ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కొనసాగించడం లేదా దాన్ని ప్రయోజనాలను అలాగే అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీ హనిఫ్ ఖురేషి తాజాగా తెలిపారు.
సుస్థిర పారిశ్రామిక వృద్ధికి సమర్థ నిర్వహణ వ్యవస్థలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఖురేషీ మాట్లాడుతూ.. వినియోగదారుల సంతృప్తి, స్థిరమైన పారిశ్రామిక వృద్ధిని నడపడంలో నిర్వహణ వ్యవస్థల ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. 150 బిలియన్ డాలర్ల మేర ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, కొనుగోలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో ఫేమ్ పథకాన్ని తీసుకొచ్చింది. మూడేళ్ల కాల పరిమితి ముగిశాక మళ్లీ రెండేళ్లు పొడిగించింది. అయితే ఇటీవల ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. దీంతో జూన్ నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచేశాయి. కాగా మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం దీనిపై పునరాలోచించడం కొనుగోలుదారులు సంతోషాన్నిచ్చే విషయం.
ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment