
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.
బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఓటీఏ అప్‌డేట్‌లు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment