ఎలక్ట్రిక్ వాహనాలపై అందించే అందించే సబ్సిడీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఫేమ్-2 పథకం ముగిసిన తర్వాత తాత్కాలికంగా తీసుకొచ్చిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) 2024 ను పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈఎంపీఎస్ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో రెండు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇందు కోసం రూ. 778 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఈ పథకం కింద 5,00,080 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 60,709 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు మొత్తంగా 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీలకు మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ప్రైవేట్ లేదా కార్పొరేట్ యాజమాన్యంలోని రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కూడా ఈ పథకం కింద అర్హత ఉంటుంది.
ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) రెండవ దశ గడువు ముగియడానికి ముందు మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఈఎంపీఎస్ 2024ని ప్రకటించింది. రూ.500 వ్యయంతో నాలుగు నెలలపాటు జూలై 31 వరకు 3,33,387 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 13,590 ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు మద్దతు ఇవ్వడానికి దీన్ని అమలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment