Bajaj Chetak
-
ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఇవి చూడండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లోని ఉత్తమ ఈవీ స్కూటర్లు ఏవి? వాటి ధర, రేంజ్ వంటి వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ చేతక్ (Bajaj Chetak)ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తోంది. దీని అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. కాగా ఈనెల 20న మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బేస్ మోడల్ 2.88 కిలోవాట్ బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. లక్ష కంటే ఎక్కువ.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. రూ. 89999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా 75 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కిమీ/గం. ఇది 12.7 సెంమీ TFT డిస్ప్లే కలిగి, ఎల్ఈడీ హెడ్‌లైట్, 4.4 కిలోవాట్ BLDC మోటార్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారుహీరో విడా (Hero Vida)రూ. 96000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న హీరో విడా మంచి అమ్మకాలు పొందుతున్న ఒక బెస్ట్ మోడల్. ఇందులో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 94 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 69 కిమీ/గం. ఈ స్కూటర్ 7 ఇంచెస్ డిజిటల్ TFT టచ్‌స్క్రీన్ పొందుతుంది.ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)ప్రారంభం నుంచి గొప్ప ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి. -
బజాజ్ ఆటో రివర్స్‌గేర్.. చేతక్ అమ్మకాలు సూపర్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 1,385 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, డిఫర్డ్ ట్యాక్స్‌కు పెరిగిన కేటాయింపులు ప్రభావం చూపాయి. అయితే మొత్తం ఆదాయం రూ.10,838 కోట్ల నుంచి రూ. 13,247 కోట్లకు జంప్ చేసింది. మొత్తం వ్యయాలు రూ. 8,806 కోట్ల నుంచి రూ. 10,767 కోట్లకు పెరిగాయి. విక్రయాలు 16% అప్ ఈ క్యూ2లో బజాజ్ ఆటో స్టాండెలోన్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 2,005 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 10,777 కోట్ల నుంచి రూ. 13,127 కోట్లకు బలపడింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 16 శాతం ఎగసి 12,21,504 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 26 శాతం జంప్‌చేసి 6,36,801 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 5 శాతం పుంజుకుని 3,96,407 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 70,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. -
రూ.1.15 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్: 137 కిమీ రేంజ్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఓటీఏ అప్డేట్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.ప్రస్తుతం కంపెనీ 600 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉంది. ఈ షోరూమ్‌లలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో అమ్మకాలు కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో మొదటి 15 నెలల్లో 1587 యూనిట్ల అమ్మకాలను పొందిన చేతక్ క్రమంగా వాహన వినియోగదారులు ఆకర్శించడంలో విజయం సాధించింది.బజాజ్ ఆటో చేతక్ లైనప్ స్టెమ్ను రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడంతో స్టెర్న్గా మార్చింది. చేతక్ బేస్ 2901, మిడ్-టైర్ అర్బేన్, రేంజ్ టాపింగ్ ప్రీమియం వేరియంట్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్స్, రేంజ్ విషయంలో కొంత తేడా ఉంటుంది. -
రూ.లక్షకే చేతక్ స్కూటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న బజాజ్ చేతక్ తాజాగా 2901 మోడల్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.99,998 ఉంది. కంపెనీ ఆఫర్ చేస్తున్న మోడళ్లలో ఇదే తక్కువ ధర కలిగింది. చేతక్ అర్బేన్ ధర రూ.1,23,319 కాగా, చేతక్ ప్రీమియం రూ.1,47,243 ఉంది. 2901 మోడల్ స్కూటర్ ఒకసారి చార్జింగ్‌తో 123 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2.88 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. స్టీల్ బాడీతో తయారైంది. చార్జింగ్కు 6 గంటలు తీసుకుంటుంది. రూ.3 వేలు చెల్లించి టెక్‌ప్యాక్ సబ్‌్రస్కిప్షన్ తీసుకుంటే హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, యాప్ కనెక్టివిటీ, కాల్ మేనేజ్మెంట్, మ్యూజిక్ కంట్రోల్, జియో–ఫెన్సింగ్ ఫీచర్లు అదనంగా చేరతాయి. -
బజాజ్ చేతక్ ప్రీమియం బైక్ వచ్చేస్తోంది.. ఎలా ఉందో చూశారా?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ శుక్రవారం చేతక్ అర్బేన్, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనుంది. అయితే ఈ బైక్ ధరలు ప్రస్తుతం ఈవీ మార్కెట్లో లీడింగ్‌లో ఉన్న ఓలా, ఎథేర్ ఈవీ స్కూటర్ల కంటే తక్కువేనని తెలుస్తోంది. ఓలా ఎస్1 ప్రో (రూ1,47,499), ఎథేర్ 450 ఎక్స్ (రూ.1,37,999) ధరలు ఇలా ఉండగా చేతక్ అర్బేన్ ధర రూ.1.15లక్షలు, చేతక్ ప్రీమియం ఎక్స్ షోరూం ధర రూ.1.35లక్షలుగా ఉంది. బజాజ్ సంస్థ 2019లో తొలిసారి చేతక్ ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 140 నగరాల్లో లక్షకు పైగా వెహికల్స్‌ను అమ్మింది. ఇక తాజాగా విడుదల చేయనున్న రెండు వేరియంట్లలో 3.2 కేడబ్ల్యూ బ్యాటరీతో రానుంది. 127 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించచ్చు. అదనంగా చేతక్ ప్రీమియంలో 800 డబ్ల్యూ ఛార్జర్‌తో రానుంది. ఈ సదుపాయంతో చేతక్ ను 30 నిమిషాల్లో 15.6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు వరకు ప్రయాణించ్చు. ఇక ఈ బైక్‌లో బ్లూటూత్, యాప్ కనెక్టివిటీ, నోటిఫికేషన్ అలెర్ట్‌ల కోసం కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త టీఎఫ్టీ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ ఆధారిత టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్/మ్యూజిక్ అలర్ట్‌లు, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)ని అనుసంధానం చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఈవీ మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఎథేర్ 450 ఎక్స్, సింపుల్ వన్లు.. బజాజ్ చేతక్‌తో పోటీ పడనున్నాయి. -
ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో ఆఫర్
Bajaj Chetak Electric Scooter Price Cut: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చిలో బజాజ్ ఆటో రెండు వేరియంట్లలో అప్డేట్ చేసిన 2023 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రకటించింది. తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. చేతక్ఈవీ ధరలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బేస్ చేతక్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.52 లక్షలు. అయితే ఇప్పుడు, బేస్ వేరియంట్ నిలిపి వేసింది. అలాగే ప్రీమియం వేరియంట్ ధర రూ. 22 వేల తగ్గింపును అందిస్తోంది. దీని ప్రకారం రూ. 1.3 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనే వివరాలు అందుబాటులో లేవు. (టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్) బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ ఫీచర్లు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్‌లెస్ DC మోటార్‌తో ఆధారితంగా 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో. ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఒక గంటలో 25 శాతం ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఆల్-కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్‌వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ,రియర్ డ్రమ్ బ్రేక్స్ లాంటివి ఉన్నాయి.2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియమ్ ఎడిషన్ వెర్షన్ మూడు రంగులలో లభిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) -
డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుతున్న అదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి, విడుదల చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే 'యులు' (Yulu) కంపెనీ వైన్ (Wynn) అనే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: దేశీయ విఫణిలో విడుదలైన కొత్త వైన్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 55,555 మాత్రమే (ఎక్స్-షోరూమ్). ఈ ధర కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తరువాత ఇది రూ. 64,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 999 రిఫండబుల్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ బైక్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత మరిన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే డెలివరీలు మే 2023 నుంచి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్షన్స్: యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి స్కార్లెట్ రెడ్ కలర్, మూన్ లైట్ కలర్. ఇవి రెండూ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) బ్యాటరీ & రేంజ్: యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ బజాజ్ చేతక్ యాజమాన్యంలో ఉన్న చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్ తయారు ఛేస్విది. ఇందులో 984.3 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 68 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు, కావున ఈ బైక్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు. (ఇదీ చదవండి: ఆధార్ కార్డులో ఫోటో మార్చాలా? ఇలా చేయండి!) కొత్త యులు వైన్ బైక్ సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ మల్టిపుల్ మొబిలిటీ ఫ్యాక్స్ పొందుతుంది. కావున బ్యాటరీ యాజ్-ఏ-సర్వీస్ సబ్స్‌స్క్రిప్షన్ మీద నెలవారీ చార్జీలను ఉపయోగించుకోవచ్చు. దీనికింద నెల చార్జీలు రూ. 499 నుంచి రూ. 899 వరకు ఉంటాయి. దీని వల్ల రైడింగ్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఈ ప్లాన్ ద్వారా కిలోమీటరుకు 70 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. చూడటానికి బైక్ చిన్నగా ఉన్నప్పటికీ 100 కేజీలు పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. -
రెండింతలకు చేతక్ స్కూటర్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్‌లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్‌కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు. సబ్సిడీ పొడిగించాల్సిందే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ’ అని తెలిపారు. -
బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు
దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు వాహనాలు అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇందులో భాగంగానే ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ చేతక్ 'ప్రీమియం ఎడిషన్'లో విడుదలైంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). బజాజ్ కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ని మూడు కలర్ ఆప్సన్స్‌లో విడుదల చేసింది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ సీటు, బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్‌లు, హెడ్‌ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటి వాటిని పొందుతుంది. భారతదేశంలో కంపెనీ ఈ కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి డీలర్‌షిప్‌లను విస్తరించనుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ డీలర్షిప్ నెట్వర్క్ భారతదేశంలోని 60 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉంది. అంతే కాకుండా 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 85 కంటే ఎక్కువ నగరాల్లో 100 కంటే ఎక్కువ స్టోర్లకు విస్తరించడానికి ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికి కంపెనీ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ధర ప్రీమియం ఎడిషన్ కంటే తక్కువ. ఇప్పుడు ఈ వేరియంట్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రోస్సో అనే నాలుగు కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ బ్యాటరీ ప్యాక్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్ లేదు. కావున ఇందులో అదే 2.9 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 4.2kW పీక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఛార్జ్‌పై 90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. బజాజ్ చేతక్ ఎక్కువ అమ్మకాలు జరపకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తున్నాయి, కొనుగోలుదారులు కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున చేతక్ క్లెయిమ్ చేసిన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ (IDC) పరిధిని 20 శాతం పెంచి 108కిమీలకు పెంచబోతున్నట్లు బజాజ్ ఆటో గత నెలలో ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇదే జరిగితే చేతక్ అమ్మకాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. -
ఏకంగా108 కి.మీ. రేంజ్‌తో 2023 బజాజ్ చేతక్ ఈవీ.. వచ్చేస్తోంది!
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బజాజ్ సంస్థ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈవీ 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ 90 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 18 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుందని స్పష్టమవుతోంది. బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ చేసినప్పటికీ డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, పవర్ అవుట్‌పుట్ వంటివి మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. కంపెనీ ఇందులో కొంత ఎక్కువ రేంజ్ అందించడానికి బ్యాటరీ మేనేజ్ మెంట్ సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేయడం జరుగుతుంది. భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, అన్ని సబ్సిడీలు మినహాయించి). త్వరలో విడుదలయ్యే 2023 చేతక్ ఈవీ ఎక్కువ రేంజ్ అందించడం వల్ల ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్డేటెడ్ మోడల్ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా కంపెనీ అమ్మకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. -
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. యూరప్ దేశాల్లో అమ్మకాలకు సర్వం సిద్ధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏడాదిలో యూరప్‌లో అడుగుపెట్టబోతోంది. బజాజ్ ఆటో భాగస్వామి అయిన స్పోర్ట్స్ బైక్స్ త యారీ దిగ్గజం కేటీఎం ఈ స్కూటర్లను విక్రయించనుంది. 2019లో ఎలక్ట్రిక్ రూపంలో రీఎంట్రీ ఇచ్చిన చేతక్ ఇప్పటి వరకు దేశంలో 24,000 యూ నిట్లు రోడ్డెక్కాయి.ప్రస్తుతం 40 నగరాల్లో మాత్రమే ఈ వాహనాన్ని కంపెనీ విక్రయిస్తోంది. 1972లో చేతక్ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కింది. 2006 నుంచి చేతక్ స్కూటర్ల తయారీని బజాజ్ నిలిపివేసి బైక్స్‌పైనే పూర్తిగా దృష్టిసారింది. కాగా, కేటీఎం తాజాగా చకన్ ప్లాంటులో 10 లక్షల బైక్‌ల తయారీని పూర్తి చేసింది. 2011లో ఈ ప్లాంటు నుంచి కేటీఎం తొలి బైక్ బయటకు వచ్చింది. 5 లక్షల యూనిట్లు దేశీయంగా అమ్ముడయ్యాయి. మరో 5 లక్షల యూని ట్లు భారత్ నుంచి 70 దేశాలకు ఎగుమతి అయ్యా యి. ప్రీమియం మోటార్‌బైక్ బ్రాండ్‌గా ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచినట్టు కేటీఎం ప్రకటించింది. -
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరిన్ని నగరాల్లో...
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్నీ నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు తమ యూనిట్లను కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది. మరిన్నీ నగరాల జోడింపు... బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగంగా అమ్మేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2022లో చేతక్ నెట్‌వర్క్‌ను మరో 12 కొత్త నగరాలను కంపెనీ జోడించింది. కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై, మపుసాతో సహా నగరాల్లో బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసిన వారికి కంపెనీ ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల వెయిటింగ్ పీరియడ్‌తో ఆయా కస్టమర్లను అందించనుంది. దూకుడు పెంచిన బజాజ్..! బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ. 300 కోట్లను పెట్టుబడి చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ... రాబోయే కొద్ది వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను అధిక డిమాండ్‌కు అనుగుణంగా రెట్టింపు చేయాలనేది మా ప్రణాళికని ఆయన అన్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్, ప్రీమియం వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి ఒకే 3.8kW మోటార్ నుంచి శక్తిని పొందుతాయి. నాన్-రిమూవబుల్ 3kWh IP67 లిథియం-అయాన్ బ్యాటరీను కల్గి వుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 70kmph వేగంతో 95km పరిధి మేర ప్రయాణం చేస్తుంది. ఇండిగో మెటాలిక్, వెలుట్టో రోస్సో, బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్‌నట్ వంటి రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. -
రాహుల్ బజాజ్ ఇక లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన లోటు పూడ్చలేనిదంటూ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్, కుమార్తె సునైనా కేజ్రివాల్ ఉన్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపారు రాహుల్‌బజాజ్ 1938 జూన్ 10న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలా ల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. తన తండ్రి కమల్‌నయన్ బజాజ్ బృందంలో రాహుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరారు. 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్‌సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించా రు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్‌ను మెరిపించారు. ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్‌లో 60 వేల పైచిలుకు ఉద్యోగులున్నట్టు చెబుతారు. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ముక్కుసూటి మనిషి.. రాహుల్‌కు నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ప్రభుత్వంపై విమర్శలకూ వెనకాడేవారు కాదు. సొంత కొడుకుతోనూ తలపడ్డ చరిత్ర ఆయనది. విమర్శలను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ముంబైలో 2019లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సమక్షంలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘భయంతో కూడిన ఈ వాతావరణం కచ్చితంగా మా మనస్సుల్లో ఉంటుంది. విమర్శలను మీరు స్వీకరిస్తారన్న నమ్మకం మాకు లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. స్కూటర్లకు స్వస్తి చెప్పి మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టాలని కుమారుడు రాజీవ్ నిర్ణయించుకున్నప్పుడు తన నిరాశను బహిరంగంగా వెల్లడించారు. హమారా బజాజ్ బజాజ్ గ్రూప్ అనగానే టక్కున గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటరే. 1972లో బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ‘హమారా బజాజ్..’ అంటూ మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది. చేతక్ స్కూటర్ భారతీయ కుటుంబాలకు ఒక ఆకాంక్షగా మారిందంటే అతిశయోక్తి కాదు. బజాజ్ ప్రియ స్కూటర్లు సైతం ఆదరణ పొందాయి. 2006లో బజాజ్ స్కూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. బజాజ్ చేతక్ అర్బనైట్ ఈవీ సబ్‌బ్రాండ్ పేరుతో 2019 అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ–ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ కెరీర్ దేశ కార్పొరేట్ రంగం పెరుగుదలకు సమాంతరంగా సాగింది. ఆయన మరణం పారిశ్రామిక ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి చేసిన విశేషమైన కృషికి ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. గొప్ప సంభాషణకర్త. సమాజ సేవపైనా మక్కువ చూపారు. – ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వ్యాపార ప్రపంచంపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేను చెప్పలేనంత షాక్‌కు గురయ్యాను. దేశం ఒక గొప్ప పుత్రున్ని, నిర్మాతను కోల్పోయింది. – బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!
పూణే: ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన సత్తా ఏంటో చూపించేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ సిద్దం అవుతుంది. పూణేలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్ ఏర్పాటు కోసం ₹300 కోట్ల(40 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రకటించింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 5,00,000 ఎలక్ట్రిక్ వాహనలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ ప్రదేశం(అకుర్ది, పూణే)లోనే బజాజ్ అసలు చేతక్ స్కూటర్ తయారు చేశారు. పూణేలోని తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారంలో 'అత్యాధునిక రోబోటిక్, ఆటోమేటెడ్' తయారీ వ్యవస్థలను మోహరించనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. లాజిస్టిక్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఫ్యాబ్రికేషన్ & పెయింటింగ్, అసెంబ్లీ & క్వాలిటీ అస్యూరెన్స్ నుంచి ప్రతిదీ ఆటోమేటెడ్ అని తెలిపింది. ఈ తయారీ కర్మాగారం అర మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం సుమారు 800 మంది సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడికి అదనంగా రూ.250 కోట్ల పెట్టుబడిని పెట్టడానికి ఇన్వెస్టర్లు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్ నుంచి మొదటి వాహనం జూన్ 2022 నాటికి బయటకు వస్తుందని సంస్థ భావిస్తుంది. ఇతర సంస్థలకు పోటీగా మరిన్ని వాహనాలను లాంచ్ చేసేందుకు సంస్థ సిద్దం అవుతుంది. (చదవండి: పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 రాయితీ..!) -
అరె..! ఈ డైరెక్టర్ కొన్న బైక్ భలే క్యూట్‌గా ఉంది కదూ..!
ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్ చేతక్ స్కూటర్లు ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలుగా తిరిగొస్తున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య,బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ బైక్‌తో సందడి చేశారు. టోపాజ్ బ్లూ కలర్లో ఉన్న చేతక్ బండితో ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తుండగా..నెటిజన్లు కిరణ్ రావు కొనుగోలు చేసిన బజాజ్ చేతక్ లుక్స్ క్యూట్‌గా ఉందని అంటున్నారు. అంతేకాదు బిల్డ్ క్వాలిటీ, రైడ్ ఎబిలిటీ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. బజాజ్ చేతక్ బైక్ ఫీచర్స్ 3.8కేడబ్ల్యూ పీఎంఎస్ మోటర్, 5బీపీహెచ్,16.2 ఎన్ఎం టారిక్తో అందుబాటులోకి ఉంది. లిథియం అయాన్ బ్యాటరీతో బిల్డ్ చేసిన బజాజ్ చేతక్ బైక్‌కు త్రీ పిన్ చార్జర్ సాకెట్‌తో ఛార్జింగ్ పెడితే 6 నుంచి 7గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక అదే బ్యాటరీని సింగిల్ ఛార్జ్ చేస్తే 80కిలోమీటర్లు, ఈకో మోడ్‌లో 95 కిలోమీటర్ల వరకు, టాప్ స్పీడ్ 70కిలో మీటర్ల వరకు డ్రైవ్ చేయొచ్చు. మెటల్ బాడీ, ఎల్ఈడీ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటు మరికొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ చేతక్ ధరెంత? బజాజ్ చేతక్ ధర అర్బన్ వేరియంట్‌కు రూ.1.42 లక్షలు, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.44 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అయితే ఈ మోడల్ ధర ఓలా ఎస్ 1,అథర్ 450 ఎక్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్! -
ఒక్క వాహనం కూడా లేదు..‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..?
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బజాజ్ చేతక్ స్కూటర్లంటే సెంటిమెంట్. తన వద్ద ఏకంగా మూడు స్కూటర్లు ఉండేవి. ఆ స్కూటర్ల నంబర్లు కూడా సీరియల్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఏపీ28 ఏఏ 4818, ఏపీ 28 ఏఏ 4819, ఏపీ 28 ఏఏ 4820 సీరియల్ నంబర్లుగా ఉండేవి. ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇలా సీరియల్ నంబర్లు పొందగలిగారు. ఇంత ప్రేమతో, సీరియల్ నంబర్లతో కొనుగోలు చేసిన స్కూటర్లు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల అఫిడవిట్లో 3 స్కూటర్లు తన వద్ద ఉన్నాయని, వాటి విలువ రూ.20 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అన్నా.. ఎవరు గెల్తరంటవే? కానీ, ప్రస్తుతం జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల అఫిడవిట్లో ఈటల పేరిట స్కూటర్, కారు ఇలా ఒక్క వాహనం కూడా లేదని చూపించారు. ఈటలకు సెంటిమెంట్‌గా ఉన్న స్కూటర్లు ఏమయ్యాయనే చర్చ జరుగుతోంది. పాతవి కావడం వల్ల స్క్రాప్‌నకు వేశారా.. లేదా తమ కార్యకర్తలకు ఎవరికైనా గిఫ్ట్‌గా తన సెంట్మెంట్ స్కూటర్లు ఇచ్చారా.. అనే ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్లో రూ.16.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించిన ఈటల రాజేందర్ తన పేరిట ఒక్కæ వాహనం కూడా లేదని తెలుపడం గమనార్హం. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: వెజ్ రూ.40.. నాన్‌వెజ్ రూ.100 -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక ధరను మరోసారి భారీగా పెంచింది. 2021లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెరగడం ఇది మూడోసారి. ఈ ధరల పెరుగుదలతో భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చేతక్ మారింది. తాజాగా మహారాష్ట్రలో బజాజ్ చేతక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,87,390గా ఉంది. కొన్ని నెలల క్రితం వరకు ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,44,987గా ఉండేది. 2020లో లాంఛ్ చేసిన ధరతో పోలిస్తే చేతక్ ధర 60 శాతానికి పైగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఫేమ్-2 కింద సబ్సిడీని పెంచిన తర్వాత తాజాగా బజాజ్ కంపెనీ మరోసారి ధరల పెంచింది. ఫేమ్-2 కింద కంపెనీకి రూ.45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. ప్రస్తుతం ఇంతకంటే తక్కువ ధరకు ఓలా ఎస్ 1 ప్రొ, అథర్ 450 ఎక్స్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీనిలో 2 కిలోవాట్ బ్యాటరీలు అమర్చారు. బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీ అందిస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం బజాజ్ చేతక ప్రీమియం వేరియంట్ మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది. అర్బన్ వేరియంట్ ను నిలిపివేసింది.(చదవండి: మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్) -
మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ప్రస్తుతం పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటిన సంగతి తెలిసిందే. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లో లభ్యం అవుతున్నప్పటికీ, మరికొన్ని ఈ సంవత్సరం చివరినాటికి కస్టమర్ల చేతికి అందనున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఇటీవల కొత్తగా కొన్ని స్కూటర్లు వచ్చాయి. ఈ స్కూటర్లు వస్తూ వస్తూనే ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయని చెప్పుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది అత్యుత్తమం అనేది ప్రజలు తెలుసుకోలేక పోతున్నారు. మేము ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు తెలియజేస్తున్నాము.(చదవండి: ఎంజీ ఎస్టర్ ఎస్యూవీ.... కీ ఫీచర్లు ఇవే!) ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1ను ఆగస్టు 15న రూ.99,999(ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో అనే పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1,29,999గా ఉంది. ఓలా ఎస్1 సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ నుంచి 1,000 నగరాలు, పట్టణాల్లో డెలివరీల సేవలను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 8 వరకు కంపెనీ బుకింగ్స్ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఐడీసీ మోడ్ లో 181 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగం, హైపర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 40 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్ ద్వారా చార్జ్ చేయడానికి సుమారు 6 గం. సమయం పడుతుంది. ఇందులో రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ ఫంక్షన్, డ్రైవింగ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 0-40 కిలోమీటర్లు వేగాన్ని 3 సెకండ్లలో అందుకుటుంది. ఇది కీలెస్ లాక్, అన్ లాక్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, జియో ఫెన్సింగ్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్లో 3.97 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 రంగుల్లో లభిస్తుంది. ఓలా తమిళనాడులో 500 ఎకరాల్లో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. సింపుల్ వన్ సింప్లీ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆగస్టు 15 నాడు లాంఛ్ చేసింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. మీరు సింపుల్ వన్ బుక్ చేసుకోవాలంటే రూ.1,947 చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్ వన్ ను రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్ ధర)కు లాంఛ్ చేశారు. సింపుల్ వన్ బ్రెంజ్ బ్లాక్, అజ్యూరే బ్లూ, గ్రేస్ వైట్, నమ్మ రెడ్ రంగులలో లభిస్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను చార్జ్ చేస్తే ఐడీసీ మోడ్ లో 236 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. అలాగే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. దీనిలో 4.8కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ(కంబైన్డ్ ఫిక్సిడ్, పోర్టబుల్), 7 కెడబ్ల్యు మోటార్ ఉన్నాయి. దీనిలో టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. అథర్ 450ఎక్స్ అథర్ 450ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్ లో 116 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. బ్యాటరీ వాటర్ రెసిస్టెంట్ ఐపీ 67 రేటెడ్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియం బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ అండ్ రియర్ కోసం రెండు డిస్క్ బ్రేకులు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్ సిడి డిస్ ప్లేతో ఈ స్కూటర్ వస్తుంది. అథర్ 450ఎక్స్ ధర రూ.1,44,500. ఈ స్కూటర్లో 2.61 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది జూన్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అర్బన్ స్కూటర్ ను రూ.115,218 ధరకు విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ లో 2.25 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 4.4 కిలోవాట్లు కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 78 కి.మీ. దీని ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఫ్రంట్ టెలిస్కోపిక్, రియర్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ తో వస్తుంది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ 140 ఎన్ఎమ్ టార్క్ ఉతపతి చేస్తుంది. బజాజ్ చేతక్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ మోటార్ చేత పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే). -
మరో మూడు నగరాల్లో బజాజ్ చేతక్ బుకింగ్స్ ఓపెన్
బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్ని నగరాల్లోకి వేగంగా తీసుకొనిరావడానికి ప్లాన్ చేసింది. మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్ వంటి కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ జూలై 22న ప్రారంభిస్తుంది. ఈ నగరాలకు చెందిన ఆసక్తి గల వినియోగదారులు ₹2,000 చెల్లించి ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. గత వారమే నాగ్ పూర్ లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2021 ఏప్రిల్ లో బజాజ్ చెన్నై, హైదరాబాద్ నగరాలకు చేతక్ తీసుకొనివస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన ఆటోమేకర్ వచ్చే ఏడాది నాటికి 22 భారతీయ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, అథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది. ఇది 3.8 కిలోవాట్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే). -
పది వేలకే బజాజ్ చేతక్ ... ఎప్పుడంటే ..
హెడ్డింగ్ చూసి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇది నిజం ! ఒక్క బజాజే కాదు రాయల్ ఎన్ఫీల్డ్, రాజ్‌దూత్, షెవర్లెట్, అంబాసిడర్ అన్ని కార్ల ధరలు అగ్గువే !?. బైకులైతే పది వేలకు అటు ఇటు కార్లయితే ఇరవై నుంచి ముప్పే వేల రూపాయలు. అయితే ఈ ధరలన్నీ ఇప్పటి కావు. ఆర్థిక సంస్కరణలు దేశంలో అడుగు పెట్టడానికి ముందు స్వాతంత్రం తర్వాత కాలానికి చెందినవి. ఆ రోజుల్లో వాహనాల ధరలు ఎలా ఉన్నాయి. వాటిని ఆయా కంపెనీలు ఎలా ప్రమోట్ చేశాయి, అప్పటి పన్నుల వివరాలు సరదాగా ఓ సారి చూద్దాం. సాక్షి, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. నైన్టీస్లో బజాజ్ అమ్మకాల్లో చేతక్ స్కూటరే నంబర్ వన్. అయితే బైక్‌ల క్రేజ్ పెరగడంతో క్రమంగా స్కూటర్ల మార్కెట్ డౌన్ అయ్యింది. చేతక్ కూడా వెనుకపడి పోయింది. అయితే ఇప్పుడు కొంగొత్తగా బజాల్ చేతక్ ఈవీ అంటూ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. అయితే 1987లో బజాజ్ చేతక్ మార్కెటోకి వచ్చినప్పుడు దాని ధర రూ. 10,652 మాత్రమే. స్కూటర్ ధర తక్కువగా చూపించేందుకు పన్ను తక్కువగా ఉండే పాండిచ్చేరి ఎక్స్‌షోరూం ధరను పేర్కొంది బజాజ్. బజాజ్ వెస్పా స్కూటర్ అన్ని పన్నులతో కలుపుకుని కేవలం 2,129 మనకు వచ్చేది. ఆ ధరకు కొనాలంటే మనం టైం మిషన్‌లో 1961కి వెళ్లాలి. ఇక ఇదే స్కూటర్‌కి వెనుక సీటు, స్పేర్ వీల్ , ట్యూబ్ కావాలంటే అదనంగా మరో రూ. 114 చెల్లిస్తే సరి. ఇప్పుడంటే డౌన్‌పేమెంట్ కట్టి ఈఎంఐలకి వెళ్లడం సాధారణ విషయంగా మారింది. కానీ 80ల్లో అదేంతో కష్టమైన పని. 80వ దశకంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా వచ్చిన రాజ్‌దూత్ తన అమ్మకాలు పెంచుకునేందుకు ఈఎంఐని ప్రవేశపెట్టింది. కేవలం రూ. 3,500 కడితే చాలు బండి మీ సొంతం అంటూ ప్రకటనలు గుప్పించింది. మైలేజీ రావాలంటే 100 సీసీ నుంచి 125 సీసీ, పవర్ కావాలంటే 150 సీసీ నుంచి 350 సీసీ బైకులు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. కానీ 1963లోనే ఏకంగా 750 సీసీ ఇంజన్‌తో బైకును మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ పేరుతో వచ్చిన బైక్ ఆ రోజుల్లో ఓ సంచలనం. దేశీ వాహన తయారీ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రాని ప్రత్యేక స్థానం. పదిహేనేళ్ల కిందటి వరకు కూడా రూరల్ ఇండియా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో మహీంద్రా జీపులది ప్రత్యేక స్థానం. అయితే 1960 మహీంద్రా జీపు ధర కేవలం రూ. 12,421 మాత్రమే. అంతేకాదు ఆ రోజుల్లో అమ్మకాలు పెంచేందుకు రూ. 200 డిస్కౌంట్ కూడా ప్రకటించింది. జనరల్ మోటార్స్ వారి షెవర్లేట్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందరికీ సుపరిచితమైన బ్రాండ్. స్వాతంత్రానికి పూర్వం షెవర్లెట్ కారును కలిగి ఉండటం స్టేటస్ సింబల్‌గా ఉండేది. ఈ రోజుల్లో రచయితలు తమ కథనాయకుడు, నాయికల ఎంత ధనవంతులో వర్ణించేందుకు షెవర్లెట్ పేరును తరచుగా ఉపయోగించేవారు. 1936లో షెవర్లెట్ కారు ధర రూ.3,675. ఈ ధరకు ఇప్పుడు కారు టైరు కూడా రావడం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అత్యధికంగా ఉపయోగించిన కారు అంబాసిడర్. ఆ తర్వాత పద్మినీ ప్రీమియర్, స్టాండర్డ్ హెరాల్డ్‌లు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఈ కార్లు ఇంచుమించు 2000 వరకు ఇండియా రోడ్లపై తమ ఆధిపత్యం చూపించాయి. 1972లో ఆ కార్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ లుక్కేయ్యండి. కార్లకు ఇప్పుడైతే ఎక్సైజ్ డ్యూటీ కారు ఇంజన్ కెపాసిటీని బట్టి 12.50 శాతం నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. 1963లో స్టాండర్డ్ కంపానియన్ కారు ధర రూ. 12,635 అయితే ఎక్సైజ్ డ్యూటీ కేవలం రూ. 333 మాత్రమే. ఇప్పుడీ పాత జ్ఙాపకాలన్నీ ఎందుకు తెరపైకి వచ్చాయంటే.... ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫియట్ కారుకు సంబంధించిన పేపర్ యాడ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ యాడ్‌లో ఫియట్ కారు ధర రూ.9,800లుగా ఉంది. ఆహ్ ! ద గుడ్ ఓల్డ్ డేస్ అంటూ కామెంట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. తమ అనుభవాలను కూడా షేర్ చేసుకున్నారు. Ah the good old days… pic.twitter.com/SNH3Cwirki — anand mahindra (@anandmahindra) July 14, 2021 -
సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు
ముంబై: అటో దిగ్గజం బజాబ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్లు "చేతక్" డెలివరీలను సెప్టెంబర్ నుంచి చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ 2020-21 వార్షిక నివేదికలో తెలిపింది. ఈ-స్కూటర్ చేతక్ ప్రీమియం, చేతక్ అర్బన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. అర్బన్ వేరియంట్ ధర రూ.1,22,000(ఎక్స్-షోరూమ్)కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1,26,000 (ఎక్స్-షోరూమ్). అలాగే వచ్చే మూడు నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో బజాజ్ చేతక్ సేవలు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఐపీ6 వాటర్ రెసిస్టెన్స్ లిథియం ఐయాన్ బ్యాటరీని అమర్చారు. ఫుల్ చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 2020 మొదట్లోనే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కోవిడ్ సంబంధిత సమస్యలతో అప్పట్లో బుకింగ్స్ నిలిపేశారు. తిరిగి ఈ ఏప్రిల్ 18న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్లైన్లో రీ-ఓపెన్ చేశారు. భారీ డిమాండ్ నేపథ్యంలో వెంటనే నిలిపేశారు. ఇతర కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి వీలుగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. త్వరలోనే మళ్లీ సప్లై వంటి అంశాలను సమీక్షించి బుకింగ్ తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ప్రకటించింది. చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్ -
బజాజ్ చేతక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 48 గంటల్లో అన్ని యూనిట్లను అమ్ముడు పోయినట్లు కంపెనీ పేర్కొంది. ఇతర కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి వీలుగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కస్టమర్ స్పందనపై బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ.. "పూణే, బెంగళూరులోని చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ తిరిగి ప్రారంభించి నప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది" అని పేర్కొన్నాడు. త్వరలోనే మళ్లీ సప్లై వంటి అంశాలను సమీక్షించి బుకింగ్ తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ప్రకటించింది. గతేడాది 2020 సంవత్సరం ఆరంభంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు వేరియంట్స్‌లో మార్కెట్లోకి రాగా.. అందులో ఒకటి ప్రీమియం రకం కాగా, మరొకటి అర్బేన్ వేరియంట్. అర్బేన్ వేరియంట్ ధర రూ.1,22,000(ఎక్స్-షోరూమ్)కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1,26,000 (ఎక్స్-షోరూమ్). అలాగే వచ్చే మూడు నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో బజాజ్ చేతక్ సేవలు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. చదవండి: టెకీలకు గుడ్ న్యూస్.. భారీగా నియామకాలు! -
చేతక్ వాహనప్రియులకు షాక్: మళ్లీ బ్రేకులు
ముంబై: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. బుకింగ్స్‌ను పునఃప్రారంభించిన 48 గంటల్లోనే కంపెనీ మళ్లీ నిలిపివేసింది. సప్లయి చెయిన్‌లో అనిశ్చితే ఇందుకు కారణమని తెలిపింది. తదుపరి బుకింగ్ రౌండ్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. బజాజ్ కంపెనీ చేతక్ ఈ-స్కూటర్స్ బుకింగ్స్‌ను ఈ నెల 13న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్లైన్లో రీ-ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత బెంగళూరు, పుణే నగరాల్లో మాత్రమే బుకింగ్స్‌కు అవకాశం కల్పించింది. కస్టమర్ల నుంచి అధిక స్పందన లభించిందని.. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో విపరీతమైన అంతరాయాలు, సుదీర్ఘ నిరీక్షణ కాలం ఉన్నప్పటికీ బుకింగ్స్‌ను చాలా తక్కువ రద్దు చేశామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. ఇప్పటికే బుకింగ్స్ తీసుకున్న కస్టమర్లు త్వరగా డెలివరీలను స్వీకరించి, రైడింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సరఫరా గొలుసు సమస్యలను పరిష్కరించి.. వీలైనంత త్వరగా బుకింగ్స్‌ను రీ–ఓపెన్ చేస్తామని.. వచ్చే త్రైమాసికంలో మరిన్ని నగరాలలో కూడా బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చేతక్‌లో అర్బన్, ప్రీమియం రెండు మోడల్స్ ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రత్యేకమైన యాప్‌కు కనెక్ట్ చేయబడిన ఈ–స్కూటర్లకు ప్రమాదం జరిగినా లేదా దొంగిలించబడినా సరే సంబంధిత స్కూటర్ యజమానికి నోటిఫికేషన్స్ వెళతాయి. ధరలు అర్బన్ రూ.1.22 లక్షలు, ప్రీమియం రూ.1.26 లక్షలు(పుణే ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. -
కొత్త చేతక్.. చూపు తిప్పుకోలేం!
న్యూఢిల్లీ: చేతక్ స్కూటర్‌ను బజాజ్ ఆటో మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేటి అవసరాలకు అనుగుణంగా, పర్యావరణహితంగా దీన్ని రూపొందించారు. చూడగానే ఆకట్టుకునేలా సరికొత్త రూపంతో ఎలక్ట్రిక్ వాహనంగా చేతక్ వినియోగదారులకు ముందుకు రానుంది. జనవరిలో ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో అమ్మకాలు ప్రారంభిస్తారు. కొత్త చేతక్ స్కూటర్‌కు సంబంధించిన 5 ఆసక్తికర అంశాలు మీకోసం. 1. ఎలక్ట్రిక్ వాహనంగా తయారైన కొత్త చేతక్‌లో 4కేవీ ఎలక్ట్రిక్ మోటర్తో పాటు ఐపీ67 రేటింగ్ లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. 2. ఎలక్ట్రిక్ వాహనాల గురించి కొనేటప్పుడు రేంజ్ (మైలేజీ) గురించి అడుగుతారు. చేతక్ ఎకానమీ మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిలోమీటర్ల రేంజ్ వరకు నడుస్తుంది. 3. లోహపు బ్యాడీతో ఆకర్షణీయంగా ముస్తాబైన బజాబ్ చేతక్ ఆరు రంగుల్లో లభ్యమవుతుంది. డిజిటల్ కన్సోల్, గుర్రపునాడ ఆకారంలో డీఆర్ఎల్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ బ్లింకర్స్ ఉన్నాయి. 4. వేగాన్ని సులువుగా నియంత్రించేలా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంది. 12 అంగులాల చక్రాలు అమర్చారు. ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ ఉంది. అయితే బజాజ్ బ్యాడ్జ్(లోగో) మాత్రం లేదు. 5. కొత్త చేతక్ ధర రూ. 90 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. (చదవండి: చేతక్ మళ్లీ వచ్చేసింది!!)