బ్రేక్‌లో సమస్యలు..మారుతీ సుజుకీ వాహనదారులకు అలెర్ట్‌ | Maruti Suzuki Recalls More Than 9,000 Cars | Sakshi
Sakshi News home page

బ్రేక్‌లో సమస్యలు..మారుతీ సుజుకీ వాహనదారులకు అలెర్ట్‌

Published Sun, Oct 30 2022 9:32 PM | Last Updated on Sun, Oct 30 2022 9:32 PM

Maruti Suzuki Recalls More Than 9,000 Cars - Sakshi

మారుతీ సుజుకీ వాహనదారులకు అలెర్ట్‌. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన వేగనార్‌, సెలెరియో, ఇగ్నిస్‌ వేరియంట్‌ కార్లలో రేర్‌ బ్రేక్‌ అసెంబ్లీ పిన్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దాదాపు 9,925 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది.

బ్రేక్‌ అసెంబ్లీ పిన్‌ విరిగిపోయి సౌండ్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఒక్కోసారి వాహనదారులు ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. 

పైన తెలిపిన తేదీల్లో తయారు చేసిన కార్లను గుర్తించి, లోపాల్ని సరిచేస్తామని మారుతీ సుజుకీ ప్రతినిధులు చెప్పారు. ఇందుకోసం వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement