోనే తయారైనవేనని, చేనేతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయించేలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న చేనేత ప్రదర్శన, సబ్సిడీపై విక్రయాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సునీత కోరారు. 1.75 లక్షల మందికి ఉపాధి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ..రాష్ట్రంలో చేనేత రంగం 1.75 లక్షల మందికి ఉపాధి చూపుతోందన్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఎంతో మద్దతునిస్తూ ప్రతి జిల్లాలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తిస్తూ వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్లు గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహనరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆప్కో జీఎం తనూజారాణి మాట్లాడారు. -
ఒరిగిపోలేదు.. పెరిగిపోయింది
సాక్షి, అమరావతి: సర్వ సాధారణంగా ఎవరైనా సరే మన పరిస్థితిని సమీక్షించుకోవాలంటే గతంతో బేరీజు వేసుకుంటారు. ఇప్పుడు అంతకంటే మెరుగ్గా ఉన్నామో లేదో పరిశీలించుకుంటారు. ఈనాడు రామోజీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం! పొరపాటున కూడా అలా పోల్చే సాహసం చేయరు! ఎందుకంటే చంద్రబాబు వైఫల్యాలు, రైతులకు చేసిన మోసాలు బహిర్గతమవుతాయి కాబట్టే!! టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో వరి సాగు సగటున మరో నాలుగున్నర లక్షల ఎకరాలకుపైగా అదనంగా పెరిగింది. అందుకు తగ్గట్లే అన్నదాతలకు ఆదాయమూ పెరిగింది. నీళ్లపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ కొందరు రైతులు ప్రభుత్వ తోడ్పాటుతో ఉద్యాన పంటల వైపు మళ్లి పండ్ల తోటల సాగుతో మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వరి రైతులకు బోనస్ చెల్లిస్తున్నారంటూ రామోజీ మన రాష్ట్రం గురించి మొసలి కన్నీళ్లు కార్చారు. గ్రామస్థాయిలోనే రైతన్నలకు ఆర్బీకేల ద్వారా పంట ఉత్పాదకాలన్నీ సమకూరుస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం నుంచి పంట నష్ట పరిహారం దాకా ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తోంది. సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందుతోంది. పంటలను నేరుగా కల్లాల నుంచే కొనుగోలు చేస్తూ రైతన్నలకు గన్నీ బ్యాగులు, లేబర్ చార్జీలు, రవాణా చార్జీలను సైతం చెల్లించి వారిపై భారం పడకుండా ఆదుకుంటోంది. జీఎల్టీ పేరుతో టన్నుకు రూ.2,523 చొప్పున ధాన్యం కొనుగోలు డబ్బులతోపాటే రైతుల ఖాతాల్లో జమ చేస్తోందన్న విషయం రామోజీకి తెలుసా? తెలిసీ నటిస్తున్నారా? ఈనాడు ఆరోపణ: ఏపీలో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది... వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 38.8 లక్షల ఎకరాలు కాగా రబీలో 19.92 లక్షల ఎకరాలు. టీడీపీ హయాంలో ఏటా సగటున 55.43 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు గత నాలుగేళ్లుగా సగటున 60 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. చంద్రబాబు పాలనలో 2014–15లో గరిష్టంగా 59.85 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు 2020 – 21లో గరిష్టంగా 63.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రాష్ట్రంలో వరి మొత్తం సాగు విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు కాగా 2022–23లో 55.52 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు మాత్రమే. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్యసాగు విస్తరించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 6.34 లక్షల ఎకరాలు తగ్గిపోయిందంటూ పొంతన లేని లెక్కలతో ఈనాడు కథలు అల్లింది. ఆరోపణ: పంట విరామం ప్రకటించినా మొద్దు నిద్రే వాస్తవం: చంద్రబాబు అధికారంలో ఉండగా కరువు మండలాలను ప్రకటించని ఏడాదంటూ లేదు.గత నాలుగేళ్లుగా అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాలేదు. పుష్కలంగా వర్షాలు, సమృద్ధిగా సాగునీరు, ముందస్తుగానే కాలువలకు నీటి విడుదలతో సిరులు పండుతున్నాయి. గోదావరి, కృష్ణాకే కాకుండా తొలిసారిగా పెన్నాకు కూడా వరదలు వచ్చాయంటే వరుణుడు ఏ స్థాయిలో కరుణ కురిపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటప్పుడు పనిగట్టుకుని పంట విరామం ప్రకటించాలి్సన అవసరం ఏముంటుందో రామోజీకే తెలియాలి. 2022–23లో వరి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తే పంట విరామం ప్రకటించినట్లుగా నోటికొచి్చన అంకెలతో రామోజీ అబద్ధాలను అచ్చేశారు. ఆరోపణ: మద్దతు ధర మాయే.. వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. టీడీపీ హయాంలో దళారులదే రాజ్యం. తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించడమే ఇందుకు నిదర్శనం. 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఒక్కో రైతు నుంచి సగటున 33.89 టన్నుల ధాన్యం సేకరించారు. నూటికి 90 శాతం సన్న, చిన్నకారురైతులున్న ఈ రాష్ట్రంలో ఈస్థాయిలో ధాన్యంఅమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 32,78,354 మంది రైతుల నుంచి రూ.58,766 కోట్ల విలువైన 3,10,69,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. గరిష్టంగా కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేశారు. ఆరోపణ: తడిసిన ధాన్యాన్ని కొనలేదు.. వాస్తవం: గతంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఒక్కో బస్తాకి (75 కేజీలు) మద్దతు ధర కంటే రూ.200 – రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. ఇప్పుడు జిల్లాకో మొబైల్ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. తడిసిన ధాన్యాన్నే కాకుండా ముక్క విరిగిన ధాన్యాన్ని సైతం బాయిల్డ్ రకంగా పరిగణించి మరీ కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన మొత్తం ధాన్యంలో సుమారు 30 శాతం తడిసిన ధాన్యమే ఉంది. కేంద్ర నిబంధనలు అడ్డంకిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మిల్లర్లను ఒప్పించి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా సేకరించింది. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడమే కాకుండా పొలం నుంచే నేరుగా కొనుగోలు చేస్తూ జీఎల్టీ(గన్నీ బ్యాగ్‌లు, లేబర్, ట్రాన్స్‌పోర్టు) ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. టన్నుకు రూ.2,523 చొప్పున (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలుగా రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85) చెల్లిస్తుండగా ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాల్‌కు రూ.418 చొప్పున భరిస్తోంది. ఈ అదనపు మొత్తాన్ని ధాన్యం సొమ్ముతో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఆరోపణ: వరిసాగు లేక కూలీలు వలసపోతున్నారు వాస్తవం: వరి సాగు లేక వ్యవసాయ పనిదినాలు తగ్గిపోయాయని, కూలీలు వలస వెళుతున్నారంటూ రామోజీ కంటతడి పెట్టారు. వాస్తవానికి ఉపాధి హామీ పనులతో పాటు ఇతర పనుల కారణంగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. సాగులో కూలీల కొరత తీర్చేందుకు యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా చిన్న, సన్న కారు రైతులకు లబ్ధి చేకూర్చి పెట్టుబడి ఖర్చులను తగ్గించేలా యంత్రపరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఆరోపణ: వరి రైతును ఆదుకునే చర్యలేవి? వాస్తవం: 2020 నుంచి ఇప్పటివరకు వైపరీత్యాల వల్ల 15.31 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా 12.79 లక్షల మంది వరి రైతులకు రూ.930.56 కోట్ల పెట్టుబడి రాయితీని సీజన్ ముగియకుండానే అందజేశారు. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు 2.21 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఈనాడుకు మాత్రం 3.51 లక్షల ఎకరాలుగా తోచింది. 2014 నుంచి నేటి వరకు ఎకరాకు పెట్టుబడి రాయితీ రూ.6 వేల చొప్పునే ఇస్తున్నారు. 2018లో తితిలీ, పెతాయి తుపాన్ వల్ల నష్టపోయిన పంటలకు కేవలం రెండు జిల్లాల పరిధిలో మాత్రమే ఎకరాకు రూ.8వేల చొప్పున ఇచ్చారు. 2014–19 మధ్య 359 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. 42.26 లక్షల ఎకరాలు కరువు బారిన పడినట్లు గుర్తించారు. నాడు పరిస్థితి అంత దారుణంగా ఉంటే 20.09 లక్షల మంది రైతులకు రూ.2,188.74 కోట్ల పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుది కాదా? ఈ లెక్కలు రామోజీ ఎక్కడ దాచినట్లు? ఆరోపణ: ఏటా ఉత్పాతమే... వాస్తవం: ఆహార ధాన్యాల దిగుబడి 2014–19 మధ్య ఐదేళ్లలో సగటు 153.94 లక్షల టన్నులు కాగా గత నాలుగేళ్లలో 170.96 లక్షల టన్నులు ఉంది. ఒక్క వరినే పరిశీలిస్తే చంద్రబాబు అధికారంలో ఉండగా ఏటా సగటున 1.22 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2019–22 మధ్య 1.29 కోట్ల టన్నుల చొప్పున ఉత్పత్తి జరిగింది. 2021–22 ఖరీఫ్‌లో హెక్టార్‌కు 4,351, రబీలో 6,950 కేజీల చొప్పున దిగుబడి నమోదైంది. 2022–23 ఖరీఫ్‌లో 5,195 కేజీలు, రబీలో 6,944 కేజీల చొప్పున దిగుబడి వచ్చింది. 2021–22లో 1.25 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 2022–23లో 1.29 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే దిగుబడి పెరిగినట్లా? తగ్గినట్లా? రామోజీకి మాత్రం ఇవన్నీ కనపడవు. ఎందుకంటే ఆయన కళ్లున్నా కబోదిలానే వ్యవహరిస్తున్నారు కాబట్టి!! ఇతర రాష్ట్రాల్లో ఇలా.. ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్లను (2022–23)మన రైతన్నలు సాధిస్తుండగా తమిళనాడులో 17, జార్ఖండ్‌లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఎంత ప్రోత్సహిస్తున్నా ఫలితం లేకపోవడంతో కేరళ ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బొండాల కోసం క్యూ కడుతుండగా తమిళనాడు మన రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్ వెరైటీల వైపు చూస్తోంది. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్ వెరైటీ ధాన్యాన్ని జార్ఖండ్ కొనుగోలు చేస్తోంది. -
ఏపీలో టమోటాను కేజీ రూ.50కే అందిస్తోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం
-
నర్సరీ పెట్టు.. కాసులు పట్టు
కడప అగ్రికల్చర్: తక్కువ పెట్టుబడితో అనతికాలంలో అధిక ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ నర్సరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ కిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చేయూతగా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. మల్బరీ సాగుకు అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు నర్సరీ సాగుకు ముందుకు రావాలని సూచిస్తోంది. జిల్లాలో మల్బరీ సాగుకు మొక్కల కోసం ముందుగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు అందించేందుకు ప్రోత్సహిస్తోంది. ఎకరాకు నర్సరీకి 1,60,000 మొక్కలు... మల్బరీకి సంబంధించి ఒక ఎకరా కిసాన్ నర్సరీలో 1,60,000 మొక్కలను నాటితే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నర్సరీలో 4 నుంచి 5 నెలలపాటు మల్బరీ మొక్కలను పెంచి తరువాత రైతులు మొక్కలను విక్రయించాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను రైతు తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నర్సరీలో ఒక్కో మొక్కకు రైతు రూ. 2 చెల్లించి కొనుగోలు చేయాలి. తెచ్చుకున్న మొక్కలను తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎకరాకు సాగుకు మొక్కలను నాటేదాన్ని బట్టి 4500 నుంచి 10 వేల మొక్కల వరకు నాటి సాగు చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీ ఇలా.. నర్సీరీ మొక్కల సాగుకు ప్రభుత్వం ఒక యూనిట్‌కు రూ.1,50,000 అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీతో రూ.1,35,000 ఉచితంగా అందిస్తుంది. అలాగే ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీతో రూ.1,12,500 ఉచితంగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. నర్సరీ సాగు పూర్తయ్యాక (ఓసీ, బీసీ రైతులకు) రైతుకు ఒక్కో మొక్కను 2 రూపాయలతో విక్రయిస్తే రూ.2,40,000 రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.1,12,500 కలుపుకుని మొత్తం రూ.3,12,500 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను నికరంగా రైతుకు రూ.2,02,500 లాభం వస్తుందని మల్బరీ అధికారులు తెలిపారు. అలాగే (ఎస్సీ, ఎస్టీ రైతులకు) సంబంధించి రైతు రాబడి రూ.2,40,000, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,35,000 కలుపుకుని మొత్తం రూ.3,75,000 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను రైతుకు నికరంగా రూ.2,25,000 లాభం వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నర్సరీల ద్వారా... మల్బరీ నర్సరీ మొక్కల సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో రెండు నర్సరీ కేంద్రాలలో పెంపకాన్ని చేపడుతున్నారు. ఇందులో ఒకటి కడప నగర శివార్లలోని ఊటుకూరు కేంద్రంలో ఒక దానిని, మైదుకూరు మండలం వనిపెంట పట్టు పరిశ్రమలశాఖ క్షేత్రంలో మరొక మల్బరీ నర్సరీ సాగును చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2 లక్షల మల్బరీ మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో ఊటుకూరు క్షేత్రంలో ఇప్పటికే 1,50,000 మొక్కలను నాటించారు. త్వరలో వనిపెంట నర్సరీలో కూడా నాటించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు నర్సరీల ద్వారా రైతులకు కావాల్సిన మొక్కలను అందజేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్క రూ. 2కు అందజేస్తారు. వ్యాధి రహిత పట్టు పురుగుల పెంపకం.. వ్యాధి రహిత పట్టు పురుగులను( చాకీ పురుగుల పెంపకం) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసూరులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లు తెప్పించి పెంచుతోంది. ఇందులో 100 గుడ్లను 13 వందలకు తెప్పించి వనపెంటలోని సీడ్ఫామ్లో పెంచుతారు. అక్కడ 13 రోజుల తరువాత పగిలి చాకీ పురుగులు బయటకు వస్తాయి. వాటికి ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా 3 రోజులపాటు 6 మేతలను అందిస్తారు. ఈ తరుణంలో వాటికి మొదటి జ్వరం వస్తుంది. తరువాత 2వ మేతను రెండున్నర రోజులు అందిస్తారు. తర్వాత 2వ జ్వరం వస్తుంది. తరువాత రైతులకు ఈ చాకీ పురుగులను సరఫరా చేస్తారు. ఇందులో 100 పట్టు గుడ్ల రేటు రూ.1300 కాగా 100 పట్టు పురుగులను 9 రోజులపాటు పెంచి ఇచ్చినందుకు ఈ ఖర్చు అవుతుంది. ఇలా రైతుకు 100 చాకీ పురుగులను అందించాలంటే రూ.2600 రైతు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత చాకీ పురుగులను కడపతోపాటు గిద్దలూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది 4 వందల ఎకరాలు ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగును లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం కడప ఊటుకూరుతోపాటు వనిపెంట నర్సరీలో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టాము. ఇప్పటికే ఊటుకూరు నర్సరీలో 1,50,000 మొక్కలను సాగు చేశాము. మిగతా వాటిని కూడా త్వరలో నాటి కావాల్సిన రైతులకు అందిస్తాము. – అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్‌ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు. -
అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ విద్యుత్ సబ్సిడీ
పాడిందే పాడరా.. అన్నట్టు పాసిపోయినా అబద్ధమైతే చాలు ఈనాడుకు మహా ఇష్టం. అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తే నిజమైపోతుందనే భ్రమలో ఉన్నారు రామోజీ. ‘ఎస్సీ ఎస్టీల బతుకుల్లో జగనన్న కారు చీకట్లు’ అంటూ అలవాటు ప్రకారం గతంలో అనేకసార్లు రాసిన అసత్యాల కథనాన్నే మరోసారి అచ్చేసింది. పాసిపోయిన తప్పుడు సమాచారాన్నే మళ్లీ వడ్డించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు స్పష్టం చేశాయి. ఈనాడు రాసిన అసత్య కథనంలోని వాస్తవాలను వెల్లడించాయి. డిస్కంలు తెలిపిన వివరాల ప్రకారం.. గతం కంటే 3 రెట్లు ఎక్కువ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ కాలనీల్లో, ఎస్టీ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన వారందరికీ ఉచిత గృహ విద్యుత్ పరిమితిని 100 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచింది. గత ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్తుకంటే రెట్టింపు యూనిట్లు అధికంగా అందిస్తోంది. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని వినియోగదారులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. వినియోగదారుల ధ్రువీకరణ పత్రాలను డిస్కంల క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. అర్హత ఉన్న ఒక్కరికి కూడా తిరస్కరించలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19లో దీని కోసం రూ.235 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం రూ.637 కోట్లు ఖర్చు చేస్తుండటమే దీనికి నిదర్శనం. అర్హత కలిగిన ఎవరికీ ఈ విద్యుత్ రాయితీ ఎత్తివేయలేదు. సాంకేతిక తప్పిదాలు, క్షేత్రస్థాయి వాస్తవాలలో తేడాలేమైనా ఉంటే డిస్కంల స్థానిక అధికారుల దృష్టికి తీసుకు వస్తే తప్పకుండా సరిదిద్ది అర్హత కలిగిన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతోంది. ఎవరికైనా రాయితీ అందకపోతే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి. అక్కడున్న సిబ్బంది అర్హులకు దరఖాస్తు నింపడంలో, అవసరమైన ధ్రువపత్రాల జారీలోనూ సహాయపడతారు. వాస్తవాలు ఇలా ఉంటే.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లేలా, ప్రజలను పక్కదోవ పట్టించేలా నిజాలను దాచి ఈనాడు పత్రిక అబద్ధాలను అచ్చేసింది. – సాక్షి, అమరావతి -
కేంద్రం కంటే మిన్నగా..
ఈయన పేరు సోమిశెట్టి రామచంద్రరావు. విజయవాడ ఇందిరా కాలనీలో ఉంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.120–150 పలుకుతుండగా, కృష్ణలంక రైతుబజార్లో రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.50కే అందిస్తుండడం మాబోటి వారికి చాలా ఊరటగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే నాలుగైదుసార్లు వెళ్లి తెచ్చుకున్న ఆయన.. టమాటాలు తాజాగా, నాణ్యతతో ఉంటున్నాయంటూ ఆయన తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, అమరావతి : టమాటా ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో రైతుబజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. ఆకస్మిక వర్షాలతో మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో టమాటా పంట దెబ్బతినడంతో ధరలు దేశవ్యాప్తంగా చుక్కలనంటాయి. దాదాపు 40 రోజులు కావస్తున్నా డిమాండ్ సరిపడా నిల్వల్లేక ధరలు అదుపులోకి రాని పరిస్థితి. ధరలు పతనమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే రీతిలో ప్రస్తుతం మార్కెట్లో ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు బాసటగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా దాదాపు నెలరోజులుగా ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా సబ్సిడీపై టమాటాలు విక్రయాలను కొనసాగిస్తోంది. రంగంలోకి మార్కెటింగ్ శాఖ.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైగా పలుకుతుండగా, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నేటికీ కిలో రూ.120 నుంచి రూ.150కు తగ్గలేదు. ధరలు పెరుగుదల మొదలైన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపిన ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులు, వ్యాపారుల నుంచి సేకరించి వాటిని రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. రాష్ట్రంలో సబ్సిడీపై టమాటా విక్రయాలు ప్రారంభించిన మూడు వారాల తర్వాత కేంద్రం కూడా ఏపీ బాటలో వినియోగదారులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిం ది. దక్షిణాది రాష్ట్రాల నుంచి సేకరించి ఉత్తరాదిలోని మండీల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.80 చొప్పున విక్రయాలకు శ్రీకారం చుట్టింది. సబ్సిడీ కోసం రూ.11.82 కోట్లు ఖర్చు.. రోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లలో వ్యాపారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొని రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి స్థానిక వ్యాపారుల నుంచి కూడా సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.104 చొప్పున రూ.11,82,40,000 ఖర్చుచేసి 1,136.90 మెట్రిక్ టన్నుల టమాటాలను సేకరించింది. రోజూ 40–70 టన్నుల చొప్పున సేకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 ప్రధాన రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా మనిషికి ఒక కిలో చొప్పున విక్రయిస్తోంది. కిలో రూ.123.50 చొప్పున కొనుగోలు.. మంగళవారం సగటున కిలో రూ.123.50 చొప్పున రూ.49.40 లక్షల విలువైన 40 టన్నుల టమాటాలను అధికారులు సేకరించారు. వీటిని విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 40 రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేశారు. ఇలా దాదాపు నెలరోజులుగా సబ్సిడీపై టమాటా విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుండడంపట్ల వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటినప్పుడు రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు. గతలో ఎన్నడూ ఇలా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకున్న సందర్భాల్లేవని వినియోగదారులు చెబుతున్నారు. పేదలకు ఊరట టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో నెలరోజులుగా రైతుబజార్ల ద్వారా కిలో రూ.50కే నాణ్యమైన టమాటాలు అందిస్తుండడం మాలాంటి పేదవారికి ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న టమాటాలను ప్రజలు పొదుపుగా వాడుకుంటే మంచిది. – కె.నాయుడు, కార్మికుడు, సీతమ్మధార, విశాఖపట్నం నాణ్యంగా ఉంటున్నాయి ప్రభుత్వం అండగా నిలవకపోతే ఈ సమయంలో బహిరంగ మార్కెట్లో మాలాంటివారు కొనే పరిస్థితి ఉండదు. నెలరోజులుగా సీతమ్మధార రైతుబజారులో సబ్సిడీపై టమాటాలు అందిస్తున్నారు. కాయలు చాలా నాణ్యంగా ఉంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – పైడి రమణమ్మ, పాత వెంకోజీపాలెం, విశాఖపట్నం ధరలు తగ్గే వరకు కొనసాగిస్తాం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గత నెల 27న సబ్సిడీపై టమాటాల విక్రయా లకు శ్రీకారం చుట్టాం. సగటున కిలో రూ.104 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.50లకే విక్రయిస్తున్నాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్లలో సబ్సిడీ కౌంటర్లు కొనసాగుతాయి. – రాహుల్ పాండే, కమిషనర్, ఏపీ మార్కెటింగ్ శాఖ -
సూక్ష్మ సేద్యం.. విస్తరణే లక్ష్యం
సాక్షి, అమరావతి: సూక్ష్మసేద్యాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022–23లో లక్ష్యానికి మించి తుంపర, బిందు సేద్య పరికరాలు అందించగా.. 2023–24లో రూ.902 కోట్లను వెచ్చించి కనీసం 2.5 లక్షల ఎకరాల్లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పరికరాల పంపిణీ ప్రారంభించింది. లక్ష్యానికి మించి పంపిణీ సూక్ష్మ సేద్యంలో దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా.. టాప్–20 జిల్లాల్లో ఐదు జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇటీవలే నూరు శాతం బోర్ల కింద బిందు, తుంపర పరికరాలు అమర్చిన గ్రామంగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామానికి జాతీయ పురస్కారం దక్కించుకుంది. రాష్ట్రంలో 12.62 లక్షల మంది రైతులు 35.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేస్తుండగా, ఏటా 2.50 లక్షల ఎకరాల చొప్పున మరో 18.65 లక్షల ఎకరాల్లో విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.936 కోట్ల బకాయిలు చెల్లించడంతో రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరణ వేగం పుంజుకుంది రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5–12.5ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం కాగా.. రికార్డు స్థాయిలో 82,289 మంది రైతులకు చెందిన 2.26 లక్షల ఎకరాల్లో విస్తరించారు. వీటికోసం రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.465 కోట్లు భరించింది. 2023–24లో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరణ 2023–24లో రూ.902 కోట్ల అంచనా వ్యయంతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అంచనా మొత్తంలో రైతుల వాటా రూ.145 కోట్లు కాగా, సబ్సిడీ రూపంలో రూ.757 కోట్లు ప్రభుత్వం భరించనుంది. ఏప్రిల్ నుంచి ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టి ఇప్పటివరకు 5.07లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాల అమరిక కోసం 1.72 లక్షల మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ఎలాంటి సిఫార్సులు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల ఎంపిక చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో సర్వే చేయగా.. 1.45 లక్షల ఎకరాల్లో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పండగ వాతావరణంలో పరికరాల పంపిణీ 45,255 ఎకరాల్లో ఏర్పాటు కోసం 16,630 మంది రైతులు తమ వాటా సొమ్మును చెల్లించారు. 10,556 మంది రైతులకు చెందిన 29,070 ఎకరాల్లో అమర్చేందుకు అవసరమైన బిందు, తుంపర పరికరాల పంపిణీకి శనివారం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిందు, తుంపర పరికరాల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పరికరాల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. -
ఆక్వా రంగం అభ్యున్నతికి ప్రభుత్వ కృషి భేష్
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగా గతంలో ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదని ఆక్వా రైతు సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం ప్రశంసించింది. నాన్ ఆక్వా జోన్ పరిధిలో ఉన్న వారిని ఆక్వా జోన్లోకి తీసుకురావడంతో ఆక్వా సబ్సిడీ ఆక్వా రైతులకు అందుతోందని వెల్లడించింది. గతంలో ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హేచరీలతో రైతులు ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉండేది కాదనీ.. ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సడా చట్టం పుణ్యమా అని రైతులకు మేలు జరుగుతోందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆక్వా రైతు సంఘాల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ అధ్యక్షతన జరిగింది. రైతులు ఏం అడిగారంటే.. సమావేశంలో రైతు ప్రతినిధులు మాట్లాడుతూ.. ట్రేడర్స్, ఏజెంట్లను కూడా అప్సడా పరిధిలోకి తీసుకొచి్చ, వారికి కూడా లైసెన్సులు జారీ చేయాలని కోరారు. రొయ్యల కొనుగోలుదారులు విధిగా సరైన బిల్లులు ఇచ్చేలా తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆ బాధ్యతలను ఆర్బీకేల్లో ఉండే మత్స్య సహాయకులకు అప్పగించాలని కోరారు. 2024 నుంచి ఏటా మార్చి 15 నుంచి మే 15 వరకు 60 రోజుల పాటు రైతులందరూ సాగు సన్నాహాలు చేసుకునేందుకు వీలుగా డిసెంబర్ 15 నుంచి సీడ్ అమ్మకాలను హేచరీలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగు సన్నాహాలు కోసం కొద్దికాలం పాటు పనులు నిలిపి వేయడం వల్ల రైతులందరికీ మేలు జరుగుతుందని, ముఖ్యంగా పంటను వైరస్ల బారిన పడకుండా, బ్యాక్టీరియాల నుంచి తప్పించుకునేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. విద్యుత్ సబ్సిడీకి అర్హత ఉండి సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందని వారికి సాధ్యమైనంత త్వరగా మేలు చేయాలని కోరారు. రొయ్యల స్థానిక వినియోగం పెంచేందుకు మ«ధ్యాహ్న భోజన పథకంతోపాటు జైళ్లు, మిలటరీ క్యాంటీన్లలో రొయ్య వంటకాలను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎంను సత్కరించాలని తీర్మానం రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆక్వా రైతుల తరఫున సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తున్న అప్సడా వైస్ చైర్మన్ రఘురామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో భీమవరంలో రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల సమ్మేళనం నిర్వహించి.. ఆక్వా రంగానికి అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సత్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ రొయ్యరైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, జిల్లాల రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. -
టమాటా ధర కిలో రూ.80
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే కిలో రూ.250 దాకా పలికిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం దేశంలో సగటు ధర కిలోకు రూ.117గా ఉంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై టమాటాలు విక్రయిస్తోంది. పలు నగరాల్లో కొన్ని రోజులపాటు కిలో రూ.90కి విక్రయించగా, ఆదివారం నుంచి రూ.80కే అందుబాటులోకి తీసుకొచి్చంది. భారత జాతీయ సహకార వినియోగదారుల సంఘం(ఎన్సీసీఎఫ్), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంఘం(నాఫెడ్) ద్వారా ప్రభుత్వం టమాటాలను రాయితీపై విక్రయిస్తోంది. ప్రభుత్వ జోక్యంతో రిటైల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. ఆదివారం ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా తదితర నగరాల్లో కిలో టమాటాలు రూ.80 చొప్పున విక్రయించారు. సోమవారం నుంచి మరికొన్ని నగరాల్లో ఈ రాయితీ ధరతో టమాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.178, ముంబైలో రూ.150, చెన్నైలో రూ.132 చొప్పున పలుకుతోంది. సాధారణంగా జూలై–ఆగస్టు, అక్టోబర్–నవంబర్‌లో టమాటా ధరలు పెరుగుతుంటాయి. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని సంగనేరీ నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. -
బుట్టాయిగూడెంలో తమ్ముళ్ల పరువు పాయే.. పాత బిల్లుతో బొక్కబోర్లా!
ద్వారకా తిరుమల: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చిమ్మాలన్న దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకుడు చివరికి భంగపడ్డారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటన వివరాలున్నాయి.. బుట్టాయిగూడేనికి చెందిన నోముల రాంబాబు పూరి గుడిసెకు 2021 అక్టోబర్ నుంచి 2022 నవంబర్ వరకు (13 నెలలకు) రూ.26,660 విద్యుత్ బిల్లు వచ్చిం ది. అతను అధికారులను సంప్రదించగా, అంత బిల్లు రావడానికి మీటరు జంప్ అవడమే కారణమని తెలుసుకున్నారు. 2022 నవంబర్ 30న రూ.16,840 బిల్లును మినహాయించి, మిగిలిన రూ.9,820 చెల్లించాలని సూచించారు. పైగా, రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. అప్పటి నుంచి అతడికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోంది. అయితే రాంబాబు పాత బకాయితో పాటు ఆ తర్వాతి నెలల బిల్లులు కూడా చెల్లించలేదు. అతని బకాయి రూ.10,150కు చేరింది. దీంతో అధికారులు నెల క్రితం అతని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రాంబాబు ఈ నెల 7న రూ.2 వేలు మాత్రమే చెల్లించాడు. అయితే అధికారులు మొత్తం బిల్లు చెల్లించాలని సూచించారు. గోపాలపురం టీడీపీ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం అక్కడికి వచ్చారు. ఆయనకు రాంబాబు పాత బిల్లు చూపాడు. వెంటనే ఆయన పాత బిల్లు పట్టుకొని పూరి గుడిసెకు వేలల్లో బిల్లు వచ్చిం దంటూ రోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు అది పాత బిల్లని తేలడంతో నాలుక్కరుచుకున్నారు. ప్రతి నెలా ఎస్సీ సబ్సిడీ వస్తోంది ప్రభుత్వం గతేడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రతి నెలా విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని, అతనికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోందని భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణ తెలిపారు. పాత బిల్లు బకాయికి సంబంధించి రాంబాబు శనివారం మరో రూ.500 చెల్లించాడని, దాంతో అతడి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. బిల్లు నెలకు రూ.26,660 వచ్చిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది. తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా? -
రైతుబజార్లలో రూ.50.. ధరలు తగ్గే వరకు సబ్సిడీపై టమాటా
సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడ తూర్పు): వినియోగదారులపై భారం పడకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీపై టమాటాల విక్రయాలు చేపట్టిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గే వరకు సబ్సిడీపై టమాటాలను అందజేస్తామని తెలిపారు. ధరలు తగ్గినప్పుడు రైతులకు, విపరీతంగా పెరిగినప్పుడు వినియోగదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. విజయవాడలోని కృష్ణలంక రైతు బజార్లో సబ్సిడీపై టమాటాల విక్రయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో టమాటా పంట దెబ్బతినడం వల్ల దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో ధర రూ.250కు చేరుకోగా.. రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లో రూ.98 నుంచి రూ.124 వరకు ఉందన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 103 రైతుబజార్లలో సబ్సిడీపై టమాటాలను కిలో రూ.50కే విక్రయిస్తున్నామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 600 టన్నుల టమాటాలను రూ.6 కోట్లతో సేకరించామని చెప్పారు. రూ.3 కోట్లకు పైగా సబ్సిడీ భరించి ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో రూ.10.26 కోట్ల విలువైన 3,100 టన్నుల టమాటాలను సేకరించి రైతులకు, వినియోగదారులకు అండగా నిలిచామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా టమాటా రైతులను, వినియోగదారుల ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. టీడీపీ పాలనలో టమాటా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయినా చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్‌పాండే, రైతు బజార్ల సీఈవో నందకిశోర్, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ సీహెచ్ జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా?
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కొనసాగించడం లేదా దాన్ని ప్రయోజనాలను అలాగే అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీ హనిఫ్ ఖురేషి తాజాగా తెలిపారు. సుస్థిర పారిశ్రామిక వృద్ధికి సమర్థ నిర్వహణ వ్యవస్థలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఖురేషీ మాట్లాడుతూ.. వినియోగదారుల సంతృప్తి, స్థిరమైన పారిశ్రామిక వృద్ధిని నడపడంలో నిర్వహణ వ్యవస్థల ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. 150 బిలియన్ డాలర్ల మేర ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, కొనుగోలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో ఫేమ్ పథకాన్ని తీసుకొచ్చింది. మూడేళ్ల కాల పరిమితి ముగిశాక మళ్లీ రెండేళ్లు పొడిగించింది. అయితే ఇటీవల ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. దీంతో జూన్ నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచేశాయి. కాగా మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం దీనిపై పునరాలోచించడం కొనుగోలుదారులు సంతోషాన్నిచ్చే విషయం. ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు! -
ప్రజలకు సబ్సిడీపై టమోటోలు అందజేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
రైతుబజార్లలో సబ్సిడీ టమాటా
సాక్షి, అమరావతి: చుక్కలనంటుతున్న టమాటా ధరల నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.100 దాటింది. దీంతో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతుల నుంచి టమాటాను సేకరించి కిలో రూ.50 చొప్పున సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందిస్తోంది. తొలుత కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతుబజార్లలో సబ్సిడీ టమాటా విక్రయాలు ప్రారంభించగా.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతుబజార్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభారమైనప్పటికీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి, పలమనేరు తదితర మార్కెట్లలో రైతుల నుంచి కిలో రూ.98 నుంచి రూ.104 చొప్పున చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇలా గడిచిన నాలుగు రోజుల్లో 95 టన్నులు సేకరించారు. శుక్రవారం 36 టన్నులు సేకరించి.. బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం జిల్లాకు 20 టన్నులు, ఎన్టీఆర్ జిల్లాకు ఆరు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఐదేసి టన్నుల చొప్పున తరలించి స్థానిక రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున విక్రయించారు. శనివారం నుంచి రోజు 50 టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నాలుగైదు రోజులు విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలకు స్థానిక అవసరాలకు తగినట్లు టమాటా నిల్వలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో కూడిన బృందాల ద్వారా తనిఖీలకు శ్రీకారం చుడుతోంది. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలను సీఎం యాప్‌ద్వారా నిత్యం సమీక్షిస్తూ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. -
టమాటా ధరల భారం నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
సబ్సిడీపై టమాటా
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న టమాటా ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పలుచోట్ల టమాటా రేట్లు చుక్కలను తాకుతుండటంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో రూ.50కే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో బుధవారం శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిత్యం 50–60 టన్నుల టమాటాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు టమాటాతో పోటీపడుతూ ఆకాశానికి ఎగబాకుతున్న పచ్చి మిర్చిని కూడా సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం యాప్‌లో పర్యవేక్షణ.. పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు టమాటా ధరలను హడలెత్తిస్తున్నాయి. వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో టమాటా ధర చుక్కలనంటుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20–30కు మించి పలకని టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పలు రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటగా మన రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం కిలో రూ.65 నుంచి 90 మధ్య పలుకుతోంది. పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, రైతుబజార్ల సీఈవో నందకిషోర్‌తో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టమాటాతో పాటు పచ్చి మిర్చి ధరలు కూడా వంద దాటడంతో వాటిని కూడా సబ్సిడీపై అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. టమాటా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అత్యధికంగా విశాఖలో కిలో రూ.90 ఉండగా మిగిలిన జిల్లాల్లో రూ.50–85 మధ్య ధరలున్నట్లు గుర్తించడంతో రైతుబజార్ల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్లుగా టమాటా ధరలు పెరిగిన పలు సందర్భాల్లోనూ రాష్ట్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా పచ్చి మిర్చి కూడా పలు జిల్లాల్లో రూ.వంద దాటినట్టు గుర్తించారు. దీంతో మంత్రి ఆదేశాలతో పచ్చి మిర్చిని కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో సేకరణ ధరలు ఎగబాకడంతో టమాటా రైతన్నలకు మంచి రేటు లభిస్తోంది. రాష్ట్రంలోని మదనపల్లి, పలమనేరు, పత్తికొండ, పుంగనూరు, కలికిరి మార్కెట్లకు వస్తున్న టమాటాను పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. బుధవారం మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల నుంచి కిలో రూ.70 చొప్పున 10 టన్నుల టమాటాలు సేకరించారు. నేటి నుంచి మిగిలిన మార్కెట్లలోనూ సేకరించనున్నారు. రోజుకు కనీసం 50–60 టన్నులు తక్కువ కాకుండా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున టమాటా విక్రయాలకు బుధవారం శ్రీకారం చుట్టగా.. విశాఖ సహా మిగిలిన జిల్లాలకు గురువారం నుంచి విస్తరించాలని నిర్ణయించారు. అదుపులోకి వచ్చే దాకా సబ్సిడీపై విక్రయాలు ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటింది. ప్రధాన మార్కెట్లలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు దీన్ని కొనసాగిస్తాం. – నందకిషోర్, సీఈవో, ఏపీ రైతుబజార్లు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఏర్పాటు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ టమాటా అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నాం. మిగిలిన చోట్ల రైతు బజార్లలో కూడా కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ టమాటా, పచ్చిమిర్చి కూడా.. మార్కెట్లో టమాటా, మిర్చి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ధరల నియంత్రణపై స్పెషల్ సీఎస్‌తోపాటు, మార్కెటింగ్ శాఖ కమిషనర్, రైతు బజార్ల సీఈవోతో సమీక్షించాం. గురువారం నుంచి రాష్ట్రంలో ప్రధాన రైతు బజార్లలో టమాటా కిలో రూ.50కే సబ్సిడీపై అందించనున్నాం. అదేవిధంగా మిర్చిని కూడా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
టెండర్లు జీరో.. చేపపిల్లల సరఫరాకు వ్యాపారుల అనాసక్తి
నారాయణపేట: జిల్లాలో చేపపిల్లల పంపిణీకి రెండు సార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో అధికారులు ఎటూ తేల్చలేక ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. మత్య్సకారులకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో కలెక్టర్ దిశానిర్దేశంతో జిల్లా మత్య్సశాఖ అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధంచేసి టెండర్లకు పిలుపునిచ్చింది. కానీ ఎవరూ చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఽనిర్ణయించిన ధరలకు వ్యాపారస్తులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష నియమించిన టెండర్ల కమిటీ చైర్మన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మెంబర్, కం కన్వీనర్‌గా జిల్లా మత్య్సశాఖ అధికారి రానాప్రతాప్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియను ఈ ప్రొక్య్రూట్మెంట్ను ఈనెల 12న ఓపెన్ చేసి చూడగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఈ నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు జిల్లా మత్య్స శాఖ అధికారులు పంపించినట్లు తెలుస్తోంది. గడువు పెంచినా.. చేపపిల్లలను సరఫరా చేసేందుకు గతనెల 5న బిడ్ కాలింగ్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బిడ్ డాక్యుమెంట్‌ను గతనెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు తొలిసారిగా మే 30 గడువు విధించారు. అప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో మరోసారి గడువును జూన్ 12వరకు పెంచింది. అయినప్పటికి చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం టెండర్లను ఓపెన్ చేయడంతో స్పష్టమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చేప పిల్లలను పంపిణీ చేయలేమని బహిరంగంగానే కాంట్రాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ధరకు గిట్టుబాటు కాదనే ముందుకు రావడంలేదని సమాచారం. ధరలు పెరిగేనా.. టెండర్లు అయ్యేనా? ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాక కాంట్రాక్టర్లు ఆశించిన స్థాయిలో ధరలు పెరుగుతాయనేది కష్టమే అనిపిస్తోంది. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చులతో పాటు విత్తనోత్పత్తి ఖర్చులు పెరిగాయంటూ వ్యాపారస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయలేమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపపిల్లల వ్యాపారస్థులు ఏకమై ఎక్కడా టెండర్లు వేయలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ధరలు పెంచకపోతే సకాలంలో టెండర్లు అయ్యే అవకాశం కనిపించడం లేదనిపిస్తోంది. రూ.1.78 కోట్లతో ఆహ్వానం.. ఈ ఏడాది చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. పెద్దసైజు చేపపిల్లలు (80–100 ఎంఎం) 81.03 లక్షల చేపలకు గాను రూ.1.22 కోట్లు నిర్ణయించింది. టెండర్లు దక్కించుకున్న వారు బొచ్చ40 శాతం, రోహు 50 శాతం, మ్రిగాల 10శాతం చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న చేపపిల్లలకు (45–40 ఎంఎం) ధర రూ.56.17 లక్షలు నిర్ణయించి టెండర్లకు పిలిచింది. అయితే టెండర్లు వేసే వ్యాపారస్తులు 106.29 లక్షల చేపపిల్లలను (బొచ్చ 35శాతం, రోహు 35శాతం, బంగారుతీగ 30శాతం చొప్పున) సరఫరా చేయాల్సి ఉంటుంది. టెండర్లు వేయలేదు.. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో టెండర్లు వేసేందుకు ఈనెల 12తో గడువు ముగిసింది. అయితే టెండర్లు ఎవరూ వేయలేదు. సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉంది. – రానాప్రతాప్, జిల్లా మత్య్సశాఖ అధికారి, నారాయణపేట 2020 నుంచి చేప పిల్లల ధరలు ఇలా.. చేప పిల్లల పంపిణీ విషయంలో ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2020వ సంవత్సరంలో జిల్లాలోని 590 చెరువులు, మూడు రిజార్వాయర్‌లో వదిలేందుకు కావాల్సిన 1.60 కోట్ల చేపపిల్లల(సీడ్స్)ను రూ. 96.10 లక్షలతో కై కలూరి నుంచి కోనుగోలు చేసింది. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ. 1.04,000 చొప్పున 40లక్షలు కొనుగోలు చేయగా, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు 45,786 చొప్పున 1.20 కోట్లు కొనుగోలు చేసింది. ● 2021లో సంవత్సరంలో 1.84 కోట్ల చేప పిల్లలను చేసేందుకు టెండర్లు పిలువగా వనపర్తి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి రూ.1.49 కోట్లకు టెండర్లు వేసి సరఫరా చేశారు. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ.1.58,000 చొప్పున 43లక్షల చేప పిల్లలకు గాను రూ.67,46,600లు, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు.. లక్ష పిల్లలకు 58వేల చొప్పున రూ1.41 కోట్ల చేప పిల్లలకుగాను రూ. 82,24,980లకు సరఫరా చేశారు. ● 2022 లో టెండర్లు వేసిన వారిలో ఎల్–1 తప్పుకోవడంతో మిగతా నలుగురు కలిసి చేప పిల్లలను పంపిణీ చేశారు. చేపపిల్లలను పంపిణీ చేసిన వారిలో పద్మనాగ భూని నాగ వెంకటసూర్య సతిస్ రాజ్‌కుమార్ కై కలూరు (ఏపి) 35–40 ఎంఎం రూ.43,800, 80–100 ఎంఎంకు రూ.1,33,650కు ఎల్2గా టెండర్ దక్కించుకున్నారు. అయితే టెండర్లలో పాల్గొన్న మరో ముగ్గురు సైతం రాజ్‌కుమార్‌తో కలసి (అక్వా స్పార్క్ హచారీ నర్వ మండలం ఉందేకోడ్కు చెందిన వ్యాపారి, డి.శివకుమార్ ఆత్మకూర్ మండలం అరెపల్లికి చెందిన వ్యాపారి) చేప పిల్లలను పంపిణీ చేశారు. -
‘షాక్’ ఇచ్చింది చంద్రబాబే!.. డ్రామోజీ చెప్పని వాస్తవాలివీ
సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగడానికి గత టీడీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకమే కారణం. 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా విడుదలచేస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి (ఏపీఈఆర్సీ) సమర్పించలేదు. నిజానికి.. ఏపీఈఆర్సీ అనుమతించిన మేరకే డిస్కంలు విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతకుమించి ఒక్కపైసా కూడా వసూలు చేయడంలేదు. కానీ, ప్రజలు ఏమాత్రం భరించలేని విధంగా ప్రభుత్వం రకరకాల పేర్లతో ఇష్టారాజ్యంగా విద్యుత్ చార్జీలు పెంచిందంటూ ‘స్విచ్చేస్తే షాకే’ శీర్షికతో ఈనాడు మరో తప్పుడు కథనాన్ని మంగళవారం అచ్చేసింది..’ అంటూ ఆ పత్రిక రాతలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీలు ఐ.పృద్వీతేజ్, జె.పద్మాజనార్ధన్‌రెడ్డి, కె.సంతోష్ రావులు మంగళవారం అంశాల వారీగా వెల్లడించిన వివరాలివీ... ఆరోపణ: సామాన్యులు మోయలేనంత భారీగా గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ చార్జీలనుపెంచింది. వాస్తవం: ఈ అభియోగం పూర్తిగా అసత్యం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎంబీసీలకు వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి అప్పటివరకు అమలులో వున్న వార్షిక ట్రూఆప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి త్రైమాసిక సర్దుబాటు చార్జీల స్థానంలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సంవత్సరం జూన్ నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును అమలుచేస్తున్నాయి. అందువల్ల జూన్‌లో ఈ సంవత్సరం ఏప్రిల్ నెల విద్యుత్ కొనుగోలు చార్జీలు వర్తిస్తాయి. నిబంధనల ప్రకారం కనిష్ట గ్రిడ్ డిమాండ్ ఉన్న సీజన్లో ధరలు తక్కువుంటే ఆ తగ్గింపు కూడా వినియోగదారులకు వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమలవుతోంది. ఆరోపణ: ఉపాధి కోసం చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే చిన్న వ్యాపారులకు కూడా విద్యుత్ చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇవ్వలేదు. వాస్తవం: చిరు వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వం ఎంతో అంకితభావంతో ఉంది. అందువల్లే చిరు వ్యాపారులకు 2019 నుంచి ఇప్పటివరకూ విద్యుత్ చార్జీలు పెంచలేదు. చిరు వ్యాపారులకు మేలు చేయాలనే లక్ష్యంతోనే పలు వర్గాలకు సబ్సిడీ రూపంలో ఉచిత విద్యుత్ అమలుచేస్తోంది. సెలూన్ షాపులు నడుపుకునే వారికి నెలకు 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువనున్న గోల్డ్ స్మిత్‌లు (బంగారు ఆభరణాలు తయారుచేసే వారికి) వంద యూనిట్లు, ఇస్త్రీ దుకాణాలు నడుపుకునే రజకులకు 150 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. మరికొన్ని వర్గాల చిరు వ్యాపారులకు కూడా కొంతమేర ఉచిత విద్యుత్ అందిస్తూ సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లు నడుపుకునే వారికి కూడా రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించింది. అంతేకాక.. చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఆరోపణ: ప్రజల నుంచి ఏటా రూ.11,270కోట్లు అదనంగా వసూలుచేస్తూ ప్రభుత్వం దండుకుంటోంది. వాస్తవం: ఇది పూర్తిగా అసత్యం. ఏటా వ్యవసాయ, గృహ, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు పెరుగుతాయి. వినియోగదారులు పెరిగినట్లే వసూలు మొత్తం పెరుగుతుంది. దీనిని అదనపు వసూళ్ల కింద చూపడం సమంజసం కాదు. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ఏపీఈఆర్సీ సిఫార్సుల ప్రకారమే డిస్కంలు విద్యుత్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఇందులో కూడా ప్రభుత్వం కొంత భాగం సబ్సిడీగా భరిస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాటి ఆదాయ అవసరాల నివేదికలు ముందు సంవత్సరం సెపె్టంబర్ నెల నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తాయి. అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్యపడదు. ఆర్థిక సంవత్సరం జరుగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో వాస్తవంగా హెచ్చుతగ్గులుంటాయి. అవి విద్యుత్ చట్టంలోను, సంబంధిత నిబంధనలలో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలలోగానీ, విద్యుత్ కొనుగోలు వ్యయంలోగానీ ఉండే హెచ్చుతగ్గులు సర్దుబాటు చార్జీల ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు వసూలుచేసుకునే వెసులుబాటు ఉంటుంది. దాని ప్రకారమే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సర్దుబాటు చార్జీలు విధిస్తున్నాయి. ఆరోపణ: ట్రూ అప్, ఇంధన సర్దుబాటు, విద్యుత్ సుంకం అంటూ రకరకాల పేర్లతో విద్యుత్ బిల్లులు వసూలుచేస్తూ ప్రభుత్వం ప్రజలకు షాక్ కొడుతోంది. వాస్తవం: విద్యుత్ తయారుచేయాలంటే బొగ్గు, ఆయిల్ లాంటి అనేక ముడిపదార్థాలు అవసరం. వీటి కొనుగోలు ధర, రవాణా వ్యయం పెరిగినప్పుడు ఆ మేరకు విద్యుత్ చార్జీలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఇలా చేయక తప్పదు. గత ప్రభుత్వం ఇలా చార్జీలు వసూలుచేస్తే ఒప్పుగా, ఇప్పుడు వసూలుచేస్తే తప్పుగా ఈనాడుకు కనిపిస్తోంది. ఈ సంవత్సరం విద్యుత్ నియంత్రణ మండలి వారి టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం అన్ని వనరుల నుంచి సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.31 ఉండగా, 2023 ఏప్రిల్ నెలలో సంభవించిన అధిక ఉష్ణోగ్రతలవల్ల గ్రిడ్ డిమాండ్ అంచనాల కన్నా అధికంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం దాదాపు 617 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్ల ప్రాతిపదికన రూ.475 కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి యూనిట్‌కు రూ.0.20 ట్రూ అప్ చార్జీని డిస్కంలు వసూలుచేస్తున్నాయి. గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సుంకం పెరగలేదు. ఇదివరకు నిర్దేశించిన ప్రకారమే యూనిట్‌కు కేవలం 6 పైసలు వసూలుచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించి విద్యుత్ కొనుగోలు, సరఫరా వ్యయం ప్రతి యూనిట్‌కు దాదాపు రూ.1.0 పెరిగినప్పటికీ నిబంధనల మేరకు యూనిట్‌కు కేవలం రూ.0.40 సర్దుబాటుగా వసూలుచేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2020–21కు గాను కోవిడ్‌వల్ల విద్యుత్ డిమాండ్ కనిష్టంగా ఉన్న కాలంలో మార్కెట్ ధరలు అత్యంత కనిష్టంగా వున్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేయడంతో దాదాపు రూ.4,800 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు మిగల్చాయి. ఈ తగ్గింపు వాస్తవ ఖర్చులు ఆడిట్ అయ్యాక విద్యుత్ నియంత్రణ మండలి వారు జారీచేసిన ఆర్థిక సంవత్సరం 2022–23 టారిఫ్ ఉత్తర్వులలో పంపిణీ సంస్థల నికర వార్షిక ఆదాయ అవసరాల నుంచి తగ్గించారు. ఆరోపణ: వ్యవసాయ మీటర్లకు అమర్చే స్మార్ట్ మీటర్ల భారాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో ప్రజలపైనే వేయనుంది. వాస్తవం: వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టంగా ప్రకటించింది. అయినా ఈ ఖర్చును ఇతర వినియోగదారులపై మోపుతారని ‘ఈనాడు’ పదే పదే అబద్ధాలు అచ్చేస్తోంది. ఈ స్మార్ట్ మీటర్ల ఖర్చు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన ఉత్తర్వులిచ్చింది. స్మార్ట్ మీటర్ల సరఫరాదారుని ఎంపిక ప్రక్రియ కూడా అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారమే పూర్తయింది. -
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ జోరు తగ్గనుందా? కారణం ఇదే అంటున్న నిపుణులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరింత ప్రియం అయ్యాయి. ఇప్పటికే ప్రధాన కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను పెంచాయి. ఇతర కంపెనీలు వీటిని అనుసరిస్తున్నాయి. ఫేమ్–2 పథకం కింద ఇచ్చే సబ్సిడీకి భారీ పరిశ్రమల శాఖ కోత విధించడమే మోడళ్లు ఖరీదవడానికి కారణం. భారత్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు 2015లో కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పథకం దేశీ ఈవీ రంగానికి బూస్ట్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) హెచ్చరించింది. సబ్సిడీ తగ్గుదల ఇలా.. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్‌కు గతంలో ఇచ్చిన రూ.15,000 సబ్సిడీ కాస్తా ఇక నుంచి రూ.10,000 ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గతంలో ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. రానున్న రోజుల్లో పరిశ్రమ వాస్తవిక వృద్ధి చూస్తుందని బజాజ్ అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, 2023 మే నెలలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 1,04,755 యూనిట్లు రోడ్డెక్కాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయన్న నేపథ్యం కూడా ఈ విక్రయాల జోరుకు కారణమైంది. ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్, ఆంపియర్ టాప్–5లో నిలిచాయి. వృద్ధి వేగానికి కళ్లెం.. ప్రభుత్వ చర్యతో ఈ–టూ వీలర్ల వేగానికి కళ్లెం పడుతుందని ఎస్ఎంఈవీ తెలిపింది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, ఈ–టూవీలర్ల మధ్య ధర వ్యత్యాసం అమాంతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈవీల జోరు పెరిగే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని అవేరా ఏఐ మొబిలిటీ ఫౌండర్ రమణ తెలిపారు. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..) కస్టమర్లు సన్నద్ధంగా లేరు.. భారత్‌లో ధర సున్నితమైన అంశం అని ఎస్ఎంఈవీ ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ద్విచక్ర వాహనం కోసం అధికంగా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరని స్పష్టం చేశారు. ‘పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాల్లో అధిక భాగం మోడళ్లు రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువ. మార్కెట్ వృద్ధి చెందే వరకు సబ్సిడీలను కొనసాగించాల్సిందే. భారత్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ప్రకారం ఇది 20 శాతానికి చేరుకోవడానికి నిరంతర రాయితీలు ఇవ్వాల్సిందే’ అని వివరించారు. (ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..) వరుసలో బజాజ్ చేతక్.. బజాజ్ చేతక్ ధర రూ.22,000 పెరిగింది. దీంతో చేతక్ ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.1.44 లక్షలకు చేరింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ ధర వేరియంట్‌ను బట్టి రూ.17–22 వేల మధ్య పెరిగింది. ఏథర్ 450ఎక్స్ ప్రో సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ఓలా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. ప్రస్తుతం ఎస్1–ప్రో రూ.1,39,999, ఎస్1 రూ.1,29,999, ఎస్1 ఎయిర్ ధర రూ.1,09,999 పలుకుతోంది. ఈ–స్కూటర్ మోడల్స్ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్ ఇప్పటికే తెలిపింది. -
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సేల్స్‌లో రికార్డ్: ఓలాదే ఆధిపత్యం, ఎందుకో తెలుసా?
దేశీయ అతిపెద్ద ఈవీ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో బంపర్ సేల్స్ సాధించింది. 35వేల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేయగా, మొత్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు రికార్డు సృష్టించడం విశేషం. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) కంపెనీ గత మూడు త్రైమాసికాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో, ఓలా మే నెలలో 30శాతం పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది గత ఏడాది మే నెలలోని నమోదైన విక్రయాలతో పోలిస్తే ఏకంగా 300 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే 2023 నెలలో అద్భుతమైన పెరుగుదల నమోదైంది. తొలిసారిగా ఒకే నెలలో లక్ష మార్కును దాటడం విశేషం. ఏప్రిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 57శాతం పైగా పెరిగాయి. ఈవీ అమ్మకాలకు సంబంధించి మే నెల బెస్ట్‌గా నిలిచింది. ఏథర్, ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు మేలో తమ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?) అటు నెలనెలా తమ అమ్మకాలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయనీ, దేశంలో ఈవీ విప్లవానికి ఓలా లీడర్‌గా కొన సాగుతోందంటూ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు , సీఈవో భవిష్ అగర్వాల్ సంతోషాన్ని ప్రకటించారు. బ్రాండ్‌పై కస్టమర్ విశ్వాసాన్ని, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ, తాము జూన్ నుండి స్కూటర్ ధరలను స్వల్పంగా మాత్రమే పెంచిందన్నారు. కాగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుతోంది. కంపెనీ ఇటీవలే తన 600వ ఈసీని ప్రారంభించింది. ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది. సేల్స్ ఎందుకు పెరిగాయి? ఫేమ్ - II సబ్సిడీకి మే చివరి నెల కావడమే అధిక విక్రయాలకు ఒక కారణం. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్ అండ్ తయారీ (FAME II) పథకం కింద, వాహన ధరలో గరిష్టంగా 40 శాతం పరిమితితో కిలోవాట్-గంటకు (kWh) రూ. 15,000 సబ్సిడీని భారత ప్రభుత్వం అందిస్తోంది. 1 జూన్ 2023 నుంచి సవరించిన అమలులోకి వస్తుంది. ఈ సబ్సిడీని రూ. 10,000కి తగ్గించింది. వాహన ధరలో 15 శాతానికి పరిమితం చేసింది. ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. -
జూన్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధరలు జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్ 2 (FAME-II) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం కింద అందించే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది. 2023 జూన్ 1 ఆ తర్వాత కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఇది వర్తిస్తుంది. అంటే జూన్ 1 తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం ప్రతి కొలో వాట్-అవర్ (kWh)కి రూ. 10,000 మాత్రమే ఉంటుంది. అది కూడా వాహనాల ఎక్స్-షోరూం ధరలో గరిష్టంగా 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇది గతంలో 40 శాతం ఉండేది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీలు జూన్ 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే తమ ద్విచక్ర వాహనాల ధరలు రూ.32,500 వరకు పెరుగుతాయని ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, పరిశ్రమలు సబ్సిడీ లేకుండా జీవించడం నేర్చుకోవాలని ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా అన్నారు. 2019లో రూ.30,000 ఉన్న సబ్సిడీ 2021లో రూ.60,000కి పెరిగిందని, ఇప్పుడు రూ.22,000 తగ్గిందని ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి ఫేమ్ (FAME) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని 2019 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట్లో మూడేళ్ల కాలానికి దీన్ని ప్రకటించినా తర్వాత 2024 మార్చి 31 వరకు మరో రెండేళ్ల కాలానికి పొడిగించింది. ఇదీ చదవండి: Heavy Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు! -
ఈ–బైక్ కొనాలంటే.. త్వరపడండి!
సాక్షి, అమరావతి: ఈ–బైక్ కొనాలనుకుంటున్నారా. అయితే, త్వరపడండి. ఈ ఏడాది జూన్ 1వ తేదీ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్–2 (దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం) పథకం కింద అందించే సబ్సిడీని తగ్గించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బైక్స్‌పై 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ లభిస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా.. కేంద్ర నిర్ణయంతో ఇకపై వాహన ధరలో కేవలం 15 శాతం లేదా కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్)కు రూ.10 వేలు ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీగా లభించనుంది. భారీ షాక్ ఇది విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఏఎంఈ) పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం 2019–22 మధ్య మూడేళ్ల కాలానికి ఫేమ్ పథకంలో రూ.10 వేల కోట్లను కేటాయించింది. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)లను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించాయి. ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్రం ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దీనిద్వారా ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది. ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌కు రూ.15 వేలను, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.10 వేలను, బస్సులకు రూ.20 వేలను రాయితీగా అందిస్తోంది. దీంతో ఏపీలో దాదాపు 22 వేలు, దేశవ్యాప్తంగా 4 లక్షల విద్యుత్ వాహనాల విక్రయం జరిగింది. కానీ సబ్సిడీని కుదిస్తున్నట్టు ప్రకటించి తాజాగా కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే 4.9 శాతమే నిజానికి అంతర్జాతీయంగా ఈవీల శాతం పెట్రోల్ వాహనాలతో పోలిస్తే 20 శాతంగా ఉంది. మన దేశంలో ఇది కేవలం కేవలం 4.9 శాతం మాత్రమే. కనీసం అంతర్జాతీయ బెంచ్ మార్క్‌ను చేరుకునే వరకైనా రాయితీలను కొనసాగిస్తే మంచిదనే వాదనలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి చెప్పుకొచ్చింది. రానున్న నాలుగేళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది. కానీ ఒక లీటర్ పెట్రోల్ 2.3 కిలోల కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఈవీల కొనుగోలు తగ్గితే 2030 నాటికి 1 మిలియన్ కర్బన ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావం దీర్ఘకాలం పరిశ్రమపై ఉంటుందని వివరించింది. అయితే ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోని స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత నమోదయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్పులు చేస్తూ నోటిఫై చేసింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 సబ్సిడీ ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. ప్రభుత్వ చర్యతో ముడి చమురు దిగుమతుల అధిక బిల్లులకు, చాలా భారతీయ నగరాల్లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి దారితీయవచ్చని సొసైటీ వివరించింది. సున్నితమైన ధర.. ‘వాస్తవికత ఏమిటంటే భారతీయ మార్కెట్లో ధర సున్నితంగా ఉంటుంది. మొత్తం ఖర్చుకు వెనుకాడతారు. ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరు. పెట్రోలు ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రూ.1 లక్ష కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. మార్కెట్ వృద్ధి చెందే వరకు కస్టమర్‌కు సబ్సిడీలను కొనసాగించాలి. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం ఈవీల వాటా 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ప్రకారం ఇది 20 శాతం చేరుకోవడానికి నిరంతర రాయితీలు అనువైనవి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి సూచనను ఇచ్చింది. నాలుగేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసిందని గిల్ చెప్పారు. అకస్మాత్తుగా సబ్సిడీని నిలిపివేయడం, బడ్జెట్‌ను బాగా తగ్గించడం లేదా ఈ–త్రీవీలర్ల బడ్జెట్ నుండి కొంత ఖర్చు చేయని డబ్బును మళ్లించడం ద్వారా మిగిలిన సంవత్సరాన్ని ఎలాగైనా నిర్వహించడం మినహా మంత్రిత్వ శాఖకు మరో మార్గం లేదని అన్నారు. సమయం ఆసన్నమైంది.. సబ్సిడీని 15 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, డిమాండ్ ఉందని స్పష్టమైందని వోల్టప్ కో–ఫౌండర్ సిద్ధార్థ్ కాబ్రా తెలిపారు. సబ్సిడీ తగ్గింపు తక్షణ ప్రభావంతో ధరల పెరుగుదలతోపాటు అమ్మకాలు తగ్గుతాయి. అయితే ప్రభుత్వం ఒక విధంగా పరిశ్రమను స్వతంత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. పరిశ్రమ, ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చేలా నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడే సమ్మిళిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విధానాన్ని రూపొందించడానికి కృషి చేయాలి’ అని కాబ్రా పిలుపునిచ్చారు. హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కో–ఫౌండర్ నిఖిల్ భాటియా మాట్లాడుతూ ప్రభుత్వ చర్యకు మద్దతు ఇస్తూనే.. ‘ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడటానికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం దీర్ఘకాలిక పురోగతి, జీవనోపాధికి మరింత ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండాలి. రాయితీలను తొలగించడం అనేది ముందుకు సాగే చర్య. సబ్సిడీలపై ఆధారపడటం క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సబ్సిడీలు ఇకపై అవసరం లేదు. ఫేమ్–2 సబ్సిడీని తగ్గించడం, తొలగించడం సరైన దిశలో స్వాగతించే దశ’ అని భాటియా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తే ఆ భారం కస్టమర్లపై పడే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ప్రస్తుతం ఫేమ్ (FAME) 2 పథకం కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న దానిపై చాలా కాలంగా అనేక పుకార్లు ఉన్నాయి. వీటి ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిందని, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను పూర్తిగా నిలిపివేయనుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారికంగా ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని నిర్ణయించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త ఫార్ములాను ప్రతిపాదించినట్లు ఫినాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంటోంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం 40 శాతం ప్రకారం కిలోవాట్‌కు ఇస్తున్న రూ.15,000 సబ్సిడీ రూ.10,000లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. సబ్సిడీపై గరిష్ట పరిమితిని కూడా ప్రస్తుత 40 శాతం నుంచి ఎంఆర్పీలో 15 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు రూ.1.5 లక్షల ధర, 3.5 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రస్తుతం రూ.52,500 సబ్సిడీ వస్తుంది. కొత్త ఫార్ములా ప్రకారం సబ్సిడీ రూ.22,500 లకు తగ్గిపోతుంది. ఫేమ్ 2 పథకం కింద వచ్చే ఏడాది నాటికి పది లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మద్దతునిచ్చేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ వాహనాలపై సబ్సిడీ మాత్రం తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్ -
karnataka assembly elections 2023: మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా: రాహుల్
ఉడుపి/మంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ కర్ణాటక మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని, లీటర్ డీజిల్‌పై రూ.25 చొప్పున రాయితీ ఇస్తామని, రోజుకు 500 లీటర్ల డీజిల్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, మత్స్యకార మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గురువారం ఉడుపి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు. కేవలం హామీలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కాదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. -
త్రైమాసిక నివేదికలివ్వండి
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు సంబంధించిన ఆడిట్ వివరాలు, బిల్లుల లెక్కలను ఏపీఈఆర్సీకి ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర డిస్కంలకు సూచించింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సేకరిస్తుందని తెలిపింది. ఒకవేళ డిస్కంలు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నట్టు తేలితే కేంద్రం నుంచి ప్రస్తుతం డిస్కంలకు అందుతున్న రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని, జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005కి సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ నిబంధనల ప్రకారం.. విద్యుత్ సబ్సిడీ, దాని అకౌంటింగ్‌ను క్రమబద్ధీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ పంపిణీ వివరాలను డిస్కంల నుంచి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ సబ్సిడీకి సబ్సిడీ కేటగిరీ, వినియోగదారుల కేటగిరీ వారీగా వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన కచ్చితమైన లెక్కల ఆధారంగా డిస్కం సబ్సిడీ డిమాండ్‌ను పెంచారా లేదా అనే వివరాలు నివేదికలో ఉండాలని పేర్కొంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్–65 ప్రకారం సబ్సిడీకి సంబంధించిన వాస్తవ చెల్లింపు వివరాలు, ఇతర సంబంధిత వివరాల్లాగే చెల్లించాల్సిన సబ్సిడీ, చెల్లింపులో అంతరం వివరాలు కూడా నివేదికలో ఉండాలని చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘టైమ్ ఆఫ్ డే’ విధానానికీ సవరణ రోజులో గంటల లెక్కన విద్యుత్ ధరల ప్రకారం బిల్లులు విధించే ‘టైమ్ ఆఫ్ డే’ విధానంలోనూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమలకే పరిమితమైన ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సర్విసులకు వర్తింపజేసేలా ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకూ రాయితీ లభించనుంది. అయితే, ఇందుకోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. -
ఫేమ్-2 పెంపుపై ఈవీ పరిశ్రమల డిమాండ్ - మరో నాలుగేళ్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారత రోడ్లపై దూసుకెళ్తున్నాయి. సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021–22 విక్రయాలతో పోలిస్తే ఏకంగా రెండున్నర రెట్లకుపైగా వృద్ధి నమోదు కావడం విశేషం. ఎలక్ట్రిక్ టూ వీలర్లు 2021–22లో భారత్‌లో 3,27,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ భారం నుంచి బయటపడేందుకు, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సబ్సిడీలతో ప్రోత్సహించడం కలిసి వచ్చే అంశం. విభాగాల వారీగా ఇలా.. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గంటకు 25 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణించే హై స్పీడ్ ఈ–టూ వీలర్లు 7,26,976 యూనిట్లు విక్రయం అయ్యాయి. 2021–22లో లో స్పీడ్ 75,457 యూనిట్లు, హై స్పీడ్ 2,52,443 యూనిట్లు రోడ్డెక్కాయి. నీతి ఆయోగ్ లక్ష్యం, ఇతర పరిశోధన సంస్థల అంచనాల కంటే 25 శాతం తక్కువ స్థాయిలో గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. పరిశ్రమకు అడ్డంకులు.. దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) పథకం కింద మార్గదర్శకాలను పాటించనందుకు ఫేమ్–2 రాయితీలను నిలిపివేయడం ఈ–టూ వీలర్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని ఎస్ఎంఈవీ తెలిపింది. ‘స్థానికీకరణలో జాప్యం సాకుతో వినియోగదారులకు ఒరిజినల్ పరికరాల తయారీదారులు (ఓఈఎం) ఇప్పటికే బదిలీ చేసిన రూ.1,200 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీని అకస్మాత్తుగా నిలిపివేయడం హాస్యాస్పదం. అలాగే తక్కువ ఇన్వాయిస్ చేశారనే ఆరోపణ కారణంగా ఖరీదైన ఈ–టూ వీలర్లను తయారు చేస్తున్న ఓఈఎంలకు చెందిన మరో రూ.400 కోట్లు నిలిచిపోయాయి. దీని పర్యవసానంగా మూలధన నిధుల కొరతతో వారి వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయి. నేడు పరిశ్రమలో 95 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16 కంపెనీలు ప్రస్తుత గందరగోళ పరిస్థితి నుంచి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. 2023–24లో తమ వ్యాపార ప్రణాళికలు చేసుకోవడానికి వీలుగా ఫేమ్ దశలవారీ తయారీ కార్యక్రమం తాలూకా అడ్డంకులకు తొలగించాలని విన్నవిస్తున్నాయి’ అని వివరించింది. ఎండమావిలా లక్ష్యం.. ద్విచక్ర వాహన రంగంలో 2022–23లో ఈ–టూ వీలర్ల వాటా 5% మాత్రమే. స్వల్పకాలిక లక్ష్యం 30 శాతం. 2030 నాటికి ఇది 80 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యం మరింత ఎండమావిలా కనిపిస్తోందని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ అన్నీ కోల్పోలేదు. ఈ రంగాన్ని తిరిగి గా డిలో ఉంచగలిగేది దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) అర్హత ప్రమాణాలను రెండేళ్లు పొడిగించడం. అలాగే దీనిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఖచ్చితంగా అమలు చేయడం. ఫేమ్ పథకం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం మొత్తం పరిశ్రమ విధిని నిర్ణయించే కీలకాంశం. ఈ విషయంలో ప్రభు త్వం నుంచి స్పష్టత కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదు రుచూస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్వయం–సమర్థ వంతంగా చేయడానికి కనీసం 3–4 ఏళ్ల పాటు ఫేమ్ పథకాన్ని పొడిగించడం చాలా ముఖ్యం’ అని తెలిపారు. కస్టమర్లకే నేరుగా సబ్సిడీ.. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం వల్ల దీర్ఘకాలిక వ్యూహాన్ని అభివృద్ధి చేయడం కంపెనీలకు కష్టతరం అవుతోందని గిల్ వివరించారు. ‘సబ్సిడీలలో ఏదైనా ఆకస్మిక తగ్గింపు వృద్ధిపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. ఈ–మొబిలిటీ కోసం ప్రభుత్వ ప్రణాళికను ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుత విధానంలో తయారీదార్లు సబ్సిడీని కస్టమర్‌కు బదిలీ చేస్తారు. విక్రయం తర్వాత ప్రభుత్వం నుండి క్లెయిమ్ చేసుకుంటారు. ఇది మోసపూరితంగా సబ్సిడీని క్లెయిమ్ చేయడానికి ఓఈఎంలు అమ్మకాలను మార్చడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం నేరుగా కస్టమర్‌కు ప్రోత్సాహకాలను చెల్లించడానికి ప్రత్యక్ష సబ్సిడీ విధానాన్ని ప్రవేశపెట్టాలి’ అని వివరించారు. -
పడకేసిన సాగు యాంత్రీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రక్రియ మూడేళ్లుగా మూలనపడింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లలో రూ. వందల కోట్లు కేటాయించినా ఆ మేరకు పరికరాలు కొనుగోలు చేసి రైతులకు అందించడంలో వ్యవసాయ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. యంత్రాల ధరల నిర్ధారణకు ముందు వాటి మార్గదర్శకాలపై ప్రతిపాదనలను పంపా లని ‘ఆగ్రోస్’విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు స్పందించలేదు. మరో రెండు నెలల తర్వాత వానాకాలం సీజన్ మొదలు కాబోతున్నా కనీసం దుక్కు యంత్రాలు, తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021–22 బడ్జెట్లో యంత్రాల సబ్సిడీకి రూ. 1,500 కోట్లు, 2022–23 బడ్జెట్లో రూ. 500 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించినా వ్యవసాయ యంత్రాలు రైతులకు సరఫరా కావడం లేదు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఖరీదైన పనిముట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2018 వరకు ట్రాక్టర్లు సరఫరా: తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టిసారించింది. అంతేకాదు.. వాటిపై రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ప్రకటించింది. 2018 వరకు భారీగా ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చింది. వ్యవసాయ యంత్రాలు తీసుకొనే ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. ఒకేసారి గ్రూపునకు లేదా వ్యక్తిగతంగా కూడా వాటిని అందించింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. సబ్సిడీ నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత రైతులకు యంత్రాల పంపిణీ చూస్తే దాదాపు రెండింతలైంది. దీంతో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగు నీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. నిలిచిన ప్రక్రియ... 2018 తర్వాత యంత్రాల సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ట్రాక్టర్ల బదులు వరి నాటు యంత్రాలతోపాటు కొన్ని చిన్నచిన్న పరికరాలను రైతులకు ఇవ్వాలని భావించిన వ్యవసాయ శాఖ ఆ ప్రక్రియ అమల్లో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఒక్కో వరి నాటు యంత్రం ధర కంపెనీలను బట్టి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉండగా దాదాపు 5 వేల యంత్రాలను సరఫరా చేయాల్సి రావొచ్చని ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో మాత్రం విఫలమైంది. రెండేళ్లకోసారి యంత్రాల ధరలను నిర్ణయించి ఖరారు చేయాల్సి ఉండగా వాటి నిర్ధారణ ప్రతిపాదనలు కూడా పంపలేదు. కస్టమ్ హైరింగ్ సెంటర్లూ లేవు ఓలా, ఉబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించి భారీ కోత, నాటు మెషీన్లు బుక్ చే సుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని గతంలో వ్య వసాయశాఖ చెప్పింది. అయితే ఇంతవరకు ఆ సెంటర్లు ఎలా ఉండాలి? ఎవరి ఆధ్వర్యంలో నడిపించాలనే దానిపై స్పష్టత లేదు. -
రుణమెప్పుడొస్తది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను రుణం కింద సమకూర్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే సబ్సిడీ గొర్రెల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలిచ్చారు. ఆ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు. కానీ, ఈ పథకం రెండో దఫా రాష్ట్రంలో అమలు చేయాలంటే రూ.4,565 కోట్ల రుణం కావాలి. ఈ రుణాన్నిచ్చేందుకు జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ఆమోదం తెలిపి కూడా ఆరునెలలు దాటిపోయింది. కానీ, ప్రభుత్వ పూచీకత్తు లభించకపోవడంతో ఆ ఆమోదం కాగితాలకే పరిమితం అయింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదంతో ఆ రుణం ఎప్పుడు వస్తుందా అని పశుసంవర్ధక శాఖ అధికారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటివరకు గొర్రెల కొనుగోలు కోసం తమ వద్ద ఉన్న రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టగలమని, ఆ తర్వాత ఎన్సీడీసీ రుణంపైనే ఆధారపడాల్సి ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు రుణం వస్తుందనే ఆశతో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నగదు బదిలీతో కాదు.. వాస్తవానికి, ఈ పథకం కింద గొర్రెల పంపిణీని నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినా ఆ తర్వాత వెనక్కు తగ్గింది. పైలట్‌గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమచేసి గొర్రెలు కొనుగోలు చేపట్టింది. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మళ్లీ పాత తరహాలోనే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్దిదారుల వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా కాంట్రాక్టు టెండర్లను జిల్లా స్థాయిలో పిలవగా, ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది. ఈ టెండర్ల ఖరారయిన తర్వాత గొర్రెల కొనుగోలు, పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెపుతున్నారు. కొనుగోలు బాధ్యత జిల్లా అధికారులకు.. కొనుగోలు కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పజెపుతున్నారు. గతంలో మండల స్థాయిలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కొనుగోళ్లు జరిపించగా, ఈసారి మాత్రం జిల్లా స్థాయి అధికారులతో (డీఆర్వో, ఆర్డీవో, పీడీ డీఆర్డీఏ, జిల్లా వ్యవసాయాధికారులు, ఇతర శాఖలకు చెందిన జిల్లా అధికారులు) కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు. గొర్రెల కోసం ఇప్పటివరకు 30వేల మందిలోపు లబ్దిదారులే డీడీలు తీయగా, మిగిలిన వారి చేత కూడా డీడీలు కట్టించే పనిలో స్థానిక అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఏప్రిల్ 14 తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అమలు చేపడతామని, ఏప్రిల్ నెలాఖరు కల్లా ఎన్సీడీసీ రుణం వస్తుందని ఆశిస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ
-
Puducherry: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్ సిలింబర్ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే. -
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. వందేభారత్ రైళ్ల ఉత్పత్తిపై ఆందోళన వందేభారత్ రైళ్ల తయారీ మందగమనంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2022–23లో 35 రైళ్లు తయారవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 8 రైళ్లే సిద్ధమయ్యాయి. లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, రైలు ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరాలన్నా వందేభారత్ రైలు ఇంజన్లు, బోగీల తయారీ వేగాన్ని ముమ్మరం చేయాలి. ఇందుకోసం పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేశాఖ సాంకేతిక తోడ్పాటు అందించాలి’’ అని సూచించింది. -
ఆక్వా రైతులకు శుభవార్త
-
బడ్జెట్ 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ( PMAY) ఈ సారి బడ్జెట్లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పీఎంఏవై కేటాయింపుల పెంపు గృహ రుణాలకు డిమాండ్‌ను పెంచడమే కాకుండా, సిమెంట్ రంగానికి కూడా సానుకూలాంశమని చెప్పచ్చు. దేశ ప్రజలకు పక్కా ఇళ్లను అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ప్రధన మంత్రి ఆవాస యోజన ని ప్రారంభించింది. మధ్య ఆదాయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు (LIG) వారికి సహాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు. -
పోటాపోటీగా పేటెంట్లు.. రాయితీలతో కేంద్రం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పేటెంట్ల విషయంలో పోటీపడుతున్నాయి. వీటిల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత పగడ్బందీగా కొనసాగిస్తుండడంతో కొత్త ఆవిష్కరణలతో స్వయం సమృద్ధికి వీలుగా మేథో సంపత్తి హక్కుల (ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ రైట్స్) సాధనలో పురోగతి సాధిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ ఉన్నత విద్యా సంస్థల్లో చేపట్టే ఆవిష్కరణలకు పేటెంట్లు కల్పించడంలో 80 శాతం ఫీజు రాయితీలు ఇవ్వడం కూడా నూతన ఆవిష్కరణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఈ సంస్థలలో పేటెంట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నిజానికి.. ఏదైనా సంస్థ పేటెంట్ దాఖలు చేయాలంటే ముందుగా రూ.20వేల ఖర్చుపెట్టాలి. ఆ తరువాత వాటి పరిశీలన తదితర ప్రక్రియలలో మరికొంత మొత్తాన్ని ఛార్జీలుగా చెల్లించాలి. దీనికి అదనంగా.. పేటెంట్ చేసే వ్యక్తి 20 ఏళ్లపాటు దాని నిర్వహణ రుసుమును కూడా జమచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నత విద్యాసంస్థల్లో పేటెంట్లపై ఆసక్తి కనబర్చలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా చట్టాన్ని సవరించి 80 శాతం రాయితీలను ప్రకటించడంతో క్రమేణా పేటెంట్లు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. నూతన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని.. వాటి ద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలుచేయాలని సూచించింది. సమగ్ర పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థిక సహకారం కూడా అందించేలా మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా అధ్యాపకులు, పరిశోధక అభ్యర్థులకు నిధులు కూడా ఇస్తోంది. ఇలా ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. పేటెంట్ల వాణిజ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఏయూలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ఈ పేటెంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో మేథో సంపత్తి హక్కుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రం డాక్యుమెంటేషన్ ప్రక్రియను పర్యవే„ìక్షించడంతో పాటు దాఖలుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు తమ మెంటార్ల మార్గదర్శకత్వంలో వినూత్న ప్రాజెక్టుల పేటెంట్ల దాఖలుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. 2020–21లో విద్యాసంస్థలు, ఇతర పరిశోధనా సంస్థలు అందించిన పేటెంట్ దరఖాస్తులు 58,503గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర 4,214, తమిళనాడు 3,945, కర్ణాటక 2,784, యూపీ 2,317, తెలంగాణ 1,662, పంజాబ్ 1,650, ఢిల్లీ 1,608, గుజరాత్ 921, హర్యానా 765, ఆంధ్రప్రదేశ్ 709, పశ్చిమ బెంగాల్ 505 రాజస్థాన్ 449, కేరళ 426, మధ్యప్రదేశ్ 398, ఒడిశా 144, పాండిచ్చేరి నుంచి 139 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్లలో ముందున్నవి ఇవే.. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు అత్యధిక సంఖ్యలో పేటెంట్లను దాఖలు చేయడంలో ముందున్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్ (సీజీపీడీటీఎం) నివేదిక ప్రకారం 2019–2020లో టాప్–10 విద్యాసంస్థలు అందించిన పేటెంట్ల సంఖ్య 2,533 కాగా.. 2020–21లో ఆ సంఖ్య 3,103కి పెరిగింది. 2019–20లో ఐఐటీలు 664 పేటెంట్లను దాఖలు చేశాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగఢ్ వర్సిటీ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తక్కిన పేటెంట్లకు దరఖాస్తు చేశాయి. అలాగే, 2020–21లో ఐఐటీలు 640 పేటెంట్లు ప్రకటించగా తక్కిన సంస్థల్లో అవి మరింత మెరుగుపడ్డాయి. ఈ వర్సిటీల్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసి ఈ పేటెంట్లను దాఖలు చేశాయి. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
‘ఫిష్ ఆంధ్రా’తో ఇంటి ముంగిటకే మత్స్య ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: వినియోగదారుల ముంగిటకే చేపలు, రొయ్యల విక్రయ వాహనాలు (ఫిష్ వెండింగ్ వెహికల్స్) రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై వాటిని ప్రజల ముంగిటకే చేర్చే ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు 40 నుంచి 60 శాతం సబ్సిడీపై మొబైల్ త్రీ వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, ఫోర్ వీలర్ మొబైల్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్ అందజేస్తోంది. మూడు చక్రాల వాహనం ధర రూ.4 లక్షలు కాగా.. నాలుగు చక్రాల వాహనం ధర సైజును బట్టి రూ.12 లక్షల నుంచి రూ.23 లక్షలుగా నిర్ణయించారు. వీటిపై ఎస్సీ, ఎస్టీతోపాటు మహిళా లబ్ధిదారులకు 60 శాతం చొప్పున, ఇతరులకు 40 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారులు చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా సమకూరుస్తారు. తొలి విడతగా 450 వాహనాలు ఈ వాహనాలను సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేస్తుండగా.. తొలి విడతలో 300 త్రీ వీలర్, 150 ఫోర్ వీలర్ వాహనాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. తొలి వాహనాన్ని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఉప్పుల సుందరరావు అనే ఎస్సీ లబ్ధిదారునికి సోమవారం అందజేశారు. వాహనాల్లో ప్రత్యేకతలివే.. మూడు చక్రాల వాహనంలో 200 కేజీల మత్స్య ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 20 లీటర్ల సామర్థ్యం గల రెండు ఐస్ బాక్స్‌లు, వేయింగ్ మెషిన్, మైక్ సౌకర్యం, మత్స్య ఉత్పత్తులను డ్రెస్సింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. నాలుగు చక్రాల వాహనంలో అయితే.. వాహన రకాన్ని బట్టి 2 నుంచి 8 టన్నుల వరకు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. అత్యాధునిక డ్రెస్సింగ్, రెడీ టూ ఈట్ కుకింగ్ చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటిద్వారా లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటెడ్ అండ్ కుక్డ్ ప్రొడక్టŠస్ను రిటైల్, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా అమ్ముతారు. స్నాక్స్, ఇన్స్టెంట్ కుకింగ్ ఫుడ్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
ఎరువుల సబ్సిడీ రూ.2.5 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 2.3–2.5 లక్షల కోట్లకు పెరుగుతుందని పరిశ్రమల సంఘం– ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఐ) అంచనావేసింది. అయితే 2023–24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ బిల్లు 25 శాతం తగ్గవచ్చని పరిశ్రమల సంఘం ఎఫ్ఏఐ తెలిపింది. గ్లోబల్ ధరల్లో తగ్గుదల దీనికి కారణం అవుతుందని పేర్కొంది. యూరియా స్థిర ధరను పెంచకపోవడంతో ఈ కర్మాగారాల మనుగడపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పరిశ్రమ చాలా తక్కువ మార్జిన్లో నడుస్తోందని, ఇది ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తోందని కూడా సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న రబీ (శీతాకాలం–సాగు) సీజన్‌కు యూరియా, డీఏపీసహా తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని కూడా పరిశ్రమల సంఘం తెలిపింది. ఎఫ్ఏఐ ప్రెసిడెంట్ కేఎస్ రాజు పరిశ్రమకు సంబంధించి విలేకరులకు తెలిపిన ముఖ్యాంశాల్లో కొన్ని.. ► ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 2.3–2.5 లక్షల కోట్ల స్థాయికి పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయంగా ఎరువులు, ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం వల్ల అన్ని ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం నుంచి దేశీయ రైతులను రక్షించేందుకు ఈ స్థాయి సబ్సిడీలు దోహదపడుతున్నాయి. 2021–22లో సబ్బిడీ భారం రూ.1.62 లక్షల కోట్లు. ► గత రెండేళ్లలో సహజవాయువు, ఎల్ఎన్జీతో సహా ఎరువులు– ఎరువుల ముడి పదార్థాలకు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయి. ► కొన్ని ధరలు ఇటీవలి నెలల్లో తగ్గుముఖం పట్టాయి. అయితే మహమ్మారికి ముందు కాలం కంటే ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి. డీఏపీ అంతర్జాతీయ ధర (సీఎఫ్ఆర్– వ్యయం భారత్‌కు సరకు రవాణా) ఏప్రిల్ 2021న టన్నుకు 555 డాలర్లు ఉంది. అయితే ఈ ధర జూలై 2022నాటికి 945 డాలర్లకు పెరిగింది. ఇది 2022 అక్టోబర్‌కు మళ్లీ 722 డాలర్లకు తగ్గింది. ► అలాగే ఫాస్పోరిక్ యాసిడ్ ధర ఏప్రిల్ 2021లో టన్నుకు 876 డాలర్లు ఉంది. 2022 జూలై నాటికి టన్నుకు 1718 డాలర్లకు పెరిగింది. అయితే ఇది 2022 అక్టోబర్‌కు 1355 డాలర్ల స్థాయికి తగ్గింది. ► యూరియా విషయానికి వస్తే, 2021 ఏప్రిల్‌లో టన్నుకు 400 డాలర్లు ఉంది. 2021 డిసెంబర్ నాటికి 1000 డాలర్లకు చేరింది. తాజాగా టన్నుకు 600 డాలర్లకు తగ్గింది. ► యూరియా స్థిర ధర, ఇంధన వినియోగ నిబంధనలు వంటి అంశాల్లో యూరియా పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతికూలతలను పరిష్కరించాలి. ► 2022 ఏప్రిల్–అక్టోబర్ 2022లో యూరియా, డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్) ఎస్ఎస్పీ వార్షికంగా వరుసగా 16.0 శాతం, 14.2 శాతం, 9.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎన్పీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువుల ఉత్పత్తి ఈ కాలంలో 5.2 శాతం క్షీణతను నమోదు చేసింది. ► 2022 ఏప్రిల్–అక్టోబర్‌లో డీఏపీ ఎన్పీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు వరుసగా 45.2 శాతం, 76.1 శాతం పెరిగాయి. అయితే, యూరియా, ఎంఓపీ దిగుమతులు వరుసగా 12.9 శాతం, 7.3 శాతం తగ్గాయి. ► భారతీయ ఎరువుల రంగం పేలవమైన లాభదాయకతతో పనిచేస్తోంది. 24 ఎరువుల కంపెనీలకు సంబంధించి అందించిన డేటా ప్రకారం... గత ఐదేళ్లలో (2017–18, 2018–19, 2019–20, 2020–21, 2021–22) పరిశ్రమ నికర లాభం వరుసగా 0.61 శాతం, 0.39 శాతం, 0.64 శాతం, 2.47 శాతం, 1.39 శాతాలుగా ఉన్నాయి. ► ఇటువంటి అతి తక్కువ మార్జిన్లు ఇప్పటికే చేసిన పెట్టుబడులకే సవాళ్లుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ రంగంలో తాజా పెట్టుబడులను, ప్రత్యేకించి, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవుతుంది. -
డీజిల్ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్! ఆటోలకు రూ.15 వేల సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ వాహనలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 5 వేల ఆటోలకు బ్యాటరీలు బిగించి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో 500 ఆటోలకు బ్యాటరీలు అమర్చాలని భావిస్తోంది. ఒక్కో ఆటోకు రూ.15 వేల సబ్సిడీని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు త్వరలో టెండర్లు పిలవాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలకు నెలవారీ అద్దె కింద ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాలే తీసుకునేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా 138 చార్జింగ్ కేంద్రాలు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో 138 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో 118, వరంగల్, కరీంనగర్ నగరాల్లో చెరో 10 చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు తాజాగా టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో రెవెన్యూ షేరింగ్ విధానంతోపాటు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పర్యాటక, పౌర సరఫరాల, రోడ్డు, రవాణా శాఖలు తమ పరిధిలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన 979 స్థలాలను గుర్తించి టీఎస్ రెడ్కోకు జాబితాను అందజేశాయి. జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖల స్థలాలను ఇప్పటికే అధీనంతోకి తీసుకోగా, మిగిలిన శాఖలతో రెవెన్యూ షేరింగ్ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి రెడ్కో చర్యలు తీసుకుంటోంది. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు 20 మంది ఆపరేటర్లను ఎంప్యానల్ చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి రుణాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారులను ప్రోత్సహించేందుకు 18 బ్రాండ్లతో రెడ్కో ఒప్పందం కుదుర్చుకుంది. తయారీదారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంలు, సింగరేణితో కలిసి త్వరలో ఓ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తయారీదారులకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు సహకరించనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ప్రాచుర్యం కల్పించేందుకు త్వరలో మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నామని టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా రుణాలతోపాటు చార్జింగ్ కేంద్రాలను మానిటరింగ్ చేసే వీలుంటుందని తెలిపారు. -
వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్
(బివి రాఘవ రెడ్డి) ఈ భూ మండలంలో రెండు విలువైన సంపదలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లు కాగా.. మరొకటి ప్రకాశం జిల్లా చీమకుర్తి భూగర్భంలో ఉన్న గెలాక్సీ బ్లాక్ గ్రానైట్. 45 ఏళ్ల కిందట.. తనకు రోజూ మంచి కాఫీ ఇస్తున్నాడన్న అభిమానంతో చీమకుర్తి తహశీల్దార్ వెంకటేశ్వర్లు.. ఆఫీసు ఎదురుగా ఉన్న ఓ టీస్టాల్ యజమానికి సాగు చేసుకోమంటూ రెండెకరాలకు పట్టా రాసిచ్చారు. పశువుల మేత కూడా మొలవని ఆ భూమి నాకెందుకంటూ అతను పట్టా తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఆ భూమి విలువ ఇప్పుడు ఎకరా రూ.3 కోట్లు! చీమకుర్తికి 4 కి.మీ దూరంలో రాళ్లు, రప్పలు, రేగుచెట్లతో నిండిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో 1978లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న వేమా ఎల్లయ్య రామతీర్థం కేంద్రంగా పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. అదే భూమి గర్భంలో రూ.వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉన్నట్లు తర్వాత కాలంలో బయట పడింది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ మరింతగా వెలుగులు విరజిమ్మనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో విదేశాలకు ఎగుమతులు పెరగటంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో పాదయాత్రకు వచ్చిన సందర్భంగా గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు ఇచ్చిన హామీ మేరకు జీఓ నంబరు 58ని ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రకారం అక్టోబర్ 1 నుంచి కొత్త స్లాబ్ సిస్టం అమలులోకి రానుంది. సింగిల్ కట్టర్ బ్లేడ్ ఉన్న ఫ్యాక్టరీ యజమాని రూ.27 వేలు చెల్లిస్తే 22 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయిని ప్రాసెస్ చేసుకునేందుకు అనుమతి వస్తుంది. మల్టీ కట్టర్ బ్లేడ్ ఫ్యాక్టరీ అయితే రూ.54 వేలు చెల్లించి 44 క్యూబిక్ మీటర్ల రాయిని ప్రాసెస్ చేసుకోవచ్చు. విద్యుత్ చార్జీల రాయితీపైనా త్వరలో జీవో విడుదల కానుంది. ఆ మేరకు యూనిట్‌కు రూ.2 రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఒక్కో ఫ్యాక్టరీ యజమానికి నెలకు కనీసం రూ.లక్ష ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు రా మెటీరియల్‌ను క్వారీ యజమానుల వద్ద నేరుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. విజిలెన్స్ దాడుల భయం లేకుండా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. రామాయపట్నం పోర్టు ఇక్కడి ఎగుమతిదారులకు వరం కానుంది. రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఇప్పటికే 1650 గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 60 అధునాతన ఫ్యాక్టరీలు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యాయి. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే యజమానులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం జనరల్ కేటగిరీ, బీసీ వర్గాలకు 30 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 45 శాతం సబ్సిడీ వస్తుంది. దీంతో బ్యాంకుల్లో రుణం తీసుకున్న రెండు మూడు సంవత్సరాల్లోనే తీర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వ సహకారం బాగుండటంతో ఏటేటా ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన మూడేళ్లలోనే 250కి పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మరో 90 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదికి 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఎగుమతి జిల్లా నుంచి ఏడాదికి 8.82 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ చైనా, ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్, టర్కీ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. అందులో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఒక్కటే 6.25 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతి అవుతుంది. బ్లాక్ గ్రానైట్ ఏడాదికి 80 వేల క్యూబిక్ మీటర్లు, కలర్ గ్రానైట్ 1.77 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతవుతోంది. వెలికితీసిన గ్రానైట్ విలువ రూ.1.26 లక్షల కోట్లు! ఇక్కడ గ్రానైట్‌ను గుర్తించిన తొలినాళ్లలో ఏడాదికి 11 వేల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికి తీసినా ప్రస్తుతం పది లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు. 35 ఏళ్లలో సరాసరిన ఏడాదికి 4 లక్షల క్యూబిక్ మీటర్ల వంతున లెక్కగట్టినా 1.40 కోట్ల చ.మీటర్ల గ్రానైట్ రాయిని తవ్వి తీసినట్లు అంచనా. క్యూబిక్ మీటర్ గ్రానైట్ నాణ్యతను బట్టి రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. క్యూబిక్ మీటర్‌కు సరాసరిన రూ.90 వేలు లెక్కగట్టినా ఇప్పటి వరకు రూ.1.26 లక్షల కోట్ల విలువ చేసే గ్రానైట్‌ను బయటకు తీసినట్లు అంచనా. ఇప్పటి వరకు భూగర్భంలో ఉన్న గ్రానైట్‌లో 30 శాతం గనుల ద్వారా వెలికితీయగా.. రానున్న 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరువు జిల్లాలో కనకవర్షం... ఒకప్పుడు ప్రకాశం జిల్లా కరువుకు పెట్టింది పేరు. అలాంటి జిల్లా నేడు పారిశ్రామిక కేంద్రంగా మారిందంటే దానికి చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కారణం. అప్పట్లో ఎందుకూ పనికి రాదనుకున్న రామతీర్థం పరిసరాల్లోని భూమి నేడు ఎకరం రూ.3 నుంచి రూ.4 కోట్లకు పైనే పలుకుతోంది. చీమకుర్తితో పాటు ఒంగోలు శివారులో నున్న పేర్నమిట్ట ఎస్టేట్, సంతనూతలపాడు, మార్టూరు, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ తదితర ప్రాంతాల్లో 1650 గ్రానైట్ ఫ్యాక్టరీలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడు, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల కార్మికులు ఇక్కడి పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదుకున్న వైఎస్... 2008లో ఆర్థిక మాంద్యం కారణంగా గ్రానైట్ గనుల లీజుదారులు తీవ్రంగా నష్టాల బారిన çపడ్డారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి లీజుదారులు చెల్లించాల్సిన రాయల్టీలో మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీని ప్రకటిస్తూ జీఓ నంబర్లు 104, 105 ను జారీ చేశారు. దాంతోనే తాము ఒడ్డున పడ్డామని చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బ్లాక్ గెలాక్సీ.. పేరెలా వచ్చిందంటే చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో గ్రానైట్ ఉన్నట్లు 1983లో బయటపడింది. 1985లో మైనింగ్ లీజుకు తీసుకున్న జూబ్లీ గ్రానైట్ యజమాని నన్వాని వెలికి తీసిన గ్రానైట్‌ను మార్కెటింగ్ కోసం చైనా తీసుకెళ్లారు. నల్లని బండపై నగిషీలు అద్దినట్టున్న ఆ గ్రానైట్‌కు బ్లాక్ గెలాక్సీ అని పేరుపెట్టారు. దాని డిమాండ్‌ను గుర్తించిన చైనా అధునాతన కటింగ్ మిషన్లతో పెద్దఎత్తున యూనిట్లను నెలకొల్పింది. రూ.11,015 ఆదాయంతో మొదలు రామతీర్థం పరిసరాల్లో గ్రానైట్ ఉన్నట్లు గుర్తించిన అనంతరం మొట్టమొదటి సారిగా 8.094 హెక్టార్లలో ఒకే ఒక లీజుతో రాయల్టీ ద్వారా రూ.11,015 ఆదాయం వచ్చినట్లు ఒంగోలు భూగర్భ గనుల శాఖాధికారుల వద్దనున్న గణాంకాలు చెబుతున్నాయి. 2013లో రాయల్టీ రూçపంలో ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 1081 హెక్టార్లలో 327 లీజులతో ఏడాదికి రూ.566 కోట్ల ఆదాయం రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి వస్తోందని మైన్స్ డీడీ తెలిపారు. జీఎస్టీ, డెడ్రెంట్లు, పెనాల్టీల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.200 కోట్లు ఆదాయం వస్తోంది. ఏటా రూ.500– రూ.600 కోట్లు బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 85 శాతం చైనాకు ఎగుమతి అవుతోంది. గ్రానైట్ రాయి కటింగ్‌కు, పాలిషింగ్‌కు ఉపయోగించే మిషనరీ, డైమండ్ కట్టర్లు, సెగ్మెంట్లు అన్నీ చైనా లో పెద్దఎత్తున అభివృద్ధి చేసి యూనిట్లు స్థాపించారు. కొన్నేళ్లుగా మన పారిశ్రామికవేత్తలు చైనా నుంచి మిషనరీ దిగుమతి చేసుకుని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. – బి.జగన్నాథరావు, మైన్స్ డీడీ, ఒంగోలు చైనా మార్కెట్‌తోనే డిమాండ్ చీమకుర్తిలోని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాలో మంచి డిమాండ్ ఉంది. మొట్టమొదటి సారిగా గెలాక్సీ గ్రానైట్‌ను నేనే చైనాకు తీసుకుపోయి మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత మరో రెండు కంపెనీలు నాతో కలిసి వ్యాపారం చేశాయి. క్వారీలు పెరిగాక ఎగుమతి కూడా భారీగా పెరిగింది. – ఎల్.టి.నన్వాని, జూబ్లీ గ్రానైట్ యజమాని స్లాబ్ సిస్టంతో మంచి రోజులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చీమకుర్తి వచ్చినప్పుడు స్లాబ్ సిస్టం అమలు చేస్తున్నట్లు చెప్పి, ఆమేరకు జీఓ ఇచ్చారు. ఈ విధానం వల్ల ఫ్యాక్టరీల యజమానులకు నిర్ణీత ధరకు రాయి దొరుకుతోంది. విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 రాయితీ వల్ల చాలా కలిసి వస్తుంది. మొత్తం మీద ఫ్యాక్టరీల యజమానులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. – యర్రంనేని కోటేశ్వరరావు, ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్, గుండ్లాపల్లి -
విద్యుత్ సబ్సిడీ 36,890 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రూ.36,890 కోట్లు ఖర్చు చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు విద్యుత్ సరఫరా చేసేవారు. రాష్ట్రం ఏర్పడిన ఆర్నెల్లలోనే రైతులకు 9 గంటల కరెంటును సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారు. రైతుల కరెంట్ కష్టాలను తీర్చడానికి 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 7.93 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేయడంతో రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 26.96 లక్షలకు పెరిగింది. రాష్ట్ర విద్యుత్ రంగం సాధించిన ప్రగతిపై ఆదివారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో ప్రభుత్వం ఈ విషయాలను వెల్లడించింది. పంపిణీ వ్యవస్థ పటిష్టం రాష్ట్రంలో నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడానికి గత 8 ఏళ్లలో ప్రభుత్వం రూ.37,099 కోట్లను ఖర్చు చేసింది. ట్రాన్స్మిషన్ వ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్రంలో కొత్తగా 400–17200 కేవీ సబ్స్టేషన్లు 48, 132కేవీ సబ్స్టేషన్లు 72, ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు 137 నెలకొల్పడంతోపాటు ఈహెచ్‌టీ లైన్‌ను 11,107 సర్క్యూట్ కి.మీ మేర ఏర్పాటుచేసింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి డిస్కంలు 33/11 కేవీ సబ్స్టేషన్లు 1038, 3.65 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాయి. దీంతో గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,160 మెగావాట్లకు పెరిగినా విజయవంతంగా సరఫరా చేయగలిగారు. గతంలో పవర్ హాలిడేలతో మూతబడే పరిస్థితికి చేరిన పరిశ్రమలు ఇప్పుడు 24 గంటల విద్యుత్‌తో నిరంతరంగా పనిచేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1,110 యూనిట్లు ఉంటే 2021 నాటికి 2,012 యూనిట్లకు చేరింది. జాతీయ సగటుతో పోల్చితే 73శాతం అధికంగా ఉండటం రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. దేశంలో అతి తక్కువగా 2.47శాతం ట్రాన్స్మిషన్ నష్టాలు, 99.98 శాతం ట్రాన్స్మిషన్ వ్యవస్థ లభ్యతతో తెలంగాణ ట్రాన్స్‌కో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06 శాతం ఉన్న విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ) ఇప్పుడు 11.01శాతానికి తగ్గింది. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 73 మెగావాట్ల నుంచి 4,950 మెగావాట్లకు పెరిగింది. బడుగులకూ ఉచిత విద్యుత్ రాష్ట్రంలో 5,96,642 ఎస్సీ, 3,21,736 ఎస్టీ గృహాలకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 2017 నుంచి ఇప్పటివరకు రూ.656 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 29,365 సెలూన్లకు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. 6,667 పౌల్ట్రీ యూనిట్లు, 491 పవర్‌లూమ్స్‌కు యూనిట్‌కి రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. -
ఏది ఉచితం? ఏది అనుచితం?
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న రాయితీలను, సబ్సిడీలను ఉచితాలుగా ప్రకటించి... వాటిని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకటన చేసింది. ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఉచితం అంటే పూర్తి సబ్సిడీగా ఇచ్చేది. ఎలాంటి శ్రమ, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈరోజు దేశంలో 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు. వారికి కనీస పౌష్టికాహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు వెయ్యికి 40 మంది మరణిస్తున్నారు. ఉత్పత్తి ధర చెల్లించి కొనుగోలు చేసే శక్తి ప్రజలలో లేదు. అలాంటి ప్రజలకు రాయితీలు ఇవ్వాలి. శ్రమ చేయడానికి శక్తిలేని వారు, వయస్సు మళ్లినవారు, ఆనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఉచితంగా సహకారం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రాలు చౌక డిపోల ద్వారా బియ్యం ఇస్తున్నాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, భరోసా పింఛన్లు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. వీటితోనే వీరు బతుకుతున్నారు. ఈ ఉచితాలు రద్దు చేస్తే వీరిలో చాలామంది బతకలేరు. వ్యవసాయ రంగానికి ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పేర్లతో రాయితీలు ఇస్తున్నారు. వ్యవసా యోత్పత్తులకు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా ప్రభుత్వం లెక్కించడంలేదు. చివరికి మార్కెట్లలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏదో రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన ప్రజలకు సబ్సిడీల పేరుతో రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలన్నింటినీ రద్దు చేయాలని సలహా ఇస్తున్నది. వార్షిక తలసరి ఆదాయం దేశంలో రూ. 1,50,326గా కేంద్రం ప్రకటించింది (2021–22). అంతకు తక్కువ వచ్చిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాయితీలను గమనించి ఆహార సబ్సిడీ (రూ. 2,06,831 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ. 1,06,222 కోట్లు), గ్యాస్ (రూ. 8,940 కోట్లు), పెట్రోల్ సబ్సిడీ (రూ.3.30 లక్షల కోట్లు) ఏటా ఇస్తున్నది. ఈ మధ్య రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ పేర రూ.68,000 కోట్లు, వడ్డీమాఫీకి రూ. 19,500 కోట్లు, పంట బీమాకు రూ. 15,500 కోట్లు... మొత్తం రూ.1,03,000 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. వాటితో ఉపాధి చాలామంది సంపాదించుకుంటున్నారు. రాష్ట్రాలు రాయితీలను రద్దు చేయాలంటున్న కేంద్రం ఈ రాయితీలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది! పేదలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలీకి తీసుకుపోవడంతో అక్షరాస్యత పెరగడం లేదు. అక్ష్యరాస్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా రూ. 12,500 ఇవ్వడంతో వారు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఆ విధంగా విద్య వ్యాప్తి జరుగుతున్నది. మరి ఈ సహాయాన్ని ఆపాలంటారా? కాలేజీలలోగానీ, యూనివర్సిటీలలో గానీ పేదలకు అనేక రాయితీలు ఉన్నాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం చేయిస్తున్నారు. ఈ ఉచితాలన్నింటినీ లెక్కవేసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో 15 శాతానికి మించవు. కానీ, కార్పొరేట్ సంస్థలు ఈ రాయితీలను రద్దు చేయాలనీ, తమకు అనుకూల విధానాలు తేవాలనీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గింది. సెప్టెంబర్ 2019న ఒక జీఓ ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించారు. మార్చి 2033 నాటికి 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. విదేశాలలో 35 నుండి 40 శాతం పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ పన్నులు తగ్గిస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్ళు 13 రంగాలలో మోసాలు చేసి లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. 2019 ఏప్రిల్ 14కు ముందు రూ. 7 లక్షల కోట్లు వారి ఖాతాల నుండి ‘రైట్ ఆఫ్’ చేశారు. నిరర్థక ఆస్తుల పేర 10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ చేశారు. రూ. 2.11 లక్షల కోట్లు బెయిల్ ఔట్ కింద ఇచ్చారు. జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ తదితర దేశాలలో కార్పొరేట్లపై 30–40 శాతం పన్నులు వసూళ్ళు చేయడంతోపాటు నెలవారీ వేతనాలపై పన్ను వసూలు చేస్తూ ఆహార, ఇతర సంక్షేమ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఈ విషయాలు తెల్సినప్పటికీ భారత దేశంలో ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రద్దుచేసి, కార్పొరేట్లకు బహి రంగంగా లాభాలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. కేంద్రం ప్రకటించిన ‘ఉచితాల రద్దు విధానాన్ని’ ఉపసంహరించుకోవాలి. (క్లిక్: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - సారంపల్లి మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు -
పదెకరాల్లోపు ఆక్వా రైతులకు.. వచ్చే నెల1 నుంచి విద్యుత్ రాయితీ
సాక్షి, అమరావతి: ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు సాగుచేసే సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని వర్తింపజేసేందుకు చేపట్టిన సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది. అర్హతగల వారికి సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ రాయితీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలో 1.40 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి, 3.89లక్షల ఎకరాల్లో మంచినీటి ఆక్వా సాగు జరుగుతోంది. వీటికి 63,343 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ–క్రాప్ బుకింగ్ ప్రకారం 1,35,842 మంది ఆక్వా రైతులుండగా, 2.5 ఎకరాల లోపు 95,277 మంది, 2.5 నుంచి ఐదెకరాల్లోపు 22,358 మంది, 5–10 ఎకరాల్లోపు 11,809 మంది, పదెకరాలకు పైబడి 6,398 మంది ఉన్నారు. కానీ, నాన్ ఆక్వాజోన్ పరిధిలో సాగుచేస్తున్న వారు సైతం విద్యుత్ రాయితీ ద్వారా లబ్ధిపొందుతున్నారు. అలాగే, కొన్నిచోట్ల కనెక్షన్ ఒకరి పేరిట ఉంటే, సాగు మరొకరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత జోన్ పరిధిలో ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు మాత్రమే విద్యుత్ రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ పరిమితిని పదెకరాలకు పెంచింది. అనంతరం ఆక్వాజోన్ పరిధిలో వాస్తవంగా సాగుచేసే పదెకరాల్లోపు రైతులను గుర్తించేందుకు విద్యుత్, రెవెన్యూ, మత్స్య శాఖలతో సర్వే చేపట్టింది. విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరిట ఉంది? ఆ కనెక్షన్ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? ప్రతీనెలా ఎంత విద్యుత్ వినియోగమవుతోంది? ఆ చెరువుకు లైసెన్సు ఉందా.. లేదా? వంటి వివరాలను ఈ సర్వేలో సేకరించారు. మేలో చేపట్టిన ఈ సర్వే ఇప్పటికే 95 శాతం పూర్తికాగా.. మిగిలింది ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత జోన్, నాన్‌జోన్ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? వాటి పరిధిలో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.. జోన్ వారీగా ఎంతమంది ఆక్వా రైతులు ఉన్నారో గుర్తించి ఆ జాబితాలను ఆయా డిస్కంలకు పంపిస్తారు. ప్రభుత్వాదేశాల మేరకు జోన్ పరిధిలోకి వచ్చే పదెకరాల్లోపు ఆక్వా రైతులకు సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ రాయితీని వర్తింపజేసేలా ఏర్పాట్లుచేస్తున్నారు. అర్హులందరూ నమోదు చేయించుకోవాలి విద్యుత్ రాయితీ పొందాలంటే జోన్ పరిధిలో అర్హతగల ఆక్వా రైతులు తాము సాగుచేస్తున్న భూముల భూరికార్డు, వన్ బీ అడంగల్, లీజ్ అగ్రిమెంట్ కాపీ, వీఆర్వో నుంచి పొందిన సర్టిఫికెట్ ఆఫ్ కల్చర్లతో ఆర్బీకేల్లోని మత్స్య సహాయకులు లేదా మత్స్య అభివృద్ధి అధికారిని సంప్రదించాలి. వివరాలను నమోదు చేయించుకుని విద్యుత్ రాయితీకి అర్హత పొందాలి. – వడ్డి రఘురాం, వైస్‌చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ -
తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై అందజేస్తోంది. దీంతో ఇప్పటికే ట్రాక్టర్ల వినియోగం పెరిగిపోయింది. రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయా యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీనికి మరింత ఊతం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పిచికారీ కష్టాలకు చెక్ ►ప్రస్తుతం డ్రోన్లను ఫొటోలు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వ్యవసాయానికి వాడే డ్రోన్లు రైతుకు అనేక రకాలుగా ఉపయోగపడేలా చూస్తారు. ►ప్రధానంగా పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. ►పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ►కొన్ని పంటలకు మొక్కల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. చీడపీడలపై నిఘా ►పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయా తెలుసుకునేందుకు కూడా డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో పంటల్ని ఫొటోలు తీయడం, వాటిని వ్యవసాయాధికారికి పంపడం చేసేలా కూడా పరికరాలు అమర్చాలని భావిస్తున్నారు. ►అలాగే కాత ఎలా ఉంది?, దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది?, ఇలా పంటకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ పర్యవేక్షించేందుకు వీలుగా సాగు డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పలు కంపెనీలతోనూ చర్చించినట్లు తెలిసింది. పైలట్ శిక్షణ తప్పనిసరి.. ►డ్రోన్లను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. పదో తరగతి పాసై ఉండాలి. డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. రైతుకైనా, రైతు కుటుంబంలో సభ్యులు ఎవరికైనా ఇస్తారు. ►నిరుద్యోగ యువతీ యువకులు కస్టమ్ హైరింగ్ సెంటర్ నడుపుతున్నట్లయితే వారికి ఇస్తారు. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలను ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. అయితే డ్రోన్లకు ఎంతమేరకు సబ్సిడీ ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదు. 24 గంటల ముందు అనుమతి తప్పనిసరి ►డ్రోన్లకు సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ►ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు ముందు 8 గంటల్లోపు మద్యం తీసుకోకూడదు. ►డ్రోన్ ఉపయోగించడానికి తగిన మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోవాలి. మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. ఆ సిగ్నల్స్ డ్రోన్లకు అడ్డుపడవచ్చు. కాబట్టి మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. నీటివనరులు, నివాసాలకు దూరంగా.. ►నీటివనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాస పంటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించాలి. ►డ్రోన్లతో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. ►డ్రోన్ ఉపయోగించే ప్రాంతం నుంచి 100 మీటర్ల కంటే తక్కువ దూరంలో పురుగుమందులను పిచికారీ చేయకూడదు. ►ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలు లేదా అనుమతి లేని జోన్ల మీదుగా డ్రోన్లను ఎగుర వేయకూడదు. అనుమతి లేని ప్రైవేట్ ఆస్తులపై కూడా డ్రోన్ ఎగరకూడదు. అవసరమైతే బుక్ చేసుకునేలా.. ►ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. వాటిని రైతులకు సబ్సిడీపై ఇస్తారు. అయితే చాలావరకు ఒక్కో రైతుకు ఒక్కో డ్రోన్ అవసరం ఉండదు. పైగా ధర ఎక్కువ. ఈ నేపథ్యంలో కొంతమంది రైతుల బృందానికి ఒక డ్రోన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ►తొలుత ప్రయోగాత్మకంగా మండలానికి ఒకటి చొప్పున ఇస్తారు. డిమాండ్‌ను బట్టి క్రమంగా వీటి సంఖ్యను పెంచుతారు. తర్వాత కస్టమ్ హైరింగ్ సెంటర్ల (యంత్ర పరికరాలు అద్దెకిచ్చే కేంద్రం)లోనూ అందుబాటులో ఉంచుతారు. రైతులు తమకు అవసరమైనప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. -
రుణంతో సాగు చేసినా సబ్సిడీ: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులు రుణం తీసుకుని ఆయిల్‌పామ్ సాగు చేసినా వారికి చెందాల్సిన సబ్సిడీని అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రుణం అనేది ఆప్షన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్‌పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తేయడంలేదని స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ డిమాండ్‌ను గమనించే ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేలమంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించామని వెల్లడించారు. -
అడిగితేనే విద్యుత్ సబ్సిడీ ఇస్తాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉచిత, సబ్సిడీ విద్యుత్‌పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడిగే వారికి మాత్రమే ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందని చెప్పారు. ‘చౌక విద్యుత్ అనేది ఇప్పుడు ఢిల్లీలో ఐచ్ఛికం. అంటే, వినియోగదారుడు విద్యుత్ సబ్సిడీని కోరుకుంటేనే ఇక నుంచి ఉచిత లేదా రాయితీతో కూడిన విద్యుత్‌ను పొందుతాడు. సబ్సిడీ అవసరం లేదకునేవారు సాధారణ రేటుకే కరెంటు ఉపయోగించుకుంటామని ప్రభుత్వానికి తెలపాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1 నుండి రాయితీతో కూడిన విద్యుత్ అడిగిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంద’ని కేజ్రీవాల్ వివరించారు. (చదవండి: వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది) ప్రస్తుతం ఢిల్లీలోని వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు లేదు. నెలకు 201 నుంచి 400 యూనిట్ల విద్యుత్‌పై రూ. 800 సబ్సిడీ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, నీటి పథకాలతో కేజ్రీవాల్ ఢిల్లీలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. పంజాబ్‌లోనూ దీన్ని అమలు చేస్తామని ఆయన హామీయిచ్చారు. విద్యా, వైద్య రంగాల్లోనూ ఢిల్లీ సర్కారు మంచి ప్రగతి సాధించడంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. (చదవండి: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన) -
తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానని మోసం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ సబ్సిడీ వెహికల్ పాలసీ(సీఎస్‌వీపీ) కింద తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానంటూ తండ్రి కొడుకులు తమను మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మహ్మద్ ఖుష్రో అహ్మద్ ఫారూఖీ అనే వ్యాపారికి దూరపు బంధువులైన ఖాజా నసీరుద్దీన్, అతడి కుమారుడు జియాయుద్దీన్ తమకు రాజకీయ పలుకుబడి ఉందని, ఆ పలుకుబడితో కార్లు, ట్రక్స్, మోటర్ సైకిల్స్ సబ్సిడీపై ఇప్పిస్తామని చెప్పారు. వీరి మాటలు నమ్మిన ఫారూకీ రూ. 1.61 కోట్లు వాహనాల కోసం చెల్లించాడు. అయితే వాహనాలు ఇప్పించక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేశాడు. దీంతో రూ. 66 లక్షలు తిరిగి చెల్లించి, మిగతా వాటికి గ్యారంటీగా చెక్కులు ఇచ్చారు. ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తమతో పాటు మరికొందరిని స్కీమ్‌ల పేర్లతో మోసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ముందుగా బేరం.. కానీ మధ్యలో రూ. 5 వేలు చోరీ చేసిందని చంపేశాడు!) -
ఎరువులపై రూ.60,939 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: డీఏపీ సహా ఫాస్పాటిక్ అండ్ పొటాలిక్ ఎరువులకు రూ.60,939 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో ఫాస్ఫాటిక్ అండ్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనలను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం అంటే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సబ్బిడీని కేటాయిస్తున్నట్టుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని 2024 డిసెంబర్ వరకు విస్తరిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ సేవలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడున్న 2జీ మొబైల్ సేవలను 4జీకి అప్‌గ్రేడ్ చేసేందుకు ఉద్దేశించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. యూఎస్ఓఎఫ్ ప్రాజెక్టు కింద 2,343 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 2జీ నుండి 4జీ మొబైల్ సేవలను రూ.2,426 కోట్ల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఈ– గవర్నెన్స్, బ్యాంకింగ్, టెలి–మెడిసిన్ డెలివరీ, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా టెలి ఎడ్యుకేషన్ మొదలైన సేవలు సులువుగా అందుతాయి. -
కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!
కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం మునుపెన్నడు లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా ఈ మహమ్మారి వల్ల దేశంలోని దిగువ మధ్యతరగతి, పేదల ఆదాయం పడిపోవడంతో పుట గడవడమే కష్టం అవుతుంది. జనజీవనం ఇప్పుడిప్పుడే కుడుటపడుతున్న తరుణంలో మరోసారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే నెలలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే, ప్రభుత్వం పేదలకు అందించే సబ్సిడీలను 2022-23లో కట్ చేయాలని చూస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రాబోయే బడ్జెట్లో ఆహార, ఎరువుల సబ్సిడీలను వరుసగా రూ.2.60 లక్షల కోట్లు, రూ.90,000 కోట్లుగా కేటాయించాలని భావిస్తున్నారు. ఇది ఆర్థిక సంవత్సరం 2022 కోసం సవరించిన అంచనాల కంటే చాలా తక్కువ. ఎకనామిక్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ బిల్లు మొత్తం సుమారు రూ.5.35-5.45 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ మొత్తాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత బడ్జెట్లో ప్రకటించిన జిడిపిలో ఆర్థిక లోటు 6.8 శాతం కంటే ఎఫ్వై23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6.5 శాతంగా ఉంటుందని ఒక అధికారి తెలిపారు. మన ఆర్థిక లక్ష్యాల మేరకు ఆహారం, ఎరువులపై సబ్సిడీలను సవరించే అవకాశం ఉన్నట్లు ఆ అధికారి తెలిపారు. (చదవండి: అదిరిపోయిన స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్.. దీని రేంజ్, ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
‘సబ్సిడీపై స్మార్ట్ఫోన్లు’.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందన
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంకా ఫీచర్ ఫోన్లను వినియోగిస్తున్న వారిని స్మార్ట్ఫోన్ల వైపు మళ్లించడానికి సబ్సిడీపై హ్యాండ్సెట్లను అందించాలన్న ప్రతిపాదనలపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ప్రభుత్వం ఇప్పటికే దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుందన్నారు. ‘ప్రస్తుతం మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉంది. గత నాలుగైదేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో మెరుగైన మొబైల్ ఫోన్ల ధరలు రూ. 10,000 కన్నా తక్కువ స్థాయికి దిగివచ్చాయి. ఇది కీలక స్థాయి. ఎందుకంటే అల్పాదాయ వర్గాలకూ ఇది అందుబాటు రేటుగానే భావించవచ్చు. ఇక దేశీయంగా విడిభాగాలు, చిప్‌ల తయారీ కోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనివల్ల సరఫరాపరమైన ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా స్మార్ట్ఫోన్ల తయారీ వ్యయాలు తగ్గి, మరింత అందుబాటు ధరల్లో లభించగలవు‘ అని చెప్పారు. కాబట్టి సబ్సిడీ అవసరం ఉండదనే అర్థం వచ్చేట్టుగా మంత్రి వ్యాఖ్యానించారు. స్పెక్ట్రం ధరలపై కొనసాగుతున్న చర్చలు టెలికం స్పెక్ట్రం ధరకు సంబంధించిన చర్చల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో చురుగ్గా పాల్గొనాలని, టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్)కి తగు సూచనలివ్వాలని టెల్కోలకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భాగస్వామ్య సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ట్రాయ్ తుది డాక్యుమెంటు రూపొందిస్తుందని, దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. స్పెక్ట్రం ధరల నిర్ణయంలో ’ప్రజా ప్రయోజనాల’ను కూడా దృష్టిలో ఉంచుకుంటున్న విషయాన్ని అంతా గుర్తిస్తున్నారని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం.. అదే సమయంలో బడుగు వర్గాలకు సర్వీసులను మరింతగా మెరుగుపర్చడానికి మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ పరిణామాలతో అంతా డిజిటల్ బాట పట్టాల్సి రావడంతో టెలికం ప్రాధాన్యతకు గణనీయంగా గుర్తింపు లభించిందని వైష్ణవ్ తెలిపారు. చదవండి: స్పెక్ట్రం బేస్ ధరపై టెలికాం సంస్థల పేచీ -
గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..!
ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో సామాన్యులకు కాస్త ఉపశమనం తగ్గింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ సిలిండర్లపై భారీ రాయితీ..! ఇంధన ధరలతో పాటుగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగానే పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధర ఏకంగా రూ.1000కు చేరువైంది. దాంతో పాటుగా గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సబ్సిడీను కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలను బట్టి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై సుమారు రూ.20 నుంచి రూ. 40 వరకు మాత్రమే సబ్సిడీని పొందుతున్నారు. గ్యాస్ సిలిండర్లపై ధరల పెంపుతో సామాన్య ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.312.48కి సబ్సీడి అందించాలని తెలుస్తోంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ తీసుకున్న వారికి గరిష్టంగా ఈ సబ్సిడీ లభించనుంది. ఇతరులకు రూ.291.48 వరకు సబ్సిడీ రానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీని పొందాలంటే గ్యాస్ వినియోగదారులు కచ్చితంగా బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ పొందాలంటే మీ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో ఇలా లింక్ చేయండి ఇండనే గ్యాస్ సిలిండర్ కస్టమర్లు ‘cx.indianoil.in’ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆదార్‌కార్డును లింక్ చేయాలి. భారత్ గ్యాస్ కంపెనీ వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ - ‘ebharatgas.com’సందర్శించి ఆదార్‌కార్డును లింక్ చేయాలి. సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా కూడా ఆదార్ కార్డును లింక్ చేయవచ్చును. చదవండి: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ -
టెలికం రాయితీలతో ప్రజలకేం లాభం?
టెలికం రంగ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం మూడు ప్రైవేటు టెలికం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ప్రకటించిన కేంద్రం, అదే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ విషయంలో పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. విశాఖ ఉక్కు కర్మాగారం అప్పు విషయంలోనూ కేంద్రం ధోరణి అదే. మరి ప్రైవేటు రంగం మీద ఎందుకింత ప్రేమ? అయితే, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్న అవరోధాల వల్ల ఈ సహాయం అవసరమేననే నిపుణుల వాదన కూడా తోసిపుచ్చదగినది కాదు. కానీ ఈ మొత్తం ఉదారత సామాన్యులకు అందే సేవల్లో ఏమేరకు ప్రతిఫలిస్తుంది అన్నదే వేచిచూడాల్సిన అంశం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీల విషయం ఆయా రంగాల్లోని వారికి తప్ప ఇతరులకు పెద్ద ఆసక్తి గొలపలేదు. కానీ టెలికం రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కేవలం మూడు టెలికం కంపెనీలకు దాదాపు రూ.రెండు లక్షల కోట్ల రాయితీ ఇచ్చి, దేశ టెలికం రంగం బాగుపడిందంటే నమ్మడం ఎలా? ప్రజలకు వీటి వల్ల ఒరిగేదేమిటి? పూర్వరంగం 1994లో ప్రైవేటు టెలికం కంపెనీలకు ఫిక్స్డ్ లైసెన్సు విధానంలో అనుమతి నిచ్చారు. లైసెన్స్‌తో పాటు కొంత స్పెక్ట్రమ్ ఉచితంగా ఇచ్చేవారు. ఫిక్స్డ్ లైసెన్స్ విధానం అంటే, ఏడాదికి కొంత మొత్తం లైసెన్స్‌గా చెల్లించడం. ఏడాదికి కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలిఫోన్ కనెక్షన్లు ఇవ్వాలన్న నిబంధనలు ఉండేవి. అప్పట్లో ఇన్కమింగ్ కాల్స్‌కు కూడా ప్రైవేటు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు ఇవ్వని కారణంగా ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.50వేల కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమకు నష్టాలు వస్తున్నాయని, పెనాల్టీలు రద్దు చేయాలని టెలికం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో 1999 నూతన టెలికం విధానం వచ్చింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ విధానం ప్రకారం కాకుండా, రెవెన్యూపై 8 శాతం లైసెన్స్ ఫీజుగానూ, 3–5 శాతం స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగానూ చెల్లించాలి. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 50 వేల కోట్ల పెనాల్టీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రెవెన్యూ అంటే ఏమిటి అన్న విషయంలో టెలికం కంపెనీలకూ, ప్రభుత్వానికీ వివాదం ఏర్పడింది. నాన్ టెలికం ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు 2019లో ఈ విషయంలో తీర్పు ఇస్తూ– ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పన్ను చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీని ప్రకారం రూ.1,46,000 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించే అవసరం లేకుండా రెండేళ్ల మారిటోరియం విధించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై పన్నులు చెల్లించేందుకు 10 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. రూ.39 వేల కోట్ల రూపాయలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా, వీఆర్ఎస్ పేరుతో 90 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. కానీ మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.1,46,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, వారికి 10 ఏళ్ల గడువు ఇమ్మని కోర్టును కేంద్రం కోరడం గమనార్హం. తాజాగా కల్పించిన రాయితీలేమిటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఏమేమి రాయితీలు కల్పించిందో చూద్దాం: 1.అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నిర్వచనాన్ని మార్చి, ప్రైవేటు టెలికం కంపెనీలు కోరుకున్న విధంగా నాన్ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు. అయితే ఈ నిర్ణయం ఇప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుంది. గత కాలపు పన్ను బకాయిలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లించాలి. 2.టెలికం కంపెనీలు చెల్లించాల్సిన చట్టబద్ద పన్నులకు గతంలోని రెండేళ్ల కాలానికి అదనంగా మరో నాలుగేళ్ళ మారటోరియం విధించారు. అంటే అక్టోబర్ 2025 వరకు టెలికం కంపెనీలు కేవలం వడ్డీ చెల్లిస్తే చాలు. 3.డైరెక్ట్ విధానం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అమలు. ఈ నిర్ణయం వల్ల విదేశీ టెలికం కంపెనీలు దేశ టెలికం రంగాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 4.వడ్డీ రేటు గతంలో ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటుకు అదనంగా నాలుగు శాతం ఉండగా, దాన్ని రెండు శాతానికి తగ్గించారు. 5.స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు ఇకపై రద్దు. గతకాలపు స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు నెలవారిగా కాకుండా ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు. 6.లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ చెల్లించకపోతే విధించే అదనపు రుసుం రద్దు. 7.స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇకపై 20 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ల కాలానికి పొడిగింపు. 8.స్పెక్ట్రమ్ షేరింగ్ చేసుకోవచ్చు. ఈ షేరింగ్‌పై ఇప్పటివరకు విధించిన రెవెన్యూపై 0.5 శాతం పన్ను రద్దు. 9. బ్యాంకు గ్యారెంటీలు ఇకపై బిజినెస్ సర్కిల్ ప్రకారం కాకుండా యావత్ ఇండియా ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికం కంపెనీలకు 80 శాతం భారం తగ్గుతుంది. 10.ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో స్పెక్ట్రమ్ వేలం. 11. నాలుగేళ్ళ మారటోరియం తర్వాత కూడా టెలికం కంపెనీలు పన్నులు చెల్లించలేకపోతే ఆ మొత్తం ఈక్విటీగా మార్చుకోవచ్చు. 12. స్పెక్ట్రమ్ వాపస్ ఇవ్వాలంటే కనీసం 10 ఏళ్ల తర్వాతనే వీలవుతుంది. ఇలా విధాన పరమైన నిర్ణయాల్లో కేంద్రం మార్పులు చేసింది. ప్రధానంగా ఈ నిర్ణయాల వల్ల దివాలా స్థితిలో ఉన్న వొడాఫోన్–ఐడియా కంపెనీ తాను చెల్లించాల్సిన లక్షా ఎనభై వేల కోట్ల బకాయిలలో, రూ. 96,000 కోట్ల వెసులుబాటు నాలుగేళ్ళ కాలానికి లభించింది. ప్రజలకు ఏం ఉపయోగం? విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న అప్పు 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా కేంద్రం తిరస్కరించింది. మానిటైజేషన్ పేరుతో బీఎస్ఎన్ఎల్కు చెందిన 20,000 టవర్లు అమ్మివేసి, కేబుల్ అమ్మి, భూములు అమ్మి రూ.35,000 కోట్లు ఆర్జించాలని కేంద్రం ప్రకటించింది. కానీ టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీలు గమనిస్తే ఒక్క వొడాఫోన్–ఐడియాకే రూ.96,000 కోట్ల వెసులుబాటు వచ్చింది. కాగా మొత్తం టెలికం రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చారు. 1994 నుండి ఇప్పటి దాకా అనేక పర్యాయాలు టెలికం రంగానికి రాయితీలు లభించాయి. టెలికం రంగ పారిశ్రామికవేత్తల అభిప్రాయం ప్రకారం– టెలికం రంగంలో 2జీ నుండి 3జీకి, 3జీ నుండి 4జీకి, 4జీ నుండి 5జీకి ప్రతి నాలుగైదేళ్ల వ్యవధిలో మారాల్సి రావడం, దానికోసం టెక్నాలజీ దిగుమతులు, సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు, టెలికం కంపెనీల మధ్య అనారోగ్య కరమైన పోటీతో ధరల తగ్గుదల లాంటి కారణాల వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయాలు తగ్గి, నష్టాలు వస్తున్నాయి కనుక ఈ వెసులుబాట్లు అవసరం. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం ఇంత మొత్తంలో రాయితీ ఇవ్వడం సరి కాదని, ఈ రాయితీలు ప్రజలకు సరాసరి చేరేలా చూసే విధానాన్ని రూపొందిస్తే బాగుండేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రజల ధనంతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆరు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను భారత్ నెట్ కింద నిర్మిస్తూ, అందులో రెండు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను అమ్మి రూ.20,000 కోట్లు సమీకరించాలను కోవడం ఏమిటి? మరోవైపు లక్షల కోట్లు రాయితీగా ఇవ్వడం ఏమిటి? బీఎస్ఎన్ఎల్కు ఉన్న 70,000 టవర్లలో 20,000 టవర్లు అమ్మి రూ.15,000 కోట్లు సమీకరించే ఆలోచన ఎందుకు? 4జీ ఇవ్వకుండా, టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయకుండా ప్రభుత్వ డైరెక్టర్లే అడ్డు పడటం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా టెలికం రంగంలో ఒకటి రెండు కంపెనీల గుత్తాధిపత్య నివారణకు ప్రభుత్వం భారీ రాయితీలే ఇచ్చింది. ఈ రాయితీల ద్వారా మెరుగైన సేవలను ప్రజలకు ప్రైవేటు టెలికం కంపెనీలు అందుబాటులోకి తెస్తాయని; ప్రపంచంలొనే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న దేశంగా మనం ఇకపై కూడా కొనసాగేలా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్కు కూడా మరిన్ని వెసులుబాట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుందాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు -
ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం.. వరి రైతులకు రాయితీపై వరికోత యంత్రాలు
సాక్షి, అమరావతి: కూలీల కొరతతో వరి రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను అధిగమించేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అలాగే వరి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో వరి కోత యంత్రాల(కంబైన్డ్ హార్వెస్టర్స్)ను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్‌లోగా 500 కేంద్రాలు, మిగిలిన వాటిని వచ్చే ఏడాది మార్చిలోగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణంలో దాదాపు 60 శాతం తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే సాగవుతుంది. ఈ జిల్లాల్లో పంట మొత్తం ఒకేసారి కోతకొస్తుండటం, ఆ సమయంలో కూలీలు దొరక్క, సరిపడా వరి కోత యంత్రాల్లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలను ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించి పంట కోత, నూర్పిడి చేయిస్తున్నారు. దీనివల్ల రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం రైతు సంఘాలను ఏర్పాటు చేసి.. వాటి ఆధ్వర్యంలో కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన యంత్ర సేవా కేంద్రాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. తద్వారా గ్రామాల్లోనే తక్కువ అద్దెకు యంత్ర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. 5 యూనిట్లు మండలానికి.. ► ప్రభుత్వం అనుభవం కలిగిన ముగ్గురు రైతులతో ఒక్కో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో పాటు బేలర్(గడ్డిమోపు యంత్రం) కొనుగోలు చేసేలా ప్రోత్సహించనుంది. వారి ఆధ్వర్యంలోనే ఈ యంత్ర సేవా కేంద్రాన్ని నిర్వహిస్తుంది. ► ఇందుకోసం 40 శాతం రాయితీ ఇస్తుండగా, 50 శాతం బ్యాంకు ద్వారా రుణం అందిస్తుంది. ► మొత్తం నాలుగు జిల్లాల్లో 1,035 క్లస్టర్లలో యంత్ర సేవా కేంద్రాల కోసం ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద రూ.103.50 కోట్లు కేటాయించింది. ► 3,706 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్న గ్రామాలను ఒక క్లస్టర్‌గా తీసుకుంటుంది. అలాగే మండలానికి ఐదు యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ► రైతులకు రూ.10 లక్షల రాయితీ వస్తుండగా, బ్యాంకు ద్వారా 12.50 లక్షల రుణం మంజూరు చేయనున్నారు. ► మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి నిర్దేశించిన మేరకు యంత్రాల అద్దెలను వసూలు చేయాల్సి ఉంటుంది. యువతకు స్వయం ఉపాధి యంత్ర సేవా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంపిక చేసిన యువతకు కంబైన్డ్ హార్వెస్టర్ల డ్రైవింగ్, నిర్వహణ, మరమ్మతులపై వివిధ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ శిక్షణ కేంద్రాల(ఎఫ్‌ఎంటీటీఐ) ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా వారు కంబైన్డ్ హార్వెస్టర్లను నడపడంలో ప్రావీణ్యం పొందనున్నారు. తద్వారా యంత్ర సేవా కేంద్రాలకు అనుబంధంగా స్వయం ఉపాధి సాధించనున్నారు. రైతులకు మేలు వరి ఎక్కువగా పండిస్తున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 640 వరికోత యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పంట కోత సమయంలో డిమాండ్ పెరిగిపోతోంది. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలు తీసుకొస్తున్న రైతులకు ఖర్చు మోయలేని భారం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ -
తెలంగాణ కేబినేట్ భేటీ: ‘స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది కనుక.. నిల్వ, మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమల ఏర్పాటుకు.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. మంత్రులు గంగుల, హరీష్‌రావు, కేటీఆర్, పువ్వాడ, ఇంద్రకరణ్, సబిత, ప్రశాంత్‌రెడ్డి, జగదీష్రెడ్డిలని సబ్‌కమిటీ సభ్యులుగా నియమించారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి ఏడాది 26వేలు రూపాయలు, రెండు, మూడో ఏడాదికి గాను 5వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి ఆమోదం అలానే ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను ఆదేశించింది. రైతులకు సమగ్ర శిక్షణకు సౌకర్యాలను వ్యవసాయశాఖ కల్పించాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉద్యానశాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని.. పౌరసరఫరాలు, వ్యవసాయశాఖలో ఖాళీలు భర్తీ చేయాలని తెలిపారు. పండిన ధాన్యం వెంటనే మిల్లింగ్ చేసి డిమాండ్ ఉన్నచోటకు పంపాలన్నారు. అన్ని రకాల పంట ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. కొత్త పారాబాయిల్డ్ మిల్లులు ఎక్కువగా స్థాపించాలని కేసీఆర్ ఆదేశించారు. -
డీఏపీపై సబ్సిడీ పెంపునకు కేంద్రం కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) బస్తా పాత ధరకే లభించనుంది. డీఏపీ బస్తాకు రూ.700 చొప్పున సబ్సిడీని పెంచుతూ గత నెలలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత ఏడాది డీఏపీ బస్తా ధర రూ. 1,700 ఉండగా, కేంద్రం రూ. 500 సబ్సిడీ ఇవ్వడంతో కంపెనీలు రూ. 1,200కు బస్తా చొప్పున విక్రయించాయి. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల కారణంగా డీఏపీ బస్తా రూ. 2,400 లకు చేరుకుంది. రైతులకు పాత ధరకే డీఏపీ బస్తా లభించేలా కేంద్రం తాజాగా సబ్సిడీని రూ. 1,200లకు పెంచింది. డీప్ ఓషియన్ మిషన్‌కు ఓకే సముద్ర వనరుల సుస్థిర వినియోగానికి వీలుగా రానున్న ఐదేళ్లలో రూ. 4,077 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన అయిన ‘డీప్ ఓషియన్ మిషన్’కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ప్రధానంగా ఆరు భాగాలుగా ఉంటుంది. డీప్ సీ మైనింగ్‌లో భాగంగా సముద్రంలో 6 వేల మీటర్ల అడుగున ఖనిజాల అన్వేషణకు వీలుగా శాస్త్రీయ సెన్సార్లు, పరికరాల సహితంగా ముగ్గురు మనుషులను తీసుకెళ్లగలిగే ఒక సబ్మెర్సిబుల్ను అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు కొన్ని దేశాలకు మాత్రమే ఇలాంటి సామర్థ్యం ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విభజన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఏడు ప్రభుత్వరంగ సంస్థలుగా విభజించింది. కేబినెట్ దీనికి బుధవారం ఆమోదముద్ర వేసింది. జవాబుదారీతనం, పోటీతత్వం, పనితీరును మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని 41 ఆయుధ కర్మాగారాలు, సైనిక ఉత్పత్తుల సంస్థలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కింద ఉన్నాయి. -
డీఏపీ రూ.1,200కే బస్తా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రైతులకు తీపికబురు అందించింది. డీఏపీపై సబ్సిడీని ఏకంగా 140 శాతం పెంచింది. ఫలితంగా రైతులకు పాత ధరకే... రూ. 1,200లకు బస్తా (50 కేజీలు) చొప్పున డీఏపీ దొరకనుంది. ‘రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. డీఏపీ ఎరువును పాతధరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’ అని ప్రధానమంత్రి మోదీ బుధవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు డీఏపీపై బస్తాకు రూ. 500 సబ్సిడీ చెల్లిస్తోంది. దాన్ని 140 శాతం పెంచి రూ.1,200లు చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల మూలంగా రైతులపై భారం పడకూడదనే ఉద్దేశంతో పెరిగిన మొత్తం భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్రంపై వచ్చే ఖరీఫ్ సీజన్లో రూ.14,774 కోట్ల అదనపు భారం పడనుంది. గతేడాది డీఏపీ బస్తా రూ.1,700కు ఉండగా... అందులో రూ.500 కేంద్రం రాయితీ ఇవ్వడంతో రైతులకు రూ.1,200కే కంపెనీలు అమ్మాయి. అంతర్జాతీయంగా ఇటీవల ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియా ధరలు 60 నుంచి 70 శాతం పెరగడంతో డీఏపీ బస్తా ధర రూ.2,400కు చేరింది. కేంద్రం ఇచ్చే రూ.500 రాయితీ పోను రూ. 1,900లకు రైతులకు అమ్మాల్సిన పరిస్థితి. దీని ప్రకారం బస్తాపై రూ.700 పెంచుతున్నట్లు ఇఫ్కో ఏప్రిల్‌లో ప్రకటించినా... తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యంతో వెనక్కి తగ్గింది. అయినా కొన్ని కంపెనీలు ధరలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఎపీపై రాయితీని బస్తాకు రూ. 500 నుంచి రూ. 1,200కు పెంచాలని నిర్ణయించారు. అంటే బస్తా ఖరీదు రూ.2,400 రూపాయల్లో 1,200 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్న మాట. దాంతో రైతుకు 50 కేజీల డీఏపీ బస్తా రూ.1,200లకే లభించనుంది. అంతర్జాతీయంగా ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియా ధరలు పెరగడం వల్ల ఎరువుల ధర పెరిగినప్పటికీ దేశంలోని రైతులకు పాతధరలకే ఎరువులు అందజేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. -
టాటా మోటార్స్‌కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్‌కు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. నెక్సాన్ పేరుతో అమ్ముతున్న టాటా విద్యుత్ కార్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్దారించింది. ఈ మేరకు టాటా నెక్సాన్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ వాహనాలను రాయితీ లిస్ట్ నుంచి తొలగిస్తూ ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఈ కార్ల కొనుగోలు చేసే కస్టమర్లకు ఎలాంటి సబ్సిడీ రాదు. దీంతో విద్యుత్ కార్ల విభాగంలో దేశీయ మార్కెట్లో టాప్‌లో దూసుకెడుతున్న టాటా కంపెనీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికిల్ సబ్ స్టాండర్డ్ గా ఉందని.. ఆఫర్ చేసిన డ్రైవింగ్ రేంజ్ అందుకోవడం లేదని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాత్ ప్రకటించారు. మోడల్ ఒకే ఛార్జీపై నిర్దేశించిన పరిధిని చేరుకోవడంలో విఫలమైందని, ఈ నేపథ్యంలో దీనిపై తుది నివేదిక వచ్చేవరకు వాహనాలపై ఇస్తున్న రాయితీని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యుత్తు కార్లను ప్రోత్సహించడంలో నిబద్ధతగా ఉందన్నారు. అయితే ప్రజలు అవసరాలకు అనుగుణంగా విశ్వాసం కల్పించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు. కాగా కంపెనీ ప్రామిస్ చేసినట్టుగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల ప్రయాణ దూరం రావడం లేదని కస్టమర్ల ఫిర్యాదు వెల్లువెత్తాయి. దీనిపై ఆప్ సర్కార్ గత నెలలోనే(ఫిబ్రవరి 8న) కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ముగ్గరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కంపెనీ ఇచ్చిన రాతపూర్వక సమాధానం ఇచ్చింది అయితే టాటా మోటార్స్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని రవాణా శాఖ తాజాగా పేర్కొంది. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉందనీ, తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ట్వీట్ చేశారు. Delhi govt has decided to suspend subsidy on a EV car model, pending final report of a Committee, due to complaints by multiple users of sub-standard range performance. We r committed to support EVs, but not at the cost of trust & confidence of citizens in claims by manufacturers pic.twitter.com/R81S3kH6vT — Kailash Gahlot (@kgahlot) March 1, 2021 -
పార్లమెంట్లో హైదరాబాద్ బిర్యానీ ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: రాయితీలు ఎత్తివేయడంతో పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి. రాయితీ ఎత్తేసిన తర్వాత కొత్త ధరలతో మెనూను సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ మేరకు క్యాంటీన్ కూడా సిద్ధమైంది. అయితే రాయితీ ఎత్తివేయగా ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో అందరి ఫేవరేట్‌గా ఉండే హైదరాబాద్ బిర్యానీ ఎంత అనే ప్రశ్న వస్తోంది. ఈ క్యాంటీన్లో ప్రస్తుతం రూ.150కి హైదరాబాద్ మటన్ బిర్యానీ లభిస్తోంది. ఈ బిర్యానీ రాయితీతో రూ.65కే వచ్చేది. ఇక నాన్ వెజ్ బఫే కొత్త ధర రూ.700 ఉంది. మెనూలో అత్యధిక ధర ఉన్నది ఈ పదార్థానికే. అతి తక్కువ ధర అంటే చపాతీనే. ఒక చపాతీ రూ.3కు అందుబాటులో ఉంది. కొత్త ధరల ప్రకారం శాకాహార భోజనానికి రూ.100. ఉడకబెట్టిన కూరగాయలు గతంలో రూ.12 ఉండగా ఇప్పుడు రూ.50కి పెరిగింది. అయితే రాయితీలను ఎత్తివేయడంతో లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఏడాదికి దాదాపు రూ.8 కోట్లు ఆదా అవుతోంది. ఈ క్యాంటీన్లో మొత్తం 58 ఆహార పదార్థాలు ఉన్నాయి. -
బియ్యం కార్డులకే సరుకులు
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం అమల్లోకి రానుంది. డిసెంబర్ నుంచి బియ్యం కార్డులున్నవారికి మాత్రమే సబ్సిడీపై సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు తీసుకోవడం లేదు. తీసుకున్న మరికొందరు పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం నాణ్యత తక్కువగా ఉండడంతో తినలేక అమ్ముకుంటున్న పరిస్థితి ఇక ఉండకూడదనే ఉద్దేశంతో జనవరి నుంచి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం బియ్యం కార్డులు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1.52 కోట్లకుపైగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎనిమిది లక్షలకు పైగా తెల్ల కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నట్లు గ్రామ, వార్డు వలంటీర్ల తనిఖీలో వెల్లడైంది. వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హతల పత్రాన్ని వారికి అందించి, వారి నుంచి వివరాలు తీసుకున్నారు. అనర్హతకు సంబంధించి ఆయా కుటుంబాలు అంగీకారం కూడా తెలిపాయి. ఈమేరకు సిద్ధం చేసిన అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సోషల్ ఆడిట్ జరిపారు. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోయినా ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాలపై దాదాపు రెండులక్షల మంది నుంచి అభ్యంతరాలు, విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు చేశారు. బియ్యం కార్డుకు అర్హత ఉన్నప్పటికీ తెల్ల కార్డులున్న మరో ఆరులక్షల కుటుంబాలకు సంబంధించి చిరునామాలు ఇప్పటికీ లభించలేదు. (చదవండి: 1.52 కోట్లు దాటిన బియ్యం కార్డులు) బియ్యం కార్డుతో ఇతర పథకాలకు సంబంధం లేదు... బియ్యం కార్డులతో పెన్షన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు ముడిపెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని జనవరి నుంచి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు ప్రస్తుతం అర్హతలను సడలించి మరింతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇన్ని బియ్యం కార్డుల సంఖ్యకు పరిమితి విధించలేదు. అర్హులందరికీ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బియ్యం కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1,52,70,217 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు, బియ్యం కార్డుల మొత్తం జిల్లాల వారీగా.. --------------------------------------------------------- జిల్లా రేషన్ కార్డులు --------------------------------------------------------- తూర్పు గోదావరి 17,03,597 గుంటూరు 15,47,127 కృష్ణా 13,47,292 విశాఖపట్నం 13,20,321 పశ్చిమ గోదావరి 12,93,075 అనంతపురం 12,73,601 కర్నూలు 12,43,324 చిత్తూరు 11,88,779 ప్రకాశం 10,25,455 నెల్లూరు 9,33,193 శ్రీకాకుళం 8,41,047 వైఎస్సార్ కడప 8,37,057 విజయనగరం 7,16,349 --------------------------------------------------------- మొత్తం 1,52,70,217 --------------------------------------------------------- అర్హులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం డిసెంబర్ కోటా నుంచి బియ్యం కార్డులున్న వారికే సబ్సిడీ సరుకులు పంపిణీ చేస్తాం. గతంలో తెల్ల రేషన్ కార్డులు తీసుకున్న వారిలో చాలామంది అనర్హులున్నారు. కరోనా కారణంగా ఉపాధి పనులు దొరకడం లేదనే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా సరుకులు పంపిణీ చేశాం. అర్హత ఉండి బియ్యం కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.- కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ -
పేద నిరుద్యోగులకు మినీ ట్రక్కులు
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా ఆయా వర్గాల్లోని పేద నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న 9,260 మంది పేద నిరుద్యోగులను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి భారీ సబ్సిడీతో మినీ ట్రక్కులు ఇవ్వనుంది. ఇంటింటికీ సబ్సిడీ సరుకుల పంపిణీకి ఈ వాహనాలను వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో వాహనాల కొనుగోలుకు సంబంధించి సెప్టెంబర్ 11న పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. ఆరేళ్లలో లబ్ధిదారునికి వాహనం సొంతం ఒక్కో వాహనం ఖరీదు రూ. 5,81,190గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 60% అంటే రూ.3,48,714 సబ్సిడీ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. 30% అంటే రూ.1,74,357 బ్యాంకు రుణం కింద అందజేస్తుంది. మొత్తం వాహనం ఖరీదులో కేవలం 30% మాత్రమే బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంటున్నందున లబ్ధిదారులపై పెద్దగా భారం పడదు. సులభ వాయిదాలలో రుణం చెల్లించేందుకు వీలవుతుంది. ఇక లబ్ధిదారుని వాటా కింద కేవలం 10% అంటే రూ.58,119 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. కాగా బ్యాంకు రుణ మొత్తాన్ని ఆరు సంవత్సరాల్లో చెల్లించేట్లుగా నిబంధనలు విధించారు. అంటే ఆరేళ్లలో వాహనం లబ్ధిదారుని సొంతమవుతుందన్న మాట. ఏదైనా పథకం కింద ఇంత భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. నెలకు రూ.10 వేల నికర ఆదాయం ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి ఇంటింటికీ సబ్సిడీ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు చౌకధరల దుకాణాల నుంచి కార్డుదారులు బియ్యం తెచ్చుకుంటున్నారు. ఇకపై వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ బియ్యం, సరుకులు అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే ట్రక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదట మండల స్థాయి గోడౌన్ పాయింట్ల నుంచి సరుకులు మినీ ట్రక్కుల ద్వారా డీలర్ షాపులకు చేరుస్తారు. అక్కడి నుంచి ఇంటింటికీ చేర్చే కార్యక్రమాన్ని చేపడతారు. బ్యాంకు రుణం, ఇతర ఖర్చులు పోను లబ్ధిదారునికి నెలకు రూ.10 వేలు కార్పొరేషన్ చెల్లిస్తుంది. 27 వరకు దరఖాస్తుల స్వీకరణ మినీ ట్రక్కులకు దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుని పూర్తి చేసిన అనంతరం తిరిగి అక్కడే అందజేయాలి. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూలు ఉంటాయి. 5న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తారు. కార్పొరేషన్ల వారీగా ప్రభుత్వం ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్య ఇలా.. బీసీలు 3,800 ఈబీసీలు 1,800 ఎస్సీలు 2,300 ఎస్టీలు 700 క్రైస్తవులు 104 మైనార్టీలు 556 మొత్తం 9,260 -
విద్యుత్ నగదు బదిలీకి రూ.8,353 కోట్లు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన రైతు ఖాతాల్లోకే నగదు బదిలీ ప్రక్రియ వేగవంతమైంది. క్షేత్రస్థాయిలో సేకరించిన వ్యవసాయ విద్యుత్ లోడ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,353.7 కోట్ల మేర విద్యుత్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని లెక్కించారు. ఇప్పటివరకు విద్యుత్ సబ్సిడీ లెక్కకు శాస్త్రీయత కొరవడింది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లాలు, రైతుల వారీగా పొలంలోని పంపుసెట్ సామర్థ్యం, విద్యుత్ వినియోగం, ఇవ్వాల్సిన సబ్సిడీ వివరాలతో ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఇంధనశాఖ అధికారులు నివేదిక రూపొందించారు. చిత్తూరు జిల్లాకు రూ.1,421 కోట్లు ► రాష్ట్రవ్యాప్తంగా 17,54,906 వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ఇవి 1,15,55,553 అశ్వశక్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ మొత్తానికి ఏటా రూ.8,353.7 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఇంతకాలం ఈ మొత్తాన్ని డిస్కమ్‌లకు అందించేవాళ్లు. ఇకనుంచి ఈ సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళుతుంది. ► చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18,52,479 హెచ్‌పీ విద్యుత్ లోడ్ ఉంది. ఈ జిల్లాలో మొత్తం 2,89,544 పంపుసెట్లున్నాయి. ఈ జిల్లాకు సంవత్సరానికి రూ. 1421 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుంది. ► తర్వాత స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. ఇక్కడ 2,72,607 పంపుసెట్లు 18,20,367 అశ్వశక్తి సామర్థ్యంతో ఉన్నాయి. వీటికి రూ.1,396.4 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించబోతోంది. శ్రీకాకుళంలో ఇప్పటికే చెల్లింపులు ► వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇందుకోసం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. పథకం ఉద్దేశాన్ని రైతులకు వివరిస్తున్నారు. ► శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 31,526 పంపుసెట్లలో 25వేల పంపుసెట్లకు మీటర్లు బిగించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమచేశారు. -
రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు
కొడవలూరు: రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించిందని డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు తెలిపారు. స్థానిక ఏఓ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో రుణాల నియమ నిబంధనలపై గురువారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ, 50 శాతం రుణం, పది శాతం రైతు వాటాతో రుణాలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ రుణాలు పొందేందుకు ఒక్కో రైతు భరోసా కేంద్రం పరిధిలో 5 నుంచి 6 మంది రైతులు గ్రూపుగా ఏర్పడాలన్నారు. వీరంతా ఆర్బీకే పరిధిలో పొలమున్న రైతులు అయి ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 15 లోగా ఆర్బీకేలో రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పారు. ఒక్కో గ్రూపుకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విలువైన యంత్రాలను అందజేస్తోందన్నారు. ఈ రుణంతో ట్రాక్టర్లు, రోటో వేటర్లు, సీడ్ ట్రిల్లర్ తదితర యంత్ర పరికరాలు కొనుగోలు చేసి ఆర్బీకే ద్వారా రైతులకు అద్దెకివ్వచ్చన్నారు. తద్వారా వచ్చిన రాబడితో రుణం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రుణం మొత్తంలో ప్రభుత్వం 40 శాతం రాయితీగా వస్తే 50 శాతం ఎన్డీసీసీబీ రుణమిస్తుందని చెప్పారు. రైతులు వ్యవసాయ యంత్ర పరికరాలను ఎంపిక చేసుకునేందుకు సెప్టెంబరు 2న నెల్లూరు, కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో వివిధ కంపెనీల ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 15 తేదీ కల్లా ఎన్డీసీసీబీ రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్టోబరు 2 కల్లా ఆర్బీకేల్లో వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులు గ్రూపుల రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎల్. జ్యోతిరెడ్డి, ఏఓ సీహెచ్ఎస్ లక్ష్మి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య పాల్గొన్నారు. -
ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్ పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పథకాన్ని (ఈక్వలైజేషన్ స్కీమ్) కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలున్నాయి. ఎగుమతుల రంగానికి సంబంధించిన ఈ పథకం 2015, ఏప్రిల్‌లో మొదలైంది. ఎంపిక చేసిన వస్తువులకు సంబంధించిన రుణాలపై 3–5 శాతం సబ్సిడీనిచ్చే ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఎగుమతుల రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన వెబినార్‌లో విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్ మాట్లాడారు. రానున్న వారాల్లో ఈ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి శుభవార్త వింటారనిపేర్కొన్నారు -
ఎగుమతుల సబ్సిడీలకు డబ్య్లూటీవో ఆటంకాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వివాదాన్ని లేవనెత్తిన విషయం వాస్తవమేనని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల సబ్సిడీ పథకం నిబంధనలకు అనుగుణంగా లేదంటూ డబ్ల్యూటీవో భారత దేశానికి వ్యతిరేకంగా వివాదాన్ని లేవనెత్తిందని చెప్పారు. ప్యానల్ దశలో ఇండియా తన కేసును వాదించింది. కానీ వివాద పరిష్కార ప్యానల్ మాత్రం భారత్ చేపట్టిన చర్యలు డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధమని తన నివేదికలో పేర్కొంది. ప్యానల్ నివేదికను భారత్ 19 నవంబర్ 2019న అప్పిలేట్ సంఘం వద్ద సవాలు చేసింది. కానీ తగినంత కోరం లేని కారణంగా కేసులో పురోగతి లేదు. అయినప్పటికీ డబ్ల్యూటీవోలోని ఇతర సభ్యులతో కలసి అప్పిలేట్ సంఘం వద్ద ఈ కేసును అనుకూలంగా పరిష్కరించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అయితే ఈ దశలో కేసు మనకు అననుకూలంగా పరిష్కారం అవుతుందో లేదో చెప్పలేమని అన్నారు. -
ఫాస్టాగ్ లేకుంటే సబ్సిడీ రద్దు ..
కడప సిటీ : ఫాస్టాగ్ నిబంధనలను కేంద్ర ఉపరితల రవాణాశాఖ కఠినతరం చేసింది. ఫాస్టాగ్ తీసుకోకుంటే తిరుగు ప్రయాణంలో ఇచ్చే 50 శాతం సబ్సిడీని రద్దు చేసింది. ఈ మేరకు ఆయా టోల్‌ప్లాజాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఎల్రక్టానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు మొగ్గుచూపకపోవడంతో ఎలాగైనా నిబంధనలు కఠినతరం చేసి స్టిక్కర్లు కొనిపించాలని నిర్ణయానికి రావడం వల్లే ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.పండుగకు ముందు రెండు, మూడు క్యాష్ కౌంటర్లు ఉండగా, తర్వాత అధికభాగం ఫాస్టాగ్ కౌంటర్లుగా మార్చి కేవలం ఒకే ఒక్క క్యాష్‌లైన్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని కూడా తీసి వేస్తామని పాలెంపల్లె టోల్‌ఫ్లాజా మేనేజర్ హర్షవర్ధన్ తెలిపారు. గడువు ఇచ్చినా... టోల్‌ప్లాజాల వద్ద క్యాష్ విధానం వల్ల గంటల తరబడి వాహనాలు నిలపాల్సి వచ్చేది.దీనివల్ల సమయం, వృథా, ఇంధనం ఖర్చు కూడా అవుతోంది. దీంతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ 2016లో ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.స్టిక్కర్లో ఉన్న చిప్‌ను అక్కడున్న స్కానర్ స్కాన్ చేసి వారి అకౌంటులో ఉన్న మొత్తాన్ని జమ చేసుకుంటుంది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి 15 వరకు ఫాస్టాగ్ స్టిక్కర్లను కొనుగోలు చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. మళ్లీ ఈ గడువును జనవరి 15, 2020 వరకు పొడిగించారు. కానీ వాహనదారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 52 శాతం మాత్రమే ఫాస్టాగ్ స్టిక్కర్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్నారు. జనవరి 15వ తేదీ నుంచి ఒకే క్యాష్‌లైన్ ఏర్పాటు చేయడం, తిరుగు ప్రయాణంలో సబ్సిడీని ఎత్తివేయడం వంటి అంశాలను తీసుకొచ్చారు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అదే ఫాస్టాగ్ స్టిక్కర్లు కలిగి ఉంటే 50 శాతం సబ్సిడీ వారికి ఉంటుంది. జాతీయ రహదారులపై రెగ్యులర్‌గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాసులను కూడా జారీ చేస్తారు. దీనిని తీసుకుంటే టోల్ ఛార్జీల్లో తగ్గింపు ఉంటుంది. ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిని సంక్రాంతి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. రాయితీ ఉండదు టోల్‌ప్లాజా వద్దకు 24 గంటల్లో తిరిగి వాహనం వస్తే 50 శాతం సబ్సిడీ మాత్రమే ఉంటుంది. ఫాస్టాగ్ స్టిక్కర్ లేకపోతే ఈ అవకాశం ఉండదు. ఇప్పటివరకు 51 శాతం ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనదారులు కొనుగోలు చేశారు. నిబంధనలు కఠినతరం చేయడం వల్ల వారం రోజుల్లో పూర్తి స్థాయిలో తీసుకుంటారని భావిస్తున్నాం. – హర్షవర్ధన్, మేనేజర్, పాలెంపల్లె టోల్‌ప్లాజా -
ఇంటి రుణాలపై వడ్డీరేటు 7%కి తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతం పైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రి బడ్జెట్ సమావేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులను సూచించినట్టు కౌన్సిల్ చైర్మన్ నిరంజన్ హిరనందన్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి విలువలో 90% మేర రుణంగా ఇవ్వాలని, స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నులు కూడా రుణంలో కలిపేలా సంస్కరణలు రావాలని నివేదించినట్టు తెలిపారు. రెంటల్ హౌజింగ్, స్టాఫ్ హౌజింగ్ అందించే సంస్థలకు ప్రాజెక్టులో 90% మేర రుణాలు మంజూరు చేయాలని, అది కూడా గృహాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే వడ్డీ రేటుకే ఈ రుణాలు ఇవ్వాలని నివేదించినట్టు తెలిపారు. ముంబై వంటి నగరాల్లో స్టాంప్ డ్యూటీ కేవలం రూ. 1000గా ఉందని, కానీ అనేక రాష్ట్రాల్లో 3–5% వరకు ఉందని వివరించారు. దీనిని సగానికి సగం తగ్గించాలని కోరినట్టు తెలిపారు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీని ఏటా రూ. 5 లక్షల మేర మినహాయింపు ఇవ్వాలని, గృహ నిర్మాణం పూర్తవడంతో సంబంధం లేకుండా తొలి ఏడాది నుంచే వర్తించేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుందని నివేదించినట్టు తెలిపారు. -
సల్ఫర్ ఎరువుపై రాయితీ 84 పైసలు పెంపు
న్యూఢిల్లీ: సల్ఫర్ ఎరువుపై రాయితీని కేజీకి 84 పైసలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ రాయితీ కేజీకి రూ. 2.72 ఉండగా, దానిని రూ. 3.56కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే యూరియాయేతర, ఇతర పోషక ఎరువులకు ఇస్తున్న రాయితీలో మార్పులేమీ లేవని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో యూరియాయేతర ఎరువులకు రాయితీ ఇచ్చేందుకు వెచ్చించే మొత్తం రూ. 22,875.5 కోట్లుగా ఉంటుందని ఆయన చెప్పారు. జవదేకర్ మాట్లాడుతూ ‘దేశంలో యూరియా వాడకం ఎక్కువగా ఉంది. అయితే వ్యవసాయానికి యూరియా ఎంత ముఖ్యమో ఎన్పీకేఎస్ (ఎన్–నైట్రోజన్, పీ–ఫాస్ఫాటిక్, కే–పొటాసిక్, ఎస్–సల్ఫర్) కూడా అంతే ముఖ్యం. ఎన్పీకేఎస్ పోషకాలకు కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. సల్ఫర్(ఎస్)పై రాయితీని కేజీకి ప్రస్తుత రూ. 2.72 నుంచి రూ. 3.56కు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఎన్,పీ,కేలపై రాయితీల్లో మార్పులేమీ ఉండవు’ అని వివరించారు. ప్రస్తుతం నైట్రోజన్(ఎన్)పై కేజీకి రూ. 18.9, ఫాస్ఫాటిక్(పీ)పై కేజీకి రూ. 15.21, పొటాసిక్(కే)పై కేజీకి రూ. 11.12లను కేంద్రం రాయితీగా ఇస్తోంది. యూరియాయేతర ఎరువులు రైతులకు అందుబాటు ధరల్లోనే ఉండాలనే ఉద్దేశంతో సల్ఫర్పై రాయితీని పెంచినట్లు జవదేకర్ చెప్పారు. కాగా, కేంద్రం ఓ ప్రకటన విడుదల చేస్తూ సల్ఫర్పై రాయితీని పెంచుతున్నట్లు ఏ రోజు నోటిఫికేషన్ విడుదల అవుతుందో ఆ రోజు నుంచే కొత్త రాయితీ అమల్లోకి వస్తుందనీ, అప్పటి వరకు ప్రస్తుత రేట్లే ఉంటాయని స్పష్టం చేసింది. యూరియాయేతర ఎరువులైన డీఏపీ (డై–అమ్మోనియం ఫాస్ఫేట్), ఎంవోపీ (మ్యురియేట్ ఆఫ్ పొటాష్), ఎన్‌పీకేల ధరలను వాటి తయారీదారులే నిర్ణయించుకుంటారు. అయితే ప్రభుత్వం వాటిపై కొంత రాయితీని మాత్రం ఇస్తుంది. ఆ రాయితీ ఎంతనేది ఏయేటికాయేడు కేంద్రం నిర్ణయిస్తుంది. కశ్మీర్ ఈడబ్ల్యూఎస్ కోటాకు ఓకే ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కశ్మీర్‌కు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న రిజర్వేషన్లకు తోడుగా ‘కశ్మీర్ ఈడబ్ల్యూఎస్’ కోటాను అమలుచేస్తారని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మరోవైపు, ఓబీసీల్లో ఉపవర్గాలపై అధ్యయ నానికి ఏర్పాటైన కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది జనవరి 31 వరకు గడువు పెంచింది. సుప్రీం జడ్జీలు 34మంది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరింత పరిపుష్టంకానుంది. కోర్టు జడ్జీల గరిష్ట సంఖ్యను 34కు పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుందని కేబినెట్ భేటీ తర్వాత కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో చెప్పారు. సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య దాదాపు 60,000కు చేరుకున్న నేపథ్యంలో జడ్జీల పరిమితి పెరగడం గమనార్హం. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి అనుమతించిన సుప్రీం జడ్జీల సంఖ్య 30గా ఉంది. జడ్జీల గరిష్ట పరిమితిని పెంచాలని గతంలో ప్రధాని మోదీకి సీజేఐ జస్టిస్ గొగోయ్ లేఖరాయడం తెల్సిందే. ‘ మూడు దశాబ్దాల క్రితం 1988లో సీజేఐని మినహాయించి జడ్జీల సంఖ్య పరిమితిని 18 నుంచి 25కు పెంచారు. తర్వాత మరో రెండు దశాబ్దాలకు 2009లో 30కి పెంచారు. పోగుబడుతున్న కేసులను త్వరగా తేల్చాలన్నా, ప్రజలకు సరైన సమయానికి న్యాయం దక్కాలన్నా, రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు జరగాలన్నా జడ్జీల సంఖ్య పెంచడం తప్పదు’ అని మోదీకి రాసిన లేఖలో సీజేఐ పేర్కొన్నారు. -
‘సబ్సిడీ’ గడబిడ!
సాక్షి, సిటీబ్యూరో: గృహోపయోగ వంట గ్యాస్ సబ్సిడీ సొమ్ము వ్యవహారం గడబిడగా తయారైంది. సిలిండర్ ధరలో సబ్సిడీ సొమ్ము నగదు బదిలీ కింద బ్యాంక్ ఖాతాలో జమ చేయడంలో ఒక నిర్ధిష్టమైన లెక్కంటూ లేకుండా పోయింది. ప్రతి నెల ధరల సవరణ మరింత అయోమయానికి గురిచేస్తోంది. వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తున్నా..సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేదు. కొందరు వినియోగదారులకు బ్యాంకు ఖాతాలో మొక్కుబడిగా నగదు జమ అవుతున్నా... మరికొందరికి అసలు నగదు జమ కావడం లేదు. బ్యాంక్ ఖాతాలో జమయ్యే నగదు సిలిండర్ ధరలోని సబ్సిడీ సొమ్ముతో పొంతన లేకుండా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పేదలకు నగదు బదిలీ కింద వంట గ్యాస్ సిలిండర్ ధర ఆర్థికంగా భారంగా తయారైంది. మార్కెట్ ధరపైనే సిలిండర్ గృహోపయోగ సబ్సిడీ వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతున్న కారణంగా మార్కెట్ ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చమురు సంస్థలు సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది. ఇదీ కేవలం నగదు బదిలీ కింద అనుసంధానమైన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తోంది. చమురు సంస్థల నిబంధనల ప్రకారం సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సరఫరా అయ్యే సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. సబ్సిడీ సొమ్ము కూడా నగదుగా బ్యాంక్ ఖాతాలో జమ కాదు. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కలు చూపిస్తోంది. వాస్తవంగా పథకం అమలు అరంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది.కానీ, ఇప్పుడు తిరిగి పాత పరిస్థితి పునరావృతం అవుతోంది. ధరల సవరణలతో సబ్సిడీ సొమ్ము జమ మరింత అయోమయంగా తయారైంది. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. కనెక్షన్లు ఇలా.. హైదరాబాద్ మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో సుమారు 28.21 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజు డిమాండ్‌ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సిలిండర్ల స్టాక్ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్లైన్ బుకింగ్‌ను బట్టి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు, హెచ్‌పీసీఎల్‌కు సంబధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. -
రాయితీకి మంగళం!
యాచారం(ఇబ్రహీంపట్నం): కూరగాయ విత్తనాల పంపిణీ విషయంలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ చేతులేత్తెసింది. విత్తనాలపై అందజేసే రాయితీలపై కేసీఆర్ సర్కార్ నుంచి నేటికి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో సంబంధిత శాఖ అధికారులతోపాటు రైతుల్లో అయోమయం నెలకొంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు కురిసి పొలం దున్ని నార్లు పోయడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాయితీ విత్తనాలు లేవంటూ ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారులు చావు కబురు చల్లగా చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేస్తే అవి నకిలీవో... లేదా నాణ్యమైనవో తెలియకని భయాందోళన నెలకొంది. అదే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే ఆ భయం, దిగులు ఉండదు. మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. అయితే, ఈ ఏడాది ఆ ఉసే లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక రైతులకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. కూరగాయ విత్తనాల కోసం ఆయా డివిజన్లల్లో ఉన్న ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులను రైతులు నిత్యం కలుస్తున్నా.. స్వష్టమైన హామీ రావడం లేదు. మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండడంతో విస్తారంగా కూరగాయలు పండించేలా కేసీఆర్ సర్కార్ పంట కాలనీల పథకాన్ని చేపట్టింది. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద ఇబ్రహీంపట్నం డివిజన్‌ను ఎంపిక చేసింది. అనంతరం చేవెళ్ల, మహేశ్వరం, షాద్‌నగర్ డివిజన్లను కూడా ఈ పథకం కింద ఎంపిక చేసింది. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి వేలాది టన్నుల కూరగాయల పండించాలని సంకల్పించింది. ఆలోచన బాగానే ఉన్నా అమలు విషయానికి వచ్చేసరికి తుస్సుమంది. రాయితీ విత్తనాలకే మంగళం పాడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూరగాయ విత్తనాలను అధికారులు 50 శాతం రాయితీతో అందజేసేవారు. ఈసారి సబ్సిడీకి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదు. విత్తనాల్లేవ్... నారే ఇస్తాం.. రాయితీ విత్తనాలకు మంగళం పాడిన ప్రభుత్వం నారును పంపిణీ చేయడానికి నిర్ణయించింది. అది కూడా కేవలం టమాట, మిర్చి, వంకాయ రకానికే పరిమితం చేసింది. కేవలం మూడు రకాల నార్లనే ఇస్తామని చెప్పడం రైతులకు మింగుడుపడడం లేదు. కాగా కూరగాయల విత్తనాలపై ఉన్న రాయితీలను రద్దు చేసిన సర్కార్.. రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయంలోనే రైతులు తమకు కావాల్సిన విత్తనాలు కొనుగోలు చేసు కోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాయితీ లేదని చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి స్వష్టత రాలేదు రాయితీ విత్తనాలు అందించే విషయంలో నేటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. రైతులు నిత్యం ఆయా డివిజన్లల్లోని మండలాల్లో ఉద్యానశాఖ అధికారులను కలిసి రాయితీ విత్తనాలు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి 20 పైసలకు ఒకటి చొప్పన టమాట, మిర్చి, వంకాయ నారును అందించాలని ఆదేశాలు ఉన్నాయి. రైతులు కొంతమంది కలిసి గచ్చిబౌలి వెళ్లి నారు తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఇస్తాం. పంట కాలనీల పథకం అమలు గగనమే. మరోమారు ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సునందారెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిణి -
అక్రమార్కుల పా‘పాలు’
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ పాడి గేదెల పథకాన్ని కొందరు భ్రష్టుపట్టిస్తున్నారు. అక్రమార్కుల పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. 3, 4 లీటర్లు కూడా పాలివ్వని పశువులను కూడా రైతులతో కొనిపిస్తున్నారు. కొందరు అధికారులు, పశువైద్యులు, దళారులు కుమ్మక్కు అయి పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో పాలకొరత లేకుండా, స్వయంసమృద్ధి సాధించాలని సర్కారు సంకల్పించింది. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గేదెల పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేయాలన్నది సర్కారు ఉద్దేశం. ఒక్కో పాడి పశువుకు రూ.80 వేలు యూనిట్ ధరగా నిర్దారించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీ (రూ.60 వేలు) ఇస్తారు. అందులో మిగిలిన 25 శాతం (రూ.20 వేలు) లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఇతర లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ (రూ.40 వేలు) ఖరారు చేశారు. మిగిలిన 50 శాతం వాటాను లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. యూనిట్ ధర రూ.80 వేలలో పాడి పశువు ధర, మూడేళ్ల బీమా, 300 కిలోల దాణా కూడా కలిపారు. కాబట్టి లబ్ధిదారుడు ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. కమీషన్ల కోసం కుమ్మక్కు... నాలుగు డెయిరీల పరిధిలో 2.13 లక్షల మంది పాడి రైతులకుగాను ఇప్పటివరకు 57,567 మంది రైతులకు పాడి పశువులను సబ్సిడీపై ఇచ్చారు. అందులో విజయ డెయిరీ పరిధిలో 29,189 మంది రైతులు, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీకి చెందిన 13,878 మంది, ముల్కనూరు మహిళా డెయిరీకి చెందిన 2,942 మంది. కరీంనగర్ డెయిరీలో 11,558 మంది పాడి రైతులు ఇప్పటివరకు గేదెలు లేదా ఆవులు కొనుగోలు చేశారు. వయసు మళ్లిన వాటిని కొనుగోలు చేసి రైతులకు ఇస్తున్నారు. పాడి ఉత్పత్తి గేదెలలో కనీసం 6–10 లీటర్లు, ఆవులలో 8–12 లీటర్లు సామర్థ్యం కలిగి ఉండాలి. ముర్రా, గ్రేడేడ్ ముర్రా గేదెలు, ఆవు జాతి అయిన జెర్సీ, హోలిస్టిన్ సంకర జాతి పశువులను కొనవలసి ఉండగా నాటు పశువులను కొంటున్నారు. సబ్సిడీ గేదె బహిరంగ మార్కెట్లో రూ.30 వేలకు మించి ధర పలకదని, కానీ దాన్నే రూ.80 వేలకు కొనిపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేదెలను తీసుకొచ్చే ప్రాంతంలోని దళారులతో పశువైద్యులు కొందరు కుమ్మక్కు అయి ప్రతి గేదె పేరిట రూ.10 వేలకుపైగానే కమీషన్ కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గేదెలను తీసుకువచ్చే వాహనాల ఖర్చు కూడా రైతులతోనే పెట్టిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ఎన్నో సంతలుండగా, ఇతర రాష్ట్రాల్లో కొనిపిస్తూ రైతులను అప్పులపాలు చేస్తున్నారు. పాడి పశువులను కొనకపోతే ఇప్పటికే పోస్తున్న పాలు తీసుకోబోమని పాల కేంద్రాల నిర్వాహకులు, వైద్యం చేయబోమని కొందరు పశు వైద్యాధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పాడి రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకొని అధికారులు ఎంతో ధీమాగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. పాడి గేదెల పంపిణీలో అవినీతి పాడిగేదెల పంపిణీలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ పథకంతో రైతుకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్టర్లకు, పశువైద్యాధికారులకు పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే పాడిగేదె బహిరంగ మార్కెట్లో రూ.30 వేలకు మించి ఉండదు. రవాణా ఖర్చులు మాపైనే వేసేందుకు పశువైద్యులు ప్రయత్నిస్తున్నారు. దీన్ని నేను వ్యతిరేకించాను. – రాగీరు కిష్టయ్య, రైతు, జైకేసారం, చౌటుప్పల్ మండలం -
లీటర్‌కు రూ. 4 బోనస్!
‘ఇదిగో ఇటు చూడండి.. ఇది మంచి నీళ్ల సీసా. లీటర్ ధర అక్షరాల రూ. 20. ఇదిగో ఇది పాల సీసా.. లీటర్ పాలకు రైతుకు ఇచ్చే ధర రూ. 22, 23. నీళ్ల ధర, పాల సేకరణ ధర ఒకటే అయితే పాడి రైతు బతికేదెలా? ఆ కుటుంబం గడిచేదెలా?‘ అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన. పాడి ఉన్న ఇంట సిరులు విరజిల్లునంట అనే సామెత పాతబడింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో ఐదోస్థానం. 47 లక్షల పశువులు (ఆవులు, గొర్రెలు, మేకలు), 64.62 లక్షల గేదెలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అంచనా. లక్షలాది మంది రైతులు పాడి పశువుల పెంపకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం 133 లక్షల మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం పాల ఉత్పత్తిలో 69 శాతంతో ఆవు పాలు అగ్రస్థానంలో ఉండగా గేదె పాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ధరలో కూడా ఈ రెండింటికీ తేడా ఉంది. 2023 నాటికి పాల ఉత్పత్తి సుమారు 20 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. కరవొచ్చినా కాటకం వచ్చినా ఇబ్బంది పడకుండా పాడి కాపాడుతుంది. ఏడాది పొడవునా అంతో ఇంతో ఆదాయం వస్తుందని పెద్దలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబుకు కరవుకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది నానుడి. దానికి తగ్గట్టే నాలుగైదు ఏళ్లుగా మృగశిర కార్తె చిందేయడం మానేసింది. ముసలి ఎద్దు రంకె వేయడమూ ఆగింది. కరవు, పశుగ్రాసం కొరతతో పశువులు కబేళాలకు తరలుతున్నాయి. మరోపక్క పశువుల దాణా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తవుడు, చిట్టు, చెక్క ధరలు భారీగా పెరిగాయి. పాడి రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ స్థాయిలో పాల సేకరణ ధరలు మాత్రం పెరగలేదు. దీంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో రైతులు పాడిని వదిలేసుకుంటున్నారు. పశువు పోయాక పాడి బయటపడినట్టుగా– పాలు పోయించుకుంటున్న పాల సంఘాలు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం లేదు. బకాయిలు పేరుకుపోతున్నాయి. సహకార డైరీలకు ప్రభుత్వం మొండి చేయి చూపడంతో మూతపడుతున్నాయి. హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్థలకు ఇది వరంగా మారింది. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నాయి. 2015 మే నెలకు ముందు లీటర్ పాల ఉత్పత్తికి 26 రూపాయలు ఖర్చయ్యేది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఆ ధర రూ. 30 దాటి పోయింది. కానీ, పాల సేకరణ ధర మాత్రం రూ. 18 నుంచి 28 మధ్యే ఉంది. పాలలో వచ్చే వెన్న శాతాన్ని బట్టి ఈ ధర ఉంటుంది. 2015 మే నెలకు ముందు పాల సేకరణ ధర రూ.32, 35 మధ్య ఉండేది. ఉత్పత్తి పెరిగిందన్న సాకుతో ధరను తగ్గించి పాడి రైతుల నోట మట్టికొడుతున్నారు. లీటర్ నీళ్ల ధర రూ.20గా ఉంటే పాల సేకరణ ధర 23, 24 రూపాయలకు మించడం లేదు (గేదె పాల ధర రూ.28 నుంచి 34 మధ్య ఉంటుంది). అంతర్జాతీయ మార్కెట్లో మిగులు పేరిట పెద్ద కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. విధాన నిర్ణేతల లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, సన్నకారు పాడి రైతులు బడా కార్పొరేట్ సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికులుగా చేరాల్సి వస్తోంది. వ్యవసాయ సంక్షోభం, తీవ్ర కరవు పరిస్థితులను తట్టుకునేందుకు ఆసరా ఉంటుందని పాడి పశువుల్ని పెట్టుకుంటే ఇప్పుడు వాటినీ పోషించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా పాల ఉత్పత్తికి వెన్నుముకగా ఉన్న చిన్న రైతులు పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా పాడి రైతుల్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలి. పాల సేకరణ ధర పెంచడమో, లీటర్‌కు ఇంతని బోనస్ ఇవ్వడమో చేయాలి. పాడి రైతుల కష్టాలకు చలించిన చాలా రాష్ట్రాలు లీటర్‌కు నాలుగైదు రూపాయల బోనస్‌ను ప్రకటించాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ.4, కర్ణాటకలో రూ.5, మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.5 ల బోనస్ ఇస్తోంది. కర్ణాటకలో రైతులకు బోనస్ ఇవ్వడం వల్ల సహకార పాల సంఘాలు చాలా బలీయంగా తయారయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాడి రైతుల్ని గాలికి వదిలేశారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసాను ప్రకటించారు. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే ప్రతి రైతుకూ లీటర్‌కు 4 రూపాయల బోనస్ ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో దాదాపు 60, 65 లక్షల మంది కుటుంబాలకు మేలు జరుగుతుంది. జగన్ ఇచ్చే బోనస్‌తో కలుపుకుని పాల సేకరణ ధర లీటర్‌కు రూ. 30 దాటుతుంది. చంద్రబాబు హయాంలో మూతపడిన చిత్తూరు, ప్రకాశం, విశాఖ, కాళహస్తి కో ఆపరేటివ్ డైరీ వంటి వాటినన్నింటినీ తిరిగి తెరిపిస్తానని హామీ ఇవ్వడం పట్ల పాడి రైతులు సంబరపడుతున్నారు. బకాయిల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేకుండా పాల డైరీలన్నింటినీ సహకార రంగంలోకి తీసుకువస్తానని భరోసా ఇస్తున్నారు. డైరీలను సహకార రంగంలోకి తీసుకువచ్చి ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడు చచ్చినట్టు ప్రై వేటు డైరీలు కూడా పాల సేకరణ ధర పెంచకతప్పదు. సకాలంలో డబ్బులు ఇస్తాయి. విశ్వసనీయతా పెరుగుతుంది. పాల సంఘాలను కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ పర్యవేక్షణలో నడపగలిగితే ప్రైవేటు డైరీల ఆగడాలకు ముగుతాడు వేయడమే కాకుండా అటు పాడి రైతులకు ఇటు వినియోగదారులకు మేలు చేసినట్టవుతుంది. ఆ పని చేస్తానని జగన్ ఇచ్చిన హామీ పట్ల రాష్ట్ర పాడి రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. – ఆకుల అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
ఎల్పీజీ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో ఎల్పీజీ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలని ఇండియన్ ఆటో ఎల్పీజీ సంస్థల సమాఖ్య (ఐఏసీ) కోరింది. సబ్సిడీపై విక్రయించేందుకు విద్యుత్, హైబ్రీడ్ వాహనాల కోసం రూ. 10,000 కోట్ల స్కీమును ప్రకటించడం స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ఆటో ఎల్పీజీ వాహనాల వినియోగాన్ని సైతం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. మిగతా ఇంధనాలతో పోలిస్తే మెరుగైన ఆటో ఎల్పీజీ వంటి గ్యాస్ ఇంధన వినియోగదారులకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఇందుకోసం సబ్సిడీలు ఇవ్వనక్కర్లేదని.. విధానాలపరంగా ఆటో ఎల్పీజీపై జీఎస్టీని తగ్గించడం తదితర చర్యలు తీసుకుంటే చాలని ఐఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమయమైన నగరాల జాబితాలో కొన్ని భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా 65 శాతం విద్యుదుత్పత్తి శిలాజ ఇంధనాల నుంచే జరుగుతోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే మరో రెండు దశాబ్దాలు పట్టేసే అవకాశం ఉంది. నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం 20 ఏళ్లు ఆగే పరిస్థితి ఉందా.. అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి రోజున కాలుష్య సమస్యను అరికట్టేందుకు తగు తక్షణ పరిష్కారమార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఆటో ఎల్పీజీ ఒక మంచి ప్రత్యామ్నాయం‘ అని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా తెలిపారు. -
ఎలక్ట్రిక్ త్రీవీలర్లు.. ‘ఫేమ్’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల పైచిలుకు త్రీవీలర్లు తయారవుతున్నాయి. ఇందులో సుమారు 65 శాతం వాహనాలు దేశీయంగా అమ్ముడవుతున్నాయి. ఫేమ్–2 కింద ఇప్పుడు 5,00,000 ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం ఇవ్వనుండడంతో ఈ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఒక్కో వాహనానికి బ్యాటరీ రకాన్నిబట్టి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఉండడంతో ఈ ఏడాది నుంచి అమ్మకాలు జోరుమీదుంటాయని చెబుతున్నాయి. 2020 నుంచి ఏటా అమ్ముడయ్యే త్రీవీలర్లలో 25% ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని పరిశ్రమ ధీమాగా ఉంది. ఫేమ్–టూ జోష్‌తో కొత్త మోడళ్ల రూపకల్పన, తయారీ సామర్థ్యం పెంపు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కంపెనీలు దృష్టిసారించాయి. పట్టణాల్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఎలక్ట్రిక్ త్రీవీలర్లే ఉత్తమ పరిష్కారమని డెలాయిట్ తన నివేదికలో వెల్లడించింది. ఇదీ భారతీయ పరిశ్రమ.. సంప్రదాయ సైకిల్ రిక్షాల స్థానంలో క్రమంగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ రిక్షాలు వచ్చి చేరుతున్నాయి. భారత్‌కు ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా, అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దేశంలో 15 లక్షల పైచిలుకు ఎలక్ట్రిక్ త్రీవీలర్లు పరుగెడుతున్నాయి. 2017–18లో కొత్తగా 3.5 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి. మహీంద్రా, గోయెంకా, ట్రినిటీ క్లీన్టెక్, కినెటిక్ ఇంజనీరింగ్ వంటి 15–20 కంపెనీలు దీర్ఘకాలిక లక్ష్యంతో రంగంలోకి దిగాయి. వచ్చే ఏడాదికల్లా బజాజ్ ఆటో, పియాజియో ఈ విపణిలోకి అడుగుపెట్టనున్నాయి. చెనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని విక్రయించే కంపెనీలు సుమారు 200 దాకా ఉంటాయి. ఉత్తర, తూర్పు భారత్‌లో ఈ–రిక్షా, ఈ–ఆటోలకు డిమాండ్ ఎక్కువ. ఫేమ్–2తో దక్షిణాదిలోనూ వీటి అమ్మకాలు పెరగనున్నాయి. ఓలా 10,000 ఈ–రిక్షాలను రంగంలోకి దింపుతోంది. కిలోమీటరుకు రూ.1.50.. త్రిచక్ర వాహనం కిలోమీటరు తిరిగినందుకు అయ్యే వ్యయం పెట్రోల్ వేరియంట్ అయితే రూ.4, డీజిల్ రూ.3.50 అవుతోంది. అదే ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌కు వ్యయం కిలోమీటరుకు రూ.1.50 మాత్రమేనని గోయెంకా ఎలక్ట్రిక్ మోటార్ వెహికిల్స్ సీఈవో జాఫర్ ఇక్బాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే బ్యాటరీ ఖరీదు ఇప్పుడు 20–25%కి వచ్చి చేరిందని చెప్పారు. హైదరాబాద్‌లో తమ కంపెనీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోం దని వెల్లడించారు. వాహన యజమానులు తమ వాహనానికి బ్యాటరీ వినియోగించినందుకు నెలవారీ చందా చెల్లిస్తే చాలని వివరించారు. ఈ–త్రీవీలర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారిస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఈడీ నాగ సత్యం తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలో అడ్డంకులు తొలగించాలని కోరారు. డీజిల్ ఆటోల కొత్త అనుమతులకు బదులు ఎలక్ట్రిక్ త్రీవీలర్ ఉండాలన్న నిబంధన రావాలన్నారు. ఈ–రిక్షాలకూ అనుమతి..! గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వేళ్లే ఈ–రిక్షాలకు ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన రహదారుల్లో అనుమతి లేదు. 25 కిలోమీటర్ల కంటే అధిక వేగం ఉన్న ఈ–ఆటోలకే అనుమతి ఉంది. ఢిల్లీ మెట్రోలో రోజూ 30 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఇందులో 50–60 శాతం మంది 3 లక్షల పైచిలుకు ఈ–త్రీవీలర్లలో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇక హైదరాబాద్ మెట్రోలో రోజూ 2 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఇంతే సంఖ్యలో ఎంఎంటీఎస్‌లో వెళ్తున్నారు. ప్రధాన రహదారులు మినహా ఇతర ప్రాంతాలకు ఈ స్టేషన్ల నుంచి వెళ్లే మార్గాల్లో ఈ–రిక్షాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. చిన్న రోడ్లలో వెళ్లేందుకు పెద్ద వేగం అక్కర లేదన్నది కంపెనీల వాదన. ట్రినిటీ క్లీన్టెక్ ఈటో బ్రాండ్ ఈ–ఆటోలను మెట్రో స్టేషన్ల నుంచి త్వరలో నడుపనుంది. -
చేనేతకు ఆ'ధార'మేదీ..?
నిర్వీర్యమైన చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చేనేత రంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన చేనేత రుణమాఫీ సక్రమంగా నేటికీ చాలామందికి అమలు చేయకపోగా చివరకు ఆప్కోకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా దగాకోరు విధానాన్ని అవలంబిస్తోంది. టీడీపీ ప్రభుత్వ తీరుతో చేనేతల పరిస్థితి దయనీయంగా మారింది. సాక్షి, చీరాల(ప్రకాశం): చేనేతల స్థితిగతులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేతల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24 వేల చేనేత కుటుంబాల వారు ఉన్నారు. చేనేత రంగంపై లక్షా అరవై వేల మంది చేనేతలు పరోక్షంగా ఆధారపడ్డారు. జిల్లాలో 70కి పైగా ఆప్కో సొసైటీలు ఉండగా ఒక్క చీరాలలోనే 50 వరకు ఈ సంఘాలు పని చేస్తున్నాయి. జిల్లాలో చేనేత వస్త్రాల ఉత్పత్తి నెలకు రూ.7 కోట్ల వరకు ఉన్నప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో మాస్టర్ వీవర్ల వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో మాస్టర్‌వీవర్ వద్ద పది నుంచి ఇరవై లక్షలు విలువ చేసే చేనేత వస్త్రాలు నిల్వ ఉన్నాయని సమాచారం. వస్త్రాల ఉత్పత్తి పెరిగిపోతుండటం, కొనుగోళ్లు లేకపోవడం, ఆప్కో చేయూత అందించకపోవడంతో మాస్టర్‌వీవర్లు తమ వద్ద పనిచేసే చేనేత కార్మికులకు పని కూడా కల్పించక పూట గడుపుకోవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాలో తయారయ్యే జరీకోట, గద్వాల్, అస్సాంపట్టు, కుప్పటం వంటి చేనేత వస్త్రాలకు రాష్ట్రంలోని విజయవాడ, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అందమైన చీరలను నేసేందుకు వినియోగించే పట్టు, జరీ తదితర నూలును ముంబాయి, సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటారు. పెట్టుబడులు పెట్టి వస్త్రాలు తయారు చేయిస్తున్నప్పటికీ కొనుగోళ్లు లేక, ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వకపోవడం, ఆప్కో మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడంతో నేతన్నల పరిస్థితి కడు దయనీయంగా మారింది. చేనేతలను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల ముడిసరుకులు, రంగు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేసి చేనేత వస్త్రాలను అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వ హామీలు బుట్ట దాఖలయ్యాయి. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన ఆప్కో కనీసం ప్రత్యేక చర్యలను, కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి సూచనలు తీసుకోకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోతూనే ఉన్నాయి. కనీస వేతన చట్టానికీ కరువే... కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. అయితే చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. చేనేత “రిజర్వేషన్’కు చెల్లుచీటి: పరిశ్రమల ధాటికి ఈ రంగం కొట్టుకుపోయి, కార్మికులు రోడ్డున పడుతారన్న ఉద్దేశంతో 22 రకాల వస్త్రాలను చేనేత రంగానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. పవర్లూమ్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం దానిని 1985లో 22 రకాలను కాస్త 11 రకాలకు కుదించింది. అయితే ఈ 11 రకాల వస్త్రాలు తయారు చేస్తే పూట గడుస్తుందని భావించిన కార్మికులు అందుకు అంగీకరించారు. చీరలు, లుంగీలు, పంచెలు, చేతిరూమాలు వంటివి తయారు చేస్తూ లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారు. అయితే ప్రస్తుతం చేనేత రిజర్వేషన్ చట్టానికి పూర్తిగా తూట్లు పడటంతో మగ్గాలు మూలనపడుతున్నాయి. చేనేత రంగానికి కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లను మరమగ్గాలపైనే తయారవుతున్నాయి. చేనేత వస్త్రాల మాటున జరుగుతున్న ఈ అక్రమ దందాను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఊహల్లోనే..ఉచిత విద్యుత్ హామీ టీడీపీ ప్రభత్వుం ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ అమలైతే ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు 100 యూనిట్లలోపు బిల్లు రూ.300 మినహాయింపు కలుగుతుంది. గృహ అవసరాలు, చేనేతలకు ఒకే శ్లాబు అమలులో ఉండగా వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తుల వారికి మరొక శ్లాబు ప్రకారం రేట్లను విద్యుత్‌శాఖ నిర్ణయించింది. అయితే జిల్లాలో కేవలం 7500 కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యుత్ అర్హులుగా చేసేలా చేనేతశాఖ అధికారులు సర్వే పూర్తిచేసి నివేదికలను ప్రభుత్వానికి అందించారు. కానీ పథకం మాత్రం అమలుకాకపోవడంపై నేతన్నలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చెయ్యిచ్చిన బాబు..చేయూత నిచ్చిన మహానేత వైఎస్ఆర్ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న చేనేత రంగానికి 9 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు చేయూతనివ్వకపోగా చేతివృత్తులకు కాలం చెల్లిందని, ఆ వృత్తిని వదలి మరమగ్గాలవైపు వెళ్లండని ఉచిత సలహా ఒకటి పడేశారు. రాష్ట్రంలో ఉన్న నూలు మిల్లులు అన్నీ మూసివేశారు. కార్మికులకు ఉపాధి దెబ్బతినడంతో పాటు, చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి నూలు కొనుగోలు చేయాల్సిరావడం ప్రస్తుతం పెను భారంగా మారింది. చంద్రబాబు పాలనలో వందల సంఖ్యలో చేనేత ఆత్మహత్యలు జరిగాయంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏస్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అదే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత రంగానికి చేయూతనిచ్చారు. రైతులకు మాదిరిగా చేనేతలకు రూ.312 కోట్లు రుణమాఫీ చేశారు. అప్పటి వరకు చిలపనూలుపై ఉన్న 9.25 ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి కార్మికులపై భారాన్ని తగ్గించారు. రంగు, రసాయనాలు, చిలపనూలుపై 10 శాతం సబ్సిడీ అవకాశం కల్పించారు. ఏరాష్ట్రంలో లేని విధంగా చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పించారు. బలహీనంగా ఉన్న ఆప్కోకు నిధులు కేటాయించి పటిష్టపరిచారు. ఇదిలా ఉంటే మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పాలించిన కిరణ్ చేనేతలకు ప్రత్యేక పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకుండానే పదవి నుంచి దిగివెళ్లారు. రుణాలకు మొండికేస్తున్న బ్యాంకర్లు చేనేతలకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. చీరాల ప్రాంతంలో కార్మికులకు ప్రభుత్వం ఎనిమిది వందల మందికి పైగా అర్టిజన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేసింది. కానీ వాటి ద్వారా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదు. వ్యక్తిగత రుణాలు తిరిగి చెల్లించరనే ఉద్దేశంతో బ్యాంకర్లు కార్మికులకు రుణాలు ఇవ్వడంలేదు. ఈ కార్డుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం నాలుగు శాతం రాయితీ ఇస్తుంది. బ్యాంకర్ల మొండి వైఖరి కారణంగా చేనేత రుణాలు అందని ద్రాక్షపండులా మారాయి. చేనేతలను ఆదుకోవాలి జిల్లాలో రోజురోజుకూ పేరుకుపోతున్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయల చేనేత వస్త్రాల నిల్వలను దశల వారీగానైనా ఆప్కో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే నేతన్నల అభివృద్ధి. - పడవల లక్ష్మణస్వామి, చేనేత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు, తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద 2019 ఏప్రిల్ 1 నుంచి 3 ఆర్థిక సంవత్సరాల కాలంలో కేంద్రం రూ.10,000 కోట్ల మేర విద్యుత్‌తో నడిచే వాహనాల కొనుగోలుదారులకు రాయితీలు కల్పించనుంది. ఈ పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు, ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. 35వేల కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందొచ్చు. హైబ్రిడ్ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000–20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు. అలాగే, 5 లక్షల ఈ రిక్షాలకు, ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, 7,090 ఈ బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరం లో రూ.1,500 కోట్లు, 2020–21లో 5,000 కోట్లు, 2021–22లో 3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధర లో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20%గా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు. ఇది సరైన సమయంలో సరైన అవకాశమని, ఫేమ్–1కు, ఫేమ్–2కు మధ్య విరామం లేకుండా కొనసాగింపు అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణుమాథుర్ పేర్కొన్నారు. -
ఫేమ్–2 పథకాన్ని నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ఫేమ్–2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధరపై వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం కింద రూ.10,000 కోట్లను కేంద్రం కేటాయించింది. ‘‘దేశంలో ఎలక్ట్రిక్ రవాణాను వేగంగా అమల్లోకి తీసుకురావడంతోపాటు, తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం, 2019 ఏప్రిల్ 1 నుంచి మూడేళ్ల కాలానికి ఈ పథకం అమలును ప్రతిపాదించడం జరిగింది’’అని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. ఈ పథకం రెండో దశ కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా ఒక్కో వాహనానికి ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. అలాగే, 5 లక్షల ఈ రిక్షాలకు ఎక్స్ ఫ్యాక్టరీ ధర రూ.5 లక్షలపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. ఇక 35,000 ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాలకు (ఎక్స్ ఫ్యాక్టరీ ధర రూ.15 లక్షల వరకు), ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ.35,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, 7,090 ఈ బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరంలో రూ.1,500 కోట్లు, 2020–21లో రూ.5,000 కోట్లు, 2021–22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు వాటి ధరలో గరిష్టంగా 40 శాతం, ఇతర వాహనాలకు 20 శాతంగా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు. ఈ ప్రోత్సాహకాలను వార్షికంగా లేదా ధరల మార్పులు, ఉపకరణాల మార్కెట్ ధరలకు అనుగుణంగా ముందే సవరించొచ్చని నోటిఫికేషన్ తెలిపింది. -
‘ఫేమ్’ రెండో విడతపై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ: సబ్సిడీల ద్వారా ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం రెండో విడతకు కేంద్ర క్యాబినెట్ నేడు (గురువారం) ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు సబ్సిడీనిచ్చేందుకు రూ. 10,000 కోట్ల కేటాయింపులతో ఫేమ్–ఐఐ పథకాన్ని రూపొందించినట్లు వివరించాయి. అయితే, దీని వ్యవధి ముందుగా అనుకున్నట్లు అయిదేళ్లు కాకుండా మూడేళ్లకు మాత్రమే పరిమితం కానుంది. అలాగే, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లకు ఉద్దేశించిన సబ్సిడీని.. ట్యాక్సీ సేవల సంస్థలకు మాత్రమే వర్తింప చేసే అవకాశం ఉంది. విద్యుత్‌తో నడిచే బస్సులు, ట్యాక్సీ అగ్రిగేటర్స్ ఉపయోగించే ప్యాసింజర్ కార్లు, త్రిచక్ర వాహనాలు, 10 లక్షల ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై ఫేమ్– ఐఐ కింద రూ. 10,000 కోట్ల మేర సబ్సిడీ లభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘రెండో విడతలో రూ. 50 లక్షల దాకా ఖరీదు చేసే 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సుమారు 40 శాతం దాకా సబ్సిడీ లభిస్తుంది. 5 లక్షల త్రిచక్రవాహనాలకు రూ. 50,000 దాకా సబ్సిడీ ఉంటుంది. ప్రైవేట్ కార్లకు కాకుండా ట్యాక్సీ అగ్రిగేటర్స్ కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం ఉంటుంది‘ అని పేర్కొన్నాయి. వాహనం కేటగిరీని బట్టి రెండో విడతలో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, పార్కింగ్ చార్జీలు మొదలైన వాటి నుంచి మినహాయింపులు కూడా లభించే అవకాశం ఉందని తెలిపాయి. -
నీలివిప్లవానికి సర్కారు చేయూత
సాక్షి, హైదరాబాద్: చేపల ఉత్పత్తి పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిం చింది. దీనిలో భాగంగా మత్స్యకారులకు రూ. 535 కోట్ల విలువైన పరికరాలను సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సబ్సిడీపై అందజేసింది. ఈ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో 1.69 లక్షలు అర్హమైనవిగా నిర్ధారించి 1.60 మందికి వివిధ రకాల పరికరాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకూ 80 వేలమంది లబ్ధిదారులు తమ వాటా సొమ్మును ప్రభుత్వానికి చెల్లించగా వారికి రూ. 535.93 కోట్ల విలువైన 77,448 యూనిట్ల పరికరాలను అందజేసింది. 60,398 మందికి వెండింగ్ యూనిట్ల కింద పంపిణీ చేసే మోపెడ్లను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 50,460 మందికి పంపిణీ చేసింది. ప్లాస్టిక్ ఫిష్ క్రేట్స్ 30 వేలకు గాను, 3,515 ఇచ్చారు. 9,759 లగేజీ ఆటోలకు గాను, 2 వేలు పంపిణీ చేశారు. రూ. వెయ్యి కోట్లు మంజూరు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అందజేసే పరికరాలకు ప్రభుత్వం 75% నుంచి 100% వరకు రాయితీని కల్పిస్తోంది. దీని అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసింది. చేపలు అమ్మేందుకు 50 వేల బైక్‌లను 75% రాయితీపై ఇస్తోంది. ద్విచక్ర వాహనం ధర రూ. 50 వేలు కాగా, లబ్ధి దారుడు రూ.12,500 చెల్లిస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ చేపల క్రేట్లు 30 వేలు ఇస్తారు. వాటి ధర ఒక్కోటి రూ.4 వేలు కాగా, లబ్ధిదారుడు రూ. వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. 45 వేల వలలు, క్రాఫ్టులు అందజేస్తారు. పోర్టబుల్ చేపల అమ్మకానికి కియోస్కూలు 19 వేల యూనిట్లు ఇస్తారు. వాటి ధర రూ. 20 వేలు కాగా, లబ్ధిదారుడు రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. -
సబ్సిడీ కిరోసిన్ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని పేదలకు చేరాల్సిన రాయితీ కిరోసిన్ పక్కదారి పడుతోంది. రేషన్ డీలర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం వెరసి కిరోసిన్ యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతోంది. కిరోసిన్ దందాపై నిఘా కొరవడటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు ఇటీవలి పౌరసరఫరాల శాఖ విశ్లేషణలో తేలింది. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కిరోసిన్ సరఫరానే పూర్తిగా నిలిపివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఎత్తివేతకు కేంద్రం మొగ్గు.. అయితే రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ –పాస్) విధానాన్ని కిరోసిన్ పంపిణీకి కూడా అనుసంధానం చేశారు. ఇటీవలే ఈ విధానం అమల్లోకి రావడంతో డీలర్లు కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలించే వీలు లేకుండా అడ్డుకట్ట పడుతోంది. ఈ నెలలోనే ప్రస్తుత లెక్కల మేరకే 33 శాతం మేర కిరోసిన్ మిగులు సాధించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇ–పాస్ విధానం అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు. దీంతో దేశవ్యాప్తంగా కిరోసిన్ అక్రమాలకు చెక్‌పడటం లేదు. దేశవ్యాప్తంగా 41శాతం ఏటా అక్రమమా ర్గం పడుతోందని కేంద్రం తన సర్వేలో గుర్తించింది. ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నూటికి 95 శాతం మంది దీపం, వంట పొయ్యి లు వాడడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయితీ సరఫరాను పూర్తిగా నిలిపివేయా లని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక సలహాదారు సైతం ప్రభుత్వానికి తమ సిఫారసులు పంపినట్లుగా తెలిసింది. రాయితీ కిరోసిన్ అంతా పెట్రోల్ బంక్‌లకే.. రాష్ట్రంలో ప్రస్తుతం 87లక్షల రేషన్ కార్డులుండగా, 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో కార్డుపై నెలకు లీటర్ కిరోసిన్‌ని రూ.29కి సరఫరా చేస్తున్నారు. నిజానికి లీటర్ కిరోసిన్ ధర రూ.40మేర ఉండగా, రూ.11 మేర కేంద్ర ప్రభుత్వం రాయితీని భరిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెలా సరాసరిన 7.60 లక్షల లీటర్ల కిరోసిన్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. అయితే ఈ కిరోసిన్‌ని రేషన్ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా హోల్‌సేల్ డీలర్లు, రేషన్ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉండగా, ఒక నెల సరఫరా చేసి మరో నెల తప్పిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులకు సరైన సమాచారం లేకపోవడంతో డీలర్ల వద్దే కిరోసిన్ మిగిలిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కిరోసిన్‌ను పెట్రోల్ బంక్‌లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగబాకడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. రూ.29కే అందుతున్న కిరోసిన్‌ని ఏకంగా డీలర్లు రూ.40 నుంచి రూ.50కి పెట్రోల్ బంక్ యజమానులకు విక్రయిస్తున్నారు. ఇటీవలే రాయితీ కిరోసిన్‌తో చేస్తున్న కొత్తదందాను తెలంగాణ విజిలెన్స్ గుర్తించింది. ‘ఇంటెరాక్స్ ఎస్టీ 50’అనే కెమికల్‌తో పాటు ముల్తానా మట్టిని వినియోగించి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ ఇంధనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, వివిధ పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర సాగుతున్న ఈ అక్రమ వ్యవహారం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చొరవతో గత నెలలో బహిర్గతమైంది. ప్రతి ఏటా ఈ విధంగా ఏకంగా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. -
అందని రబీ పెట్టుబడి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం జిల్లాలో కొంతమంది రైతులకే పరిమిత మవుతోందనే వాదన వినిపిస్తోంది. రబీ సీజన్ ప్రారంభమై జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది రైతులకు సాయం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌లో చెక్కుల అందజేసి బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా డబ్బులు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రబీలోనూ చెక్కు లు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టగా ముందస్తు ఎన్నికలతో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే జిల్లాలో ఇంకా దాదాపు 23వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పెట్టుబడి పైసలు వస్తాయా రావా? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. తమ తోటివారికి డబ్బులు వచ్చి తమకు రాలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ రైతుబంధు రైతన్న దరికి చేరడం లేదు. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే కొద్దిరోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కాలం వెల్లదీస్తున్నారు. మరో నెల గడిస్తే రబీ ముగియనుంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులకు సాయం అందకపోవడంతో బ్యాంకుల, వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిరీక్షణ.. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి 23,113 మంది రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదు. 20 మండలాల్లో భూమి కలిగిన రైతులు 1,36,718 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.120,74,92,810 పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 97,433 మంది రైతులకు రూ.90,29,26,930 డబ్బులు చెల్లించారు. మొత్తం 136718 రైతులకు గాను అధికారులు 1,21,268 మంది రైతుల వివరాలు సేకరించి అన్లైన్లో నమోదు చేశారు. పరిశీలన అనంతరం 1,18,918 మంది రైతులను గుర్తించారు. 15450 మంది రైతులు అందుబాటులో లేరని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు తప్పని ఎదురుచూపులు.. పెట్టుబడి సాయం అందని రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అధికారులు ప్రభుత్వానికి నివేదించామని, బ్యాంకుల్లో జమకానున్నాయని సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే మీ ఫోన్‌కు మెస్సేజ్ వస్తుందని ఆ తర్వాతే రావాలని చెబుతున్నారు. పెట్టుబడి సొమ్ము వస్తుందని చాలా మంది రైతులు రబీలో అప్పులు తెచ్చి మరీ పంటను సాగు చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అప్పుకు వడ్డీ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుకార్లతో ఆందోళన.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రైతుబంధుపై దుష్ప్రచారం నెలకొంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైతుబంధు తాత్కాలికమే అని వస్తున్న పుకార్లతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇవి కేవలం గాలి వార్తలే అని కొట్టిపారేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దశల వారీగా అందరి రైతుబంధు డబ్బులు ఖాతాలో జమవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాయం అందడంలేదు నాకు 5 ఎకరాల సాగు భూమి ఉంది. వారసత్వంగా వచ్చింది. ఆభూమిని నా పేరుపై ఇవ్వడానికి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. నాకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో మెదటి విడత చెక్కులు అందలేదు. రెండో విడత కూడా వచ్చేలా లేదు. నాలాంటి వాళ్లు మండలంలో చాలమంది ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పాస్ పుస్తకాలు అందించాలి. – వామనరావు, రైతు, మహదేవ్పూర్ వారంలో సాయం అందిస్తాం.. వారంలో రైతులకు సాయం అందనుంది. ట్రెజరీకి వివరాలు పం పించాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సబంధించి రైతుల నుంచి ఏఈఓలు వివరాలు సేకరిస్తున్నారు. ఈనెల చివరలో కేంద్ర సాయం కూడా అందనుంది. – గౌస్ హైదర్, ఏడీఏ -
‘ప్రత్యేక కోటా’.. త్వరలో టాటా !
సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీపై అందజేసే ట్రాక్టర్ల ‘ప్రత్యేక రిజర్వు కోటా (ఎస్‌ఆర్‌క్యూ)’ను రద్దు చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీని పట్టించుకోకుండా హైదరాబాద్ నుంచే నేరుగా ఇచ్చే ఈ పద్దతికి చరమగీతం పాడాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇష్టారాజ్యంగా సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారన్న విమర్శలు రావడంతో ప్రత్యేక కోటాను రద్దు చేయడమే పరిష్కారంగా భావిస్తున్నారు. మరో వైపు ట్రాక్టర్ల కేటాయింపునకు సరికొత్త మార్గదర్శకాలు తయారు చేయాలని యోచిస్తున్నారు. అర్హుల గుర్తింపునకు వీటిని రూపొందించనున్నారు. ప్రస్తుతం సబ్సిడీ ట్రాక్టర్ కేటాయింపునకు ఇన్నెకరాలు ఉండాలన్న నిబంధన లేదు. ఏభై ఎకరాలున్న ధనిక రైతు కూడా సబ్సిడీ ట్రాక్టర్ పొందే అర్హత ఉంది. దీంతో సన్నచిన్నకారు రైతులకు దక్కాల్సిన సబ్సిడీ పక్కదారి పడుతోందన్న విమర్శలు వచ్చాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఎవరైనా పదెకరాల లోపున్న రైతులకే ట్రాక్టర్లు దక్కేలా నిబంధన తేవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కోటా తెచ్చిన తంటా... వ్యవసాయ యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తుంది. వీటిని గ్రూపు లేదా వ్యక్తిగతంగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. వీటికోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్ల బృందం పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. ఆ జాబితాను జిల్లా వ్యవసాయశాఖకు పంపిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తుంది. ఆ పద్దతిని తోసిపుచ్చుతూ వ్యవసాయశాఖ 2016–17 నుంచి ట్రాక్టర్ల కేటాయింపులో ఎస్‌ఆర్‌క్యూ పద్దతిని ప్రవేశపెట్టింది. ఆ శాఖ మంత్రి సిఫారసు చేసిన రైతులకే ట్రాక్టర్లు మంజూరు చేయడం దీని ఉద్దేశం. దీంతో కలెక్టర్ల ఆమోదం లేకుండానే చాలా ట్రాక్టర్లను సిఫారసు లేఖలతోనే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. మంత్రి పేషీ నుంచి సిఫారసు లేఖ వస్తే చాలు వ్యవసాయశాఖ అనుమతి ఇచ్చి జిల్లాలకు పంపించేవారు. దీంతో కొందరు దళారులు సచివాలయంలోనూ, వ్యవసాయశాఖ కమిషనరేట్‌లోనూ తిష్ట వేసి దందా చేశారన్న ఆరోపణలున్నాయి. వారికి రెండుచోట్లా ఒకరిద్దరు అధికారుల సహకారమున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 8 వేల ట్రాక్టర్లు అనర్హులకేనా? 2016–18 మధ్య దాదాపు 15 వేల వరకు ట్రాక్టర్లు సబ్సిడీపై వ్యవసాయశాఖ ఇవ్వగా, వాటిలో దాదాపు 8 వేల ట్రాక్టర్లు ఎస్‌ఆర్‌క్యూ కిందే ఇచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొందరు ఫైరవీదారులు వాటిని అమ్ముకొని ఒక్కో ట్రాక్టర్‌పై రూ.లక్ష కమీషన్ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇలా ఎస్‌ఆర్‌క్యూ కింద భారీ అక్రమాలు జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా. ప్రస్తుత కమిషనర్ రాహుల్ బొజ్జా ట్రాక్టర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై అంతర్గతంగా విచారణ చేసినట్లు తెలిసింది. పైగా ఆర్థికశాఖ వర్గాలు కూడా ఎస్‌ఆర్‌క్యూ కోటా లోపాలను గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఈ కోటా రద్దు చేయడమే మేలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పైగా అర్హత లేకుండా ఇవ్వడంతో ధనికులే అధికంగా ట్రాక్టర్లు దక్కించుకున్నట్లు తేలిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
అనుమతి లేని నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఆగ్రోస్‌లో టార్పాలిన్ల విక్రయాలపై దుమారం చెలరేగుతోంది. సర్కారు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా టార్పాలిన్లను సబ్సిడీపై రైతులకు సరఫరా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీని నిర్ణయించడంలో కానీ, వాటి ని రైతులకు సరఫరా చేసే అంశంపైకానీ ఏదీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. దీంతో రైతులకు ఇచ్చిన సబ్సిడీని ఎవరు చెల్లించాలి, దీనికి ఎవరు బాధ్యులన్నది చర్చనీయాంశమవుతోంది. సరఫరా కంపెనీలతో కొందరు కుమ్మక్కు కావడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టార్పాలిన్ల విలువ రూ. 5.4 కోట్లు... ఈ ఏడాది రైతులకు రూ.5.4 కోట్ల విలువైన టార్పాలిన్లను సబ్సిడీపై సరఫరా చేయాలని ఆగ్రోస్‌లో కొందరు నిర్ణయానికి వచ్చారు. వచ్చిందే తడవుగా జాబితాల్లో ఉన్న కంపెనీలతో మాట్లాడారు. సాధారణంగా బయట ఒక్కో టార్పాలిన్ ధర రూ. 2,500 కాగా, ఆగ్రోస్ ద్వారా రూ. 2,350కే రైతులకు ఇవ్వాలనుకున్నారు. అంటే బయటకంటే రూ. 150 తక్కువకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో రైతులకు సగం సబ్సిడీ ఇచ్చారు. అంటే వారికి రూ. 1175కు ఒక్కో టార్పాలిన్‌ను విక్రయించారు. మిగిలి న సగం ప్రభుత్వం భరించాలన్నమాట. ఈ వ్యవహా రానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నాక, వ్యవసాయశాఖకు చెందిన మండల ఏవోల ద్వారా వాటిని రైతులకు విక్రయించారు. రైతుల వాటా సొమ్ము రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించారు. ప్రభుత్వ వాటాగా మరో రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఆ సొమ్మును చెల్లింపులపై ఇప్పుడు ఆగ్రోస్‌లో అంతర్మథనం మొదలైంది. అలాగనీ ఆగ్రోస్ భరించే స్థితిలో లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినా లభించే అవకాశాలు లేవు.దీంతో ఆగ్రో చిక్కుల్లో పడింది. అవును నిజమే: ఆగ్రోస్ ఎండీ ఈ విషయంపై ప్రస్తుత ఆగ్రోస్ ఎండీ సురేందర్‌ను వివరణ కోరగా, అనుమతి లేకుండా టార్పాలిన్లు విక్రయించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. తాను ఇటీవలే ఆగ్రోస్ బాధ్యతలు తీసుకున్నానని, తనకు పూర్తి వివరాలు తెలియవన్నారు. -
మమ్మల్ని పడేసి కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు!
కనీస వేతనాలతో బడి పిల్లలకు బాధ్యతగా వంట చేసి పెడుతున్న వాళ్లను కాదని, ఆ పనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మధ్యాహ్న భోజన పథకం.. అధ్వాన్న భోజన పథకంగా మారే పరిస్థితి తలెత్తబోతోంది. ఆగస్టు 9 మధ్యాహ్నం. సమయం ఒకటీ ముప్పావు. కొటికే భారతికి ఫోన్ చేసింది సాక్షి. ఆ ఫోన్‌ను అదే స్కూల్లో ఉన్న ఒక టీచర్ తీశారు. ‘భారతి బయటకెళ్లిందని, అరగంటలో వస్తుందని’ చెప్పారామె. అన్నట్లుగానే అరగంటకు భారతి నుంచి ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం స్కూల్లో పిల్లలకు భోజనం వండి, వారికి వడ్డించి, పిల్లల భోజనాలయిన తర్వాత హాస్పిటల్కెళ్లి వచ్చిందామె. అంతకు మూడు రోజుల ముందు పోలీసులు కొట్టిన దెబ్బలకు వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ కెళ్లిందామె. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘మూగదెబ్బలు! తొడలు సహా ఒంటి మీద ఫలానా చోట అని చెప్పలేను. చెప్పలేని చోట్ల కూడా దెబ్బలయ్యాయి’ అన్నదామె బేలగా. ‘‘అసలేం జరిగింది?’’ అని అడిగినప్పుడు తన ఆవేదనను సాక్షితో పంచుకుంది భారతి. ‘‘మాది కర్నూలు. డ్వాక్రా మహిళను. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు భోజనం వండుతుంటాను. కర్నూలు వన్‌టౌన్ ఎలిమెంటరీ స్కూల్లో వంట చేస్తాను. పదిహేనేళ్లుగా నాలాగ చాలామంది ఇదే పనిలో ఉన్నాం. ఇప్పుడు ఈ పనిని ప్రైవేటు వాళ్లకివ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ‘ఇన్నేళ్లుగా పని చేశాం, మాకు నెల గడవడానికి కొంత జీతమిచ్చి, పిల్లల మెనూ పెంచండి’ అని అడిగినందుకు మమ్మల్ని పడేసి కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. మేమేం అడిగామని! మేము ప్రభుత్వాన్ని పెద్ద కోరికలేమీ కోరలేదు. ‘నెలకు ఐదువేల ఐదు వందలు వేతనం ఇవ్వండి, పిల్లల మెనూ ఇరవై రూపాయలకు పెంచండి’ అని అడిగాం. ఇప్పుడు ప్రభుత్వం మాకిస్తున్నది నెలకు వెయ్యి రూపాయలు. అది కూడా మే నెలలో స్కూళ్లకు సెలవున్న రోజుల్లో ఉండదు. ఏప్రిల్, జూన్ నెలల్లో స్కూళ్లు తెరిచేది సగం రోజులే కాబట్టి ఆ నెలల్లో ఐదు వందలే ఇచ్చారు. పిల్లల భోజనానికి ఒక్కొక్కరికి వందగ్రాముల బియ్యం ఇచ్చి, నాలుగు రూపాయల పదమూడు పైసలిస్తోంది. అందులోనే పప్పు, ఉప్పు, కారం, కూరగాయలు, నూనె... అన్నీ. గ్యాస్ లేదా కట్టెలు కొన్నా ఆ నాలుగు రూపాయల పదమూడు పైసల్లోనే. మా స్కూల్లో 70 మంది పిల్లలున్నారు. ఏ రోజుకారోజు లెక్కవేస్తారు, ఆ రోజు ఎంతమంది హాజరైతే అంతమందికే లెక్క వేసి డబ్బిస్తారు. వారానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఖర్చవుతాయి. నెలకు ఎనిమిది సిలిండర్లు కావాలి. సబ్సిడీలో సిలిండర్లు ఇప్పించినా కొంత వెసులుబాటు ఉంటుంది. గ్యాస్ ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తోంది. ధరలు ఒకరోజు ఉన్నట్లు మరో రోజు ఉండవు. నెలాఖరులో ఖర్చు లెక్క చూసుకుంటే మాకు మిగిలేది ఏమీ ఉండడం లేదు. మా వేతనం వెయ్యి రూపాయలు కూడా నికరంగా మిగిలే పరిస్థితి ఉండడం లేదు. గుడ్లు ఉడికేదెలా? వారానికి మూడు గుడ్లు పెట్టాలని ఒక విద్యార్థికి ఆరు రూపాయల పద్దెనిమిది పైసలిస్తామన్నారోసారి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీలో ఇస్తే తప్ప గుడ్లు ఉడికించలేమని చెప్పాం. డబ్బులు పెంచకుండా గుడ్లు పంపిస్తున్నారు, కాదనకుండా వాటిని ఉడికించి పెడుతున్నాం. బ్లాక్‌లో సిలిండర్ కొని ఉడికించాలంటే మా చేతి డబ్బే పడుతోంది. ఇవన్నీ చెప్పుకోవడానికే విజయవాడకు వెళ్లాం. ఆ రోజు ఆగస్టు 6 ఊరూరు నుంచి మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న వాళ్లం కదిలాం. అందరం విజయవాడ చేరి ఉంటే ఉప్పెన ఉబికి వచ్చినట్లే ఉండేది. ఎక్కడి వాళ్లనక్కడ గ్రామాల్లో, మండలాల్లో బస్‌స్టాపుల్లో నిఘా వేసి మరీ... అరెస్టు చేశారు. మాలాంటి కొందరం మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసుల కంట పడకుండా విజయవాడ చేరుకోగలిగాం. తీరా అక్కడికి వెళ్లాక ఒక్కొక్కరినీ తరుముతూ, ఈడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు. మా బట్టలూడిపోతున్నా సరే... అలాగే పట్టి వ్యాన్లలో పడేశారు. సిటీ నుంచి 30– 40 కిలోమీటర్ల దూరాన వదిలారు. మేమెక్కడున్నామో తెలియదు. ఎవర్ని అడగాలన్నా మనుషులే కనిపించడం లేదు. రోడ్డు మీదకెళ్లి వచ్చిన బస్సుల్ని ఆపి, ఎటు వైపు వెళ్తుందో అడిగి ఎక్కాం. బస్సు దిగిన తర్వాత ఆటోల్లో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాం. అక్కడ రాత్రి ఎనిమిదిన్నరకు రైలెక్కి తెల్లవారి కర్నూలు చేరుకున్నాం. గాయం మానేది కాదు ఆ రోజు ఎంతటి దుర్దినమో మాటల్లో చెప్పలేం. కళ్లు తెరిచినా, కళ్లు మూసుకున్నా అవే సంఘటనలు గుర్తుకువస్తున్నాయి. ఎక్కడ బస్సెక్కామో, ఎక్కడ రైలెక్కామో... అంతా అయోమయంగా ఉంది. మాకు తగిలిన గాయాలు చిన్నవి కాదు. ఒంటికైన గాయాలు వారానికో నెలకో తగ్గుతాయి. కానీ మనసుకైన గాయాలు ఎప్పటికీ మానేవి కాదు. మేమేం తప్పు చేశామని అంత దారుణంగా వ్యవహరించిందీ ప్రభుత్వం! ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా, నేరగాళ్లమా, దొంగతనాలు– దోపిడీలు చేసినోళ్లమా? మా పిల్లలకు వండి పెట్టుకున్నట్లే బడి పిల్లలకు అన్నం వండి పెడుతున్నాం. టీచర్లు సెలవులు పెడతారు, పిల్లలు బడికి డుమ్మా కొడతారేమో కానీ మేము ఎండనక, వాననక బడి తెరిచిన అన్ని రోజులూ పని చేశామే. మాకు చేసే న్యాయం ఇదేనా’’ అంటున్నప్పుడు భారతి గొంతు పూడుకుపోయింది. మాటలతో చెప్పలేని వేదన ఆమె గొంతులో పలికింది. నడిపిస్తున్నది మహిళలే! ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మొదలు పెట్టినప్పుడు వంట చేయడానికి ఎవరూ ముందుకు రాని రోజులవి. అప్పట్లో రోజుకు ఒక విద్యార్థికి రూపాయి పావలా ఇచ్చేది ప్రభుత్వం. సామాజిక కార్యకర్తలు ఉద్యమించగా, మెనూ నాలుగు రూపాయల పదమూడు పైసలు చేసి, వండేవాళ్లకు వెయ్యి రూపాయలు ఇస్తోందని నిర్మల చెప్పారు. ‘నిజానికి పొదుపు సంఘాల మహిళలే ఈ పథకాన్ని నిలబెట్టారు. కొన్ని స్కూళ్లలో నీళ్లుండవు, నీళ్లు మోసుకొచ్చి వండాలి. వంటగది ఉండని చోట బయటే వండాలి. కొంతమంది పాత్రలు కూడా సొంతంగా కొనుక్కున్నారు. ప్రభుత్వం వాటికి డబ్బివ్వలేదు. వేతనం పెంచమంటే ‘పనిచేసేది మధ్యాహ్నం ఒక గంట సేపే కదా’ అంటున్నారు. వడ్డించే సమయం, తినే సమయమే కాదు కదా! పన్నెండు గంటలకు వడ్డించాలంటే ఉదయం వేరే ఏ పనులకూ వెళ్లకుండా ఈ పని కోసమే వాళ్ల సమయాన్ని కేటాయించుకోవాలి. స్కూలుకి వచ్చి వండి, భోజనం వడ్డించిన తర్వాత ఇళ్లకు పోయి ఇంటి పనులు చూసుకోవాలి. సాయంత్రమయ్యే సరికి మర్నాడు వంట కోసం కూరగాయల వంటివి సమకూర్చుకోవడానికి ఉపక్రమించాలి. దాదాపుగా రోజంతా ఇదే పనిలో ఉండక తప్పదు. కొన్ని చోట్ల ఆరు నెలలకు కూడా బిల్లులు రావడం లేదు. దుకాణాల్లో సరుకులు అరువివ్వకపోతే అప్పులు తెచ్చి వంట చేయాల్సిన పరిస్థితి. డబ్బివ్వలేదని వండడం మానేస్తే ‘ఎందుకు వండలేదు’ అని తప్పు వీళ్ల మీదనే మోపుతారు. ప్రభుత్వం కేంద్రీకృత వంటశాలల నిర్ణయంతో వీళ్లను రోడ్డున పడేయాలని చూస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం జిల్లాలను క్లస్టర్లుగా విభజించి కొన్ని సంస్థలకిస్తారు. ఒక్కో వంటశాలకు మూడు నుంచి ఐదెకరాల పొలం ఇస్తారు. వంటగది కట్టి, వండి, పాతిక కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలన్నింటికీ రవాణా చేయాలి. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేసినా, పిల్లలు ఆ భోజనాన్ని తినడం లేదన్న వాస్తవం ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా సరే, అమలు చేసి తీరాలని చూస్తోంద’ంటూ నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకేనా? ఆంధ్రప్రదేశ్ మొత్తంలో స్కూళ్లలో వంట చేస్తున్న వాళ్లు 60 వేల వరకు ఉన్నారు. ఆరవ తేదీన విజయవాడలో 1,650 మందిని అరెస్టు చేశారు. నాగమణి అనే అమ్మాయి కాలిని పట్టుకుని మెలి తిప్పేశారు. ఆమె నడవలేక పోతోంది. మహిళల మీద, పిల్లల భోజనం మీద ఉక్కుపాదం మోపే బదులు... మెనూ, వేతనం పెంచినట్లయితే పిల్లలు చక్కటి భోజనం చేస్తారు. ఈ పథకం అమలు చేస్తున్నామని జబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేసుకోవడానికి పెట్టే డబ్బును పిల్లల కంచాల్లోకి మళ్లిస్తే చాలు. – పి. నిర్మల, కన్వీనర్, శ్రామిక మహిళా సంఘం, కర్నూలు జిల్లా – వాకా మంజులారెడ్డి -
రాయితీ ఇంకా రాకపాయె!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఆవేదన అరోణ్యరోదన అయింది. రాయితీ రుణాల కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనంలేదు. నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి యూనిట్ల వైపు ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ విరివిగా రాయితీ రుణాలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది. పెద్దసంఖ్యలో లబ్ధి కలిగించాలని భారీ ప్రణాళికలు రచించింది. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో లబ్ధిదారులను ఎంపిక చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 33,607 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరికి రాయితీ రూపంలో రూ.454.01 కోట్లు అవసరమని ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది. కానీ 27,261 మంది లబ్ధిదారులకు మాత్రమే రాయితీ యూనిట్లు మంజూరు చేసింది. ఈ మేరకు లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. కార్పొరేషన్ నిర్దేశించిన మేరకు రూ.351.26 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు కార్పొరేషన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు 2016–17 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రాయితీ రుణాల పంపిణీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దాదాపు 3610 మంది లబ్ధిదారులకు రూ.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. వార్షిక ప్రణాళికకేదీ ఆమోదం... 2018–19 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేసి రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది. ఇంకా ఆమోదం లభించలేదు. 50 వేల మందికి లబ్ధి చేకూర్చేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అయోమయంలో పడ్డారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొలి త్రైమాసిక ముగిసింది. ఇప్పటికిప్పుడు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టినా ప్రక్రియ పూర్తి కావడానికి కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. బ్యాంకు నుంచి సమ్మతిపత్రాలు పొందడానికి,రుణాల మంజూరు పూర్తికావడానికి సమయం పడుతుంది. దీంతో రుణ ప్రణాళిక అమలు కష్టంగా మారే అవకాశముందని ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వార్షిక ప్రణాళికకు ఆమోదం లభించిన వెంటనే చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
అశ్వగంధకు ఇదే అదను!
రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే ఔషధ పంటల్లో అశ్వగంధ ముఖ్యమైనది. తెలుగురాష్ట్రాలతోపాటు మరో 4 రాష్ట్రాల్లో అశ్వగంధ సాగులో ఉంది. పంటకాలం 150–180 రోజులు. ఆగస్టు మొదటి వారం వరకు దీన్ని విత్తుకోవచ్చు. అశ్వగంధ వేర్లు, కాండం, ఆకుల్లో ఔషధ గుణాలుంటాయి. అయితే వాణిజ్యపరంగా వేర్లకే గిరాకీ ఉంటుంది. మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. వేర్లు లేత పసుపుతో కూడిన తెలుపు రంగులో చిరుచేదుగా ఉంటాయి. నరాల బలహీనతను నివారించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అల్సర్ల నివారణకు ఉపయోగిస్తారు. అశ్వగంధ వేర్ల చూర్ణం నిద్రలేమిని నివారిస్తుంది. నీరు నిల్వ ఉండని నేలలు, పొడి వాతావరణం అనుకూలం. ఉదజని సూచిక 7.5–8.0 మధ్య ఉండాలి. వర్షాధార పంటగా సాగుకు తేలికపాటి నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉంటే ఇసుక నేలలు లేదా తేలికపాటి ఎర్రనేలలు అనుకూలం. జవహర్–20, రక్షిత, నాగరి రకాలు విత్తుకోవచ్చు. తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ బోడుప్పల్‌లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ(సీమాప్) అందించే పోషిత రకం వంగడం అనుకూలం. ఎకరాకు నారు పద్ధతిలో 2 కిలోలు, వెదజల్లే పద్ధతిలో 7–8 కిలోలు అవసరం. 5 రెట్లు ఇసుకతో కలిపి వెదజల్లాలి. నారును వరుసల మధ్య 25–30 సెం.మీ., మొక్కల మధ్య 8–10 సెం.మీ. ఉండేలా నాటుకోవాలి. అశ్వగంధకు తీవ్రమైన తెగుళ్లేవీ రావు. కాయలు ఎరుపు రంగులోకి మారినప్పుడు లేదా ఆకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు మొక్కలను పీకి వేర్లను సేకరించాలి. వేర్లను 7–10 సెం.మీ. ముక్కలు చేసి నీడన ఆరబెట్టుకోవాలి. ఎండిన వేర్లను గ్రేడింగ్ చేసుకొని నిలువ ఉంచుకుంటే రైతులకు మంచి ధర లభిస్తుంది. ఎకరాకు 250–300 కిలోల ఎండు వేర్లు, 80 కిలోల విత్తనం వస్తుంది. ఎకరాకు ఖర్చు రూ. 15 వేల వరకు ఉంటుంది. జాతీయ ఔషధమొక్కల బోర్డు, తెలంగాణ ఔషధ మొక్కల బోర్డు(94910 37554) ఎకరా సాగుకు రూ. 4,392 వరకు సబ్సిడీ అందిస్తున్నాయి. మార్కెట్ ధరను బట్టి రూ. 35,000–45,000 వరకు నికరాదాయం రావచ్చు. మధ్యప్రదేశ్‌లోని నీమచ్, మాండ్సర్ మార్కెట్లు అశ్వగంధ కొనుగోలుకు ప్రసిద్ధి. స్థానికంగా కూడా మార్కెటింగ్ అవకాశాలున్నాయి. (రాజేంద్రనగర్‌లోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలోని ఉద్యాన కళాశాల పరిశోధక విద్యార్థులు ఎస్. వేణుగోపాల్, బి. అనిత అందించిన సమాచారం) -
ఎక్కడైనా కొనుక్కోవచ్చు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీపై అందించే పాడి పశువులను ఎక్కడైనా, ఎవరి వద్దయినా కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారు ఏ రకమైన పాడి పశువునైనా కొనుగోలు చేసుకోవచ్చని.. దీనిలో సంబంధిత శాఖ, వ్యక్తుల జోక్యం ఉండదని పేర్కొంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం తెలుగులో మార్గదర్శకాలు విడుదల చేశారు. తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేయనున్నారు. ఒక్కో పాడి పశువుకు రూ. 80 వేలు యూనిట్ ధరగా నిర్ధారించారు. అందుకు అదనంగా రూ.5 వేలు రవాణా, ఇతర ఖర్చుల కోసం కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75% (రూ.60వేలు), ఇతరులకు 50%(రూ.40వేలు) సబ్సిడీ ఖరారు చేశా రు. మిగిలిన సొమ్మును లబ్ధిదారు చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేయనున్నారు. పశువులను కొనుగోలు చేసిన చోటు నుంచి రైతు వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. పథకానికి కావాల్సిన నిధులను విజయ డెయిరీ ఫెడరేషన్ ద్వారా సమకూర్చుతారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పాడి పశువుల కొనుగోలు ప్రారంభం కానుంది. -
ఇక ‘కుకింగ్’ సబ్సిడీ..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సబ్సిడీ స్థానంలో కుకింగ్ సబ్సిడీని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. పైపుల ద్వారా సహజవాయువును వినియోగించేవారు, వంట కోసం బయో ఇంధనాలను వినియోగించే వారికీ సబ్సిడీ ప్రయోజనాలను విస్తరించాలనే ఆలోచనే ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. వంట కోసం వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ ప్రయోజనాలు వర్తించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎల్పీజీ వినియోగదారులకే సబ్సిడీ అందుతున్న విషయం తెలిసిందే. ‘‘వంటకు వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ వర్తించాలి. ఎందుకంటే కొన్ని పట్టణాల్లో పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా జరుగుతోంది. అందుకే సబ్సిడీని వారికి కూడా అందించడమే సరైనది’’ అని కుమార్ పేర్కొన్నారు. సబ్సిడీని కేవలం ఎల్పీజీకే పరిమితం చేయడం అన్నది చౌక ఇంధనాలు, గ్రామీణ ప్రాంతాల్లో బయో ఇంధనాలు, పట్టణాల్లో పీఎన్జీ (పైపుల ద్వారా సహజవాయువు) వినియోగాన్ని నిరుత్సాహపరిచే చర్యగా వస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కుకింగ్ సబ్సిడీ ప్రతిపాదన ‘నేషనల్ ఎనర్జీ పాలసీ 2030’ ముసాయిదాతో వెల్లడైంది. గత వారమే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇది కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలతో ఎదురయ్యే ప్రభావాన్ని తట్టుకునేందుకు సన్నద్ధమైనట్టు తెలిపారు. స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడులు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ 7–7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఆమర్థ్యసేన్ క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాలి... ప్రముఖ ఆర్థిక వేత్త ఆమర్థ్యసేన్ కొంత కాలం పాటు దేశంలో ఉండి మోదీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని రాజీవ్ కుమార్ సూచించారు. మోదీ సర్కారు పనితీరును ఆమర్త్యసేన్ తప్పుబట్టిన నేపథ్యంలో కుమార్ ఇలా స్పందించడం గమనార్హం. ‘‘ప్రొఫెసర్ ఆమర్థ్యసేన్ కొంత సమయాన్ని భారత్‌లో వెచ్చించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఆ విధమైన ప్రకటనలు చేసే ముందు గడిచిన నాలుగేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పనులను సమీక్షించాలి’’ అని కుమార్ పేర్కొన్నారు. -
అన్నం లెక్కల్లో తిరకాసు!
పేదవాడికి కడుపునిండా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని రాష్ట్రప్రభుత్వం అంటోంది. కేవలం రూ.5 నామమాత్రపు ధరకు అల్పాహారం, భోజనం సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం కోట్లాది రూపాయలు సబ్సిడీ భారం మోస్తున్నామని ఆర్భాటం చేస్తోంది. క్యాంటీన్ల నిర్మాణంలోనే పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. కాగా ఇప్పుడు నిర్వాహకులు అధికారులు కూడబలుక్కొని తప్పుడు లెక్కలతో భారీ అవినీతికి తెరలేపుతున్నారనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. క్యాంటీన్ల నిర్వహణలో పారదర్శకత లోపించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. కడప సెవెన్‌రోడ్స్: మూడు రోజు ల క్రితం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్నారు. ఒక్కోపూట 500 మంది చొప్పున రోజుకు 1,500 మందికి ఆహారం సరఫరా చేస్తున్నామని కడప మున్సిపల్ కమిషనర్ లవన్న అంటున్నా రు. అయితే క్యాంటీన్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం పూటకు 300మందికి మాత్రమే ఆహారం సరఫరా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలా అధికారులు, సిబ్బంది చెబుతున్న మాటలకు పరస్పరం పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సిబ్బంది చెబుతున్న విధంగా పూటకు 300 చొప్పున రోజుకు మూడు పూటల కలిపి 900మందికి టిఫెన్లు, భోజ నాలు సరఫరా చేసి 1,500మందికి సరఫరా చేసినట్లు బిల్లులు చూపి ఆ మేరకు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే అవకాశం లేకపోలేదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. టొకెన్లు కనిపించవ్! ప్రజలు డబ్బు చెల్లించినపుడు ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇలా డబ్బు తీసుకుని అలా పేపర్ ప్లేట్లు ఇచ్చేస్తున్నారు. ఇందువల్ల ఖచ్చితత్వం లోపిస్తోంది. ఒక వ్యక్తి మూడు పూటలా తింటే క్యాంటీన్ నిర్వాహకులకు రూ.25 ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై రూ.60 సబ్సిడీ నిర్వాహకులకు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఒక్కో వ్యక్తి మూడు పూటలా చెల్లించే రూ.15లను కలిపితే రూ.75లు వస్తుంది. ఇందులో క్యాంటీన్ నిర్వాహకులకు అయిన రూ.25 ఖర్చును తీసి వేస్తే రూ.50 ఉంటుంది. భోజనం రవాణా, నిర్వహణకు మరో రూ.10 వేసుకున్నా రూ.40 నికరంగా మిగులుతుంది. మూడు పూటలా కలిపి 600 మందిని అధికంగా చూపెడితే రూ.24వేలు మిగులుతుంది. అంటే రోజుకు 900 మందికే ఆహారం సరఫరా చేస్తూ 1,500 మందికి చేశామని దొంగ లెక్కలు రాసుకోవడం ద్వారా రోజుకు రూ.24వేలు నొక్కేస్తున్నారు. ఒక కౌంటర్..భారీగా క్యూ అవకతవకలకు అవకాశం లేకుండా క్యాంటీన్ నిర్వహణ పారదర్శకంగా జరగాలంటే కంప్యూటర్ బిల్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలంటున్నారు. ఇందువల్ల రోజుకు ఎంతమంది క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. క్యాంటీన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే ఒక కౌంటర్ మాత్రమే ఉండడంతో చాలాసేపు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. కనుక రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాగునీరు లేక అవస్థలు కడప జెడ్పీ ఆవరణంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భోజనం చేస్తున్న సమయంలో గొంతు పట్టుకుంటే అందుబాటులో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నామమాత్రపు ధరకే భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తాగునీటి విషయాన్ని పట్టించుకోకపోవడం సబబు కాదంటున్నారు. క్యాంటీన్ ఆవరణంలో పారిశుద్ధ్యం కూడా లోపించింది. అన్నం ప్లేట్లు ఇష్టానుసారంగా పడేసి ఉండడం కనిపించింది. చేతులు కడుక్కునే నీళ్లే తాగునీరు క్యాంటీన్లో సమస్యల గురించి మున్సిపల్ కమిషనర్ లవన్నను ‘సాక్షి’ వివరణ కోరింది. ఇందుకు ఆయన బదులిస్తూ పూటకు 500 మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. క్యాంటీన్లో ప్రజలు చేతులు కడుక్కుంటున్న నీళ్లనే తాగాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఈని నియమించామని చెప్పారు. అన్న పేరు చెడగొట్టవద్దు పేదవాడికి తక్కువ ధరకే అన్నం సరఫరా చేయడం మంచిదే. క్యాంటీన్‌కు వచ్చిన వారు భోజనం లభించక వెనుదిరిగి పోయే పరిస్థితి వద్దు. నిర్వహణలో పారదర్శకత పాటించడం ద్వారా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలి. ఎన్టీఆర్ పేరు చెడగొట్టవద్దు. – కొండూరు జనార్దన్‌రాజు, కడప నిర్ణీత సమయమంతా భోజనం పెట్టాలి ఉదయం టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశిత వేళలను ప్రకటించింది. ఆ సమయాల్లో ఎంతమంది వచ్చినా భోజనం పెట్టాలి. అలాకాకుండా మేం ఇంతమందికి మాత్రమే పెడతామనడం సరైంది కాదు. ప్రతిరోజు చాలామంది భోజనం లభించక వెనుకదిరిగిపోతున్నారు. – ఎన్.వెంకట శివ, సీపీఐ నగర కార్యదర్శి, కడప -
బీసీలకు సబ్సిడీ 100%
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి పథకాలను అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వంద శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం నేరుగా అందించాలని చెప్పారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, గణేష్ గుప్తా, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా లబ్ధిదారులు ‘‘బీసీల్లో కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుక్కోవడానికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అవసరమైన పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలి. ఇందుకు గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలి. లబ్ధిదారుల జాబితా సిద్ధం కాగానే బ్యాంకులతో సంబంధం లేకుండా వారికే నేరుగా ఆర్థిక సాయం అందించాలి’’అని సీఎం చెప్పారు. ‘‘బీసీ సంక్షేమ శాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకు వినియోగించాలి. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పెద్దఎత్తున బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్స్‌లో ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని కూడా బీసీలకే కేటాయిస్తాం. బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కల్లు దుకాణాల పునరుద్ధరణ, చెట్ల పన్ను రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతోంది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చే విషయాలపై మరోసారి అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’అని సీఎం వివరించారు. పండ్లు, కూరగాయాలు అమ్ముకునేవారికీ చేయూత యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగపుత్రులు తదితరులు లాభం పొందుతున్నారన్నారు. చేనేతను ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలి కులస్తులకు మేలు కలిగిందని పేర్కొన్నారు. ఇంకా చాలా కులాలవారు వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ చేయూత అందిస్తామని చెప్పారు. ‘‘విశ్వ కర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందివ్వాలి. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారులు చేసే వారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలి’’అని అధికారులను ఆదేశించారు. -
స్టీల్ ప్లాంట్‌పై తామెందుకు రాయితీ ఇవ్వాలన్న లోకేశ్
-
చెంచులకు వంద శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని చెంచులకు వందశాతం సబ్సిడీతో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మినీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. చెంచులకు 250 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ కాస్ట్ రూ.30వేలు ఉండగా రూ.22,500 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన రూ.7,500 ఐటీడీఏ భరిస్తుందని తెలిపారు. ఆళ్లగడ్డ మండలానికి 16 యూనిట్లు, రుద్రవరం ఏడు యూనిట్లు, జూపాడుబంగ్లా 3, నందికొట్కూరు 4, ఆత్మకూరు 109, బండి ఆత్మకూరు 26, కొత్తపల్లి 18, మహానంది 1, పాణ్యం 10, శ్రీశైలానికి 26, వెలుగోడుకు 30 ప్రకారం మొత్తం 250 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని పారదర్శకంగా పంపిణీ చేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీడీలు పి.రమణయ్య, జీవీ రమణ, సీవీ రమణయ్య, పలువురు పశువైద్యులు పాల్గొన్నారు. -
మాయాజాలం
భీమవరం : వరి సాగులో ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ విధానం అమలు చేస్తూ సబ్సిడీపై ఇస్తున్న వరి కోత యంత్రాలను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుని రైతుమిత్ర బృందాలు దిగమింగుతున్నాయి. దీంతో రైతులకు యంత్రాలు అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యంత్రాలకు అధికమొత్తం చెల్లించి మాసూళ్లు పూర్తి చేసుకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయం, అధికారుల ముడుపులు, లబ్ధిదారుల అత్యాశ కారణంగా రైతులకు మేలు చేయాల్సిన యాంత్రీకరణ వ్యవహారం నిరుపయోగంగా మారుతోంది. ఇప్పటికే సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో రైస్‌మిల్లర్లు, రొయ్యలు, చేపలు చెరువుల యజమానులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చోటు లభించగా ప్రస్తుతం డెల్టా ప్రాంతంలో దాళ్వా వరికోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వరికోత యంత్రాలు మాయం కావడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా వరిసాగులో ప్రకృతి వైపరీత్యాలు రైతులను అతలాకుతలం చేయడం, గిట్టుబాటు ధరలేకపోవడం, సాగుఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో జిల్లాలోని ఎక్కువమంది భూస్వాములు తమ పంట భూములను కౌలుకు ఇస్తుండగా మరికొంతమంది సారవంతమైన పంట భూములను రొయ్యలు, చేపలు చెరువులుగా మార్పు చేస్తున్నారు. పెరిగిన కౌలు రైతుల సంఖ్య జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగుచేయాల్సి ఉండగా అత్యధికంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇవ్వడంతో జిల్లాలో దాదాపు మూడు లక్షలకు పైగా కౌలు రైతులే వరి సాగు చేస్తున్నారు. కౌలుదారులు తమ కుటుంబం మొత్తం సాగులో లీనమైనప్పటికీ ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పెట్టుబడులు పెరిగి నష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం సాగును యాంత్రీకరణ బాట పట్టిస్తే ఖర్చులు తగ్గి రైతులకు ప్రయోజనం కలుగుతుందని అనేక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రైతులకు పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేయడానికి స్పేయర్లు, టార్పలిన్లు, జింకు సల్ఫేట్, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మాసూళ్లు సమయంలో వాతావరణం భయపెట్టడంతో రైతులు ఎక్కువగా వరి కోతయంత్రాలపైనే ఆధారపడుతున్నారు. లబ్ధిదారుల ఎంపికలో మాయాజాలం ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యంత్రపరికాల పంపిణీలో అధికారులు లబ్ధిదారుల ఎంపికలో మాయాజాలం సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరిసాగు చేసేది ఎక్కువగా కౌలు రైతులే అయినప్పటికీ సబ్సిడీ మాత్రం భూస్వాములు దక్కించుకుంటున్నారు. గతేడాది రూ.రెండు లక్షల సబ్సిడీతో పంపిణీ చేసిన ట్రాక్టర్లు ఎక్కువగా రైస్‌మిల్లర్లు, రొయ్యలు, చేపల చెరువుల యజమానులు, కొంతమంది ప్రజాప్రతినిధులు దక్కించుకున్న వైనం తెలిసింది. -
కారు.. తకరారు
అనంతపురం:దళిత యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రవేశపెట్టిన జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ) కింద అమలు చేస్తున్న పథకాలు అర్హులకు దక్కడం లేదు. ఈ పథకం కింద సబ్సిడీపై పంపిణీ చేస్తున్న కార్లు అనర్హుల ఇళ్లకే చేరుతున్నాయి. ఎక్కువ శాతం అధికార పార్టీకి చెందిన వారికే కార్లు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ వారిని పథకం లబ్ధిదారులుగా గుర్తించకపోయినా...పైస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. దీంతో అధికారులు కూడా ఈ కార్ల..తకరారుతో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ప్రైవేట్ వ్యక్తిగత సహాయకుడు వైఏ చంద్రశేఖర్‌కు నిబంధనలకు విరుద్ధంగా నాలుగుచక్రాల వాహనం మంజూరుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గతేడాది దరఖాస్తు తిరస్కరణ తాడిపత్రికి చెందిన వైఏ చంద్రశేఖర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీ–సీ సర్టిఫికెట్ జత చేసి 2016–17 సంవత్సరంలో ఎన్ఎస్ఎఫ్డీసీ స్కీం కింద రూ. 8.50 లక్షల విలువైన ఇతియోస్ కారు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పథకం కింద 35 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. లబ్ధిదారుడు 5 శాతం తన వాటాగా చెల్లిస్తే మిగతా సొమ్ముకు బ్యాంకు లోను సదుపాయం కల్పిస్తారు. అయితే అర్హులను గుర్తించేందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అధ్యక్షతన నిమిమించిన కమిటీ ఇంటర్వ్యూ సమయంలో చంద్రశేఖర్ దరఖాస్తును అర్హత లేదంటూ తిరస్కరించింది. పక్కనపెట్టిన కలెక్టర్ ఈ క్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చంద్రశేఖర్‌కు కారు మంజూరు చేసే ఫైలును అప్పటి కలెక్టర్ కోన శశిధర్ వద్దకు పంపారు. అయితే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకంగా మంజూరు చేయడం, అందులోనూ జిల్లా కమిటీ సిఫార్సులు చేయకపోవడం తదితర కారణాలతో ఆయన చంద్రశేఖర్ దరఖాస్తును పక్కనపెట్టారు. అనంతరం వీరపాండియన్ కలెక్టర్‌గా వచ్చిన తర్వాత మరోమారు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చంద్రశేఖర్ ఫైలు ఆయన వద్దకు పంపారు. వీరపాండియన్ కూడా ఆ ఫైలును పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఇదంతా తలనొప్పిగా భావించిన అధికారులు కూడా చంద్రశేఖర్‌కు నేడోరేపో వాహనం మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచే అసలు కథ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ప్రైవేట్ పీఏగా ఉన్న తనను ఎంపిక చేయకపోయేసరికి చంద్రశేఖర్ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. మరోవైపు చంద్రశేఖర్‌కు అనుకూలంగా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పాడు. చైర్మన్ మెప్పు పొందడానికి జిల్లా అధికారులపై ఒత్తిడి చేయించి దరఖాస్తును ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి సిఫార్సు చేయించారు. అందువల్లే లక్ష్యం పూర్తయినా ప్రత్యేక కోటా కింద చంద్రశేఖర్‌కు కారు మంజూరు చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. నేను కొత్తగా వచ్చా..నాకేం తెలీదు చంద్రశేఖర్‌కు మేము కారు మంజూరు చేయలేదు. ఆయనకు కారు మంజూరు చేస్తూ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అప్పట్లో ఆయన దరఖాస్తును ఎందుకు తిరస్కరణకు గురైందో కూడా తెలీదు. ఇంతకు మించి నాకు తెలీదు. నేను కొత్తగా వచ్చా. – రామాంజనేయులు,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
ఈపీఎస్‌లో మూడేళ్ల వాటానుచెల్లించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించి తొలి మూడేళ్లపాటు ఈపీఎస్ (ఉద్యోగుల పెన్షన్ పథకం) యాజమాన్యం వాటాను పూర్తిగా కేంద్రం చెల్లించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తద్వారా కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరి, రూ.15 వేలలోపు వేతనం అందుకునే ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు ఇది వర్తిస్తుంది. అలాగే ఎవరైనా 2016 ఏప్రిల్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారుంటే.. అలాంటి వారి పెన్షన్ ఖాతాలకు సంబంధించి తొలి మూడేళ్లలో ఇప్పటి నుంచి మిగిలిన కాలానికి కేంద్రం యాజమాన్యం వాటాను చెల్లిస్తుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశమైంది. ఫాస్ఫరిక్ అండ్ పొటాషియం (పీ అండ్ కే) ఎరువులపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవ్వనున్న రాయితీ రేట్లనూ కేబినెట్ ఆమోదించింది. పొటాష్, సల్ఫర్లకు రాయితీని పెంచిన కేంద్రం నైట్రోజన్, ఫాస్ఫరస్లకు తగ్గించింది. సవరించిన ధరల ప్రకారం కేజీ పొటాషియంపై రూ.15.2, సల్ఫర్పై రూ.2.7, నైట్రోజన్‌పై రూ.18.9, కేజీ ఫాస్ఫరస్పై రూ.11.12 రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. మరికొన్ని నిర్ణయాలు: ఈశాన్య రాష్ట్రాల్లో పలు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వివిధ పథకాలను 2020 మార్చి వరకు పొడిగించింది. ఈశాన్య మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టే అన్ని పనులకూ 100 శాతం నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆయుష్ (ఆయుర్వేద,యోగ, న్యాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) వైద్యులు ఓ బ్రిడ్జి కోర్సు చేసి ఆధునిక వైద్య సేవలు ప్రారంభించేందుకు ఉన్న వెసులుబాటును మంత్రివర్గం తొలగించింది. అలాగే ఇకపై దేశంలోని ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ ఉమ్మడిగా నెక్స్ట (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరుతో తుది పరీక్షలను నిర్వహించనుంది. ప్రాక్టీసు లైసెన్సు కోసం మరో పరీక్షతో పనిలేకుండా నెక్స్›్టలో అర్హత సాధించిన వారికి దేశంలో వైద్య సేవలకు అనుమతులు లభిస్తాయి. విదేశాల్లో వైద్య విద్య చదివిన వారినీ నెక్స్›్టలో అర్హత సాధించాకే దేశంలో ప్రాక్టీసుకు అనుమతిస్తారు. ళీవిద్యా రుణాలకు సంబంధిచిన ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్ఈఎల్)’ ‘సెంట్రల్ సెక్టార్ ఇంట్రస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్)’ అనే రెండు పథకాలను కొనసాగించేందుకు ఆమోదం. వీటి కోసం 2017–18 నుంచి 2019–20 మధ్య రూ.6,600 కోట్ల వ్యయం చేయనున్నారు. -
రెండేళ్లుగా రాయితీ రాలేదు
సిరిసిల్ల: వివిధ సామాజిక వర్గాలకు మెరుగైన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో తీరని జాప్యం చోటుచేసుకుంటోంది. నాయీబ్రాహ్మణులు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసిన సర్కారు.. రెండేళ్లు దాటినా సబ్సిడీ సొమ్ము విడుదల చేయ డంలేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన 17 సంఘాల్లోని 222 మంది తమకు రావా ల్సిన దాదాపు రూ.2.22 కోట్ల రాయితీ కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఒక్కో సెలూన్ ఏర్పాటు కోసం రూ.2 లక్షలు రుణంగా అందిస్తుండగా, ఇం దులో రూ.లక్ష వరకు రాయితీ వర్తింపజేస్తోంది. ఏం జరిగిందంటే.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 కోట్లతో నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సహకార సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. దీంతో 12– 15 మంది సభ్యులతో కూడిన సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కో సంఘానికి రూ.12 లక్షల – రూ.15 లక్షల వరకు సబ్సిడీ అందించాలని, అంతే మొత్తంలో అంటే.. రూ.12 లక్షల – రూ.15 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రతిపాదనలు తెప్పించారు. అప్పుల పాలైనం లోను వస్తదనే ఆశతో సంఘం రిజిస్ట్రేషన్ చేయించినం. అప్పు తెచ్చి బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్ జేసినం. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా రాయితీ పైసల్ వస్తలెవ్వు. రెండేండ్ల సంది మిత్తి పెరుగుతూనే ఉంది. – పయ్యావుల లక్ష్మీనర్సయ్య, లబ్ధిదారు -
ఎంబీసీలకు రాయితీ పెంపు
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) రుణసాయం, సబ్సిడీలను పెం చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్వయం ఉపాధి పథకాలకు అందించే ఆర్థిక సహకారాన్ని మరింత పెంచాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విధంగానే ఎంబీసీలకు సబ్సిడీలు ఇవ్వాలన్నారు. బీసీలకు అమలు చేసే ఎకనామిక్ సపోర్టు స్కీమ్‌కు ఇప్పటివరకు రూ.లక్షకు 60 శాతం (రూ.60 వేలు) సబ్సిడీ ఇచ్చేవారు. అది సరిపోదని, మరింత పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. యూనిట్లకు అందించే రుణ సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.12 లక్షల వరకు అందించాలన్నారు. రూ.లక్ష యూనిట్‌కు ఇకపై రూ.80 వేలు (80 శాతం), రూ.2 లక్షల యూనిట్‌కు రూ.1.40 లక్షలు (70 శాతం), రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల యూనిట్‌కు గరిష్టంగా రూ.5 లక్షలు (60 శాతం) సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంబీసీలకు అమలు చేసే స్వయం ఉపాధి పథకాల సబ్సిడీకి సంబంధించిన ఫైలుపై గురువారం కేసీఆర్ సంతకం చేశారు. గతేడాది ఎంబీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామని, ఈసారీ నిధులు కేటాయిస్తామన్నారు. ఆ నిధులతో ఎంబీసీ కులాల్లోని పేద యువతకు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించారు. -
‘ఎరువుల సబ్సిడీ కంపెనీలకే’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఎరువుల సబ్సిడీ లబ్ధిదారులకు కాకుండా ఫెర్టిలైజర్ కంపెనీలకే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.లబ్ధిదారులకు రిటైలర్లు ఎరువులు విక్రయించిన అనంతరం సబ్సిడీని ఆయా కంపెనీలకు చెల్లిస్తామని ఎరువులు, రసాయనాల మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.ఈ వ్యవహారంపై లోతైన విశ్లేషణ జరిపిన నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఎల్పీజీ తరహాలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు అందచేయడం ఎరువుల సబ్సిడీ విషయంలో సాధ్యపడదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెడుతుందని చెప్పారు. రిటైలర్లు లబ్ధిదారులకు విక్రయించిన ఎరువుల ఆధారంగా సబ్సిడీని గ్రేడ్ల వారీగా ఆయా ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులు సైతం కిసాన్ క్రెడిట్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు చూపి సబ్సిడీపై ఎరువులను కొనుగోలు చేయవచ్చని మంత్రి చెప్పారు. -
అడిగితే ఆలోచిస్తారట!
సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు రామారావు. గోదావరి జిల్లాకు చెందిన వృద్ధుడు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు బంధువులతో కలసి వచ్చి.. తర్వాత నగరం నుంచి భద్రాచలానికి బయలుదేరారు. రాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఎక్కి వయో వృద్ధుల రాయితీ టికెట్ అడిగారు. ‘అలాంటి వసతి లేదు’అంటూ కండక్టర్ బదులిచ్చాడు. దీంతో ఓ ఆర్టీసీ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఏపీఎస్ ఆర్టీసీలో రాయితీ ఉన్నప్పుడు మీరెందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించగా.. ‘అలాంటి రాయితీ కావాలంటూ ఇప్పటి వరకు ఆర్టీసీకి ఎలాంటి అర్జీలు రాలేదు. వస్తే పరిశీలిస్తాం’అని ఆ అధికారి అనటంతో కంగుతినడం ఈయన వంతైంది. చాలా రాష్ట్రాల్లో ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు వృద్ధులకు రాయితీని అమలు చేస్తున్నాయి. రైల్వే శాఖ టికెట్ ధరలో 40 శాతం రాయితీ కల్పించింది. కానీ రాష్ట్ర ఆర్టీసీలో మాత్రం వృద్ధులకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాటు లేదు. తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ.. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఈ రాయితీ అంశంపై దృష్టి సారించలేదు. ఆదాయాన్ని పెంచుకు నేందుకు అనుసరించాల్సిన కొత్త పద్ధతులంటూ గతంలో కొందరు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అందులో వృద్ధులకు టికెట్ ధరపై రాయితీ ప్రకటించాలన్న అంశం కూడా ఉంది. రాయితీ ఇస్తున్నందున వృద్ధులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు ఆసక్తి చూపుతారని, వెంట కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించటం వల్ల బస్సుల ఆక్యుపెన్సీ రేషియో మెరుగవుతుందనేది ఆ సూచనల సారాంశం. ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం.. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25 శాతం మేర టికెట్ ధరపై రాయితీ వస్తోంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధుల్లో చాలామంది ఏపీ బస్సుల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం వరకు ఉంది. ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తే అది కనీసం 2 శాతం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం తెలంగాణలో వృద్ధుల సంఖ్య 70 లక్షల వరకు ఉంది. అందులో సగం మంది ఆర్టీసీ బస్సులవైపు చూసినా అది సంస్థకు ఆర్థికంగా కొంతమేర మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో విరమణ పొందిన ఉద్యోగులకు మాత్రమే రాయితీని వర్తింపజేస్తున్నారు. ఏడేళ్ల కిందటే తీర్మానం వాస్తవానికి రాష్ట్ర విభజనకు పూర్వమే ఈ అంశంపై ఆర్టీసీ బోర్డు తీర్మానించింది. కానీ దాన్ని అమలులోకి తీసుకురాలేదు. తాను బోర్డు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తీర్మానం చేశామని, వృద్ధులకు 25 శాతం మేర రాయితీ ఇవ్వాలని అనుకున్నా ఓ ఉన్నతాధికారి దాన్ని అమలు చేయలేదని ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే వృద్ధులను గౌరవించుకున్నట్టు ఉండటంతోపాటు సంస్థకు మేలు జరుగుతుందని చెప్పారు. -
దళారుల దందా!
‘పక్క చిత్రం జగిత్యాల మండలం బాలపెల్లి గ్రామంలో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలది. ఈ గ్రామంలో మొత్తం 89 యూనిట్లను మంజూరు చేసిన అధికారులు నెలక్రితం 27 మంది లబ్ధిదారులను తమవెంట గుంటూరు జిల్లా మాచర్లకు తీసుకెళ్లి గొర్రెలు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఒక్కో గొర్రెపిల్ల వయస్సు ఏడాది ఉండాలి. కానీ ఈ లబ్ధిదారుల్లో దాదాపు అందరికీ సగం నెల, రెండునెలల వయస్సున గొర్రె పిల్లలు, మిగిలిన సగం పెద్ద జీవాలు అందాయి. ప్రతి యూనిట్లో ఓ పొట్టెలు కచ్చితంగా ఉండాలి. కానీ 17 యూనిట్లకు కూడా ఒక్కపొట్టెలూ లేకుండానే గొర్రెలు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇచ్చిన గొర్రెలు కూడా ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక పంపిణీ చేసినవాటిలో చాలావరకు చనిపోయాయి. చెట్టె కొమురెల్లి, గుంటి పోశవ్వకు చెందిన రెండు యూనిట్లలో పది గొర్రె పిల్లలు చనిపోయాయి. వీరిద్దరు ఎక్కువగా నష్టపోయారు. అంతేకాదు.. మరో 20 యూనిట్లకు సంబంధించిన డీడీలు లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. వారికి ఇంకా జీవాలు పంపిణీ కాలేదు..’ ‘కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్‌కు చెందిన పలువురు గొల్లకుర్మలు గతేడాది నవంబర్‌లో ఓ పశువైద్యాధికారితో కలిసి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లారు. అక్కడ పశువైద్యాధికారి చూపించిన గొర్రెలు బలహీనంగా ఉండడంతో వాటిని తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీంతో సదరు వైద్యుడు వారిని అక్కడే వదిలేసి నాలుగు రోజులపాటు మాయమయ్యాడు. చివరకు లబ్ధిదారులు నేరుగా ఓ ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ఆయన జిల్లా అధికారులకు సమాచారమిచ్చి మరో వైద్యుడిని అక్కడికి పంపగా.. లబ్ధిదారులను తిరిగి తీసుకొచ్చాడు. అదే నెలాఖరులో మళ్లీ కనిగిరి వెళ్లిన లబ్ధిదారులు తమకు నచ్చిన గొర్రెలు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. పై రెండు ఉదాహరణలు చాలు.. జిల్లాలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలు తీరును బేరీజు వేసేందుకు. సాక్షి, జగిత్యాల : అధికారుల వైఫల్యంతో సబ్సిడీ గొర్రెల పథకం జిల్లాలో అభాసుపాలైంది. పథకం అమలులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పథకం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీవాలు ఇప్పించడంలో క్యాష్ టీం.. (లబ్ధిదారుల వెంట వెళ్లిన పశువైద్యులు), దళారులు కలిసి అవినీతికి పాల్పడినట్టు లబ్ధిదారులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నా రు. తమ గొర్రెలు విక్రయించినందుకుగానూ విక్రయదారుల వారినుంచి రూ.5వేల వరకు లంచం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. అక్కడి పరిస్థితుల గురించి ఏమీ తెలియ ని తమను ఎటూ వెళ్లనీయకుండా చేసి వారికి నచ్చిన గొర్రెలు మాత్రమే చూపించి వాటిని మాత్రమే ఇప్పించారని బాధితులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం సబ్సిడీ మీద అందించే జీవాలు ఏడాది నిండి ఉండాలి. కానీ నెల, రెండు నెలలున్న గొర్రెల పిల్లలు, పొట్టేలు లేకుండా లబ్ధిదారులకు అంటగట్టడం పశువైద్యాధికారులకే చెల్లింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం అనుకూలించక వందల సంఖ్యలో గొర్రెల పిల్లలు చనిపోయాయి. దీంతో గొల్లకుర్మలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. మరోపక్క.. పక్క రాష్ట్రంలోని జిల్లాలకు లబ్ధిదారులను తీసుకెళ్లిన పశువైద్యాధికారులు వారు చూపించిన గొర్రెలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. జీవాలు బలహీనంగా ఉన్నా.. తమకు నచ్చకున్నా వాటినే తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేక సబ్సిడీ రూపంలో వచ్చిన గొర్రెలను కాదనకుండా జీవాలను తమ వెంట తీసుకొచ్చామని చెప్తున్నారు. ఉద్దేశమొకటి.. జరుగుతున్నదొకటి.. చితికిపోతున్న గొల్లకుర్మ కుటుంబాలకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకాన్ని ప్రారంభించింది. గతేడాది ఏడాది ఏప్రిల్ 18న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో లబ్ధిదారులతో కలిసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు పర్యటించిన పశువైద్యాధికారులు జిల్లా వాతావరణాన్ని తట్టుకుని జీవించేలా అనువుగా ఉండే గొర్రెలను కొనుగోలు చేశారు. మహారాష్ట్ర జీవాలపై లబ్ధిదారులు అనాసక్తి చూపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుగొండ, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, నెల్లూరు జిల్లా ఉదయగిరి, ప్రకాశం జిల్లా పామూరు, కనిగిరి ప్రాంతాల నుంచి గొర్రెల ను కొనుగోలు చేసి జిల్లాలో గొల్లకుర్మలకు అప్పగించారు. ఒక్కొ యూనిట్‌కు రూ.1.25 లక్షల చొప్పున ఇప్పటి వరకు 9,739 యూని ట్లు లబ్ధిదారులకు అందించారు. ఒక్కో యూని ట్‌కు ఇరవై గొర్రెలు.. ఒక పొట్టెలు చొప్పున ఇచ్చారు. ప్రతి యూనిట్‌కు సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.93,750 (75 శాతం) చొప్పున రూ.31 కోట్ల పైచిలుకు ఖర్చు చేసింది. మిగిలిన రూ.31,250 (25శాతం) లబ్ధిదారులు భరించారు. దీంతో పాటు ప్రతి జీవిపై ఏడాదిపాటు ఇన్సురెన్స్ చెల్లించారు. ఆ లోపు గొర్రె, పొట్టే చనిపోతే దానిస్థానంలో మరో జీవిని ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు గొర్రెలు ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారు. నిర్ణయించిన లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిదేమీ లేదు లబ్ధిదారుల ఇష్టం మేరకే సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశాం. ఇష్టం లేని ఎంతోమంది జీవాలు లేకుండానే తిరిగొచ్చారు. మరోసారి వారిని తీసుకెళ్లి ఇష్టం మేరకు జీవాలు ఇప్పించాం. గొర్రెలు ఇప్పించడంలో దళారుల ప్రమేయం లేదు. పొట్టేలు తక్కువగా ఉండడంతో పలు యూనిట్లకు ఇవ్వలేకపోయాం. -అశోక్‌రాజు, జిల్లా పశువైద్యాధికారి చిన్నపిల్లలు కొనిచ్చారు గొర్రెల పథకంలో లబ్ధిదారులు ఏరుకున్న గొర్రెలు కాకుండా నచ్చలేదని చెప్పినా వినకుండా 10 పెద్దవి, 11 చిన్న గొర్రెలు కొనిచ్చారు. ఇప్పటికే మూడు పిల్లలు చనిపోయాయి. అధికారులు చిన్న గొర్రెపిల్లలు వద్దని చెప్పినా పట్టించుకోకుండా కొనిచ్చారు. – చెట్టె బుచ్చయ్య, బాలపల్లి పొట్టేలు లేకుండానే ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి ఇచ్చారు. 10 పెద్ద గొర్రెలు, 10 చిన్న పిల్లలు ఇచ్చారు. గొర్రెలు నచ్చలేదని చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడకు వచ్చేలోపు పిల్లలు చనిపోయాయి. నెల్లూరు జిల్లా మాచర్ల, కుంటాల ప్రాంతాల్లో వారే గొర్రెలను చూసి కొనుగోలు చేసి ఇచ్చారు. – ఏగుర్ల రెడ్డి, బాలపల్లి మేం చూసినవి వద్దన్నరు కర్నూలు గొర్రెలు బాగున్నాయి. అధికారులు కుదరవని, కుంటకు తీసుకెళ్లారు. చిన్నవి సగం, పెద్దవి సగం కొనివ్వడంతో కొంత మంది మి విధిలేక తీసుకున్నాం. కొంతమంది వాపస్ వచ్చారు. 20 యూనిట్ల లబ్ధిదారులు గొర్రెలు తీసుకోలేదు. – చెట్టె కొమురయ్య, బాలపల్లి -
‘హజ్ సబ్సిడీ పేరుతో మోసం చేశారు’
సాక్షి, లక్నో : హజ్ సబ్సిడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపడింది. తాజాగా హజ్ సబ్సిడీని ఉసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటన అర్థం లేనిదని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రెటరీ మౌలానా వాలీ రెహమాని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు సాధారణ రోజుల్లో ఇక్కడ నుంచి సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్ ధర.. రూ. 32 వేలు మాత్రమే. అదే హజ్ యాత్ర రోజుల్లో ఈ టిక్కెట్‌ధర రూ. 65 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుందని ఆయన చెప్పారు. సబ్సిడీకన్నా అసలు టిక్కెట్ ధరే తక్కువని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. సబ్సిడీ పేరుతో ప్రభుత్వాలు ముస్లింలను మోసగించాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు. హజ్ యాత్రికులు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకపోయినా.. ఎయిర్ ఇండియా మాత్రం నష్టాల్లో నడుస్తోందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానిచారు. ఇదిలావుండగా.. హజ్ సబ్సిడీని ఎత్తివేయడంపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు హర్షం వ్యక్తం చేసింది. అలాగే సబ్సిడీ మొత్తాన్ని ముస్లిం పేద విద్యార్థినులకోసం ఖర్చు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని షియా బోర్డు ఛైర్మన్ యాసూబ్ అబ్బాస్ స్వాగతించారు. -
హజ్ యాత్రికుల సబ్సిడీ ఎత్తివేత
-
హజ్ యాత్రికులకు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. హజ్ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మందిపై సబ్సిడీ భారం పడనుంది. ఇప్పటివరకూ హజ్ యాత్రకు వెళ్లేవారికి ప్రతి ఏటా రూ. 700 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. హజ్ యాత్రకు సబ్సిడీ నిలుపుదల వల్ల మిగిలే డబ్బును మైనార్టీ బాలికలు, మహిళల సంక్షేమానికి వినియోగిస్తామని నక్వీ పేర్కొన్నారు. హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ద్వారా ఏజెంట్లు మాత్రమే లాభపడుతున్నారని, ముస్లింలు లాభం పొందడం లేదని అన్నారు. -
జాడలేని కంపెనీలకు రూ. కోట్లలో రాయితీలు
సాక్షి, అమరావతి: కొత్త రాష్ట్రం కాబట్టి కంపెనీలకు రాయితీలు ఇవ్వడం సహజం. వాటిని రప్పించే కన్సల్టెన్సీకి కూడా ఫీజులు చెల్లించటం మామూలే. కానీ ఏ కంపెనీలు వస్తాయో తెలియదు... ఎప్పుడొస్తాయో అంతకన్నా తెలియదు. అయినా సరే వచ్చేస్తున్నాయంటే ముందే రాయితీలు ఇస్తారా? కార్యాలయాల కోసం రూ. కోట్లలో అద్దెలు చెల్లిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడదే చేస్తోంది. గ్లోబల్ ఇన్‌హౌస్ (ఏపీజీఐసీ) పాలసీ కింద బెంగళూరుకు చెందిన ఏఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ. కోట్లలో ప్రయోజనం చేకూరుస్తూ గురువారం జీవో జారీ చేసింది. వివిధ దేశాలకు చెందిన ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించి వందల మందికి ఉపాధి కల్పిస్తామని ఈ కన్సల్టెన్సీ పేర్కొంది. ఉద్యోగులను తామే నియమిం చుకుని, ఏవైనా కంపెనీలు వచ్చాక ఆ ఉద్యోగులను వారికి బదలాయిస్తామంది. అప్పటివరకూ వారు కన్సల్టెన్సీ ఆధ్వర్యంలోనే పనిచేస్తారు. ఈ సంస్థలో 200 మంది ఉద్యోగులు పనిచేయడానికి వీలుగా విశాఖలో అవసరమైన భవనాన్ని ప్రభుత్వమే అద్దె చెల్లించి సమకూరుస్తుంది. ఏడాదిన్నర అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుంది ఎప్పుడో వచ్చే ఐటీ కంపెనీల కోసం ప్రైవేట్ వ్యక్తులు భవనాలు నిర్మిస్తారు. కంపెనీలు వచ్చే వరకూ వాటికి ప్రభుత్వమే అద్దె చెల్లిస్తుంది. దీనికోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ (డీటీపీ) అనే మరో పాలసీని ప్రవేశపెట్టారు. ఏఎన్ఎస్ఆర్ కన్సల్టెన్సీ ఆఫీస్‌కు అడుగు రూ. 80 చొప్పున 15,000 అడుగులకు అద్దె చెల్లిస్తారు. ఇలా ఊరూ పేరు లేని కంపెనీల కోసం నెలకు రూ.12 లక్షల చొప్పున 18 నెలల పాటు రూ. 2.16 కోట్లు అద్దెగా కన్సల్టెన్సీకి చెల్లించనున్నారు. అంతేకాదు వెయ్యి మంది ఉద్యోగుల కోసం అద్దెకోసం మరో రూ. 11 కోట్ల వరకూ అవుతుంది. అంతా కలిపి ఏడాదిన్నరలో రూ. 13 కోట్లకుపైగా కన్సల్టెన్సీకి చెల్లించనున్నారు. ఒకవేళ ఐటీ కంపెనీలను రప్పించటంలో కన్సల్టెన్సీ విఫలమైతే 18 నెలల తర్వాత ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. అసలు ఐటీ కంపెనీలు వచ్చేవరకు వీరికి ఎలాంటి విధులు కేటాయిస్తారు? వేతనాలు ఎలా చెల్లిస్తారు? అనే అంశాలపై భరోసా ఇవ్వటం లేదు. -
ఇక నిలకడగా సిలెండర్ ధర
సబ్సిడీ వంటగ్యాస్ సిలెండర్ ధరను నెలకు రూ. 4 చొప్పున పెంచుతూ వచ్చే మార్చినాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలని సంకల్పించుకున్న కేంద్ర ప్రభుత్వానికి వ్రత భంగమైంది. ఇకపై ధర పెంచొద్దని చమురు రంగ సంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మౌఖికంగా చెప్పడం వల్లనో ఏమో... వాస్తవానికి మొన్న అక్టోబర్ నుంచే సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ధర పెరగడం ఆగింది. అందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు ఇప్పుడొచ్చాయి. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణా లేమిటో మాకు చెప్పలేదని చమురు సంస్థలు అంటున్నాయి. ప్రజలకు చెప్పిన కారణమైతే అంత హేతుబద్ధంగా లేదు. ఓ వైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం... మరోవైపు సిలెండర్ ధర పెంచుకుంటూ పోవడం పరస్పర విరుద్ధమైన విధానాలుగా గుర్తించడంవల్ల ఈ నిర్ణయం తీసుకు న్నామని కేంద్రం ప్రకటించింది. ‘కారణమేదైనా ధర పెరగదన్నారు అదే పదివేల’ని మధ్యతరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతకూ తాజా నిర్ణయానికి కారణ మేమిటి? దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు వచ్చే మూడేళ్లలో ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో నిరుడు మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకాన్ని ప్రారంభించింది. అది విజయవంతంగా అమలవుతోంది. దానికింద ఇప్పటికి 3.2 కోట్ల మంది లబ్ధి పొందారు. ఆ పథకం ప్రారంభమైన రెండు నెలలకే...అంటే నిరుడు జూన్‌లో సబ్సిడీ సిలెండర్ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచాలని కేంద్రం ఆదేశా లిచ్చింది. మొన్న జూన్ నుంచి ఆ రెండు రూపాయలు కాస్తా రూ. 4 అయింది. ఇలా పెంచుతూ వచ్చే మార్చి నాటికి సబ్సిడీని పూర్తిగా తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పీఎంయూవై పథకానికీ, సబ్సిడీ సిలెండర్ ధర పెంచుకుంటూ పోవాలన్న నిర్ణయానికీ మధ్య వైరుధ్యం ఉన్నదని గుర్తించడానికి ఏణ్ణర్ధం పట్టిందంటే అది నమ్మదగినదిగా లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధానాలనూ, నిర్ణయాలనూ ప్రకటిం చేది వివిధ శాఖల మంత్రులు కావొచ్చుగానీ... ఆ నిర్ణయానికొచ్చే ముందు వేర్వేరు స్థాయిల్లో మథనం జరుగుతుంది. పలు కోణాల్లో ఉన్నతాధికారులు, నిపుణులు పరి శీలించి తమ అభిప్రాయాలు చెబుతారు. ఈ క్రమంలో ఏ దశలోనూ వైరుధ్యం ఉన్నట్టు తాను గుర్తించలేదని ప్రభుత్వం చెప్పడమంటే నిర్ణయం తీసుకునే ప్రక్రియ సరిగా లేదని అంగీకరించినట్టు లెక్క. సిలెండర్ ధర పెంపును ఆపేయాలని మొన్న అక్టోబర్‌లో మౌఖికంగా చమురు సంస్థలకు చెప్పినప్పుడే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ప్రారంభమై దాని ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై చూపడం మొదలయ్యాక జనంలో ఆగ్రహా వేశాలు మొదలయ్యాయి. అందువల్లే వాటిపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయిం చారు. ఇదిగాక గత నెలాఖరులో చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్)కూ, రష్యాకూ మధ్య చమురు ఉత్పత్తి కోతపై ఒప్పందం కుదిరాక చమురు ధరలు మరింత పెరగడం మొదలైంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్లతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కొందరు అంచనా వేస్తున్నట్టు వాటితోపాటు లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, వాటికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలు పెరగడం కేంద్ర ప్రభుత్వానికి క్షేమం కాదు. మన పాలకుల్లో సంస్కరణలు అమలు చేయాలన్న తహతహకూ, వాటి పర్య వసానంగా ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజల ప్రయోజనాలకు మధ్య ఎప్పుడూ వైరుధ్యం ఉంది. ధరలు పెరిగితే ప్రజలు వెనువెంటనే రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేయకపోవచ్చుగానీ... ఎన్నికల్లో అధికార పక్షాన్ని శిక్షించిన దాఖలాలు గతంలో చాలానే ఉన్నాయి. ఈమధ్య జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో స్థానాలు లభించకపోవడం వెనకున్న అనేక కారణాల్లో ధరల పెరుగుదల కూడా ఒకటి. ఇప్పటికే సబ్సిడీ సిలెండర్లకు రకరకాల కారణాలతో కోత మొదలైంది. రూ. 10 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి 12 సిలెండర్లు మాత్రమే ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం పదవినుంచి వైదొలగే ముందు నిర్ణయించింది. అంతకు మించితే ఆ వర్గాలవారు మార్కెట్ ధర చెల్లించి సిలెండర్లు కొనుక్కోవలసి వస్తోంది. అదిగాక ఆధార్‌తో అనుసంధానించడం తప్పని సరి చేయడంతో 3.5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయని, అందువల్ల రూ. 21,261 కోట్లు ఆదా అయ్యాయని కేంద్రం చెబుతోంది. దీనికితోడు కారున్న కుటుంబాలకు వంటగ్యాస్ సబ్సిడీ తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆమధ్య వార్తలొచ్చాయి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచీ సంక్షేమ భావన కొడిగడుతోంది. కేంద్రంలో ఏ కూటమి పరిపాలించినా ఈ సంస్కరణల విషయంలో ఒకేలా ఆలోచిస్తున్నాయి. విపక్షంలో ఉండగా వ్యతి రేకించడం, అధికారంలోకొచ్చాక ఆ విధానాలనే కొనసాగించడం ఆనవాయితీగా మారింది. అయితే దాదాపు ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం వల్ల ఈ సంస్కరణలకు అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నాయి. బహుశా అందుకే కావొచ్చు... ఈమధ్య లోక్‌సభకూ, అసెంబ్లీలకూ జమిలి ఎన్ని కలు జరగాలన్న వాదన తెరపైకొచ్చింది. ఏదేమైనా వంటగ్యాస్ సిలెండర్ ధర పెంపుదలకు బ్రేక్ పడిందన్న వార్త పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తుంది. పనిలో పనిగా చమురు సంస్థలపై విధిస్తున్న రకరకాల పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధం చేస్తే వీటి ధరలు నిలకడగా ఉండటంకాదు... గణ నీయంగా తగ్గుతాయి కూడా. మన పాలకులు ఆ దిశగా ఆలోచించాలని అందరూ కోరుకుంటున్నారు.