maruthi suzuki
-
కార్ల కొనుగోలు దారులకు మారుతి సుజుకి బంపరాఫర్
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎస్యూవీ, హ్యాచ్ బ్యాక్ తదితర కార్ల సెగ్మెంట్లలో తన స్థానం పదిలం చేసుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ తరుణంలో ఏప్రిల్‌లో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇగ్నీస్ మోడల్ కారుపై గరిష్టంగా రూ.58 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనోపై రూ.58 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. మారుతి సుజుకి సియాజ్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 కలుపుకుని మొత్తం రూ.53 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రీడ్ కార్లపై రూ.58 వేలు, స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్లపై రూ.84 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్ మీద రూ.68 వేల వరకూ ధర తగ్గించింది. మారుతి సుజుకి జిమ్నీ కారుపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 2022-23, 2023-24 మోడల్ కార్లలో స్పెషిఫిక్ ట్రిమ్స్ మీద గణనీయ క్యాష్ డిస్కౌంట్లు అందిస్తున్నది -
ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కంపెనీకు చెందిన 16,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాహనతయారీ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కృషిచేస్తాయి. కొన్నిసార్లు ఆ ఉత్పత్తుల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తిరిగి వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే ఇంధన పంప్ మోటార్లో లోపం ఉన్న విడి భాగాన్ని సరిచేసేందుకు బాలెనో, వ్యాగన్ఆర్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్) మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. 2019 జులై 30 నుంచి నవంబరు 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇంధన పంప్ మోటార్ భాగంలో లోపం ఉంటే, అరుదుగా ఇంజిన్ నిలిచిపోవడం లేదా స్టార్టింగ్ సమస్య తలెత్తవచ్చని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ అధీకృత డీలర్ వర్క్‌షాప్‌ల నుంచి ప్రభావిత వాహన యాజమానులకు సమాచారం ఇవ్వనుంది. లోపాలు ఉండే అవకాశం ఉన్న విడిభాగాలను ఉచితంగా మార్చనుంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో కంపెనీ కార్లను రీకాల్ చేయలేదని తెలిసింది. మారుతీ సుజుకీ కంపెనీ ఇటీవల ఇన్విక్టో, జిమ్నీ, ప్రాంన్క్స్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ తయారుచేసిన అరెనా, నెక్సా, ట్రూవాల్యూ మోడళ్లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి మొదటివారం వరకు కంపెనీ 43.82 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. 2020లో అది 31.59 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు -
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజికి విడుదల చేసిన కార్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఆ సంస్థ మార్కెట్‌కి పరిచయం చేసిన మారుతీ గ్రాండ్ విటారా ఏడాదిలోనే లక్ష కార్లు అమ్ముడు పోయాయి. అంచనా ప్రకారం.. నెలకు సుమారు 8,333 కార్లను విక్రయాలు జరిగాయి. తద్వారా దేశీయంగా మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో వేగంగా వేగంగా సేల్స్ జరిగిన కార్ల జాబితాలో గ్రాండ్ విటారా చోటు దక్కించుకోవడం గమనార్హం. ప్రత్యర్ధులకు పోటీగా ఇతర ఆటోమొబైల్ సంస్థలకు పోటీగా మారుతి మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లను డిజైన్ చేసింది. ఈ వేరియంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్, హోందయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వేగన్ టైగన్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, ఎంజీ ఆస్టర్లు ఉన్నాయి. అయితే, బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించిన ఎస్‌యూవీలలో హైరైడర్, గ్రాండ్ విటారాలు మాత్రమే ఉన్నాయి. ఇ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ వేరియంట్ లీటరుకు 27.97 కి.మీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా, మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ,‘గత ఏడాది విడుదలైన గ్రాండ్ విటారా ఎస్యూవీ ఔత్సాహికులకు కొత్త డ్రైవింగ్ అనుభూతిని అందిస్తూ కొత్త శకానికి నాంది పలికింది. ఎస్యూవీ వేరియంట్లో 22 శాతం వాటాతో మారుతి సుజికి వేగంగా వృద్ది సాధించిందని అన్నారు. గ్రాండ్ విటారా ధర గ్రాండ్ విటారా ధర ప్రస్తుతం రూ. 10.70 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంది (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్). -
రికార్డ్ ర్యాలీకి బ్రేక్, అదరగొట్టిన మారుతి సుజుకి
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతోనైనా పటిష్టంగానే ముగిసాయి. నిఫ్టీ 50 వరుసగా ఐదవ రోజు రికార్డు స్థాయి సెషన్‌ను కొనసాగించింది. 10 పాయింట్ల లాభంతో 19,398.50 వద్ద ముగియగా, సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 65,446 వద్ద ముగిసింది. ప్రాఫిట్-బుకింగ్ కారణంగా గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న ర్యాలీకి బ్రేక్ పడింది. బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్ల నష్టం పోయింది. సెన్సెక్స్‌లో ఎంపీవీ ఇన్విక్టో లాంచ్ తరువాత మారుతీ సుజుకి షేర్లు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఫలితంగా బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (m-క్యాప్) తొలి సారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్లే టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐషర్ మోటార్స్, టాటా కన్జ్యూమర్, యూపీఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
భారీ అవినీతి ఆరోపణలు: పెదవి విప్పిన మారుతీ ఛైర్మన్
సాక్షి,ముంబై: దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీలోని ఎగ్జిక్యూటివ్స్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై తొలిసారి స్పందించారు సంస్థ ఛైర్మన్ ఆర్సీ భార్గవ. ఈ ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు విచారణకు ఆదేశించినట్లు ఛైర్మన్ చెప్పారు. కంపెనీ పాలసీ ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెండర్స్‌కు కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు అధిక ధరకు విడి భాగాలను కొందరు ఎగ్జిక్యూటివ్స్ సరఫరా చేసి వ్యక్తిగత లబ్ది పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తునకు మారుతీ సిద్ధమైంది. అవినీతి ఆరోపణలు రుజువైతే.. చట్టపరమైన చర్యలు తప్పవని సంస్థ ఛైర్మన్ హెచ్చరించారు. పర్చేజ్ డిపార్టమెంట్ లో కొందరు కీలక అధికారులు అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు నేపథ్యంలో కంపెనీ తొలిసారిగా స్పందించింది. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను KPMGకు అప్పగించినట్లు వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ను ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌కు ఇప్పటికే పంపినట్లు చెప్పారు మారుతీ సుజుకీ ఛైర్మన్. కాగా దేశంలోని తయారీ ప్లాంట్లకు అవసరమైన 95 శాతం ముడిసరుకు సప్లయిర్ల నుంచే కొనుగోలు చేస్తుంది మారుతి సుజుకీ. 84 శాతం సప్లయిర్లు.. తయారీ ప్లాంట్లకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. ఈ క్రమంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. -
విదేశాల్లో మారుతీ సుజుకీ హవా.. 2022లో 2,63,068 కార్ల ఎగుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 2022లో 2,63,068 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2021తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే రెండున్నరెట్లు ఎక్కువగా సరఫరా అయ్యాయి. 2019లో కంపెనీ 1,07,190 వాహనాలను ఎగుమతి చేసింది. విదేశాలకు గతేడాది అధికంగా సరఫరా అయిన మోడళ్లలో డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెస్సో, బాలెనో, బ్రెజ్జా ఉన్నాయి. వరుసగా రెండవ సంవత్సరం ఎగుమతుల్లో 2 లక్షల మైలురాయిని దాటడం కంపెనీ ఉత్పత్తుల పట్ల విశ్వసనీయత, నాణ్యత, పనితీరును సూచిస్తుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు. 1986–87లో భారత్ నుంచి మారుతీ సుజుకీ ఎగుమతులను ప్రారంభించింది. 100 దేశాలకు వాహనాలు సరఫరా అవుతున్నాయి. ఆఫ్రికా, మధ్యప్రాచ్య, లాటిన్ అమెరికా, ఆసియాన్ దేశాలు సంస్థకు ప్రధాన మార్కెట్లు. -
ఈ కార్లకు జనాల్లో ఫుల్ క్రేజ్..కానీ ఇప్పుడు షెడ్డుకు చేరిన వేల కార్లు!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 9,125 కార్లను రీకాల్ చేస్తోంది. మార్కెట్లో విపరీతంగా అమ్ముడు పోతున్న సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా కార్లలో ముందు వరుస సీట్ల బెల్ట్లలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి 2022 నవంబర్ 2–28 తేదీల్లో తయారైనవని కంపెనీ తెలిపింది. షోల్డర్ హైట్ అడ్జెస్టర్ ఉప భాగాలలో ఒకదానిలో లోపం ఉందని అనుమానిస్తున్నామని, ఇది అరుదైన సందర్భంలో సీట్ బెల్ట్ విడదీయడానికి దారితీయవచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది. వాహనాలను తనిఖీ చేసి, లోపం ఉన్న భాగాన్ని భర్తీ చేయడం కోసం ఉచితంగా రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. అధీకృత వర్క్‌షాప్‌ల నుండి సంబంధిత కార్ల యజమానులకు సమాచారం వెళుతుందని తెలిపింది. -
మారుతీ కార్లపై అదిరిపోయే ఆఫర్స్!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలుపలు వాహనాలపై ఫెస్టివ్ సీజన్ ముగిసిన తరువాత కూడా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. తద్వారా ఫెస్టివ్ జోష్‌ను కొనసాగించి, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించగా, తాజాగా ఈ కోవలో మారుతి సుజుకి చేరింది. నవంబర్ నెలలో నెక్సా లైనప్‌లో మారుతీ సుజుకి బాలెనో, ఇగ్నిస్, వ్యాగన్-ఆర్ లాంటి పలు మోడళ్ల కార్ల కొనుగోలుపై రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఆల్టో కే10: పాపులర్ మోడల్ ఆల్టో కే10పై అత్యధికంగా రూ. 50వేల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. మారుతీ సుజుకి సియాజ్: మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ అన్ని మాన్యువల్ వేరియంట్లపై రూ. 40వేల దాకా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు. ఆల్టో 800: ఆల్టో 800 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 15వేలు , 4 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించింది. సెలేరియో: సెలేరియో బేసిక్ మేన్యువల్ వేరియంట్, సీఎన్జీ వేరియంట్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్, జెడ్ ప్లస్ వేరియంట్లపై 25వేల దాకా తగ్గింపును అందిస్తోంది. మిగిలిన సమాచారంకోసం మారుతి సుజరుకి డీలర్ల వద్దగానీ, వెబ్సైట్లో గానీ చూడవచ్చు. -
గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్
-
బ్రేక్‌లో సమస్యలు..మారుతీ సుజుకీ వాహనదారులకు అలెర్ట్
మారుతీ సుజుకీ వాహనదారులకు అలెర్ట్. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన వేగనార్, సెలెరియో, ఇగ్నిస్ వేరియంట్ కార్లలో రేర్ బ్రేక్ అసెంబ్లీ పిన్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దాదాపు 9,925 కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. బ్రేక్ అసెంబ్లీ పిన్ విరిగిపోయి సౌండ్ వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఒక్కోసారి వాహనదారులు ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. పైన తెలిపిన తేదీల్లో తయారు చేసిన కార్లను గుర్తించి, లోపాల్ని సరిచేస్తామని మారుతీ సుజుకీ ప్రతినిధులు చెప్పారు. ఇందుకోసం వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
మారుతీ సుజుకీ కొత్త ప్లాన్స్: మారుతీ మిడ్-ఎస్యూవీ
న్యూఢిల్లీ: దేశంలో కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగాన్ని కీలకంగా పరిగణిస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో ప్రస్తుతం సంస్థ వాటా 45 శాతంగా ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది మారుతీ సుజుకీ లక్ష్యం. ‘ఎస్‌యూవీయేతర విభాగంలో కంపెనీ వాటా 65 శాతం పైచిలుకు. ఎస్‌యూవీల్లో అంత పెద్దగా లేదు. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఇది. ఇందులో మారుతీ సుజుకీ తప్పనిసరిగా సుస్థిర స్థానం సంపాదించాలి. ప్రారంభ స్థాయి ఎస్‌యూవీల విపణి వార్షిక పరిమాణం 6.6 లక్షల యూనిట్లు. ఇందులో సంస్థకు 20 శాతం వాటా ఉంది. 5.5 లక్షల యూనిట్ల వార్షిక పరిమాణం ఉన్న మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో కంపెనీకి ఒక్క మోడల్ కూడా లేదు. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో మిడ్ సైజ్ ఎస్యూవీ ఆవిష్కరించనున్నాం. 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఎస్‌యూవీలపైనా దృష్టిసారిస్తాం’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
మారుతి సక్సెస్ మంత్ర ఇదే! సీక్రెట్ రివీల్ చేసిన ఛైర్మన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతి సుజుకీ ఇండియా విజయం మాదిరే.. ఇతర రంగాల్లోనూ భారత్ విజయం సాధించాలని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా భార్గవ మీడియాతో మాట్లాడారు. భారత ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధిలో మారుతి సుజుకీ ఇండియా ఎంతో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఆటో విడిభాగాల సప్లయ్ చైన్, అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పడిందని, ఇప్పుడు ఇవి ప్రపంచ మార్కెట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ‘‘తయారీలో భారత్ పాత్ర చాలా తక్కువ. కానీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ నాలుగో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా ఉంది. అంతే కాదు ఆటో విడిభాగాల పరిశ్రమ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. కనుక వీటిల్లో కొన్నింటిని మా కృషి వైపు నుంచి చూడాలి’’అని భార్గవ వివరించారు. మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విజయవంంతమైన జపనీస్ కారు జాయింట్ వెంచర్‌గా పేర్కొన్నారు. (Eicher Motors: సీఎఫ్‌వో గుడ్‌బై, ఐషర్ మోటార్స్ ఢమాల్!) ఇతర రంగాల్లోనూ.. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎంతో విజయవంతమైన కంపెనీగా మారుతి సుజుకీ ఇండియా అవతరించినట్టు భార్గవ చెప్పారు. మారుతి విషయంలో విజయం సాధ్యమైనప్పుడు, ఇతర పరిశ్రమల్లోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ‘‘మారుతి విజయానికి కారణం భారత ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే సామర్థ్యం. జపనీస్ యాజమాన్య సామర్థ్యం. వనరుల సమర్థ వినియోగం, భాగస్వాములు, యాజమాన్యం, పనివారు, ఇతర భాగస్వాముల మధ్య విశ్వాసం’’అని భార్గవ వివరించారు. మారుతి సుజుకీ ప్రయాణం అంత సాఫీ ఏమీ కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. దేశీ కార్ల మార్కెట్లో సుజుకీ 43 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. -
మారుతి కొత్త S-ప్రెస్సో, మోర్ ఫీచర్స్, మోర్ మైలేజీ, రూ.4.25 లక్షలు
సాక్షి, ముంబై: మారుతి సుజుకి ఇండియా కొత్త ఎస్-ప్రెస్సోను లాంచ్ చేసింది. 1.0 లీటర్ల నెక్స్ట్ జెన్ K-సిరీస్‌లో 2022ఎస్-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. సుమారు 1.44 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. పాత ఎస్-ప్రెస్సోతో పోలిస్తే, ఫీచర్లనుఅప్డేట్ చేసి, ధరను సుమారు 71,వేల రూపాయలు పెంచింది. అత్యాధునిక ఇంజీన్, ఎక్కువ మైలేజీతో మైక్రో-SUVగా తీసుకొచ్చింది. స్టార్ట్-స్ట్రాప్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ వీవీటీ ఇంజన్, మెరుగైన ఇంధన-సామర్థ్యం, అదనపు ఫీచర్లు కస్టమర్లకు ఆకర్షణీయమైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఫీచర్లు, మైలేజీ, ధర 1.0L డ్యూయల్ జెట్, ఐడిల్-స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో డ్యూయల్ వీవీటి ఇంజన్‌తో కొత్త S-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మోడల్ 4 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో స్టాండర్ట్, LXi, Vxi Vxi వేరియంట్లలో వస్తుంది. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 5.99 లక్షల మధ్య ఉంటుంది. దీని ఇంజీన్ 5,500rpm వద్ద 65bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎకానమీ 25.30 కిలోమీటర్ల మైలేజీ, అందిస్తుందని, అయితే మాన్యువల్ వెర్షన్ 24.76kmplని ఆఫర్ చేస్తుందని మారుతి వెల్లడించింది. స్టాండర్డ్, Lxi, Vxi Vxi+. మాన్యువల్ శ్రేణి ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు రూ. 5.49 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, ఏజీఎస్ గేర్‌బాక్స్ వరుసగా రూ. 5.65 లక్షలు ,రూ. 5.99 లక్షల ధర కలిగిన Vxi , Vxi+ వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉంది. Image source: Maruti Suzuki 5-స్పీడ్ మాన్యువల్, AGS(ఆటో-గేర్ షిఫ్ట్), ఎంట్రీ-లెవల్ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ప్రీ-టెన్షనర్లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ తోపాటు, హ్యాచ్‌బ్యాక్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, వాయిస్ కన్సోల్, ట్విన్ ఛాంబర్ హెడ్‌ల్యాంప్‌లు , డైనమిక్ సెంటర్ కన్సోల్ స్మార్ట్ ప్లే స్టూడియో లాంటివి ప్రధాన ఫీచర్లు. -
7 దిగ్గజ కంపెనీలకు అప్పులు అసలే లేవు, ఆదాయం మాత్రం లక్షల కోట్లలోనే!
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ దేశ ఆర్ధిక వృద్ది కోసం ఆర్బీఐ స్వల్ప కాలానికి తక్కువ వడ్డీ రేట్లను అమలు చేసింది. క్రమేపీ ఆ వడ్డీ రేట్లను పెంచింది. ఈ తరుణంలో ఆర్బీఐ అమలు చేసిన తక్కువ ఇంట్రస్ట్ రేట్లతో పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపార కార్యకలాపాల కోసం భారీ ఎత్తున రుణాలు తీసుకున్నాయి. అయితే రుణాలు తీసుకొని, అనుకున్న ఫలితాలు రాబట్టలేక, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా కొన్ని సంస్థలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ-50లో నమోదైన మొత్తం 7దిగ్గజ కంపెనీలు సున్నా రుణం లేని సంస్థలుగా అవతరించాయి. ఈ ఏడు నిఫ్టీ 50 కంపెనీలు కలిపి రూ.31 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఆ సంస్థల ఆర్ధిక స్థితి గతుల్ని పరిశీలిస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సున్నా రుణంతో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. 12లక్షల మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. ఆర్ధిక సంవత్సరం 2022లో 26బిలియన్లకు పైగా ఆదాయం గడించింది. 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర లాభంతో కొనసాగుతుంది. ఇన్ఫోసిస్ మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్‌తో పోటీ పడుతుంది. ఆర్ధిక సంవత్సరం 2022లో దాని ఆదాయం 16 బిలియన్లకు పైగా ఉండగా నికర లాభం దాదాపు 3 బిలియన్లుగా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంది. 14 విభాగాల్లో దాదాపూ 44 బ్రాండ్లతో మార్కెట్‌ను శాసిస్తున్న హెచ్‌యూఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాని ఆదాయం దాదాపు 2.4 నుంచి 6.5 బిలియన్ డాలర్ల వృద్దిని సాధించింది. ఐటీసీ టుబాకో-టు-పేపర్ దిగ్గజం ఐటీసీ 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. కాగితం, పొగాకు, హోటళ్లు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో రాణిస్తుంది. కంపెనీ ఆర్ధిక సంవత్సరం 2022లో ఆదాయం 8.4 బిలియన్గా ఉంది. నికర లాభం దాదాపు 2 బిలియన్లకు చేరింది. మారుతీ సుజుకి ఇండియా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సున్నా రుణం లేని సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. టాటా మోటార్స్‌తో పోటీ పడుతూ 2.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో.. మారుతి సుజుకి ఆర్ధిక సంవత్సరం 11 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.దాని లాభం 497 మిలియన్లకు చేరుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ 1.08 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఆర్ధిక సంవత్సరం ఆదాయం 10.6 బిలియన్లు కాగా, నికర ఆదాయం 193 మిలియన్లుగా ఉంది. దివీస్ లాబొరేటరీస్ రూ.96వేల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఫార్మా రంగం నుండి రుణ రహిత సంస్థగా దివిస్ లాబొరేటరీస్ అవతరించింది. జెనరిక్స్, న్యూట్రాస్యూటికల్ తయారీ కంపెనీ దివీస్ ఆదాయం1.2 బిలియన్లు కాగా నికర లాభం 378 మిలియన్లుగా ఉంది. చదవండి👉బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా! కానీ.. -
ఆల్ న్యూ మారుతి బ్రెజా వచ్చేసింది, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ ఎస్యూవీ బ్రెజాను గురువారం లాంచ్ చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా బ్రెజా 2022 మోడల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. అలాగే మొదటిసారిగా ప్యాడిల్ షిఫ్టర్లను కూడా జోడించింది. మొత్తం 10 వేరియంట్లు, ఇందులో 7 మాన్యువల్ ట్రిమ్లుగా, 3 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.మూడు డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా బ్రెజా తొమ్మిది రంగుల్లో తీసుకొచ్చింది. కొత్త మారుతి సుజుకి బ్రెజా కొత్త గ్రిల్, హెడ్లైట్లు, టెయిల్ లైట్లతో సహా ఎక్ట్సీరియర్‌లో డిజైన్‌లో అనేక మార్పులను పొందింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, వైర్లెస్ ఛార్జింగ్ డాక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పరిసర లైటింగ్, హెడ్ అప్ డిస్ప్లేస్, 360 డిగ్రీ కెమెరా ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించిన 8 రోజుల్లోనే 45 వేలకుపైగా ఆర్డర్లను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో సరికొత్త మారుతి సుజుకి బ్రెజా రూ. 7.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా, హై ఎండ్ మోడల్ ధర రూ. 13.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
సెయిల్ మాజీ ఛైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూత
బిజినెస్ వరల్డ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాజీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), మారుతి సుజుకి చైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో వి.కృష్ణమూర్తి మరణించినట్లు సెయిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కృష్ణమూర్తి సెయిల్‌లో 1985 నుంచి 1990 వరకు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. "పద్మ విభూషణ్ డాక్టర్. వెంకట రామన్ కృష్ణమూర్తి మరణం పట్ల సెయిల్ కుటుంబం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందంటూ" సెయిల్ విడుదల చేసిన ప్రటకనలో పేర్కొంది. ఆయన సేవలు మరువలేం! వెంకట రామన్ కృష్ణమూర్తి సెయిల్, బీహెచ్ఈఎల్ వంటి దిగ్గజ సంస్థలకు చైర్మన్‌గా వ్యవరించారు. వీటితో పాటు మారుతి ఉద్యోగ్(మారుతి సుజుకి), గెయిల్‌లో చైర్మన్‌గా ముఖ్య పాత్ర పోషించారు. కృష్ణ మూర్తి మరణంపై మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ. బార్గవ విచారం వ్యక్తం చేశారు. అవుట్ స్టాండింగ్ లీడర్, గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి. ఆయన సారధ్యంలోనే మారుతి ఉద్యోగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారత్‌లో జపనీస్ వర్క్ కల్చర్‌ను పరిచయం చేసింది కృష్ణమూర్తేనని గుర్తు చేశారు. వ్యక్తి గతంగా సివిల్ సర్వీస్ నుంచి ఇండస్ట్రీలిస్ట్‌గా ఎదగడానికి కృష్ణమూర్తి ఎంతో తోడ్పడ్డారని చెప్పారు. కృష్ణమూర్తి గొప్ప దార్శానికుడు. నా గురువుగా..టీవీఎస్ మోటార్‌ను ఒక సామ్రాజ్యంగా విస్తరించడంలో చేసిన కృషి చిరస్మరణీయం. అంతేకాదు వ్యాపార రంగంలో దేశ ఎకానమీ వృద్ది కోసం పాటు పడిన వారిలో కృష్ణమూర్తి ఒకరని టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కొనియాడారు. -
మారుతి ఆల్టో: స్పార్క్ లుక్, రెట్రో డిజైన్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: జపనీస్ కార్ మేకర్ మారుతి సుజుకి పాపులర్ మోడల్ కారు ఆల్టోను రెట్రో డిజైన్‌లో తీర్చిదిద్ది జపాన్‌లో లాంచ్ చేసింది. సుజుకి ఆల్టో లాపిన్ ఎల్సీ పేరుతో సరికొత్తగా ఫోర్ వీలర్ డ్రైవ్ వేరియంట్‌గా ఈ కారును తీసుకొచ్చింది. ఇండియాలో విక్రయిస్తున్న అత్యంత పాపులర్ కారు ఆల్టోతో పోలిస్తే డిజైన్, స్పెసిఫికేషన్స్‌లో భారీ మార్పులు చేసింది. స్పార్క్ లుక్, రెట్రో డిజైన్‌తో ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్ ఫంక్షన్‌తో కూడిన స్టీరింగ్ వీల్‌ను అమర్చింది. ముఖ్యంగా 660 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 3-సిలిండర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో అమర్చింది. ఈ ఇంజిన్ సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే కలిపి వస్తుందట. ఇది 63 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కీలెస్ ఎంట్రీ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది. అలాగే డ్యాష్‌బోర్డ్ Apple CarPlay లేదా Android Autoకి అనుగుణంగా 7 అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్‌తో పాటు రివర్సింగ్ కెమెరాను కూడా అందిస్తోంది.. డ్రైవర్ డిస్ప్లేలో డిజిటల్, మైలేజ్, పవర్ రిజర్వ్ ఇతర సంబంధిత డేటాను అందిస్తుంది. జపాన్‌లో ఆల్టో లాపిన్ ఎల్సీ కారు ధర 14 లక్షల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఆ ల్టో లాపిన్ ఎల్సీ, ఆల్-వీల్ డ్రైవ్ , ఆల్-వీల్ డ్రైవ్ రెండు ఆప్షన్లలో ఇది లభించనుంది. అయితే జపాన్ కీ కార్లు, లేదా మినీవాన్ల మోడల్స్ మాదిరిగా ఉన్న ఈ కారు ఇండియా లాంచింగ్‌పై ఇప్పటికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే కొన్ని స్పెసిఫికేషన్స్‌లో కొన్ని మార్పులు చేసిన అనంతరం ఇండియాలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ఈమేరకు దీని ధర 10 లక్షలకు దగ్గరగా ఉండనుందని అంచనా. -
ఆల్-న్యూ హాట్ & టెక్కీ బ్రెజ్జా, ఒక సూపర్ సర్ప్రైజ్ కూడా
సాక్షి, ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ బ్రెజ్జాను తీసుకురానుంది. 2022 మారుతి సుజుకి బ్రెజ్జా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. అలాగే మారుతి సుజుకి పేరు నుండి 'వితారా' అనే పదాన్ని తొలగిస్తోంది. కేవలం బ్రెజ్జా అని పిలుస్తోంది.ఈ మేరకు మొదటి టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది కొత్త 2022 బ్రెజ్జా జూన్ 30నుంచి కస్టమర్లు అరేనా షోరూమ్‌లో లేదా ఆన్లైన్లో 11 వేలకు ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీకి స్టైలింగ్, ఫీచర్లు టెక్ పరంగా బారీ మేక్ఓవర్‌ను అందిస్తోంది. ముఖ్యంగా కొత్త బ్రెజ్జా తొలి సన్‌రూఫ్ కారుగా రావడం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.ఇంకా కార్ టెక్ కనెక్ట్ , ప్యాడిల్ షిఫ్టర్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లేదా ESPతో అప్డేట్ చేయబడిన ఇంజీన్‌ను జోడించింది. 5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 102బీహెచ్పీ వద్ద 35 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. సీఎస్జీ వెర్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం 6 సంవత్సరాలలో 7.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో, దేశంలోని కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో బ్రెజ్జా బలమైన మార్కెట్ మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు సరికొత్త టెక్ ఫీచర్లు, కమాండింగ్ డ్రైవింగ్ ఫీచర్స్‌తో మారుతి కొత్త బ్రెజ్జా నెక్స్ట్-జెన్ స్మార్ట్ హైబ్రిడ్ కె-సిరీస్ ఇంజన్‌తో వస్తుందని, న్యూహాట్, టెక్కీ బ్రెజ్జాను పరిచయం చేస్తున్నామన్నారు. Feel the breeze while cruising through the city! Introducing Electric Sunroof in the All New #HotAndTechyBrezza.#BookingsOpen #AllNewBrezza #MarutiSuzukiArena #MSArena #MarutiSuzuki pic.twitter.com/ipJI67BbCA — Maruti Suzuki Arena (@MSArenaOfficial) June 20, 2022 -
తస్సాదియ్యా: సెమీ కండెక్టర్ల కొరతున్నా కార్ల కొనుగోలు జోరు తగ్గలేదు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీ వాహన విక్రయాలు మేలో జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్‌తో అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా మహీంద్రా, కియా, టయోటా, హోండా కార్స్, స్కోడా సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ద్వి చక్ర వాహన, ట్రాక్టర్స్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ‘‘గత ఏడాది ఇదే సమయంలో కోవిడ్ రెండో దశ కారణంగా కార్ల తయారీ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ రికవరీ దశలో ఉంది. ఉత్పత్తి పెరుగుదలతో కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది’’ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ మేనెల మొత్తం అమ్మకాలు 1,61,413 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే మేలో విక్రయించిన 46,555 యూనిట్లతో పోలిస్తే 224 % అధికంగా ఉంది. టాటా మోటార్స్ రికార్డు స్థాయిలో 43,341 యూనిట్ల అమ్మకాలతో 185% వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఏకంగా 626% వృద్ధితో 3,454 ఈవీలను విక్రయించింది. -
మారుతీ సుజుకీ వేల కోట్ల పెట్టుబడులు, ఏ రాష్ట్రంలో అంటే!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ సహా వివిధ ప్రాజెక్టులపై రూ. 5,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేథ్ తెలిపారు. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), బీఈవీ బ్యాటరీల తయారీ కోసం సుజుకీ మోటర్స్ గుజరాత్లో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలపై స్పందిస్తూ .. స్థానికంగా విద్యుత్ వాహనాల ఉత్పత్తికి ఈ పెట్టుబడులు గణనీయంగా దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. అలాగే దేశీయంగా తమ బీఈవీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరించుకునేందుకు కూడా ఉపయోగపడగలవని వివరించారు. 2025 నాటికి తమ తొలి బీఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టడంపై మారుతీ సుజుకీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గుజరాత్లో బీఈవీలు, బ్యాటరీల తయారీపై 2026 నాటికి రూ. 10,445 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సుజుకీ మోటర్స్ మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరతపై అనిశ్చితి కొనసాగుతోందని అజయ్ తెలిపారు. 2022–23లో కూడా ఉత్పత్తి పరిమాణంపై దీని ప్రభావం కొంత ఉండవచ్చని వివరించారు. -
బాదుడే.. బాదుడు..మరింత పెరగనున్న కార్ల ధరలు!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల ధరలు ఎగుస్తున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను ఈ నెలలో పెంచనున్నట్లు దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. అయితే, ఎంత మేర పెంచేదీ మాత్రం వెల్లడించలేదు. ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో గత ఏడాది కాలంగా వాహనాల తయారీ వ్యయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఎంఎస్ఐ వివరించింది. దీనితో కొంత భారాన్ని రేట్ల పెంపు రూపంలో కొనుగోలుదారులకు బదలాయించక తప్పడం లేదని పేర్కొంది. ఉక్కు, అల్యుమినియం వంటి కమోడిటీలతో పాటు సరకు రవాణా చార్జీలు మొదలైనవన్నీ పెరిగిపోవడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఏప్రిల్ నుండి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకీ గతేడాది జనవరి నుండి ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో 8.8 శాతం మేర తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. ఆల్టో మొదలుకుని ఎస్–క్రాస్ వరకూ వివిధ మోడల్స్‌ను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.25 లక్షల నుండి రూ. 12.77 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంది. -
సరికొత్త హంగులతో మారుతి సుజుకి బాలెనో...!
2022 Maruti Baleno Facelift: భారతీయ మార్కెట్లో త్వరలోనే కొత్త 2022 మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (2022 Maruti Baleno Facelift) విడుదల కానుంది. ఈ కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ కి సంబంధించిన చాలా విషయాలను కంపెనీ ఇదివరకే చాలా టీజర్ వీడియోల ద్వారా పంచుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ కారుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. డిజైన్‌లో సరికొత్త హంగులతో... 2022 మారుతి సుజుకి బాలెనో ప్రొఫైల్ ప్రస్తుత మోడల్‌కు కొంతవరకు సమానంగా ఉంటుంది. ఇది కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులను పొందుతుంది. విండో లైన్ వెంట క్రోమ్ తో రానుంది. , ఇది వెనుక క్వార్టర్ గ్లాస్ వరకు విస్తరించి ఉంది. డోర్ హ్యాండిల్స్‌పై కూడా క్రోమ్ లుక్స్ కనిపిస్తుంది. బాలెనో కొత్తగా రూపొందించిన 16-అంగుళాల 10-స్పోక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ తో రానుంది. 2022 మారుతి సుజుకి బాలెనో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ లుక్‌తో రానుంది. ఫేస్ లిఫ్ట్ మోడల్ కోసం గ్రిల్ వెడల్పుగా వస్తోంది. ఇది LED హెడ్లైట్లు,DRL లు కొత్త సెట్‌తో రానుంది. ఫాగ్‌ల్యాంప్ కేసింగ్ పరిమాణాన్ని పెంచడానికి బంపర్ కూడా ట్వీక్ చేశారు.. బానెట్‌కు మరింత ఫ్లాట్‌గా కనిపించేలా రీడిజైన్ చేయబడింది. ఈ వివరాలు కంపనీ ప్రీమియమ్ డీలర్షిప్ అవుట్లెట్ నెక్సా వెబ్సైట్ ద్వారా లీకయ్యాయి. భద్రతలో సరికొత్తగా... న్యూ ఫేస్ లీఫ్ట్ బాలెనోలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 2022 మారుతి సుజుకి బాలెనో వెనుక భాగం కూడా రీడిజైన్ చేయబడింది. ఇది ఇప్పుడు LED ర్యాప్‌రౌండ్ టైల్లైట్ సరికొత్తగా వెనుక బంపర్‌తో అందించబడుతుంది. మారుతి హ్యాచ్‌బ్యాక్ డైమెన్షన్‌ను మార్చనందున బూట్ స్పేస్ మారదు. 2022 మారుతి సుజుకి బాలెనో ఇంటీరియర్ రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్‌తో రిఫ్రెష్ లుక్‌ను అందిస్తుంది. ఇది ఇప్పుడు డ్యాష్‌బోర్డ్ వెడల్పులో క్రోమ్ యాక్సెంట్లతో డ్యూయల్-టోన్ యూనిట్. ఫ్లోటింగ్ 9-ఇచ్ డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సరౌండ్ సెన్స్‌తో స్మార్ట్‌ప్లే ప్రో+ని అందిస్తుంది. ఈ కారులో స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌లోని స్విచ్ గేర్లు కూడా మార్చబడ్డాయి. ఇంజిన్ విషయానికీ వస్తే... మారుతి బాలెనో భారతదేశంలో ఒకే ఇంజన్ ఆప్సన్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ బాలెనో ఇంజిన్‌ను మార్చలేదు. కావున మొదటిది 1.2-లీటర్ ఇంజన్, ఇది 83 బిహెచ్పి పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. -
అయ్యో మారుతి ! ఆటోమొబైల్ సెక్టార్‌పై ‘చిప్’ ఎఫెక్ట్
దేశంలోనే నంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కార్ల తయారీలో కీలకమైన సెమికండర్లు (చిప్)ల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యను అధిగమించేందుకు మారుతి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. చిప్సెట్ల ఎఫెక్ట్ దసరా, దీపావళి పండుగలకి మన దగ్గర కార్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. మారుతి సైతం ఇదే లక్ష్యంతో భారీగా సేల్స్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన చిప్సెట్ల కొరత కారణంగా ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మారుతికి చిప్సెట్లు తయారు చేసే కంపెనీలు ఇప్పుడప్పుడే డిమాండ్‌కు తగ్గట్టు చిప్‌లు సరఫరా చేయలేమంటూ తేల్చిచెప్పాయి. దీంతో పండగ సీజన్ అమ్మకాల మాట అటుంచి చివరకు నెలవారీ తయారీ యూనిట్లలోనూ కోత పెట్టేందుకు మారుతి సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. టార్గెట్ కుదింపు ? దసరా, దీపావళీలను లక్ష్యంగా చేసుకుని మారుతి సెప్టెంబరు నెల తయారీ టార్గెట్ 60,000 నుంచి 90,000 యూనిట్లుగా ఆగస్టులో నిర్ధేశించుకుంది. అయితే చిప్సెట్ల కొరత కారణంగా ఈ టార్గెట్‌ను 50,000 నుంచి 70,000లకు కుదించినట్టు ఎకనామిక్ టైమ్స్ లో కథనాలు ప్రచురితం అయ్యాయి. సాధారణంగా పండగ సీజన్లో లక్షకు పైగా యూనిట్లను మారుతి తయారు చేస్తుంది. కానీ చిప్ సెట్ల కొరతతో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. 2014 తర్వాత కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్లు విధించినప్పుడు కూడా మారుతి కార్ల తయారీ ఈ స్థాయిలో దిగువకు చేరుకోలేదు. చివరి సారిగా 2014లో యాభై వేల యూనిట్లు తయారు చేశారు. ఆ తర్వాత ప్రతీ ఏడు 70వేలకు పైగానే కార్లు తయారు అయ్యేవి. చిప్సెట్లు, సెమికండక్టర్ల కొరతతో మారుతి ప్రణాళిక అమలు కష్టంగా మారింది. ఓపెన్ మార్కెట్ నుంచి చిప్సెట్లు కొనుగోలు చేసే దిశగా కూడా మారుతి ప్రయత్నాలు చేస్తోంది. షేర్ ధర తగ్గలేదు చిప్ సెట్ల కొరతతో ఇబ్బందుల్లో మారుతి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ కంపెనీ షేర్ వ్యాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం రోజు మారుతి షేర్ ధర రూ.6605 నుంచి 6,675కి చేరుకోవడం ఈ కంపెనీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. చదవండి: ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ? -
సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించే విషయంలో మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్ల పని తీరు అస్సలు బాగోలేదంటూ లాటిన్ ఎన్సీఏపీ స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ రెండు కార్లు దారుణమైన ఫలితాలను పొందాయి. క్రాష్ టెస్ట్ కార్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి వివిద దేశాలు న్యూ కార్ ఎస్సెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) పేరుతో క్రాష్ టెస్ట్‌లు నిర్వహించి రేటింగ్స్ ఇస్తుంటాయి. ఇటీవల లాటిన్ ఎన్సీపీఏ పరీక్షలు నిర్వహించగా మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్లు ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఇటీవల కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించగా ఈ రెండు ప్రముఖ కార్లు దారుణంగా జీరో స్టార్స్ రేటింగ్ సాధించి నిరాశజనకమైన ఫలితాలు కనబరిచాయి. మారుతి స్విఫ్ట్ పరిస్థితి మారుతి సిఫ్ట్కి సంబంధించి హ్యాచ్‌బ్యాక్, సెడాన్ రెండు కార్లు సైతం ఈ టెస్టులో అత్తెసరు మార్కులు కూడా సాధించలేపోయాయి. ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 15.53 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో సున్నా శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 66 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 6.98 శాతం పాయింట్లనే సాధించగలిగింది. దీంతో మారుతి స్విఫ్ట్‌కి లాటిన్ ఎన్సీఏపీ జీరో రేటింగ్ ఇచ్చింది. డస్టర్దీ అదే దారి రెనాల్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ డస్టర్‌కి ఈ క్రాష్ టెస్ట్‌లో ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 29.47 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో 22.93 శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 50.79 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 34.88 శాతం పాయింట్లనే సాధించగలిగింది. రక్షణ చర్యలేవి లాటిన్ ఎన్సీఏపీ పరీక్షలో విఫలమైన మారుతి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ల్ కార్లలో స్టాండర్డ్‌గా రెండు ఎయిర్‌బ్యాగులు అందించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ విషయంలో ఈ రెండు కార్లలో భద్రతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని లాటిన్ ఎన్సీఏపీ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం పెద్దలోటని తెలిపింది. ఇప్పుడే కష్టం యూఎన్ 95 నిబంధనలకు తగ్గట్టుగా స్విఫ్ట్ , డస్టర్ కార్లలో భద్రతా ఏర్పాట్లు లేనందున వీటిని ఇప్పుడే లాటిన్ దేశాల్లో అనుమతించే అవకాశం లేదు. 2018లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్‌కి 2 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈసారి రేటింగ్ మెరుగవుతుందని భావిస్తే దారుణంగా పడిపోయింది. యూరోపియన్, లాటిన్ దేశాల్లో కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌లు తప్పనిసరిగా మారాయి. చదవండి : హ్యుందాయ్ సంచలనం! త్వరలో హైడ్రోజన్ వేవ్ కారు!! -
ఎలక్ట్రిక్‌లోనూ దూసుకెళ్తాం: మారుతీ
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న సెమికండక్టర్ల కొరత సమస్య తాత్కాలికమేనని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ అన్నారు. వచ్చే ఏడాది ఇది సమసిపోతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. కంపెనీపై కొరత ప్రభావం స్వల్పమేనని వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి ప్రవేశిస్తాం. ధర విషయంలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, అలాగే కంపెనీ నష్టపోకుండా ఉన్నప్పుడే ఎంట్రీ ఇస్తాం. సంప్రదాయ కార్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈవీ రంగంలోనూ తొలి స్థానంలో నిలవాలన్నదే మా ధ్యేయం’ అని ఆయన చెప్పారు. -
టాప్‌గేర్‌లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
వాహన ఎగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మహమ్మారి నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. భారత్ నుంచి వాహన ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 14,19,430 వాహనాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 4,36,500 మాత్రమే. ప్రయాణికుల వాహనాలు 43,619 నుంచి 1,27,115 యూనిట్లకు చేరాయి. వీటిలో కార్లు 79,376 కాగా, యుటిలిటీ వెహికిల్స్ 47,151 ఉన్నాయి. మారుతి సుజుకి 45,056, హ్యుండాయ్ మోటార్ 29,881, కియా 12,448, ఫోక్స్‌వ్యాగన్ 11,566 యూనిట్లను ఎగుమతి చేశాయి. ద్విచక్ర వాహనాలు గడిచిన మూడేళ్లతో పోలిస్తే మెరుగ్గా నమోదు అయ్యాయి. ఈ విభాగంలో 2021–22 తొలి త్రైమాసికంలో 11,37,102 యూనిట్లు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,37,983. వాణిజ్య వాహనాలు 3,870 నుంచి 16,006 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 50,631 నుంచి 1,37,582కు ఎగిశాయి. కాగా విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి రావాల్సి ఉంది. -
మారుతీ మొబిలిటీ చాలెంజ్: పది లక్షలు మీ సొంతం..!
న్యూఢిల్లీ: రవాణా, వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ఆవిష్కరించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) కొత్తగా మొబిలిటీ చాలెంజ్ పోటీలను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు చెందిన టీ–హబ్‌తో కలిసి దీన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దేశవిదేశాలకు చెందిన సిరీస్ ఎ స్థాయిలోని స్టార్టప్‌లు మొదలుకుని యూనికార్న్‌ల స్థాయి సంస్థలు ఇందులో పాల్గొనవచ్చని వివరించింది. మారుతీ ఇప్పటికే మెయిల్ (మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్) పేరిట స్టార్టప్‌ల కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన మొబిలిటీ చాలెంజ్ .. ప్రత్యేకంగా ప్రారంభ దశలోని, పూర్తి స్థాయిలో విస్తరించిన స్టార్టప్‌ల కోసం ఉద్దేశించినది. ఎంపికైన స్టార్టప్‌లకు మారుతీ, టీ–హబ్ నుంచి తోడ్పాటు లభిస్తుంది. గెలుపొందిన రెండు సంస్థలకు చెరి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఉంటుంది. చదవండి: మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు -
మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు
ముంబై: రెండో దశ కోవిడ్ ప్రభావం దేశీయ వాహన విక్రయాలపై తీవ్ర ప్రతికూలతను చూపింది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్డౌన్లతో ఉత్పత్తి, పంపిణీలకు అంతరాయం కలిగింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి ఆటో కంపెనీలు కొన్నిరోజుల పాటు తమ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటాతో సహా అన్ని కంపెనీల అమ్మకాలు క్షీణత నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మే నెలలో 35,293 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఈ ఏప్రిల్ నెలలో అమ్మిన 1.42 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 75 శాతం క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లను ఆక్సిజన్ తయారీకి వినియోగించడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్స్ మే నెలలో 25,001 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో అమ్మిన 49,002 యూనిట్లతో పోలిస్తే 49 శాతం తక్కువ. ఇదే మే నెలలో టాటా మోటార్స్ వాహన అమ్మకాలు 40 క్షీణించాయి. ఏప్రిల్‌లో 25,091 యూనిట్లను విక్రయించిన ఈ కంపెనీ మే నెలలో 15,181 వాహనాలను మాత్రమే విక్రయించింది. కియా మోటార్స్ ఏప్రిల్‌లో 16,111 యూనిట్లు విక్రయించింది. మేనెలలో 11,050 యూనిట్లకు పరిమితమైన అమ్మకాల్లో 31 శాతం క్షీణతను నమోదు చేసింది. చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్!
సాక్షి, ముంబై: నిన్న(ఏప్రిల్ 26 సోమవారం) భారత మార్కెట్లో లాంచ్ అయిన 2021 సుజుకి హయాబుసా హాట్ కేకులా అమ్ముడు పోయింది. సుజుకి ఆన్లైన్ బుకింగ్ పోర్టల్‌లో వైట్ కలర్ మోడల్ నో స్టాక్ బోర్డు చూపిస్తోంది. దీంతో హయాబుసా పాపులారిటీ చూసి కస్టమర్లు షాక్ తిన్నారు. కానీ ఆసక్తి ఉన్న కస్టమర్లు లక్ష రూపాయలు చెల్లించి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎన్ని యూనిట్లు బుక్ అయ్యాయనే దానిపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అలాగే అవుట్ ఆఫ్ స్టాక్ ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన అగ్రశ్రేణి స్పోర్ట్స్ బైక్ హయబుస మూడో తరం వెర్షన్ బైక్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.16.40 లక్షలుగాఉంది. కంపెనీ దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ బైక్‌ను అప్డేట్ చేసింది. బీఎస్-6 ఉద్గార నియమాలను కలిగిన 1,340 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ఇందులో ఉంది. హిల్‌హోల్డ్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. బైక్ డెలివరీలు మే నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, రూ.లక్ష నగదు చెల్లించి ఆన్లైన్లో బుక్ చేసుకోచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్పోర్ట్స్ బైకులను ఇష్టపడే రైడర్లకు కొత్త హయబుస చక్కని ఎంపిక అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కొయిచిరో హిరావ్ పేర్కొన్నారు. -
మారుతి మాజీ ఎండీ కన్నుమూత: ఇండస్ట్రీ దిగ్భ్రాంతి
సాక్షి,ముంబై: ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నోషన్ వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ (78) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 1993-2007 కాలంలోఖత్తర్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఖత్తర్ పనిచేశారు. తరువాత 1999లో తొలుత ప్రభుత్వ నామినీగా, అనంతరం మే 2002 లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీ గా పనిచేశారు.ఖత్తర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్ర మల్టీ-బ్రాండ్ పాన్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కార్నేషన్ ఆటోను 2008 లో ప్రారంభించారు. దీనికి ముందు దాదాపు 37 సంవత్సరాల పాటు ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. ఖత్తర్ మరణ వార్తను మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ ధృవీకరించారు. ఆయన హఠాన్మరణంవ్యక్తిగతంగా తనకు తీరని నష్టమని వ్యాఖ్యానించారురు. ఖత్తర్ అకాలమరణంటో ఆటో పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం.. కాంపౌండింగ్ -
వ్యాగన్ఆర్ అంత ఘోరమా : టాటా మోటార్స్ సెటైర్లు
సాక్షి, ముంబై: భద్రతా ప్రమాణాల విషయంలో మెరుగైన రేటింగ్ సాధించిన ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది. తాజాగా మారుతి సుజుకిని లక్ష్యంగా చేసుకుంది. మారుతి సుజుకి వాహనం వ్యాగన్ఆర్పై సెటైర్లు వేసింది. ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న టాటా మెటార్స్ భద్రతా క్రాష్ పరీక్షలలో విఫలమైన పోటీ సంస్థల కార్లపై వరుసగా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, మారుతి ఎస్-ప్రెస్సోపై విమర్శలు చేసింది. (ఎస్బీఐతో బెంజ్ జట్టు: ప్రత్యేక ఆఫర్లు) చక్రం ఊడిపోయిన ఇమేజ్ను ట్వీట్ చేస్తూ, భద్రత ముఖ్యం స్మార్ట్‌గా ఉండాలంటూ సూచించింది. అంతేకాదు కారు స్పెల్లింగ్‌లో కావాలనే ‘R’చేర్చడం గమనార్హం. మారుతి వాగన్ఆర్ గ్లోబల్ ఎన్సీఏపీ భద్రతా క్రాష్ పరీక్షలలో పేలవమైన రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ 2014-2019 మధ్య వచ్చిన కార్లలో సురక్షితమైన భారతీయ కార్ల జాబితాను ప్రకటించింది. ఇందులో మారుతి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, కియా మోటార్స్ సెల్టోస్ ఎస్యూవీ రేటింగ్ దారుణంగా ఉండగా, టాటా మోటార్స్ కార్లు నెక్సాన్, ఆల్ట్రోజ్ ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్‌ను పొందాయి. ఇంకా టిగోర్, టియాగో కూడా సురక్షితమైన కార్లుగా పేర్కొంటూ ఫోర్-స్టార్ రేటింగ్ ఇచ్చింది. Safety is 'two' important to be ignored. Be smart before someone overturns your caRt. Choose Tiago, the safest car in the segment, rated 4 stars by GNCAP. Click on https://t.co/x9nKgE745s to book now.#Tiago #NewForever #SaferCarsForIndia pic.twitter.com/3k8Ughat0C — Tata Motors Cars (@TataMotors_Cars) November 22, 2020 -
వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కార్లను భారీ సంఖ్యలో రీకాల్ చేస్తోంది. ఫ్యూయెల్ పంప్లో లోపాలు ఉండటంతో వ్యాగన్ ఆర్, బాలెనో మోడళ్ళను రీకాల్ చేస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతి బుధవారం ప్రకటించింది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఈ లోపాలను సరిదిద్ది కస్టమర్లకు తిరిగి అందించనున్నామని దేశంలోని అతిపెద్ద ప్రయాణీకుల వాహనాల తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కార్లు వాగన్ ఆర్, బాలెనో (పెట్రోల్ వేరియంట్) 1,34,885 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. నవంబర్ 15, 2018-2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వ్యాగన్ఆర్ 56,663 కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే జనవరి 8, 2019-నవంబర్ 8, 2019 మధ్య తయారైన బాలెనో 78,222 కార్లను రాబోయే వారాల్లో రీకాల్ చేస్తామని పేర్కొంది. కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ భర్తీ చేస్తుందని వెల్లడించారు. మోటారు జనరేటర్ యూనిట్లో లోపం కారణంగా డిసెంబరులో, 63,493 యూనిట్ల ప్రీమియం సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6, ఆగస్టులో 40,618 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. -
సగానికి పైగా తగ్గిన మారుతి జూన్ అమ్మకాలు
దేశీయ అతిపెద్ద వాహన దిగ్గజం మారుతి సుజుకీ జూన్ అమ్మకాలు సగానికి పైగా తగ్గాయి. ఈ జూన్‌లో మొత్తం 57,428 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జూన్‌లో అమ్మిన 1,24,708 వాహనాలతో పోలిస్తే ఇది 54శాతం తక్కువ. దేశీయంగా ఈ నెలలో 53,139 వాహన విక్రయాలను జరిపింది. గతేడాది ఇదే నెలలో మొత్తం 1.14లక్షల యూనిట్లను విక్రయించింది. విదేశాలకు 4,289 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది జూన్‌లో ఎగుమతి చేసిన 9,847 మొత్తం వాహనాలతో పోలిస్తే ఇవి 56.4శాతం తక్కువ. చిన్న తరహా విభాగానికి చెందిన అల్టో, వేగనార్ అమ్మకాలు గతేడాది ఇదే జూన్‌లో 18,733 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో 44.2 శాతం క్షీణించి 10,458 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో కాంపాక్ట్ విభాగంలో సిఫ్ట్, సెలెరియో, ఇగ్నీస్, బాలెనో, డిజైర్ మోడళ్లు 6,696 అమ్ముడుపోయాయి. ఈ జూన్‌లో మధ్య తరహా విభాగానికి చెందిన 553 సెడాన్ సియాజ్ కార్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాదిలో విక్రయించిన 2,322 యూనిట్లతో పోలిస్తే, ఇది 76.2 శాతం తక్కువ. యూటిలిటీ విభాగానికి చెందిన విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 45.1 శాతం క్షీణించి 9,764 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఈ తొలి త్రైసిమాకంలో కంపెనీ 76,599 వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో విక్రయించిన 4,02,594 వాహనాలతో పోలిస్తే ఇది 81శాతం తక్కువ. కరోనా ప్రేరేపిత్ లాక్డౌన్ విధింపు అమ్మకాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలిపింది. ప్లాంట్లలో ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని ఇదే సందర్భంలో తమ ఉద్యోగ సభ్యులందరి ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు ముఖ్యమని కంపెనీ తెలిపింది. జూన్ వాహన విక్రయాలు సగానికి పైగా క్షీణించడంతో మారుతి సుజుకీ షేరు బుధవారం అరశాతం నష్టంతో రూ.5786.90 వద్ద స్థిరపడింది. -
కరోనా : క్షీణించిన మారుతి విక్రయాలు
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ దేశీయ వాహన అమ్మకాలు మరోసారి భారీగా పడిపోయాయి. మార్చి మాసంలో సంవత్సర ప్రాతిపదికన 48 శాతం క్షీణతను నమోదు చేశాయి. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ ఆటో అమ్మకాలను ప్రభావితం చేసింది. కరోనా వైరస్‌ను అడ్డుకనేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా మార్చి 22, 2020 నుండి కార్యకలాపాలను నిలిపివేశామనీ, దీని మూలంగా మార్చి 2020 లో అమ్మకాలు 2019 మార్చిలో అమ్మకాలతో పోల్చలేమని కంపెనీ బుధవారంనాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కరోనావైరస్ ఆందోళనల మధ్య ఆటోమొబైల్ అమ్మకాలు మార్చి 15 నుండి పాతాళానికి పడిపోయాయి. దీంతో మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కంపెనీ 76,976 యూనిట్లను విక్రయించింది, ఏడాది క్రితం 147,613 యూనిట్లుగా వుంది. ముఖ్యంగా కాంపాక్ట్ అమ్మకాల క్షీణత మారుతి దేశీయ అమ్మకాలను దెబ్బతీసింది. మారుతి ప్రసిద్ధ మోడళ్లైన స్విఫ్ట్, బాలెనో, వాగన్ఆర్ డిజైర్లను కార్ల విక్రయాలు 51 శాతం క్షీణించాయి. సంవత్సరానికి 42,000 యూనిట్లకుపైగా తగ్గిపోయాయి. మినీ కేటగిరీలో, ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 5శాతం తగ్గి 15,988 యూనిట్లకు చేరుకుందని కంపెనీ నివేదించింది. యుటిలిటీ వెహికల్ విభాగంలో మారుతి విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ , ఎక్స్ఎల్ 6 అమ్మకాలు 53శాతం పడిపోయి 11,904 యూనిట్లకు తగ్గింది. మధ్యతరహా సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా ఏడాది క్రితం 3,672 యూనిట్ల నుండి 1,863 యూనిట్లకు తగ్గాయి. వ్యాన్స్ విభాగంలో, ఇది 5,966 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 64 శాతం క్షీణత. కంపెనీ తన తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్ క్యారీలో 736 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 2,582 యూనిట్లు. మార్చిలో కంపెనీ మొత్తం ఎగుమతులు 55శాతం తగ్గి 4,712 యూనిట్లుగా ఉన్నాయి. అయితే 2020 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 14,36,124 యూనిట్లను మారుతి విక్రయించింది, ఇది 18శాతం క్షీణత కాగా, ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలు 15,63,297 యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 18,62,449 యూనిట్లు. అంటే 16శాతం క్షీణించాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, బలహీనమైన డిమాండ్, 2020 ఆర్థిక సంవత్సరంలో బీఎస్-6 నిబంధనలు, మూలధన కొరత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన ఆటో పరిశ్రమకు కరోనా రూపంలో మరో భారీ దెబ్బ తగిలింది. అయితే లాక్డౌన్ తర్వాత కొన్నాళ్లపాటు బీఎస్4 వాహనాల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. -
విటారా బ్రెజా కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన పాపులర్ ఎస్యూవీ మోడల్, విటారా బ్రెజాలో పెట్రోల్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరలు రూ.7.34 లక్షల నుంచి రూ.11.4 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్–సిక్స్ పెట్రోల్ విటారా బ్రెజాను 1.5 లీటర్ కె–సిరీస్ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్లో 5 గేర్లు(మాన్యువల్) వెర్షన్‌తో పాటు ఏఎమ్‌టీ(ఆటోమేటిక్ ట్రాన్సిషన్)ను కూడా అందిస్తున్నామని తెలిపారు. డీజిల్ కార్లకు టాటా... ఈ కొత్త విటారా బ్రెజాకు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించగలదన్న ధీమాను కెనిచి అయుకవ వ్యక్తం చేశారు. బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తి నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. విటారా బ్రెజాలో డీజిల్ వేరియంట్‌ను దశలవారీగా ఉపసంహరిస్తామని వివరించారు. 2016లో విటారా బ్రెజా (డీజిల్) మోడల్‌ను మారుతీ సుజుకీ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. అనతికాలంలోనే యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఐదు లక్షల విటారా బ్రెజాలు అమ్ముడయ్యాయి. -
మారుతి జిమ్నీని చూశారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆటో ఎక్స్పో 2020లో దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి తన హవాను చాటుకుంటోంది. నాలుగో తరం జపాన్ మోడల్ వాహనం సుజుకి జిమ్నీని శనివారం ప్రదర్శించింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 75 కిలోవాట్ / 6000 ఆర్పీఎం పవర్, 130 ఎన్ఎమ్ / 4000 ఆర్‌పిఎమ్ గరిష్ట టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. భారతీయ వినియోగదారుల స్పందనను పరిశీలించేందుకు ఆటో ఎక్స్పో 2020లో ప్రదర్శనకు ఉంచామని మారుతి సీఎండీ కెనిచి అయుకావా వెల్లడించారు. కష్టతరమైన రోడ్లలో కూడా సులువుగా ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు. ప్రొఫెషనల్ వినియోగదారుల అంచనాలు, అవసరాలపై సమగ్ర పరిశోధనల ఆధారంగా జిమ్నీని అభివృద్ధి చేశామన్నారు. కాంపాక్ట్ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో సుజుకి జిమ్నీకి మంచి ఆదరణ లభిస్తోందని, 194 దేశాలలో విక్రయిస్తున్నా మన్నారు. చదవండి : ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు, ఆటో ఎక్స్పో: టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు , కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020 లోకొత్త విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి లాంచ్ చేసింది. దేశంలో అమలు కానున్న ఉద్గార నిబంధనలు నేపథ్యంలో బీఎస్-6 1.5 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజీన్‌తో గురువారం ఆవిష్కరించింది. సరికొత్త వెర్షన్లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీలలో విటారా బ్రెజ్జా ఉన్నతంగా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా సీఎండీ కెనిచి ఆయుకావా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ, ప్రీమియంలో వస్తున్న ఆదరణకు తగినట్టుగా, విటారా బ్రెజ్జా మరింత స్పోర్టియర్‌గా మరింత శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల నుంచి భారీ స్పందనను ఆశిస్తున్నట్టు తెలిపారు. విటారా బ్రెజ్జా 1.5 లీటర్ కె-సిరీస్ బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 138 ఎన్ఎం వద్ద 4400 ఆర్పీయం టాప్ ఎండ్ టార్క్, పెప్పీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో లాంచ్ చేసిన విటారా బ్రెజ్జా వాహనం నాలుగేళ్లలో 500,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని వెల్లడించింది. చదవండి : ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ అదరగొడుతున్న పియాజియో స్కూటీలు -
ఆటో ఎక్స్పో 2020
-
కార్ల సందడి రెడీ!!
రెండేళ్లకొకసారి జరిగే వాహన పండుగకు రంగం సిద్ధమైంది. పర్యావరణ స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు బాగా ఉండగలదని నిపుణులు భావిస్తున్నారు. మందగమనం కారణంగా వాహన విక్రయాలు కుదేలయ్యాయని, ఆ ఆటో ఎక్స్పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్నివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి ఆరంభం కానున్న ఆటో ఎక్స్‌పోకు సంబంధించిన వివరాలు, పాల్గొనే కంపెనీలు, అవి ఆవిష్కరించే మోడళ్లు తదితర అంశాల సమాహారం సాక్షి పాఠకుల కోసం ప్రత్యేకం... ఆర్థిక మందగమనం వాహన రంగాన్ని బాగా దెబ్బతీస్తోంది. గత ఏడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వాహన రంగ రికవరీ ఆటో ఎక్స్‌పోతో ఆరంభం కాగలదని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. 1986లో మొదలై ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ ఆటో ఎక్స్‌పోలో దేశీ, విదేశీ కంపెనీలు తమ వాహనాలను డిస్ప్లే చేయనున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలకు, మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఆటో ఎక్స్పో వేదికగా పలు వాహన కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ 6 ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో ఈ ఆటో షో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అమ్మకాలు తగ్గుతుండటం, బీఎస్ 6 నిబంధనలు అమల్లోకి రానుండటం తదితర కారణాల వల్ల పలు కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనడం లేదు. కాగా, చైనాకు చెందిన గ్రేట్ వాల్మోటార్స్, ఫా హైమ ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఆటో ఎక్స్పో ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. 2018లో జరిగిన ఆటో ఎక్స్‌పోకు సుమారుగా 6 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోకు కూడా ఇదే స్థాయిలో సందర్శకులు వస్తారనేది నిర్వాహకుల అంచనా. మారుతీ సుజుకీ.... ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ‘ఫ్యూచరో–ఈ’ ను ఆవిష్కరించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారత కారుగా ఈ కాన్సెప్ట్ కారు నేటి యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని మారుతీ పేర్కొంది. దీంతో బీఎస్–6 పెట్రోల్ విటారా బ్రెజా, ఇగ్నిస్ మోడల్లో అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను, స్విఫ్ట్ హైబ్రిడ్ వేరియంట్‌ను, మరో 14 ఇతర మోడళ్లను ప్రదర్శించనున్నది. టాటా మోటార్స్ పలు ఎస్యూవీ మోడళ్లను టాటా మోటార్స్ కంపెనీ ఈ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేయనున్నది. ఏడు సీట్ల ఎస్యూవీ గ్రావిటాస్ మోడల్‌ను ఇక్కడే ఆవిష్కరించనున్నది. ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని, హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ కారును, హారియర్ మోడల్లో కొత్త వేరియంట్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌లు విలీనమై ఏర్పాటైన స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా పలు మోడళ్లను ఈ ఆటో ఎక్స్పో కోసం సిద్ధం చేస్తోంది. టిగుయాన్ ఆల్స్పేస్, టీ–రోక్ ఎస్యూవీ, విజన్ ఇన్, ఆక్టేవియా ఆర్ఎస్245, సూపర్బ్‌లో కొత్త వేరియంట్, కోడియాక్ టీఎస్ఐ, కరోక్ ఎస్‌యూవీలను తెస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీల్లో కొత్త వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా డిస్ప్లే చేయనున్నది. ఎక్స్‌యూవీ300, కేయూవీ100 మోడళ్లలో ఎలక్ట్రిక్ వేరియంట్లను కలుపుకొని మొత్తం నాలుగు ఎస్యూవీ ఈవీలను సిద్ధం చేస్తోంది. బీఎస్–6 ప్రమాణాలతో కూడిన అల్టురాస్, ఎక్స్‌యూవీ300, మారాజో వేరియంట్లను ప్రదర్శించనున్నది. వందకు పైగా ఆవిష్కరణలు... దాదాపు 31 కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాలుపంచుకోనున్నాయి. దాదాపు వందకు పైగా కొత్త మోడళ్లు, వేరియంట్ల ఆవిష్కరణ జరగనున్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన 30కి పైగా స్టార్టప్‌లు కూడా తమ తమ టెక్నాలజీలను, ఉత్పత్తులను డిస్ప్లే చేయనున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా చైనా ప్రతినిధులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. చైనా కంపెనీలు ఆ ఆటో ఎక్స్‌పోలో పాల్గొంటాయని, ఇక్కడి ఉన్నతాధికారులే వస్తారని, చైనా నుంచి పెద్ద అధికారులెవరూ రారని సమాచారం. కాగా, ఈ ఆటో ఎక్స్పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్నివ్వగలదని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ మీనన్ ఆశాభావం వ్యక్తంచేశారు. హ్యుందాయ్.... క్రెటా మోడల్లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించనున్నది. ఎలంత్ర, ట్యూసన్, ఐ30ఎన్ హ్యాచ్బాక్లతో పాటు నెక్సో ఫ్యూయల్ సెల్ ఎస్‌యూవీని కూడా ప్రదర్శించనున్నది. ఎమ్జీ మోటార్స్ చైనాకు చెందిన ఈ కంపెనీ పలు ఎస్‌యూవీలను ఆ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేయనున్నది. ఐ–విజన్ కాన్సెప్ట్, మాక్సస్ డి90, 6 సీట్ల హెక్టర్, ఎమ్జీ 6 హ్యాచ్‌బ్యాక్, ఎమ్జీ 360 సెడాన్లను సిద్ధం చేస్తోంది. కియా మోటార్స్ ఈ కంపెనీ కార్నివాల్ ఎమ్‌పీవీ(మల్టీ పర్పస్ వెహికల్)ను, క్యూవైఐ ఎస్‌యూవీని, సోల్ ఈవీ, స్ట్రింజర్ జీటీ, స్పోర్టేజ్ క్రాసోవర్, నిరో హ్యాచ్‌బ్యాక్ తదితర కార్లను ప్రదర్శించనున్నది. రెనో ఈ కంపెనీ మొత్తం 12 కార్లను డిస్ప్లే చేయనున్నది. హెచ్‌బీసీ ఎస్యూవీ, జో ఈవీ హ్యాచ్‌బాక్, ట్రైబర్ ఏఎమ్‌టీ, ట్రైబర్ పెట్రోల్ కార్లను ఆవిష్కరించనున్నది. గ్రేట్ వాల్ మోటార్స్ చైనాకు చెందిన ఈ కంపెనీ హావల్, ఓరా బ్రాండ్ ఎస్యూవీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించనున్నది. హెచ్9, హెచ్6, హెచ్1 ఎస్‌యూవీలతో పాటు హెచ్, విజన్ 2025 కాన్సెప్ట్ కార్లను డిస్ప్లే చేయనుంది. మెర్సిడెస్ బెంజ్ కొత్త ఏ–క్లాస్ లిమోసిన్, 2020 జీఎల్ఏ, ఈక్యూసీ ఎడిషన్ 1886– ఈ మూడు కార్లను ఆవిష్కరించనుంది. ఏఎమ్‌జీ జీటీ 63 ఎస్ 4మ్యాటిక్ 4 డోర్ల కూపే కారుతో పాటు వి–క్లాప్ మార్కోపోలో కార్లను తీసుకొస్తోంది. ఎప్పుడు: ఈ నెల 7–12 తేదీల్లో ఎక్కడ: ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో ఇది ఎన్నవ సారి: 15వ సారి పాల్గొనే కంపెనీల సంఖ్య: 30కి పైగా ఆవిష్కరణలు: కొత్త మోడళ్లు, వేరియంట్లు కలుపుకొని 100కు పైగా సందర్శకుల సంఖ్య: 6 లక్షలకు పైగా (అంచనా) ఎవరు నిర్వహిస్తున్నారు: ఏసీఎమ్ఏ (ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్); కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) -
మారుతి మాజీ ఎండీకి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన రూ.110 కోట్ల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు రుణం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్‌పై కేసు నమోదు చేసింది. తన కొత్త కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ లోన్ మోసం కేసులో 110 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. మారుతి ఎండీగా రిటైరైన తరువాత, జగదీష్ ఖట్టర్ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2009లో 170 కోట్ల రూపాయల రుణాన్ని పొందారు. ఆ తర్వాత 2012 వరకు కొంత మొత్తాన్ని చెల్లించారు. కానీ సుమారు 110 కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టారు. దీంతో 2015లో ఇది నిరర్ధక ఆస్తి (ఎన్‌పిఎ)గా మారింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. -
పెద్ద మొత్తంలో మారుతి కార్ల రీకాల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ వినియోగదారులకు షాకిచ్చిందింది. తన వాహనాల్లో కొన్ని మోడళ్ల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 'పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్' వేరియంట్ల కార్లలోని మోటారు జనరేటర్ యూనిట్లలో సమస్య కారణంగా వేలాది వాహనాలను రీకాల్ చేస్తోంది. 63,493 మారుతి సుజుకి సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 కార్లును వెనక్కి తీసుకుంటోంది. జనవరి1నవంబర్ 21మధ్య తయారైన సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 మోడళ్ల స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లను పరిశీలిస్తామని భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థమారుతి తెలిపింది. ఈ మేరకు మారుతి సుజుకి మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారు చేయడం వలన ఎంజీయూలో లోపం ఏర్పడి వుండవచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆయా వాహనదారులు ఈ రోజునుంచే మారుతి సుజుకి డీలర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ఆయా వాహనాలను తనిఖీ చేయించు కోవడంతోపాటు లోపభూయిష్టమైన పార్ట్‌లను ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తమ రీకాల్‌కు సంబంధించిన ప్రచారాన్ని చేపట్టినట్టు మారుతి తెలిపింది. -
వరుసగా ఎనిమిదో నెలలోనూ మారుతికి షాక్
సాక్షి, ముంబై : డిమాండ్ క్షీణత దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. తాజాగా దేశీయంగా పాసింజర్ వాహనాలకు డిమాండ్ లేకపోవడం వల్ల మారుతి తన ఉత్పత్తిని వరుసగా 8 వ నెలలో తగ్గించుకోవలసి వచ్చింది. ఇటీవల వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ఆటో కంపెనీలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు ఉత్పత్తిలో కోత పెడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే తాజాగా వరుసగా ఎనిమిదవ నెలలో కూడా మారుతి ఉత్పత్తి కోతను ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం వాహనాల ఉత్పత్తి 1,19,337 యూనిట్లు కాగా, గత ఏడాది అక్టోబర్‌లో 1,50,497 గా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 148,318 నుండి 117,383 యూనిట్లు తగ్గాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. వాన్ల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే సగానికి పడిపోయింది. 2018 అక్టోబర్‌లో 13,817 య నిట్లను ఉత్పత్తి చేయగా, గత నెలలో 7,661గా ఉంది. మినీ-సెగ్మెంట్లో ఆల్టో, ఎస్-ప్రెస్సో, ఓల్డ్ వాగన్ఆర్ లాంటి వాహనాల తయారీ గత ఏడాది ఇదే నెలలో 34,295 నుండి 20,985 కి పడిపోయింది. కాంపాక్ట్ విభాగంలో న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల ఉత్పత్తి చేసిన యూనిట్ల సంఖ్య గత ఏడాది ఇదే నెలలో 74,167 తో పోలిస్తే అక్టోబర్‌లో 64,079 గా ఉంది. అయితే జిప్సీ, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్ -6, ఎస్-క్రాస్ వంటి యుటిలిటీ వాహనాలు మాత్రమే అక్టోబర్‌లో 22,526 నుండి 22,736 వద్ద స్వల్ప వృద్ధిని సాధించాయి. ఏదేమైనా, అమ్మకాల పరంగా పండుగ సీజన్ డిమాండ్ కారణంగా స్వల్ప రికవరీ సంకేతాలను చూపించింది. దేశీయ మార్కెట్లో 2019 అక్టోబర్‌లో మొత్తం 1,44,277 యూనిట్లు విక్రయించింది. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు క్షీణించగా, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లతో సహా కాంపాక్ట్ విభాగం సంవత్సరానికి 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
ఈ మారుతీ కారుపై లక్ష రూపాయల తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కస్టమర్లకు శుక్రవారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన బాలెనో మోడల్ కారుపై లక్ష రూపాయలు తగ్గించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఢిల్లీలో బాలెనో మోడల్ ధర 5,58,602 ఉంది. ఎంపిక చేసిన పది మోడల్స్‌పై రెండో రోజుల క్రితం 5000 రూపాయల వరకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. పండుగ సీజన్‌కు ముందు ఇలాంటి ఆఫర్లతో అమ్మకాలు పెరుగుతాయని తద్వారా కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇటీవల కాలంలో ఆర్థిక మాంద్యం ప్రభావంతో అన్ని కంపెనీల కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో అన్ని కంపెనీలు కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుతీ సుజకీ బంపర్ ఆఫర్లు ప్రకటించడం విశేషం. సియామ్ గణాంకాల ప్రకారం ఆగస్టులో వాహనాల అమ్మకాలు 31.57 శాతం వరకు పడిపోయాయి. (చదవండి: మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!) -
మారుతీ కారు ప్లాంట్లు మూసివేత
-
మారుతి సుజుకి వరుసగా ఏడోసారి ఉత్పత్తి కోత
సాక్షి, ముంబై : డిమాండ్ క్షీణించి , అమ్మకాలు లేక విలవిల్లాడుతున్న దేశీయ అతిపెద్ద కార్ల తయారీ మారుతి సుజుకి ఇండియాకు వరుస షాక్‌లు తప్పడం లేదు. తీవ్ర మందగమనంలో ఉన్న మారుతి సుజుకి వరుసగా 7వ నెలలో కూడా ఉత్పత్తిని నిలిపివేసినట్టు ప్రకటించింది. ఆగస్టులో మాసంలో ఉత్పత్తిని 33.99 శాతం తగ్గించగా, గత నెలలో మొత్తం అమ్మకాలు 33 శాతం క్షీణించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులోని 1,58,189 యూనిట్లతో పోలిస్తే 1,06,413 యూనిట్ల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది. ఆగస్టులో కంపెనీ మొత్తం 1,11,370 యూనిట్లను ఉత్పత్తి చేయగా, అంతకుముందు నెలలో 1,68,725 యూనిట్లు ఉత్పత్తి చేశామని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సెప్టెంబర్ 2 న బీఎస్సీ ఫైలింగ్‌లో తెలిపింది. గత నెలలో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 1,10,214 యూనిట్లు కాగా, 2018 ఆగస్టులో 1,66,161 యూనిట్లగా ఉంది. అంటే 33.67 శాతం క్షీణత. ఆల్టో, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లతో సహా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల ఉత్పత్తి 80,909 యూనిట్లు కాగా, గత ఏడాది ఆగస్టులో 1,22,824 యూనిట్లు మాత్రమే. 34.1 శాతం తగ్గింది. విటారా బ్రెజ్జా, ఎర్టిగా, లాంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 34.85 శాతం క్షీణించి 15,099 యూనిట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది 23,176 యూనిట్లు. మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ ఉత్పత్తి ఆగస్టులో 2,285 యూనిట్లకు తగ్గింది, గత ఏడాది ఇదే నెలలో 6,149 యూనిట్లు. -
మారుతీలో 3 వేల ఉద్యోగాలు ఫట్
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
సుజుకి జిక్సెర్ 250.. ధర ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎస్ఎంఐపీఎల్) కొత్త బైక్‌ను పరిచయం చేసింది. జిక్సర్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘జిక్సర్ 250’ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ధరను రూ.1,59,800 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ)గా నిర్ణయించింది. జిక్సెర్ ఎస్‌ఎఫ్‌కంటే రూ. 11 వేల ధను ఎక్కువ. ఫోర్-స్ట్రోక్ 249 సీసీ ఇంజిన్‌తో ఈ బైక్‌ను రూపొందించింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ఏబీఎస్) తో మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులకోసం దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పింది. రెండు రంగుల్లో ఇది లభ్యం కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, పనితీరు గల మోటార్‌సైకిళ్లను అభివృద్ధికి నిదర్శనం తమ కొత్త జిక్సర్ 250 అని, సుజుకి వారసత్వానికి ఇది నిజమైన ప్రతిబింబమని కంపెనీ హెడ్ కొయిచిరో హిరావ్ అన్నారు. జిక్సెర్ పోర్ట్‌ఫోలియోతో తాము మరింత వృద్ధిని సాధించాలని ఆశిస్తున్నామన్నారు. -
అమ్మకాల క్షీణత, ఉద్యోగాల కోత
సాక్షి, ముంబై : దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోవడంతో ఉద్యోగులపై వేటు వేసింది. ఈ మేరకు మారుతి సుజుకి రాయిటర్స్ కిచ్చిన సమాచారంలో వెల్లడించింది. చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ, వ్యాపార మందగమనం నేపథ్యంలో, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకాలకు కూడా ఇదే కారణమన్నారు. అయితే భవిష్యత్తులో ఎంతమంది ఉద్యోగులపై వేటు వేయనున్నారనే దానిపై వివరాలు ఇవ్వలేదు. ఈ తిరోగమనం కొనసాగితే మార్జినల్, వీక్ కంపెనీలు మనుగడ సాగించడం కష్టమని వ్యాఖ్యానించారు. జూన్ 30 తో ముగిసిన ఆరు నెలల్లో సగటున 18,845 మంది తాత్కాలిక కార్మికులను నియమించినట్లు మారుతి సుజుకి రాయిటర్స్‌కు పంపిన ఇమెయిల్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం లేదా 1,181 తగ్గిందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోత పెరిగిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో పాసెంజర్ వాహన విక్రయాల్లో టాప్‌లో ఉండే మారుతి సుజుకి, జూలై, 2018 తో పోలిస్తే, ఈ ఏడాది జూలైలో (33.5 శాతం) అమ్మకాలు 109 265 యూనిట్లకు పడిపోయాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఉత్పత్తిని 10.3 శాతం తగ్గించామని గతంలో సుజుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశ ఉత్పాదక ఉత్పత్తిలో దాదాపు సగం వాటాను సొంతం చేసుకున్న ఆటో మొబైల్ రంగం దాదాపు ఒక దశాబ్దం కాలంగా మందగమనాన్ని ఎదుర్కొంటోంది. వాహన అమ్మకాలు కూడా అంతే వేగంగా పడిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిరుద్యోగ గణాంకాలు పాతవని, విశ్వసనీయత లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగి జులై నాటికి 7.51 శాతానికి చేరింది. ఈ ఏడాది ప్రారంభం ఇది 5.66 శాతంగా ఉండేదని సీఎంఐఈ తెలిపింది. వీరిలో రోజువారీ కూలీలను కలపలేదు. మారుతి ఉద్యోగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్దీప్ జంఘు మాట్లాడుతూ మానేసర్, గురుగ్రామ్ ప్లాంట్లలో తాత్కాలిక కార్మికుల సగటు వేతనం నెలకు 250 డాలర్లుగా ఉందనన్నారు. కాగా ఈ రెండు ప్లాంట్లు కలిపి సంవత్సరానికి 1.5 మిలియన్లకు పైగా వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థ 1983 లో గురుగ్రామ్ ప్లాంట్ నుంచే తన ప్రసిద్ధ మారుతి 800 మోడల్‌ను విడుదల చేసింది. ఆటోరంగ అమ్మకాల తిరోగమనం పరిశ్రమ అంతటా ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తోంది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) మాట్లాడుతూ, ఈ తిరోగమనం కొనసాగితే విడిభాగాల తయారీదారులు తమ 5 మిలియన్ల మంది కార్మికుల్లో 5వ వంతును తగ్గించుకోవచ్చని పేర్కొంది. -
మారుతి ఆఫర్ : పొల్యూషన్ చెక్, డ్రై వాష్ ఫ్రీ
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణతోపాటు, వినియోగదారులకు కూడా ఉచిత ప్రయోజనాలను అందివ్వనుంది. తద్వారా తక్కువ నీటి వినియోగం, పర్యావరణంపై అవగాహన కల్పించనుంది. ఉచిత కాలుష్య చెక్, కాంప్లిమెంటరీ డ్రైవాష్ సౌకరాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ 2019 జూన్ 10 వరకు ఈ ఆఫర్ చెల్లుతుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ప్రధాన నగరాల్లో ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. వాహనాల డ్రై వాష్ ద్వారా 2018-19 ఏడాదిలో సుమారు 656 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేశామని సుజుకి పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో నీటి పొదుపు అంశాన్ని తమ వర్క్‌షాపులలో మూడు రెట్లు పెంచినట్టు వెల్లడించింది. తాజాగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, నాగ్‌పూర్, చెన్నై ఆరు నగరాల్లో వాహనాల డ్రై వాష్ ద్వారా 160 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయాలని భావిస్తోంది. తమ వర్క్‌షాపుల వద్ద డ్రై వాష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని 18 మిలియన్లకుపైగా ఉన్న వినియోగదారులకు ఆటో మేజర్ విజ్ఞప్తి చేసింది. తద్వారా రాబోయే తరాలకోసం నీటిని ఆదా చేయాలని మారుతి సుజుకి ఇండియా సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ కోరారు. -
క్షీణించిన మారుతి విక్రయాలు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కారు మేకర్ మారుతి సుజుకి మే నెల అమ్మకాల్లో చతికిల బడింది. అమ్మకాలు 22 శాతం క్షీణించి 1,34,641 యూనిట్లు విక్రయించింది. ఈ మేరకు శనివారం గణాంకాలను మారుతి విడుదల చేసింది. మే నెలలో 1,72,512 యూనిట్లు విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ అమ్మకాలు 23.1 శాతం క్షీణించి 1,25,552 యూనిట్లు విక్రయించగా .. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 1,63,200 యూనిట్లు విక్రయించింది. ఆల్టో, వ్యాగన్ ఆర్ లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 16,394 యూనిట్లుగా నమోదయ్యాయి. మే నెలలో 37,864 యూనిట్లు విక్రయించగా, ఇవి 56.7 శాతం తగ్గాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్లతో సహా 9.2 శాతం క్షీణించి 77,263 యూనిట్ల నుంచి 70,135 గా ఉన్నాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ 3,592 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 4,024 యూనిట్లను విక్రయించింది. విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా వినియోగ వాహనాల అమ్మకాలు 25.3 శాతం తగ్గి 19,152 కి చేరుకున్నాయి. అంతకు ముందు నెల 25,629 యూనిట్లు విక్రయించింది. ఎగుమతులు మే నెలలో 2.4 శాతం తగ్గి 9,089 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 9,312 యూనిట్లు ఎగుమతులు జరిగాయి. -
మారుతి ఎర్టిగా సరికొత్తగా
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎర్టిగా కారును విడుదల చేసింది. 1.5 లీటర్ డీడీఐఎస్ 225 డీజిల్ ఇంజిన్‌తో అప్డేట్ చేసి లాంచ్ చేసింది. వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్ మూడు వేరియంట్లలో ఈ కారును విక్రయిస్తోంది. వీటి ప్రారంభ ధర (న్యూఢిల్లీ ఎక్స్‌షోరూమ్) రూ.9.86లక్షలు. అత్యధిక ధర రూ.11.20 లక్షలు. పాత 1.3లీటర్ డీడీఐఎస్ 200 ఇంజిన్ స్థానంలో సరికొత్త 1.5 లీటర్ డీడీఐఎస్ 225 పెట్రోల్ ఇంజిన్ ను అమర్చింది. డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ టెక్నాలజీ, 1498 సీసీ ఫోర్ సిలిండర్‌తో వస్తున్న ఈ కొత్త ఎర్టిగా 4000 ఆర్పీఎం వద్ద 94 బీహెచ్పీ శక్తి, 1500-2500 ఆర్పీఎం వద్ద 225ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. అవసరమైతే 1.5 లీటర్ డీజిల్ ఇంజీన్‌ను బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామని మారుతీ ఛైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. కాగా ఎర్టిగా ఎంపీవీ సెగ్మెంట్లో అత్యధికంగా విక్రయించే వాహనంగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
డీజిల్ కార్లకు మారుతీ మంగళం!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ నుంచి డీజిల్ వెర్షన్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బీఎస్6 ఉద్గార నియమావళికి అనుగుణం గా ఆటోమొబైల్ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్ కార్ల వాటా 23 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం 4.63 లక్షల డీజిల్ వాహనాలను విక్రయిం చింది. కంపెనీ ఉత్పత్తి చేసే విటారా, బ్రెజా, ఎస్‌క్రాస్ వంటి కొన్ని మోడళ్లు కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభిస్తాయి. స్విఫ్ట్, బాలెనో, సియాజ్, ఎర్టిగా లాంటి మోడళ్లు రెండు వెర్షన్లలోనూ లభిస్తా యి. కేవలం డీజిల్ కార్ల విక్రయాలే కాకుండా వచ్చే ఏప్రిల్ నుంచి కంపెనీ ఎల్సీవీ సూపర్ క్యారీ డీజిల్ వెర్షన్ విక్రయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది. ఇకపై సూపర్‌క్యారీ కేవలం పెట్రో ల్, సీఎన్జీ వెర్షన్లలో మాత్రమే లభిస్తుంది. డీజిల్ వాహనాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘2020 ఏప్రిల్1 నుంచి మేము డీజిల్ కార్లను విక్రయించం’’అని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. అయితే బీఎస్6 డీజిల్ కార్లకు డి మాండ్ బాగా పెరిగితే అప్పుడు అందుకు తగ్గ మో డల్ను తయారు చేస్తామని వివరించారు. భవిష్యత్‌లో డీజిల్ ఇంజన్లతో కూడిన కార్లను తయారు చే యాల్సి వస్తే 1500 లీటర్లకు పైబడిన డీజిల్ ఇం జన్లనే తయారు చేస్తామని భార్గవ చెప్పారు. చిన్న డీజిల్ కార్లు పెద్దగా లాభదాయకం కాదన్నారు. బీఎస్6 నిబంధనలతో మరింత ప్రియం యూరప్‌లో బీఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ వాహనాల విక్రయాల్లో క్షీణత నమోదవుతోందని భార్గవ చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన డీజిల్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరతో పోలిస్తే భారీగా పెరిగిందని, దీంతో వీటిపై కస్టమర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో కస్టమర్లు ధరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, అందువల్ల ఇకపై డీజిల్ ఇంజన్ వాహనాల విక్రయాలు ఇక్కడ కూడా క్షీణిస్తాయని అభిప్రాయపడ్డారు. డీజిల్ కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ఏడాది కొనడం మంచిదని, వచ్చే ఏడాది వీటి ధరలు భారీగా పెరగవచ్చని సూచించారు. ఇటీవలే కంపెనీ బీఎస్4 నిబంధనలకు అనుగుణమైన సియాజ్ సెడాన్ 1,500 లీటర్ల డీజిల్ ఇంజన్ వెర్షన్‌ను తయారు చేసింది. ఈ కారు ఇంజన్‌ను కంపెనీ సొంతంగా నిర్మించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయించే డీజిల్ వాహనాల్లో ఇంజన్లను ఫియట్ సరఫరా చేస్తోంది. 2020 మార్చి చివరకు తమ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే 16 మోడళ్ల పెట్రోల్ ఇంజన్లను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇప్పటికే ఆల్టో 800ను బీఎస్6 అనుగుణంగా పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టామని తెలిపారు. ఇప్పటికిప్పుడు బలమైన హైబ్రిడ్ సాంకేతికతో తయారు చేసిన మోడళ్లను తీసుకువచ్చే ఆలోచన లేదని, భవిష్యత్‌లో వీటిపై ఫోకస్ చేస్తామని కంపెనీ సీఈఓ కెనిచి అయుకవా చెప్పారు. లాభంలో 4.6 శాతం క్షీణత మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికరలాభం 4.6 శాతం పతనమై 1,795.6 కోట్లకు చేరింది. 2017–18 చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 1882.1 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ నికర విక్రయాలు రూ. 20,737.5 కోట్లకు చేరాయి. అంతకుముందేడాదితో పోలిస్తే ఈ మొత్తం స్వల్పంగా అధికం. క్యు4లో మొత్తం కార్ల విక్రయాలు స్వల్పంగా క్షీణించి 4,58,479 యూనిట్లకు చేరాయి. మొత్తం 2018–19 సంవత్సరానికి కంపెనీ నికరలాభం 2.9 శాతం పతనమై 7,500.6 కోట్లకు చేరింది. నికర విక్రయాలు 6.3 శాతం పెరిగి 83,026.5 కోట్లకు చేరాయి. వాల్యూం పరంగా విక్రయాలు 4.7 శాతం పెరిగి 18,62,449 యూనిట్లకు చేరాయి. ఇందులో 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. మార్చి త్రైమాసికంలో కరెన్సీ రేట్లలో ఆటుపోట్లు, కమోడిటీ ధరల్లో పెరుగుదల, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, రూపీ క్షీణత వంటివి ఫలితాలపై ప్రభావం చూపాయని కంపెనీ వివరించింది. తాము చేపట్టిన వ్యయ నియంత్రణా చర్యలు లాభాలు మరింత పతనం కాకుండా ఆదుకున్నట్లు తెలిపింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ షేరుపై రూ. 80 డివిడెండ్‌ను మారుతీ ప్రకటించింది. గతేడాది రూ.4వేల కోట్ల మూలధన వ్యయాలు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,500 కోట్ల క్యాపెక్స్ ప్రణాళికలు తయారు చేశామని కంపెనీ తెలిపింది. ఈ నిధులను ఆర్అండ్డీ, కొత్త షోరూంలకోసం భూసమీకరణ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి తదితర అంశాలపై వెచ్చిస్తామని కంపెనీ సీఎఫ్ఓ అజిత్ సేథ్ చెప్పారు. కంపెనీ ఉత్పాదిత బాలెనో ధరను రూ. 15వేల మేర పెంచుతున్నట్లు మారుతీ ప్రకటించింది. ఆర్సీ భార్గవ -
క్షీణించిన మారుతి లాభాలు
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా క్యూ4 ఫలితాల్లో నిరాశపర్చింది. విశ్లేషకులు అంచనావేసినట్టుగా మార్చి 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో 5శాతం (4.6 శాతం)పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 0.7 శాతం క్షీణించాయి. ఈ త్రైమాసికంలో నికర లాభం రూ .1,795.6 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .1,882.1 కోట్లు.స్టాండలోన్ ఆదాయం 1 శాతం పుంచుకుని 21,459. కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో 25 శాతం తక్కువగా రూ. 2263 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 14.22 శాతం నుంచి 10.55 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో మారుతీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1.8 శాతం నష్టంతో రూ. 6880 వద్ద ట్రేడవుతోంది. ప్రతికూల విదేశీ మారక ద్రవ్యం, వస్తువుల ధరలు, లాభాలను ప్రభావితం చేశాయని ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ పేర్కొంది.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 80 రూపాయల డివిడెండ్ ను చెల్లించనుంది. -
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మారుతి కొత్త బాలెనో
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద వాహన తయారీ దారు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) సోమవారం కొత్త కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ స్టేజ్ (బీఎస్) 6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో బిఎస్ -6 ఇంజనతో కొత్త బాలెనో వాహనాన్ని పరిచయం చేసింది. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ (పెట్రోల్) ఇంజీన్ బాలెనో కారు ధర రూ. 5.58 లక్షలు -8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉండనున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా నెక్సా దుకాణాల ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2015లో లాంచ్ అయినప్పటినుంచి బాలెనో బ్లాక్ బ్లస్టర్గా నిలిచిందనీ, 5.5 లక్షల బాలెనో వినియోగదారులున్నారనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లు విక్రయించించినట్టు తెలిపారు. ఇటీవలే బాలెనోను తాజా డిజైన్, టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేశామన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ లాంగ్‌లైఫ్ సర్వీసు అందిస్తుందనీ, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, వాహన ఉద్గారాలను తగ్గించే మెరుగైన ఇంధన సామర్థ్యంలో వినియోగదారులను ఉత్సాహానిస్తుందని తెలిపారు. -
మారుతి కార్లపై భారీ తగ్గింపు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ సుజుకీ ప్రధాన డీలర్ షిప్ నెక్సా ద్వారా విక్రయిస్తున్న కార్లపై సూపర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై సుమారు రూ.60 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. సియాజ్, బాలెనో, ఎస్-క్రాస్, ఇగ్నిస్ కార్లపై ఈ డిస్కౌంట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ పై రూ.33 వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఇందులో 15 వేల రూపాయల డిస్కౌంట్, 15 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అలాగే నెక్సా డీలర్ షిప్ కింద పరిచయమైన మొదటి మోడల్ కార్ ఎస్-క్రాస్‌పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 20 వేల రూపాయల డిస్కౌంట్, రూ. 25 వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. -
మారుతికి షాక్ : టాటా ఓకే
మార్చి మాసంలో దేశీయ కార్ల దిగ్గజాలకు మిశ్రమ అనుభవాలను మిగిల్చాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చి నెల విక్రయాలు షాకివ్వగా, ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ వార్షిక విక్రయాల్లో వృద్ధిని సాధించింది. మార్చి నెల విక్రయాలు ఎనలిస్టుల అంచనాలనుతాకడంతో పాటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 16శాతం పెరిగాయని టాటా మోటార్స్ తెలిపింది. అయితే మార్చి నెలలో వాహన విక్రయాలు నామమాత్ర వెనకడుగుతో 68,709 యూనిట్లుగా నమోదయ్యాయి. గత మాసంతో పోలిస్తే 1శాతం తక్కువజ విదేశీ రీసెర్చ్ సంస్థ నోమురా అంచనాలను కంపెనీ అందుకుంది. దీంతో ఇవాల్టి మార్కెట్లో టాటా మోటార్స్ షేరు 8శాతం లాభపడి టాప్ విన్నర్‌గా నిలిచింది. మరోవైపు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చినెల విక్రయాలు షాకిచ్చాయి. ఈ నెలలో విక్రయాలు1,47,613గా నమోదయ్యాయి. గతేడాది ఇదే మాసంలో1,48582 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. విదేశీ విక్రయాల్లో దాదాపు 13శాతం తగ్గి 10,463 యూనిట్లుగా మారింది. గత ఏడాది మార్చిలో 12,016 యూనిట్లను విక్రయించింది అలాగే 2018-19 సంవత్సరానికిగాను మారుతీ విక్రయాలు వరుసగా ఏడవసారి పుంజుకుని 4.7శాతం పెరిగి 18,62,449కు చేరాయి. అంతకు ముందు సంవత్సరం 17,79,574గా నమోదైయ్యాయి. -
మారుతి బాస్‌గా మళ్లీ ఆయనే
సాక్షి, ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కెనిచి నియామకం 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2013 మార్చిలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అవకాశంతో మూడోసారి కూడా మరోవమూడుళ్లపాటు కెనిచి సీఎండీగా కొనసాగనున్నారు. -
మారుతి సుజుకి ఇగ్నిస్ 2019 లాంచ్
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2019 ఇగ్నిస్ కారును లాంచ్ చేసింది. రూఫ్ రెయిల్స్ లాంటి సరికొత్త భద్రతా ఫీచర్లతోపాటు, ఇతర మార్పులతో అపడేటెడ్ వెర్షన్‌ను తాజాగా భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.79 లక్షల నుంచి 7.14 లక్షల మధ్య ఉండనుంది. 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజీన్ సామర్థ్యంతో పెట్రోలు వెర్షన్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఇది సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా అనే నాలుగు వేరియంట్ల రూపంలో అందుబాటులో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. కొత్త ఇగ్నిస్ కారులో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుతోపాటు డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి భద్రతా ఫీచర్లను అమర్చింది. ప్రయాణికులకు మెరుగైన భద్రతా అందించాలనే లక్ష్యంతో పలు సేఫ్టీ ప్రత్యేకతలతో కొత్త ఇగ్నిస్ కారును తీసుకువచ్చామని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆస్.ఎస్.కల్సి తెలిపారు. ప్రీమియం అర్బన్ కార్ యూజర్లకు 2019 ఇగ్నిస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారిందని పేర్కొన్నారు. -
పుల్వామా దాడిలో వాడింది ఇతడి కారునే
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14వ తేదీన జరిగిన ఆత్మాహుతి దాడిపై సాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ దాడిలో వినియోగించింది ‘మారుతి ఈకో’ కారు అని తేల్చిన జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) దాని యజమానిని కూడా గుర్తించింది. ఫోరెన్సిక్ నిపుణులు, వాహన నిపుణులు కలిసి చేసిన దర్యాప్తులో ఛాసిస్ నంబర్ ఆధారంగా ఆ కారు ఎవరి వద్ద ఉన్నదీ కనిపెట్టారు. అనంత్‌నాగ్ జిల్లా కేంద్రంలోని హెవెన్ కాలనీకి చెందిన జలీల్ అహ్మద్ హకానీ 2011లో మొదట ఈ కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఇది ఏడుగురి చేతులు మారి ఆఖరుకు దక్షిణ కశ్మీర్‌లోని బిజ్బెహారాకు చెందిన సజ్జాద్ భట్‌కు చేరింది. ఇతడు ఈ కారును ఫిబ్రవరి 4వ తేదీన అంటే దాడికి పది రోజుల ముందు కొనుగోలు చేశాడు. ఇతడిని షోపియాన్‌లోని సిరాజ్–ఉల్–ఉలూమ్ స్కూలు విద్యార్థిగా గుర్తించారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శనివారం అతడుండే ఇంటిపై దాడి చేశారు. కానీ, అతడు అక్కడ లేదు. ఆయుధాలు పట్టుకున్నట్లుగా ఉన్న అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండటంతో ఉగ్ర సంస్థ జైషే ముహమ్మద్‌లో చేరి ఉంటాడని భావిస్తున్నారు. జైషే ముహమ్మద్‌కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లగా 40 మంది జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
చతికిలపడిన మారుతి
సాక్షి,ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి క్యూ3 ఫలితాల్లో చతికిలపడింది. నికరలాభాల్లో విశ్లేషకుల అంచనాలను అందుకోలేక నిరాశాజనక ఫలితాలను వెల్లడించింది. నికర లాభాల్లో 17.2 శాతం క్షీణతను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసిక ఫలితాలను ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టలో ఆర్జించిన 17,99 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈ క్యూ3లో రూ. 1489 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దాదాపు రూ.1799కోట్ల లాభాలను ఆర్జించనుదని విశ్లేషకులు అంచనా వేశారు. ఆదాయం మాత్రం చాలా నామామాత్రంగా 2 శాతమే పెరిగి రూ.19,668 కోట్లను నమోదు చేసింది. నిర్వహణ లాభం(ఇబిటా) 36 శాతం పడిపోయి రూ. 1930 కోట్లకు పరిమితమైంది. మార్జిన్లు 15.7 శాతం నుంచి 9.8 శాతానికి బలహీనపడ్డాయి. కమోడిటీల ధరలు పెరగడం, ఫారెక్స్ నష్టాలు, మార్కెటింగ్ వ్యయాలు వంటి అంశాలు తమ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ మార్కెట్ సమాచారంలో వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు దాదాపు 8 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. -
సరికొత్తగా మారుతి బాలెనో ఆర్ఎస్ ఫేస్‌లిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు బాలెనో ఆర్ఎస్ కొత్త హంగులతో ముస్తాబవుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్డేట్స్తో మారుతి బాలెనో ఆర్ ఎస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆకర్షణీయంగా కంపెనీ తీసుకొస్తోంది. ఈ నెల చివరకు మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ధర విషయానికి వస్తే..రూ.8.53లక్షలుగా (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) ఉండవచ్చని అంచనా. 1.0 లీటర్ పెట్రోలు బూస్టర్ జెట్ టర్బో ఇంజీన్‌తో మరింత శక్తివంతంగా ఈ కారును లాంచ్ చేయనుంది. ఫ్రంట్ బంపర్‌లో మార్పులతోపాటు పాత హెచ్ఐడీ ల్యాంప్స్‌కు బదులుగా కొత్త ఎల్ఈడీ హెడ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అమర్చింది. అలాగే రియర్ డిస్క్ బ్రేక్‌లను, బ్లాక్ అండ్ సిల్వర్ డ్యుయల్ టోన్ కొత్త అల్లోయ్ వీల్స్‌ను కొత్తగా జోడించింది. డార్క్ గ్రే కలర్లో ఇంటీరియర్ డిజైన్‌ను ఇచ్చింది. దీంతోపాటు స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంను స్మార్ట్‌ఫోన్ నావిమాప్స్ నావిగేషన్ ఆప్‌తో అప్డేట్ చేసింది. -
పెరగనున్న రెనో కార్ల ధరలు
ముంబై: యూరోపియన్ ఆటో తయారీ దిగ్గజం రెనో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. జనవరి ఒకటి నుంచి 1.5 శాతం మేర పెంపు ఉండనుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ముడి పదార్థాల ధరల్లో పెరుగుదల, ఫారెన్ ఎక్సే్ఛంజ్‌లో భారీ మార్పులు ఈ ధరల పెంపు నిర్ణయానికి దోహదపడ్డాయని తెలిపింది. రెనో డస్టర్, క్విడ్, లాజీ, క్యాప్టర్ బ్రాండ్లను కంపెనీ భారత్‌లో విక్రయిస్తోంది. మరోవైపు స్కోడా, మారుతీ సుజుకీ, ఇసుజు మోటార్స్, టయోటా కిర్లోస్కర్ సంస్థలు కూడా వచ్చే ఏడాది ఒకటవ తేదీ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
మారుతి కూడా ధరలు పెంచేసింది
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వినియోగదారులకు చేదువార్త అందించింది. మారుతి అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం వెల్లడించింది. వచ్చే నెలనుంచి (2019,జనవరి) ఈ పెరిగిన ధరలు అమలవుతాయని తెలిపింది. అయితే ఏ మేరకు పెంపు ఉంటుంది అనేది స్పష్టం చేయలేదు. ఉత్పత్తి ఖర్చులు, కమోడిటీ ధరలు, రూపాయి విలువ తదితర కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో 800 నుంచి ప్రారంభమై ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్-క్రాస్‌కు 2.53 లక్షల రూపాయల నుంచి 11.45 లక్షల రూపాయల మధ్య విక్రయిస్తోంది. కాగా జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్ కంపెనీ భారత్‌లో విక్రయించే తన వాహనాల ధరలను రూ.లక్ష వరకూ పెంచేసింది. పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇసుజు మోటార్స్ తెలియజేసింది. ఉత్పత్తి, పంపిణి వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
మారుతి ఎర్టిగా బుకింగ్స్ నేటి నుంచే
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఎర్టిగాను న్యూ అవతార్‌లో లాంచ్ చేయనుంది. సెవన్ సీటర్ మల్టీ పర్సస్ వెహికల్ (ఎంపీవీ) కొత్త ఎర్టిగా 2018ను నవంబరు 21ల లాంచ్ చేయనున్నామని మారుతి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ న్యూ ఎర్టిగా ఎల్, వీ, జెడ్, జెడ్ + అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో ఈనెల 21న లాంచ్ చేయనుంది. అలాగే ఈ వాహనాల ప్రీ బుకింగ్స్‌ను నేటి (నవంబరు 14, బుధవారం) నుంచి ప్రారంభించింది. కేవలం రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే లాంచింగ్ సందర్భంగా మారుతి వెల్లడించనుంది. అయితే పాత మోడల్ ఎర్టిగాతో పోలిస్తే కొత్త ఎర్టిగా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. రూ 6.34- 10.69 లక్షలు (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎర్టిగా 2018 ( ఎంపీవీ) 1.5 లీటర్ పెట్రోలు ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ రెండు వెర్షన్లలో, అయిదు రంగుల్లో లభ్యంకానుంది. -
దివాలీ ఆఫర్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దీపావళి సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు శుభవార్త. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్ల కార్లపై దివాలీ ఆఫర్‌గా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా హ్యుందాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో డిస్కౌంట్లను పెంచి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా 23శాతం డిస్కౌంట్ అందిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, బాలెనోలపై రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కన్నా ఇది రూ.3,500 ఎక్కువ. ధంతేరస్, దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ద్వారా మరిన్ని అమ్మకాలను సాధించనున్నామని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు అమ్మకాలు) ఆర్ ఎస్‌కల్సీ చెప్పారు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, వడ్డీ రేట్లు అక్టోబర్ నెల రీటైల్ విక్రయాలను ప్రభావితం చేశాయి. మరోవైపు అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకి మెరుగైనప్రదర్శన కనబర్చింది. గత సెప్టెంబరు నెలలో తొలిసారి 1.5శాతం క్షీణతతో 1,38,100 యూనిట్స్ అమ్మితే... అక్టోబర్‌లో 1,46,766 యూనిట్స్‌ను విక్రయించింది. అటు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కూడా కార్ల ధరలపై డిస్కౌంట్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది. -
నిరాశపర్చిన మారుతి ఫలితాలు
సాక్షి,ముంబై: దేశీయకార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఏడాది ఫలితాల్లో చతికిలబడింది. 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను గురువారం విడుదల చేసింది. క్యూ2(జులై-సెప్టెంబర్)లో మారుతీ నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 2,240 కోట్లుగా నిలిచింది. అయితే మొత్తం ఆదాయం 3 శాతం పెరిగి రూ. 22,433 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 7శాతం తగ్గి రూ. 3,431 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు16.9శాతం నుంచి 15.3 శాతానికి బలహీనపడ్డాయి. వస్తువుల ధరల పెరుగుదల, ప్రతికూల విదేశీ మారకం, అమ్మకాల ప్రమోషన్ వ్యయాలు లాభాల క్షీణతకు కారణమని కంపెనీ పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో స్వల్ప నష్టంతో ముగిసింది. -
సేఫ్టీ రేటింగ్‌లో ‘స్విఫ్ట్’ నిరాశపరిచింది
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ‘స్విఫ్ట్’ భద్రతా ప్రమాణాల పరీక్షలో నిరాశ పరిచింది. కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే ఈ కారు సాధించింది. గ్లోబల్ న్యూకార్ అసెస్మెంట్ ప్రొగ్రామ్(జీఎన్సీఏపీ), ‘‘సేఫర్ కార్స్ ఫర్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు పూర్తిగా నిరాశజనకంగా ఉన్నట్టు వాహనదారులు పెదవి విరుస్తున్నారు. జీఎన్ఏసీపీ ప్రకారం... కారు పెద్దల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను అందుకోలేకపోయిందని తెలిసింది. అంతేకాక ప్రమాద సమయంలో కారు డ్రైవర్ తల, మెడకు రక్షణ లభిస్తున్నా.. ఛాతీ, మోకాళ్లకు మాత్రం గాయాలయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ వెర్షన్లో రెండు స్టాండర్డ్ డబుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా.. 4-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థ లేకపోవడంతో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు తెలిపింది. పెద్దలకు, చిన్నారులకు రక్షణ విషయంలో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు పేర్కొంది. ‘భారత్‌లో విక్రయిస్తున్న కొత్త మోడల్ స్విఫ్ట్ కార్లలో రెండు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్‌లున్నాయి. భారత ప్రభుత్వపు కొత్త క్రాష్ టెస్ట్ రెగ్యులేషన్ ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే భారత్‌లో విక్రయించే స్విఫ్ట్ కార్ల కంటే యూరప్, జపాన్లలో విక్రయించే కార్లే సురక్షిత ప్రయాణం విషయంలో మెరుగైన రేటింగ్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ భారత్‌లో తన ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది’ అని జీఎన్సీఏపీ సెక్రటరీ జనరల్ డేవిడ్ చెప్పారు. స్థానికంగా తయారు చేసే బ్రిజా మోడల్స్‌ను అత్యంత భద్రతా ప్రమాణాలతో మారుతీ సుజుకీ రూపొందిస్తోందని, ఇదే ఫార్ములాను స్విఫ్ట్‌కు అవలంభించాలని, కనీసం యూరోపియన్, జపనీస్ వెర్షన్లకు అందుబాటులో ఉన్న భద్రతా ఫీచర్లనైనా తీసుకు రావాలని జీఎన్సీఏపీ టెక్నికల్ డైరెక్టర్ అలెజాండ్రో ఫ్యూరస్ సూచించారు. -
మారుతి వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్
సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ఆటో మేజర్ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఎక్కువగా అమ్ముడుబోయే తన కార్లలో ఒకటైన వ్యాగన్ ఆర్కు కొత్త సొబగులు అద్ది విడుదల చేసింది. అంతేకాదు వాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్ కొనుగోలుపై రెండు ఆప్షనల్ యాక్ససరీస్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ కిట్లను రూ.15,490, రూ.25,490 ప్రత్యేక ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, డబుల్-డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్తోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్లను, ఫాబ్రిక్ ఫ్లోర్ మాట్స్ను జోడించింది. డబుల్ డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ విత్ స్పీకర్స్ అమర్చింది. అలాగే సీటు కవర్ల డిజైన్‌ను కూడా కొత్తగా తీర్చిదిద్దింది. ఇక ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే బాడీ గ్రాఫిక్స్‌తో పాటు, వెనుక స్పాయిలర్‌ను అమర్చింది. ఈ పరిమిత ఎడిషన్‌లో జోడించిన అదనపు హంగులతో వినియోగదారులను భారీగా ఆకర్షించాలని మారుతి భావిస్తోంది. వ్యాగన్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా కస్టమర్లకు ఈ పండుగు సీజన్ మరింత అద్భుతంగా మారనుందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 1999లో లాంచ్ అయిన వాగన్ఆర్ కంపెనీ అమ్మకాల్లో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ కాలానికి మారుతి మొత్తం అమ్మకాల సంఖ్య 21.9 లక్షలు నమోదుకాగా, వ్యాగన్ ఆర్ 85వేల యూనిట్లను విక్రయించడం గమనార్హం. ధర : రూ 4.19 లక్షల నుంచి రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.0 లీటర్, 3-సిలిండర్ డ్యుయల్ ఇంజీన్(పెట్రోల్, సీఎన్జీ) ఆప్షన్సతో లభిస్తుంది. అలాగే 5-స్పీడ్ ఎఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో పెట్రోల్ వెర్షన్ కూడా లభ్యం. -
బాలెనో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో' లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కాస్మొటిక్, ఇంటీరియర్ మార్పులు చేసి స్పోర్టీ లుక్‌తో ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. అలాగే ధరల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే 30 నుంచి 40వేల ప్రీమియం ధర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.కాగా ఫెస్టివ్ సీజన్లలో లిమిటెడ్ ఎడిషన్ కార్లను కస్టమర్లకు అందించడం ఇది మూడవ సారి. గతంలో ఇగ్నిస్, స్విఫ్ట్ మోడల్ కార్లలో స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేసింది. బాలెనో వాస్తవ ధరలు రూ. 5.48 లక్షలు, (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. -
మారుతీ సుజుకీ కార్లపై రూ.70వేల డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలో తన మోడల్స్‌పై రూ.70వేల వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్ అందించే మోడల్స్‌లో స్విఫ్ట్, ఎర్టిగా, డిజైర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ చేసే కారు, ఏడేళ్ల కంటే తక్కువ వయసున్నది అవ్వాలి. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ సర్వీసున్న కార్లకు తక్కువ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. కారు అసలు విలువ నుంచి రూ.35 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎర్టిగా.. మారుతీ సుజుకీ ప్రకటించిన ఆఫర్ కింద, ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ రూ.15వేల నగదు డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్‌పై రూ.20వేల డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా సీఎన్జీ ట్రిమ్‌పై రూ.10వేల డిస్కౌంట్ లభిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.30వేలు, రూ.20వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కారు వాడిన ఏళ్ల ప్రకారం ఉంటుంది. డీజిల్ వేరియంట్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు రూ.35వేలు, రూ.25వేలుగా ఉన్నాయి. డిజైర్... మారుతీ సుజుకీ డిజైర్(పెట్రోల్) రెగ్యులర్ ఎడిషన్‌పై రూ.20వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. స్పెషల్ ఎడిషన్‌పై రూ.27వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఉంది. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ వయసున్న కారు అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10వేలకు తగ్గుతుంది. మారుతీ సుజుకి డిజైర్ డీజిల్ వేరియంట్‌పై రూ.10వేల నగదు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఆఫర్ చేస్తుంది. స్విఫ్ట్... మారుతీ సుజుకీ స్విఫ్ట్ రెగ్యులర్ పెట్రోల్ ట్రిమ్ వేరియంట్‌పై రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌పై రూ.27వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు, ఒకవేళ కారు ఏడేళ్ల కంటే ఎక్కువ వాడి ఉంటే, డిస్కౌంట్ రూ.10వేలు తగ్గిపోతుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్(డీజిల్)పై రూ.10వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు రూ.25వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో/ఆల్టో కే10... ఆల్టో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.25వేల నగదు డిస్కౌంట్లను మారుతీ సుజుకీ ఆఫర్ చేస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 పెట్రోల్ ఎంటీపై రూ.22వేల నగదు డిస్కౌంట్ లభ్యమవుతుంది. ఆల్టో కే10 ఏఎంటీపై రూ.27వేల నగదు డిస్కౌంట్‌ను, అన్ని మోడల్స్‌పై రూ.30వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. -
మారుతి విక్రయాలకు వరదల దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) విక్రయాలను వర్షాలు, వరదల దెబ్బబాగా తాకింది. ఆగస్టునెలలో మారుతి వాహనాల విక్రయాలు భారీ క్షీణతను నమోదు చేసింది. 3.6 శాతం క్షీణతతో మారుతి విక్రయాలు 1,45,895 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 1,51,270 యూనిట్లు విక్రయించింది. కేరళలో తీవ్ర వరదలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల నెలవారీ అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగుమతులు కూడ 10శాతం క్షీణించి 10,489 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 11,701 యూనిట్లను ఎగుమతి చేసింది. గత నెలలో కాంపాక్ట్ సెగ్మెంట్లో 71,364 యూనిట్లు విక్రయించింది. అంటే సెలేరియో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కంపెనీల అమ్మకాలు 3.6 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 74,102 యూనిట్లు విక్రయించింది.యుటిలిటీ వాహనాలు ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గత ఏడాది ఆగస్టులో 21,442 యూనిట్లతో పోలిస్తే 17,971 యూనిట్లపే మాత్రమే విక్రయించింది. అయితే మిని సెగ్మెంట్ అల్టో, వాగన్ ఆర్ విక్రయాలను పాజిటివ్‌గా ఉన్నాయి. గత ఏడాది 35,428 యూనిట్ల తో పోలిస్తే ఈ ఏడాది 35,895 యూనిట్లు విక్రయించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మిడ్ రేంజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 8 శాతం పెరిగి 7,002 యూనిట్లకు చేరాయి. మొత్తంగా ఆగస్టు నెలలో దేశీయ మార్కెట్లో మారుతి సుజుకీ ఇండియా 2.8 శాతం క్షీనించి 1,47,700 వాహనాలను సేల్ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,52,000 యూనిట్లు. -
త్వరలో అలరించబోతున్న కొత్త కార్లు
కొత్త కారు అంటే ... ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. మార్కెట్లోకి ఎప్పుడు ఏ కొత్త కారు వస్తుందా? అని ఎదురు చూసే ఆటోప్రియులు చాలా మందే. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలే ఉంది. ఆటో ఎక్స్ 2018లో చెప్పిన మేరకు ఈ నాలుగు నెలల్లో 11 కార్ల మేర మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఆటో ప్రియులను అలరించనున్న ఈ కార్లేమిటో ఓ సారి తెలుసుకుందామా? మెర్సిడెస్-బెంజ్ సీ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ : కొత్త ఇంజిన్లతో మెర్సిడెస్-బెంజ్ సీ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ఆటో అభిమానుల ముందకు వస్తుంది. దాంతో పాటు ఎక్స్టీరియర్స్లో కూడా పలు మార్పులను చేపట్టింది మెర్సిడెస్ బెంజ్. ఇప్పటికే ఈ వెహికిల్ టెస్ట్ డ్రైవ్ అయిపోయిందట. మొత్తం లగ్జరీ లుక్, అద్భుతమైన ప్రదర్శనలో ఇది అభిమానులను అలరించబోతుంది. దీని ధర రూ.42 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు ఉంటుంది. 2018 అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ ఆల్-టెర్రైన్: ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల నుండి ఎక్కువ ఆదరణ లభించిన వాటిలో మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్ కారు ఒకటి. మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎస్టేట్ వెర్షన్ రివైజ్డ్ వెర్షనే ఈ ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్. దీనిని తొలుత 216లో ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించారు. దీనిని ప్రస్తుతం మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. దీని ధర రూ.65 లక్షల మేర ఉండొచ్చు. సెప్టెంబర్‌లో ఇది లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. 2018 మారుతీ ఎర్టిగా : ఇది సెవన్-సీటర్ ఎంపీవీ. ఇది చాలా తేలికగా, చాలా పీచర్లతో వస్తుంది. కొత్త ఇంజిన్లను దీనిలో పొందుపరిచారు. నెక్సా రిటైల్ స్టోర్లు వీటిని విక్రయించబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్‌లో ఈ వెహికిల్ లాంచింగ్. ఫోర్డ్ ఫిగో అండ్ ఫోర్డ్ యాస్పైర్ ఫేస్‌లిఫ్ట్ : ఈ ఫిగో సిబ్లింగ్స్ అత్యంత శక్తివంతమైన 1.2 లీటరు డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. అదనపు సేఫ్టీ ఫీచర్లు, పలు వినూత్న ఫీచర్లతో ఇది లాంచ్ కాబోతున్నాయి. యాస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.5.20 లక్షల నుంచి రూ.9 లక్షలుండగా.. ఫిగో ధర రూ.4.80 లక్షల నుంచి రూ.7.80 లక్షలుగా ఉన్నాయి. తొలుత సెప్టెంబర్‌లో యాస్పైర్ను లాంచ్ చేసి, ఆ అనంతరం ఫిగోను మార్కెట్లోకి తేబోతున్నారు. మహింద్రా మారాజ్జో : ఎక్కువ స్పేస్ కలిగి, ఏడు సీట్లతో రాబోతున్న వెహికిల్ మహింద్రా మారాజ్జో. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుంది. లాంచ్ తేదీ : 2018 సెప్టెంబర్ 3. మహింద్రా ఎస్201 : సబ్-కాపాక్ట్ ఎస్యూవీ స్పేస్‌లో మరో వాహనం మహింద్రా ఎస్201. మారుతీ విటారా బ్రిజా, ఎకోస్పోర్ట్, టాటా నెక్సోన్కు ఇది డైరెక్ట్ పోటీ దారిగా నిలువబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్యలో ఉంది. 2018 అక్టోబర్‌లో దీని లాంచింగ్. 2018 హోండా సీఆర్-వీ : ఇప్పటికే మార్కెట్లలో ఐదు తరం సీఆర్-వీ ఉంది. భారత్‌లో ఏడు సీట్ల అవతార్‌గా రాబోతున్న తొలి వాహనం ఇదే. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇది కలిగి ఉండబోతుండగా.. తొలిసారి దీని ద్వారా 1.6 లీటర్ ఇంజిన్‌ను ప్రవేశపెడుతోంది. డస్టన్ జీఓ, జీవో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ : ఎక్స్టీరియర్లో స్వల్ప మార్పులతో, లోపల కొత్త ఫీచర్లతో డస్టన్ ఈ వాహనాలను తీసుకొస్తోంది. టచ్‌స్క్రీన్, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇవి కలిగి ఉంటాయి. దీని ధర రూ.3.50 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండబోతున్నాయి. లాంచింగ్ : 2018 సెప్టెంబర్. జీప్ కంపాస్ ట్రైల్హాక్ : భారత్‌లో ఇదే అత్యంత ఖరీదైన కంపాస్ మోడల్. దీని ధర రూ.23 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. లాంచింగ్ : 2018 అక్టోబర్. నిసాన్ కిక్స్ : నిసాన్ కంపెనీ కిక్స్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. టెర్రానో వంటి బ్రో ప్లాట్‌ఫామ్ ఆధారితంగా ఈ వెహికిల్ లాంచ్ చేస్తోంది. దీని ధర రూ.9.90 లక్షల నుంచి రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. డిసెంబర్లో దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హ్యుందాయ్ శాంట్రో : హ్యుందాయ్ శాంట్రో బడ్జెట్ కార్ కస్టమర్ల మదిలో ఇప్పటికీ బెస్ట్ కారుగానే నిలిచింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును విపణి నుండి తొలగించిప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ శాంట్రో కారును మళ్లీ లాంచ్ చేయడానికి సిద్దమైంది. 2018 అక్టోబర్‌లో ఇది లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
రుపీ దెబ్బ : మారుతి ధరలు పెంచేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి ధరలను పెంపును ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారుదారు తన మోడళ్లు అన్నింటి ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా మారుతికి చెందిన అన్ని మోడళ్ల వాహనాల ధరలను గరిష్టంగా 6,100 రూపాయల (ఎక్స్ షోరూం ఢిల్లీ) వరకు ధరల పెంపు వుంటుందని గురువారం వెల్లడించింది. వస్తువుల ధరలు, పంపిణీ ధరలు పెరగడంతోపాటు విదేశీ మారకంలో పడిపోతున్న రూపాయి విలువ కూడా తమ ధరలను ప్రభావితం చేసిందని మారుతి సుజుకి ప్రతినిధి తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా బాగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు , తదితర వ్యయాల కారణంగా తమ వాహనాల ధరలను ఆగస్టు నుంచి పెంచుతున్నట్టు మారుతి సహా, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, టాటా మోటార్స్‌లాంటి దిగ్గజ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రూ.11 వేలకే కొత్త సియాజ్ బుకింగ్
న్యూఢిల్లీ : సరికొత్త హంగులతో మారుతీ సుజుకీ కొత్త సియాజ్ 2018 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ అప్డేటెడ్ వెర్షన్ బుకింగ్స్‌ను కంపెనీ రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఎంఎస్ఐ నెక్సా నెట్వర్క్ నుంచే ఈ మోడల్‌ను విక్రయించబోతుంది. తొలుత 11 వేల రూపాయలను కట్టి ఈ కొత్త సియాజ్‌ను బుక్ చేసుకోవచ్చు. 319 నెక్సా షోరూంలలో దీని బుకింగ్స్‌ను చేపడుతున్నామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెక్సా వెబ్సైట్ నుంచి కూడా దీన్ని ఈ-బుక్ చేసుకోవచ్చు. ఈ వాహనం అనధికారిక బుకింగ్స్‌ను డీలర్లు రెండు వారాల కిందటే ప్రారంభించారు. మారుతీ సియాజ్ భారత్‌లోకి లాంచ్ చేసి నాలుగేళ్లకు పైగా అవుతుంది. గత ఆరు నెలల నుంచి సియాజ్ విక్రయాలు పడిపోతూ ఉన్నాయి. ఈ అమ్మకాలను పెంచడానికి సరికొత్త హంగులతో కొత్త సియాజ్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెడుతోంది. ఈసారి సియాజ్ ఫ్రంట్ ఎండ్ లుక్స్, ఇంటీరియర్స్‌తో పాటు ఇంజిన్‌లోనూ మార్పులు చేశారు. హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్, టయోటా యారిస్లకు ఇది పోటీగా నిలువొచ్చన్నది అంచనా. ఇవీ హంగులు... సియాజ్ ఫ్రంట్ లుక్స్ గతాని కన్నా షార్ప్‌గా ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ కొత్త ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ టైల్ల్యాంప్స్ స్లీకర్ గ్రిల్, క్రోమ్ గార్నిషింగ్, అప్డేటెడ్ బంపర్, బ్రో షేప్ హెడ్‌లైట్స్‌తో కాస్త విభిన్నంగా కనిపిస్తుంది. ఇంజిన్ పరంగా మార్పులు బాగానే చేశారు. సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. గతంలో ఇది 1.4 లీటర్ ఇంజిన్‌గా ఉండేది. నూతన ఇంజిన్ 103 బీహెచ్పీ శక్తిని, 138 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో పెద్దగా మార్పులేవీ లేవు. అయితే ఇంటీరియర్స్‌లో కొత్తగా లైట్ కలర్డ్ ఫాక్స్ ఉడ్ ఇన్లేస్, టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి హంగులద్దారు. నెక్సా బ్లూ, మెటాలిక్ సిల్కీ సిల్వర్ కలర్స్‌తో పాటు మరికొన్ని వేరియంట్స్ ఉండవచ్చని అంచనా. ధర రూ.7.8 లక్షల నుంచి ప్రారంభం -
మారుతి కూడా బాంబు పేల్చింది
సాక్షి, ముంబై: వరుసగా ఆటో కంపెనీలు తమ వాహనాల రేట్లను పెంచేస్తున్నాయి. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ బాటలో మరో ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా కూడా వినియోగదారులపై ధరల బాంబును పేల్చింది. వివిధ మోడళ్ల వాహనాల ధరలను పెంచుతున్నట్టు మారుతి బుధవారం ప్రకటించింది. ఈ నెల నుంచే తమ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వస్తువుల ధరలు, విదేశీ మారకం అనిశ్చితి, ఇంధన ధరల పెరుగుదల తదితర ప్రతికూల ప్రభావాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇంధన ధరలు, లాజిస్టిక్స్ వ్యయంతో పాటుగా విదేశీ మారకం రేటు కూడా సంస్థపై ప్రభావం చూపిందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎస్.ఎస్.కాల్సీ తెలిపారు. ఆయా మోడల్స్ ఆధారంగా ధర పెంపు ఉంటుందని చెప్పారు. కాగా ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో 800 మొదలుకొని సెడాన్ సియాజ్ మోడల్ వరకూ రకరకాల కార్లను అమ్ముతోంది. వీటి ధరలు రూ.2.51 లక్షలు - రూ.11.51 లక్షల వరకూ ఉన్నాయి. సెడాన్ సియాజ్ (మధ్య సైజ్) ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం రూ.11.51లక్షలుగా ఉంది. -
మారుతీ ‘ఇగ్నిస్’పై భారీ డిస్కౌంట్లు
మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా విక్రయాలు నమోదు చేస్తున్న మారుతీ, తన మోడల్స్‌లో ఒకటి మార్కెట్లో కస్టమర్లను చేరుకోలేకపోతుందని గుర్తించింది. అది ఇగ్నిస్ డీజిల్ వేరియంట్‌గా తెలిపింది. కస్టమర్ల నుంచి ఈ వాహనానికి తక్కువ డిమాండ్ వస్తుండటంతో, ఇగ్నిస్ డీజిల్ వేరియంట్‌ను ఆపివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇగ్నిస్ డీజిల్ ఉత్పత్తిని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్డీటీవీ కారన్అండ్బైక్ రిపోర్టు ప్రకారం, ఇగ్నిస్ డీజిల్‌కు సంబంధించి ఎలాంటి బుకింగ్స్‌ను తాము తీసుకోవడం లేదని ముంబైకి చెందిన ఓ డీలర్ చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్న డీలర్స్ కూడా ఇగ్నిస్ మోడల్‌ను నిలిపివేసినట్టు పేర్కొన్నారు. ఫీచర్ల పరంగా చూసుకుంటే, ఆ కారు ధర చాలా ఎక్కువని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారు అసలు ధర సుమారు 8 లక్షల రూపాయలుగా ఉంది. ఎవరైతే కస్టమర్లు పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి అన్ని ఫీచర్లు కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. కంపెనీ ఇటీవలే తన కొత్త స్విఫ్ట్‌ను లాంచ్ చేసింది. మారుతీ సుజుకీ చెందిన స్విఫ్ట్, ఇగ్నిస్ రెండు మోడల్స్ కూడా ఒకే విధమైన ధరను కలిగి ఉన్నాయి. మూడో తరానికి చెందిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ వేగవంతమైన కారుగా పేరులోకి వచ్చింది. ఇప్పటికే ఇది లక్ష యూనిట్ విక్రయాలను క్రాస్ చేసింది. అయితే ఇగ్నిస్ కేవలం నెలవారీ 4500 యూనిట్ విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. ఇగ్నిస్‌ను ప్రస్తుతం నిలిపివేయడంతో, ఇప్పటికే ఉన్న స్టాక్‌పై డీలర్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించారు. న్యూఢిల్లీలో ఇగ్నిస్‌పై 70 వేల రూపాయల వరకు ప్రయోజనాలను మారుతీ సుజుకీ డీలర్లు ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్ వెర్షన్ 35 వేల రూపాయల నగదు డిస్కౌంట్లో అందుబాటులో ఉంది. ఏఎంటీపై కూడా 40 వేల రూపాయల డిస్కౌంట్ లభ్యమవుతుంది. 25 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్, రూ.3100 కార్పొరేట్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే డిస్కౌంట్లు, ఆఫర్లు డీలర్‌షిప్‌కు డీలర్‌షిప్‌కు మధ్య తేడా ఉంటాయి. ఇగ్నిస్ డీజిల్ బేస్ వేరియంట్ ధర, కొన్ని ప్రత్యర్థ వాహనాల ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి. -
కొత్త స్విఫ్ట్, బాలెనో కార్లు రీకాల్
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ తన కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. 52686 యూనిట్ల కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేయనున్నామని, అనంతరం వాటిని పరీక్షించి, లోపం ఉన్న బ్రేక్ వాక్యుమ్ను రీప్లేస్ చేయనున్నట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 16కు మధ్యలో తయారుచేసిన స్విఫ్ట్, బాలెనో వాహనాలకు ఈ సర్వీసు క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా 2018 మే 14 నుంచి వాహన యజమానులు డీలర్లను సంప్రదించాలని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. గ్లోబల్‌గా కూడా ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద మొత్తంలో సర్వీసు క్యాంపెయిన్లను చేపడుతున్నాయి. కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్న లోపం ఉన్న భాగాలను సరిదిద్దుతున్నాయి. సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ చేపడుతున్న ఈ తనిఖీ, రీప్లేస్మెంట్ కస్టమర్లకు ఉచితం. మీ స్విఫ్ట్ లేదా బాలెనో కారు రీకాల్‌లో భాగమై ఉందో లేదో తెలుసుకోవడం కోసం కస్టమర్లకు మారుతీ సుజుకీ అధికారిక సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ వాహన ఛాసిస్ నెంబర్‌ను నమోదుచేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన తర్వాత ఒకవేళ మీ కారు ఆ రీకాల్ జాబితాలో ఉంటే, కస్టమర్లు కంపెనీ సర్వీసు స్టేషన్‌ను సందర్శించి, పరీక్షించుకుని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్ చేయించుకోవాలి. ఛాసిస్ నెంబర్ వాహన ఇన్వాయిస్లో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉంటుంది. కాగా, సియామ్ వెబ్సైట్లో పొందుపరిచిన డేటాలో 2018 తొలి మూడు నెలల కాలంలో 1.12 లక్షలకు పైగా వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు రీకాల్ చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం 2017లో రీకాల్ చేసిన వాహనాల కంటే కూడా ఎక్కువే. -
టాప్ సెల్లింగ్ కారుగా మారుతీ సుజుకీ స్విఫ్ట్
-
ఆ కార్ల కోసం లక్షకుపైగా వెయిటింగ్
మార్కెట్లో దేశీయ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కార్లకు ఉన్న పాపులారిటీ తెలిసిందే. రోడ్లపై చక్కర్లు కొట్టే వాహనాల్లో సగానికి పైగా ఈ కంపెనీవే. రోజురోజుకి ఈ సంస్థ కార్లకు డిమాండ్ పెరగడమే కానీ, తగ్గడం మాత్రం ఉండదు. తాజాగా స్విఫ్ట్, బాలెనో, డిజైర్, విటారా బ్రిజా కార్ల కోసం లక్షకు పైగా కస్టమర్లు వేచిచూస్తున్నట్టు తెలిసింది. ఈ నాలుగు కార్లు కలిపి 1,10,00 యూనిట్ల పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉన్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం కంపెనీకి చెందిన గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచి, ఈ ప్రొడక్ట్‌ల వెయిటింగ్ కాలాన్ని తగ్గించాలని మారుతీ సుజుకీ ప్లాన్ చేస్తోందని తెలిసింది. కొత్త మారుతీ స్విఫ్ట్‌ను కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే ఈ కారు టాప్-సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. లాంచ్ అయిన రెండు నెలల్లోనే స్విఫ్ట్‌కు దాదాపు లక్ష బుకింగ్స్ నమోదైనట్టు తెలిసింది. మరోవైపు ఏడాది క్రితం లాంచ్ అయిన మారుతీ డిజైర్‌కు కూడా అంతే డిమాండ్ వస్తోంది. లాంచ్ అయిన ఐదు నెలల లోపే ఈ కారు కూడా లక్ష యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ సెడాన్ గతేడాది టాప్ సెల్లింగ్ కార్ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2018 ఏప్రిల్ చివరి నాటికి మారుతీకి 1.72 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగ, హ్యుందాయ్ ఇండియాకు 59,744 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని తెలిసింది. ఈ గణాంకాలు బట్టి మారుతీ సుజుకీ ఉత్పత్తులకు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచాలని మారుతీ చూస్తోంది. ఈ ప్లాంట్‌కు మరో రెండు లైన్లను కూడా జత చేయాలనుకుంటోంది. మొత్తంగా 2020 నాటికి 7.5 లక్షల యూనిట్ల కెపాసిటీని మారుతీ పెంచబోతోంది.