ఎలక్ట్రిక్ స్కూటర్‌కి చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషంలోనే పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంటిలోని అన్ని గృహోపకరణాలన్ని దగ్ధమయ్యాయి. ఐతే ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఈ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలో మండ్యా జిల్లాలో ఓ కుటుంబం చార్జింగ్ కోసం అని ఇంటి లోపలే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని పార్క్ చేశారు. వారు ప్లెగ్‌ఇన్ చేసిన కొద్దిసేపటిలోనే స్కూటర్ పేలింది.
దీంతో ఇంటిలోని విలువైన వస్తువులన్ని దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబసభ్యులు ఇంటిలోనే ఉన్నారు. ఐతే అందరూ స్కూటర్ దూరంగా ఉండటం వల్ల వారంతా ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ పేలుడు ధాటికి టీవీ, ఫ్రిజ్, డైనింగ్ టేబుల్, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులన్ని ఆహుతైపోయాయి. స్కూటీకి మంటలు అంటుకున్నప్పడు సమీపంలోనే తమ చిన్నారి కూడా ఉన్నాడని, కానీ మంటలను అదుపు చేయలేకపోయామని ఇంటి యజమాని ముత్తురాజ్ చెప్పుకొచ్చారు. తాను రూట్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఆరు నెలల క్రితమే షోరూం నుంచి రూ. 85 వేలకు కొనుగోల చేసినట్లు తెలిపారు.
(చదవండి: ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ..దించేసినా దక్కని ప్రాణం)
Comments
Please login to add a commentAdd a comment