ఆటో కంపెనీల ముందున్న ఆప్షన్లు రెండే
ఆటో కంపెనీల ముందున్న ఆప్షన్లు రెండే
Published Fri, Mar 31 2017 8:35 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
బీఎస్-3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై ఏప్రిల్ 1 నుంచి నిషేధం విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు కీలక తీర్పుచెప్పింది. ఎలాగైనా ఒక్కరోజులో అవకాశం దక్కిన కాడికి బీఎస్-3 వాహనాలను అమ్మేయాలని నిర్ణయించిన ఆటో కంపెనీలు బైక్ లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. బీఎస్-3 ప్రమాణాలతో ఉన్న అన్ని రకాల వాహనాలు దేశంలో 8 లక్షలకు పైన ఉంటాయని అంచనా. వీటిలో కేవలం ద్విచక్ర వాహనాలే 6.71 లక్షలు ఉన్నాయి. కానీ నేటివరకు వీటిలో ఎన్ని అమ్ముడుపోతాయనేదే అసలైన సందేహం.
ఒకవేళ అమ్ముడుపోని వాహనాలను ఏం చేయాలి? అంటే కంపెనీల దగ్గర కేవలం రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి ఇతర దేశాలకు, మార్కెట్లకు తరలించి విక్రయించడం. రెండు సుప్రీం ఆదేశాల మేరకు బీఎస్-4లోకి అప్ గ్రేడ్ అవ్వడం. ఇతర దేశాల్లో అమ్ముడుపోని వాహనాలను తిరిగి భారత్ కు తీసుకొచ్చి వాటిని బీఎస్-4లోకి అప్ గ్రేడ్ చేసుకోవాలి. కానీ బీఎస్-4లోకి అప్ గ్రేడ్ చేసుకోవాలంటే కొంచెం కష్టతరమేనట. దీనికి సాంకేతికంగా ప్రక్రియ ఎక్కువ పడుతుందని, ప్లస్ ఖరీదైన వ్యవహారమని కంపెనీలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం ఆటో కంపెనీల ముందున్న ఆప్షన్లు మాత్రం ఈ రెండేనని ఆటో వర్గాలంటున్నాయి.
Advertisement
Advertisement