fame
-
లేత రంగు చీర.. లేలేత నవ్వులు, బిగ్‌బాస్ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
Naga Manikanta: బిగ్‌బాస్ ఫేమ్ నాగమణికంఠ వెడ్డింగ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహం
ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)–3 పథకం కింద రూ.10,000 కోట్లను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరంభంలో రెండేళ్ల కాలానికి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. ఫేమ్ –2 కింద 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వగా.. ఫేమ్–3లో ఇంతకంటే అధిక సంఖ్యలో బస్సులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు సమాచారం. ఫేమ్–2లో ఎలక్ట్రిక్ కార్లకు సైతం ప్రోత్సాహకాలు లభించగా.. ఫేమ్–3లో వీటి ప్రోత్సాహకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పథకం నుంచి కార్లను మినహాయించనున్నట్టు తెలుస్తోంది. ఫేమ్ –2 పథకం గడువు 2024 మార్చితో ముగిసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు విక్రయ ధరపై 15 శాతం సబ్సిడీ లభించడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్)ను తాత్కాలికంగా అమల్లోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్ఈఎంపీఎస్ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు ఈ ఏడాది జూలై వరకు ప్రోత్సాహకాల కింద రూ.500 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రతి ద్విచక్ర ఈవీపై రూ.10,000 చొప్పున సబ్సిడీ కేటాయించింది. కానీ ఫేమ్–2లో ఇది రూ.22,500గా ఉంది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనంపై రూ.50,000 సబ్సిడీని ఈఎంపీఎస్ కింద ఇచ్చారు. ఫేమ్–2లో ఇది రూ.1,11,505గా ఉంది. కిలోవాట్ హవర్‌కు రూ.5,000 చొప్పున ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. -
ముత్యాల్లాంటి నవ్వు.. హీరోయిన్ నితాన్షీ మరింత క్యూట్‌నెస్ (ఫొటోలు)
-
Jyothi Rai: బిగ్‌బాస్ నుంచి పిలుపొచ్చింది.. కానీ! (ఫొటోలు)
-
ఇదే జరిగితే.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గుతాయి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్లో 'ఫేమ్' (FAME) స్కీమ్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. అయితే కేంద్ర బడ్జెట్‌కు ముందు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి ఫేమ్ 3 పథకం ప్రణాళికలు చివరి దశలో ఉన్నాయని, వాటిని అమలు చేస్తామని వెల్లడించారు.ఫేమ్ 3 ప్రారంభించే ప్రణాళికల గురించి భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వివరిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి అమలులో ఉన్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కానీ ఫేమ్ 3 గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే దీనిని త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.ఫేమ్ 3 కింద ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వ్యయాన్ని పరిగణించాలని మొబిలిటీ మేనేజింగ్ పార్టనర్ ఆర్యమాన్ టాండన్ అన్నారు.2024-25 బడ్జెట్లో ఫేమ్-3 స్కీమ్ ప్రస్తావన లేకపోవడం పరిశ్రమలోని చాలా మంది వాటాదారులకు నిరాశ కలిగించింది. కానీ ప్రభుత్వం ప్రోత్సాహాలను అందిస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ భాగస్వామి రజత్ మహాజన్ అన్నారు.ప్రభుత్వ ప్రోత్సాహకాల ఆధారంగా ఈవీల విక్రయాలు ఉంటాయి. అంతే కాకుండా దేశంలో మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని, అప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఫేమ్ 3 కింద బెనిఫీట్స్ అందిస్తాయనే విషయం తెలియాల్సి ఉంది. -
గుడ్‌న్యూస్.. ఈవీ సబ్సిడీ స్కీమ్ పొడిగింపు
ఎలక్ట్రిక్ వాహనాలపై అందించే అందించే సబ్సిడీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఫేమ్-2 పథకం ముగిసిన తర్వాత తాత్కాలికంగా తీసుకొచ్చిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) 2024 ను పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈఎంపీఎస్ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో రెండు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇందు కోసం రూ. 778 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఈ పథకం కింద 5,00,080 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 60,709 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు మొత్తంగా 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీలకు మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ప్రైవేట్ లేదా కార్పొరేట్ యాజమాన్యంలోని రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కూడా ఈ పథకం కింద అర్హత ఉంటుంది.ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) రెండవ దశ గడువు ముగియడానికి ముందు మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఈఎంపీఎస్ 2024ని ప్రకటించింది. రూ.500 వ్యయంతో నాలుగు నెలలపాటు జూలై 31 వరకు 3,33,387 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 13,590 ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు మద్దతు ఇవ్వడానికి దీన్ని అమలు చేశారు. -
భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..
ఎలక్ట్రానిక్ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్ఫేమ్3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్ ఇండియా1ను 2015, ఏప్రిల్1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. -
స్నాతక పాఠం అంటే..?
ఒక వయసులో ఒక స్త్రీ ఒకపురుషుడికి నచ్చిందనీ, ఒక పురుషుడు ఒక స్త్రీకి నచ్చాడనీ...కాబట్టి కలసి జీవించడం... అనేది శాస్త్ర సమ్మతం కాదు. కాలం గడిచేకొద్దీ ధనం వెళ్ళిపోతుంది, నీ వాళ్ళనుకున్న వాళ్ళు వెళ్లిపోతారు, అధికారం పోతుంది, జ్ఞాపకశక్తి కూడా పోతుంది.. అన్నీ పోతాయి... అలాగే యవ్వనం కూడా. కానీ మిగిలిపోయేది ఏదయినా ఉంటే.. ఆ వ్యక్తి ధార్మికంగా బతికాడా..అన్నదే! పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, వారిద్దర్నీ ఎందుకు కలుపుతున్నారు... ప్రస్థానం అంటే వారిద్దరూ కలిసి ఏం చేయాలి? అన్న దాని గురించి అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు గురువుని తీసుకొచ్చి మంచి విషయాలు చెప్పిస్తారు. దానిని స్నాతక పాఠం అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి ‘‘మీరు వివాహం చేసుకోవాలి. ఇద్దరూ అన్యోన్యంగా బతకడం మీద ఎన్నో జీవితాల అభ్యున్నతి ఆధారపడి ఉంది. ఈ ఏర్పాటు మీ వ్యక్తిగత జీవితం కోసం మాత్రమే కాదు సుమా! మీ పెద్దల కీర్తి ప్రతిష్ఠలు, నీ తోబుట్టువుల తృప్తి, మీ బిడ్డల భవిష్యత్తు.. ఇలా చాలా ముడిపడి ఉన్నాయి. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. దీనిని మీరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అవగాహనపరిచే ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్న గొప్పదనం. అన్నపానీయాలుగానీ, మరేవయినాగానీ వాటిని సంస్కరించకుండా స్వీకరించం. అటువంటి ఒక ఏర్పాటును నీవు జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు.. ఇక అక్కడినుంచి నీ జీవితం పండవలసిన అవసరం ఉంది. ఇది బ్రహ్మచర్యం అన్న కట్టువిప్పి గృహస్థాశ్రమం అన్న కొత్తకట్టు వేయడం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు విప్పేయడం అన్నమాట ఉండదు. కారణం – ఆ ఆశ్రమంలో క్రమశిక్షణ, విద్యాభ్యాసం, గురువుపట్ల చూపే గౌరవమర్యాదలు ...ఇవన్నీ ఉన్నాయి. గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆ కట్టుబాటు ఎటు పోయింది? ఎటూ పోలేదు. దాని మీద మరో కట్టు వచ్చి చేరింది. కట్టుమీద కట్టు. ΄పొలంలో పచ్చిగడ్డికోసి మోపుకట్టిన తండ్రిని చూసి కొడుకు ‘‘మోపు గట్టిగా కట్టలేదు’’ అంటే తండ్రి బాధపడతాడని... ‘‘అది వదులుగా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది, మరో కట్టు వేస్తాను’’ అని మోపును మోకాళ్ళతో అదిమి గట్టిగా కట్టి తలమీద పెట్టుకుని ఇంటిబాట పడతాడు. తండ్రి వేసిన కట్టును విప్పి ఆయనను అగౌరవ పరచలేదు. ఆ కట్టు వదులుగా ఉన్నందువల్ల ఎక్కడో దానంతట అదే జారిపోయింది. అంతే.గృహస్థాశ్రమం అన్న కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్య నియమాలు జారిపోతాయి తప్ప బ్రహ్మచర్యంలో ఏ బంధాలున్నాయో అవి, అక్కడ అలవర్చుకున్న సంస్కారం మాత్రం జీవితాంతం ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎలా సంస్కరిస్తే వ్యక్తి జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమయిన విషయాలను అందించి ఆశ్రమాన్ని మారుస్తారు. -
ఫేమ్-2 పథకం పొడిగింపుపై కేంద్రం వ్యాఖ్యలు
దేశంలో విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్-2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగించబోతోందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనున్న సందర్భంగా మరో నాలుగు నెలల పాటు గడువును పొడిగిస్తారని, ఇందుకోసం అదనంగా రూ.500 కోట్లు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈ పథకాన్ని పొడిగించే ప్రతిపాదనలేవీ లేవని తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’ కేంద్రం ఫేమ్ పేరిట ఇప్పటికే రెండు దఫాల్లో విద్యుత్తు వాహన కొనుగోళ్లకు రాయితీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు, ఫోర్ వీలర్లకు రాయితీ వర్తిస్తుంది. తొలుత ఫేమ్-2 కింద రూ.10వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత దాన్ని రూ.11,500 కోట్లకు పెంచారు. నిధులు అందుబాటులో ఉండే వరకు ఈ పథకాన్ని పొడిగిస్తారనే వాదనలు వచ్చాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల వేళ గడువు పొడిగిస్తారంటూ వార్తలు రాగా.. అవన్నీ అవాస్తవమని కేంద్రం చెప్పింది. -
Vasanthi Krishnan: బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి రిసెప్షన్ పిక్స్ (ఫోటోలు)
-
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
ఫేమ్ 3 పేరుతో కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ!
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఫేమ్ 3' (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)ను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ కోసం రూ.26,400 కోట్లు కేటాయించాలని మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్రం కేటాయించనున్న రూ.26400 కోట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రూ.8158 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సులు కోసం రూ. 9,600 కోట్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్ల కోసం రూ.4,100 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లపై అందించే రాయితీ మాత్రమే కాకుండా టెక్నాలజీ డెవలప్మెంట్, ట్రయల్ రన్ వర్క్స్ కోసం ఈ పథకంలో భాగంగానే నిధులు కేటాయించాలన్నది కేంద్రం ఆలోచన. మొత్తంగా రూ.33వేల కోట్లను మూడో దశకు కేటాయించే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలను ప్రోత్సహించడానికి.. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్ 1న తీసుకువచ్చింది. ఈ సబ్సిడీ కింద టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్‌కు వర్తించేలా చేశారు. ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లెక్కకు మించిన వాహనాలు సేల్ అయ్యాయి. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు కొన్ని సంస్థలు చేసిన అవకతవకల వల్ల.. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ 2 సబ్సిడీ నిలిపివేశారు. కాగా 2024 మార్చి 31 నాటికి ముగుస్తుంది. దీనిని సృష్టిలో ఉంచుకుని ఫేమ్ 3 స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది కూడా రెండు దశల్లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఫేమ్ 3 స్కీమ్ కింద వాహనాలను మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తే 10 శాతం అదనపు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం యోచిస్తోంది. -
Pranati Rai Prakash: దాస్ కా ధమ్కీ ఫేమ్ ప్రణతి రాయ్ ప్రకాష్ స్టన్నింగ్ ఫోటోలు
-
హీరోగా బిగ్‌బాస్ ఫేమ్.. షూటింగ్ ప్రారంభం!
బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న సిబీ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సిబీ ఇంతకుముందే వంజగర్ ఉలగం, మాస్టర్ తదితర చిత్రాల్లో నటించారు. నటి ఖుషితా కల్లప్పు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పరుత్తివీరన్ శరవణన్, జయప్రకాష్, నిరోషా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. క్రౌన్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఎస్ ఇబ్రహీం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రకాష్ కృష్ణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ చిత్రం ఫేమ్ బాబు సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి గోపి కృష్ణన్ చాయాగహ్రణం అందిస్తుండగా.. కబీర్ వాసుకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం చైన్నెలో రెగ్యులర్‌గా షూటింగ్ జరుగుతోందని యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
సత్సాంగత్యం
ఏమీ చదువుకోక పోయినా, విద్యాగంధం ఏ మాత్రం లేక పోయినా కొంత మంది మాటలు పండితులకే ఆశ్చర్యం కలిగిస్తాయి. వారు ఉంటున్న, లేదా పని చేస్తున్న ప్రదేశంలో ఉన్న వాతావరణం ప్రభావం అది. అందరు వైద్యులే ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు అప్రయత్నంగా వైద్య పరిభాషని ఉపయోగించటం, సంగీత విద్వాంసుల కుటుంబంలో వారి పిల్లలు రాగాలని గుర్తు పట్టటం వంటివి మనం చూస్తూనే ఉంటాం కదా! అదంతా సాంగత్య ప్రభావం. ఒక వ్యక్తి నిత్యం ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటే వారి ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. మంచివారితో కలిసి ఉంటే సహజంగా దురాలోచన ఉన్న వ్యక్తి అయినా కొంత వరకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉండటం జరుగుతుంది. దుర్మార్గుల సాహచర్యంలో ఉంటే చెడ్డపనులు చేయక పోయినా ఆమోదించటం, అనుమోదించటం జరుగుతుంది. కనుకనే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాము... అన్న దానిని గమనించుకుంటూ ఉండాలి. కొన్ని ప్రభావాలు తాత్కాలికం. మందారపువ్వు పక్కన ఉన్న గాజుపట్టకం లాగా. పువ్వుని అక్కడి నుండి తీసేయగానే అప్పటి వరకు ఎర్రగా కనపడిన గాజుపట్టకం తన సహజ వర్ణానికి వచ్చేస్తుంది. కొన్నిటిని తప్పించుకోవటం కష్టం. మరికొన్నిటి ప్రభావం శాశ్వతం. స్వభావంలో జీర్ణించుకుపోతాయి. శక్తివంతమైన చెడు ప్రభావాల నుండి తప్పించుకోవటానికి మార్గం దూరంగ ఉండటమే. ‘‘దుష్టుడికి దూరంగా ఉండ’’ మని పెద్దలు చెప్పిన మాట ఇందుకోసమే. మరి కొన్నిటి ప్రభావం ఆ పట్టకం పైన రంగులని పూసినట్టు. గట్టిగా తుడిచినా, నీళ్ళతో కడిగినా సహజ స్థితికి వస్తుంది. అదే, పట్టకం తయారు అయే సమయంలో ద్రవస్థితిలో ఉండగానే ఏదైనా రంగు కలిపితే అది శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే మంచివారి సాంగత్యంలో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. స్వభావసిద్ధంగా దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందటానికి కారణం ఎంతో సమయం విదురుడి సమక్షంలో గడపటమే. మనసు బాగుండనప్పుడు విదురుడిని పిలిపించుకొని అతడి సమక్షంలో కాలం గడిపే వాడు. శాశ్వతంగా కాక పోయినా విదురుడు మాట్లాడినంత సమయం ధృతరాష్ట్రుడు సదాలోచనాలతోనే ఉన్నాడు. కనీసం దురాలోచనలు చేయకుండా ఉన్నాడు కదా! పూలు మాల కట్టిన దారానికి ఆ పూల పరిమళం అంటుకు పోతుంది. ఒకరి ప్రభావం మరొకరి మీద ఉండటం ఎట్లా కుదురుతుంది? అనే దానికి సాన్నిధ్యం లో ఉండటమే కారణం అన్నది సమాధానం. ఇనుము అయస్కాంత సన్నిధిలో కొంతకాలం ఉండగా ఉండగా దాని లక్షణాలు ఇనుముకి రావటం చూస్తున్నాముగా! ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్న మునిలో హింసాప్రవృత్తి క్రమంగా పెంపొందిన ఇతివృత్తాన్ని సీత రాముడికి చెప్పింది. అదే విధంగా బోయల మధ్య పెరిగిన ప్రచేతసుడనే ముని కుమారుడు బోయవాడుగా మారటం మనకి తెలుసు. ఇది పైకి కనిపించే అర్థం. అసలు అర్థం మరొకటి ఉన్నదని పెద్దలు చెపుతూ ఉంటారు. ‘సత్’ అంటే ఉన్నది, సత్యము అని కూడా అర్థాలున్నాయి. ‘సత్’ అంటే భగవత్తత్త్వం. ఆ సత్ (వేదాంతులు సత్తు అని అంటూ ఉంటారు) తో సాహచర్యం చేస్తూ ఉండటం. అంటే నిరంతరం దైవచింతనలో ఉండటం. అట్లా కుదురుతుందా? అంటే అందరినీ దైవస్వరూపులుగా భావిస్తే అదెంత పని? ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆది శంకరులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటారు. వీరిలో ఒకరికైనా సద్బుద్ధి కలిగిందని చెప్పగలరా? అంటూ విమర్శిస్తూ ఉంటారు కొందరు. వారికి సద్బుద్ధి కలిగిందో లేదో మనకి అనవసరం. కాని, ఆ కార్యక్రమంలో ఉన్నంత కాలం దురాలోచనలు లేక ఉంటారు. అది గొప్ప ప్రయోజనమే కదా! తరువాత అది నెమ్మది గా మిగిలిన సమయాలకి కూడా విస్తరించే అవకాశం ఉంది. పూలు మాల కట్టిన దారం పువ్వుగా మారక పోవచ్చు కాని పూలవాసనని మాత్రం సంతరించుకుంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
ఏడు కంపెనీలకు షాక్ - దెబ్బకు రూ. 469 కోట్లు వెనక్కి!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. కావున వాహన తయారీ సంస్థలు ఇలాంటి వెహికల్స్ తయారు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ 2 పథకం కింద ప్రయోజనాలను అందిస్తోంది. దీనిని అదనుగా తీసుకున్న చాలా కంపెనీలు నిబంధనలను పాటించలేదని గుర్తించి మొత్తం రికవరీ చేయాలనీ కేంద్రం ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫేమ్ 2 నియమాలను అదనుగా తీసుకున్న 7 కంపెనీలు రూ. 469 కోట్లు క్లెయిమ్ చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మోసాన్ని గుర్తించిన కేంద్రం ఫేమ్ 2 కింద పొందిన మొత్తం డబ్బుని తిరిగి వెనక్కి ఇవ్వాలని వెల్లడించింది. మరో 7 నుంచి 10 రోజులలోపు మొత్తం డబ్బుని తిరిగి ఇవ్వని యెడల ఈ స్కీమ్ నుంచి కంపెనీని తొలగించనున్నట్లు పేర్కొంది. (ఇదీ చదవండి: నోట్ల ఉపసంహరణ గడువుపై కేంద్రం కీలక ప్రకటన - తప్పక తెలుసుకోవాల్సిందే!) మన దేశంలో తయారైన విడి భాగాలను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు అందించాలని ఫేమ్ 2 నిబంధలు చెబుతున్నాయి. అయితే హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో వంటి కంపెనీలు చైనా విడి భాగాలతో వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చింది, ఎవరు ప్రారంభించారో తెలిస్తే అవాక్కవుతారు!) ఫేమ్ 2 నిబంధనలను అనుగుణంగా నడుచుకుంటున్నట్లు హీరో ఎలక్ట్రిక్, ప్రభుత్వానికి వివరణాత్మకంగా సమాచారం అందిస్తామని యాంపియర్, మాకు ఇప్పటి వరకు ఎటువంటి నోటీసు అందలేదని లోహియా కంపెనీలు వెల్లడించాయి. కాగా దీనిపైన స్పందించడానికి ఒకినావా & రివోల్ట్ నిరాకరించినట్లు సమాచారం. మొత్తం మీద విదేశాల నుంచి ముడి భాగాలను దిగుమతి చేసుకుని వాహనాలను తయారు చేసినట్లు రుజువైతే ఇప్పటి వరకు ప్రోత్సాహకాల కింద అందుకున్న మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. -
ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా?
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కొనసాగించడం లేదా దాన్ని ప్రయోజనాలను అలాగే అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీ హనిఫ్ ఖురేషి తాజాగా తెలిపారు. సుస్థిర పారిశ్రామిక వృద్ధికి సమర్థ నిర్వహణ వ్యవస్థలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఖురేషీ మాట్లాడుతూ.. వినియోగదారుల సంతృప్తి, స్థిరమైన పారిశ్రామిక వృద్ధిని నడపడంలో నిర్వహణ వ్యవస్థల ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. 150 బిలియన్ డాలర్ల మేర ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, కొనుగోలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో ఫేమ్ పథకాన్ని తీసుకొచ్చింది. మూడేళ్ల కాల పరిమితి ముగిశాక మళ్లీ రెండేళ్లు పొడిగించింది. అయితే ఇటీవల ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. దీంతో జూన్ నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచేశాయి. కాగా మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం దీనిపై పునరాలోచించడం కొనుగోలుదారులు సంతోషాన్నిచ్చే విషయం. ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు! -
మంత్రిత్వ శాఖ చర్యలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి - అజయ్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఫేమ్–2 పథకంపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సొసైట ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) తాజాగా నీతి ఆయోగ్‌ను కోరింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చర్యలు ఫేమ్–2 విధానాన్ని విధ్వంసం చేస్తున్నాయని నీతి ఆయోగ్ చైర్పర్సన్ సుమన్ కె బెర్రీకి రాసిన లేఖలో సొసైటీ సెక్రటరీ జనరల్ అజయ్ శర్మ పేర్కొన్నారు. ‘18 నెలలుగా మంత్రిత్వ శాఖ చర్యలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, విస్తరణ ప్రక్రియను గణనీయంగా ఆలస్యం చేసే అవకాశం ఉంది. రాయితీల నిలిపివేత, 2019లో ఇచ్చిన రాయితీల పునరాలోచనను డిమాండ్ చేయడం, నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ పోర్టల్ నుండి కంపెనీల తొలగింపు, ఫేమ్–2 సబ్సిడీల తగ్గింపు వినాశకర చర్యల శ్రేణిగా భావిస్తున్నాం. సబ్సిడీ దిగ్బంధనం, పెనాల్టీ నోటీసులు, భవిష్యత్ విక్రయాలపై ఆంక్షలు ఫేమ్–2 విధానాన్ని నాశనం చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) తయారీ కంపెనీలు సమస్యల నుంచి గట్టెక్కడానికి కష్టపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. ఉద్యోగులు పారిపోతున్నారు. కంపెనీలకు అప్పులు పెరుగుతున్నాయి. మూసివేతలే ఇక తదుపరి దశ’ అని లేఖలో వివరించారు. -
ఈవీలపై రూ.30,000 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేమ్ సబ్సిడీ నిలిపివేతతో ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ కంపెనీలు కార్యకలాపాల పునరుద్ధరణ, కొనసాగడానికి రూ.3,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) ప్రభుత్వాన్ని కోరింది. సొసైటీ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి కంపెనీలకు రూ.1,200 కోట్లకుపైగా సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని లేఖలో ప్రస్తావించింది. 18 నెలలుగా ఈ మొత్తాల కోసం పరిశ్రమ ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. ఆర్థిక ఒత్తిడి నుండి కంపెనీలు చాలా వరకు బయటకు రాలేవని సొసైటీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ‘ఒకవేళ బకాయిలు చెల్లించిన తర్వాత వచ్చే ఒకట్రెండేళ్లు కంపెనీలు నిలదొక్కుకోవడానికి పునరావాస నిధి ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలి. సబ్సిడీ పథకం పతనం కారణంగా కార్యకలాపాలతోపాటు విక్రయాలు నిలిచిపోయాయి. కస్టమర్లు బుకింగ్స్‌ను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. డీలర్‌షిప్‌లపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది’ అని లేఖలో వెల్లడించారు. పెట్టుబడులకు విముఖత కోల్పోయిన పనిదినాలు, అవకాశాల నష్టం, మార్కెట్ వాటా క్షీణత, పరిశ్రమ ఇమేజ్ దెబ్బతినడం.. సమిష్టిగా ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయిక అంచనా ప్రకారం పరిశ్రమకు రూ.30,000 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని గిల్ తన లేఖలో ప్రస్తావించారు. ‘తయారీ సంస్థలకు వ్యతిరేకంగా తరచుగా జరుగుతున్న వ్యతిరేక చర్యల కారణంగా ఈ రంగంపై పెట్టుబడిదారులు తీవ్ర విముఖత చూపుతున్నారు. బ్యాంకులు కూడా నిజానికి రుణాన్ని విస్తరించడానికి ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించలేనందున బ్యాంకులు అనుషంగిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. పునరావాస నిధి గ్రాంట్ లేదా రుణదాతలకు గ్యారెంటీ మెకానిజమ్‌గా పని చేసే సబ్వెన్షన్ పథకం రూపంలో ఉండాలి. -
భారీగా పెరిగిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ విడా వీ1 ప్రో ధరను దాదాపు రూ.6000 పెంచినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 1 నుంచి ఫేమ్-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో విడా వీ1 ప్రో ధరను పెంచినట్లు తెలుస్తోంది. దీంతో, తాజాగా పెరిగిన ధరతో ఫేమ్-2 రాయితీ, పోర్టబుల్ ఛార్జర్ కలుపుకుని విడా వీ1 ప్రో స్కూటర్ రూ.1,45,900కు లభించనుంది. పాత ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.6000 ఎక్కువ. అయితే,పెరిగిన ధరలపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్రం ఫేమ్2 పథకాన్ని అమలు చేసింది. ఈ స్కీంలో ఈవీ స్కూటర్లపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై ప్రోత్సాహకాలు 40 శాతం అందించేది. జూన్ 1 నుంచి వాటిని 15 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో వాహనాల తయారీ సంస్థలు ధరల్ని పెంచడం అనివార్యమైంది. కాగా, ఫేమ్-2 కింద తయారీ సంస్థలకు కేంద్రం ఇచ్చే ప్రోత్సహకాల్లో యూనిట్‌కు దాదాపు రూ. 32,000 సబ్సిడీ తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 భారత పర్యటనలో చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్.. ఆయన ఎందుకొస్తున్నారంటే? -
జూన్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధరలు జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్ 2 (FAME-II) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం కింద అందించే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది. 2023 జూన్ 1 ఆ తర్వాత కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఇది వర్తిస్తుంది. అంటే జూన్ 1 తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం ప్రతి కొలో వాట్-అవర్ (kWh)కి రూ. 10,000 మాత్రమే ఉంటుంది. అది కూడా వాహనాల ఎక్స్-షోరూం ధరలో గరిష్టంగా 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇది గతంలో 40 శాతం ఉండేది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీలు జూన్ 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే తమ ద్విచక్ర వాహనాల ధరలు రూ.32,500 వరకు పెరుగుతాయని ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, పరిశ్రమలు సబ్సిడీ లేకుండా జీవించడం నేర్చుకోవాలని ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా అన్నారు. 2019లో రూ.30,000 ఉన్న సబ్సిడీ 2021లో రూ.60,000కి పెరిగిందని, ఇప్పుడు రూ.22,000 తగ్గిందని ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి ఫేమ్ (FAME) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని 2019 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట్లో మూడేళ్ల కాలానికి దీన్ని ప్రకటించినా తర్వాత 2024 మార్చి 31 వరకు మరో రెండేళ్ల కాలానికి పొడిగించింది. ఇదీ చదవండి: Heavy Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు! -
ఇది మోదీ ఎక్స్‌ప్రెస్!
గమనించాలి... గ్రహించాలే కానీ సంఘటనలన్నీ ఏదో ఒక సంకేతమిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల పాటు జరిపిన మూడు దేశాల పర్యటన చూస్తే అదే అనిపిస్తుంది. ప్రపంచ దేశాధినేతల ప్రత్యేక ప్రశంసలు, ప్రవాస భారతీయుల నుంచి జయ జయ ధ్వానాలు మోదీకే కాదు... భారత్‌కు పెరిగిన ప్రాధాన్యాన్నీ, ప్రతిష్ఠనూ సూచిస్తున్నాయి. జపాన్‌లో ‘జీ7’ దేశాల సదస్సులో అతిథిగా హాజరైనప్పుడూ, పాపువా న్యూ గినియా నేత ఏకంగా పాదాభివందనం చేసినప్పుడూ, ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల ‘మోదీ’ నాదాలు చూసినప్పుడూ వెలువడ్డ సంకేతం అదే. కర్ణాటకలో పదే పదే పర్యటించి, భారీ సభలు, ఊరేగింపులు నిర్వహించినప్పటికీ ఆ రాష్ట్రంలో అధికారం చేజార్చుకున్న బీజేపీ నేతగా స్వదేశంలో సన్నాయి నొక్కులు వినిపిస్తూ ఉండ వచ్చు. ప్రధానిగా బాహ్య ప్రపంచంలో మాత్రం మోదీ సమ్మోహన మంత్రానికి తరుగు, తిరుగు లేదని అర్థమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అగ్ర రాజ్యాల దాకా అన్నీ.. అతిపెద్ద మార్కెటైన నవభారతంతో భుజాలు రాసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నాయని తెలుస్తుంది. హిరోషిమాలో ‘జీ7’ సదస్సుకు హాజరైన ప్రధాని ఆ పైన ద్వీపదేశమైన పాపువా న్యూ గినియాను తొలిసారి సందర్శించారు. ‘భారత – పసిఫిక్ ద్వీపదేశాల సహకార వేదిక’ (ఎఫ్ఐపీఐసీ) మూడో సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఆ దేశానికి ఒక భారత ప్రధాని వెళ్ళడం ఇదే ప్రథమం. ఏడాది క్రితం పదవి చేపట్టిన లేబర్ పార్టీ నేత, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానంపై మోదీ సిడ్నీలో పర్యటించారు. అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం, వ్యాపార బృందాల రౌండ్ టేబుల్‌తో తన మూడు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించి, స్వదేశానికి తిరిగొచ్చారు. స్వదేశంలోని రాజకీయ చిక్కులతో అమెరికా అధ్యక్షుడు వైదొలగేసరికి ఆస్ట్రేలియాలో జరగాల్సిన ‘క్వాడ్’ సదస్సును లఘువుగా జపాన్‌లోనే అధినేతలు జరిపేశారు. ఆస్ట్రేలియాతో పటిష్ఠ బంధానికి అవకాశం వదులుకోని మోదీ తన పర్యటనను సమయానికి తగ్గట్టు ద్వైపాక్షిక సందర్శన చేసేశారు. గత ఏడాది కాలంలో ఆరోసారి అల్బెనీస్‌తో భేటీ, ఈ ఆర్థిక, వాణిజ్య సహకార దోస్తీ ప్రాంతీయ శాంతి సుస్థిర తలకూ కీలకమన్నారు. ‘డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ’– ఈ మూడు ‘డి’లు కీలకమంటూ, శరవేగంతో మెరుగవుతున్న ఇరుదేశాల సంబంధాలకు టీ20 మ్యాచ్‌లతో పోలిక తెచ్చారు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులు, వేర్పాటువాద శక్తుల విజృంభణను మార్చిలో అల్బనీస్‌తో ప్రస్తావించినా ఇప్పుడూ ఆ ఊసెత్తడం స్నేహదేశానికి ఒకింత ఇబ్బందికరమే. అది అటుంచితే, భారత ప్రధానికి సాదర స్వాగతం పలుకుతూ ఆ దేశంలోని అతి పెద్ద వినోద, క్రీడా ప్రాంగణంలో సాగిన భారీ సంబరం ప్రవాసుల్లో పెరిగిన జాతీయవాదానికి మచ్చు తునక. ‘మోదీ ఎయిర్వేస్’, ‘మోదీ ఎక్స్‌ప్రెస్’ లాంటి పేర్లతో ఆస్ట్రేలియా నలుమూలల నుంచి ప్రత్యేక విమా నాల్లో, రైళ్ళలో అభిమాన జనం తరలివచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలోకి లక్షల కోట్ల రూపాయలను ప్రవహింపజేస్తున్న ప్రవాస భారత ప్రపంచానికి ఒక భరోసా ఇవ్వాలని ప్రధాని భావించినట్టున్నారు. అందుకే, క్రిక్కిరిసిన స్టేడియమ్లో ముప్పావుగంట సేపు మాటల మోళీ చేశారు. తొమ్మిదేళ్ళలో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రియతమ నేత పట్ల భారతీయ డయాస్పోరా స్పందన చూసి, అక్కడి పాలకులు సైతం అబ్బురపడ్డారు. 2014 నవంబర్‌లో మోదీ ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు ఆయన అప్పుడప్పుడే విశ్వవేదికపై నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని. నాడు బ్రిస్బేన్‌లో ‘జీ20’ సదస్సులో ఇతర దేశాలతో స్నేహానికి ఆయన శ్రమిస్తే, నేడు 2023లో అదే భారత్ ‘జీ20’కి అధ్యక్ష పీఠం దాకా ఎదిగింది. పోటీ దేశాల కన్నా వేగంగా పెరుగుతున్న దేశమైంది. అప్పట్లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో బెరుకుగా మాట్లాడిన అదే వ్యక్తి ఇప్పుడు విదేశీ పర్యటనలు, డజన్ల కొద్దీ శిఖరాగ్ర సదస్సుల్లో ఆరితేరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా సహచరుడు ‘మోదీ... ది బాస్’ అని మైకులో అంటే, వచ్చే అమెరికా పర్యటనలో భారత ప్రధాని వైట్‌హౌస్ విందుకు అప్పుడే టికెట్లు అమ్ముడై పోయాయంటూ, ఆటోగ్రాఫ్ కావాలని అగ్రరాజ్య అధినేత బైడెన్ చమత్కరించడం గమనార్హం. మోదీ మాటల్లోనే చెప్పాలంటే, ‘నేను కలసిన నేతలందరూ ‘జీ20’కి భారత సారథ్యం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది భారత్‌కు గర్వకారణం.’ ఇవాళ భారత్ ప్రపంచంలోని అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. జనాభాలో చైనాను దాటి ప్రపంచంలో ప్రథమ స్థానానికి దూసుకుపోతున్న మన గడ్డపై ఈ మానవ వనరులకు తోడు అపార ప్రతిభ, అరచేతిలో సాంకేతికత ఉన్నాయి. వాణిజ్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, మొబైల్ తయారీ, అందివచ్చిన అంకుర సంస్థల ఉద్యమం లాంటి అనేక సానుకూలతలతో పురోగమిస్తున్న భారత్ వైపు ప్రపంచం చూస్తున్నది. హరిత ఉదజని టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఖరారు చేసుకోవడం మొదలు వలసలు – రాకపోకల భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపీఏ) దాకా ఆస్ట్రేలియా – భారత్‌లు తాజాగా సంతకాలు చేయడం ఆ ధోరణికి కొనసాగింపే! ఇవన్నీ విద్యార్థులు, వృత్తి నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తల రాకపోకలను సులభతరం చేస్తాయి. ఆర్థిక, దౌత్య సంబంధాలైనా, అత్యంత కీలకమైన భౌగోళిక వ్యూహాత్మక దోస్తీలైనా బాగుండాలంటే మనుషుల మధ్య ఆత్మీయ బంధాలు ప్రధానం. ప్రజాస్వామ్య దేశాలతో, ప్రవాస భారతీయులతో కలసి అడుగులు వేస్తున్న నమో భారత్ అనుసరిస్తున్న మార్గమూ అదే! -
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావం దీర్ఘకాలం పరిశ్రమపై ఉంటుందని వివరించింది. అయితే ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోని స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత నమోదయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్పులు చేస్తూ నోటిఫై చేసింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 సబ్సిడీ ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. ప్రభుత్వ చర్యతో ముడి చమురు దిగుమతుల అధిక బిల్లులకు, చాలా భారతీయ నగరాల్లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి దారితీయవచ్చని సొసైటీ వివరించింది. సున్నితమైన ధర.. ‘వాస్తవికత ఏమిటంటే భారతీయ మార్కెట్లో ధర సున్నితంగా ఉంటుంది. మొత్తం ఖర్చుకు వెనుకాడతారు. ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరు. పెట్రోలు ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రూ.1 లక్ష కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. మార్కెట్ వృద్ధి చెందే వరకు కస్టమర్‌కు సబ్సిడీలను కొనసాగించాలి. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం ఈవీల వాటా 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ప్రకారం ఇది 20 శాతం చేరుకోవడానికి నిరంతర రాయితీలు అనువైనవి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి సూచనను ఇచ్చింది. నాలుగేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసిందని గిల్ చెప్పారు. అకస్మాత్తుగా సబ్సిడీని నిలిపివేయడం, బడ్జెట్‌ను బాగా తగ్గించడం లేదా ఈ–త్రీవీలర్ల బడ్జెట్ నుండి కొంత ఖర్చు చేయని డబ్బును మళ్లించడం ద్వారా మిగిలిన సంవత్సరాన్ని ఎలాగైనా నిర్వహించడం మినహా మంత్రిత్వ శాఖకు మరో మార్గం లేదని అన్నారు. సమయం ఆసన్నమైంది.. సబ్సిడీని 15 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, డిమాండ్ ఉందని స్పష్టమైందని వోల్టప్ కో–ఫౌండర్ సిద్ధార్థ్ కాబ్రా తెలిపారు. సబ్సిడీ తగ్గింపు తక్షణ ప్రభావంతో ధరల పెరుగుదలతోపాటు అమ్మకాలు తగ్గుతాయి. అయితే ప్రభుత్వం ఒక విధంగా పరిశ్రమను స్వతంత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. పరిశ్రమ, ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చేలా నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడే సమ్మిళిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విధానాన్ని రూపొందించడానికి కృషి చేయాలి’ అని కాబ్రా పిలుపునిచ్చారు. హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కో–ఫౌండర్ నిఖిల్ భాటియా మాట్లాడుతూ ప్రభుత్వ చర్యకు మద్దతు ఇస్తూనే.. ‘ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడటానికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం దీర్ఘకాలిక పురోగతి, జీవనోపాధికి మరింత ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండాలి. రాయితీలను తొలగించడం అనేది ముందుకు సాగే చర్య. సబ్సిడీలపై ఆధారపడటం క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సబ్సిడీలు ఇకపై అవసరం లేదు. ఫేమ్–2 సబ్సిడీని తగ్గించడం, తొలగించడం సరైన దిశలో స్వాగతించే దశ’ అని భాటియా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులకు ముఖ్య గమనిక!
ఎలక్ట్రిక్ వాహనదారులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేశారా? అదనంగా ఛార్జర్లతో పాటు వెహికల్‌కు సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు చేశారా? అయితే మీకో శుభవార్త. దేశంలో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలైన ఎథేర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్స్, ఓలా, హీరో మోటో కార్ప్ కంపెనీలు డబ్బుల్ని రిఫండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ద్విచక్ర వాహనం తయారు చేసే సంస్థలకు ఫేమ్ పథకం కింద కేంద్రం కొన్ని రాయితీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. వాహన తయారీ సంస్థలు వాహనదారులకు విక్రయించే వెహికల్ ధర రూ.1.5 లక్షలు మించకూడదు. ధర మించితే ఫేమ్ పథకం సదరు తయారీ సంస్థలకు వర్తించదు. అయినప్పటికీ దేశంలోని కొన్ని ఆటోమొబైల్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి ఛార్జర్లు, వాహనానికి వినియోగించే ఇతర వస్తువులకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆటోమొబైల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందంటూ నివేదికలు పేర్కొన్నాయి. 2021 నుంచి ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా ఎస్1, ఎస్1 ప్రో విక్రయాలు జరిపే సమయంలో హోం ఛార్జర్లకు అదనంగా డబ్బులు వసూలు చేసింది. ఆ మొత్తం విలువ రూ.131 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఆ భారీ మొత్తాన్ని ఓలా తన వాహన దారులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. రీఫండ్‌పై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ సైతం స్పందించలేదు. చదవండి👉 ‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా