ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. వెహికల్స్‌పై ఉన్న మక్కువతో ఓ యూట్యూబర్ పెట్రో వెహికల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ట్రయల్స్ కూడా చేశాడు.
గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా పెట్రోల్,డీజిల్ వెహికల్స్ ఉపయోగించి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అందుకే వాహన దారులు పెట్రో వెహికల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు.
ఈ తరుణంలో ఈవీ వెహికల్స్ ధర ఎక్కువగా ఉందని భావించిన ఓ యూట్యూబర్ తన పెట్రో వెహికల్.. ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాల రూ.18,500. దాన్ని ఒక్కసారి చేస్తే 200కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అలా అని బైక్‌ను నాసిరకంగా ఈవీ బైక్‌గా మార్చాడనుకుంటే పొరబడినట్లే. యూనిక్‌గా ఈవీ వెహికల్స్‌ను ఎలా తయారు చేస్తారో ఈవీ బైక్‌ను అలాగే డెవలప్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
సుజికీ ఏఎక్స్ 100
పెట్రోల్ బైక్ సుజికీ ఏఎక్స్ 100ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఈ బైక్‌ను లిథియం అయాన్ బ్యాటరీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. కంట్రోలర్, కేబుల్స్, ఎల్‌ఈడీ టైల్ టైల్స్,టర్న్ ఇండికేటర్స్, వెహికల్స్ ప్రారంభ స్పీడ్ 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా లైటర్ వీల్స్, సింగిల్ సీట్ డిజైన్..అవసరం అనుకుంటే రెండు సీట్లను అమర్చుకోవచ్చు. ఇక ఆర్‌ఎక్స్ 100 కేఫ్ రేసర్ లుక్‌తో అదరగొట్టేస్తుంది.
ప్యాషన్‌తో చేసిందే ఈ బైక్
ఈవీ బైక్‌ను ఎవరు తయారు చేశారనే విషయాలు తెలియాల్సి ఉండగా..ఈ బైక్‌ను నడిపేందుకు ఆర్టీవో, ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మీషన్ కోసం అప్లయ్ చేసినట్లు తెలిపాడు. ప్యాషన్‌తో చేసిందే తప్పా డబ్బులు కోసం కాదని, ఈ బైక్ తయారు చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం జీఎస్టీతో కలుపుకొని రూ.18,500 అని సదరు యూట్యూబర్ వీడియోలో తెలిపాడు.
చదవండి: Ola Electric: పాపం..అంచనా తలకిందులైందే? ఈవీ వెహికల్స్ తయారీ నిలిపేసిన ఓలా!
Comments
Please login to add a commentAdd a comment