సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమొబైల్ కంపెనీలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి బైక్‌లు, కార్లకు వరుసగా రెండేళ్లు, ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా లేకుండా వాహన విక్రయాలు జరపరాదని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. తొలిసారి బైక్, కార్లు కొనుగోలు చేసే సమయంలో థర్డ్ పార్టీ బీమాను కల్పిస్తారని, అయితే తదుపరి సంవత్సరం నుంచి వినియోగదారులు దాన్ని కొనసాగించడం లేదని అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ కోర్టుకు నివేదించారు.
దేశంలో 66 శాతం వాహనాలకు థర్డ్ పార్టీ బీమా లేదని తెలిపారు. ఒకేసారి 20 ఏళ్లకు సరిపడా మొత్తంతో థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం సాధ్యం కాదని బీమా కంపెనీలు వాదించాయి. అయితే కారు బీమాకు మూడేళ్ల వ్యవధి, బైక్‌లకు ఐదేళ్ల వ్యవధితో థర్డ్ పార్టీ బీమా విధిగా వర్తింపచేయాలని కమిటీ సూచనలతో కోర్టు ఏకీభవించింది. మరోవైపు వాహనాలకు అధిక ప్రీమియం చెల్లించాల్సి రావడంతో థర్డ్ పార్టీ బీమాను తీసుకునేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment