Bajaj Auto
-
బజాజ్ ఆటో నుంచి త్వరలోనే ఈ-రిక్షా
బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (మార్చి) ఈ–రిక్షా విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు అసంఘటితంగా ఉన్న ఈ విభాగంలో గణనీయమైన వాటాపై దృష్టి సారించింది. ప్రస్తుత త్రైమాసికం చివరికి అనుమతులు రావచ్చని, నెలవారీ రూ.45,000 యూనిట్ల విక్రయ అంచనాతో ఉన్నట్టు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.‘‘ఆధునిక ‘ఈ–రిక్’ను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆవిష్కరించే ఉద్దేశ్యంతో ఉన్నాం. ఈ విభాగంలో ఇది కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అటు యజమానులు, ఇటు ప్రయాణికులకు సంతోషాన్నిచ్చే విధంగా ఉత్పత్తి ఉంటుంది’’అని రాకేశ్ శర్మ వివరించారు. ఆటో విభాగం స్థాయిలోనే ఈ–రిక్ విభాగం కూడాఉంటుందని చెప్పారు.కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ గురించి మాట్లాడుతూ.. బజాజ్ ఆటో కొత్తగా ప్రవేశపెట్టిన అధిక రేంజ్, అధునాతన డిస్ప్లేలు, వేగవంతమైన ఛార్జింగ్, అత్యుత్తమ బూట్ స్పేస్ అందించే బజాజ్ చేతక్ 35 సిరీస్ ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటున్నట్లు రాకేశ్ శర్మ పేర్కొన్నారు."ఇప్పటికే ప్రవేశపెట్టిన రెండు వేరియంట్లు ఈ ఈవీ విభాగంలో అధిక మార్కెట్ వాటా కోసం బలమైన పాత్ర పోషిస్తున్నాయి. కొత్త సిరీస్ కూడా దిగువ శ్రేణిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది" అని రాకేశ్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్: బజాజ్ ప్లాటినా 100 vs హోండా షైన్
రోజువారీ వినియోగానికి లేదా ఎక్కువ మైలేజ్ కావాలని కోరుకునేవారు బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ వంటి బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇవి రెండూ.. సింపుల్ డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఈ కథనంలో ఈ రెండు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఆటో లాంచ్ చేసే బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ప్లాటినా 100 కూడా ఉంది. ఇందులో 102 సీసీ ఫోర్ స్ట్రోక్ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 పీఎస్ పవర్, 8.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 90 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.హోండా షైన్ విషయానికి వస్తే.. ఇది 123.94 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.74 పీఎస్ పవర్, 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?డిజైన్, ఫీచర్స్ పరంగా బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్.. రెండూ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర బైకులతో పోలిస్తే.. ఈ రెండు బైకులు మంచి మైలేజ్ అందించడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ధరలు రూ. 68,685 కాగా.. హోండా షైన్ ధర రూ. 84151 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). -
ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇది
ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ (CNG) బైక్ లాంచ్ చేసిన బజాజ్ ఆటో (Bajaj Auto) ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. 'ఫ్రీడమ్ 125' బైకును ఆరు నెలల్లో.. 40,000 కంటే ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ వెల్లడించారు.బజాజ్ సీఎన్జీ బైక్.. అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వాహన వినియోగదారులకు ఆకర్శించింది. మేము దాదాపు 40,000 బైక్‌లను రిటైల్ చేసాము. ఇది 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుండంతో.. రోజువారీ వినియోగానికి కూడా దీనిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారని రాకేష్ శర్మ (Rakesh Sharma) పేర్కొన్నారు.బజాజ్ సీఎన్జీ బైకును ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇప్పటికి సుమారు 350 పట్టణాలకు విస్తరించినట్లు రాకేష్ శర్మ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రధాన నగరాలలో ఈ బైకును ప్రదర్శించడానికి, అక్కడ విక్రయాలను కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.బజాజ్ ఫ్రీడమ్ 125బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన సీఎన్జీ బైక్ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
ఓలాకు బజాజ్ గట్టి దెబ్బ
ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌కు (Ola Electric) బజాజ్ (Bajaj Auto) గట్టి దెబ్బ కొట్టింది. 2024 డిసెంబర్లో ఓలా ఎలక్ట్రిక్‌ని అధిగమించి ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Two-Wheeler) మార్కెట్లో కొత్త లీడర్‌గా అవతరించింది. వాహన్ పోర్టల్‌లోని రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఇప్పుడు 25% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మునుపటి నెల కంటే 3 శాతం వాటాను పెంచుకుంది.మరోవైపు తీవ్రమైన పోటీలో ఓలా ఎలక్ట్రిక్ వెనుకబడిపోయింది. 2024 డిసెంబర్లో కంపెనీ మార్కెట్ వాటా 19%కి పడిపోయింది. అంతకుముందు నెలతో పోల్చితే ఇది 5% క్షీణించింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక టీవీఎస్ (TVS) మోటార్స్ 23% మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ప్లేయర్‌గా తన స్థానాన్ని నిలుపుకొంది.బజాజ్ విజయానికి కారణాలుబజాజ్ ఆటో వృద్ధికి దాని చేతక్ 35 సిరీస్ వ్యూహాత్మక లాంచ్ కారణమని చెప్పవచ్చు. ఫీచర్-రిచ్ స్కూటర్లను తక్కువ ఉత్పత్తి ఖర్చుతో దాని మునుపటి మోడళ్ల కంటే 45% తక్కువకే టీవీఎస్ అందిస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.తీవ్ర పోటీఎలక్ట్రిక్ టూవీలర్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా మారింది. భిన్న వ్యూహాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టీవీఎస్ వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (2-4 kWh) స్కూటర్లను అందించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్షిప్ ఐ-క్యూబ్ (I-Qub) 250 ప్రత్యేక ఈవీ అవుట్లెట్లతో సహా దాదాపు 4,000 స్టోర్లలో అందుబాటులో ఉంది.మరో కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ-ఓరియెంటెడ్ రిజ్టా స్కూటర్‌ను విడుదలతో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బలమైన ఈవీ మార్కెట్లను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తన ఉనికిని విస్తరించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.ఓలాకు సవాళ్లుఒకప్పుడు ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పెరిగిన పోటీ, ధరల సవాళ్ల కారణంగా మార్కెట్ వాటాలో తిరోగమనాన్ని చవిచూసింది. ఎస్1 (Ola S1) స్కూటర్ స్వాపింగ్ బ్యాటరీ వెర్షన్‌ను రూ.59,999కే ప్రారంభించడం, తమ నెట్‌వర్క్‌ను 800 నుండి 4,000 స్టోర్లకు విస్తరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ తన ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది. -
అవి స్టార్టప్‌లు కావు.. ‘అప్‌స్టార్ట్‌లు’
ముంబై: చాలా వరకు స్టార్టప్‌లది ఆరంభ శూరత్వమేనని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. అవి వ్యూహాలను, బ్రాండ్‌ను, టెక్నాలజీని నిరుపయోగంగా మార్చేస్తుండగా.. విజయవంతమైన కంపెనీలు మాత్రం వాటిని దన్నుగా చేసుకొని బ్రాండ్‌ను వృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండింటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఇదేనన్నారు.ఓ టీవీ చానెల్ నిర్వహించిన గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడుతూ.. ‘ఎలాంటి వ్యూహం లేకుండా మార్కెట్లోకి అడుగుపెట్టేవి ‘అప్‌స్టార్ట్‌లు’. అవి తమ వ్యూహాలు, టెక్నాలజీలు, ఉత్పత్తులను చేజార్చుకుంటాయి. ప్రతి నెలా ధరలను తగ్గిస్తూ బ్రాండ్‌కు తూట్లు పొడుస్తాయి. ఫ్యాక్టరీల్లో, ట్రక్కుల్లో, డీలర్‌షిప్‌ల వద్ద, రోడ్లపై ఉత్పత్తులు తగలబడిపోతుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా స్టార్టప్‌లు వ్యూహాన్ని రూపొందించుకుంటాయి. టెక్నాలజీని, బ్రాండ్‌ను, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. ఉద్యోగులకు సంతృప్తి అందిస్తాయి. పటిష్టమైన ఆదాయాలే కాకుండా, లాభాలను కూడా కళ్లజూస్తాయి.ఇక మూడో కోవలోకి వచ్చేవి విజయవంతమైన కంపెనీలు. అవి సరైన వ్యూహాలు, టెక్నాలజీ వినియోగంతో అద్భుతమైన బ్రాండ్లుగా అవతరిస్తాయి’ అని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే పోటీలో స్టార్టప్‌లు, పేరొందిన సంస్థల్లో ఏవి విజయం సాధిస్తాయనే ప్రశ్నకు రాజీవ్ బజాజ్ ఈ విధంగా బదులిచ్చారు. బైక్లయినా, ఇంకా ఏ ఇతర వ్యాపారమైనా సరే 90–95 శాతం కొత్త వ్యాపారాలు, కొత్త ఉత్పత్తులు, సర్వీసులన్నీ విఫలమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో చూసినా ఇది వాస్తవమన్నారు. -
బజాజ్ ఆటో రివర్స్‌గేర్.. చేతక్ అమ్మకాలు సూపర్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 1,385 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, డిఫర్డ్ ట్యాక్స్‌కు పెరిగిన కేటాయింపులు ప్రభావం చూపాయి. అయితే మొత్తం ఆదాయం రూ.10,838 కోట్ల నుంచి రూ. 13,247 కోట్లకు జంప్ చేసింది. మొత్తం వ్యయాలు రూ. 8,806 కోట్ల నుంచి రూ. 10,767 కోట్లకు పెరిగాయి. విక్రయాలు 16% అప్ ఈ క్యూ2లో బజాజ్ ఆటో స్టాండెలోన్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 2,005 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 10,777 కోట్ల నుంచి రూ. 13,127 కోట్లకు బలపడింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 16 శాతం ఎగసి 12,21,504 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 26 శాతం జంప్‌చేసి 6,36,801 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 5 శాతం పుంజుకుని 3,96,407 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 70,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. -
రూ.1.15 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్: 137 కిమీ రేంజ్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఓటీఏ అప్డేట్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎలక్ట్రిక్ టూవీలర్స్ పోటీ!
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా జూలై నెలలో సేల్స్ దాదాపు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. మరోపక్క, ఈ విభాగంలో పోటీ ఫాస్ట్ చార్జింగ్ అవుతోంది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. ధరల యుద్ధానికి తెరతీసి, ఓలా మార్కెట్ వాటాకు గండికొడుతున్నాయి. ఐపీఓ సక్సెస్‌తో దండిగా నిధుల జోష్‌లో ఉన్న ఓలా.. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది! ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,07,016 ఈ–టూవీలర్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన 54,616 వాహనాలతో పోలిస్తే 96 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 79,868 మాత్రమే. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సేల్స్ మళ్లీ ఎలక్ట్రిక్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పెట్రోలు టూవీలర్లలో రారాజులుగా ఉన్న సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో సైతం ఎలక్ట్రిక్ బరిలో తగ్గేదేలే అంటూ కాలుదువ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలైలో బజాజ్ ఆటో ఏకంగా 17,642 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం విశేషం. జూన్‌తో పోలిస్తే 80 శాతం సేల్స్ పెరిగాయి. మార్కెట్ వాటా సైతం 11.6 శాతం నుంచి 16.9 శాతానికి జంప్ చేసింది. ఇక టీవీఎస్ అమ్మకాలు 30 శాతం పైగా ఎగబాకి 19,471 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడ్డ హీరో మోటో 5,044 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సత్తా చాటింది. మొత్తంమీద చూస్తే, ఈ మూడు దిగ్గజాల ‘ఎలక్ట్రిక్’ వాటా 40 శాతానికి పైగా ఛార్జింగ్ అయింది. ఇందులో టీవీఎస్, బజాజ్ వాటాయే దాదాపు 35 శాతం గమనార్హం. ఓలాకు షాక్... రెండు నెలల క్రితం, మే నెలలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో తిరుగులేని స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ సెగ బాగానే తగులుతోంది. జూన్‌లో కంపెనీ 36,781 వాహనాలు విక్రయించగా.. జూలైలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడి 41,597కు చేరింది. అయితే, మార్కెట్ వాటా మాత్రం జూన్‌లో 47.5 శాతానికి, ఆపై జూలైలో ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఓలాకు తగ్గుతున్న మార్కెట్ వాటాను సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేగంతో కొట్టేస్తున్నాయి. మరోపక్క, పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఏథర్ ఎనర్జీ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. జూన్‌లో 6,189 (8% మార్కెట్ వాటా), జూలైలో 10,080 (10% వాటా) వాహనాలను అమ్మింది. అయితే, దీని స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రూ. లక్ష లోపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుండటంతో.. ఓలా, ఏథర్ వంటి పూర్తి ఈవీ కంపెనీలు కూడా ధరల యుద్ధంలోకి దూకాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాటా పతనంతో ఓలా ఇక పూర్తిగా ఈ–టూవీలర్లపైనే దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.భారీ నెట్వర్క్, సర్వీస్ ప్లస్..తొలిసారిగా రూ. లక్ష లోపు స్కూటర్లను ప్రవేశపెట్టడం కూడా బజాజ్, టీవీఎస్, హీరో అమ్మకాలు పుంజుకున్నాయి. ‘ఈ 3 సాంప్రదాయ టూవీలర్ కంపెనీలకు విస్తృత డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్, బ్రాండ్ విలువ, సర్వీస్ సదుపాయాలు దన్నుగా నిలుస్తున్నాయి.మార్కెట్ వాటాను కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని రీసెర్చ్ సంస్థ నోమురా ఆటోమోటివ్ రిటైల్ విభాగం హెడ్ హర్షవర్ధన్ శర్మ పేర్కొన్నారు. ధరల పోరు, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటివి ఈ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. తాజా పరిణామాలతో ఛార్జింగ్ స్టేషన్ల భారీ పెరుగుదలతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాలు జోరందుకుంటాయని, వినియోగదారులకు కూడా ఇది మేలు చేకూరుస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్.. అమెజాన్‌లో కోనేయండి
బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా తయారైంది. ఆగష్టు 5నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ బ్రూక్లిన్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. అయితే డిజైన్ మాత్రం దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్.. ప్రీమియమ్ వేరియంట్ మాదిరిగానే అదే 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 136 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 73 కిమీ కావడం గమనించదగ్గ విషయం. మార్కెట్లో ఈ స్కూటర్.. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.ప్రస్తుతం కంపెనీ 600 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉంది. ఈ షోరూమ్‌లలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో అమ్మకాలు కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో మొదటి 15 నెలల్లో 1587 యూనిట్ల అమ్మకాలను పొందిన చేతక్ క్రమంగా వాహన వినియోగదారులు ఆకర్శించడంలో విజయం సాధించింది.బజాజ్ ఆటో చేతక్ లైనప్ స్టెమ్ను రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడంతో స్టెర్న్గా మార్చింది. చేతక్ బేస్ 2901, మిడ్-టైర్ అర్బేన్, రేంజ్ టాపింగ్ ప్రీమియం వేరియంట్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్స్, రేంజ్ విషయంలో కొంత తేడా ఉంటుంది. -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ దేశీయ విఫణిలో లాంచ్ అయింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ప్రతిభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.World‘s first #CNG motorcycle has been launched! Meet the Bajaj #Freedom125. 🏍️That’s a good looker, eh? Kinda has to be for the kind of premium over a regular petrol 125cc bike. Initially launching only in Maha/Guj; phased pan India launch to follow. Prices: ₹ 95-110k. SVP pic.twitter.com/9V9KGKLxrZ— Siddharth Vinayak Patankar (@sidpatankar) July 5, 2024 -
ఖండాంతరాలు దాటిన ఇండియన్ కంపెనీ.. బ్రెజిల్లో కొత్త ప్లాంట్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' బ్రెజిల్లో కొత్త ప్లాంట్ ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయంతో కంపెనీ సంవత్సరానికి 20,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే వంద దేశాల్లో కంపెనీ తన వాహనాలను విక్రయిస్తోంది. ఈ కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి మరిన్ని దేశాలకు బజాజ్ వాహనాలు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్లకు విస్తరించనున్నట్లు సమాచారం. ఇందులో కేవలం వాహనాలు మాత్రమే కాకుండా వాహనాలకు కావలసిన విడి భాగాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రారంభంలో కంపెనీ బజాజ్ డామినర్ బైకులను మాత్రమే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి చేసిన డామినార్ బైకులు లాటిన్ అమెరికన్ మార్కెట్లలో విక్రయించనున్నారు. కంపెనీ సొంత ప్లాంట్ ఏర్పాటు చేయడంతో.. ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కస్టమర్లకు త్వరితగతిన వాహనాలను డెలివరీ చేయవచ్చని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో బ్రెజిల్లో మోటార్‌సైకిల్ అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డేటా ప్రకారం, 2024లో దక్షిణ అమెరికా మోటార్‌సైకిల్ మార్కెట్ భారీగా పుంజుకుంది. భారతదేశంలో కూడా బజాజ్ ఆటో అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్లడించింది. -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైక్ ఈ నెల 18న లాంచ్ అవుతుందని గతంలో వెల్లడైంది. అయితే ఈ డేట్ ఇప్పుడు జూలై 5కి మారింది. ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో సీఎన్జీ బైక్ లేదు.బజాజ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త సీఎన్జీ 125 సీసీ విభాగంలో లాంచ్ అవుతుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ పేరు 'బ్రూజర్' అని తెలుస్తోంది. ఈ బైక్ సీఎన్జీ, పెట్రోల్‌తో నడిచే ప్రపంచంలోనే మొదటి ప్రొడక్షన్ స్పెక్ మోటార్‌సైకిల్. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలతో పోలిస్తే.. సీఎన్జీ ధరలు తక్కువ. కాబట్టి దేశీయ మార్కెట్లో సీఎన్జీ బైక్ లాంచ్ అనేది ఆటోమొబైల్ చరిత్రలో ఓ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ బైకుకు సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 5న వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ ఎన్160 పేరుతో మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్ మోడ్‌లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ బజాజ్ పల్సర్ ఎన్160 మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులోని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. కాబట్టి టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా పొందవచ్చు. ఈ బైక్ ఇప్పుడు రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.కొత్త పల్సర్ ఎన్160 మోడల్ సాధారణ మోడల్ మాదిరిగానే 164.82 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇంజిన్‌లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది. -
ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ ఇదే.. ఆటోమొబైల్ చరిత్రలో నవశకం
దశాబ్దాల క్రితం డీజిల్ బైకులు వినియోగంలో ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ బైకులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. త్వరలో సీఎన్జీ బైక్ లాంచ్ అవ్వడానికి సిద్ధమైంది.ప్రస్తుతం భారతీయ విఫణిలో సీఎన్జీతో నడిచే వాహనాల జాబితాలో కార్లు, ఆటో రిక్షాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎన్జీ బైకులు ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టలేదు. కాబట్టి బజాజ్ ఆటో సీఎన్జీ బైక్ లాంచ్ చేసి.. నవ శకానికి నాంది పలకడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్జీ బైక్ కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది.బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైకును ఈ నెల (జూన్ 18) అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్‌కు సిద్దమవుతున్న ఈ బైక్‌కు 'ఫైటర్' అని నామకరణం చేశారు. బజాజ్ కంపెనీ గత కొంత కాలంగా ఈ సీఎన్జీ బైక్ మీద పనిచేస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ఆవిష్కరించడానికి సిద్ధమైంది.ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించిన బజాజ్ సీఎన్జీ బైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, సస్పెన్షన్ డ్యూటీల కోసం మోనోషాక్ యూనిట్ వంటి వాటితోపాటు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్ & డ్రమ్ బ్రేక్ యూనిట్ పొందనున్నట్లు సమాచారం. -
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
Q4 results: బజాజ్ ఆటో లాభం హైజంప్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 35 శాతం జంప్‌చేసింది. రూ. 1,936 కోట్లను తాకింది. 2022–23 ఇదే కాలంలో రూ. 1,433 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదా యం సైతం 29% వృద్ధితో రూ. 11,485 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం ఎగసి రూ. 7,479 కోట్లయ్యింది. 2022–23లో కేవలం రూ. 5,628 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ. 36,248 కోట్ల నుంచి రూ. 44,685 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. వాహన విక్రయాలు జూమ్ క్యూ4లో బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 10,68,576 యూనిట్లకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 26 శాతం పుంజుకుని 9,16,817ను తాకగా.. 13 శాతం అధికంగా 1,51,759 వాణిజ్య వాహనాలు విక్రయించింది. బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 1.1 శాతం లాభంతో రూ. 9,018 వద్ద ముగిసింది. -
సీఎన్జీ బైక్‌పై బజాజ్ ఆటో కసరత్తు
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పెట్రోల్‌తో నడిచే మోటర్‌సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్‌నకు చెందిన అన్ని సీఎస్ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది. -
బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్..!
బజాజ్ ఆటో షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ నెల 8న జరిగే బోర్డు సమావేశంలో చర్చించే అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది. కంపెనీ అత్యున్నత అధికారులు, వీరి తరఫు బంధువులు సంస్థ సెక్యూరిటీలు, ఈక్విటీ షేర్లలో లావాదేవీలు నిర్వహించే విండోను ఈ నెల 1 నుంచి 26వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 6,989 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్టం రూ. 7,060 వరకూ ఎగసింది. -
విడుదలకు సిద్దమవుతున్న ఫస్ట్ సీఎన్జీ బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు పెట్రోల్ బైకులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ సీఎన్జీ విభాగంలో బైకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బ్రుజెర్ ఈ101 (Bruzer E101) కోడ్‌నేమ్‌తో రానున్న ఈ కొత్త సీఎన్జీ బైకుని ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతం దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో ప్లాటినా పేరుతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ బైక్ గురించి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కంపెనీ గుర్తించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎన్జీ బైకుని తీసుకురావడానికి సంకల్పించినట్లు వెల్లడించాడు. సంవత్సరానికి సుమారు ఒక లక్ష నుంచి 1.2 లక్షల సీఎన్జీ బైకులను ఉత్పత్తి చేయాలనుకున్నట్లు, ఇది రెండు లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా? పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్జీ ధరలు తక్కువ. ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ వాహనాల కంటే సీఎన్జీ వాహనాల మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎన్జీ బైక్ మైలేజ్ దాని మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన గణాంకాలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. -
వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలు - సంజీవ్ బజాజ్
ముంబై: బజాజ్ ఫైనాన్స్ సూక్ష్మ రుణాలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్లకు రుణాలు ఇచ్చే వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. అలాగే, వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలను తెరవనున్నట్టు చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో కస్టమర్లకు రుణాలు ఇవ్వడం ద్వారా ద్విచక్ర వాహన ఫైనాన్స్‌లోకి అడుగు పెట్టామని, ఆ తర్వాత కన్జ్యూమర్ ఫైనాన్స్‌లోకి, అనంతరం ప్రాపర్టీపై రుణాలు ఇవ్వడంలోకి ప్రవేశించినట్టు చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ రుణాలు, ఎంఎస్ఈ, ఇతర వాహన రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తమకు 4,000 శాఖలు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 5,000కు చేర్చనున్నట్టు పేర్కొన్నారు. 2008లో ఈ సంస్థ సేవలు ప్రారంభించగా, ప్రస్తుతం 4 కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నట్టు సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ కాలంలో సంస్థ మార్కెట్ విలువ 450 రెట్లు పెరిగినట్టు చెప్పారు. రుణ ఆస్తులు 250 రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. -
ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో ఆఫర్
Bajaj Chetak Electric Scooter Price Cut: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చిలో బజాజ్ ఆటో రెండు వేరియంట్లలో అప్డేట్ చేసిన 2023 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రకటించింది. తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. చేతక్ఈవీ ధరలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బేస్ చేతక్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.52 లక్షలు. అయితే ఇప్పుడు, బేస్ వేరియంట్ నిలిపి వేసింది. అలాగే ప్రీమియం వేరియంట్ ధర రూ. 22 వేల తగ్గింపును అందిస్తోంది. దీని ప్రకారం రూ. 1.3 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనే వివరాలు అందుబాటులో లేవు. (టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్) బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ ఫీచర్లు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్‌లెస్ DC మోటార్‌తో ఆధారితంగా 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో. ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఒక గంటలో 25 శాతం ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఆల్-కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్‌వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ,రియర్ డ్రమ్ బ్రేక్స్ లాంటివి ఉన్నాయి.2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియమ్ ఎడిషన్ వెర్షన్ మూడు రంగులలో లభిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా.. బజాజ్ ఆటో కీలక నిర్ణయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ రంగంలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి బజాజ్ ఆటో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కంపెనీ మంగళవారం తెలిపింది. ఈ శిక్షణ కేంద్రాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, డిప్లమాలతో కూడిన అధునాతన నైపుణ్య శిక్షణను ఇస్తాయని వివరించింది. మెకాట్రానిక్స్, మోషన్ కంట్రోల్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి క్లిష్ట మాడ్యూల్స్‌పై శిక్షణ ఉంటుంది. తయారీ పరిశ్రమలో నైపుణ్యం అంతరాన్ని పరిష్కరించడంలో ట్రైనింగ్ సెంటర్లు సహాయం చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అవసరమైన పరికరాలను ఈ శిక్షణా కేంద్రాలకు బజాజ్ ఆటో అందిస్తుంది. కార్యక్రమ ప్రారంభ దశలో నిర్వహణ ఖర్చులకు నిధులు కూడా సమకూరుస్తుంది. ‘భారత్‌లో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగులుగా చేరుతున్నారు. సాంకేతికతలో వేగవంతమైన మార్పులతో యువతను ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడంలో విద్య, పరిశ్రమల మధ్య భారీ అంతరం ఉంది. సమాజానికి తిరిగి ఇచ్చే వారసత్వంతో ఈ అంతరాన్ని పూడ్చేందుకు కట్టుబడి సీఎస్ఆర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నాము’ అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. -
అందరికి తెలిసిన బైక్ లాంచ్ చేయనున్న బజాజ్ - పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో మళ్ళీ తన అవెంజర్ 220 బైక్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ క్రూజ్ 220, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 సరసన స్ట్రీట్ 220. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త అవెంజర్ 220 బైక్ చూడటానికి దాని స్ట్రీట్ 160 మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో రౌండ్ హెడ్ లాంప్, బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, పిలియన్ బ్యాక్ రెస్ట్, ఒక చిన్న ఫ్లైస్క్రీన్ మరియు ప్లాట్ హ్యాండిల్ బార్ వంటివి ఉన్నాయి. బజాజ్ అవెంజర్ 220 బైక్ 200 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 18.7 bhp పవర్, 17.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ ఇంజిన్ లేటెస్ట్ బిఎస్ 6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందింది. కావున మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఈ బికా ధరలను ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది అవెంజర్ క్రూజ్ 220 కంటే తక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దీని ధర బహుశా రూ. 1.40 లక్షలు ఉండవచ్చు. ఈ బైక్ గురించి గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రెండింతలకు చేతక్ స్కూటర్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్‌లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్‌కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు. సబ్సిడీ పొడిగించాల్సిందే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ’ అని తెలిపారు. -
బ్రిటీష్ కంపెనీ ఇప్పుడు బజాజ్ చేతుల్లోకి..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' ఇప్పుడు భారతదేశంలో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌కి సంబంధించి విక్రయాలు, సర్వీస్ మొదలైన వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొన్ని సంవత్సరాలకు ముందు ప్రకటించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది ఒక భాగం. బజాజ్ ఆటో ఇప్పుడు ట్రయంఫ్ భాగస్వామ్యంతో కొత్త ఎంట్రీ-లెవల్ మిడ్-కెపాసిటీ ట్రయంఫ్ మోడల్లను అభివృద్ధి చేయడంలో భాగంగా బజాజ్ తన చకాన్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం సుమీత్ నారంగ్ నేతృత్వంలోని బజాజ్ ప్రోబైకింగ్ కిందికి వస్తాయి. బజాజ్ కంపెనీ చేసిన ఈ అధికారిక ప్రకటనలో భాగంగా 2023లో మొదటి బజాజ్-ట్రయంఫ్ బైక్ విడుదలకానున్నట్లు సమాచారం. అయితే ఇందులో అది ఏ బైక్ అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు. దీనికి సంబంధించిన వివరాలు రానున్న రోజుల్లో విడుదలవుతాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) బజాజ్-ట్రయంఫ్ నేతృత్వంలో మరింత సరసమైన ట్రయంఫ్ మోడల్లను అందించడానికి, కంపెనీ డీలర్ నెట్వర్క్ కూడా రాబోయే 2 సంవత్సరాలలో దాని నెట్వర్క్ పెంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశంలోని 120 నగరాల్లో తన షోరూమ్‌లను ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్‌లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్‌లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
భారత్‌లో తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బైకులు - వివరాలు
సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ 100: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్‌పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్: హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం. టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్‌పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. బజాజ్ ప్లాటినా 100: భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్ కొనుగోలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో చైర్మన్ నీరజ్ బజాజ్ ముంబైలో అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో, సముద్ర తీరంలోని ఓ పెంట్ హౌస్ (ట్రిప్లెక్స్)ను రూ.252.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. గృహాల సెర్చింగ్ పోర్టల్ ఇండెక్స్‌ట్యాప్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ రియల్టీ డెవలపర్ లోధా గ్రూపు నుంచి నీరజ్ బజాజ్ ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగింది. రూ.15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు సమాచారం. మలబార్ ప్యాలసెస్ ప్రాజెక్ట్‌లోని 29, 30, 31 అంతస్తులను నీరజ్ బజాజ్ ఇంత భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణం (కార్పెట్ ఏరియా 12,624 చదరపు అడుగులు) పరిధిలో మూడు అంతస్తులుగా ఉంటుంది. ఎనిమిది కారు పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. గత నెలలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబైలోని వర్లిలో అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం తెలిసిందే. అలాగే డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సైతం పలు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. -
250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు
సాక్షి,ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం లగ్జరీ ఫ్లాట్లకు నెలవుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ నీరజ్ బజాజ్ ముంబైలో ఖరీదైన ఫ్లాట్లను కొనుగోలు చేశారు. బజాజ్ గ్రూప్ డైరెక్టర్ ఏకంగా రూ.252 కోట్లతో మూడు అంతస్తులను కొనుగోలు చేశారు. దీంతో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్‌కు బజాజ్ ఓనర్‌గా అవతరించారు. ఇదే ముంబైలో అతిపెద్ద డీల్‌గా భావిస్తున్నారు. మాక్రోటెక్ డెవలపర్స్ నుండి బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ 252.5 కోట్ల రూపాయలకు సీ-ఫేస్డ్ ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్‌లో 18వేల చదరపు అడుగుల ట్రిప్లెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీగా డీల్ స్టాంప్ డ్యూటీ రూ.15 కోట్లు. 29, 30, 31వ అంతస్తులతోపాటు, ఎనిమిది పార్కింగ్‌లను కూడా నీరజ్ కొనుగోలు చేశారు. 31 అంతస్తులున్న లోధా మలబార్ ప్యాలెస్ ప్రాజెక్ట్ ఒక్కో ఫ్లాట్ కనీస పరిమాణం దాదాపు 9,000 చదరపు అడుగులు. ఒక్కో అపార్ట్మెంట్ ధర రూ. 100 కోట్లకు పైమాటే ప్రస్తుతం బజాజ్ ముంబైలోని పైదార్ రోడ్డులో 50 ఏళ్ల నాటి భవనంలోని రెండు అంతస్తుల్లో కుటుంబం నివసిస్తోంది. నీరజ్ బజాజ్ ఎవరు? రాహుల్ బజాజ్ మరణానంతరం బజాజ్ గ్రూప్‌ను ముందుండి నడిపిస్తున్న 69 ఏళ్ల నీరాజ్ బజాజ్ఆ సియా అత్యంత సంపన్నులలో ఒకరు. 2021లో గ్రూప్ ఛైర్మన్ అయిన నీరజ్‌కు 35 సంవత్సరాల కార్పొరేట్ అనుభవం ఉంది. బజాజ్ పల్సర్‌తో సహా అనేక ప్రసిద్ధ ద్విచక్ర వాహనాలను తయారు చేసే బజాజ్ ఆటో, అలాగే బజాజ్ అలయన్జ్ , జనరల్ ఇన్సూరెన్స్‌లో డైరెక్టర్ల బోర్డులో కూడా ఉన్నారు. మూడు సార్లు టేబుల్ టెన్నిస్ చాంపియన్, 17 ఏళ్లకే అర్జున అవార్డు మూడు సార్లు జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ అయిన నీరజ్ బజాజ్ 1977లో ఆట నుండి రిటైర్ అయ్యారు. అప్పటికి ఆయన వయసు కేవలం 22 సంవత్సరాలు. ఇది సోదర వర్గానికి మరియు అతని స్వంత కుటుంబానికి కూడా షాక్ ఇచ్చింది. బజాజ్, అయితే టేబుల్ టెన్నిస్ జీవితకాల సాధన కాబోదు అందుకే కుటుంబ వ్యాపారంలో చేరాలనుకుంటున్నట్లు స్పష్టంగా నీరజ్ ప్రకటించారు.పారిశ్రామికవేత్తల కుటుంబంలో ప్రపంచస్థాయి క్రీడాకారుడుగా రాణించడం చాలా అరుదు అనే ఘనతను దక్కించుకున్నారు. 17ఏళ్లకే నీరాజ్ బజాజ్ 1974లో అర్జున అవార్డు గెల్చుకున్నారు. అలాగే ప్రమోటర్‌గా ప్రపంచంలోనే తొలి టేబుల్ టెన్నిస్ ఫ్రాంచైజీ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)ని ప్రారంభించారు. 1970-77 మధ్య ఏడు సంవత్సరాలు టేబుల్ టెన్నిస్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాదు. నాలుగు సార్లు నంబర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ర్యాంక్ సాధించారు. నీరజ్ భార్య మినాల్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కృతి, నీరవ్ బజాజ్ ఉన్నారు. నీరజ్‌కు ఇద్దరు సోదరులు. మధుర్ , శేఖర్ బజాజ్ వీరిలో నీరజ్ చిన్న. ఫోర్బ్స్ ప్రకారం 2022 నాటికి ఈ సోదరుల నికర సంపద దాదాపు రూ. 65000 కోట్లు. 1954లో జన్మించిన నీరజ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత ముంబైలోని సిడెన్హామ్ కాలేజీ నుండి కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండిఎంబీఏ పట్టాను పొందారు నీరజ్ నేతృత్వంలోని గ్రూపులో 50000 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.4,50,000 కోట్లు. అల్ట్రా-లగ్జరీ ప్రాపర్టీ సేల్స్ జోరు కోవిడ్ తరువాత గత రెండేళ్లుగా అల్ట్రా-లగ్జరీ ప్రాపర్టీల అమ్మకాలు పెరిగాయి. ఇండిపెండెంట్ నాన్-బ్రోకరేజీ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ కంపెనీ లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ తెలిపారు. రెసిడెన్షియల్ యూనిట్లను కొనుగోలు చేయడానికి దీర్ఘకాలిక మూలధన పన్ను మినహాయింపు ఏప్రిల్ 1, 2023 నుండి రూ. 10 కోట్లకు పరిమితం కానుందని బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో మార్చి 31కి ముందు లగ్జరీ యూనిట్ల అమ్మకాలు పెరుగుతాయని ముందే చెప్పామని మరో నిపుణుడు అభిషేక్ కిరణ్ గుప్తా అన్నారు. ఏప్రిల్ 1నుంచి పాలసీ మారుతున్న క్రమంలో లగ్జరీ గృహాలను కొనుగోలు చేసేవారికి ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ తర్వాత నీరజ్ బజాజ్ కొనుగోలుమూడో అతిపెద్ద ప్రాపర్టీ డీల్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డీమార్ట్ యజమానిరాధాకిషన్ దమానీ, అతని ఫ్యామిలీ ఒబెరాయ్ రియల్టీలో 28 యూనిట్లను బల్క్‌గా కొనుగోలు చేశారు. అలాగే గత నెలలో (ఫిబ్రవరి 8,) వెల్స్పన్ గ్రూప్‌నకు చెందిన బీకే గోయెంకా అదే లగ్జరీ ప్రాజెక్ట్‌లో రూ.240 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ విఫణిలో పల్సర్ NS160 & NS200 స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిళ్ల అప్డేట్ వెర్షన్స్ విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.47 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైకులు వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా రూ. 10,000 (ఎన్ఎస్160), రూ. 7,000 (ఎన్ఎస్200) ఎక్కువ. ఈ రెండు బైకులు మునుపటి స్టాండర్డ్ టెలిస్కోపిక్ యూనిట్ స్థానంలో అప్‌సైడ్ ఫోర్క్‌ను పొందాయి, అంతే కాకుండా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: మీ మొబైల్‌పై ఎవరైనా నిఘా పెట్టారేమో.. ఇలా తెలుసుకోండి..!) డిజైన్ పరంగా కొంత అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్, పర్ఫామెన్స్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఎన్ఎస్160 అదే 160.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 17.2 హెచ్‌పీ పవర్ 14.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక ఎన్ఎస్200 బైక్ 199.5 సీసీ ఇంజిన్‌తో 24.5 హెచ్‌పీ పవర్ 18.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఫీచర్స్ పరంగా కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. -
బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు
దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు వాహనాలు అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇందులో భాగంగానే ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ చేతక్ 'ప్రీమియం ఎడిషన్'లో విడుదలైంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). బజాజ్ కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ని మూడు కలర్ ఆప్సన్స్‌లో విడుదల చేసింది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ సీటు, బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్‌లు, హెడ్‌ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటి వాటిని పొందుతుంది. భారతదేశంలో కంపెనీ ఈ కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి డీలర్‌షిప్‌లను విస్తరించనుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ డీలర్షిప్ నెట్వర్క్ భారతదేశంలోని 60 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉంది. అంతే కాకుండా 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 85 కంటే ఎక్కువ నగరాల్లో 100 కంటే ఎక్కువ స్టోర్లకు విస్తరించడానికి ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికి కంపెనీ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ధర ప్రీమియం ఎడిషన్ కంటే తక్కువ. ఇప్పుడు ఈ వేరియంట్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రోస్సో అనే నాలుగు కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ బ్యాటరీ ప్యాక్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్ లేదు. కావున ఇందులో అదే 2.9 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 4.2kW పీక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఛార్జ్‌పై 90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. బజాజ్ చేతక్ ఎక్కువ అమ్మకాలు జరపకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తున్నాయి, కొనుగోలుదారులు కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున చేతక్ క్లెయిమ్ చేసిన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ (IDC) పరిధిని 20 శాతం పెంచి 108కిమీలకు పెంచబోతున్నట్లు బజాజ్ ఆటో గత నెలలో ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇదే జరిగితే చేతక్ అమ్మకాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. -
దేశీయ మార్కెట్లో రెండు కొత్త ఈ-స్కూటర్లు: ప్రత్యేకంగా..!
బెంగళూరు: ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు, దేశీయ ద్విచక్ర తయారీ దిగ్గజం బజాజ్ ఆటో రెండు ఈవీ స్కూటర్లను సోమవారం మార్కెట్లో లాంచ్ చేశాయి. దేశీయ వినియోగానికి అనుగుణంగా రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని కంపెనీలు వెల్లడించాయి. యులు,బజాజ్ ఆటో సంయుక్తంగా మిరాకిల్ జీఆర్, డీఎక్స్ జీఆర్ పేరుతో లాంచ్ చేశాయి. దేశీయ అవసరాలు, రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని లాంచ్ చేస్తున్నట్టు యూలు, బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపాయి. మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ ఈ-స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పని చేస్తాయి. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అందిస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. 2024 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాహన అవసరాలు, ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈవో అమిత్ గుప్తా చెప్పారు.గత మూడు నెలల్లో తమ వాహనాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, దేశంలోని ప్రధాన నగరాల్లో లక్ష వాహనాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పదిరెట్ల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని సాధించాలని యూలు లక్క్ష్యంగా పెట్టుకుంది. నెక్ట్స్‌జెన్ మేడ్-ఫర్ ఇండియా వాహనాలు అధునాతన డిజైన్లతో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ కేటగిరీకి మైలురాయిగా నిలుస్తాయని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ పేర్కొన్నారు. -
డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే
భారత ప్రభుత్వం 2023 ఏప్రిల్ నుంచి బిఎస్6 2 ఉద్గార నిబంధలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బజాజ్ డామినర్ 400' మీద కంపెనీ ఇప్పుడు రూ. 25,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ ఆకర్షణీయమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీనితో పాటు తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. బజాజ్ కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ వల్ల డామినార్ 400 రూ. 1,99,991 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడమే కాకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బజాజ్ డామినర్ 400 రూ. 1.36 లక్షల వద్ద 2016లో విడుదలైంది. బజాజ్ డామినార్ 400 మోటార్‌సైకిల్ 373 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్సి ఇంజన్ కలిగి 39.4 బిహెచ్పి పవర్, 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ 43 మిమీ యుఎస్డి ఫోర్క్స్, 110 మిమీ ట్రావెల్‌తో మోనోశాక్ పొందుతుంది. బజాజ్ డామినార్ 400 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా సఫోర్ట్ చేస్తుంది. -
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
అమ్మకాల పరంగా భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'పల్సర్ 220ఎఫ్' విడుదల చేసింది. ఈ ఆధునిక బైక్ ధర రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్). బజాజ్ పల్సర్ మొదటిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007లో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది, ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ నిలిపివేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ రీ లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్సన్స్ కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో విడుదల చేసింది. కంపెనీ తన బైకులను కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇంజిన్ & పర్ఫామెన్స్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి 20.9 బిహెచ్పి పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. అదే సమయంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది. డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ పరంగా మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వంటి వాటితో పాటుఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. -
ఏకంగా108 కి.మీ. రేంజ్‌తో 2023 బజాజ్ చేతక్ ఈవీ.. వచ్చేస్తోంది!
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బజాజ్ సంస్థ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈవీ 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ 90 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 18 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుందని స్పష్టమవుతోంది. బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ చేసినప్పటికీ డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, పవర్ అవుట్‌పుట్ వంటివి మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. కంపెనీ ఇందులో కొంత ఎక్కువ రేంజ్ అందించడానికి బ్యాటరీ మేనేజ్ మెంట్ సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేయడం జరుగుతుంది. భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, అన్ని సబ్సిడీలు మినహాయించి). త్వరలో విడుదలయ్యే 2023 చేతక్ ఈవీ ఎక్కువ రేంజ్ అందించడం వల్ల ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్డేటెడ్ మోడల్ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా కంపెనీ అమ్మకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. -
ఈవీల్లో అన్ని విభాగాల్లోకి వస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అన్ని విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తామని అర్బనైట్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలను అర్బనైట్ బ్రాండ్‌లో బజాజ్ ఆటో ఆఫర్ చేస్తోంది. ఈ–టూ వీలర్స్‌లో ఏటా ఒక కొత్త మోడల్‌ను పరిచయం చేయాలన్నది బజాజ్ లక్ష్యమని అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ‘ఇందుకు అనుగుణంగా నూతన ఉత్పాదనలను అభివృద్ధి చేస్తున్నాం. చేతక్ లేదా ఇతర పేర్లతోనూ వాహనాలు రావొచ్చు. ఈవీ వ్యాపారం ఒక దీర్ఘకాలిక క్రీడ. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల వాటా గతేడాది 9 శాతం. ఇప్పుడిది ఏకంగా 20 శాతానికి చేరింది. రెండేళ్లలో మొత్తం స్కూటర్ల విక్రయాల్లో 70 శాతం ఎలక్ట్రిక్ కైవసం చేసుకుంటుంది’ అని వెల్లడించారు. చేతక్ శకం మళ్లీ వస్తుంది.. నాణ్యతలో రాజీపడని కస్టమర్ల తొలి ప్రాధాన్యత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఎరిక్ అన్నారు. ‘బ్రాండ్‌ను నిలబెట్టడానికి మన్నిక, సాంకేతికత, ఇంజనీరింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎలక్ట్రిక్ త్రీ, ఫోర్ వీలర్ల విభాగంలోకి రాలేమని చెప్పలేను. చేతక్ అంటే అంచనాలు ఎక్కువ. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కిన చేతక్ శకం మళ్లీ వస్తుంది. మొబిలిటీ కంపెనీ యూలు వినియోగిస్తున్న 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి సరఫరా చేశాం. మొబిలిటీని ఒక సేవగా దేశంలో ప్రోత్సహిస్తాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ టూవీలర్లను అద్దె ప్రాతిపదికన బెంగళూరు, ముంబై, ఢిల్లీలో యూలు ఆఫర్ చేస్తోంది. కాగా, నెలకు 200లకుపైగా చేతక్ స్కూటర్లను విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక మోబైక్స్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో చేతక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు మూడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
బజాజ్ ఆటో లాభం 16% డౌన్
న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,719 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 2,040 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం తగ్గింది. విదేశాలకు ఎగుమతులు 25 శాతం క్షీణించడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 8,762 కోట్ల నుంచి రూ. 10,203 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మాత్రం లాభం రూ. 1,275 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 11,44,407 యూనిట్ల నుంచి నామమాత్రంగా 1 శాతం వృద్ధితో 11,51,012 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 5,32,216 యూనిట్ల నుంచి 30 శాతం వృద్ధి చెంది 6,94,375 యూనిట్లకు చేరాయి. అయితే ఎగుమతులు మాత్రం 6,12,191 యూనిట్ల నుంచి 4,56,637 యూనిట్లకు తగ్గాయి. విదేశీ మార్కెట్లలో స్థూలఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు ఇందుకు కారణమని బజాజ్ ఆటో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రం విక్రయాలు పుంజుకున్నాయని వివరించింది. శుక్రవారం బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్లు 1% క్షీణించి రూ. 3,569 వద్ద క్లోజయ్యాయి. -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్‌ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్‌లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు. -
చిప్ కొరత.. బజాజ్ ఆటో లాభం డౌన్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం నామమాత్ర క్షీణతతో రూ. రూ. 1,163 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,170 కోట్లు ఆర్జించింది. చిప్ కొరత అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 7,386 కోట్ల నుంచి రూ. 8,005 కోట్లకు ఎగసింది. ఇందుకు ధరల పెంపు, డాలర్ బలపడటం సహకరించింది. అమ్మకాల పరిమాణం మాత్రం 7 శాతం నీరసించి 9,33,646 యూనిట్లకు చేరింది. గతేడాది క్యూ1లో 10.06 లక్షలకుపైగా వాహనాలు విక్రయించింది. తొలుత సెమీకండక్టర్ల కొరత సమస్యలు సృష్టించినప్పటికీ తదుపరి ఇతర మార్గాలలో సరఫరాలు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 1,061 కోట్ల నుంచి రూ. 1,173 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీ అమ్మకాలు 1 శాతం తగ్గి 3,52,836 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు మరింత అధికంగా 10 శాతం క్షీణించి 5,80,810 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో 2.25 శాతం బలహీనపడి రూ. 3,932 వద్ద ముగిసింది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్లకు భారీ షాకిచ్చిన బజాజ్
సాక్షి, ముంబై: బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కి షాక్ ఇచ్చింది. భారతదేశంలో తన ద్విచక్ర వాహనాల పోర్ట్ ఫోలియోలో చాలా వాటిపై భారీగా ధరలను పెంచింది. పల్సర్ అవెంజర్ బైక్‌లతోపాటు, ఎలక్ట్రిక్ స్కూటర్ - చేతక్ ధరలను కూడా గణనీయంగా పెంచింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌పై ధరను 9 శాతం పెంచింది. దీని ధరను 12,749 రూపాయలు పెంచింది. పుణేలో (ఎక్స్-షోరూమ్) 1.41 లక్షలతో రూపాయలతో పోలిస్తే ప్రస్తుత ధర 1.54 లక్షలుగా ఉంది. అయితే, ధర పెరిగినప్పటికీ, ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్, ఫీచర్లును అలానే ఉన్నాయి. కాగా 2019లో బజాజ్ అకుర్దిలోని పూణే ప్లాంట్‌లో చేతక్ ఎలక్ట్రిక్ ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని 75 కంటే ఎక్కువ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. అప్పటినుంచి 14,000 యూనిట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. -
బజాజ్ ఆటో: భారీ బై బ్యాక్‌కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దేశీ దిగ్గజం బజాజ్ ఆటో బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో షేరుకి రూ. 4,600 ధర మించకుండా 9.61 శాతం ఈక్విటీని బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 2,500 కోట్లవరకూ వెచ్చించనుంది. సోమవారం సమావేశమైన బోర్డు ఇందుకు అనుమతించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. వెరసి ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌ను మినహాయించి వాటాదారుల నుంచి రూ. 10 ముఖ విలువగల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. కంపెనీ ఈక్విటీలో 9.61 శాతం వాటాకు సమానమైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు రెగ్యులేటరీకి బజాజ్ ఆటో సమాచారమిచ్చింది. కాగా మార్చి 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి చెందిన రూ. 19,090 కోట్ల మిగులు నగదు, ఇతరాలతో పోల్చినప్పుడు బైబ్యాక్ పరిమాణం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీంతో మంగళవారం నాటిమార్కెట్లో కంపెనీ షేరు స్వల్ప లాభాలకు పరిమితమైంది. -
వేలం వెర్రిగా ఎలక్ట్రిక్ వాహనాలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అంశం వేలం వెర్రిగా మారిందని, ఈవీ వ్యాపారంతో సంబంధం లేని వాళ్లంతా కూడా పరిశ్రమలోకి వస్తున్నారని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆక్షేపించారు. అందుకే అగ్నిప్రమాదాల్లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. పుణెలోని అకుర్దిలో బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేక ప్లాంటును ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది కేవలం అగ్నిప్రమాదాల గురించి మాత్రమే కాదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల వాహనాల్లోనూ ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈవీల విషయంలో సమస్యంతా తయారీ ప్రక్రియతోనే ఉంటోంది. ఈవీల వ్యవహారం వేలం వెర్రిగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈవీలతో సంబంధం లేని వాళ్లకు ఈ వ్యాపారంతో ఏ పని ఉంది? ఈ విధానాన్ని సరిచేయాలి. బహుశా, ప్రభుత్వంలోని సంబంధిత అధికార వర్గాలు ఈవీల నిబంధనలను సడలించారేమో. అందుకే ఈవీలు మార్కెట్‌ను వరదలా ముంచెత్తుతున్నాయి‘ అని బజాజ్ పేర్కొన్నారు. ‘తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల పేరుతో దేన్నైనా రోడ్డు మీదకు తీసుకొస్తున్నారు. మరి స్కూటర్లకు అగ్నిప్రమాదాలు జరగకుండా మరేమవుతుంది?‘ అని ఆయన ప్రశ్నించారు. ప్లాంటుపై రూ. 750 కోట్ల పెట్టుబడులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈవీల తయారీ ప్లాంటుపై చేతక్ టెక్నాలజీ (సీటీఎల్), దాని వెండార్ భాగస్వాములు రూ. 750 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నారు. సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఉంటుంది. వార్షికంగా దీని తయారీ సామర్థ్యం 5 లక్షల ద్విచక్ర వాహనాలుగా ఉంటుంది. 2019 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన చేతక్ ఈ–స్కూటర్లను ఇప్పటివరకూ 14,000 పైచిలుకు విక్రయించామని, 16,000 పైగా బుకింగ్స్ ఉన్నాయని బజాజ్ తెలిపారు. ‘చేతక్ అనేది సిసలైన మేక్ ఇన్ ఇండియా సూపర్‌స్టార్. అది ఎంతో మంది వాహనప్రియుల అభిమానం చూరగొంది. దేశీయంగానే డిజైన్ చేసి, ఇక్కడే నిర్మించిన ఎలక్ట్రిక్ చేతక్ .. మా పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలకు, తయారీలో దశాబ్దాల అనుభవానికి, వినియోగదారులు .. ఉత్పత్తులపై మాకున్న లోతైన అవగాహనకు నిదర్శనం‘ అని బజాజ్ తెలిపారు. -
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరిన్ని నగరాల్లో...
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్నీ నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు తమ యూనిట్లను కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది. మరిన్నీ నగరాల జోడింపు... బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగంగా అమ్మేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2022లో చేతక్ నెట్‌వర్క్‌ను మరో 12 కొత్త నగరాలను కంపెనీ జోడించింది. కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై, మపుసాతో సహా నగరాల్లో బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసిన వారికి కంపెనీ ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల వెయిటింగ్ పీరియడ్‌తో ఆయా కస్టమర్లను అందించనుంది. దూకుడు పెంచిన బజాజ్..! బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ. 300 కోట్లను పెట్టుబడి చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ... రాబోయే కొద్ది వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను అధిక డిమాండ్‌కు అనుగుణంగా రెట్టింపు చేయాలనేది మా ప్రణాళికని ఆయన అన్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్, ప్రీమియం వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి ఒకే 3.8kW మోటార్ నుంచి శక్తిని పొందుతాయి. నాన్-రిమూవబుల్ 3kWh IP67 లిథియం-అయాన్ బ్యాటరీను కల్గి వుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 70kmph వేగంతో 95km పరిధి మేర ప్రయాణం చేస్తుంది. ఇండిగో మెటాలిక్, వెలుట్టో రోస్సో, బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్‌నట్ వంటి రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. -
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత..!
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ (83) శనివారం రోజున పుణేలో మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో 12 ఫిబ్రవరి, 2022 మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనను విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. భారతీయ కార్పొరేట్ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు రాహుల్ బజాజ్. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా ఆయన పనిచేశారు. నితిన్ గడ్కరీ సంతాపం..! గత ఐదు దశాబ్దాలుగా బజాజ్ గ్రూప్‌కు నాయకత్వం వహించిన రాహుల్జీ పరిశ్రమలో కీలకపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని కేంద్ర రోడ్డు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్లో స్పందించారు. -
బజాజ్ పల్సర్ బైక్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో పలు బైక్‌ల ధరలను కాస్త పెంచింది. పల్సర్ మోడల్లోని Pulsar N250 , Pulsar F250 బైక్‌ల ధరలను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా బజాజ్ పల్సర్ బైక్స్‌లో అత్యంత ఆదరణ పొందిన Pulsar 220F బైక్ ధరను కూడా పెంచింది. ఈ బైక్‌లను కొద్ది రోజుల క్రితమే బజాజ్ లాంచ్ చేసింది. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..! పల్సర్ 220F ధరను బజాజ్ ఆటో రూ. 660కు పెంచింది. ఇప్పుడు దీని ధర రూ. 1.34 లక్షలుగా ఉండనుంది. మరోవైపు, కొత్త పల్సర్ F250 బైక్ స్వల్పంగా రూ. 915 పెంపును అందుకుంది. కాగా పల్సర్ F250 నేకెడ్ మోడల్ కొంచెం అధికంగా పెరిగింది. పల్సర్ F250 నేకెడ్ మోడల్‌పై రూ.1180 పెంచగా, ప్రస్తుత ధర రూ. 1.41 లక్షలకు చేరింది (ఎక్స్-షోరూమ్). ధరల పెంపు కొత్తేమి కాదు..! గత పన్నెండు నెలల వ్యవధిలో పల్సర్ మేకర్ బజాజ్ ఆటో తన ఉత్పత్తుల ధరలను అనేకసార్లు పెంచింది. గత ఏడాది బజాజ్ విడుదల చేసిన 2021 పల్సర్ 250 ధరలను కూడా పెంచింది. ఇక సంప్రదాయ బైక్‌లకు స్వస్తి పలుకుతూ... బజాజ్ ఆటో ఇప్పుడు తన ఈవీ ఉత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తోంది. పూణే సమీపంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది . ఈ ప్లాంట్ నుంచి బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ ఒక ఏడాదికి 5 లక్షల ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కల్గి ఉంది. చదవండి: 111 ఏళ్ల తరువాత రోల్స్ రాయిస్ సంచలన నిర్ణయం..! -
‘మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు’ - రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్స్ సంస్థలు కుప్పతెప్పలుగా వస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశీ టూ–వీలర్ దిగ్గజాలను అంత తేలికగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ‘ఏవో కొన్ని స్టార్టప్‌లు అనుకుంటున్నట్లుగా మంచి భారతీయ ద్విచక్ర వాహన కంపెనీలు మరీ అంత తేలికైనవి కాదు. మేము అక్టోబర్‌లో మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తే.. మీకు నవంబర్‌లో చేతికి అందుతుంది. అంతే గానీ 2021లో ఆవిష్కరిస్తే డెలివరీ తీసుకునేందుకు మీరు 2022 దాకా వేచి చూస్తూ కూర్చోనక్కర్లేదు. అది స్టార్టప్‌లు పనిచేసే తీరు. చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజాల పనితీరు అలా ఉండదు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. డార్విన్ సిద్ధాంతం 150 సీసీ మించిన స్పోర్ట్స్ మోటర్‌సైకిల్స్ విభాగంలో ఎన్ఫీల్డ్, బజాజ్, టీవీఎస్‌లకు 70–80 శాతం మార్కెట్ వాటా ఉంటుందన్నారు. సరికొత్తగా పల్సర్ 250ని ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ విషయాలు రాజీవ్ బజాజ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్‌ల నుంచి బడా కంపెనీలకు పోటీ ఎదురయ్యే అంశంపై స్పందిస్తూ.. చార్లెస్ డార్విన్ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అత్యంత తెలివైన, బలమైన జీవి కాకుండా మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగించగలవని, సంస్థలకు కూడా అదే వర్తిస్తుందని పేర్కొన్నారు. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ 250
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బజాజ్ ఆటో తాజాగా సరికొత్త పల్సర్ 250 బైక్‌ను ఆవిష్కరించింది. ఎఫ్ 250, ఎన్ 250 వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.38 లక్షల నుంచి ప్రారంభం. ఎఫ్ 250 ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే 250 సీసీ డీటీఎస్–ఐ ఆయి ల్ కూల్డ్ ఇంజన్, 24.5 పీఎస్ పవర్, 21.5 ఎన్ఎం టార్క్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, గేర్ ఇండికేటర్, యూఎస్బీ మొబైల్ చార్జింగ్, మోనోషాక్ సస్పెన్షన్, ఇన్ఫినిటీ డిస్ప్లే కన్సోల్ వంటి హంగులు ఉన్నాయి. 2001 అక్టోబర్‌లో కంపెనీ భారత మార్కెట్లో పల్సర్ స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఎన్ 250 -
బజాజ్ ఆటో లాభం 71 శాతం అప్..
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,094 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,194 కోట్లతో పోలిస్తే ఇది 71 శాతం అధికం. ఇక ఆదాయం రూ. 7,442 కోట్ల నుంచి రూ. 9,080 కోట్లకు చేరింది. కేటీఎం ఏజీలో 46.5 శాతం వాటాలను పీరర్ బజాజ్ ఏజీలో 49.9 శాతం వాటా కోసం తమ అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మార్పిడి చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో సుమారు రూ. 501 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం 11,44,407 వాహనాలు విక్రయించింది. గత క్యూ2లో విక్రయించిన 10,53,337 యూనిట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదు చేసింది. -
ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం.. త్వరలో హైదరాబాద్‌లో
సాక్క్షి, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు త్వరలో సరికొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ఆటో ఛార్జీలకే కారు తరహా సౌకర్యాలను అనుభవిస్తూ ప్రయాణం చేయవచ్చు. బజాజ్ ఆటో, ఉబర్ సంస్థలు కలిసి ఈ సర్వీసును అందుబాటులోకి తేనున్నాయి. క్వాడ్రి సైకిల్ బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రిసైకిల్ని రూపొందించింది. పేరు క్వాడ్రి సైకిల్ అని పిలచుకున్నా ఇది సైకిల్లా కాదు చూడటానికి కారులా ఉంటుంది. నాలుగు చక్రాలతో ప్రయాణం చేస్తుంది. అయితే కారుతో పోల్చుకున్నప్పుడు ఇంజన్ సామర్థ్యం , ఇతర సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అదే ఆటోతో పోల్చినప్పుడు భద్రతతో పాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ ఎక్కువగా ఇస్తుంది. క్యూట్ క్వాడ్రిసైకిల్ని బజాజ్ ఆటో క్యూట్ పేరుతో రూపొందించి చాలా కాలమే అయినా ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురాలేదు. కేరళా, గుజరాత్, మహారాష్ట్రలలో ప్రయోగాత్మకంగా ఈ మోడళ్లను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఉబర్‌తో జత కట్టి బెంగళకూరు నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సేవల్లోకి వచ్చింది. ఆటో ఛార్జీలకే కారు తరహా ప్రయాణం అందిస్తున్న ఈ బిజినెస్ మోడల్ బెంగళూరులో సక్సెస్ అయ్యింది. పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరులో ఈ కారులో ప్రయాణించిన కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాయి బజాజ్ ఆటో, ఉబర్లు. లక్ష మందికి పైగా ఈ క్యూట్ క్వాడ్రి సైకిల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. దీంతో మరిన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు రెండు కంపెనీలు రెడీ అయ్యాయి. త్వరలో హైదరాబాద్ ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ రోడ్లపై క్యూట్ పరుగులు పెట్టనుంది. ఉబర్ సంస్థ ఆధ్వర్యంలో క్యూట్ క్యాబ్ సర్వీసులు ప్రారంభిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. దీనికి సంబంధించి క్యూట్ యూనిట్ల తయారీని పెంచే పనిలో ఉంది బజాజ్. -
క్యూ1లో బజాజ్ ఆటో స్పీడ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,170 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో నమోదైన రూ. 395.5 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం. ఇందుకు ప్రధానంగా ఎగుమతులు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్లు అమ్మకాలను దెబ్బతీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆదాయం జూమ్ క్యూ1లో బజాజ్ ఆటో మొత్తం ఆదాయం సైతం రూ. 3,079 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు జంప్‌చేసింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావం చూపినప్పటికీ పలు దేశాలకు పెరిగిన ఎగుమతులు దన్నునిచ్చినట్లు కంపెనీ వివరించింది. క్యూ1లో వాహన అమ్మకాలు 4,43,103 యూనిట్ల నుంచి 10,06,014 యూనిట్లకు ఎగసినట్లు తెలియజేసింది. వీటిలో ఎగుమతులు మూడు రెట్లు ఎగసి 6,48,877 యూనిట్లకు చేరగా.. దేశీయంగా 3,57,137 వాహనాలు విక్రయమయ్యాయి. జూన్ చివరికల్లా మిగులు నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 19,097 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. మొబిలిటీ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ కోసం పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు 1.2% నీరసించి రూ. 3,860 వద్ద ముగిసింది. -
కేటీఎం బంపర్ ఆఫర్... ఈ బైక్‌పై భారీ తగ్గింపు
రైడర్స్‌కి గుడ్‌న్యూస్ కేటీఎం సంస్థ తన బైకులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కేటీఎంలో ఎంట్రీ లెవల్ లైట్‌వెయిట్ బైక్ 250 అడ్వెంచర్ ధరను తగ్గించింది. బైక్ ప్రమోషన్లో భాగంగా కేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ అవసరాలతో పాటు లాండ్రైడ్కి కూడా వెళ్లగలిగేలా అడ్వెంచర్ 250 బైక్‌ని కేటీఎం మార్కెట్లోకి తెచ్చింది. 250 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఈ బైకుపై రూ. 25,000 డిస్కౌంట్ని సంస్థ అందిస్తోంది. ఆఫర్ వర్తింపుతో హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర రూ. 2,28,480గా ఉంది. అడ్వెంచర్ 250 బైకుపై అందిస్తోన్న డిస్కౌంట్ 2020 జులై 14 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కేటీఎం తెలిపింది. ధర తగ్గింపుతో కేటీఎంలో పాపులర్ మోడల్ డ్యూక్‌కి అడ్వెంచర్‌కి మధ్య ధరల వత్యాసం బాగా తగ్గిపోయింది. రోజువారి రవాణా అవసరాలు తీర్చడంతో పాటు వీకెండ్లో లాంగ్ టూర్ వేసేందుకు వీలుగా బైకర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడ్వెంచర్‌ను డిజైన్ చేసినట్టు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ తెలిపారు. అడ్వెంచర్ బైకు 248 సీసీ ఫోర్ వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పాటు డబ్ల్యూపీ అపెక్స్ సస్పెన్షన్, ఏబీఎస్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. -
బజాజ్ డొమినర్పై బంపర్ ఆఫర్
ముంబై: బైక్ లవర్లకు శుభవార్త. స్పోర్ట్స్ బైక్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న బజాన్ డొమినర్ ధరలు తగ్గాయి. బజాజ్ ఆటో తన డొమినర్ 250 మోడళ్ల ధరలపై రూ.16,800 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ధర తగ్గింపుతో ఈ మోడల్ ధర రూ.1.54 లక్షలకు దిగిరానుంది. ‘‘ఆటో కంపెలన్నీ వాహన ధరలను పెంచుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డొమినార్ మోడళ్ల ధరలను తగ్గిస్తున్నాము. కస్టమర్లకు స్పోర్ట్స్, టూరింగ్ సదుపాయాలను మరింత చేరువ చేసేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. గతేడాది మార్చిలో విడుదలైన డొమినర్ 248.8 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. స్పోర్ట్స్ బైక్ కేటగిరిలో డోమినర్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ధర తగ్గింపుతో డొమినర్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. -
సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు
ముంబై: అటో దిగ్గజం బజాబ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్లు "చేతక్" డెలివరీలను సెప్టెంబర్ నుంచి చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ 2020-21 వార్షిక నివేదికలో తెలిపింది. ఈ-స్కూటర్ చేతక్ ప్రీమియం, చేతక్ అర్బన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. అర్బన్ వేరియంట్ ధర రూ.1,22,000(ఎక్స్-షోరూమ్)కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1,26,000 (ఎక్స్-షోరూమ్). అలాగే వచ్చే మూడు నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో బజాజ్ చేతక్ సేవలు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఐపీ6 వాటర్ రెసిస్టెన్స్ లిథియం ఐయాన్ బ్యాటరీని అమర్చారు. ఫుల్ చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 2020 మొదట్లోనే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కోవిడ్ సంబంధిత సమస్యలతో అప్పట్లో బుకింగ్స్ నిలిపేశారు. తిరిగి ఈ ఏప్రిల్ 18న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్లైన్లో రీ-ఓపెన్ చేశారు. భారీ డిమాండ్ నేపథ్యంలో వెంటనే నిలిపేశారు. ఇతర కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి వీలుగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. త్వరలోనే మళ్లీ సప్లై వంటి అంశాలను సమీక్షించి బుకింగ్ తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ప్రకటించింది. చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్ -
2021లో టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల జోరు!
మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో పోటీ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. చాలా వరకు పెద్ద కంపెనీలు ఇంకా తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని రాలేదు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని గణాంకాలు చూస్తే మనకు అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సాహిస్తున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ రెండూ కూడా తమ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేశాయి. బజాజ్ తన పాత మోడల్ చేతక్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. బజాజ్ నుంచి ప్రస్తుతానికి ఒకే ఒక్క ఎలక్ట్రిక్ వాహనం అందుబాటులో ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు దాదాపు ఒకే సమయంలో మార్కెట్లో ప్రారంభించబడ్డాయి. ఈ రెండు 2020లో భారత మార్కెట్లోకి లాంఛ్ అయ్యాయి. అయితే, వీటి అమ్మకాలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ చేతక్ 1,395 వేల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలవగా టీవీఎస్ ఐక్యూబ్ 1,110 యూనిట్లను అమ్మేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2021 మార్చిలో టీవీఎస్ ఐక్యూబ్ 355 యూనిట్లను విక్రయించగా, బజాజ్ చేతక్ కేవలం 90 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే, బజాజ్ చేతక్ కంటే టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. కంపెనీలు ఏడాదికి రెండు వేల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బజాజ్ కొంచెం వెనుకబడింది అని చెప్పుకోవాలి. చదవండి: ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు హైదరాబాదీలు -
కార్పొరేట్ ఇండియా... డివిడెండ్ బొనాంజా!
ఇటీవల నగదు నిల్వలు అధికంగా గల(క్యాష్ రిచ్) కంపెనీలు వాటాదారులకు డివిడెండ్లు, బైబ్యాక్‌ల రూపంలో లాభాలను పంచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు విస్తరణ ప్రాజెక్టుల వ్యయాలు తగ్గడం, వ్యాపార నిర్వహణ ద్వారా మెరుగుపడుతున్న క్యాష్‌ఫ్లో తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వార్షిక లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండుగా అందించనున్నట్లు ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ప్రకటించడాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా దేశీ బ్లూచిప్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకులు, బీమా, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను మినహాయిస్తే.. పలు లిస్టెడ్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం 2020 మార్చికల్లా టాప్ లిస్టెడ్ కంపెనీల వద్ద రూ. 11 లక్షల కోట్లకుపైగా నగదు, తత్సమాన నిల్వలున్నాయి. ఇవి ఆయా కంపెనీల మొత్తం నెట్‌వర్త్‌లో 30 శాతానికి సమానమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండ్లకు కేటాయించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇటీవల కాలంలో చెల్లించిన డివిడెండ్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో వాటాదారులకు భారీ నగదు అందనున్నట్లు నిపుణులు తెలియజేశారు. బజాజ్ ఆటో కొత్త డివిడెండ్ పాలసీ నేపథ్యం లో ఇకపై మరిన్ని కార్పొరేట్స్ ఈ బాటలో నడిచే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు గత వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డివిడెండ్ పంపిణీ పాలసీని సమీక్షించింది. దీనిలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా డివిడెండ్ పాలసీలోకి వచ్చే టాప్–500 కంపెనీల జాబితాను టాప్–1,000కు సవరించింది. ఇది డివిడెండ్ చెల్లింపు విధానాలలో మార్పులకు కారణంకానున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బజాజ్ దూకుడు... గత మూడేళ్లలో బజాజ్ ఆటో వాటాదారులకు లాభాల్లో 47 శాతం వాటాను డివిడెండ్లుగా పంచింది. ఈ బాటలో గతేడాది డివిడెండ్ చెల్లింపులకు రూ. 3,472 కోట్లను వెచ్చించింది. తద్వారా అధిక చెల్లింపుల జాబితాలో 10వ ర్యాంకులో నిలిచింది. రూ. 16,000 కోట్లవరకూ మిగులు ఉన్నదని, దీనికితోడు వార్షికంగా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. దీంతో అధిక డివిడెండ్ పాలసీకి తెరతీసినట్లు వెల్లడించింది. కాగా.. దేశీ కార్పొరేట్ల వద్ద గతేడాదికల్లా నగదు నిల్వలు 13.8%కి చేరాయి. ఇందుకు ఐటీ కంపెనీల ఆర్జనల మెరుగుదలతోపాటు.. రిలయన్స్, ఎయిర్టెల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల నిధుల సమీకరణ కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిమాండ్ ఎఫెక్ట్ ఇటీవల డిమాండ్ మందగించడంతో ఆటో, ఎఫ్ఎంసీజీ, విద్యుత్ తదితర రంగాలలో భారీ విస్తరణ ప్రణాళికలు తగ్గినట్లు ఈక్వినామిక్స్ అండ్ రీసెర్చ్ అడ్వయిజరీ పేర్కొంది. దీంతో మరిన్ని కంపెనీలు డివిడెండ్ చెల్లింపులను పెంచడం, షేర్ల బైబ్యాక్‌లు వంటివి చేపట్టవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అధిక డివిడెండ్లను చెల్లిస్తున్న కొన్ని కంపెనీలు తమ లాభాల్లో మరింతగా ఇన్వెస్టర్లకు అందించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ నేపథ్యంలోనూ గతేడాది(2019–20) ఫైనాన్షియల్‌యేతర రంగ కంపెనీలు 12.8% అధికంగా రూ.1.7 లక్షల కోట్లను వాటాదారులకు అందించినట్లు తెలిపారు. వెరసి 2019–20లో మొత్తం కంపెనీలు తమ నికర లాభాల్లో 78% వాటాను డివిడెండ్లకు కేటాయించాయి. అంతక్రితం ఏడాది ఇది 55% శాతమే. బైబ్యాక్‌లతో... 2019 జనవరి నుంచి చూస్తే పలు కంపెనీలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లను చేపట్టాయి. తద్వారా దాదాపు రూ. 64,000 కోట్లను వెచ్చించాయి. ఈ జాబితాలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాతోపాటు.. పీఎస్‌యూలు ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ప్రైవేట్ రంగ కంపెనీ అదానీ పోర్ట్స్ తదితరాలున్నాయి. పటిష్ట నిర్వహణ లాభాలు, నీరసించిన ట్రెజరీ ఈల్డ్స్, విస్తరణ ప్రణాళికల్లో మందగమనం వంటి అంశాలు పలు కంపెనీలను బైబ్యాక్, డివిడెండ్లవైపు ప్రోత్సాహిస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేట్ వర్గాలు తెలియజేశాయి. -
కొత్త బజాజ్ ప్లాటినా బైక్ : ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో గురువారం దేశీయ మార్కెట్లోకి కొత్త బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ బైక్‌ను విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.65,920 గా నిర్ణయించింది. ‘స్ప్రింగ్-ఆన్-స్ప్రింగ్’ నిట్రాక్స్ సస్పెన్షన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లను కలిగిన ఈ బైక్‌లో ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. (టియాగో.. కొత్త వేరియంట్) బ్రేకింగ్ సెగ్మెంట్లో అత్యుత్తమ టెక్నాలజీని కలిగిన తమ కొత్త ప్లాటినా 110 లక్షలాది మంది భారతీయులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తుందని కంపెనీ మోటార్‌సైకిల్ విభాగం అధ్యక్షుడు సరంగ్ కనడే తెలిపారు. దేశవ్యాప్తంగా 7 మిలియన్ల మంది కస్టమర్ల అభిమాన్ని సొంతం చేసుకున్న ప్లాటినా బ్రాండ్ ఇప్పుడు ఏబీఎస్ చేరికతో తన పోటీదారుల కంటే మరింత ముందుకు దూసుకెళ్లిందని కనేడే తెలిపారు. (అత్యంత తక్కువ ధర: బజాజ్ ప్లాటినా 100 ఈఎస్) -
అత్యంత తక్కువ ధర: బజాజ్ ప్లాటినా 100 ఈఎస్
సాక్షి, ముంబై: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన 102 సీసీ బైక్ ‘ప్లాటినా 100 ఈఎస్’ కొత్త వెర్షన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ (ఇఎస్) వేరియంట్‌ను ఎక్స్ షోరూం వద్ద ధరను రూ.53,920గా నిర్ణయించింది. ఇది భారత మార్కెట్లో లభించే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్-స్టార్ట్ బైక్ అని సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వెర్షన్లో అమర్చిన స్ప్రింగ్–ఇన్–స్ప్రింగ్ సస్పెషన్... రైడర్‌తో పాటు తోటి ప్రయాణికుడికి మెరుగైన సదుపాయాన్ని అందించనుంది. అలాగే సుదీర్ఘ ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తుంది. స్ప్రింగ్-ఇన్-స్ప్రింగ్ సస్పెన్షన్ లాంటి కొత్త ఫీచర్లతో పాటు ఇబ్బందులు లేని, సురక్షితమైన ప్రయాణం కోసం ట్యూబ్‌లెస్ టైర్లను ఇందులో అమర్చారు. ప్లాటినా బ్రాండ్ తన సెగ్మెంట్లో విశిష్ట సేవలు అందిస్తూ 7 మిలియన్ల మంది కస్టమర్ల అభిమాన్ని సొంతం చేసుకుందని బజాజ్ మార్కెటింగ్ హెడ్ సుందరరామన్ ఈ సందర్భంగా తెలిపారు. కస్టమర్లను కొత్త వెర్షన్ ఆకర్షిస్తుందని సుందరరామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్లో భారతదేశంలో ప్లాటినా 100 కిక్-స్టార్ట్ మోడల్‌ను, రూ.51,667 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్
ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్ము రేపుతున్నాయ్. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మిడ్‌సెషన్‌కల్లా మార్కెట్లు భారీగా ఎగశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 584 పాయింట్లు జంప్‌చేసి 47,028కు చేరింది. వెరసి మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడింది. ఇక నిఫ్టీ సైతం 165 పాయింట్లు ఎగసి 13,766 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం సెన్సెక్స్ 47,056 సమీపంలో, నిఫ్టీ 13,778 సమీపంలోనూ సరికొత్త గరిష్ట రికార్డులను సాధించాయి. జీడీపీ అంచనాలకు మించి వేగమందుకున్నట్లు ఆర్బీఐ నివేదిక తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటుకు జోష్ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. (రికవరీ అంచనాలను మించుతోంది: ఆర్బీఐ) బజాజ్ ఆటో చకన్లో రూ. 650 కోట్లతో మోటార్ సైకిళ్ల తయారీ ప్లాంటుకి మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. 2023కల్లా ఉత్పత్తిని ప్రారంభించగల ఈ ప్లాంటులో అత్యంత ఖరీదైన కేటీఎం బైకులు, హస్క్వర్నా, ట్రయంప్ మోటార్ సైకిళ్లను తయారు చేయనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తినీ చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో తొలుత 3 శాతం ఎగసి రూ. 3,423ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 3,378 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ షేరు 6 శాతం పుంజుకుంది. టాటా కమ్యూనికేషన్స్ ఫ్రాన్స్‌కు చెందిన ఈసిమ్ టెక్నాలజీ కంపెనీ.. ఒయాసిస్ స్మార్ట్ సిమ్ యూరోప్‌ను కొనుగోలు చేసినట్లు టాటా కమ్యూనికేషన్స్ తాజాగా పేర్కొంది. ఈసిమ్, సిమ్ విభాగాలలో ఒయాసిస్ ఆధునిక టెక్నాలజీ సర్వీసులను అందిస్తున్నట్లు తెలియజేసింది. తద్వారా మూవ్టీఎం పేరుతో తాము అందిస్తున్న ఎండ్టుఎండ్ ఎంబెడ్డెడ్ కనెక్టివిటీ సర్వీసులు మరింత బలపడనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లింది. రూ. 1,145 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 1,067 వద్ద కదులుతోంది. ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ హెల్త్‌కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ కంపెనీ పేషంట్మ్యాటర్స్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించాక జోరందుకున్న ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ తాజాగా మరోసారి బలపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 89 సమీపానికి చేరింది. వెరసి 2008 తదుపరి గరిష్టానికి చేరింది. గత మూడు రోజుల్లోనూ ఈ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఈ కౌంటర్లో మధ్యాహ్నానికల్లా నాలుగు రెట్లు అధికంగా 1.4 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30కల్లా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 2.88 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఆర్పీ సంజీవ్ గోయెంకా కంపెనీ ఫస్ట్‌సోర్స్.. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసులను అందించే విషయం విదితమే. -
డ్డగ్...డ్డగ్...డ్ఢగ్.....రాయల్ ఎన్ఫీల్డ్!
‘దేవుడిని బైక్ ఇవ్వమని అడిగాను. ఇవ్వకపోయేసరికి బైక్ దొంగిలించి క్షమాపణ అడిగాను’ అన్నాడట ఒక దొంగ. ఆ దొంగగోల మనకెందుకుగానీ, యువ హృదయాలను కామ్‌గా, క్లాసిక్‌గా దోచుకోవడానికి మోటర్‌బైక్ కంపెనీలు కాంపిటీషన్‌కు కాలు దువ్వుతున్నాయి స్పోర్టీ, రేసింగ్, టూర్ బైక్ కావచ్చు. మోడ్రన్, క్లాసిక్ బైక్ కావచ్చు....ఇప్పుడు మోటర్ కంపెనీల ప్రధాన టార్గెట్ యూత్! రేస్ మొదలైంది.... పోటీ గురించి మాట్లాడుకునే ముందు పోటీ ఎవరితో, దాని బలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ మోటర్ సైకిల్స్‌ను ‘లైఫ్‌స్టైల్’గా మార్చిన ఘనత రాయల్ది. మిడిల్‌వెయిట్ మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో లీడింగ్ ప్లేయర్ అయిన ‘రాయల్’ మెనేజ్మెంట్ స్కూళ్లలో ‘కేస్ స్టడీ’ అయింది. తిరుగులేని విజయానికి ఒక మోడల్‌గా నిలిచింది. ‘రాయల్’ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టడానికి దేశీయ,విదేశీ మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ అంటున్నాయి. రకరకాల ఎక్సైటింగ్ మోడల్స్‌తో ‘యూత్ టార్గెట్’గా బరిలోకి దిగాయి. దిగుతున్నాయి రాజకీయాల్లో వినిపించే ‘పొత్తులు’ ‘టై–అప్’లు మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో కనిపిస్తున్నాయి. ఎడతెగని చర్చల తరువాత ప్రఖ్యాత అమెరికన్ మోటర్‌సైకిల్ తయారీదారు హార్లే–డెవిడ్సన్ లార్జెస్ట్ టు వీలర్ మేకర్ ‘హీరో మోటో కోర్ప్’తో ఒక అవగాహనకు వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ బలమైన కోటలోకి ప్రవేశించడానికి అప్రకటిత వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి కంపెనీలు. లోకల్ పాట్నర్షిప్లతో బజాజ్–ట్రయంప్, హీరో–హార్లే, టీవిఎస్–నొర్టన్...మొదలైనవి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటి ఇవ్వనున్నాయి. టాక్టికల్ మూవ్లో భాగంగా కొన్ని కంపెనీలు ధరలను కాస్తో కూస్తో తగ్గిస్తూ యూత్‌ను ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రాయల్‌తో పోటీ పడేందుకు హోండా కంపెనీ ‘హైనెస్’ను ప్రవేశపెట్టింది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ‘హోండా రెబెల్’ మోడల్‌తో దీన్ని రూపొందించారు. మిడ్‌సైజ్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకొని డిలక్స్, డిలక్స్ ప్రొ వెరియంట్లలో వచ్చిన ‘హైనెస్’ సార్మ్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన బైక్. ఇక బజాజ్–ట్రయంప్ జోడి 400 నుండి 800 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న మిడిల్ కెపాసిటీ మోటర్ సైకిల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. దేశీయ మోటర్‌బైక్ తయారీ దిగ్గజం ‘మహీంద్ర అండ్ మహీంద్ర’ జావా బ్రాండ్‌ను యుద్దంలో సరికొత్త ఆయుధంగా చేసుకుంది. చెక్ రిపబ్లిక్ బ్రాండ్ ‘జావా’ హవా ఒకప్పుడు మనదేశంలో బాగానే నడిచిందికాని ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాకపోడంతో జావగారిపోయి ఇండియన్ మార్కెట్ నుంచి జారిపోయింది. సినిమా ఇంటర్యూ్యలలో ఒక సంభాషణ తరచుగా వింటుంటాం... ‘ఇరవై సంవత్సరాల క్రితం మీరు తీసిన సినిమా చూశానండీ. ఇప్పటికీ కొత్తగా ఉందంటే నమ్మండి. మరి కమర్శియల్‌గా ఎందుకు సక్సెస్ కాలేదు!’ ‘చాలా అడ్వాన్స్డ్గా తీసిన సినిమా కావడం వల్లే సక్సెస్ కాలేదు. ఈ టైమ్‌లో తీసి ఉంటే కచ్చితంగా హిట్టు కొట్టి ఉండేది’ ఇది కాస్తో కూస్తో ఆనాటి ‘జావా’కు కూడా వర్తిస్తుంది. అందుకే మహీంద్ర ‘జావా’ బ్రాండ్‌ను దేశీయంగా సొంతం చేసుకుంది. కేటిఎం390 అడ్వెంచర్‌ను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతున్న బజాజ్–హిస్కివర్న మోడల్ డిజిటల్ ఇన్స్ట్ర్మెంట్ క్లస్టర్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, వైర్–స్పోక్డ్ వీల్స్‌తో రోడ్ఫ్రెండ్లీ డిజైన్‌తో రూపొందించారు. ఐకానిక్ బీయండబ్ల్యూ ఆర్5 నుంచి టెక్నాలజీ, విజువల్ మోటర్‌సైకిల్ ఎసెన్షియల్స్‌ను స్ఫూర్తి పొంది రూపుదిద్దుకున్న ‘బీయండబ్ల్యూ ఆర్18 క్లాసిక్’లో రెయిన్, రోల్ అండ్ రాక్...ఎలాంటి రైడింగ్ కండిషన్స్‌లోనైనా ధైర్యం ఇచ్చే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. స్టెప్డ్–అప్ సీట్, రైజ్డ్ విండ్‌స్క్రీన్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, బ్లూటూత్–ఎనేబుల్డ్ టీఎఫ్టి ఇన్స్ట్ర్మెంట్ కన్సోల్...ఐ క్యాచింగ్ బాడీగ్రాఫిక్స్తో బరిలోకి దిగింది టీవిఎస్–అపాచీ ఆర్ఆర్ 310. అలయెన్స్‌లు, అవగాహనలు, టై–అప్లు, సృజనాత్మక ఆలోచనతో ఏ బండి ‘యూత్’ గుండెల్లో స్టాండవుతుందో వేచిచూద్దాం. -
సెప్టెంబర్‌లో ఆటోరంగం అమ్మకాల స్పీడ్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ల ఎత్తివేత నేపథ్యంలో వాహన పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ బాటలో ఇప్పటికే ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోగా.. గత నెల(సెప్టెంబర్)లో ద్విచక్ర వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా కార్ల విక్రయాలు సైతం వేగమందుకున్నాయి. ఇకపై ఆటో రంగం మరింత బలపడనున్న అంచనాలు వాహన తయారీ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ ఆటో జూమ్ గత నెలలో బజాజ్ ఆటో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 3,033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లింది. రూ. 3,114 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ సైతం మెరుగైన అమ్మకాలను సాధించగలదన్న అంచనాలు ఈ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ను పెంచాయి. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత టీవీఎస్ మోటార్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 490ను తాకింది. ప్రస్తుతం 3.6 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాలు భళా సెప్టెంబర్‌లో బజాజ్ ఆటో మొత్తం 4.41 లక్షల వాహనాలను విక్రయించింది. ఇది 10 శాతం వృద్ధికాగా.. ద్విచక్ర వాహన అమ్మకాలు 20 శాతం పెరిగి దాదాపు 4.09 లక్షలకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం ఎగసి 1.85 లక్షల యూనిట్లను దాటాయి. కాగా.. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు గత నెలలో 31 శాతం జంప్‌చేసి 1.6 లక్షల యూనిట్లను అధిగమించగా.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల విక్రయాలు 9 శాతం బలపడి 11,851 యూనిట్లను తాకాయి. ఇదే ఇధంగా ఎంఅండ్ఎం సైతం 17 శాతం అధికంగా 43,386 ట్రాక్టర్ల అమ్మకాలను సాధించింది. -
కేటీఎం 390 బైక్ : కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో బైక్ లవర్స్ కోసం కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. తన అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌పై ఈ కొత్త ఫైనాన్స్ పథకాన్ని అందిస్తోంది. కేటీఎం 390 బైక్ కేటీఎం 390 అడ్వెంచర్ బైక్‌ను సులువైన ఈఎంఐల ద్వారా కొనుగోలుచేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తోంది. ఆన్-రోడ్ ధర మీద 80 శాతం ఫైనాన్స్ సదుపాయాన్నిఅందిస్తోంది. తద్వారా మరింతమంది వినియోగదారులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నట్టు బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ ఫైనాన్స్ పథకాన్ని అందస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయంతో ఈ బైక్‌ను 6,999 రూపాయల సులభ వాయిదాలతో కొనుగోలు దారులు ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు అప్గ్రేడయ్యే అవకాశం కల్పిస్తున్నామని బజాజ్ ఆటోలిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ అన్నారు. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా వినియోగదారులు 95 శాతం వరకు ఫైనాన్స్ కవరేజ్, తక్కువ వడ్డీరేట్లు, హెచ్ఢీఎఫ్సీనుంచి ఇతర ఫైనాన్స్ ఆఫర్లను కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే ఆసక్తికరమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కేటీఎం డీలర్ల వద్ద లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో ప్రారంభించిన కేటీఎం 390 ధర (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) 3.04 లక్షల రూపాయలు. ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉంది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 38,267 యూనిట్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ నెలల్లో 33,220 కేటీఎం బైక్‌ల అమ్మకాలను నమోదు చేసింది. -
బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కల్లోలంతో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్‌లో కోవిడ్ కేసులు తాజాగా 400కు పెరిగాయి. దీంతో కార్మికులు ప్లాంట్‌కు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయాలనే డిమాండ్ ఊపందుకుంది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగినందున, వైరస్ సైకిల్ ను విచ్ఛిన్నం చేయడానికి ఎనిమిది నుంచి 10 రోజులు ప్లాంట్‌లో పని నిలిపివేయాలని కోరుతున్నామని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ తెలిపారు. దీనికి సంబంధించి మళ్ళీ మేనేజ్మెంట్తో చర్చిస్తామనీ, మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదించనున్నామని చెప్పారు. అవసరమైతే ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు గంటలు కేటాయించమని కోరినట్లు వర్కర్స్ యూనియన్ తెలిపింది. అయితే దీనిపై బజాజ్ యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) కాగా ప్రస్తుతం బజాజ్ ఆటోకు 3 ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని వాలూజ్, చకన్ వద్ద రెండు ప్లాంట్లు ఉండగా, ఉత్తరాఖండ్‌లోని పంత్నగర్ వద్ద మరో ప్లాంట్ ఉంది. డిస్కవర్, ప్లాటినా, సిటీ 100, బాక్సర్ 150తో పాటు త్రిచక్ర వాహనాలను కంపెనీ వాలూజ్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. 8,100 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు బజాజ్ ఆటో కార్మికులు ఏడుగురు చనిపోయారు. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్) -
బజాజ్ ఆటో ప్లాంట్‌లో కరోనా కలకలం
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్‌కు చెందిన వలూజ్ ప్లాంట్‌లో 140 కరోనా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని సంస్థ ప్రకటించింది. అయితే కంపెనీ మూసివేత అంచనాలను కంపెనీ తోసిపుచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులలో 2 శాతం మందే ప్రభావితమయ్యారని అవసరమైన భద్రతా చర్యలతో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు . జూన్ 6న మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైందని బజాజ్ ఆటోఅధికారికంగా ప్రకటించింది. 8100 మందికి పైగా ఉన్న ఉద్యోగులలో ఎక్కువమందికి పాజిటివ్ రావడంతో దేశీయ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఔరంగాబాద్‌లోని వలూజ్ కర్మాగారంలో కార్యకలాపాలను మూసివేసిందన్న నివేదికలను సంస్థ ఖండించింది. హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఇతర అనారోగ్యాలు కూడా తోడవ్వడంతో దురదృష్టవశాత్తు ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రవి కైరాన్ రామసామి వివరించారు. ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష, కాంటాక్ట్ ట్రేసింగ్, సెల్ఫ్ క్వారంటైన్, పూర్తి పారిశుద్ధ్యం లాంటి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు వైద్య సహాయంతో సహా అన్ని సహకారాన్ని అందిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. కాగా బజాజ్ ఆటోకు చెందిన అతిపెద్ద తయారీ యూనిట్ వాలూజ్ ప్లాంట్ లో ప్రధానంగా ఎగుమతి కోసం మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు మొదటి దశ దేశ వ్యాప్త లాక్ డౌన్ ను క్రూరమైన చర్యగా రాజీవ్ బజాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. -
మార్కెట్లోకి కొత్త పల్సర్ బైక్
ముంబై: పల్సర్ బైక్స్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ పేరుతో గురువారం బజాజ్ ఆటో మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ బైక్ సింగిల్ సిట్ డ్రమ్ వేరియంట్ కలిగిన అత్యున్నత టెక్నాలజీతో రూపొందించామని సంస్థ తెలిపింది. ఈ బైక్‌లో కొన్ని అదనపు ఫీచర్లు వినిమోగదారులను ఆకర్శిస్తాయని సంస్థ పేర్కొంది. బైక్‌లో రెగ్యులర్ మోడల్ సింగిల్ యూనిట్‌కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పిట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లతో ఈ బైక్ అలరించనుంది. కాగా పల్సర్ 125 బైక్ కలర్ విషయానికి వస్తే బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. అత్యాధునిక ఫీచర్లతో అలరించనున్న పల్సర్ 125 వేరియంట్ బైక్ ధర రూ.79,091గా సంస్థ నిర్ణయించింది. పల్సర్ 125 వేరియంట్ బైక్‌ను వినియోగదారులకు అందించడం పట్ల బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే హర్షం వ్యక్తం చేశారు. సారంగ్ కనడే స్పందిస్తూ.. గత సంవత్సరం విడుదల చేసిన పల్సర్ 125 బైక్ కేవలం ఆరు నెలల్లోనే లక్ష బైకులను కస్టమర్లు కొనుగోలు చేశారని అన్నారు. స్పోర్ట్స్ బైక్‌ను ఇష్టపడే వారికి సరికొత్త స్టైల్, థ్రిల్‌తో ఈ బైక్ అలరిస్తుందని తెలిపారు. చదవండి: బజాజ్ ఆటో కొత్త బైక్ : రూ.38 వేలు -
బజాజ్ ఆటో విక్రయాలు రివర్స్ గేర్
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో విక్రయాలు భారీగా క్షీణించాయి. మే నెలలో ఈ కంపెనీ ఆటో విక్రయాలు 70 శాతం తగ్గి 1,27,128 యూనిట్లుగా నమోదైనట్లు బజాజ్ ఆటో మంగళవారం వెల్లడించింది. గతేడాది మే నెలలో విక్రయాలు 4,19,235 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ విక్రయాలు సైతం గతేడాదితో పోలిస్తే 83 శాతం తగ్గి 2,35,824 యూనిట్ల నుంచి 40,074 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపింది. ఇక ద్విచక్ర వాహనాలు సైతం గతేడాదిలో 3,65,068 యూనిట్లు ఉండగా ఇప్పుడు 69 శాతం 1,12,798 యూనిట్లకు చేరాయి.దేశీయ ద్విచక్రవాహనాలు సైతం 2019తో పోలిస్తే 81 శాతం తగ్గి 39,286 యూనిట్లకు చేరాయి. ఇక వాణిజ్య వాహనాలు సైతం 74శాతం తగ్గి 14,330 యూనిట్లు నమోదవ్వగా, దేశీయ విక్రయాలు 97శాతం పడిపోయాయని బజాజ్ ఆటో వివరించింది.ఎగుమతుల్లో మొత్తం 53 శాతంక్షీణించి 87,054 యూనిట్లకు చేరాయని కంపెనీ పేర్కొంది. -
చేతక్ ఎలక్ట్రిక్ @ రూ. లక్ష
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఒకప్పటి తన ఐకానిక్ స్కూటర్ ‘చేతక్’ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన తరానికి తగిన విధంగా ఈసారి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదలచేసింది. ఈ–స్కూటర్ ప్రారంభ ధర రూ. లక్ష కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలు పోనూ ఇది ఎక్స్–షోరూం ధరని కంపెనీ వివరించింది. అంటే, రోడ్ ట్యాక్స్, బీమా కలపని ధర ఇది. డిస్క్ బ్రేక్‌లు, లగ్జరీ ఫినిషింగ్ కలిగిన ప్రీమియం ఎడిషన్ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ సంక్రాంతి పండుగ రోజే (నేటి నుంచి) ప్రారంభంకానున్నాయి. సంస్థ వెబ్సైట్ ద్వారా ఈ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని, ఇందుకు ఇనీషియల్ అమౌంట్ కింద రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు. మూడేళ్ల వారంటీ..: ఈ–స్కూటర్‌కు ఏడాదికి ఒకసారి లేదంటే.. 12,000 కిలోమీటర్లు తిరిగిన ప్రతిసారీ కనీస నిర్వహణ అవసరమని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు 50,000 కిలోమీటర్ల వరకు లేదంటే, మూడేళ్లు ఏది ముందైతే అది వారంటీగా లభిస్తుంది. లిథియం–అయాన్ బ్యాటరీకి కూడా వారంటీ వర్తిస్తుంది. అతి నియంత్రణ వల్లే రేట్ల పెంపు.. ఏడాదిన్నరలో 30% పెరగనున్న ద్విచక్ర వాహనాల ధరలు బడ్జెట్‌పై పెద్దగా ఆశల్లేవు: బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఏడాదిన్నర వ్యవధిలో ద్విచక్ర వాహనాల ధరలు 30 శాతం మేర పెరగనున్నాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. మార్కెట్లను ’అతిగా నియంత్రించడమే’ ఇందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ఉద్గార నిబంధనల అమలు ప్రభావం తదితర నియంత్రణపరమైన అంశాలను బజాజ్ ఉదహరించారు. చేతక్ స్కూటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంఛనంగా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కొత్తగా భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయాల్సి రానుండటంతో స్టేజ్–4 తో పోలిస్తే రేట్లు మరింత పెంచాల్సి వస్తుందంటూ ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బజాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, విద్యుత్ వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని 5 శాతంగా కేంద్రం నిర్ణయించినప్పటికీ.. కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28 శాతం కొనసాగుతోందని బజాజ్ చెప్పారు. దీన్ని 18 శాతానికైనా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే అంశాలేవీ బడ్జెట్లో ఉంటాయని తానేమీ ఆశించడం లేదని బజాజ్ తెలిపారు. -
భారత్‌లోకి హస్వానా ప్రీమియం బైక్స్
న్యూఢిల్లీ: ఆ్రస్టియా మోటార్ సైకిల్ కంపెనీ కేటీఎమ్ ఉత్పత్తి చేస్తున్న హస్వానా ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్‌ను.. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ బ్రాండ్‌లోని విట్పిలెన్ 250, స్వార్ట్పిలెన్ 250 మోడళ్లను ఇక్కడి మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. అత్యంత శక్తివంతమైన ఈ రెండు మోడళ్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కేటీఎం షోరూంల ద్వారా కొనుగోలు చేయవచ్చని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ వెల్లడించారు. ఇక కేటీఎం ఏజీలో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే కాగా, 1903 నుంచి మార్కెట్లో ఉన్న స్వీడిష్ మోటార్ సైకిల్ బ్రాండ్‌ను తాజాగా భారత బైక్ ప్రియులకు ఇక్కడ పరిచయం చేసింది. -
4 శాతం ఎగిసిన బజాజ్ ఆటో ఆదాయం
సాక్షి,ముంబై : ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో 1012 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గత ఏడాదితో పోలిస్తే 2.84 శాతం క్షీణించినప్పటికీ ఆదాయంలో వృద్ధిని సాదించింది. వార్షిక ప్రాతిపదికన 3.90 శాతం ఎగిసి, రూ.7785 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో బజాజ్ఆటో షేరు 6 శాతం పుంజుకుంది. మొదటి త్రైమాసికంలో 1,247,174 యూనిట్లను విక్రయించినట్లు బజాజ్ ఆటో తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 1,226,641 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 2 శాతం పెరిగాయి. -
బజాజ్ ఆటో కొత్త బైక్ : రూ.38 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ఎంట్రీ లెవల్ మోటారుసైకిల్‌ను లాంచ్ చేసింది. సీటీ 110 లోని సరికొత్త వెర్షన్‌ను సోమవారం తీసుకొచ్చింది. రూ .37,997, రూ .44,480 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ధరల పరిధిలో విడుదల చేసింది. కొత్త సిటి 110 హై గ్రౌండ్ క్లియరెన్స్, స్ట్రాంగ అండ్ బిగ్గర్ క్రాష్ గార్డ్స్‌తో కఠినమైన రహదారుల్లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుందని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. మూడు రంగుల్లో లాంచ్ అయిన ఈ బైక్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. 115 సిసి ఇంజిన్‌తో, 8.6 పిఎస్ శక్తిని అందిస్తుంది. కిక్ స్టార్ట్ వెర్షన్ ధర రూ. 37,997 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్ రూ .44,480 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) బడ్జెట్ ధరలో బెస్ట్ బైక్‌ను అందిచండమే తమ లక్ష్యమని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే వెల్లడించారు. ఎక్కువ మైలేజీ, పవర్ తోపాటు ఆకర్షణీయ ధరలో తీసుకొచ్చిన తమ కొత్త సీటీ 110 వెర్షన్ అత్యుత్తమ పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటుందన్న దీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు (సీటీ శ్రేణి) 50 లక్షల వాహనాలను విక్రయించినట్టు వెల్లడించారు. -
బజాజ్ ఆటో ఫలితాలు భేష్ : నష్టాల్లో షేరు
సాక్షి,ముంబై: దేశీ ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని సాధించింది. క్యూ3 ఫలితాలు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో ద్విచక్ర తయారీదారు బజాజ్ ఆటో నికర లాభం 16 శాతం పుంజుకుని రూ. 1102 కోట్లను నమోదు చేసింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 7409 కోట్లను తాకింది. గత ఏడాది రెవెన్యూ 6387 కోట్ల రూపాయలుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1246 కోట్లకు చేరగా.. ఇతర ఆదాయం రూ. 209 కోట్ల నుంచి రూ. 470 కోట్లకు ఎగసింది. మార్జిన్లు 19.5 శాతం నుంచి 15.6 శాతానికి బలహీనపడ్డాయి. తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నప్పటికీ దలాల స్ట్రీట్‌ను మెప్పించలేకపోయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో బజాజ్ ఆటో షేరు దాదాపు 2 శాతం నష్టపోయింది. అయితే మార్జిన్లు క్షీణించడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
2020లో ఎలక్ట్రిక్ వాహనాల్లోకి బజాజ్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో 2020 నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లోకి ప్రవేశించనుందని ఆ సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈ విభాగం ఆకర్షణీయమైనదిగా చెప్పారాయన. వచ్చే 12 నెలల కాలంలో మార్కెట్ వాటాను 15– 20 శాతం స్థాయి నుంచి 20–25 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. ‘‘రెండేళ్ల కాలంలోనే 10 శాతం మార్కెట్ వాటాను సాధించడం మామూలు విషయం కాదు. ఇది 35 ఏళ్లుగా భారత్‌లో ఉన్న యమహా మార్కెట్ వాటాతో పోలిస్తే మూడు రెట్లు’’ అని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వచ్చే కొన్ని నెలల పాటు సమస్యలుంటాయా? అన్న ప్రశ్నకు... ఆసక్తికరమైన ధోరణులతో ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన బదులిచ్చారు. ఎగుమతులకు సంబంధించి మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని, అయినా 2018 చివరికి కంపెనీ 20 లక్షల యూనిట్లను 70 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు చెప్పారాయన. -
బజాజ్ కేటీఎం 200డ్యూక్..సరికొత్తగా
ప్రముఖ ద్విచక్ర తయారీదారు బజాజ్ ఆటో బజాజ్ బైక్స్‌లో కొత్త వెర్షనను లాంచ్ చేసింది. బజాజ్ ఆటోలో 49శాతం వాటావున్న ఆస్ట్రియన్ బైక్ బ్రాండ్ కేటీఎంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్) ఫీచర్‌తో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2019, ఏప్రిల్ 1 కొత్త ఏబీఎస్ చట్టానికి అనుగుణంగా ఈ మార్పులు చేపట్టింది. కెటిఎమ్ 200 డ్యూక్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త వెర్షన్ 125 సి.సి బైక్ ధర రూ. 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉండనుంది. కొత్తగా జోడించిన ఏబీఎస్ ఫీచర్ మెరుగైన, నియంత్రిత శక్తిని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే నాన్ఏబీఎస్ కేటీఎం200డ్యూక్ వేరియంట్ కూడా రూ.1.51 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 450ప్రత్యేకమైన కేటీఎం దుకాణాల్లో ఈ రెండు వేరియంట్స్ కస్టమర్లకు అందుబాటులోఉన్నాయని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ అమిత్ నంది వెల్లడించారు. -
బజాజ్ ఆటో లాభం 1,257 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం, బజాజ్ ఆటో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 5 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,194 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,257 కోట్లకు పెరిగిందని బజాజ్ ఆటో తెలిపింది. దేశీయంగా అమ్మకాలు బాగా ఉండడం, ఎగుమతులు కూడా పెరగడం వల్ల ఈ స్థాయిలో నికర లాభం సాధించామని వివరించింది. గత క్యూ2లో రూ.6,566 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.7,987 కోట్లకు పెరిగింది. ఎబిటా 3.4 శాతం పెరిగి రూ.1,343 కోట్లకు పెరిగిందని, కానీ ఎబిటా మార్జిన్ 2.9 శాతం క్షీణించి 16.8 శాతానికి తగ్గిందని తెలిపింది. ఇతర ఆదాయం 29 శాతం పెరిగి రూ.382 కోట్లకు పెరిగినా, పన్ను వ్యయాలు 23 శాతం పెరిగి రూ.500 కోట్లకు చేరాయని పేర్కొంది. కంపెనీ ఆదాయం, నికర లాభం విశ్లేషకుల అంచనాలను అందుకోగలిగాయి. కానీ ఎబిటా, ఎబిటా మార్జిన్లు అంచనాలు అందుకోలేకపోయాయి. కాగా ఈ ఏడాది జూన్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.16,889 కోట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. తగ్గిన మార్జిన్... ఈ కంపెనీ ఇప్పటివరకూ 20 శాతం ఎబిటా మార్జిన్ సాధిస్తూ వస్తోంది. కానీ, ఈ క్యూ2లో ఎబిటా మార్జిన్ 16.8 శాతానికి పడిపోయింది. జూన్ క్వార్టర్లో ఈ మార్జిన్ 17.3 శాతంగా ఉంది. ఈ క్యూ2లో ధరలు తగ్గించడం ఎబిటా మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. మొత్తం టూ వీలర్ల అమ్మకాల్లో మూడో వంతు ఉండే సీటీ 100 బైక్ ధరను ఈ కంపెనీ రూ.2,000 వరకూ తగ్గించింది. దీంతో అమ్మకాలు పెరిగినా, మార్జిన్ మాత్రం తగ్గింది. కాగా రానున్న రెండు క్వార్టర్లలో కూడా మార్జిన్ ఇదే రేంజ్లో ఉండొచ్చని కంపెనీ కమర్షియల్ ఆఫీసర్ రాకేశ్ శర్మ అంచనా వేస్తున్నారు. 25 శాతం పెరిగిన వాహన విక్రయాలు... వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 25 శాతం పెరిగాయని బజాజ్ ఆటో తెలిపింది. గత క్యూ2లో 10.71 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 13.39 లక్షలకు ఎగిశాయని పేర్కొంది. మోటార్ బైక్‌ల అమ్మకాలు 23 శాతం వృద్ధితో 11.26 లక్షలకు చేరాయని తెలిపింది. ఎగుమతులు 33 శాతం పెరిగి 5.35 లక్షలకు చేరాయని తెలిపింది. నిర్వహణ మార్జిన్ బలహీనంగా ఉండటం, పన్ను వ్యయాలు అధికం ఉండడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపించడంతో బజాజ్ ఆటో షేర్ బీఎస్ఈలో ఏడాది కనిష్టానికి, రూ.2,460కు పడిపోయింది. చివరకు 4.3 శాతం నష్టంతో రూ.2,475 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన రెండో షేర్ ఇది. ఈడీగా రాకేశ్ శర్మ నియామకం కంపెనీ అదనపు డైరెక్టర్, హోల్–టైమ్ డైరెక్టర్‌గా రాకేశ్ శర్మను బజాజ్ ఆటో కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. ఆయన 2019, జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. -
కేరళ వరదలు : విరాళాన్ని పెంచిన బజాజ్ ఆటో
న్యూఢిల్లీ : కేరళ బాధితుల దయనీయమైన పరిస్థితిని చూసి, ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే విరాళాలు ప్రకటించిన కంపెనీలు కూడా.. మరింత సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో, కేరళకు మరో రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ పలు బజాజ్ ట్రస్ట్‌ల ద్వారా రూ.50 లక్షల రూపాయలను కేరళకు అందించింది. తాజాగా ప్రకటించిన రెండు కోట్ల రూపాయలలో ఒక కోటిని నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధిలో క్రెడిట్ చేయనున్నట్టు పేర్కొంది. మరో కోటి రూపాయలను జానకిదేవి బజాజ్ గ్రామ్ వికాస్ సంస్థ(జేబీజీవీఎస్) ద్వారా సర్వైవల్ కిట్స్ సరఫరాకు ఉపయోగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. జేబీజీవీఎస్.. బజాజ్ ఆటో తరుఫున పలు కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ. వరదల్లో ప్రభావితమైన ప్రాంతాల్లో బేసిక్ స్టార్టప్ కిట్ ద్వారా సుమారు 1000 కుటుంబాలకు సహాయం అందించనుంది. రాష్ట్రంలో ఉన్న డీలర్‌షిప్‌ల ద్వారా కేరళకు తామిచ్చే సపోర్టును మరింత పెంచుతామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(ఇంట్రా-సిటీ బిజినెస్) ఆర్సీ మహేశ్వరి తెలిపారు. బజాజ్ ఆటో అందిస్తున్న సర్వైవల్ కిట్‌లో వాటర్ ఫిల్టర్, బేసిక్ ఐటమ్స్‌తో కిచెన్ సెట్, ప్లాస్టిక్ స్లీపింగ్ మ్యాట్స్, బ్లాంకెట్లు, టవల్స్ వంటివి ఉండనున్నాయి. ఈ కిట్స్‌ను బజాజ్ ఆటో కమర్షియల్ వెహికిల్ డీలర్‌షిప్‌లు, సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్న ఎన్జీవోల ద్వారా సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇతర ఆటోమొబైల్ సంస్థలు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, టీవీఎస్ మోటార్ కంపెనీలు రెండు కోటి చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాయి. టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియా, బీఎండబ్ల్యూలు కస్టమర్లకు సర్వీస్ సపోర్టు ఇస్తున్నాయి. -
బజాజ్ ఆటో... లాభం రూ.1,042 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,042 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండటంతో క్యూ1లో ఈ స్థాయి లాభం సాధించామని పేర్కొంది. గత క్యూ1లో రూ.5,740 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ క్యూ1లో రూ.7,267 కోట్లకు పెరిగాయి. గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినందున ఈ అమ్మకాల గణాంకాలను పోల్చడానికి లేదని వెల్లడించింది. అంచనాలు మిస్... కంపెనీ స్టాండెలోన్ నికర లాభం 21% వృద్ధితో రూ.1,115 కోట్లకు చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 11% తగ్గింది. అంతకు ముందటి క్వార్టర్ (గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో) ఈ కంపెనీ రూ.1,175 కోట్ల నికర లాభం సాధించింది. మరోవైపు కంపెనీ లాభం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కంపెనీ రూ.6,359 కోట్ల మొత్తం ఆదాయం, రూ.1,261 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. అమ్మకాలు 38 శాతం అప్.. మొత్తం వాహన విక్రయాలు 38 శాతం వృద్ధి చెందాయి. గత క్యూ1లో 8.88 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ1లో 12.26 లక్షలకు పెరిగాయి. మొత్తం మోటార్ బైక్‌ల అమ్మకాలు 7.75 లక్షల నుంచి 33 శాతం వృద్ధితో 10.29 లక్షలకు పెరిగాయని, వీటిల్లో దేశీయ అమ్మకాలు 39 శాతం, ఎగుమతులు 25 శాతం చొప్పున వృద్ధి చెందాయని కంపెనీ వివరించింది. వాణిజ్య వాహనాల దేశీయ విక్రయాలు 52,347 నుంచి 80 శాతం వృద్ధితో 94,431కు పెరిగాయి. 9 శాతం పతనమైన షేర్ ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో బజాజ్ ఆటో షేర్ 9% పతనమై రూ.2,841 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 9.4% నష్టం తో రూ.2,820ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. షేర్ ధర భారీగా పతనం కావడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,862 కోట్లు క్షీణించి రూ.82,212 కోట్లకు తగ్గింది. -
బజాజ్ ఆటో క్యూ4 లాభం రూ.1,175 కోట్లు
న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం, బజాజ్ ఆటో 2017–18 నాలుగో క్వార్టర్లో రూ.1,175 కోట్ల నికర లాభం సాధించింది. 2016–17 ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.862 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. అన్ని సెగ్మెంట్లలో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించినట్లు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,213 కోట్ల నుంచి రూ.6,773 కోట్లకు పెరిగింది. మొత్తం అమ్మకాలు 7.88 లక్షల నుంచి 10.45 లక్షలకు పెరిగాయి. మోటార్‌బైక్‌ల విక్రయాలు 7 లక్షల నుంచి 22 శాతం వృద్ధితో 8.5 లక్షలకు ఎగిశాయి. ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.25,563 కోట్లు పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.4,079 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,219 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.23,088 కోట్ల నుంచి రూ.25,563 కోట్లకు చేరుకుంది. మొత్తం వాహన విక్రయాలు 36.65 లక్షల నుంచి 33 శాతం వృద్ధితో 40 లక్షలకు పెరిగాయని, మోటార్ బైక్‌ల అమ్మకాలు 32.19 లక్షల నుంచి 5 శాతం వృద్ధితో 33.7 లక్షలకు చేరిందని కంపెనీ తెలియజేసింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ షేర్ మంచి లాభాలు సాధించినప్పటికీ, చివరకు 1.4 శాతం నష్టంతో రూ.2,778 వద్ద ముగిసింది. గురువారం రూ.2,819 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం రూ.2,701, రూ.2,942 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. -
బజాజ్ కొత్త పల్సర్ ...విత్ ట్విన్ డిస్క్స్
సాక్షి, న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కొత్త పల్సర్ వాహనాన్ని లాంచ్ చేసింది. పాత మోడల్‌ను అప్డేట్ చేసి పల్సర్ 150 పేరుతో మార్కెట్లో రిలీజ్ చేసింది. కొత్త డిస్క్ బ్రేక్స్, కొత్త రంగు, డిజైన్‌తో ప్రారంభించిన ఈ కొత్త వేరియంట్ షార్ప్ అండ్ స్పోర్టియర్ స్టైలింగ్ ను అందించింది. ప్రీమియం 150 స్పోర్ట్స్ విభాగంలో ఈ బైక్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఒక డిస్క్ వేరియంట్‌కు బదులు ట్విన్-డిస్క్ వేరియంట్ అందుబాటులో ఉంచిన దీన బైక్ ధర రూ .78,016, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. స్ప్లిట్ సీట్స్, లాంగర్ వీల్స్, వెడల్పైన్ పెద్ద టైర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కొత్త వేరియంట్లో 149.5సీసీ ఇంజీన్, 14 పిఎస్ పవర్, 13.4 ఎన్ఎమ్ టార్క్ ఇతర ఫీచర్లు. బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్ , బ్లాక్ క్రోమ్ రంగులలో అందుబాటులో ఉంటుంది. -
బజాజ్ ఆటో లాభం1,013 కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,013 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.977 కోట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,354 కోట్ల నుంచి రూ.6,369 కోట్లకు పెరిగినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్ అండ్ అష్యూరెన్స్) ఎస్.రవికుమార్ తెలిపారు. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైకు షేర్..: గత నెల విక్రయాలు బాగా ఉండటంతో ఫలితాలు కూడా బాగుంటాయనే అంచనాలతో బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.3,473ను తాకింది. అయితే ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో చివరకు 5 శాతం క్షీణించి రూ.3,243 వద్ద ముగిసింది. బీఎస్ఈ లాభం 11 శాతం అప్... ముంబై: బాంబే స్టాక్ ఎక్సే్చంజ్(బీఎస్ఈ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 11 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.53 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.59 కోట్లకు పెరిగిందని బీఎస్ఈ తెలిపింది. ఆదాయం రూ.86 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.126 కోట్లకు పెరిగిందని బీఎస్ఈ ఎమ్డీ, సీఈఓ అశీష్కుమార్ చౌహాన్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో బీఎస్ఈ షేర్ 2.4 శాతం నష్టపోయి రూ.849 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి రూ.842ను తాకింది. పోకర్ణ నికరలాభం రూ.14 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ నికరలాభం రూ.18.6 కోట్ల నుంచి రూ.14 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.93 కోట్ల నుంచి రూ.89 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.245 కోట్ల టర్నోవరుపై రూ.33 కోట్ల నికరలాభం పొందింది. గాయత్రి షుగర్స్‌కు లాభం.. డిసెంబరు క్వార్టరులో గాయత్రి షుగర్స్ రూ.4.7 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2.6 కోట్ల నికర నష్టం వాటిల్లింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో రూ.99 కోట్ల టర్నోవరుపై రూ.20 కోట్ల నికర నష్టం చవిచూసింది. రెండింతలైన తాజ్ జీవీకే లాభం.. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో తాజ్ జీవీకే హోటల్స్, రిసార్ట్స్ నికరలాభం రెండింతలపైగా పెరిగి రూ.9 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.72 కోట్ల నుంచి రూ.83 కోట్లను తాకింది. ఏప్రిల్–డిసెంబరు మధ్య రూ.205 కోట్ల టర్నోవరుపై రూ.14 కోట్ల నికర లాభం పొందింది. తగ్గిన న్యూలాండ్ లాభం.. డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ నికరలాభం రూ.3.6 కోట్ల నుంచి రూ.1.2 కోట్లకు పడిపోయింది. టర్నోవరు రూ.135 కోట్ల నుంచి రూ.117 కోట్లకు వచ్చి చేరింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో రూ.363 కోట్ల టర్నోవరుపై రూ.6 కోట్ల నికరలాభం నమోదైంది. సింఫనీ లాభం 21 శాతం అప్ హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎయిర్ కూలర్స్ తయారీ సంస్థ సింఫనీ నికర లాభం 21 శాతం పెరిగి రూ. 66 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో లాభం రూ. 55 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 21 శాతం పెరిగి రూ. 180 కోట్ల నుంచి రూ. 217 కోట్లకు చేరింది. రూ. 2 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి 50 శాతం (రూ.1) చొప్పున మూడో మధ్యతర డివిడెండు కింద చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది.