హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఫేమ్–2 పథకంపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సొసైట ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్‌ఎంఈవీ) తాజాగా నీతి ఆయోగ్‌ను కోరింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చర్యలు ఫేమ్–2 విధానాన్ని విధ్వంసం చేస్తున్నాయని నీతి ఆయోగ్ చైర్‌పర్సన్ సుమన్ కె బెర్రీకి రాసిన లేఖలో సొసైటీ సెక్రటరీ జనరల్ అజయ్ శర్మ పేర్కొన్నారు. ‘18 నెలలుగా మంత్రిత్వ శాఖ చర్యలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, విస్తరణ ప్రక్రియను గణనీయంగా ఆలస్యం చేసే అవకాశం ఉంది. రాయితీల నిలిపివేత, 2019లో ఇచ్చిన రాయితీల పునరాలోచనను డిమాండ్ చేయడం, నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ పోర్టల్ నుండి కంపెనీల తొలగింపు, ఫేమ్–2 సబ్సిడీల తగ్గింపు వినాశకర చర్యల శ్రేణిగా భావిస్తున్నాం. సబ్సిడీ దిగ్బంధనం, పెనాల్టీ నోటీసులు, భవిష్యత్ విక్రయాలపై ఆంక్షలు ఫేమ్–2 విధానాన్ని నాశనం చేస్తున్నాయి.
(ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!)
తయారీ కంపెనీలు సమస్యల నుంచి గట్టెక్కడానికి కష్టపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. ఉద్యోగులు పారిపోతున్నారు. కంపెనీలకు అప్పులు పెరుగుతున్నాయి. మూసివేతలే ఇక తదుపరి దశ’ అని లేఖలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment