new avatar
-
మారుతి ఎర్టిగా బుకింగ్స్ నేటి నుంచే
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఎర్టిగాను న్యూ అవతార్‌లో లాంచ్ చేయనుంది. సెవన్ సీటర్ మల్టీ పర్సస్ వెహికల్ (ఎంపీవీ) కొత్త ఎర్టిగా 2018ను నవంబరు 21ల లాంచ్ చేయనున్నామని మారుతి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ న్యూ ఎర్టిగా ఎల్, వీ, జెడ్, జెడ్ + అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో ఈనెల 21న లాంచ్ చేయనుంది. అలాగే ఈ వాహనాల ప్రీ బుకింగ్స్‌ను నేటి (నవంబరు 14, బుధవారం) నుంచి ప్రారంభించింది. కేవలం రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే లాంచింగ్ సందర్భంగా మారుతి వెల్లడించనుంది. అయితే పాత మోడల్ ఎర్టిగాతో పోలిస్తే కొత్త ఎర్టిగా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. రూ 6.34- 10.69 లక్షలు (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎర్టిగా 2018 ( ఎంపీవీ) 1.5 లీటర్ పెట్రోలు ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ రెండు వెర్షన్లలో, అయిదు రంగుల్లో లభ్యంకానుంది. -
సరికొత్త అవతారంలో సమంత
సనాఫ్ సత్యమూర్తి సినిమాలో డయాబెటిస్ బాధితురాలిగా చేసిన సమంత.. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీబిజీగా కనిపిస్తోంది. విక్రమ్ సరసన 10 ఎన్రాదుకుల్ల అనే సినిమాలో చేసిన సమంత.. ఆ సినిమా టీజర్ విడుదల సందర్భంగా సరికొత్త డిజైనర్ వేర్ ధరించింది. తెల్ల టాప్, నల్లటి లెగ్గింగ్స్ ధరించి, దాని మీద పొడవాటి ఎర్ర స్లీవ్‌లెస్ ష్రగ్ ధరించింది. మెడలో కూడా రంగురంగుల పూసలతో కూడిన ఓ దండ వేసుకుంది. ప్రస్తుతం ఈ కొత్త ఎటైర్‌తో కూడిన సమంత ఫొటోలు ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. -
ఎర్రడబ్బాకు కొత్త రూపం!
ఎర్రడబ్బా రూపం మారుతోంది. ఇన్నాళ్లబట్టి ఇనుముతో రూపొందించిన పోస్టు బాక్సులు ఎప్పటికప్పుడు తుప్పుపట్టి, పాడైపోవడం, దాంతో వాటిలో లెటర్లు వేయడానికి జనం భయపడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు పోస్టల్ శాఖ ఓ పరిష్కారం కనుగొంది. సరికొత్త విధానంలో పోస్టుబాక్సులను రూపొందించింది. త్వరలోనే ఇవన్నీ రోడ్ల మీద దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే వరంగల్ పోస్టాఫీసుకు ఇలాంటిది ఓ బాక్సు చేరుకుంది. తుప్పు పట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో వీటిని రూపొందించారు. నగరాల్లో అయితే మొబైల్ ఫోన్లు, ఈమెయిళ్లతోనే సమాచారం పంపుకొంటున్నా, ఇప్పటికీ గ్రామాల్లో మాత్రం ఎర్రడబ్బాలకు ఆదరణ తగ్గలేదు. అలాగే వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా కూడా పోస్టుబాక్సులను ఆశ్రయించాల్సిందే. కొన్ని స్కాలర్షిప్పులకు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా పోస్టులో పంపాల్సిందే. చాలావరకు కొరియర్ సర్వీసుల కన్నా కూడా స్పీడ్ పోస్టు వేగంగా వెళ్తుందని, ఖర్చు కూడా తక్కువని భావిస్తున్నారు. అందుకే ఈ సరికొత్త పోస్టు బాక్సుతో మరింత ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.