సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఎర్టిగాను న్యూ అవతార్‌లో లాంచ్ చేయనుంది. సెవన్ సీటర్ మల్టీ పర్సస్ వెహికల్ (ఎంపీవీ) కొత్త ఎర్టిగా 2018ను నవంబరు 21ల లాంచ్ చేయనున్నామని మారుతి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ న్యూ ఎర్టిగా ఎల్, వీ, జెడ్, జెడ్ + అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో ఈనెల 21న లాంచ్ చేయనుంది. అలాగే ఈ వాహనాల ప్రీ బుకింగ్స్‌ను నేటి (నవంబరు 14, బుధవారం) నుంచి ప్రారంభించింది. కేవలం రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
ఇక ధర విషయానికి వస్తే లాంచింగ్ సందర్భంగా మారుతి వెల్లడించనుంది. అయితే పాత మోడల్ ఎర్టిగాతో పోలిస్తే కొత్త ఎర్టిగా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. రూ 6.34- 10.69 లక్షలు (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎర్టిగా 2018 ( ఎంపీవీ) 1.5 లీటర్ పెట్రోలు ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ రెండు వెర్షన్లలో, అయిదు రంగుల్లో లభ్యంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment