Electric Scooter
-
ఒకటే బ్రాండ్.. 4 లక్షల మంది కొనేశారు
2024 ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆటోమొబైల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అనేక కొత్త వాహనాలను దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. ఇందులో టూ వీలర్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని కొత్త వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టినా.. ప్రజలు మాత్రం 'ఓలా ఎలక్ట్రిక్' స్కూటర్స్ కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ ఈ ఒక్క ఏడాది (2024) సుమారు నాలుగు లక్షల స్కూటర్లను విక్రయించింది. దీంతో దేశంలోనే అత్యధిక రిటైల్ విక్రయాలను సాధించిన స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాహన్ డేటా ప్రకారం.. 2024 డిసెంబర్ 15 ఉదయం 7 గంటల సమయం నాటికి దేశంలో అమ్ముడైన మొత్తం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏకంగా 4,00,099 యూనిట్లు అని తెలిసింది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ ఈవీ దినోత్సవం (సెప్టెంబర్ 9) నాటికి 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ తరువాత మంచి ఎక్కువ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. -
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఇవి చూడండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లోని ఉత్తమ ఈవీ స్కూటర్లు ఏవి? వాటి ధర, రేంజ్ వంటి వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ చేతక్ (Bajaj Chetak)ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తోంది. దీని అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. కాగా ఈనెల 20న మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బేస్ మోడల్ 2.88 కిలోవాట్ బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. లక్ష కంటే ఎక్కువ.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. రూ. 89999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా 75 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కిమీ/గం. ఇది 12.7 సెంమీ TFT డిస్ప్లే కలిగి, ఎల్ఈడీ హెడ్‌లైట్, 4.4 కిలోవాట్ BLDC మోటార్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారుహీరో విడా (Hero Vida)రూ. 96000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న హీరో విడా మంచి అమ్మకాలు పొందుతున్న ఒక బెస్ట్ మోడల్. ఇందులో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 94 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 69 కిమీ/గం. ఈ స్కూటర్ 7 ఇంచెస్ డిజిటల్ TFT టచ్‌స్క్రీన్ పొందుతుంది.ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)ప్రారంభం నుంచి గొప్ప ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి. -
రూ. 39999కే ఎలక్ట్రిక్ స్కూటర్: ఓలా సరికొత్త వెహికల్స్ చూశారా..
భారతీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన స్కూటర్లు.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ కస్టమర్ల రోజువారీ వినియోగానికి, వాణిజ్యపరమైన వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంటాయి.ఓలా గిగ్: రూ. 39,999ఓలా గిగ్ ప్లస్: రూ. 49,999ఓలా ఎస్1 జెడ్: రూ. 59,999ఓలా ఎస్1 జెడ్ ప్లస్: రూ. 64,999ఓలా గిగ్రోజువారీవినియోగానికి లేదా తక్కువ దూరాలు ప్రయాణించడానికి.. ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. పేలోడ్ కెపాసిటీ బాగేనా ఉంటుంది. ఇందులోని 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 112 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం మాత్రమే. కంపెనీ దీనిని ప్రధానంగా గిగ్ వర్కర్ల కోసం లాంచ్ చేసినట్లు సమాచారం.ఓలా గిగ్ ప్లస్కొంత ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఓలా గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనికొస్తుంది. గంటకు 45 కిమీ వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ రేంజ్ 81 కిమీ మాత్రమే. అయితే రెండు బ్యాటరీల ద్వారా 157 కిమీ రేంజ్ పొందవచ్చు. ఇందులో కూడా 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. గిగ్ వర్కర్లు వేగవంతమైన డెలివరీ కోసం ఈ స్కూటర్లు ఉపయోగపడతాయి. రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణనికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.ఓలా ఎస్1 జెడ్ఓలా ఎస్1 జెడ్ అనేది వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే స్కూటర్. పరిమాణంలో ఇది కొంత చిన్నదిగా ఉండటం వల్ల దీనిని రద్దీగా ఉండే అర్బన్, సెమీ-అర్బన్ రోడ్లపై కూడా సాఫీగా రైడ్ చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 జెడ్ ప్లస్ఇక చివరగా.. ఓలా ఎస్1 జెడ్ ప్లస్ విషయానికి వస్తే, ఇది దృఢమైన నిర్మాణం, అధిక పేలోడ్ కెపాసిటీ పొందుతుంది. దీనిని కూడా వ్యక్తిగత వినియోగం కోసం లేదా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా పవర్పాడ్ఓలా ఎలక్ట్రిక్ కేవలం కొత్త స్కూటర్లను లాంచ్ చేయడమే కాకుండా.. పవర్పాడ్ కూడా లాంచ్ చేసింది. ఇది పోర్టబుల్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. గృహోపకరణాలు, లైట్లు, ఫ్యాన్లు, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలకు శక్తినిచ్చే ఇన్వర్టర్‌గా ఉపయోగపడుతుంది. 500W అవుట్‌పుట్‌ను కలిగిన ఓలా పవర్పాడ్.. 1.5 కిలోవాట్ బ్యాటరీ, 5 ఎల్ఈడీ బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్ ఛార్జింగ్, 1 Wi-Fi రూటర్ వంటి వాటికి మూడుగంటల పాటు శక్తినిస్తుంది. అంటే పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ. 9999 మాత్రమే.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..ఓలా ఎలక్ట్రిక్.. కొత్త స్కూటర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి మూలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓలా గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్ల లాంచ్ ఈవీ రంగం వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు. సరసమైన ధర వద్ద లభించే ఈ స్కూటర్లు తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని అన్నారు.Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPodReservations open, deliveries Apr’25!🛵⚡🔋Ola S1 Z: https://t.co/jRj8k4oKvQOla Gig:… pic.twitter.com/TcdfNhSIWy— Bhavish Aggarwal (@bhash) November 26, 2024 -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్‌ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్‌కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్‌ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్‌కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్‌ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి ప్రముఖ కంపెనీ
'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఆల్ ఎలక్ట్రిక్ యాక్టివాను నవంబర్ 27న ఆవిష్కరించడానికి సిద్ధమైంది. చాలా రోజుల నిరీక్షణ తరువాత కంపెనీ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది.ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటి వరకు హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఒక్క వాహనాన్ని కూడా లాంచ్ చేయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభాగంలో ఒక ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్, రేంజ్, డిజైన్, ఫీచర్స్ వంటి చాలా వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కాబట్టి నవంబర్ 27న సంస్థ బహుశా ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన రేంజ్ గణాంకాలు త్వరలోనే తెలుస్తాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. -
ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
భారతదేశం ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్లో.. ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. తక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.బ్రిస్క్ ఈవీ ఆరిజన్ ప్రో: హైదరాబాద్‌కు చెందిన బ్రిస్క్ ఈవీ కంపెనీ మార్చి 2023లో ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసింది. ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 333 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల ధర మధ్య లభించే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ.రివోట్ ఎన్ఎక్స్100: భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో మరొకటి రివోట్ ఎన్ఎక్స్100. ఈ స్కూటర్ టాప్ వేరియంట్.. ఒక సింగిల్ చార్జితో 300 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 110 కిమీ/గం టాప్ స్పీడ్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ. 1,59,000 (ఎక్స్ షోరూమ్).సింపుల్ వన్: బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. రూ. 1.54 లక్షల ధర వద్ద లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిమీ. ఇది కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 ప్రో జెన్ 2: దేశీయ టూ వీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ఎస్1 ప్రో జెన్ కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.1,47,499 ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ.ఇదీ చదవండి: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో అత్యుత్తమ కార్లు ఇవే..హీరో విడా వీ1 ప్రో: సింగిల్ చార్జితో 165 కిమీ రేంజ్ అందించే హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కిమీ. ఇందులో 3.94 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కూడా దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది. -
99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వచ్చిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ గతంలో తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజులు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అందిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తాజాగా కంపెనీ పేర్కొంది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
శ్రీలంకకు బెంగళూరు ఎలక్ట్రిక్ స్కూటర్లు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ.. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను శ్రీలంకకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపించించినట్లు సమాచారం. ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తమ మోడల్‌ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.శ్రీలంకకు ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిస్తున్న ఫోటోలను కంపెనీ సీఈఓ 'తరుణ్ మెహతా' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గత ఏడాది నేపాల్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన తరువాత ఏథర్ స్కూటర్లను దిగుమతి చేసుకుంటున్న విదేశీ మార్కెట్ శ్రీలంక.ఏథర్ 450ఎస్భారతదేశంలో ఏథర్ 450ఎస్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే శ్రీలంకలో ఈ స్కూటర్ ధర ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియాలో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్, 450 అపెక్స్, రిజ్టా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది.శ్రీలంకలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే ప్రణాళిక ఆగస్ట్‌లోనే మొదలైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో జతకట్టింది. శ్రీలంకలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాండర్డ్, ప్రో ప్యాక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 2.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఒకే బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఒక చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంది.Ather’s second international market is set to go live by this festive!First shipment of 450s have left for Sri Lanka 🇱🇰 from our warehouses in 🇮🇳❤️ pic.twitter.com/EyfYCHPuIf— Tarun Mehta (@tarunsmehta) October 17, 2024 -
ఓలా ఎలక్ట్రిక్‌కు మరో షాక్
న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. అయితే, తమ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అలాగే, సీసీపీఏ ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలిపింది. ఈ వార్తలతో ఓలా షేరు మంగళవారం మరో 6% పడింది. చివర్లో కోలుకుని 5 శాతం లాభంతో రూ. 95 వద్ద క్లోజైంది. వాహనాల సర్విస్ నాణ్యతపై సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ మధ్య వాగ్వాదం ప్రభావంతో సోమవారం కంపెనీ షేరు 8 శాతం పైగా పతనమైంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ రూ.5 వేలేనా?
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. ఫేమ్ స్కీమ్ స్థానంలో ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్లపై గరిష్టంగా మొదటి సంవత్సరంలో రూ.10,000, రెండో ఏడాదిలో రూ.5,000 సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం అందించనుంది.ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించిన వివరాలను, ఏయే వాహనానికి ఎంత సబ్సిడీ వస్తుందన్న విషయాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఇటీవల వెల్లడించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద బ్యాటరీ 'పవర్'ఆధారంగా కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీని నిర్ణయించినట్లు కుమారస్వామి తెలిపారు. అయితే మొదటి సంవత్సరంలో మొత్తం సబ్సిడీ రూ.10,000 మించదు. రెండవ సంవత్సరంలో ఈ సబ్సిడీ కిలోవాట్ అవర్‌కు సగానికి అంటే రూ. 2,500కి తగ్గుతుంది. మొత్తం ప్రయోజనాలు రూ. 5,000 మించవు.ఇక ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలుదారులకు మొదటి సంవత్సరంలో రూ.25,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాది రూ.12,500 సబ్సిడీని పొందవచ్చని కుమారస్వామి తెలిపారు. ఎల్ 5 కేటగిరీ (త్రీవీలర్లను తీసుకెళ్లే వాహనాలు) వాహనాలకు మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 సబ్సిడీ లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.‘ఫేమ్’లో భారీగా సబ్సిడీఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకాన్ని మొదటిసారి 2015 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ రెండో ఫేజ్‌ను 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది వాస్తవానికి మూడేళ్ల ప్రణాళిక 2022 మార్చి 31న ముగియాల్సి ఉండగా 2024 జూలై 31 వరకు పొడిగించింది.ఈ స్కీమ్ రెండో దశ కాలంలో నమోదైన ఒక్కో ఎలక్ట్రిక్ టూవీలర్‌పై ప్రభుత్వం ప్రభుత్వం రూ.20,000 రాయితీ అందించేది. ఫేమ్2 ప్రారంభంలో సబ్సిడీ మొత్తం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 ఉండేది. తర్వాత రూ.15000 లకు పెంచినప్పటికీ మళ్లీ తగ్గించింది. -
కైనెటిక్ ఫ్యామిలీ ఈ-స్కూటర్.. త్వరలో లాంచ్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో పూణే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏడాదిన్నరలో ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. 2025 మార్చిలోగా ఎల్5 విభాగంలో ప్యాసింజర్ త్రీ–వీలర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. 2030 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. ఇందులో 60 శాతం ద్విచక్ర వాహన విభాగం, 35 శాతం త్రిచక్ర వాహనాల నుంచి సమకూరాలన్నది ఆలోచనగా చెప్పారు.మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహన విభాగంలో ఈ–స్కూటర్స్, ఈ–లూనాకు పరిమితం అవుతామని తెలిపారు. కైనెటిక్ గ్రీన్ గత నెలలో గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ (జీపీసీ) నుంచి 25 మిలియన్ డాలర్ల పెట్టుబడి అందుకుంది. ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ల వ్యాపార విస్తరణకు ఈ నిధులకు కంపెనీ ఖర్చు చేయనుంది.లంబోర్గీని భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రీమియం గోల్ఫ్ కార్ట్ శ్రేణి ద్వారా విదేశాల్లో విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సిరీస్–ఏ నిధుల సమీకరణలో భాగంగా మరో 15 మిలియన్ డాలర్లను ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వీకరించే అవకాశం ఉందని సులజ్జ వెల్లడించారు. 16 గంటలపాటు కార్యకలాపాలు సాగించే కార్గో ఈ–త్రీ వీలర్స్ కోసం అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. -
రూ.1.15 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్: 137 కిమీ రేంజ్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఓటీఏ అప్డేట్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఓలా ఈ–బైక్స్ వచ్చేశాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్‌లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్‌ను ప్రవేశపెట్టనుంది. -
బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్.. అమెజాన్‌లో కోనేయండి
బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా తయారైంది. ఆగష్టు 5నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ బ్రూక్లిన్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. అయితే డిజైన్ మాత్రం దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్.. ప్రీమియమ్ వేరియంట్ మాదిరిగానే అదే 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 136 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 73 కిమీ కావడం గమనించదగ్గ విషయం. మార్కెట్లో ఈ స్కూటర్.. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొని.. తంటాలు పడి
హైదరాబాద్: ఎలక్ట్రిక్ స్కూటర్‌కి నాసిరకం బ్యాటరీ అమర్చినందుకు పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్–1 ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా కంపెనీ, షోరూం సిబ్బంది అలసత్వమే అని స్పష్టం చేసింది. కంపెనీ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి తప్పులకు తావు లేకుండా ఉండేదని సూచించింది. వినియోగదారుడి ఇబ్బందుల దృష్ట్యా రూ.20 వేల నష్ట పరిహారంతో పాటు రూ.5 వేలు కోర్టు ఖర్చులు ఇవ్వాలని కంపెనీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్–1 కమిషన్ అధ్యక్షురాలు ఉమా వెంకట సుబ్బలక్ష్మి , సభ్యులు లక్ష్మీప్రసన్న, మాధవిలతతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. 22 నెలల్లో 8 సార్లు బ్యాటరీ సమస్య.. హైదరాబాద్ (మారుతీనగర్ ఓల్డ్ బోయిన్పల్లి)కి చెందిన శ్రీనివాస్ రెడ్డి 2021లో పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించి ఈ డ్రైవ్ మున్నంగి మోటర్స్ షోరూంలో ఎలక్రి్టకల్ స్కూటర్ (పీయూఆర్ – ఈ – ప్లూటో – 7జీ) ను రూ. 90 వేలతో కొనుగోలు చేశాడు. ఒకసారి చార్జింగ్ పెడితే రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ రాకపోవడం, ఎక్కడపడితే అక్కడ అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి పలు రకాల సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. దాదాపు 22 నెలల కాలంలో 8 సార్లు బ్యాటరీ సమస్యతో సరీ్వస్ సెంటర్‌కి వెళ్లాల్సి వచ్చింది. చాలాసార్లు కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. కొంత కాలానికి పరిశీలించిన సర్వీస్ సెంటర్ సిబ్బంది సాఫ్ట్వేర్ సమస్య ఉందని చెప్పినా దానికి సరైన పరిష్కారం మాత్రం చూపలేదు. అనంతరం షోరూం సిబ్బంది ఆగస్టు, 2022లో మరో బ్యాటరీని అమర్చారు. దీంతో ఆనందంతో స్కూటర్ తీసుకొని వెళ్లిన శ్రీనివాస్ రెడ్డికి తిరిగి 9 నెలల కాలంలో మళ్లీ అదే సమస్య ఎదుర్కొన్నాడు. దీంతో తిరిగి మళ్లీ షోరూం సిబ్బంది సంప్రదించాడు. అయితే వారు బ్యాటరీని కంపెనీకి టెస్టింగ్ కోసం పంపాలని, తిరిగి బ్యాటరీ అమర్చాలంటే దాదాపు 3 నుంచి 4 నెలల కాలం పడుతుందని, అంతవరకు ఆగాలని జులై, 2023లో చెప్పారు. అయితే ఇప్పటికీ ఏడాది కాలం దాటినా బ్యాటరీ మాత్రం అమర్చలేదు. ఆ స్కూటర్ బ్యాటరీ లేకుండా నిరూపయోగంగానే ఉన్నది. దీంతో బాధితుడి సంబంధిత షోరూంకి వెళ్లి స్కూటర్ని తీసుకెళ్లి డబ్బును ఇవ్వండి, లేదా బ్యాటరీ అయినా మార్చి ఇవ్వండి అని అడిగారు. కంపెనీ యాజమాన్యం, షోరూం సిబ్బంది çపట్టించుకోకపోవడంతో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్–1ను ఆశ్రయించి తన గోడును విన్నవించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్ కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారులకు సరైన సౌకర్యం ఇవ్వకుండా కాలయాపన చేయడమేంటని మండిపడింది. బాధితుడి ఎలక్ట్రిక్ స్కూటర్‌కు వెంటనే కొత్త బ్యాటరీ అమర్చాలని సూచించింది. అంతేకాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీని ఆదేశించింది. దీంతో పాటు అతనికి చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
భారత్‌లో రూ.14.90 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. వివరాలు
భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ సీఈ (BMW CE) లాంచ్ అయింది. దీని ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ టూ వీలర్ అదే అని తెలుస్తోంది.దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.3 kW ఛార్జర్ ద్వారా 4 గంటల 20 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6.9 kW ఛార్జర్ ద్వారా 1 గంట 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటారు 42 హార్స్ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 120 కిమీ.ఎల్ఈడీ లైటింగ్స్, 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్, USB ఛార్జర్, సైడ్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. ఇది బ్లూ, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.ప్రస్తుతం కంపెనీ 600 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉంది. ఈ షోరూమ్‌లలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో అమ్మకాలు కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో మొదటి 15 నెలల్లో 1587 యూనిట్ల అమ్మకాలను పొందిన చేతక్ క్రమంగా వాహన వినియోగదారులు ఆకర్శించడంలో విజయం సాధించింది.బజాజ్ ఆటో చేతక్ లైనప్ స్టెమ్ను రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడంతో స్టెర్న్గా మార్చింది. చేతక్ బేస్ 2901, మిడ్-టైర్ అర్బేన్, రేంజ్ టాపింగ్ ప్రీమియం వేరియంట్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్స్, రేంజ్ విషయంలో కొంత తేడా ఉంటుంది. -
తెలుగు రాష్ట్రాల్లోకి రివర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ రివర్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించగా మార్చి నాటికి వైజాగ్, విజయవాడ, గుంటూరులో కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి స్టోర్స్ సంఖ్యను 50కి పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో అరవింద్ మణి తెలిపారు. ప్రస్తుతం ఇండీ పేరిట స్కూటర్లు విక్రయిస్తున్నామని, 2026 నాటికి ఏటా 1,00,000 వాహన విక్రయాల లక్ష్యం సాధించాక రెండో మోడల్‌ను కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. యమహా మోటర్ కార్పొరేషన్, టయోటా వెంచర్స్ తదితర దిగ్గజాల నుంచి ఇప్పటివరకు రూ. 550 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకు సుమారు 500 యూనిట్లుగా ఉన్న అమ్మకాలను వచ్చే మార్చి నాటికి 3,000కి పెంచుకోనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ధర రూ. 1,45,000గా ఉంటుందని, ఒకసారి చార్జింగ్‌తో 120 కి.మీ. వరకు రేంజి ఉంటుందని మణి చెప్పారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్ రష్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్1 ఎక్స్+పై రూ. 5,000, ఎస్1 ప్రో.. ఎస్1 ఎయి ర్‌పై రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటు లభిస్తుంది.ఎస్1 ఎక్స్+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మొత్తం ఎస్1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్1 పోర్ట్‌ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్–ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. -
చార్జింగ్ టెన్షన్ లేదిక.. ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఒప్పందం
హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల మార్పిడి (స్వాపింగ్) కోసం 25 పైచిలుకు నగరాల్లో 900 పైగా ఉన్న బ్యాటరీ స్మార్ట్ స్వాప్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని క్వాంటమ్ ఈ–స్కూటర్స్ డైరెక్టర్ సి. చేతన తెలిపారు. చార్జింగ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా యూజర్లు రెండు నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో చార్జ్ అయిన బ్యాటరీలను పొందవచ్చని వివరించారు. ఈ తరహా బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ విధానం వల్ల జీవితకాలం పూర్తయిన బ్యాటరీలను రీప్లేస్ చేసుకునే వ్యయాలు తగ్గుతాయని తెలిపారు. బ్యాటరీ స్మార్ట్ స్వాపింగ్ స్టేషన్లు వ్యూహాత్మకంగా అధిక జన సాంద్రత, ట్రాఫిక్ ప్రాంతాలకు సమీపంలో ఉంటాయి. దీంతో క్వాంటం ఎనర్జీ స్కూటర్లకు అందుబాటులో ఉంటాయని, తద్వారా వాహనదారులకు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కంపెనీ చెబుతోంది. -
లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జేబులో డబ్బు పెట్టుకునే వారే కరువయ్యారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా అంతా ఆన్లైన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రమే తనకు ఇష్టమైన స్కూటర్ కొనటానికి మొత్తం చిల్లర ఇచ్చి షోరూమ్ వారికే షాక్ ఇచ్చాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనడానికి మొత్తం చిల్లర అందించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు లక్ష కంటే ఖరీదైన స్కూటర్‌ను చిల్లరతో కొనేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏథర్ ఎనర్జీ సీఈఓ 'తరుణ్ మెహతా' స్కూటర్ డెలివరీ చేసి, స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఫోటో షేర్ చేస్తూ.. జైపూర్ వ్యక్తి 10 రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జైపూర్ వ్యక్తి కొనుగోలు చేసిన ఏథర్ 450 సిరీస్ ఖచ్చితమైన మోడల్‌ను మెహతా పేర్కొనలేదు. కాబట్టి దీని ధర ఎంత అనేది స్పష్టంగా తెలియదు. ఏథర్ 450ఎక్స్, 450ఎస్, 450అపెక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుందో. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇదీ చదవండి: 2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా? A new Ather owner just bought himself a 450 in Jaipur ... all with 10Re coins! pic.twitter.com/VWoOJiQey2 — Tarun Mehta (@tarunsmehta) February 17, 2024 -
OLA ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
-
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
చైనా కంపెనీ ముక్కు పిండి వసూలు చేశాడు
గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు కస్టమర్లకు జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగా.. మరో కొన్ని కంపెనీలు ఊరుకున్నాయి. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి కోర్టుకెళ్లి నష్ట పరిహారంగా రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. అతడు రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా.. అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్‌కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్‌ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు. ఇదీ చదవండి: ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే? ఎన్ని రోజులకూ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్‌తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి.. రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్‌కు చెల్లించాలని లేదా స్కూటర్‌ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది.