ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్నీ నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు తమ యూనిట్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది.
మరిన్నీ నగరాల జోడింపు...
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగంగా అమ్మేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2022లో చేతక్ నెట్‌వర్క్‌ను మరో 12 కొత్త నగరాలను కంపెనీ జోడించింది. కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై, మపుసాతో సహా నగరాల్లో బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసిన వారికి కంపెనీ ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల వెయిటింగ్ పీరియడ్‌తో ఆయా కస్టమర్లను అందించనుంది.
దూకుడు పెంచిన బజాజ్..!
బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ. 300 కోట్లను పెట్టుబడి చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ... రాబోయే కొద్ది వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను అధిక డిమాండ్‌కు అనుగుణంగా రెట్టింపు చేయాలనేది మా ప్రణాళికని ఆయన అన్నారు.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్, ప్రీమియం వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి ఒకే 3.8kW మోటార్ నుంచి శక్తిని పొందుతాయి. నాన్-రిమూవబుల్ 3kWh IP67 లిథియం-అయాన్ బ్యాటరీను కల్గి వుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 70kmph వేగంతో 95km పరిధి మేర ప్రయాణం చేస్తుంది. ఇండిగో మెటాలిక్, వెలుట్టో రోస్సో, బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్‌నట్ వంటి రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment