Suzuki Motorcycl
-
25 సంవత్సరాల చరిత్రకు నిదర్శనం ఈ బైక్ - ధర ఎంతంటే?
Suzuki Hayabusa Anniversary Edition: సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా' (Hayabusa) అని అందరికి తెలుసు. అయితే సంస్థ ఇప్పుడు ఇందులో ఒక కొత్త ఎడిషన్ విడుదల చేయడానికి సర్వత్రా సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో 25 సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్న హయబుసా గుర్తుగా కంపెనీ 25వ యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేయడానికి తయారైంది. ఇందులో భాగంగానే హమామట్సు (Hamamatsu) ఆధారిత మార్క్యూ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించింది. సంస్థ ఈ బైక్ అమ్మకాలను ఈ నెల నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది. దేశీయ విఫణిలో అందుబాటులోకి రానున్న కొత్త హయాబుసా స్పెషల్ ఎడిషన్ ఆరెంజ్/బ్లాక్ పెయింట్, డ్రైవ్ చైన్ అడ్జస్టర్ వంటి బిట్ల కోసం ప్రత్యేకమైన యానోడైజ్డ్ గోల్డ్ కలర్ పొందుతుంది. కంజి లోగో, ట్యాంక్ మీద త్రీ-డైమెన్షనల్ సుజుకి లోగో వంటివి చూడవచ్చు. సింగిల్ సీట్ కౌల్ ప్రామాణికంగా లభిస్తుంది. సుజుకి హయాబుసా పవర్‌ట్రెయిన్ & ఎలక్ట్రానిక్స్ హయబుసా స్పెషల్ ఎడిషన్ అదే లిక్విడ్ కూల్డ్ 1340సీసీ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి 190 hp పవర్, 150 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో లభిస్తుంది. రైడింగ్ మోడ్లు, పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) అంచనా ధర & ప్రత్యర్థులు సుజుకి హయబుసా యానివెర్సరీ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విక్రయానికి రానుంది. భారతీయ మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు, సాధారణ హయబుసా ధర రూ. 16.90 లక్షలు, కావున స్పెషల్ ఎడిషన్ ధర అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం!
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. వెహికల్స్‌పై ఉన్న మక్కువతో ఓ యూట్యూబర్ పెట్రో వెహికల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ట్రయల్స్ కూడా చేశాడు. గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా పెట్రోల్,డీజిల్ వెహికల్స్ ఉపయోగించి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అందుకే వాహన దారులు పెట్రో వెహికల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈవీ వెహికల్స్ ధర ఎక్కువగా ఉందని భావించిన ఓ యూట్యూబర్ తన పెట్రో వెహికల్.. ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాల రూ.18,500. దాన్ని ఒక్కసారి చేస్తే 200కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అలా అని బైక్‌ను నాసిరకంగా ఈవీ బైక్‌గా మార్చాడనుకుంటే పొరబడినట్లే. యూనిక్‌గా ఈవీ వెహికల్స్‌ను ఎలా తయారు చేస్తారో ఈవీ బైక్‌ను అలాగే డెవలప్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. సుజికీ ఏఎక్స్ 100 పెట్రోల్ బైక్ సుజికీ ఏఎక్స్ 100ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఈ బైక్‌ను లిథియం అయాన్ బ్యాటరీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. కంట్రోలర్, కేబుల్స్, ఎల్ఈడీ టైల్ టైల్స్,టర్న్ ఇండికేటర్స్, వెహికల్స్ ప్రారంభ స్పీడ్ 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా లైటర్ వీల్స్, సింగిల్ సీట్ డిజైన్..అవసరం అనుకుంటే రెండు సీట్లను అమర్చుకోవచ్చు. ఇక ఆర్ఎక్స్ 100 కేఫ్ రేసర్ లుక్‌తో అదరగొట్టేస్తుంది. ప్యాషన్‌తో చేసిందే ఈ బైక్ ఈవీ బైక్‌ను ఎవరు తయారు చేశారనే విషయాలు తెలియాల్సి ఉండగా..ఈ బైక్‌ను నడిపేందుకు ఆర్టీవో, ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మీషన్ కోసం అప్లయ్ చేసినట్లు తెలిపాడు. ప్యాషన్‌తో చేసిందే తప్పా డబ్బులు కోసం కాదని, ఈ బైక్ తయారు చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం జీఎస్టీతో కలుపుకొని రూ.18,500 అని సదరు యూట్యూబర్ వీడియోలో తెలిపాడు. చదవండి: Ola Electric: పాపం..అంచనా తలకిందులైందే? ఈవీ వెహికల్స్ తయారీ నిలిపేసిన ఓలా! -
సుజుకి యాక్సెస్... లిమిటెడ్ ఎడిషన్
ముంబై: సుజుకి మోటార్‌సైకిల్స్ యాక్సెస్ స్కూటర్ మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెస్తోంది. ఈ స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని సుజుకి మోటార్‌సైకిల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. ఈ స్కూటర్ ధరను రూ.58,978గా నిర్ణయించామని పేర్కొన్నారు. ఇప్పటికే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారని, తాజా ఒప్పందం దీనికి కొనసాగింపని చెప్పారు. ఒప్పందంలో భాగంగా బీయింగ్ హ్యూమన్ దుస్తులు, వస్తువులను సుజుకి డీలర్లు విక్రయిస్తారని తెలిపారు. వీటి విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. సుజుకి భాగస్వామ్యంతో బీయింగ్ హ్యూమ న్ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత మవుతాయని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.