రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు | Ather 450S EV Get Rs 20000 Discount | Sakshi
Sakshi News home page

రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు

Published Thu, Jan 11 2024 2:46 PM | Last Updated on Thu, Jan 11 2024 3:12 PM

Ather 450S EV Get Rs 20000 Discount - Sakshi

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' 2024 ప్రారంభంలోనే తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద కంపెనీ ఇప్పుడు రూ. 20000 తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ బెంగళూరులో రూ.1.09 (ఎక్స్-షోరూమ్) లక్షలకు, ఢిల్లీలో రూ.97,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలు లభిస్తోంది. 

మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది.

ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!

ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. సంక్రాంతి పండుగలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు రూ. 20000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెలలో మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement