
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ (83) శనివారం రోజున పుణేలో మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో 12 ఫిబ్రవరి, 2022 మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. భారతీయ కార్పొరేట్ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు రాహుల్ బజాజ్. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా ఆయన పనిచేశారు.
నితిన్ గడ్కరీ సంతాపం..!
గత ఐదు దశాబ్దాలుగా బజాజ్ గ్రూప్‌కు నాయకత్వం వహించిన రాహుల్‌జీ పరిశ్రమలో కీలకపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని కేంద్ర రోడ్డు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్‌లో స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment