భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 వేదికగా హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన 'యాక్టివా ఈ' స్కూటర్ లాంచ్ చేసింది. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఈ-యాక్సెస్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఇది త్వరలోనే దేశీయ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా ఏంటి?.. రేంజ్ ఎంత, బ్యాటరీ కెపాసిటీ ఏమిటనే వివరాలను వివరంగా తెలుసుకుందాం.
ఫీచర్స్
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, రివర్స్ మోడ్, ఆటో బ్రైట్‌నెస్ అడ్జస్టేబుల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్మార్ట్ కీ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. యాక్టివా ఈ స్కూటర్ టచ్‌స్క్రీన్ కూడా పొందుతుంది. దీని ద్వారా రైడర్ బ్యాటరీ స్టేటస్, టైమ్ మొదలైనవన్నీ తెలుసుకోవచ్చు.
సుజుకి ఈ యాక్సెస్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT క్లస్టర్ పొందుతుంది. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్ పొందవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ అలర్ట్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ కీ కూడా లభిస్తుంది.
బ్యాటరీ, రేంజ్ & పర్ఫామెన్స్
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 కిలోవాట్ కెపాసిటీ కలిగిన రెండు రిమూవబుల్ బ్యాటరీలు పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌పై 102 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 3.07 కిలోవాట్ లిథియం ఐరన్ బ్యాటరీ ద్వారా.. 95 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
పర్ఫమెన్స్ విషయానికి వస్తే.. యాక్టివా ఈ స్కూటర్ 6 kW పవర్, 22 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. కాగా .. ఇది ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 4.1 kW పవర్, 15 Nm టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 71 కిమీ. ఇది కూడా మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment