ఎలక్ట్రానిక్ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్‌లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్‌బుక్
ఫేమ్3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్‌ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్ ఇండియా1ను 2015, ఏప్రిల్1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment