సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే.. | Komaki Rs 19000 Cash Discount For LY Electric Scooter | Sakshi
Sakshi News home page

Electric Scooter: సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే..

Published Fri, Dec 1 2023 11:13 AM | Last Updated on Fri, Dec 1 2023 11:24 AM

 Komaki Rs 19000 Cash Discount For LY Electric Scooter - Sakshi

Komaki LY Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దాదాపు అన్ని సంస్థలు ఈ రంగం వైపే జోరుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో విడుదలైన 'కొమాకి ఎల్‍వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లాంచ్ సమయంలో రూ. 96,968 వద్ద అమ్ముడైన ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 78,000 వద్ద లభిస్తోంది. అంటే కంపెనీ ఈ స్కూటర్ మీద రూ. 18,968 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని తయారైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్, డ్యూయల్ బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ 85 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి

రిమూవబుల్ బ్యాటరీ కలిగిన 'కొమాకి ఎల్‍వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, న్యావిగేషన్ వంటి మరిన్ని వివరాలను రైడర్‌కు తెలియజేస్తుంది. ఆన్‌బోర్డ్‌లో సౌండ్ సిస్టమ్ ఉండటం వల్ల, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ప్లే చేయవచ్చు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement