రోజువారీ వినియోగానికి లేదా ఎక్కువ మైలేజ్ కావాలని కోరుకునేవారు బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ వంటి బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇవి రెండూ.. సింపుల్ డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఈ కథనంలో ఈ రెండు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.
బజాజ్ ఆటో లాంచ్ చేసే బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ప్లాటినా 100 కూడా ఉంది. ఇందులో 102 సీసీ ఫోర్ స్ట్రోక్ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 పీఎస్ పవర్, 8.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 90 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.
హోండా షైన్ విషయానికి వస్తే.. ఇది 123.94 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.74 పీఎస్ పవర్, 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.
ఇదీ చదవండి: హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?
డిజైన్, ఫీచర్స్ పరంగా బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్.. రెండూ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర బైకులతో పోలిస్తే.. ఈ రెండు బైకులు మంచి మైలేజ్ అందించడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ధరలు రూ. 68,685 కాగా.. హోండా షైన్ ధర రూ. 84151 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా).
Comments
Please login to add a commentAdd a comment