automobile manufacturers
-
2024లో ఆటో విడిభాగాల జోరు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజాగా అంచనాలు వెలువడ్డాయి. ఇందుకు దేశ, విదేశీ మార్కెట్ల నుంచి ఊపందుకోనున్న డిమాండు దోహదపడనున్నట్లు ఆటోమోటివ్ విడిభాగాల తయారీ అసోసియేషన్(ఏసీఎంఏ) పేర్కొంది. యూఎస్, యూరప్ తదితర ప్రధాన మార్కెట్లలో ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలున్నప్పటికీ దేశీ ఆటో విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 23 శాతం ఎగసింది. 56.5 బిలియన్ డాలర్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ బాటలో మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 15 శాతం పుంజుకోగలదని ఏసీఎంఏ అంచనా వేసింది. ఐసీఈ ఎఫెక్ట్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్స్(ఐసీఈ) తయారీలో వినియోగించే ఆటో విడిభాగాల కోసం ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. యూఎస్, యూరప్ తదితర పశ్చిమ దేశాల మార్కెట్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లుతుండటం ప్రభావం చూపుతోంది. దీంతో దేశీ విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనుంది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(2022 మార్చి– డిసెంబర్) ఎగుమతులు, దిగుమతులు బ్యాలన్స్డ్గా 15.1 బిలియన్ డాలర్ల చొప్పున నమోదైనట్లు పారిశ్రామిక సమాఖ్య ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఏసీఎంఏ డైరెక్టర్ విన్నీ మెహతా వెల్లడించారు. పశ్చిమ దేశాలలో ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీ ఆటో విడిభాగాల ఎగుమతులు అంచనాలకు అనుగుణంగా పుంజుకోనున్నట్లు అంచనా వేశారు. ఎగుమతుల్లో ఎలాంటి మందగమన పరిస్థితులనూ గమనించలేదని తెలియజేశారు. దేశీ ఆటో మార్కెట్ అత్యంత పటిష్టంగా ఉన్న కారణంగా దిగుమతుల్లో సైతం వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు. వృద్ధి కొనసాగుతుంది ఏడాది కాలంగా పలువురు ప్రస్తావిస్తున్నట్లు యూఎస్ తదితర ప్రధాన మార్కెట్లలో ఎలాంటి మాంద్య పరిస్థితుల సంకేతాలూ కనిపించలేదని ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ పేర్కొన్నా రు. నిజానికి ఆటో విడిభాగాల పరిశ్రమ వృద్ధి బాటలోనే పయనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ నుంచి లభించిన వివరాల ప్రకారం జనవరిలోనూ పటిష్ట అమ్మకాలు నమోదుకాగా.. ఇకపైన కూడా ఈ జోరు కొనసాగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. వృద్ధిరీత్యా దేశీ మార్కెట్ అత్యంత సానుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతు ల్లో బలహీనతలున్నప్పటికీ దేశీ డిమాండ్ ఆదుకోగలదని అంచనా వేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీలవైపు ప్రయాణించడంలో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనున్నట్లు వివరించారు. ఈవీల కారణంగా ఐసీఈ విభాగంలో డిజైన్, డెవలప్మెంట్ కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో దేశీ విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు తెలియజేశారు. -
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. యూరప్ దేశాల్లో అమ్మకాలకు సర్వం సిద్ధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏడాదిలో యూరప్‌లో అడుగుపెట్టబోతోంది. బజాజ్ ఆటో భాగస్వామి అయిన స్పోర్ట్స్ బైక్స్ త యారీ దిగ్గజం కేటీఎం ఈ స్కూటర్లను విక్రయించనుంది. 2019లో ఎలక్ట్రిక్ రూపంలో రీఎంట్రీ ఇచ్చిన చేతక్ ఇప్పటి వరకు దేశంలో 24,000 యూ నిట్లు రోడ్డెక్కాయి.ప్రస్తుతం 40 నగరాల్లో మాత్రమే ఈ వాహనాన్ని కంపెనీ విక్రయిస్తోంది. 1972లో చేతక్ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కింది. 2006 నుంచి చేతక్ స్కూటర్ల తయారీని బజాజ్ నిలిపివేసి బైక్స్‌పైనే పూర్తిగా దృష్టిసారింది. కాగా, కేటీఎం తాజాగా చకన్ ప్లాంటులో 10 లక్షల బైక్‌ల తయారీని పూర్తి చేసింది. 2011లో ఈ ప్లాంటు నుంచి కేటీఎం తొలి బైక్ బయటకు వచ్చింది. 5 లక్షల యూనిట్లు దేశీయంగా అమ్ముడయ్యాయి. మరో 5 లక్షల యూని ట్లు భారత్ నుంచి 70 దేశాలకు ఎగుమతి అయ్యా యి. ప్రీమియం మోటార్‌బైక్ బ్రాండ్‌గా ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచినట్టు కేటీఎం ప్రకటించింది. -
సీఎన్జీ వేరియంట్, అదిరిపోయే లుక్‌తో ఎస్యూవీ గ్రాండ్ విటారా విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మధ్యస్థాయి ఎస్యూవీ గ్రాండ్ విటారా మోడల్లో రెండు రకాల సీఎన్జీ వేరియంట్లను పరిచయం చేసింది. ధర రూ.12.85 లక్షల నుంచి ప్రారంభం. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 26.6 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ధర వేరియంట్‌ను బట్టి రూ.10.45–19.49 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ శ్రేణిలో గ్రాండ్ విటారాతో కలిపి మొత్తం 14 మోడళ్లు ఉన్నాయని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలో నెల ఫీజు రూ.30,723 మొదలుకుని ఈ కారును సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎన్‌ఈబీపీ టెండర్లు
న్యూఢిల్లీ: జాతీయ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (ఎన్‌ఈబీపీ) కింద తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,465 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రభుత్వ రంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎస్ఎల్) ఏకీకృత టెండర్లు ఆహ్వానించింది. ఇందులో డీజిల్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయం 29 శాతం తక్కువగా ఉండే విధంగా టెండర్లు దాఖలైనట్లు సీఈఎస్ఎల్ తెలిపింది. 12 మీటర్ల బస్సు (ఇంట్రా–సిటీ)ల నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ. 54.3గాను, 12 మీటర్ల ఇంటర్సిటీ బస్సుకి కిలోమీటరుకు రూ. 39.8/కి.మీ.గాను బిడ్లు వచ్చాయి. అలా గే, 9 మీటర్ల బస్సుకు రూ. 54.46, 7 మీటర్ల బస్సుకు రూ. 61.92 వ్యయం ఉండేలా బిడ్లు వచ్చినట్లు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య తెలిపారు. ఎలక్ట్రిక్ విధానంలో ప్రజా రవాణా బస్సులను ప్రభుత్వ రవాణా సంస్థలు (ఎస్టీయూ) ఒక సర్వీసుగా ఉపయోగించుకుని, నిర్దిష్ట ఫీజులను చెల్లించే విధంగా ఎన్‌ఈబీపీని రూపొందించారు. దీని ప్రకారం ప్రైవేట్ ఆపరేటరు బస్సులను 10–12 ఏళ్ల పాటు నడిపిస్తారు. బస్సు సర్వీసు పొందినందుకు గాను ఎస్టీయూలు ఫీజులను చెల్లిస్తాయి. -
అంచనాలను మించి పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాలు, వాహన విడిభాగాల తయారీ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం జోష్ నింపింది. వచ్చే అయిదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా.. ఏకంగా రూ.67,690 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రావడం విశేషం. పీఎల్ఐ పథకం కింద మొత్తం 115 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం, మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 23న ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో 85 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో చాంపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 18 సంస్థలు, కంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 67 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు విభాగాల్లోనూ రెండు కంపెనీలు ఎంపికైనట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీ కంపెనీలు సైతం.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఎంపికైన కంపెనీల జాబితాలో భారత్‌తోపాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూఎస్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, నెదర్లాండ్స్ కంపెనీలు ఉండడం గమనార్హం. అంచనాలను మించి పెట్టుబడి ప్రతిపాదనలు రావడం ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా భారత పురోగతికి నిదర్శనమని ప్రభుత్వం తెలిపింది. ఆత్మనిర్భర్ ప్రణాళికలో భాగంగా భారతీయ తయారీదార్లను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల పెంపు, భారత్‌ను ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
బ్రేక్‌లో సమస్యలు..మారుతీ సుజుకీ వాహనదారులకు అలెర్ట్
మారుతీ సుజుకీ వాహనదారులకు అలెర్ట్. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన వేగనార్, సెలెరియో, ఇగ్నిస్ వేరియంట్ కార్లలో రేర్ బ్రేక్ అసెంబ్లీ పిన్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దాదాపు 9,925 కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. బ్రేక్ అసెంబ్లీ పిన్ విరిగిపోయి సౌండ్ వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఒక్కోసారి వాహనదారులు ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. పైన తెలిపిన తేదీల్లో తయారు చేసిన కార్లను గుర్తించి, లోపాల్ని సరిచేస్తామని మారుతీ సుజుకీ ప్రతినిధులు చెప్పారు. ఇందుకోసం వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
బీపీసీఎల్.. ఈవీ రూట్
బెంగళూరు: ఇంధన రంగంలో ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఈవీ బాట పట్టింది. దేశవ్యాప్తంగా 7,000 రిటైల్ ఔట్లెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు–చెన్నై, బెంగళూరు–మైసూరు–కూర్గ్ హైవే మార్గాల్లో ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను తాజాగా ప్రారంభించింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ అన్ని ముఖ్య జాతీయ రహదారులపై నిర్ధేశిత దూరంలో రిటైల్ కేంద్రాల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలన్నది బీపీసీఎల్ ఆలోచన. -
‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెటైర్లు’
కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లగ్జరీ కార్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. దేశీయంగా ఎక్కువ కార్లను తయార చేయాలని, అదే సమయంలో కొనుగోలు దారుల స్థోమతకు తగ్గట్లు వాటి ధరల్ని తగ్గించాలని కోరారు. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ పూణే జిల్లాలోని చకాన్ అనే పట్టణంలో కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఆ కార్ల తయారీ యూనిట్లో ఉత్పత్తి చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఈక్యూఎస్ 580 4మేటిక్’ ను నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మెర్సిడెస్ సంస్థ కార్ల ఉత్పత్తిని పెంచితే వాటి ధరల్ని తగ్గించే అవకాశం ఉంది. మేం మధ్య తరగతి ప్రజలం, కార్ల ధరల్ని తగ్గించినప్పటికీ.. నేను మీ కార్లను కొనలేని’ నితిన్ గడ్కరీ అన్నారు. అంతకు ముందు నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పేద ప్రజలున్న ధనిక దేశం భారత్ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయ మయ్యాయి. పేద ప్రజలున్న ధనిక దేశం నాగపూర్‌లో భారత్ వికాస్ పరిషత్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ప్రపంచంలోనే మన దేశం అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించి ధనిక దేశంగా నిలిచింది. కానీ ప్రజలు మాత్రం ఇంకా పేదలుగానే ఉన్నారు. వాళ్లంతా ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరాని తనం , ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. చదవండి👉 కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు..తగ్గే ప్రసక్తే లేదు -
ఎస్‌యూవీల్లోకి హోండా రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్‌యూవీలైన సీఆర్–వి, బీఆర్–వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్–వి, జాజ్ ఎస్‌యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్‌తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ధర ప్రాధాన్యత కాదు.. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో హైదరాబాద్ విభిన్న మార్కెట్. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 50,000 యూనిట్లు.. దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్–1 ర్యాంక్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు. -
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల అభిమానులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ ప్రారంభించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ ఈ విషయాలు తెలిపారు. ఈవీలను ప్రస్తుత ప్లాంట్లలోనే తయారు చేస్తారా లేక ప్రత్యేకంగా కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘మేం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం వివిధ రాష్ట్రాలు ఎంత మేర సబ్సిడీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించుకుని, తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, ప్లాంటు ఏర్పాటుకు సబ్సిడీ మాత్రమే ప్రాతిపదిక కాబోదని, వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు తదితర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని జెజూరికర్ తెలిపారు. ‘అసలు ఆటోమోటివ్ వ్యవస్థ అనేదే లేని ప్రాంతానికి వెళ్లాము. అది ఆటోమోటివ్ హబ్ అయి ఉండాలి. వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు ఉండి, ఈవీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెడుతున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. మేము మూడు–నాలుగు అవకాశాలను మదింపు చేసి, తగు నిర్ణయం తీసుకుంటాము’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) ఎగుమతులపై స్పందిస్తూ.. ఇంకా ఏయే మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నది నిర్ణయం తీసుకోలేదని రాజేశ్ చెప్పారు. ఎంఅండ్ఎం ఇటీవలే ఎక్స్‌యూవీ, బీఈ బ్రాండ్ కింద అయిదు ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్‌ను ప్రదర్శించింది. 2024–2026 మధ్యలో నాలుగు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సంప్రదాయ ఇంధనాలతో పనిచేసే వాహనాల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
స్కోడా ఎస్యూవీ బుకింగ్స్ షురూ..ప్రైస్ ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా ఎస్యూవీ కొడియాక్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. జనవరి–మార్చిలో డెలివరీలు ఉంటాయని కంపెనీ బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.37.49 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కొడియాక్ బుకింగ్స్‌ను కంపెనీ జనవరిలో ప్రారంభించింది. -
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం!
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. వెహికల్స్‌పై ఉన్న మక్కువతో ఓ యూట్యూబర్ పెట్రో వెహికల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ట్రయల్స్ కూడా చేశాడు. గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా పెట్రోల్,డీజిల్ వెహికల్స్ ఉపయోగించి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అందుకే వాహన దారులు పెట్రో వెహికల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈవీ వెహికల్స్ ధర ఎక్కువగా ఉందని భావించిన ఓ యూట్యూబర్ తన పెట్రో వెహికల్.. ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాల రూ.18,500. దాన్ని ఒక్కసారి చేస్తే 200కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అలా అని బైక్‌ను నాసిరకంగా ఈవీ బైక్‌గా మార్చాడనుకుంటే పొరబడినట్లే. యూనిక్‌గా ఈవీ వెహికల్స్‌ను ఎలా తయారు చేస్తారో ఈవీ బైక్‌ను అలాగే డెవలప్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. సుజికీ ఏఎక్స్ 100 పెట్రోల్ బైక్ సుజికీ ఏఎక్స్ 100ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఈ బైక్‌ను లిథియం అయాన్ బ్యాటరీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. కంట్రోలర్, కేబుల్స్, ఎల్ఈడీ టైల్ టైల్స్,టర్న్ ఇండికేటర్స్, వెహికల్స్ ప్రారంభ స్పీడ్ 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా లైటర్ వీల్స్, సింగిల్ సీట్ డిజైన్..అవసరం అనుకుంటే రెండు సీట్లను అమర్చుకోవచ్చు. ఇక ఆర్ఎక్స్ 100 కేఫ్ రేసర్ లుక్‌తో అదరగొట్టేస్తుంది. ప్యాషన్‌తో చేసిందే ఈ బైక్ ఈవీ బైక్‌ను ఎవరు తయారు చేశారనే విషయాలు తెలియాల్సి ఉండగా..ఈ బైక్‌ను నడిపేందుకు ఆర్టీవో, ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మీషన్ కోసం అప్లయ్ చేసినట్లు తెలిపాడు. ప్యాషన్‌తో చేసిందే తప్పా డబ్బులు కోసం కాదని, ఈ బైక్ తయారు చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం జీఎస్టీతో కలుపుకొని రూ.18,500 అని సదరు యూట్యూబర్ వీడియోలో తెలిపాడు. చదవండి: Ola Electric: పాపం..అంచనా తలకిందులైందే? ఈవీ వెహికల్స్ తయారీ నిలిపేసిన ఓలా! -
విడుదలైన పియాజియో ఆపే నెక్ట్స్‌ప్లస్, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న ఇటలీ సంస్థ పియాజియో భారత మార్కెట్లో ప్యాసింజర్ విభాగంలో ఆపే నెక్ట్స్ ప్లస్ త్రిచక్ర వాహనం ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో ఎక్స్‌షోరూం ధర రూ.2.35 లక్షలు. పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ వేరియంట్లలో ఈ మోడల్‌ను రూపొందించారు. సీఎన్జీ వేరియంట్ కేజీకి 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ట్యూబ్‌లెస్ టైర్స్, విశాలమైన కూర్చునే స్థలం, డ్యూయల్ టోన్ సీట్స్, పారదర్శక కిటికీలు వంటి హంగులు ఉన్నాయి. కంపెనీ విక్రయిస్తున్న మోత్తం యూనిట్లలో సీఎన్జీ వాటా ఏకంగా 50 శాతముంది. డీజిల్ మోడళ్లకు మహమ్మారి ముందస్తు స్థాయిలో 20 శాతం లోపే డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 3,551 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించింది. కంపెనీకి ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలు నమోదైన రెండవ త్రైమాసికం కూడా ఇదే. జనవరి–జూన్‌లో 56 శాతం వృద్ధితో 7,573 యూనిట్ల అమ్మకాలను రికార్డు చేసింది. సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించడం విశేషమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వింక్ తెలిపారు. సెమికండక్టర్ల కొరత మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం 6,000లకుపైగా కార్లకు ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. భారతీయ కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న అంతర్జాతీయ మోడళ్లు కొన్ని మూడవ త్రైమాసికంలో అడుగు పెట్టనున్నాయని వివరించారు. -
మారుతీ సుజుకీ వేల కోట్ల పెట్టుబడులు, ఏ రాష్ట్రంలో అంటే!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ సహా వివిధ ప్రాజెక్టులపై రూ. 5,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేథ్ తెలిపారు. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), బీఈవీ బ్యాటరీల తయారీ కోసం సుజుకీ మోటర్స్ గుజరాత్లో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలపై స్పందిస్తూ .. స్థానికంగా విద్యుత్ వాహనాల ఉత్పత్తికి ఈ పెట్టుబడులు గణనీయంగా దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. అలాగే దేశీయంగా తమ బీఈవీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరించుకునేందుకు కూడా ఉపయోగపడగలవని వివరించారు. 2025 నాటికి తమ తొలి బీఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టడంపై మారుతీ సుజుకీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గుజరాత్లో బీఈవీలు, బ్యాటరీల తయారీపై 2026 నాటికి రూ. 10,445 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సుజుకీ మోటర్స్ మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరతపై అనిశ్చితి కొనసాగుతోందని అజయ్ తెలిపారు. 2022–23లో కూడా ఉత్పత్తి పరిమాణంపై దీని ప్రభావం కొంత ఉండవచ్చని వివరించారు. -
ఈవీ కంపెనీలకు నితిన్ గడ్కరీ వార్నింగ్!
ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థలకు కేంద్ర రవాణా, రహదారుల వ్యవహారాల మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్నిప్రమాదానికి గురవుతున్నాయి. పలువురు ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఈనేపథ్యంలో వరుస ప్రమాదాలపై నితిన్ గడ్కరీ స్పందించారు. ఈవీ వెహిలక్స్ తయారీ సంస్థలు నాణ్యత ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. లేదంటే సదరు ఆటోమొబైల్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వరుస ట్వీట్లు చేశారు. We have constituted an Expert Committee to enquire into these incidents and make recommendations on remedial steps. Based on the reports, we will issue necessary orders on the defaulting companies. We will soon issue quality-centric guidelines for Electric Vehicles. — Nitin Gadkari (@nitin_gadkari) April 21, 2022 "గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలకు సంబంధించి అనేక దుర్ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం అత్యంత దురదృష్టకరం" అని గడ్కరీ ట్వీట్లలో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమాదాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలి. Meanwhile companies may take advance action to Recall all defective batches of vehicles immediately. Under the leadership of PM Shri @narendramodi ji, our government is committed to ensure safety of each and every commuter. — Nitin Gadkari (@nitin_gadkari) April 21, 2022 వాహనాల తయారీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధించడమే కాదు.. లోపమున్న వాహనాల్ని వెనక్కి రప్పించాల్సి ఉంటుందని గడ్కరీ సూచించారు. ఇప్పటికే తయారు చేసిన వెహికల్స్ లోపాల్ని గుర్తిస్తే వాటిని వెంటనే సరిచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్..కేంద్రం సంచలన నిర్ణయం! -
అదిగో అదిరిపోయే ఆడి..భారత్‌లో కొత్త కారు విడుదలపై మా ధీమా అదే!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి త్వరలో ఏ8 సెడాన్ కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తోంది. లాంగ్ వీల్ బేస్, 3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధిస్తామన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2021లో ఆడి ఇండియా రెండింతల అమ్మకాలతో 3,293 యూనిట్లు నమోదు చేసింది. సంస్థ ఈ ఏడాది ఇప్పటికే రూ.80 లక్షల ఎక్స్‌షోరూం ధరతో క్యూ7 ఎస్యూవీ కొత్త వర్షన్ ప్రవేశపెట్టింది. -
ఆర్డర్లే ఆర్డర్లు,ఈ ఎలక్ట్రిక్ కారుకు భలే గిరాకీ!
న్యూఢిల్లీ: ముడి వస్తువులు, సెమీ కండక్టర్ల పెరుగుతున్న ధరలు, ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో సరఫరాపరమైన సమస్యలు మొదలైనవన్ని దేశీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ ఏడాది సవాళ్లుగా ఉండనున్నాయని ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ చాబా తెలిపారు. ఈ ఏడాది తొలినాళ్లలో 2022లో 10 శాతం పైగా వృద్ధిని దేశీ ఆటో పరిశ్రమ అంచనా వేసిందని .. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘జనవరి, ఫిబ్రవరికి ముందు చూస్తే.. ఈ ఏడాది అమ్మకాలపరంగా అత్యుత్తమంగా ఉంటుందని, 2018లో సాధించిన దానికి మించి విక్రయాలు ఉండవచ్చని భారతీయ ఆటో పరిశ్రమ ఆశాభావంతో ఉంది. 10 శాతం పైగానే వృద్ధి ఉండొచ్చని అంచనా వేసింది. కానీ ఏప్రిల్ వచ్చే సరికి పరిస్థితులు మారాయి. డిమాండ్‌కు ప్రతికూల సవాళ్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి‘ అని చాబా పేర్కొన్నారు. ‘లోహాల ధరలు ఎగుస్తుండటంతో ముడి వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోతుండటం ఇందుకు కారణం. సెమీకండక్టర్ల ధరలు కూడా పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా .. ముఖ్యంగా ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ద్రవ్యోల్బణం కూడా పెరిగే కొద్దీ ఆటోమోటివ్ విభాగంపైనా ప్రభావం పడవచ్చు. దీంతో డిమాండ్ తగ్గవచ్చు‘ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికైతే మార్కెట్‌పై ఈ ప్రభావం ఇంకా కనిపించడం లేదని .. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయని చాబా వివరించారు. జియస్ వాహనానికి భారీ ఆర్డర్లు.. ప్రస్తుతానికి తమ సంస్థ విషయానికొస్తే.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ జియస్ ఈవీకి నెలకు సుమారు 1,500 ఆర్డర్లు వస్తున్నాయని, కానీ తాము 300 యూనిట్లు మాత్రమే అందించగలుగుతున్నామని చాబా చెప్పారు. గ్లోస్టర్, జియస్ ఈవీలకు సంబంధించి ఈ ఏడాది మొత్తానికి సరిపడేంత ఆర్డర్లు ఉన్నాయన్నారు. ఆస్టర్, హెక్టర్ మోడల్స్ వెయిటింగ్ పీరియడ్ రెండు నుంచి ఆరు నెలల వరకూ ఉంటోందన్నారు. నెలకు 7,000 పైచిలుకు వాహనాలకు డిమాండ్ ఉండగా తాము 4,000 యూనిట్లు మాత్రమే తయారు చేయగలుగుతున్నామని చెప్పారు. ఈ నెల నుంచి తమ హలోల్ ప్లాంటులో రెండో షిఫ్ట్ కూడా ప్రారంభించామని చాబా పేర్కొన్నారు. చదవండి: ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్! -
రూ.4.5లక్షల ఎలక్ట్రిక్ కారు, 5 రూపాయలకే 60కిలో మీటర్ల ప్రయాణం!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. దీంతో అద్భుతమైన కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళ కొల్లాంకు చెందిన 67 ఏళ్ల ఆంటోనీ జాన్ ఎలక్ట్రిక్ కారును తయారు చేసుకున్నాడు. రెండు సీటర్ల కారును సింగిల్ ఛార్జ్ పెట్టి కేవలం రూ.5 ఖర్చుతో 60 కిలోమీటర్ల మీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపారు. రూ.4.5లక్షలు ఖర్చు జాన్ 2018లో పుల్కూడు పేరుతో రూ.4.5 లక్షల వ్యయంతో జాన్ ఈ కారును డిజైన్ చేశారు. ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించొచ్చు.ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా కారు వెనుక భాగంగా ఒక చిన్నసీటును డిజైన్ చేశారు. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల డ్రైవింగ్ వేగంతో వెళుతుందని జాన్ తెలిపారు. 2018లో ఎలక్ట్రిక్ కారు తయారీ జాన్ 67 ఏళ్ల కెరీర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అయితే జాన్ గతంలో తన ఇంటి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఆఫీస్‌కు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగించాడు. కఠినమైన వాతావరణ౦,సౌకర్య౦, సెక్యూరిటీ కోస౦, జాన్ ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేశాడు. 2018లో ఎలక్ట్రిక్ కారు కోసం శోధించారు. కారు బాడీ డిజైన్ కోసం ఒక గ్యారేజీకి ఇచ్చాడు. అదే సమయంలో వైరింగ్ చేసి, సర్క్యూట్ ను తానే స్వయంగా తయారు చేశాడు. కారు కోసం బ్యాటరీలు, మోటారు, వైరింగ్‌ను ఢిల్లీలో కొనుగోలు చేశాడు. హెడ్ లైట్, ఫాగ్ లైట్, ఇండికేటర్, ఫ్రంట్..బ్యాక్ వైపర్లు వంటి ముఖ్యమైన ప్రాథమిక ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారు పనిచేస్తుంది. కాగా ప్రస్తుతం ఈ కారు పనితీరు బాగుండడంతో మరో ఎలక్ట్రిక్ కారును తయారు చేసేందుకు జాన్ సిద్ధమయ్యారు. -
టాటా సరికొత్త సంచలనం..కొత్త ఎలక్ట్రిక్ కారుతో ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలే!
TATA Concept Curvv Electric Suv: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రత్యర్ధి ఆటోమొబైల్ సంస్థలకు భారీ షాక్ ఇస్తూ అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్ (Tata Concept Curvv electric suv) పేరుతో మార్కెట్‌కు పరిచయమైన కార్ డిజైన్, ఫీచర్లు ఇటు కొనుగోలు దారుల్ని,అటూ మార్కెట్ నిపుణుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుండగా..ఈ కారును అమ్మకాలు జరిపేందుకు మరింత సమయం పట్టనుంది. ఇప్పటికే టాటా సంస్థ నుంచి రెండు నెక్సాన్ ఈవీ, టైగర్ ఈవీతో పాటు 2020లో ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన నెక్ట్స్ జనరేషన్ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయగా.. తాజాగా బుధవారం టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజిండ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర ఎలక్ట్రిక్ కర్వ్ ఎస్యూవీ కారును విడుదల చేశారు. ఇప్పుడు మనం ఈ కారు గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం. కార్ రేంజ్ కారు విడుదలైన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్ కారు రేంజ్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 400కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫ్రేమ్ లెస్ విండో టాటా కర్వ్ పై మరో ఫ్యాన్సీ టచ్ ఏంటంటే అన్ని డోర్లపై ఫ్రేమ్‌లెస్ విండోస్ రూపంలో వీక్షించవచ్చు. సన్ రూఫ్‌తో వస్తుంది ఈ రోజుల్లో చాలా వాహనాల మాదిరిగానే టాటా కర్వ్ కూడా పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఈ సన్ రూఫ్ వల్ల లోపల మిరిమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతుంది. క్యాబిన్ సైతం విశాల అనుభూతిని ఇస్తుంది. మినిమలిస్టిక్ ఇంటీరియర్ టాటా కార్ మినిమలిస్టిక్ ఇంటీరియర్‌తో రానుంది. డ్యాష్‌బోర్డ్ పైన రెండు ఫ్లోటింగ్ స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే (ఎంఐడీ) మరో డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ యూనిట్‌గా పని చేస్తుంది. స్టీరింగ్ వీల్ ఇరువైపులా బ్యాక్లిట్ కంట్రోల్‌తో ఫ్లాట్ బాటమ్ డిజైన్‌తో వస్తుంది. ఛార్జింగ్ ఫీచర్ సూపర్ టాటా మోటార్స్ కర్వ్ కాన్సెప్ట్ కారులో వెహికల్-టు-వెహికల్, వెహికల్-టు-లోడ్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై కంపెనీ ప్రతినిధులు స్పందించాల్సి ఉండగా.. ఈ కొత్త కాన్సెప్ట్‌తో ఇతర వాహనాలు లేదా చిన్న విద్యుత్ ఉపకరణాలను ఛార్జ్ చేయగలదని దీని అర్థం. అడ్జెస్టబుల్ రెజెనేరేటీవ్ బ్రేకింగ్ టాటా మోటార్ జనరేషన్ 2 పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్ పెద్ద వెహికల్స్ అన్నీ రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో వస్తాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2025 నాటికి 10కార్లు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్ కార్లను 2025 నాటికి మరో 10 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మూడు వేరియంట్ కార్లను విడుదల చేయాలని చూస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాటా ఎలక్ట్రిక్ కార్లు! వెహికల్స్ డెలివరీలో రికార్డ్‌లు! -
కార్ల ధరలు పైపైకి..తగ్గిన అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ కేంద్రాల నుంచి డీలర్‌షిప్స్‌కు గత నెలలో వాహనాల సరఫరా 23 శాతం తగ్గింది. 2021 ఫిబ్రవరిలో అన్ని రకాల వాహనాలు కలిపి 17,35,909 యూనిట్లు డీలర్షిప్ కేంద్రాలకు చేరాయి. గత నెలలో ఈ సంఖ్య 13,28,027 మాత్రమే. సెమికండక్టర్ల కొరత, సరఫరా సమస్యలకుతోడు వాహనాల ధరల పెరుగుదల ఇందుకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. విడిభాగాలు ప్రియం కావడం, రవాణా ఖర్చులు భారమవడంతో పరిశ్రమలో మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపిందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున రష్యా–ఉక్రెయిన్ వివాదం ప్రభావాన్ని పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు -
హైదరాబాద్‌లో ’ఆటమ్’ ఎలక్ట్రిక్ వెహికల్ రెండవ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ’ఆటమ్’ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ’ఆటమొబైల్’ హైదరాబాద్‌లో రెండవ ప్లాంటును ఆవిష్కరించింది. దీనితో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 25,000 నుంచి 3.50 లక్షల యూనిట్లకు పెరుగుతుందని సంస్థ వ్యవస్థాపక ఎండీ వంశీ గడ్డం తెలిపారు. 2020లో హైదరాబాద్‌లో కంపెనీ తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పెట్రోల్ టూవీలర్ల మార్కెట్ ఏటా 1.50 కోట్ల యూనిట్లుగా ఉందని, ఎలక్ట్రిక్ ద్వికచ్ర వాహనాల మార్కెట్ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు మూడు లక్షల వాహనాల స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు వంశీ వివరించారు. తాజాగా ఏర్పాటైన ప్లాంటు విస్తీర్ణం 20,000 చదరపు అడుగులు. తక్కువ వేగంతో నడిచే కొత్త తరం ఈ–బైక్ ఆటమ్ 1.0, ఇతర మోడల్స్‌ను ఇందులో ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే నెలల్లో మరిన్ని మోడల్స్ ఆవిష్కరించనున్నట్లు వివరించారు. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే ఆటమ్ 1.0 ధర పన్నులతో కలిపి దాదాపు రూ.54,999 ఉంటుందని సంస్థ తెలిపింది. దీనికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం ఉండదని పేర్కొంది. -
అమ్మో!!ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.లక్షా10వేలా,దీని స్పెషల్ ఏంటో?
ముంబై: ఏఎంఓ ఎలక్ట్రిక్ బైక్స్ కంపెనీ జాంటి ప్లస్ పేరుతో కొత్త స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోని విడుదల చేసింది. దీని ధర ఎక్స్ షోరూం వద్ద రూ.1.10 లక్షలుగా ఉంది. కేవలం నాలుగు గంటల్లోనే 100 శాతం ఛార్జ్ అయ్యే 60 వోల్టుల లిథియం బ్యాటరీని ఇందులో అమర్చారు. ఒకసారి పూర్తి చార్జింగ్‌తో ఈ స్కూటర్ 120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. క్రూజ్ కంట్రోల్ స్విచ్, ఈఏబీఎస్, యాంటీ థెఫ్ట్ అలారమ్, సైడ్ స్టాండ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డీఆర్ఎల్ లైట్స్, ఇంజిన్ కిల్ స్విచ్, రెండువైపులా టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెషన్, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అలాగే పోర్టబుల్ బ్యాటరీ సదుపాయం కూడా ఉంది. ఫిబ్రవరి 15 నుంచి జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని ఏఎంవో ఎలక్ట్రిక్ బైక్స్ ఎండీ సుశాంత్ కుమార్ తెలిపారు. -
మీరు ఐటీఐ నిపుణులా? అయితే మీకో శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: ఆటోమోటివ్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రానున్న ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంతర్జాతీయ తయారీ కంపెనీ బాష్ చైర్మన్ డాక్టర్ స్టెఫాన్ హటుంగ్ తెలిపారు. ఈ నిధులను స్థానికంగానే తయారీ చేపడతామని, ఐటీఐలతో కలిసి యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు తగిన శిక్షణ ఇస్తామని ఆయన అన్నారు. డిజిటల్ మొబిలిటీ రంగంలో పెట్టే రూ.వెయ్యికోట్లకు ఇది అదనమని ఆయన అన్నారు. భారత్‌లో బాష్ సంస్థ ఏర్పాటై వందేళ్లు అయిన సందర్భంగా గురువారం ఏర్పాటైన వర్చువల్ విలేకరుల సమావేశాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ జర్మన్ ఇంజినీరింగ్ నైపుణ్యానికి భారతీయ ఎంట్రప్రెన్యూర్షిప్ తోడు కావడంతోనే బాష్ ఇండియా ద్వారా పలు రంగాల్లో వినూత్నమైన ఉత్పత్తులను అందించడం సాధ్యమైందని చెప్పారు. ఎనిమిది రాష్ట్రాలకు విస్తరణ... 1922లో కోల్‌కతాలో మొదలైన రాబర్ట్ బాష్ కంపెనీ ప్రస్థానం అంచలంచెలుగా ఎనిమిది రాష్ట్రాల్లో 18 తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరిందని, 32 వేల మంది అసోసియేట్లు కంపెనీలో పనిచేస్తున్నారని వివరించారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరిస్తూ... దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్ల కార్ల సర్వీసింగ్ కోసం బాష్ మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని 2025 నాటికల్లా కనీసం వెయ్యి కొత్త సర్వీస్ కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ప్రస్తుతం 400 ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఉండగా... వాటిని 972 ప్రాంతాలకు విస్తరించనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వపు బడ్జెట్లో మూలధన వ్యయాన్ని రూ.7.5 లక్షల కోట్లకు పెంచడాన్ని స్వాగతించిన డాక్టర్ స్టెఫాన్ హటుంగ్ ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉండటాన్ని ప్రస్తావించారు. భారత్‌లో బాష్ గ్రూపు డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భరత, మేకిన్ ఇండియా కార్యక్రమాలకు బాష్ తనదైన రీతిలో సాయం చేస్తోందని చెప్పారు. బాష్ ఉత్పత్తి చేస్తున్న అత్యాధునిక వీడియో నిఘా ఉత్పత్తులు, వీడియో అనాలసిస్ సాఫ్ట్వేర్లు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయని, దేశంలోని యాభై మెట్రో రైలు ప్రాజెక్టుల్లోనూ బాష్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని తెలిపారు. విద్యుత్తు వాహనాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బాష్ వాటిల్లో వాడే బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే దిశగా పరిశోధనలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.