bookings
-
బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన 'బీఈ 6', 'ఎక్స్ఈవీ 9ఈ' ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత 30,179 బుకింగ్‌లను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (Twitter) ఖాతాలో వెల్లడించారు.ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో.. మహీంద్రా కార్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. మొదటి రోజు 30,179 బుకింగ్‌లు సాధించాయి. ఇంకో రెండు బుకింగ్స్ కావలి అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొంటూ.. ధన్యవాదాలు తెలిపారు. ఈ బుకింగ్ విలువ ఏకంగా రూ. 8472 కోట్లు (ఎక్స్ షోరూమ్).శుక్రవారం ప్రారంభమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్‌లలో XEV 9e 56 శాతం బుకింగ్స్ సాధించింది. BE 6 44 శాతం బుకింగ్స్ పొందింది. ఎక్కువమంది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ప్యాక్ త్రీ టాప్ మోడల్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.Mahindra Electric Origin SUVs create a new record in EV category by clocking 30,179 Bookings on Day 1 with booking value of ₹8,472 Crore (at ex-showroom price).There are only two more words needed:THANK YOU! pic.twitter.com/X2Ftj9CMED— anand mahindra (@anandmahindra) February 14, 2025 -
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6: బుకింగ్స్.. డెలివరీ వివరాలు
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా & మహీంద్రా' (M&M) దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.ఫిబ్రవరి 14న మహీంద్రా కంపెనీ బుకింగ్‌లను స్వీకరిస్తే డెలివరీలు 2025 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. సంస్థ అన్ని వేరియంట్లకు బుకింగ్స్ స్వీకరించనుంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 18.90 లక్షలుప్యాక్ వన్ అబోవ్ (59 kWh): రూ. 20.50 లక్షలుప్యాక్ టూ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 24.50 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 26.90 లక్షలుమహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ వన్ ఎబౌ (59 kWh): NAప్యాక్ టూ (59 kWh): రూ. 24.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 27.90 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 30.50 లక్షలు -
డిసెంబర్ 31న ఎన్ని ఓయో రూమ్స్ బుక్ అయ్యాయో తెలిస్తే షాక్..!
-
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. నేటి నుంచి బుకింగ్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులో ఉంటుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు.కాచిగూడ - కాకినాడ టౌన్ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకోనుంది. అలాగే, కాకినాడ టౌన్ -కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.హైదరాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయని రైల్వే శాఖ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే! -
బడ్జెట్ పర్యటనలవైపే చూపు: ఎక్కువ బుకింగ్స్ అక్కడికే..
ముంబై: మారుమూలనున్న సాహస కేంద్రాలు, అందుబాటు ధరల్లో ఉన్న కేంద్రాలను సందర్శించేందుకు దేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాసియాలోని పేరొందిన ప్రదేశాలు పర్యాటకుల ప్రముఖ ఎంపికగా ఉంది.ట్రావెల్ బుకింగ్ సేవల్లోని ‘క్లియర్‌ట్రిప్’ నివేదికను పరిశీలించగా.. జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు), వృద్ధులు అందుబాటు ధరల్లోని ప్రాంతాలకు ఈ ఏడాది ఎక్కువగా బుకింగ్ చేసుకున్నారు. సులభతర చెల్లింపుల విధానాలకు సైతం ఆమోదనీయం పెరుగుతోంది. ఈ విషయంలో జెనరేషన్ జెడ్‌లో 1.4 రెట్ల అధిక ఆమోదం కనిపించింది. ‘‘వీసా రహిత విధానాలు, ట్రావెల్ నిబంధనలను సడలించడంతో దక్షిణాసియా ప్రాంతాలు ట్రావెలర్ల ముఖ్య ఎంపికగా మారాయి. అందుబాటు ధరల్లో ఉన్న ప్రాంతాలను సందర్శించేందుకు ఈ ఏడాది పర్యాటకులు ప్రాధాన్యం ఇచ్చారు’’అని క్లియర్‌ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనుజ్రాతి తెలిపారు. ➜బాలిలోని డెన్పాసర్కు బుకింగ్‌లు 2023తో పోల్చితే 73 శాతం పెరిగాయి. బాలికి బెంగళూరు నుంచి ఇండిగో డైరెక్ట్ ఫ్లయిట్ సేవలను ప్రారంభించడంతో దేశీయ పర్యాటకులకు ఇది అందుబాటులోకి వచ్చింది.➜దేశీయంగా పెరుంబాకం, పంగాల, టెక్కుమురి ప్రాంతాలకూ ఆదరణ లభించింది.➜దేశీయంగా చూస్తే లక్షద్వీప్‌లోని అగట్టి దీవికి ఏకంగా 94 శాతం మేర బుకింగ్‌లు పెరిగాయి. డయ్యూకి 130 శాతం అధికంగా బుకింగ్‌లు వచ్చాయి. బెంగళూరు నుంచి గోవా, డయ్యూని కలుపుతూ అగట్టికి ఇండిగో సేవలు ప్రారంభించడం ఇందుకు నేపథ్యం. ➜ఎక్కువ మంది అన్వేషించిన దేశీయ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గోవా మొదటి స్థానంలో ఉంది. గతేడాదితో పోల్చితే గోవాకి ఫ్లయిట్ అన్వేషణలు 200% పెరిగాయి. అమృత్‌సర్‌కు 106% బుకింగ్‌లు పెరిగాయి. ➜ఎక్కువ మంది అన్వేషించిన అంతర్జాతీయ కేంద్రంగా అజర్‌బైజాన్‌లోని షాదాగ్ నిలిచింది. అలాగే అదుబాబి, కౌలాలంపూర్, మెల్బోర్న్, లండన్, బ్యాంకాక్ ఫ్లయిట్ అన్వేషణల్లో ప్రముఖంగా నిలిచాయి. గతేడాదితో పోలిస్తే 90 - 150 శాతం పెరుగుదల కనిపించింది. -
ఆడి కొత్త కారు.. బుకింగ్‌లు ప్రారంభం
ముంబై: లగ్జరీ కార్ల సంస్థ ఆడి.. నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆడి ఇండియా వెబ్సైట్ లేదా ‘మైఆడికనెక్ట్’ మొబైల్ యాప్ నుంచి రూ.2,00,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.ఈ నెల 28న విడుదల చేసే న్యూ ఆడి క్యూ7 మోడల్ కార్లను ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. 3.0లీటర్ల వీ6 టీఎఫ్ఎస్ఐ ఇంజన్ కలిగిన ఆడి క్యూ7.. 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌తో ఉంటుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుందని, 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది. -
ధర రూ.2 కోట్లు.. అన్నీ బుక్ అయిపోయాయ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బ్రాండ్ వాహనాలలో ఒకటైన లెక్సస్ తన 'ఎల్ఎమ్ 350హెచ్' (Lexus LM 350h) బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. 2024 మార్చిలో లాంచ్ అయిన ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్ 2023 ఆగష్టులో ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం 100 బుకింగ్స్ పొందింది.కంపెనీ వంద బుకింగ్స్ పొందింది, కాబట్టి వీటిని డెలివరీ చేసిన తరువాత మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మళ్ళీ ఎప్పుడు బుకింగ్స్ మొదలవుతాయనేది తెలియాల్సిన విషయం.లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్విశాలమైన క్యాబిన్ కలిగిన ఈ ఎంపీవీ.. పెద్ద ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. బ్లాక్, సోలిస్ అనే రెండు రంగులలో లభించే ఈ కారు 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. 23 స్పీకర్ ఆడియో సిస్టం, ఫోల్డ్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్, రిఫ్రిజిరేటర్ మొదలైనవన్నీ ఇందులో లభిస్తాయి.ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటనఈ లగ్జరీ ఎంపీవీ 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp, 240 Nm టార్క్ అందిస్తుంది. ఏడు సీట్ల లెక్సస్ ఎల్ఎమ్350 హెచ్ ధర రూ. 2 కోట్లు. అయితే ఇదే మోడల్ 4 సీటర్ ధర రూ. 2.5 కోట్లు. ఈ కారు టయోటా వెల్ఫైర్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఐఫోన్ 16 సిరీస్ ఫ్రీ-బుకింగ్స్: ఇలా బుక్ చేసుకోండి
యాపిల్ ఇటీవల తన ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పుడు సెప్టెంబర్ 13 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. వీటిని వివిధ మార్గాల్లో బుక్ చేసుకోవచ్చు.ఫ్రీ ఆర్డర్ ఎక్కడ చేయాలంటే..యాపిల్ స్టోర్ ఆన్లైన్యాపిల్ స్టోర్ బీకేసీ, ముంబైయాపిల్ స్టోర్ సాకేత్, ఢిల్లీఅమెజాన్ఫ్లిప్కార్ట్క్రోమావిజయ్ సేల్స్రిలయన్స్ డిజిటల్యూనికార్న్ స్టోర్స్ఇమాజిన్ స్టోర్స్ ఆప్రోనిక్ స్టోర్స్మాపుల్ స్టోర్స్ఐప్లానెట్ స్టోర్స్ఐకాన్సెప్ట్ స్టోర్స్పైన పేర్కొన్న స్టోర్లలలో లేదా అధికారిక వెబ్సైట్లలో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండటం మంచింది. ఎందుకంటే అధికారిక వెబ్‌సైట్స్ మాదిరిగానే ఉంటూ.. పలువురు సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉంది.డిస్కౌంట్ వివరాలుఐఫోన్ 16 సిరీస్ బుక్ చేసుకునేవారు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ 16 సిరీస్ అన్ని మోడళ్లకు వర్తిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే వారు మూడు లేదా ఆరు నెలల పేమెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రాం కింద ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 4000 నుంచి రూ. 67500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలుఐఫోన్ 16128 జీబీ: రూ. 79900256 జీబీ: రూ. 89900512 జీబీ: రూ. 109900ఐఫోన్ 16 ప్లస్128 జీబీ: రూ. 89900256 జీబీ: రూ. 99900512 జీబీ: రూ. 119900ఐఫోన్ 16 ప్రో128 జీబీ: రూ. 119900256 జీబీ: రూ. 129900512 జీబీ: రూ. 1499001 టీబీ: 169900ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్256 జీబీ: రూ. 144900512 జీబీ: రూ. 1649001 టీబీ: రూ. 184900 -
బీఎండబ్ల్యూ మరో ఈ-స్కూటర్.. ప్రీలాంచ్ బుకింగ్స్ రేపే..
అంతర్జాతీయ ప్రీమియం మోటర్‌సైకిల్స్ కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. సీఈ 02 (CE 02) పేరుతో వచ్చే ఈ ఈ-స్కూటర్ రానున్న పండుగ సీజన్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ప్రీ-లాంచ్ బుకింగ్ శనివారం ప్రారంభమవుతున్నాయి.బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ఈ-స్కూటర్‌ను స్థానికంగా భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. దీని ధర సుమారు రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో బీఎండబ్ల్యూ భారత్‌లో తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సీఈ 04ని విడుదల చేసింది. దీని ధర 14.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 31 kW మోటార్‌ను పొందుతుంది మరియు 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.బీఎండబ్ల్యూ సీఈ 02లో గరిష్టంగా 55 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేసే 11 కిలోవాట్ల (15 హార్స్ పవర్) మోటర్ ఉంటుంది. దీని రేంజ్ 90 కి.మీ, గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. సీటు ఎత్తు 750 మి.మీ. ఉంటుంది. ఇక టీనేజర్ల కోసం 4 కిలోవాట్ల వెర్షన్ కూడా ఉంటుంది. "ఫ్లో", "సర్ఫ్" అనే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. వీటితోపాటు "ఫ్లాష్" డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. -
ఫ్యాన్స్‌కు టెన్షన్.. పొరపాటున కల్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం క్రేజీ రికార్డ్ సృష్టించింది. టికెట్స్ అమ్మకాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిగమించింది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో ఇండియాలోనూ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే టికెట్స్ అమ్ముడుపోయాయి.అయితే హైదరాబాద్‌లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీకి బదులు.. రాజశేఖర్ నటించిన కల్కి మూవీ టికెట్స్ బుక్ అయినట్లు చూపించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. టికెట్స్ బుక్ చేసుకోవాలన్న తొందరలో ఫ్యాన్స్ ఈ విషయాన్ని గమనించలేదు. టికెట్ లావాదేవి పూర్తయ్యాక చూస్తే కల్కి పోస్టర్ కనిపించడంతో అవాక్కయ్యారు. కాగా.. 2019లో ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ కాంబోలో కల్కి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అలా టికెట్స్ బుక్ అయిన వారికి బుక్‌మై షో వివరణ ఇచ్చింది. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కల్కి టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. కల్కి 2898 ఏడీ టికెట్గానే భావించండి. సాంకేతిక లోపం వల్లే ఈ సమస్య వచ్చిందని వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కల్కి 2898 ఏడీ ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.స్పందించిన రాజశేఖర్అయితే తన సినిమా కల్కి టికెట్స్ బుక్ కావడంపై హీరో రాజశేఖర్ స్పందించారు. ఈ విషయంలో తనకేలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. Naaku assalu sammandham ledhu 😅🤣Jokes apart...Wishing dear #Prabhas @nagashwin7, Maa #AshwiniDutt garu @VyjayanthiFilms, The stellar cast and crew all the very very best!May you create history and take the film industry a step ahead #kalki2898ad https://t.co/P00OyIZFVE— Dr.Rajasekhar (@ActorRajasekhar) June 23, 2024 -
రియల్టీ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీఎల్ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్, సిగ్నేచర్ గ్లోబల్ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్‌లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్ కనిపించడం తోడ్పాటునిచి్చంది! శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. రియల్టీ రంగ లిస్టెడ్ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్ఎఫ్ రూ. 14,778 కోట్లు, లోధా బ్రాండ్ మాక్రోటెక్ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్సై్పస్ రూ. 2,328 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ. 2,266 కోట్లు, సన్‌టెక్ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్ రూ. 1,798 కోట్లు, అరవింద్ స్మార్ట్‌స్పేసెస్ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్ ఇన్ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది. ఇతర దిగ్గజాలు.. ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ తదితరాలు నాన్‌లిస్టెడ్ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్ గృహాలవైపు కన్జూమర్ చూపుసారించడం లిస్టెడ్ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్ఫ్రాటెక్ తదితరాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్‌్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.33 శాతం వృద్ధిబలమైన కన్జూమర్ డిమాండ్ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్ ప్రీసేల్స్ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్ బుకింగ్స్‌ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్‌తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్ రియలీ్ట, మహీంద్రా లైఫ్‌స్పేస్, కోల్టేపాటిల్, సన్‌టెక్, కీస్టోన్ రియల్టర్స్ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్ గుర్తింపు, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్.కామ్, ప్రాప్‌టైగర్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్‌లిస్టెడ్ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ టికెట్స్ బుకింగ్ ఎప్పుడంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కాలేదు. తాజాగా సలార్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు రాత్రి 8.24 నిమిషాలకు సలార్ నైజాం టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుది. కాగా.. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Khansaar ee kaadhu, anni theatres housefulls tho erupekkala ❤️🔥❤️🔥#SalaarNizamBookings opens online today at 8.24 PM 🔥#Salaar Nizam Release by @MythriOfficial 💥#SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai… pic.twitter.com/FqUidhS126 — Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2023 -
OYO Travelopedia: వరంగల్, గుంటూరులో ఎక్కువ హోటల్ బుకింగ్‌లు
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు ప్రయాణాలు కడుతున్నారు. ఈ ఏడాది ఎక్కువగా హోటళ్లు బుక్ చేసుకున్నది హైదరాబాద్‌లోనే అని ఓయో ట్రెవెలో పీడియా 2023 నివేదిక ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత బుకింగ్‌లలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ, కోల్‌కతా తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. గోరఖ్‌పూర్, ధిగ, వరంగల్, గుంటూరులకు సైతం ఎక్కువ బుకింగ్‌లు నమోదయ్యాయి. ఇక ఎక్కువ మంది సందర్శించిన (హోటళ్లు బుక్ చేసుకున్న) రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 2 మధ్య వారాంతపు హోటళ్ల బుకింగ్‌లు ఎక్కువ నమోదయ్యాయి. విహార పర్యటనలకు జైపూర్ ప్రధాన కేంద్రంగా ఉంది. 2023లో ఎక్కువ మంది విహారం కోసం ఈ పట్టణాన్ని సందర్శించారు. గోవా, మైసూరు, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువ హోటళ్లు బుక్ చేసుకున్న ఆధ్యాతి్మక, భక్తి కేంద్రంగా ఒడిశాలోని పూరి పట్టణం నిలిచింది. ఈ విషయంలో అమృత్సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాతి్మకంగా పెద్దగా తెలియని దియోగఢ్, పళని, గోవర్ధన్‌కు సైతం బుకింగ్‌లు 2022తో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. రాష్ట్రాల పరంగా ఎక్కువ బుకింగ్‌లలో యూపీ మొదటి స్థానంలో ఉంటే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. ‘‘ప్రయాణాలకు సంబంధించి 2023 ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల తర్వాత పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. దేశీయంగా కొత్త ప్రాంతాలను చూసి రావాలన్న ధోరణి కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ప్రయాణాల వృద్ధిలో విహార యాత్రలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్‌లో వ్యాపార ప్రయాణాలు సైతం వృద్ధికి చెప్పుకోతగ్గ మద్దతునిస్తున్నాయి’’అని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే వివరించారు. ఈ ఏడాది ఎక్కువ హోటల్ బుకింగ్‌లు చేసుకున్న రోజు సెపె్టంబర్ 30 కాగా, మాసాల వారీగా చూస్తే మేలో ఎక్కువ బుకింగ్‌లు నమోదైనట్టు ఓయో ట్రావెలోపీడియా నివేదిక తెలిపింది. ఇక అమెరికాలో ఎక్కువ మంది ప్రయాణించిన రాష్ట్రాల్లో టెక్సాస్, ఒరెగాన్, లూసియానా, ఓక్లహామా, ఫ్లోరిడా, హూస్టన్ టాప్‌లో ఉన్నాయి. యూకేలో లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, షెఫీల్డ్, ఈస్ట్‌బోర్న్, యూరప్‌లో శాల్జ్‌బర్గ్, ఆ్రస్టియాలో టైరోల్‌ను ఎక్కువ మంది సందర్శించారు. -
కియా సెల్టోస్ కొత్త వేరియంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా సెల్టోస్ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) లెవెల్–2 సాంకేతికతతో ఇవి రూపుదిద్దుకున్నాయి. జీటీఎక్స్ ప్లస్ (ఎస్), ఎక్స్-లైన్ (ఎస్) వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఇంజన్‌తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఇవి తయారయ్యాయి. ఎక్స్షోరూలో ధర రూ. 19.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త సెల్టోస్ సగటు వెయిటింగ్ పీరియడ్ 15=16 వారాలు ఉంది. నూతన వేరియంట్లను 7-9 వారాల్లోనే డెలివరీ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెండు నెలల్లోనే కొత్త సెల్టోస్ 50,000 యూనిట్ల బుకింగ్స్ మైలురాయిని అధిగమించిందని కియా ఇండియా వెల్లడించింది. -
గంటలో అన్ని బుక్ అయిపోయాయ్.. ఇది కదా ఆ మొబైల్‌కున్న డిమాండ్!
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజే వేరు. ఈ సంగతి అందరికి తెలుసు. ఇటీవల కంపెనీ కొత్త ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది. కాగా నేడు (2023 సెప్టెంబర్ 16) ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కొంత సమయానికి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం గంటలోపు ఐఫోన్15 ప్రో సిరీస్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మొత్తం అమ్ముడైనట్లు తెలిసింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెల 12న యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్‌కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. గతంలో ఇలా.. గతంలో కూడా కేవలం యాపిల్ కంపెనీ ఫోన్స్ మాత్రమే కాకుండా.. శాంసంగ్ వంటి కంపెనీల మొబైల్స్ కూడా భారీగా బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వినియోగదారులకు నచ్చిన ఫీచర్స్ కలిగిన మొబైల్ తప్పకుండా మంచి బుకింగ్స్ పొందుతాయని స్పష్టమవుతోంది. -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు హీరో మోటోకార్ప్ మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ నుంచి డెలివరీలు ఉంటాయి. హార్లే డేవిడ్సన్ షోరూంలు, ఎంపిక చేసిన హీరో మోటోకార్ప్ ఔట్లెట్స్, ఆన్లైన్లో రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 440 సీసీ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్స్‌ను నీమ్రానా ప్లాంటులో హీరో మోటోకార్ప్ తయారు చేస్తోంది. 440 సీసీ విభాగంలోకి ఇరు కంపెనీలు ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. మూడు వేరియంట్లలో ఎక్స్440 లభిస్తుంది. ఎక్స్‌షోరూం ధర రూ.2.29 లక్షల నుంచి ప్రారంభం. 2020 అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్సన్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లను హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేయడంతోపాటు విక్రయిస్తుంది. (తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు) -
రూ. 25 వేలకే ఇన్విక్టో బుకింగ్స్ - లాంచ్ ఎప్పుడంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతీ సుజుకీ సరికొత్త యుటిలిటీ వెహికిల్ ఇన్విక్టో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వినియోగదార్లు రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. జూలై 5న ఈ కారు భారత్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ధర రూ.20 లక్షలకుపైగా ఉండనుంది. ఇన్విక్టో రాకతో మూడు వరుసల్లో లభించే ప్రీమియం వెహికిల్స్ విభాగంలోకి ప్రవేశించినట్టు అవుతుందని మారుతీ సుజుకీ తెలిపింది. స్పోర్ట్ యుటిలిటీ/మల్టీపర్పస్ వెహికిల్ లక్షణాలతో కూడిన ప్రీమియం మూడు–వరుసల వాహనాన్ని కోరుకునే వినియోగదారులను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మూడు వరుసలున్న స్పోర్ట్ యుటిలిటీ/మల్టీపర్పస్ వెహికిల్స్ 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసేవి 1.2–1.25 లక్షల యూనిట్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ఆధారంగా ఇన్విక్టో రూపుదిద్దుకుంది. Experience a new realm of luxury with the all-new Invicto. Bookings are now open for you to join this exclusive group. To know more : https://t.co/nuzitvde47#Invicto #Bookingsopen #Nexa #CreateInspire *Creative visualization pic.twitter.com/Zt9CuluXBN — Nexa Experience (@NexaExperience) June 19, 2023 -
రోజుకి 150 దాటుతున్న జిమ్నీ బుకింగ్స్ - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
మారుతి సుజుకి జిమ్నీ 2023 ఆటో ఎక్స్పో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన బుకింగ్స్ పొందుతూ ముందుకు సాగుతోంది. విడుదలకు ముందే 30,000 బుకింగ్స్ పొందిన ఈ ఆఫ్ రోడర్ ఇప్పటికి కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ పొందుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి తన జిమ్నీ ధరలను 2023 జూన్ 7న అధికారికంగా ప్రకటించింది. జిమ్నీ బేస్ వేరియంట్ ధరలు రూ. 12.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 15.05 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధరలు ప్రకటించడానికి ముందు కంపెనీ ఈ SUV కోసం రోజుకి దాదాపు 92 బుకింగ్స్ పొందింది. కాగా ధరలు ప్రకటించిన తరువాత రోజుకి 151 బుకింగ్స్ వస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సేల్స్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. డిజైన్ పరంగా నిటారుగా ఉన్న పిల్లర్లు, క్లీన్ సర్ఫేసింగ్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, స్లాట్డ్ గ్రిల్, చంకీ ఆఫ్-రోడ్ టైర్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కలిగి ఉన్న ఈ ఆఫ్ రోడర్ 195/80 సెక్షన్ టైర్లతో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. లోపలి భాగంలో 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి. జిమ్నీ ఎస్యువి 1.5 లీటర్ 5 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 105 bhp పవర్ 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి తన జిమ్నీ కారుని కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సంస్థ ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది. దేశీయ విఫణిలో డెలివరీలను కూడా ప్రారంభించింది. ఇది ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
చీపెస్ట్ ఈవీ ‘ఎంజీ కామెట్’ వెయిటింగ్‌కు చెక్: బుకింగ్ ప్రైస్ తెలిస్తే!
సాక్షి, ముంబై: ఎంజీ మోటార్స్ కాంపాక్ట్ ఈవీ కామెట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కంపెనీ తీపి కబురు. భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఇవీ ఇప్పుడు బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. ఎంజీ మోటార్ ఇండియా వెబ్సైట్ ద్వారా లేదా ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద కస్టమర్లు కేవలం రూ. 11వేలు మాత్రమే చెల్లించి మే బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ‘MyMG’ యాప్‌లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ కార్ బుకింగ్‌ల స్టేటస్‌ను వారి ఫోన్ల నుండే ట్రాక్ చేయవచ్చు. కామెట్ ఈవీ ప్రత్యేక ఆఫర్ ధరలో అందుబాటులో ఉంటుంది. పేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ప్లే, ప్లష్ వేరియంట్ ధరలు రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఆఫర్ మొదటి 5వేల బుకింగ్‌లకు మాత్రమే పరిమితం. మే నెలలోనే దశలవారీ డెలివరీలు ప్రారంభమని కంపెనీ తెలిపింది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) కామెట్ ఈవీ: 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ట్విన్ డిస్ప్లే వైడ్స్క్రీన్తో వస్తోంది. ఫుల్లీ కస్టమైజ్డ్ విడ్జెట్లతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ కీ మరో ప్రత్యేక లక్షణం, స్టైలిష్ డిజైన్ కామెట్ ఒకే ఛార్జ్‌పై దాదాపు 230 కి.మీ పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. Introducing the MG Comet EV, the no-nonsense car that keeps it real. The car’s latest tech keeps you connected with your squad and has all the space for your fam. Experience the plush interiors, latest tech and futuristic design of the Comet EV! Bookings open now! #MGCometEV — Morris Garages India (@MGMotorIn) May 13, 2023 ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు -
విడుదలకు ముందే బుకింగ్స్ షురూ.. లాంచ్ అయితే రచ్చ.. రచ్చే!
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో విడుదల చేయనున్న ఎక్స్టర్ SUV టీజర్లను గత కొన్ని రోజులుగా విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కారుని అధికారికంగా వెల్లడించింది, అంతే కాకుండా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బుకింగ్స్ & లాంచ్ టైమ్ హ్యుందాయ్ ఎక్స్టర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ కారు 2023 జులై లేదా ఆగస్టు నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డెలివరీలు ఆ తరువాత ప్రారంభమవుతాయి. డిజైన్ & ఫీచర్స్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX (O), SX(O) కెనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలకానుంది. ఇప్పటికే సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇది రేంజర్ ఖాకీ అనే కొత్త కలర్లో లభించనుంది. ఇందులో H షేప్ ఎల్ఈడీ హెడ్ లాంప్, DRL, విశాలమైన ఫ్రంట్ ఫాసియా, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూప్ రెయిల్స్ వంటివి ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎల్ఈడీ టెయిల్ లాంప్ మొదలైనవి ఉంటాయి. కంపెనీ ఏ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్, డిజైన్ వంటి వాటిని గురించి అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో ఆధునిక కాలంలో వినియోగదారునికి కావలసిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & పర్ఫామెన్స్ హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యువిలో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉండనుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, వెన్యూ కార్లలో అందుబాటులో ఉంది. పర్ఫామెన్స్ ఫిగర్స్ ఇంకా వెల్లడికానప్పటికీ ఇది 83hp పవర్ 114Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్నాము. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందనుంది. కంపెనీ ఈ ఎస్‌యువిని లాంచ్ చేసే సమయంలోనే ధరలను గురించి కూడా అధికారికంగా వెల్లడించనుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి. -
మొదలైన 'ఎంజీ కామెట్' టెస్ట్ డ్రైవ్స్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
ఇటీవల భారతదేశంలో విడుదలైన చిన్న హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ కామెట్' ఎంతో మంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లు 2023 మే 15 నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు, టెస్ట్ డ్రైవ్స్ వంటి వివరాలు ఇక్కడ చూసేద్దాం.. గత నెల చివరిలో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా డెలివరీలు మే నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఎంజి కామెట్ చూడటానికి చిన్న కారు అయినప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే ఎంజీ కామెట్ ఈవీ వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బార్ కలిగి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ లైట్ బార్ కింద ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం గమనించవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే ఈ చిన్న కారు 10.25 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే రెండూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, మ్యాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు 55కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) 3.67 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI దృవీకరించింది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఎంజి కామెట్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పరిమాణం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది. -
అప్పుడే మొదలైన 'టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ' బుకింగ్స్ - పూర్తి వివరాలు
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు తన ఆల్ట్రోజ్ సిఎన్జీ కోసం రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా డెలివరీలు 2023 మే నాటికి ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & డిజైన్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి XE, XM+, XZ , XZ+. ఇది మొదటిసారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండే ఈ మోడల్ 'iCNG' బ్యాడ్జ్ పొందుతుంది. తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్లో సిఎన్జి ట్యాంక్స్ ఉంటాయి. ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథెరెట్ సీట్లు, రియర్ AC వెంట్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటివి ఉంటాయి. అంచనా ధర: దేశీయ విఫణిలో ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ప్రస్తుతం పెట్రోల్ మాన్యువల్ ధరలు రూ. 6.45 లక్షల నుంచి రూ. 9.10 లక్షల మధ్య ఉన్నాయి. కావున ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు దాని కంటే రూ. 90వేలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నాము. పవర్‌ట్రెయిన్: ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్, త్రీ-సిలిండర్ ఇంజన్ కలిగి సిఎన్జీ మోడ్‌లో 77 హెచ్‌పి పవర్ 97 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 86 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము. సేఫ్టీ ఫీచర్స్: టాటా మోటార్స్ ఇతర వాహనాలలో మాదిరిగానే ఆల్ట్రోజ్ సిఎన్జీలో కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. కావున ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?
ఎంజీ మోటార్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి ఉత్పత్తులను ప్రవేశపెట్టి మంచి ఆదరణ పొందగలిగింది. కేవలం ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా చరిత్ర తిరగరాసిన ఈ కంపెనీ త్వరలో ఓ బుజ్జి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ లాంచ్ డేట్, రేంజ్, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: ఎంజీ మోటార్ ఇండియా ఈ నెల 26న (2023 ఏప్రిల్ 26) దేశీయ మార్కెట్లో 'కామెట్ ఈవీ' (Comet EV) విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ సమయంలో ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడిస్తుంది, ఆ తరువాత అన్ని వేరియంట్స్ ధరలను మే నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉన్న 'సిట్రోయెన్ సి3'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. అంచనా ధరలు: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్న కారుని విడుదల చేయనుంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అయితే ధరలు అధికారికంగా వెల్లడికాలేదు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) డిజైన్: ఈ చిన్న కారు చూడగానే ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుంది. కావున ఇది ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కార్లకంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం రెండు డోర్స్ కలిగి మంచి కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇప్పటికే వెల్లడైన కొన్ని ఫోటోల ద్వారా ఈ కారు డిజైన్ చూడవచ్చు. ఫీచర్స్: ఆధునిక కాలంలో విడుదలవుతున్న దాదాపు అన్ని కార్లు లగ్జరీ ఫీచర్స్ పొందుతాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంజి కామెట్ ఈవీ సరసమైన ధర వద్ద లభించే మంచి ఫీచర్స్ కలిగిన కారు కావడం విశేషం. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. అంతే కాకుండా రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ కలిగిన, నాలుగు-సీట్ల కారు ఈ కామెట్ ఈవీ. కార్ టెక్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, డ్రైవ్ మోడ్స్, వాయిస్ కమాండ్ వంటివి ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) బ్యాటరీ ప్యాక్ & రేంజ్: త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీకి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు, కానీ ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ ఏప్రిల్ 26 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. -
హైక్రాస్ బుకింగ్స్ నిలిపివేసిన టాయోటా.. కారణం ఏంటంటే?
టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ఇన్నోవా హైక్రాస్ ZX & ZX (O) మోడళ్ల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే హైక్రాస్ మోడల్లో హైబ్రిడ్, గ్యాసోలిన్ మోడళ్ల బుకింగ్‌లను కొనసాగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో గత ఏడాది చివరిలో విడుదలైన హైక్రాస్ మంచి బుకింగ్స్ పొందుతూ, అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఈ కొత్త MPV జి-ఎస్ఎల్ఎఫ్, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్లకు మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ప్రస్తుతానికి బుకింగ్స్ నిలిపివేయడం జరిగింది. జెడ్ఎక్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 2.5 సంవత్సరాలుగా ఉంది. ఇన్నోవా హైక్రాస్ ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండి వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇది ఆధునిక డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో సంపన్న భారతీయుడు!) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది. కొత్త హైక్రాస్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి 172 బిహెచ్పి పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్పి, 187 బిహెచ్పి పవర్ అందిస్తుంది. ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. -
2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!
సాక్షి,ముంబై: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్. కియా ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనం ఈవీ 6 2023 వెర్షన్ బుకింగ్‌లను షురూ చేస్తోంది. ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. 2023 ఈవీ6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీటీ లైన్ , జీటీ GT లైన్ AWD. వీటి ధరలు వరుసగా రూ. 60.95 లక్షలు, రూ. వరుసగా 65.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) గత ఏడాది తమ పాపులర్ కారును అందుకోలోలేకపోయిన వారి కోసం తమ డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించామనీ, మార్కెట్లో అద్భుతమైన పనితీరుతో ఈవీ6 ప్రీమియం ఈవీ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతుందనే విశ్వసాన్ని కియా ఇండియా సీఎండీ తే జిన్ పార్క్ ప్రకటించారు. 2022లో 432 యూనిట్ల విక్రయించిన కంపెనీ, 150 kW హై-స్పీడ్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రస్తుతం ఉన్న 15 డీలర్‌షిప్‌ల నుండి మొత్తం 60 అవుట్లెట్లకు విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. (2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే) -
దూసుకెళ్తున్న కొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్: ఇప్పటికే..
2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. 2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ డీలర్షిప్ ద్వారా లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లొకేషన్, బుక్ చేసుకునే వేరియంట్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు రెండు నెలల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT)తో వచ్చే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డిసిటి కలిగిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇవి రెండూ ఉత్తమమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కొత్త హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ పొందింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విఫణిలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
హ్యుందాయ్ అల్కజార్ ఇప్పుడు కొత్త ఇంజిన్‌తో.. బుకింగ్స్ స్టార్ట్
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'హ్యుందాయ్ అల్కజార్' ఇప్పుడు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఈ SUV కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. కంపెనీ అందించే హ్యుందాయ్ అల్కజార్ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ వెర్షన్ 158 బీహెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్సన్స్ పొందుతుంది. మ్యాన్యువల్ వెర్షన్ 17.5 కిమీ/లీటర్ మైలజీని అందించగా, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ వెర్షన్ 18 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ఈ నెల ప్రారంభంలో 2023 అల్కజార్ SUV విడుదల చేసింది. ఇది మునుపటికంటే ఎక్కువ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ అల్కజార్ ఐడిల్ స్టార్ట్ అండ్ గో ఫంక్షన్‌తో కూడా వస్తుంది. కావున ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలో కొంత ఇంధనాన్ని అదా చేయడానికి ఉపయోగపడుతుంది. అప్డేటెడ్ అల్కజార్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. -
తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధరలు అధికారికంగా ప్రకటించక ముందే భారీ సంఖ్యలో బుకింగ్స్ పొందిన గ్రాండ్ విటారా ఇప్పటికీ 90,000 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీంతో డెలివరీ పీరియడ్ భారీగా పెరిగింది. మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 19.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఇది మొత్తం 9 కలర్ ఆప్సన్స్‌లో (ఆరు మోనోటోన్ & మూడు డ్యూయల్ టోన్) లభిస్తుంది. గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 103 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?) ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 92 హెచ్‌పి పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్, 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీద ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తూ, 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా డెలివరీలను ప్రారంభించింది, ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ SUV ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కారు మరిన్ని ఎక్కువ పొందే అవకాశం కూడా ఉంది. -
తగ్గని డిమాండ్! హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతి జిమ్నీ
2023 ఆటో ఎక్స్‌పోలో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచిన 5-డోర్స్ 'మారుతి సుజుకి జిమ్నీ' ప్రారంభం నుంచి భారత్‌లో మంచి బుకింగ్స్ పొందుతోంది. ఇప్పటికి ఈ ఆఫ్-రోడర్ 16,500 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి రోజూ 700 మందికంటే ఎక్కువ కస్టమర్లు ఈ ఎస్యువీ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా తన 5 డోర్స్ జిమ్ని ఆవిష్కరించిన రోజు నుంచి రూ. 11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన జిమ్ని బుకింగ్ ప్రైస్ రూ. 25,000 కు పెరిగింది. బుకింగ్ ప్రైస్ పెరిగినప్పటికీ బుక్ చేసుకునే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్‌లోని K15B పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్పి పవర్, 135 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కొత్త మారుతి జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. ఈ ఎస్యువీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్ కలిగి ఉండటం వల్ల నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్‌లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఆఫ్ రోడర్ బాద్షా జిమ్నీ డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసే 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ పొందుతుంది -
హైస్పీడ్ ఈ-స్కూటర్ ‘మిహోస్’ లాంచ్..ఫ్రీ బుకింగ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో మరో ఈ స్కూటర్ సందడి చేయనుంది. జాయ్ ఇ-బైక్ తయారీదారు వార్డ్ విజార్డ్ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్ ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. జనవరి 22 నుండి కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ నుండి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 600+ అధీకృత షోరూమ్‌ల నుండి మిహోస్‌ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. మిహోస్ డెలివరీలు మార్చి 2023లో దశలవారీగా ప్రారంభం మవుతాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా జాయ్ ఇ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియాలో మొదటి 5000 మంది కస్టమర్లకు) లాంచ్ చేసింది. స్మార్ట్ మిహోస్ ఇ-స్కూటర్ విభిన్న సెన్సార్ల కలయికతో వస్తుంది. అదనపు మన్నిక, సేఫ్టీకోసం పాలీడైసైక్లోపెంటాడిన్ (PDCPD)తో రూపొందించింది. 7 సెకన్లలోపు వ్యవధిలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. నికెల్ మాంగనీస్ కోబాల్ట్ కెమిస్ట్రీతో 74V40Ah Li-Ion ఆధారిత బ్యాటరీ,యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, GPS సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి అనేక ఇతర ఫీచర్లు మిహోస్‌లో ఉన్నాయి.'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' ద్వారా స్కూటర్ని ట్రాక్ చేయవచ్చు , బ్యాటరీ స్థితిని కూడా రిమోట్‌గా తనిఖీ చేయవచ్చు. రివర్స్ మోడ్‌తో ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల నుండి సులభంగా బయటకు రావడానికి స్కూటర్‌ను వెనుకకు తరలించడానికి అనుమతిస్తుంది. మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెరల్ వైట్ ఇలా నాలుగు రంగుల్లో మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో తమకు అద్భుతమైన స్పందన లభించిందనీ, ముఖ్యంగా ఈ స్కూటర్ రెట్రో డిజైన్‌ను ప్రశంసించడమే కాకుండా అదనపు భద్రత కోసం ఉపయోగించిన పాలీ డైసైక్లోపెంటాడిన్ బాగా ఆకర్షించిందనీ వార్డ్‌విజార్డ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తా తెలిపారు. వినియోగదారుల సానుకూల స్పందనతోనే ఆన్లైన్ బుకింగ్స్‌ను ఉచితంగా ప్రారంభించామన్నారు. టాప్ నాచ్టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో, కస్టమర్ల ఆకాంక్షల్ని తీర్చగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
మారుతి జిమ్నీ హవా మామూలుగా లేదుగా, 2 రోజుల్లోనే
సాక్షి, ముంబై: ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి ఆవిష్కరించిన లైఫ్‌స్టైల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ జిమ్నీ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. ఆవిష్కరించిన రెండు రోజుల్లోనే, 3వేల యూనిట్ల బుకింగ్‌లను పొందింది. రాబోయే రోజుల్లో జిమ్నీకి బలమైన ఆర్డర్లు వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీంతో జిమ్నీ వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మూడు నెలల వరకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి జిమ్నీని 5 డోర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్‌తో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి దీనిని వినియోగదారులకు అందించనుంది. ఈ జిమ్నీ ధర రూ. 10-12.5 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. -
టయోటా హైలక్స్ బుకింగ్స్ ప్రారంభం
ముంబై: వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ప్రీమియం యుటిలిటీ వెహికిల్ హైలక్స్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2022 జనవరిలో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. సరఫరా అడ్డంకుల నేపథ్యంలో అదే ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్‌ను నిలిపివేసింది. హైలక్స్ ధర ఎక్స్‌షోరూంలో రూ.33.99 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైలక్స్.. భారత మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. -
టయోటా హైలక్స్ బుకింగ్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ప్రీమియం యుటిలిటీ వెహికిల్ హైలక్స్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2022 జనవరిలో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. సరఫరా అడ్డంకుల నేపథ్యంలో అదే ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్‌ను నిలిపివేసింది. హైలక్స్ ధర ఎక్స్‌షోరూంలో రూ.33.99 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైలక్స్.. భారత మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. చదవండి: నెలకు రూ.12వేలు పెన్షన్ కావాలా? ఇలా ట్రై చేయండి! -
పేటీఎం యూజర్లకు బంపరాఫర్
హైదరాబాద్: చెల్లింపులు, ఆర్థిక సేవల్లోని ప్రముఖ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) ఫ్లయిట్ టికెట్ బుకింగ్‌లపై తగ్గింపులను ప్రకటించింది. దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్ బుకింగ్‌లపై, కొత్త కస్టమర్లకే ఈ డిస్కౌంట్ ఆఫర్లు పరిమితమని పేటీఎం తెలిపింది. విస్తార, స్పైస్‌జెట్, ఎయిరేషియా, గోఫస్ట్, ఇండిగో, ఎయిర్ ఇండియా దేశీ సర్వీసులపై ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. మొదటి ఫ్లయిట్ టికెట్ బుకింగ్‌పై 14 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ.1,000కి పరిమితం అవుతుంది. కనీస ఆర్డర్ విలువ వంటి షరతు లేదు. యూజర్లు టికెట్లను రద్దు చేసుకుంటే నూరు శాతం రిఫండ్ వచ్చే రక్షణ ఉంటుందని పేటీఎం తెలిపింది. -
టయోటా నుంచి సీఎన్జీ వేరియంట్లు, బుకింగ్స్ షురూ
హైదరాబాద్: వాహన తయా రీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజా గా సీఎన్జీ విభాగంలోకి ప్రవేశించింది. గ్లాంజా, అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడళ్లలో సీఎన్ జీ వేరియంట్లను పరిచయం చేసింది. గ్లాంజా ధర రూ.8.43 లక్షల నుంచి ప్రారంభం. అర్బన్ క్రూజర్ హైరైడర్ ధరను ప్రకటించాల్సి ఉంది. బ్రాండ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఆన్లైన్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. రూ. 11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. గ్లాంజా ఎస్ ట్రిమ్‌కు రూ. 8.43 లక్షలు, జీ ట్రిమ్‌కి రూ. 9.46 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది.పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే, గ్లాంజా సీఎన్జీ ధర రూ. 95,000 ఎక్కువ. ఇంజీన్, ఫీచర్లు 55 లీటర్ సీఎన్జీ ట్యాంక్‌ను అమర్చింది. ఇంటీరియర్ ఎలాంటి మార్పులు లేవు. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ , ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన బాలెనో సీఎన్జీతో ఇది పోటీ పడనుందని అంచనా. -
హ్యుందాయ్ ఎన్–లైన్ మెటావర్స్ కమింగ్ సూన్, బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా వెన్యూ ఎన్–లైన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 6న ఈ కొత్త మోడల్ భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. అప్డేటెడ్ ఫీచర్లతో హ్యుందాయ్ ఇండియా కొత్త వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించనుంది. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసింది. అధికారిక వెబ్సైట్లో రూ.21,000 చెల్లించి ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఇండియా కొత్త వెన్యూ ఎన్-లైన్ మెటావర్స్ శ్రేణిలో ఐ20 ఎన్-లైన్ తర్వాత రెండో మోడల్. స్పోర్టీ లుక్స్, మెరుగైన పనితీరు ఈ శ్రేణి ప్రత్యేకత. కారు లోపల, వెలుపల పలు మార్పులు చేశారు. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు ఉంది. -
మార్కెట్లోకి ఓలా న్యూ వెర్షన్ స్కూటర్, అదిరే ఫీచర్లు, కేవలం రూ.499తో మన ఇంటికి!
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా మరో సంచలనానికి సై అంది. ఇప్పటికే దేశం నలుమూలలా విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 (Ola S1)ని కూడా రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్వేర్ ఫీచర్లు ఉన్నాయి. లేటస్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్‌ని అందివ్వగల ఈ స్కూటర్ ధరని రూ.99,000గా నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఈ తేదీలో బుక్ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక సారి చార్జ్ చేస్తే 141 కిలోమిటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల డ్రైవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎకో మోడ్‌లో 128 కిలోమిటర్లు , సాధారణ మోడ్ (నార్మల్ మోడ్) 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 90కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 95kmphగా ఉంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
2023 ఆడి క్యూ3 బుకింగ్స్ షురూ, తొలి కస్టమర్లకు ఆఫర్లు
సాక్షి, ముంబై: లగ్జరీకార్ల సంస్థ ఆడి 2023 ఆడి క్యూ3ని పరిచయం చేసింది. లగ్జరీ ఎస్యూవీ ఆడి క్యూ3ని ముందస్తు బుకింగ్ కోసం అందుబాటులో ఉంచింది. రూ. 2 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితేముందుగా బుక్ చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) వినూత్న డిజైన్,బెస్ల్ఇన్ క్లాస్ ఎమినిటీస్‌తో తమ బెస్ట్-సెల్లింగ్ మోడల్ కొత్త ఆడి క్యూ3ని దక్కించుకునేందుకు అద్భుత అవకాశమని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. వినియోగదారులు www.audi.inలో లేదా 'myAudi కనెక్ట్' యాప్ ద్వారా కారును ఆన్లైన్లో కాన్ఫిగర్ చేసి, ఆర్డర్ చేయవచ్చు. 2023 ఆడి క్యూ 3 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం ప్లస్ అండ్, టెక్నాలజీ, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించింది. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) అలాగే, మొదటి 500 మంది కస్టమర్లు 2+3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీతోపాటు 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు ఉచిత సర్వీస్ ప్యాకేజీలాంటి ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆడి కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరాతో, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్స్టీరియర్ మిర్రర్స్, పవర్-అడ్జస్టబుల్, హీటెడ్, పవర్ ఫోల్డింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ఇంటర్ఫేస్,6-స్పీకర్ ఆడియో సిస్టమ్ అందిస్తోంది. 2023 ఆడి క్యూ3లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 190 పిఎస్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్లు వేగం పుంజుకుంటుంది. ప్రీమియమ్ ప్లస్ వేరియంట్లో 18-అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హై గ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ, 4-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. -
ఆల్టో K10 లవర్స్‌కు గుడ్ న్యూస్! రూ. 11 వేలతో...
సాక్షి,ముంబై: మారుతి సుజుకి సరికొత్త ఆల్టో కె10 కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త ఆల్టో K10 బుకింగ్‌లను మారుతి సుజుకి బుధవారం ప్రారంభించింది. మారుతి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ తాజా వెర్షన్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఫీచర్లతో వస్తున్న కొత్త ఆల్టో కె-10 కస్టమర్లను ఆకట్టుకోనుంది. రూ. 11 వేలు చెల్లించి ఆల్టో కె10ని ప్రీ-బుక్ చేయవచ్చు. మారుతి అరేనా షోరూంలో, లేదా ఆన్లైన్లో గానీ ఈ కారును బుక్ చేసుకోవచ్చు. (సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?) మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 4.32 మిలియన్లకు పైగా కస్టమర్లతో, ఆల్టో దేశంలో అత్యంత ప్రభావవంతమైన కార్ బ్రాండ్‌గా ఉందని చెప్పారు.. ఆల్టో కుటుంబాలు విపరీతంగా ఇష్టపడే, లెజెండరీ ఆల్టో యువ భారతదేశం ఆకాంక్షలతో అభివృద్ధి చెందిన దిగ్గజ బ్రాండ్‌కు నిదర్శనం. 22 సంవత్సరాల బలమైన బ్రాండ్ వారసత్వంతో, ఆల్టో గౌరవానికి విశ్వసనీయతకు చిహ్నం మాత్రమేకాదు తమకు చాలా విజయ వంతమైన బ్రాండ్ అన్నారు. దేశంలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పునర్నిర్వచించేలా, కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా కొత్త ఆల్-న్యూ ఆల్టో K10 తీర్చి దిద్దామని మారుతి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ అన్నారు. ఆధునిక డిజైన్, విశాలమైన క్యాబిన్, సాంకేతికతతో నడిచే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. (వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!) ఫీచర్లు, ధరపై అంచనాలు ఆల్టో K10 సరికొత్త డిజైన్, ప్లాట్‌ఫారమ్, ఇంటీరియర్ లేఅవుట్, ఫీచర్ లిస్ట్‌తో రానుంది. కార్ టెక్ కనెక్ట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, మెరుగైన పనితీరు కోసం హార్ట్‌టెక్ ఆర్కిటెక్చర్‌తో రానుంది. 1,000 cc పెట్రోల్ ఇంజీన్‌తో రానుందని భావిస్తున్నారు. ఇక ధరల విషయానికొస్తే, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ఎస్-ప్రెస్సో ధర రూ. 4.25 లక్షల కంటే తక్కవనేగా ఉండనుందని అంచనా. కొత్త ఆల్టో కె10 ఆగస్టు 18 న అధికారికంగా లాంచ్ కానుంది. ఇదికూడా చదవండి : జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్ -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్‌షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్‌లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
మహీంద్రా బుకింగ్స్ బీభత్సం.. నిమిషాల్లో రూ.18వేల కోట్ల బిజినెస్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కార్ల బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్‌లు సృష్టించింది. ఆ సంస్థకు చెందిన (Scorpio N) స్కార్పియో-ఎన్ మోడల్ కారు బుకింగ్స్ బీభత్సం సృష్టించింది. దీంతో కేవలం నిమిషాల వ్యవధిలో వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మహింద్రా కొత్త స్కార్పియో-ఎన్(Mahindra Scorpio N) అధికారిక బుకింగ్స్ (శనివారం) జూలై 30 ప్రారంభమైంది. అలా విడుదల అయ్యిందో లేదో ప్రారంభమైన నిమిషంలోనే 25 వేలు, అరగంటలో లక్ష బుక్సింగ్స్ నమోదయ్యాయి. ఈ విలువ రూ.18వేల కోట్లపైనే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా. కొత్త మహింద్రా స్కార్పియో-ఎన్ ధర ఎక్స్-షోరూంలో పెట్రోల్ వెర్షన్లకు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల మద్యలో ఉండనుంది. అలాగే డీజిల్ వెర్షన్ల ధర రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల మధ్యలో ఉంది. అయితే కంపెనీ ప్రకటించిన ప్రారంభ ధర కేవలం తొలి 25 వేల బుకింగ్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ సమయంలో ఏ ధర ఉంటుందో దాన్నే కస్టమర్లు కట్టాల్సి ఉంటుంది. మహీంద్రా ఈ కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ప్రక్రియను సెప్టంబర్ 26 నుంచి ప్రారంభించబోతుంది. డిసెంబర్ 2022 నాటికి 20 వేల యూనిట్లకు పైగా స్కార్పియో-ఎన్ వెహికిల్ డెలివరీ చేపట్టాలని సన్నాహాలు కూడా చేస్తోంది. కాగా మహీంద్రాలోని థార్, ఎక్స్‌యూవీ700 మోడల్స్ కోసం కూడా కస్టమర్లు వేచి చూస్తున్నారు. మరి ఈ బుకింగ్స్ ఏ రికార్డు క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి. చదవండి: ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! -
ఆకాశ ఎయిర్: రడీ టూ టేకాఫ్, టికెట్ ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన రంగంలో సేవలందించేందుకు ఆకాశ ఎయిర్ సర్వం సిద్ధం చేసుకుంది. బిలియనీర్, ప్రముఖ పెట్టుబడి దారుడు రాకేష్ ఝున్‌ఝన్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్ తొలి వాణిజ్య బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మార్గంలో గాల్లోకి ఎగరనుంది. దీనికి టికెట్ల విక్రయాలను నేటి(జులై 22) నుంచే ప్రారంభించింది. తొలిదశలో అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి నెట్‌వర్క్‌లకు కంపెనీ టిక్కెట్ల విక్రయిస్తోంది. ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తొలి బోయింగ్ విమానం డెలివరీ అయిందని, రెండో విమానం ఈ నెలాఖరులోపు అందే అవకాశం ఉందన్నారు. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాల బుకింగ్‌లు మొబైల్ యాప్, మొబైల్ వెబ్, డెస్క్‌టాప్ వెబ్సైట్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రోజువారీ విమానాన్ని కూడా నడుపుతుంది. ముంబై విమాన టిక్కెట్లు రూ. 4,314 నుండి ప్రారంభం. కాగా, అహ్మదాబాద్ నుండి ప్రారంభ ధర రూ. 3,906గా ఉంటాయి. బెంగళూరు నుండి కొచ్చికి రెండు రోజువారీ విమానాలను నడుపుతుంది. టికెట్ల ధర రూ. 3,483 నుండి ప్రారంభం.కొచ్చి నుండి తిరిగి వచ్చే విమానం టిక్కెట్ ధరలు రూ. 3,282 నుండి ప్రారంభం. కేఫ్ ఆకాశ అకాశ ఎయిర్ విమానాల్లో ‘కేఫ్ అకాశ’ బై-ఆన్-బోర్డ్ మీల్ సర్వీస్‌ను అందిస్తుంది. ఇందులో పాస్తా, వియత్నామీ రైస్ రోల్స్, హాట్ చాక్లెట్ అందిస్తుంది. అలాగే సంవత్సరం పొడవునా భారతీయ వంటకాలతో కూడిన పండుగ మెనూ కూడా ఉంటుందని తెలిపింది. -
సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న..నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్‌ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్‌వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్‌లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్‌లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్‌లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది. కార్లపై డిస్కౌంట్ ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది. -
అతి(ర)థులోస్తున్నారు! స్టార్ హోటళ్లలో నో రూమ్స్ బోర్డ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి స్టార్ హోటళ్లన్నీ నో రూమ్స్ బోర్డ్‌లు పెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకానున్నారు. వీరంతా రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. దీంతో నగరంలోని స్టార్ హోటల్స్ అన్నీ ముందస్తు బుకింగ్స్ అయిపోయాయి. అన్ని స్టార్ హోటళ్లలో బుకింగులు.. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల కోసం నగరంలోని హెచ్ఐసీసీ, నోవాటెల్ వంటి 48–50 స్టార్ హోటల్స్ బుకింగ్ చేసినట్లు తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ నాగరాజు తెలిపారు. స్థానిక, ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలు, చిన్న లీడర్ల కోసం ఓయో గదులు, గెస్ట్ హౌస్‌లను బుకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒకటే గదులు ఇద్దరు ముగ్గురు వసతికి వీలుంటుందనే ఉద్దేశంతో వీటిని బుకింగ్ చేసినట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకూ ఎగ్జిక్యూటివ్, సుపీరియర్, డీలక్స్, ప్రీమియర్ గదులన్నీ బుకింగ్ చేసేశారని ఆ స్టార్ హోటల్ ప్రతినిధి తెలిపారు. ప్రతినిధుల కోసం వంటకాలు, ఇతరత్రా ప్రత్యేక ఏర్పాట్ల కోసం ప్రణాళికలు చేసినట్లు సమాచారం. పోలీసుల సమీక్ష... జులై 2, 3 తేదీల్లో గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అలాగే బీజేపీలోని కీలక నేతలు నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు. దీంతో హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ యాజమాన్యంతో సోమవారం సైబరాబాద్ పోలీసులు సమావేశం నిర్వహించనున్నారు. ఆయా హోటల్స్‌లోని బుకింగ్స్ వివరాలు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హెచ్ఐసీసీ, నోవాటెల్‌తో పాటు కేంద్ర మంత్రులు బస చేయనున్న ఆయా హోటల్స్ భద్రతా ఏర్పాట్లపై పోలీసులు బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. (చదవండి: ప్రధాని బస ఎక్కడా?) -
హ్యుందాయ్ కొత్త వెన్యూ సొంతం చేసుకోవడానికి రెడీనా?
గురుగ్రామ్: సరికొత్త ఫీచర్స్‌తో కొత్తగా తీర్చిదిద్దిన వెన్యూ కార్ల అమ్మకాల కోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. రూ. 21,000 కట్టి దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో లేదా తమ వెబ్సైట్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. కొత్త వెన్యూలో 60కి పైగా ఫీచర్స్ ఉన్నట్లు ఆయన వివరించారు. అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్లతో హోమ్ టు కార్ (హెచ్2సీ) టెక్నాలజీతో కారులోని అనేక ఫంక్షన్లను ఆపరేట్ చేయొచ్చని గర్గ్ పేర్కొన్నారు. రిమోట్ క్లైమేట్ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, వివిధ డ్రైవ్ మోడ్లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), 2 స్టెప్ రియర్ రిక్లైనింగ్ సీటు వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తెలుగు, హిందీ సహా 12 భాషలను సపోర్ట్ చేస్తుందని గర్గ్ పేర్కొన్నారు. చదవండి: Mercedes Benz: లక్షల కార్లలో లోపాలు, మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్! -
కియా ఈవీ6 రూ.3 లక్షలతో బుకింగ్: 12 నగరాల్లో మాత్రమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ఈవీ6 ఎలక్ట్రిక్ వెహికిల్‌ను వచ్చే వారం భారత్‌లో ఆవిష్కరిస్తోంది. పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. ఆల్ వీల్ డ్రైవ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, ఫార్వార్డ్ కొలీషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్‌తోపాటు 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లను జోడించారు. దేశంలో కంపెనీకి ఇది తొలి ఈవీ. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంది. ఈవీ6 బుకింగ్స్ ప్రారంభించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. పూర్తిగా తయారైన 100 యూనిట్ల ఈవీ6 వాహనాలను తొలుత దిగుమతి చేసుకుంటారు. కియా ఇండియా వెబ్సైట్ ద్వారా లేదా 12 నగరాల్లో ఎంపిక చేసిన 15 డీలర్షిప్ కేంద్రాల్లో మాత్రమే బుకింగ్‌కు అవకాశం ఉంది. కస్టమర్లు రూ.3 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. The wheels of progress must be powered not just by fuel but an inspiration. Presenting the most inspiring Kia ever - the fully electric Kia EV6. Book Now: https://t.co/hXAjX5EVJk#Kia #TheKiaEV6 #MovementThatInspires — Kia India (@KiaInd) May 26, 2022 -
వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..?
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. కియా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కియా ఈవీ6(Kia EV6) ఎలక్ట్రిక్ కారును భారత్ మార్కెట్లలో అరంగేట్రం చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. బుకింగ్స్ ప్రారంభం..! భారత మార్కెట్లలోకి కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కొద్ది రోజుల్లోనే లాంచ్ చేసేందుకు కియా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆల్-ఎలక్ట్రిక్ కియా EV6 బుకింగ్స్‌ను మే 26న మొదలుపెట్టనున్నట్లు సమాచారం. కాగా భారత్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కియా ఈవీ6 కారును మే 2021లో కియా మోటార్స్ ఆవిష్కరించింది. సూపర్ ఫీచర్స్‌తో..! కియా ఈవీ6 అద్బుతమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ కారు సీక్వెన్షియల్ డైనమిక్ లైట్ ప్యాటర్న్‌తో సొగసైన డీఆర్ఎల్స్తో వస్తోంది. కారు సైడ్ ప్రొఫైల్ ఆధునిక, సొగసైన, ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారుకు ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. మొత్తంమీద ఈ కారు ఏరోడైనమిక్ స్టైలింగ్ అంశాలను రానుంది. Kia EV6 రియర్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే..! అంతర్జాతీయ మార్కెట్లో కియా ఈవీ6 వాహనం 58kWh, 77.4kWh బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. వీటి సహాయంతో డ్రైవింగ్ పరిధి మెరుగవ్వనుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 510 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఇక AWD వెర్షన్లో గరిష్టంగా 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కియా ఈవీ6 కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: స్కోడా కీలక నిర్ణయం..సెకండ్ హ్యండ్ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..! -
వచ్చేస్తున్నాయి..హోండా సిటీ హైబ్రిడ్ కార్లు..బుకింగ్స్ షురూ..!
న్యూఢిల్లీ: కొత్తగా ప్రకటించిన సిటీ కారు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్ ’ఇ:హెచ్ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) వెల్లడించింది. రాజస్థాన్‌లోని తాపుకారా ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తున్నట్లు వివరించింది. హోండా సిటీ ఇ:హెచ్ఈవీని వచ్చే నెల తొలినాళ్లలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ టకుయా సుమురా తెలిపారు. డీలర్ల దగ్గర రూ. 21,000 లేదా కంపెనీ వెబ్సైట్లో రూ. 5,000 చెల్లించడం ద్వారా కారును బుక్ చేసుకోవచ్చని వివరించా రు. ఇందులో విశిష్టమైన సెల్ఫ్ చార్జింగ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు. 3 ఏళ్ల అన్లిమిటెడ్ కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ ఉంటుందని, లిథియం అయాన్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. (ఏది ముందైతే అది) వివరించారు. చదవండి: ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..! -
మెర్సిడెస్ సి–క్లాస్ బుకింగ్స్ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సెడాన్ సి–క్లాస్ నూతన వర్షన్ బుకింగ్స్ ప్రారంభించింది. మే 10న ఈ కారు భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. మెర్సిడెస్ కస్టమర్లకు ప్రత్యేకంగా ఏప్రిల్ 30 వరకు బుకింగ్‌కు అవకాశం ఉంది. ఇతరులకు మే 1 నుంచి బుకింగ్స్ మొదలు అవుతాయి. తొలుత సి200, సి300డి వేరియంట్లకు, ఆ తర్వాత సి220డి వేరియంట్‌కు బుకింగ్ ప్రారంభం అవుతుంది. కస్టమర్లు ఇందుకోసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటికిపైగా సి–క్లాస్ కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఈ సంఖ్య 37,000 యూనిట్లకుపైమాటే. 2001 నుంచి భారత్‌లో సి–క్లాస్ కార్ల అసెంబ్లింగ్ మొదలైంది. -
ఓలా స్కూటర్ నుంచి లిమిలెడ్ ఎడిషన్.. కాషాయరంగులో అదిరిపోయింది !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్ తదుపరి విక్రయాలు మార్చి 17, 18న మొదలు కానున్నాయి. ఏప్రిల్ నుంచి డెలివరీలు ఉంటాయి. గ్లాసీ ఫినిష్‌తో స్పెషల్ ఎడిషన్ గెరువా రంగుతో స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆ రెండు రోజుల్లో మాత్రమే ఈ రంగు వాహనం లభిస్తుందని వివరించింది. ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు 17న, కొత్త వారు 18న కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఎస్1 ప్రో ఇప్పటికే 10 రంగుల్లో లభిస్తుంది. హోలి పండుగ నేపథ్యంలో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. In between deliveries, the @olaelectric marketing team figured out our Holi plan after all! Launching the S1 Pro in a beautiful new colour - गेरुआ 🧡!! Purchase window opens for reservers on 17th and for EVERYONE ELSE on 18th only on the Ola app! Holi hai!🛵⚡ pic.twitter.com/TfbEB8SQD3 — Bhavish Aggarwal (@bhash) March 14, 2022 -
మారుతీ నుంచి అదిరిపోయే న్యూఏజ్ బాలెనో,రూ.10వేలకే బుకింగ్స్ ప్రారంభం!
కారు కొనుగోలు దారులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి ఆఫర్ ప్రకటించింది. కొత్త హ్యాచ్ బ్యాక్ న్యూఏజ్ బాలెనో కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్త హంగులతో మార్కెట్‌కి పరిచయమైన ఈ కారును కేవలం రూ.10వేలతో బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనుగోలుదారులు మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌లో లేదంటే మారుతి సుజుకి నెక్సా వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చంది. ఈ సందర్భంగా మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..ఇప్పటి వరకు 1 మిలియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లు విక్రయించినట్లు తెలిపారు.“కస్టమర్ల అవసరాల్ని తీర్చేందుకు డైనమిక్‌గా డిజైన్ చేసినట్లు చెప్పారు. ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ డిజైన్, క్లాస్ లీడింగ్ సేఫ్టీ వంటి సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. న్యూ ఏజ్ బాలెనో 'ఫస్ట్-ఇన్ సెగ్మెంట్' హెడ్ అప్ డిస్ప్లేను కలిగి ఉంది.హెచ్యుడితో,డిస్ప్లే స్పీడోమీటర్, క్లైమేట్ కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ ను అందించడంతో పాటు కొనుగోలు దారులకు అనుగుణంగా ఇంకా మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
అడ్వాన్స్ బుకింగ్.. ముందుగా రూ.5 లక్షలు చెల్లించండి
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్‌లు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్‌లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించం ఉత్సాహంగా ఉన్నట్టు పేర్కొంది. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్‌వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
ఓలా, ఉబెర్ క్యాబ్‌లు సాగిస్తున్న నయా దందా!...భరోసా లేని ప్రయాణం!!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన రాజేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. మధ్యాహ్నం ఏ ఇబ్బంది లేకుండా క్షణాల్లోనే క్యాబ్ బుక్ అయింది. భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా బయలుదేరాడు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ నుంచి తిరిగి బయలు దేరేందుకు క్యాబ్ కోసం ప్రయత్నించాడు. రద్దీ సమయం కావడంతో క్యాబ్ బుకింగ్‌కు పది నిమిషాలు పట్టింది. ‘హమ్మయ్య ఏదో ఒక విధంగా క్యాబ్ బుక్ అయింది. ఇక వెళ్లిపోవచ్చు’ అనుకుంటుండగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. ఎక్కడెళ్లాలి అని అడిగాడు. హిమాయత్‌నగర్‌కు అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. గంట గడిచినా క్యాబ్ రాలేదు. బుకింగ్ రద్దు కాలేదు. మరో క్యాబ్ కోసం ప్రయత్నించాడు. క్యాబ్ డ్రైవర్ రూ.1000 డిమాండ్ చేశాడు. బుకింగ్ రద్దు చేసుకొంటే వస్తానన్నాడు.మరో గత్యంతరం లేకపోవడంతో డ్రైవర్ డిమాండ్‌కు అంగీకరించవలసి వచ్చింది. ఇది ఒక్క రాజేశ్ కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. ఓలా, ఉబెర్ క్యాబ్‌లు సా గిస్తున్న నయా దందా ఇది. ప్రయాణికులను ఠారెత్తిస్తున్నారు. చివరినిమిషంలో రైడ్లను రద్దు చేసుకొనే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అడిగినంతా ఇస్తే ఓకే అంటున్నారు. దీంతో క్యాబ్ ఉందనే భరోసాతో భార్యా పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న వారు ఆ తరువాత తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఒక్క శంషాబాద్ రూట్లోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. భరోసాలేని క్యాబ్ జర్నీ... సాధారణంగా ఉదయం,సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్ బుకింగ్‌లకు కొంత సమయం పట్టవచ్చు. ఏదో ఒకవిధంగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లొచ్చని భావించే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రయాణికులకు ఇలా చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ‘క్యాబ్‌ల వల్ల ప్రయాణానికి భరోసా లభించడం లేదని, డ్రైవర్లకు గిట్టుబాటయితేనే వస్తారని’ అంబర్‌పేట్‌కు చెందిన రాజు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది డ్రైవర్లు తాము రావడం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. మరి కొందరు రైడ్ రద్దు చేసుకొని తాము అడిగినంతా నగదు రూపంలోనే చెల్లిస్తే వస్తామని పేచీ పెడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్లు డిమాండ్ చేసినంత చెల్లించవలసి వస్తుంది. ‘ఇలాంటి క్యాబ్ డ్రైవర్లపైన ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని’ మల్కాజిగిరికి చెందిన సతీష్ అభిప్రాయపడ్డారు. కమిషన్లు తగ్గినందుకే ఇలా... ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్లకు కమిషన్ల రూపంలో చెల్లిస్తాయి. ప్రతి కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తారు. కానీ ఇలా కమిషన్ రూపంలో వచ్చే ఆదాయం తమకు ఏ మాత్రం చాలడం లేదంటూ డ్రైవర్లు నేరుగా ప్రయాణికులతో బేరాలకు దిగుతున్నారు. ఓలా, ఉబెర్ల నుంచి రైడ్ బుకింగ్‌లు వచ్చే వరకు ఎదురు చూసి ఆ తరువాత ఈ తరహా బేరసారాలను కొనసాగిస్తున్నారు. డిజిటల్ అయితే నో... సదరు ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థలతో తమ కమిషన్లపైన ఒప్పందం చేసుకోవలసిన డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు. రద్దీ ఉండే రూట్ల లో క్యాబ్‌లు బుక్ కావడం లేదు. ఒకవేళ అయినా ‘డిజిటల్ పేమెంట్స్’ అనగానే నిరాకరిస్తున్నారు. ఓలా, ఉబెర్ యాప్‌లలో రెంటల్ బుకింగ్స్ సదుపాయం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో రెంటల్ బుకింగ్స్‌కు డ్రైవర్లు నిరాకరించడం గమనార్హం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను కూడా క్యాబ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చివరి నిమిషంలో రైడ్ల రద్దు వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ ఇబ్బందుల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...ఓయోకు కాసుల వర్షం..! ఒక్క రోజులో..
వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే అతిథ్య రంగ కంపెనీ ఓయోకు న్యూ ఇయర్-2022 వేడుకలు కాసుల వర్షాన్ని కురిపించాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకలను జరుపుకునేందుకు కస్టమర్లు భారీ సంఖ్యలో ఓయో రూమ్స్‌ను తలుపు తట్టారు. 110 కోట్ల బిజినెస్..! న్యూ ఇయర్ 2022 వేడుకల కోసం హాస్పిటాలిటీ చైన్ ఓయోను ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బుకింగ్స్ జరిపినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వీకెండ్లో సుమారు రూ. 110 కోట్ల విలువైన బుకింగ్‌లు జరిగాయని ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ ట్విటర్లో తెలిపారు. 2017 డిసెంబర్ తరువాత న్యూ ఇయర్ వీకెండ్లో ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి.2020 ఏప్రిల్ నుంచి 90 వారాల తరువాత అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ జరిగాయని రితేష్ వెల్లడించారు. ఒక్క రోజే 69 శాతం బుకింగ్స్..! 2016లో సుమారు 1.02 లక్షలకు పైగా బుకింగ్స్ జరగ్గా, 2021 డిసెంబర్ 30, 31 తేదీల్లో గరిష్టంగా 5.03 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయని అగర్వాల్ చెప్పారు. 2021 డిసెంబర్ 31 ఒక్క రోజే 69 శాతం రూమ్స్ బుక్ అవ్వగా...2020లో 61 శాతం, 2019లో 57 శాతం, 2018లో 63 శాతం , 2017లో 55 శాతంగా ఉన్నట్లు తెలిపారు. 127 నగరాల నుంచి 35 దేశాల్లో... టెక్-ఆధారిత హాస్పిటాలిటీ సంస్థ ఓయో గణనీయమైన వృద్ధిని సాధించింది. కోవిడ్-19 రాకతో భారీ నష్టాలనే చవిచూసింది. ఆయా దేశాల్లో కరోనా ఉదృతి తగ్గడంతో పర్యాటక రంగం మెల్లమెల్లగా పుంజుకుంటూ వచ్చింది. ఈ ధోరణి ఓయోకు కలిసోచ్చింది. 2015లో కేవలం 127 నగరాల్లో మొదలవ్వగా అది ఇప్పడు 35 దేశాల్లో ఓయో తన సేవలను అందిస్తోంది. చదవండి: Microsoft CEO Satya Nadella: న్యూ బిజినెస్..! న్యూ అవతార్..! -
లండన్‌లో మ్యాక్రోటెక్ విక్రయాలు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో లండన్‌లో రూ. 1,900 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించినట్లు వెల్లడించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రెండు ప్రాజెక్టుల నుంచి తాజా అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. దేశీయంగా లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను అభివృద్ధి చేసే కంపెనీ యూకే ప్రాజెక్టుల ద్వారా ఒక త్రైమాసికంలో తొలిసారి 19.1 కోట్ల పౌండ్ల(రూ. 1,900) అమ్మకాలు అందుకున్నట్లు వెల్లడించింది. 2013లో కెనడా ప్రభుత్వం నుంచి 30 కోట్ల పౌండ్ల(రూ. 3,100 కోట్లు)కు మ్యాక్‌డొనాల్డ్ హౌస్‌ను కొనుగోలు చేయడం ద్వారా మ్యాక్రోటెక్.. లండన్ ప్రాపర్టీ మార్కెట్లో ప్రవేశించింది. లోధా డెవలపర్స్ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ తదుపరి 2014లో 9 కోట్ల పౌండ్లకు న్యూ కోర్టు స్థలాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ గత రెండు త్రైమాసికాల్లో సాధించిన పటిష్ట బుకింగ్స్‌తో రానున్న నాలుగు నెలల్లోగా 22.5 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటి గడువు 2023 మార్చికాగా.. అంతకంటే ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. బీఎస్ఈలో మ్యాక్రోటెక్ డెవలపర్స్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,238 వద్ద ముగిసింది. -
రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా.. అయ్యప్పా..
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప సన్నిధికి చేరేందుకు భక్తజన సందోహం పడిగాపులు కాస్తోంది. రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ఈసారి భారీ సంఖ్యలోనే మాలధారణ గావించారు. డిమాండ్‌కు తగిన రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒకటే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్లో ఇప్పటికే ‘నో రూం’ దర్శనమిస్తోంది. మరోవైపు జంటనగరాల నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయి. ఫిబ్రవరి వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప భక్తులు శబరికి వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈసారి ఎక్కువ మంది భక్తులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో ప్రైవేట్ వాహనాలు చార్జీల మోత మోగిస్తున్నాయి. ఉన్నది ఒక్కటే.. ► సాధారణంగా ప్రతి ఏటా కనీసం 2.5 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తారు. జనవరిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య తగ్తింది. ఈసారి లక్ష మందికి పైగా మాలధారణ చేసినట్లు అంచనా. ప్రతి రోజు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడం వల్ల శబరికి వెళ్లే భక్తుల సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు. కానీ కనీసం 30 వేల మందికి పైగా భక్తులు వెళ్లే అవకాశం ఉంది. ► హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్ ట్రైన్. ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. మరో నెల రోజుల వరకు కనీసం టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు. ఈసారి ఇప్పటి వరకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. సంక్రాంతి ప్రయాణమూ కష్టమే.. ► ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో ఫిబ్రవరి వరకు వెయింట్ లిస్టు 200 నుంచి 250 వరకు దాటింది. జనవరి, ఫిబ్రవరి నెలల కోసం అన్ని రైళ్లలో బెర్తులు భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. ► విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తే తప్ప ఊరెళ్లడం సాధ్యం కాదు. మరోవైపు జనవరి మొదటి వారానికే గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, నర్సాపూర్, ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటిపోయింది. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోత... ► రైళ్ల కొరత కారణంగా అయ్యప్ప భక్తులు, సంక్రాంతికి సొంత ఊరు వెళ్లే సాధారణ ప్రజలు సైతం ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహణాలపైన ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. చదవండి: ‘బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ ’ -
ఐఆర్సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్..
ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బుకింగ్స్ ద్వారా వసూలయ్యే కన్వీనియెన్స్ ఫీజు ఆదాయంలో వాటాలు తీసుకునే విషయంలో రైల్వేస్ బోర్డ్ వెనక్కి తగ్గింది. ఐఆర్సీటీసీ ప్రయోజనాలు, మార్కెట్ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 1 నుంచి కన్వీనియెన్స్ ఫీజులో 50 శాతం వాటాను రైల్వే బోర్డుతో పంచుకోనున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఐఆర్సీటీసీ షేరు ధర 25 శాతం పతనమై రూ. 685 స్థాయికి క్షీణించింది. అయితే, రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ కొంత కోలుకుంది. చివరికి బీఎస్ఈలో సుమారు 7 శాతం క్షీణతతో రూ. 846 వద్ద క్లోజయ్యింది. అయితే, షేర్ల విభజన అమల్లోకి వచ్చిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. కనిష్ట స్థాయిల్లో విక్రయించుకున్న వారు నష్టాలు మూటగట్టుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైలు టికెట్ చార్జీలో కన్వీనియెన్స్ ఫీజు భాగంగా ఉండదు. వెబ్ ద్వారా టికెట్ బుకింగ్ సర్వీసును అందించినందుకు ఐఆర్సీటీసీ ఈ ఫీజును వసూలు చేస్తుంది. సాధారణంగా ప్రయాణికుల నుంచి వసూలు చేసే కన్వీనియెన్స్ ఫీజు ద్వారా ఐఆర్సీటీసీ, రైల్వేస్‌కు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. 2014–15లో రెండు సంస్థల మధ్య 20–80 శాతం నిష్పత్తిలో వాటాలు ఉండేవి. అప్పట్లో ఐఆర్సీటీసీకి రూ. 253 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత సంవత్సరంలో 50–50 నిష్పత్తికి సవరించినప్పుడు రూ. 552 కోట్లు వచ్చింది. కానీ 2016–17 తర్వాత కన్వీనియెన్స్ ఫీజును తొలగించారు. అయితే, 2019–20లో తిరిగి విధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కరోనా వైరస్ పరిణామాల కారణంగా ఐఆర్సీటీసీ ఆదాయాలు మెరుగుపర్చేందుకు రైల్వేస్ తన వాటాను వదులుకుంది. దీంతో 2020–21లో ఐఆర్సీటీసీకి రూ. 299 కోట్లు, ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 224 కోట్లు కన్వీనియెన్స్ ఫీజు ఆదాయం వచ్చింది. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త..!
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుదారులకు ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్‌ల కంపెనీ రివోల్ట్ మోటార్స్ గుడ్‌న్యూస్‌ను అందించింది. రివోల్ట్ ఆర్వీ 400 బైక్ బుకింగ్స్ నేటి(అక్టోబర్ 21) నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాదిలో ఆర్వీ400 బైక్ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఇది మూడోసారి. దేశ వ్యాప్తంగా నేటి నుంచి 70 నగరాల్లో బుకింగ్ అందుబాటులో ఉండనుంది. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన డీఏ ఆర్వీ400 బైక్‌లో తొలి సారిగా న్యూ ఎక్స్‌టిరియర్ కలర్ థీమ్‌ను రివోల్ట్ మోటార్స్ పరిచయం చేసింది. ఫేమ్ -2 పథకంలో భాగంగా ఆర్వీ400 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.07 లక్షలుగా ఉండనుంది. ఆర్వీ400 కాస్మిక్ బ్లాక్, రెబుల్ రేడ్ కలర్ వేరియంట్‌తో పాటు మిస్ట్ గ్రే కలర్లో కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. భారీ ప్రణాళికలతో..! దేశవ్యాప్తంగా రివోల్ట్ మోటార్స్ విస్తరించేందుకు భారీ ప్రణాళికలను చేస్తోంది. కంపెనీ 100 శాతం స్థానికీకరణపై దృష్టిపెడుతుందని కంపెనీ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ పేర్కొన్నారు. టైర్-1 సిటీల్లోనే కాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా ఆర్వీ 400 బైక్ బుకింగ్‌ను అందుబాటులో ఉందన్నారు. వచ్చే ఏడాదికి భారీ ఎత్తున బైక్‌లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీల ప్రణాళికలను రచిస్తోందని తెలిపారు. హర్యానాలోని మానేసర్ ప్లాట్‌లో బైక్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ ప్రస్తుతం ప్రతి ఏడాది లక్షకుపైగా యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్(జూబ్లీ హిల్స్), వరంగల్, విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలలో బుకింగ్స్ అందుబాటులో ఉండనుంది. రివోల్ట్ ఆర్వీ400 ఫీచర్స్ 72వీ 3.24 కిలోవాట్స్ లిథియన్ ఇయాన్ బ్యాటరీతో గల 3కిలోవాట్ మోటార్‌తో ఆర్వీ 400 బైక్ నడుస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్, స్పోర్ట్స్ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వరకు వెళ్లనుంది. అంతేగాక, ఇది మైరివోల్ట్ అనే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో వస్తుంది. చదవండి: క్రికెట్ లవర్స్‌కు ట్విటర్ గుడ్‌న్యూస్..! భారత్‌లో తొలిసారిగా..! -
బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్యువి700 పరిచయ ఆఫర్ కింద తక్కువ ధరలతో లాంఛ్ చేశారు. మొదటి 25,000 బుకింగ్స్ కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఎంట్రీ వేరియంట్ ఎక్స్యువి700 ధరలు ₹12.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. బేస్ వేరియంట్ ధరలను కంపెనీ ₹50,000 వరకు పెంచింది. బుకింగ్స్ మళ్లీ అక్టోబర్ 8న ఉదయం 10 నుంచి తిరిగి తెరవనున్నారు. కస్టమర్లు డీలర్ షిప్ లేదా డిజిటల్ ఫ్లాట్ ఫారాల ద్వారా ఎక్స్యువి 700ని బుక్ చేసుకోవచ్చు, మహీంద్రా ఈ రోజు మొదటిసారి బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ 25,000 మంది కారు బుక్ చేసుకున్న తర్వాత ధరలను పెంచింది. అన్ని వేరియెంట్ల ధరలను పెంచలేదు. కొన్ని వేరియెంట్ల ధరలను మాత్రమే పెంచింది. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.(చదవండి: ఫేస్బుక్ ద్వారా డబ్బుల్ని ఇలా సంపాదించండి) -
Mahindra XUV700: బుకింగ్స్ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్
అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించి కీలక అప్డేట్ని మహీంద్రా సంస్థ వెల్లడించింది. అక్టోబరులో మార్కెట్లోకి వస్తున్న ఈ కారు బుకింగ్స్ తేదీని మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన బుకింగ్ ప్రక్రియ అక్టోబరు 7 నుంచి మొదలు కానుంది. వినియోగదారులకు ఉండే విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని డిఫెరెంట్ వేరియంట్స్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, సీటింగ్ లేఅవుట్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ రోడ్లపై పరుగులు పెట్టేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ పెట్రోల్ ఇంజన్ బేస్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలుగా ఉంది. మొదటి 25.000 బుకింగ్‌లకే మాత్రమే ఈ ధరకు కారును అమ్ముతామంటూ మహీంద్రా చెబుతోంది. మిగిలిన వేరియంట్లకు సంబంధించి చిప్సెట్లతో పాటు కార్ల తయారీలో ఉపయోగించే కాంపోనెంట్ల ధరలు పెరగడంతో వరుసగా ఒక్కో ఆటోమోబైల్ సంస్థ ధరలు పెంచుకుంటూ పోతుంది. మహీంద్రా సైతం ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీకి సంబంధించి తొలి 25,000 మంది కస్టమర్లకు ముందుగా ప్రకటించిన ధరకే వాహనాలను అమ్మనుంది. చదవండి : మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్ -
ఓలా న్యూ స్టైల్... స్కూటర్ డెలివరీలో కొత్త పంథా
హైదరాబాద్: మార్కెట్లోకి రావడానికి ముందే రిజిస్ట్రేషన్లలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బైకు డిజైన్, డెలివరీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఎస్ 1 సిరీస్ ఇప్పటికే ఎలక్ట్రిక్ ఓలా స్కూటర్ కావాలంటూ లక్ష మందికి పైగా బుకింగ్‌లో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే స్కూటర్ ఎలా ఉంటుంది. మోడల్ ఏంటీ అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో పేరుతో రెండు స్కూటర్ల పేర్లు నమోదయ్యాయి. దీని ప్రకారం ఓలా స్కూటర్లు ఎస్ 1 సిరీస్‌లో మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది. పది రంగుల్లో ఇప్పటి వరకు మూడు నాలుగు రంగుల్లోనే వాహనాలు మార్కెట్లో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కానీ గతానికి భిన్నంగా ఒకే సారి పది రంగుల్లో హల్చల్ చేసేందుకు ఓలా సిద్ధమైంది. లేత నుంచి ముదురు వరకు మొత్తం పది రంగుల్లోఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నారు. మేల్, ఫిమేల్ కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టుగా ఈ కలర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. హోం డెలివరీ ఇప్పటి వరకు ఆటోమోబైల్ మార్కెట్లో వాహనాలు కొనాలంటే మొదటి మొట్టుగా షోరూమ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఓలా షోరూమ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. స్కూటర్ని బుక్ చేసుకున్న కస్టమర్లకు నేరుగా ఇంటికే హోం డెలివరీ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. -
హైస్పీడులో లగ్జరీ కార్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెర్సిడెస్ మైబాహ్ జీఎల్ఎస్ 600.. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.43 కోట్లు. ఇందులో విశేషం ఏమిటంటారా? ఈ సూపర్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి రాక ముందే ఇక్కడి కస్టమర్లు బుక్ చేసుకున్నారట. కంపెనీ భారత్ కోసం కేటాయించింది అటూ ఇటుగా 50 యూనిట్లు మాత్రమే. రెండవ లాట్ వచ్చేది 2022 జనవరి–మార్చిలోనే. సూపర్ లగ్జరీ కార్లకు భారత విపణిలో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఇదొక్కటే చెబుతోంది. ఇక రూ.2.5 కోట్లకుపైగా ధర కలిగిన సూపర్ లగ్జరీ కార్లు 2019లో దేశవ్యాప్తంగా 265 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోవిడ్–19 ముందస్తు స్థాయికి ఈ ఏడాది విక్రయాలు ఉంటాయని లంబోర్గినీ అంచనా వేస్తోంది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి నుంచి మొత్తం 50కిపైగా కొత్త మోడళ్లు ఈ ఏడాది విడుదల కానుండటం కంపెనీల ఆసక్తికి నిదర్శనం. చిన్న మార్కెట్ అయినప్పటికీ భారత్‌పై సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కోవిడ్–19 సమయంలోనూ.. దేశంలో సూపర్ లగ్జరీ కార్ల అమ్మకాలు కోవిడ్–19 సమయంలోనూ కొనసాగుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం 2020–21లో పోర్ష 249 కార్లను విక్రయించింది. లంబోర్గినీ 26 కార్లు, రోల్స్ రాయిస్ 21, ఫెరారీ 16, బెంట్లే నుంచి 12 కార్లు రోడ్డెక్కాయి. 2019–20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో లంబోర్గినీ ఏకంగా 100 శాతం వృద్ధి సాధించింది. ఊరూస్ మోడల్‌కు విపరీత డిమాండ్ కారణంగానే ఈ స్థాయి వృద్ధి నమోదు చేసింది. ఎక్స్‌షోరూంలో ఊరూస్ ధర రూ.3.15 కోట్ల నుంచి ప్రారంభం. మెర్సిడెస్ 2021లో 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి–జూన్‌లో ఇప్పటికే ఎనిమిది మోడళ్లు కొలువుదీరాయని తెలిపింది. కన్జూమర్ సెంటిమెంట్ తిరిగి బలపడిందనడానికి మైబాహ్ జీఎల్ఎస్ 600 బుకింగ్స్ ఉదాహరణగా వివరించింది. తొలి అర్ధ భాగంలో 50% వృద్ధి సాధించామని.. వచ్చే త్రైమాసికాల్లోనూ అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తోంది. ఇన్నాళ్లు ఖర్చులకు దూరంగా.. షికార్లు, షాపింగ్‌కు సంపన్నులు తరచూ విదేశాలు చుట్టి వస్తుంటారు. కోవిడ్–19 మూలంగా విమాన ప్రయాణాలకు పరిమితులు ఉండడం, వైరస్ భయం కారణంగా గతేడాది నుంచి వీరంతా షికార్లు, షాపింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరి వద్ద ఆర్థిక సామర్థ్యం ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘మెరుగైన ఇల్లు, కార్లవైపు వినియోగదార్లు చూస్తున్నారు. ఆరోగ్యం, జీవితంపై అనిశ్చితి నేపథ్యంలో స్తోమత ఉన్నప్పుడు ఈ రోజే ఎందుకు సొంతం చేసుకోకూడదు. ఎందుకు ఓ అయిదేళ్లు ఆగాలి అన్న భావన కస్టమర్లలో ఉంది. ఈ అంశమే అమ్మకాలకు బూస్ట్‌నిస్తోంది’ అని లంబోర్గినీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 30–40 సూపర్ లగ్జరీ కార్లు రోడ్డెక్కుతున్నాయని వసంత్ మోటార్స్ ఫౌండర్ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి తెలిపారు. రూ.220 కోట్లకుపైగా సంపద కలిగిన అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ప్రస్తుతం దేశంలో 6,884 మంది ఉన్నారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 63% వృద్ధి చెందుతుం దని ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
చేతక్ వాహనప్రియులకు షాక్: మళ్లీ బ్రేకులు
ముంబై: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. బుకింగ్స్‌ను పునఃప్రారంభించిన 48 గంటల్లోనే కంపెనీ మళ్లీ నిలిపివేసింది. సప్లయి చెయిన్‌లో అనిశ్చితే ఇందుకు కారణమని తెలిపింది. తదుపరి బుకింగ్ రౌండ్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. బజాజ్ కంపెనీ చేతక్ ఈ-స్కూటర్స్ బుకింగ్స్‌ను ఈ నెల 13న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్లైన్లో రీ-ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత బెంగళూరు, పుణే నగరాల్లో మాత్రమే బుకింగ్స్‌కు అవకాశం కల్పించింది. కస్టమర్ల నుంచి అధిక స్పందన లభించిందని.. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో విపరీతమైన అంతరాయాలు, సుదీర్ఘ నిరీక్షణ కాలం ఉన్నప్పటికీ బుకింగ్స్‌ను చాలా తక్కువ రద్దు చేశామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. ఇప్పటికే బుకింగ్స్ తీసుకున్న కస్టమర్లు త్వరగా డెలివరీలను స్వీకరించి, రైడింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సరఫరా గొలుసు సమస్యలను పరిష్కరించి.. వీలైనంత త్వరగా బుకింగ్స్‌ను రీ–ఓపెన్ చేస్తామని.. వచ్చే త్రైమాసికంలో మరిన్ని నగరాలలో కూడా బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చేతక్‌లో అర్బన్, ప్రీమియం రెండు మోడల్స్ ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రత్యేకమైన యాప్‌కు కనెక్ట్ చేయబడిన ఈ–స్కూటర్లకు ప్రమాదం జరిగినా లేదా దొంగిలించబడినా సరే సంబంధిత స్కూటర్ యజమానికి నోటిఫికేషన్స్ వెళతాయి. ధరలు అర్బన్ రూ.1.22 లక్షలు, ప్రీమియం రూ.1.26 లక్షలు(పుణే ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. -
ఏప్రిలియా బుకింగ్స్ షురూ...!
ముంబై: ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం పియాజియో ఇండియా ఇటీవల ఆవిష్కరించిన ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ – బుకింగ్స్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. పియాజియో డీలర్ల వద్ద, ఆన్లైన్లో ముందస్తుగా రూ.5,000 చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సరికొత్త ఎస్ఎక్స్ఆర్ 125 గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన ఎస్ఎక్స్ఆర్160 మోడల్‌కు అప్డేట్ వెర్షెన్‌గా వస్తుంది. ఇందులో బీఎస్–6 ప్రమాణాలు కలిగిన 125సీసీ త్రీ వాల్వ్ ఫ్యూయల్ ఎజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చారు. అలాగే ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టైల్ లైట్స్, ఫ్యూయల్ డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ సదుపాయం, అనువైన సీటింగ్ వ్యవస్థ, అడ్జెస్టబుల్ రేర్ సస్పెన్షన్, సీబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌తో డిస్క్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చదవండి: డబ్ల్యూఎల్‌పీకి రెండో హబ్‌గా హైదరాబాద్ -
ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రయాణీకులకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు రైల్వే టికెట్ల బుకింగ్, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులకు పరిమితమైన సంస్థ తాజాగా మరో వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించింది. 22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను జనవరి 29న దేశ వ్యాప్తంగా లాంచ్ చేసినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆన్లైన్ బస్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించింది. https://bus.co.in పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా బస్ బుక్ చేసుకోవచ్చు. దేశంలోని 22 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 50, 000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. టికెట్ బుకింగ్ ఎలా? ఇప్పటికే ఐఆర్సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నవారు https://bus.co.in వద్ద నేరుగా బస్ టికెట్లు బుక్ చేయొచ్చు. లేదంటే కొత్త లాగిన్, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బస్సు టికెట్ బుక్ చేసే సమయంలో యూజర్ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేయాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ లాంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ ద్వారా టికెట్లు బుక్ చేయచ్చు. ఇలా ఒకేసారి గరిష్టంగా 6 మంది ప్రయాణికులకు టికెట్లు బుక్ చేయొచ్చు. వివిధ రకాల బస్సుల వివరాలతోపాటు, అందుబాటులో ఉన్న రూట్లు, సౌకర్యాలు, సమీక్షలు, రేటింగ్ తదితరాలు అందుబాటులో ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. కస్టమర్లు తమ పిక్-అప్, డ్రాప్ పాయింట్లు , టైం కూడా ఎంచుకోవచ్చు. సరసమైన ధరలో బస్ టికెట్లను పొందడంతో పాటు, ఇ-వాలెట్ డిస్కౌంట్లు కూడా లభ్యం. 1800110139 వద్ద బుకింగ్కుసంబంధించిన సమస్యలు సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు. వోల్వో బస్సు, ఏసీ, నాన్ ఏసీ బస్సుల టికెట్లు బుక్ చేయొచ్చు. ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.20+జీఎస్టీ, నాన్ ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.10+జీఎస్టీ ఛార్జీ వసూలు చేస్తుంది.పేమెంట్ సేవల సంస్థల ఛార్జీల భారం వినియోగాదారులదే. ప్రతి ప్రయాణీకుడికి 10 కిలోల వరకు ఒక బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్, హ్యాండ్‌బ్యాగ్ లేదా 5 కిలోల బ్రీఫ్‌కేస్ లాంటివాటికి అనుమతి. ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రి, మందులు, మద్యం, అక్రమ రవాణా వస్తువులు లేదా చట్టం ప్రకారం నిషేధించబడిన వస్తువులను తీసుకెళ్లకూడదు. To provide a holistic travel experience, IRCTC has now launched online bus booking services covering 22 states & 3 UTs. Users can now book Buses with seat selection sitting in the comfort of their homes. For more details on booking, visit https://t.co/xyDJVnt6g3. pic.twitter.com/1MNyWLeh0h — Ministry of Railways (@RailMinIndia) February 6, 2021 -
ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ
న్యూఢిల్లీ, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160కు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా తాజాగా పేర్కొంది. విడుదలకు ముందు (ప్రీలాంచ్) బుకింగ్‌కు తెరతీసినట్లు తెలియజేసింది. రూ. 5,000 చెల్లించడం ద్వారా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్‌ను ప్రస్తుతం బారామతి ప్లాంటులో తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. బీఎస్-6 ప్రమాణాలతోపాటు.. లెడ్ స్ప్లిట్ హెడ్లైట్లు, మొబైల్ కనెక్టివిటీ, సర్దుబాటుకు వీలయ్యే వెనుక సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌ను పొందుపరచినట్లు పియాజియో ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా డీలర్ల ద్వారా దేశవ్యాప్తంగా బుకింగ్స్‌కు వీలున్నట్లు తెలియజేసింది. (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) సవాళ్లున్నప్పటికీ 2020లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ దేశీయంగా ప్రీమియం స్కూటర్ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఉత్పత్తిని చేపట్టగలిగినట్లు పియాజియో ఇండియా చైర్మన్ డీగో గ్రాఫీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఆధునిక ఫీచర్లు, తరువాతి తరం డిజైన్‌తో రానున్న ప్రీమియం స్కూటర్ వినియోగదారులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. ఎప్రిలియా ప్రీమియం స్కూటర్.. గ్లాసీ రెడ్, మ్యాట్ బ్లూ, గ్లాసీ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యంకానున్నట్లు తెలియజేశారు. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.10-1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. -
లాక్డౌన్లో హ్యుందాయ్ క్రెటా రికార్డు
సాక్షి,ముంబై: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్)కు చెందిన ప్రముఖకారు క్రెటా కొత్త వెర్షన్ బుకింగ్‌లలో దూసుకుపోతోంది. ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన క్రెటా వెర్షన్ కారు రికార్డు స్థాయి బుకింగ్‌లను సాధించి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. క్రెటా కొత్త వెర్షన్‌కు 55 వేల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. (హ్యుందాయ్ క్రెటా @ రూ. 9.9 లక్షలు) 2020 మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్యూవీ విభాగంలో టాప్‌లో ఉందని హెచ్ఎంఐఎల్ తెలిపింది. 2015 లో ప్రారంభించినప్పటి నుంచి ఇండస్ట్రీలో బెంచ్ మార్క్‌గా నిలిచిందనీ, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లను సాధించిందని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు. కొత్త వెర్షన్ ద్వారా కంపెనీ మరోసారి ఈ విభాగంలో ఎస్యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పిందన్నారు. కేవలం నాలుగు నెలల్లో 55,000 బుకింగ్‌లు, 20,000 మందికి పైగా కస్టమర్లను సాధించిందన్నారు. ఈ కష్టకాలంలో కూడా భారతదేశం అంతటా ఆదరణకు నోచుకోవడం తమ ఎస్యూవీ పనితీరుకు నిదర్శనమని గార్గ్ వెల్లడించారు. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో హ్యుందాయ్ క్రెటా 2020 మార్కెట్లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. (మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!) -
‘ఎల్పీజీ’పై తొందరవద్దు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుండంతో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లభ్యత తగ్గిపోతుందన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి బుకిం గ్లు చేస్తుండటంతో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయిల్ కంపెనీలపై ఒత్తి డి పెరుగుతోంది. ఈ క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, విని యోగదారులు ఆందోళనకు గురికావొద్దని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళికృష్ణ ప్రకటించారు. కొరత లేదు.. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి, మా ర్చి నెలల్లో బుకింగ్‌లు పెరి గాయి. దేశవ్యాప్తంగా రోజుకు 15–18 లక్షల బుకింగ్‌లు ఉం టుండగా, మార్చి నాటికి 20 నుంచి 22 లక్షలకు పెరిగాయి. పది రోజులుగా ఏకంగా రోజుకు దేశవ్యాప్తంగా 25లక్షల బు కింగ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 2లక్షల వరకు బుకింగ్‌లు ఉంటుం డగా, అవిప్పుడు ఏకంగా 3.50లక్షల వరకు పెరిగాయి. రెండ్రోజుల కిందట వరకు తొలి సిలెండర్ బుకింగ్ చేసిన అనంతరం రెండో బుకింగ్ చేసేందుకు కేవలం ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో బుకింగ్‌లు పెరగడంతో, ఆయిల్ కంపెనీలు పలు ఆంక్షలు తెచ్చాయి. ఒక్కో సిలిండర్ బుకింగ్‌కు మధ్య గ్యాప్‌ను 14 రోజులకు పెంచాయి. అంటే 14 రోజుల తర్వాతే రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన తగ్గించే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని, సాధారణంగా సరఫరాను సైతం కొనసాగిస్తున్నాయని ప్రకటించింది. అనవసరం బుకింగ్‌లు వద్దని, డిజిటల్ చెల్లింపులకు మొగ్గు చూపాలని సూచనలు చేసింది. ఎల్పీజీ వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్ 1906ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
48 గంటల్లో ఇసుక డోర్ డెలివరీ..
ఇసుక కష్టాలు తొలగిపోయాయి. ఎదురు చూడాల్సిన పని లేదు.ఆన్లైన్ విధానంతో ఇసుక పొందడం మరింత సులభతరమైంది.పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం గతనెల 10 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. కంప్యూటర్ ముందు కూర్చుని అడిగిన వివరాలుసమర్పిస్తే ఇసుక 48 గంటల్లో ఇంటికి చేరుతోంది. దీంతో వినియోగదారుల ఆనందానికి అవధులు లేవు. గతంలో రీచ్‌లలో నీరు చేరడంతో కొంత ఇబ్బంది ఎదురుకావడంతో విపక్ష నాయకులు ‘ఇసుక దుమారం’రేపిన సంగతి తెలిసిందే..ఇప్పుడు విమర్శించే గళాలన్నీ మూతపడ్డాయి.అవసరాలకు మించి ఇసుక లభ్యత కావడం..సక్రమంగా ఇంటికి చేరుతుండటం ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టాయి. సాక్షి ప్రతినిధి కడప : జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ జోరందుకుంది. బుక్ చేసిన 48 గంటల్లోనే ఇసుక ఇంటికి చేరుతోంది. జనవరి 10న డోర్ డెలివరీ విధానం అమలులోకి వచ్చింది. నాటి నుంచి ఈనెల 3 వరకూ( సెలవులుపోను) 18 రోజుల వ్యవధిలో 24,834 టన్నులు డోర్ డెలివరీ కింద సరఫరా చేశారు. జనరల్, బల్క్‌గా వినియోగదారులను విభజించి అధికారులు ఇసుక సరఫరా చేస్తున్నారు. వంద టన్నులకు పైబడి అవసరమైన వారు బల్క్ కన్జ్యూమర్ లాగిన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి జిల్లా అధికారులు అఫ్రూవల్ ఇస్తారు. తర్వాత విజయవాడ హెడ్ ఆఫీసు నుంచి మరో అఫ్రూవల్ వచ్చాక ఇసుక సరఫరా చేస్తారు. జనరల్ వినియోగదారులు జిల్లాలో ఎక్కడి నుంచయినా ‘శాండ్.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. 48 గంటల్లో వారికి ఇసుక కేటాయిస్తున్నారు. వివరాలు వాహన యజమానికి వెళతాయి. రీచ్‌లకు వెళ్లి వే బిల్లులు తీసుకుంటే వినియోగదారునికి ఫోన్ ద్వారా సమాచారం అందించి డెలివరీ చేస్తారు. పెరుగుతున్న బుకింగ్స్ రోజురోజుకూ బుకింగ్స్ పెరుగుతున్నాయి. అందుబాటులోకి ఇసుక రావడంతో వినియోగదారులు సులభతరంగా బుక్ చేసుకుంటున్నారు. నేరుగా కాకుండా సచివాలయాల నుంచి కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. పులివెందుల, కడప, రాయచోటి స్టాక్ యార్డుల నుంచి సరఫరా చేస్తున్నారు. పెన్నానది పరిధిలో జ్యోతి, ఇల్లూరు, చిత్రావతి పరిధిలో కొండాపురం వద్ద ఏటూరు, పాపాఘ్ని నదిలో వేంపల్లె వద్ద కొమరాంపల్లె, చెయ్యేరు పరిధిలో బాలరాజుపల్లె, నారాయణ నెల్లూరు, అడపూరు, టంగుటూరు తదితర తొమ్మిది ఇసుక రీచ్‌లతోపాటు పట్టా ల్యాండ్స్ పరిధిలో కొండూరు 1, 2, 3 రీచ్‌లు, రాజంపేట పరిధిలో కిచ్చమాంబపురం నాలుగు రీచ్‌ల నుండి ఇసుక సరఫరా చేస్తున్నారు. టన్ను ఇసుక రూ. 375 చొప్పున విక్రయిస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్లలోపు టిప్పర్‌కు రూ.7, ట్రాక్టర్‌కు రూ.10 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. 40 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు రూ. 4.90 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇసుక డిపోలలో 60 వేల టన్నులకు పైగా ఇసుక సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు సకాలంలో ఇసుకను అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే పెన్నా, కుందూ, పాపాగ్ని, చిత్రావతి తదితర నదుల పరిధిలో మరిన్ని ఇసుక రీచ్‌లను తెరిచేందుకు అధికారులు సిద్దమయ్యారు. అవసరమైతే పట్టాల్యాండ్స్ నుండి కూడా సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. డోర్ డెలివరీ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావడం లేదు. మైనింగ్, పోలీసు, విజిలెన్స్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
రూ.11వేలతో రెనాల్ట్ ట్రైబర్ బుకింగ్స్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ దారు రెనాల్ట్ తన అప్‌కమింగ్ కారు బుకింగ్‌లను ప్రారంభించింది. కాంపాక్ట్ ఎంపీవీ క్రాస్ఓవర్, ట్రైబర్ అధికారిక బుకింగ్‌లను ఆగస్టు 17నుంచి ప్రారంభిస్తామని రెనాల్ట్ ప్రకటించింది. రెనాల్ట్ వెబ్సైట్, లేదా దగ్గరిలోని బ్రాండ్ డీలర్ ద్వారా కేవలం 11,000 రూపాయలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.ఈ కార్ ధరలు సుమారు రూ. 5 - రూ. 7 లక్షల మధ్యన ఉంటుందని అంచనా. ఆగస్టు 28 న రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ కానుంది. రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లతో ఇది లాంచ్ కానుంది. 72 బిహెచ్పీ పవర్, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ , 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ అప్షన్స్లలో రానుంది. ట్రైబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డ్రిల్స్, రూఫ్ స్పోర్టివ్ లుక్‌తో వస్తున్న ఈ కారులో మూడో వరుసలో ఉన్న సీట్లను అవసరం లేకపోతే.. పూర్తిగా తొలగించుకునే అవకాశం కల్పించింది. మారుతి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ లాంటి వాటికి రెనాల్ట్ ట్రైబర్ గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, రెనాల్ట్ ట్రైబర్ లో 4 ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్, ట్విన్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్ లు, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ కెమెరాను జోడించింది. -
ఏపీ ఇసుక విధానం ఖరారు
-
ఐఆర్సీటీసీ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మూతపడనుంది. శనివారం, ఆదివారాల్లో కొంత సమయం పాటు ఐఆర్సీటీసీ సేవలను నిలిపివేయనున్నారు. మెయింటినెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులకు కలగనున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 18, 2019 శనివారం, మే 19 ఆదివారం మధ్య కొంత సమయం పాటు సేవలు నిలిపివేస్తారు. ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ అందించిన సమాచారం ప్రకారం తత్కాల్ సహా రైలు టికెట్ బుకింగ్, టికెట్ల రద్దు తదితర రైలు-సంబంధిత సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవు. దేశీయంగా శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము 2.30 గంటల వరకు, ఢిల్లీలో 18వ తేదీ అర్థరాత్రి 23.45 నుంచి 19వ తేదీ ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుంది. మరింత సమాచారం కోసం : కస్టమర్ కేర్ నంబర్లు: 0755-6610661, 0755-4090600, 0755-3934141 మెయిల్ ఐడీ: eticket@irctc.co.in సంప్రదింవచ్చని ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ప్రకటించింది. కాగా రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీ మే 16, గురువారం ఉదయం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ పని చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. మెయింటెనెన్స్ కారణంగా ఇప్పుడు ఈ-టికెటింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. దయచేసి కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి అన్న మెసేజ్‌తో దర్శనమిచ్చింది. దీంతో సైట్ మెయింటెనెన్స్ విషయాన్ని ముందుగా తెలియజేయ లేదంటూ పలువురు యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా బంపర్ ఆఫర్
ముంబై: విమాన డిపార్చర్‌కు మూడు గంటల ముందు బుకింగ్స్‌పై 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుక్రవారం ప్రకటించింది. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన ప్యాసింజర్లకు ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడనుందని.. సంస్థకు చెందిన కౌంటర్లు, వెబ్సైట్, మొబైల్ యాప్, ఎజెంట్ ద్వారా జరిగే బుకింగ్స్‌కు ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. ‘హ్యఫ్టీ డిస్కౌంట్’ పేరుతో ఈ ఆఫర్ లభిస్తోంది. -
ఎయిరిండియా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఖరి నిమిషంలో బుక్ చేసుకునే విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ అందిస్తామని ప్రకటించింది. ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన వాణిజ్య సమీక్షా సమావేశంలో లాస్ట్ మినిట్ టికెట్లపై భారీ డిస్కౌంట్ అందించే నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. దేశీయ మార్గాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్టు తెలిపింది. వాస్తవానికి లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకునే టికెట్లు సాధారణంగా 40 శాతం అధికంగా ఉంటాయి. కానీ జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం, పలు విమానాల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అందుబాటులో ఉన్న సీట్లలో లాస్ట్ మినిట్ బుకింగ్‌లపై 50శాతం తగ్గింపును వర్తింప జేయనుంది. ప్రయాణానికి మూడు గంటలలోపు బుక్ చేసుకుంటే ఈ తగ్గింపు వర్తిస్తుందని సీనియర్ అధికారి చెప్పినట్టుగా పీటీఐ రిపోర్టు చేసింది. ఏజెంట్లతో పాటు ఎయిరిండియా కౌంటర్లు, ఎయిరిండియా వెబ్సైట్, లేదా మొబైల్ యాప్‌లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. -
వేసవికి ప్లాన్ ఏంటి..?
వేసవి సెలవుల్లో రీఫ్రెష్ అవ్వడం కోసం చక్కని పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలన్న ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అయితే, ఎంపిక దగ్గరే సమస్యంతా. దూర ప్రాంతాలకు వెళ్లి రావడం అనేది కొంచెం కష్టమైన టాస్కే. ఎంపికను బట్టే ప్లానింగ్ ఆధారపడి ఉంటుంది. ముందుగా ఎక్కడికి వెళ్లాలన్న దానిపై కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ఆ తర్వాతే ప్రణాళిక ఆరంభమవుతుంది. కొంచెం ముందుగా సన్నద్ధం అయితే టికెట్ల బుకింగ్ దగ్గర నుంచి హోటళ్ల బుకింగ్ వరకు సాఫీగా సాగిపోతుంది. ఆలస్యం చేస్తే ఆదరాబాదరతోపాటే బడ్జెట్ కూడా పెరిగిపోవచ్చు. ఇప్పటికీ వేసవి పర్యటనకు ప్రణాళిక రూపొందించుకోకుండా, ఎక్కడో ఒక చోటకు వెళ్లొద్దామనుకునేవారు.. వెంటనే తాము చూడాలనుకుంటున్న వాటిపై స్పష్టతకు రావాలి. ఇందుకు నిపుణులు తెలియజేస్తున్న ప్లానింగ్ మీకోసం... ఎన్నో ఎంపికలు రవాణా సదుపాయాలు విస్తృతమైన తర్వాత పర్యాటక ప్రియులకు ఎన్నెన్నో గమ్యస్థానాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఏది ఎంచుకోవాలన్న మీమాంస కూడా ఎదురవుతుంది. వేసవి ట్రిప్ ద్వారా తాము ఏం ఆశిస్తున్నామనే ఆకాంక్ష, బడ్జెట్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక మారిపోవచ్చు. ‘‘భారత పర్యాటకులకు దక్షిణాఫ్రికా సఫారీ అనుభవం ప్రముఖ ఎంపిక. ఇక ఫ్రాన్స్ అయితే వంటకాలు, వైన్‌కు ప్రసిద్ధి. చరిత్ర, సంస్కృతి, నిర్మాణ కళ పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులు హంగేరి, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియాలను ఎంచుకుంటుంటారు. స్పా, వెల్నెస్, రెజువెనేషన్ అనుభవాలు కోరుకునే వారికి దక్షిణ కొరియా ఎంపిక అవుతుంది. స్విట్జర్లాండ్, క్రోయేషియా ఫొటోగ్రఫీ ప్రియులకు అనుకూలం’’ అని థామస్ కుక్ ఇండియా లీజర్ ట్రావెల్ విభాగం అధిపతి రాజీవ్ కాలే వివరించారు. సంపాదనా శక్తి పెరుగుతుండడంతో భారతీయ పర్యాటకులు ప్రముఖ పండుగల సమయాల్లో (విదేశీ పండుగలు)నూ ఆయా దేశాలకు వెళ్లి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థాయిలాండ్‌లో ఏప్రిల్ 13–15 మధ్య జరిగే సాంగ్‌క్రాన్ (వాటర్ ఫెస్టివల్), హాంకాంగ్‌లో జూన్ 7న జరిగే డ్రాగన్ బోట్ ఫెస్టివల్, స్పెయిన్‌లో ఆగస్ట్ 28న జరిగే లా టమాటినా(టమాటా ఫెస్టివల్), దక్షిణ కొరియాలో జూలై 19–28 మధ్య జరిగే బోర్యాంగ్ మడ్ ఫెస్టివల్ ను చూసేందుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని రాజీవ్ కాలే తెలిపారు. యూకేలో మే నుంచి ఆరంభమయ్యే ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్‌కూ ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్‌బీట్ డెస్టినేషన్స్ అయిన జపాన్, దక్షిణ అమెరికా, క్రోయేషియా, ఐస్‌ల్యాండ్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు ఉంటే థీమ్ పార్క్స్ అనుకూలం. ‘‘సింగపూర్, మలేషియాలోని లెగోల్యాండ్లో యూనివర్సల్ స్టూడియోలు ఉన్నాయి. టోక్యో, హాంకాంగ్, ప్యారిస్, ఓర్లాండోలలో డిస్నీల్యాండ్స్ ఉన్నాయి’’ అని బ్రాండ్ ఎక్స్పీడియా మార్కెటింగ్ హెడ్ మన్మీత్ అహ్లువాలియా తెలిపారు. ఇక ఆఫీసు బాధ్యతల నుంచి స్వల్ప విరామం తీసుకునేవారికి వీసా అవసరం లేని, సులభ వీసాలకు అవకాశం ఉండే సింగపూర్, బాలి, థాయిలాండ్, శ్రీలంకను ఎంచుకోవచ్చు. బడ్జెట్ ఎంత? పర్యటనకు వెళ్లొద్దామనే ఆలోచన వచ్చిన తర్వాత ముందుగా తేల్చుకోవాల్సినది ఎంత ఖర్చు పెడతారని. బడ్జెట్‌ను బట్టే ఎక్కడికి వెళ్లి రావచ్చన్నది నిర్ణయించుకోవడానికి వీలు పడుతుంది. ఆర్థిక సలహాదారులు అయితే వార్షికంగా మీరు చేసే ఖర్చుల్లో విచక్షణారహిత వినియోగం 15 శాతాన్ని మించకుండా చూసుకోవాలని చెబుతుంటారు. ‘‘సెలవు కాలంలో చేసే ఖర్చులు విచక్షణారహితం కిందకే వస్తాయి. మీ వార్షిక ఖర్చులో ఇది 10 శాతం మించకుండా ఉండడం అనుకూలం. వేసవితోపాటు, శీతాకాలంలోనూ పర్యాటక ప్రదేశాలను చూడాలనుకునే వారు ఈ పరిధికి లోబడే బడ్జెట్‌ను రెండు భాగాలు చేసుకోవాలి. అంతేకానీ మొత్తం బడ్జెట్‌ను వేసవి కోసం ఖర్చు పెట్టేయరాదు’’ అని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్‌పీ విషాల్ ధావన్ సూచించారు. మీరు ఎంత ఖర్చును భరించగలరన్న దాని ఆధారంగా పర్యాటక ప్రదేశాల జాబితాను షార్ట్‌లిస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ‘‘తక్కువ బడ్జెట్ ఉన్నవారు భారత్‌లోపల లేదా దక్షిణాసియాలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే తూర్పు యూరప్‌లోని ప్రాంతాలను సందర్శించొచ్చు. ఇంకా ఎక్కువ ఖర్చు చేయగలిగే వారు పశ్చిమ యూరప్‌కు వెళ్లొచ్చు’’ అని అహ్లువాలియా సూచించారు. కరెన్సీ ప్రభావం గత కొన్ని వారాల్లో డాలర్‌తో రూపాయి కాస్త బలపడడం కూడా బడ్జెట్‌ను తగ్గించేదే. గత 6 నెలల్లో ప్రధాన కరెన్సీలతో రూపాయి విలువ 2.9–8.8% బలపడింది. దీనివల్ల భారతీయుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సహజంగానే అన్ని చార్జీలు పెరిగిపోతుంటాయి. కనుక ఈ లోపే అన్నీ బుక్ చేసుకోవడం మంచిదని కాక్స్ అండ్ కింగ్స్ కరణ్ ఆనంద్ తెలిపారు. వీసా కోసం.. వీసాను ముందే తీసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. చాలా మందికి వీసాకు పట్టే సమయంపై తగిన అవగాహన ఉండదు. బ్రిటన్, షెంజెన్‌కు వీసా కావాలంటే కనీసం 10–15 రోజులు పడుతుందనేది నిపుణుల మాట. అదే ఆస్ట్రేలియాకు అయితే ఇది 20 రోజుల వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే.. విమాన టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడం వల్ల చార్జీల భారం తగ్గే వెసులుబాటు ఉంటుంది. చివరి నిమిషంలో టికెట్ల చార్జీలు పెరిగే వరకు వేచి చూడకుండా ముందే బుక్ చేసుకోవాలని ఎస్‌వోటీసీ ట్రావెల్ హెడ్ డానియల్ డిసౌజౌ సూచించారు. రెండు నెలల ముందే టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా కనీసం 20–22 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కరణ్ ఆనంద్ తెలిపారు. ‘‘డైరెక్ట్‌గా వెళ్లే విమానాల్లో టికెట్ చార్జీలు ఎక్కువ. కనెక్టింగ్ విమానాలు చౌక. తగిన వ్యవధి ఉన్న వారు కనెక్టింగ్ విమానాల ద్వారా వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చని అహ్లువాలియా తెలిపారు. ఇక ఏ సమయంలో మీరు చేరుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి విమానం సాయంత్రానికి చేరుకుంటే, ఆ రోజు స్థానిక సందర్శనకు వీలు పడదని అహ్లువాలియా గుర్తు చేశారు. అదే సమయంలో ఆ రాత్రికి విడిది కోసం గాను హోటల్, భోజన ఖర్చులను పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. కనుక ఉదయం సమయానికి తీసుకెళ్లే ఫ్లయిట్‌ను ఎంచుకోవడం కూడా ఖర్చు ఆదాకు ముఖ్యమని తెలియజేశారు. ఇక హోటల్స్ విషయంలోనూ ముందుగానే త్వరపడడం మంచిది. చాలా హోటళ్లు డిమాండ్‌ను సృష్టించేందుకు, సీజన్ ఆరంభానికి ముందే బుకింగ్‌లను పూర్తి చేసుకునేందుకు ఎర్లీబర్డ్ స్కీమ్‌లను అమలు చేస్తున్నాయని రాజీవ్ కాలే తెలిపారు. ఇక హోటల్ స్టార్ రేటింగ్‌ను బట్టి కూడా చార్జీల్లో మార్పులు ఉంటాయి. నగరం లోపల ఉన్న హోటళ్లు దూరంగా ఉన్న హోటళ్లతో పోలిస్తే ఎక్కువ చార్జీలు తీసుకుంటుంటాయి. అన్ని రకాల బుకింగ్‌లను ఇప్పుడు సులభంగా ఆన్లైన్లో చేసుకునే సదుపాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ముందుగా లోడ్ చేసిన ఫారెక్స్ కార్డులను వినియోగించుకోవడం వల్ల కొంత పొదుపు చేసుకోవచ్చు. పర్యాటకులు మెచ్చే ప్రాంతాలు ప్రముఖ ట్రావెల్ సైట్ ‘ట్రిప్ అడ్వైజర్’ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతాలకు ట్రావెలర్స్ చాయిస్ అవార్డులను (2019 సంవత్సరానికి) ప్రకటించింది. ట్రిప్ అడ్వైజర్ కస్టమర్ల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. భారత్‌లో పర్యాటకులకు నచ్చినవి... 1. జైపూర్ (రాజస్తాన్) 2. గోవా (గోవా) 3. న్యూఢిల్లీ 4. మనాలి (హిమాచల్‌ప్రదేశ్) 5. కోచి (కేరళ) 6. బెంగళూరు (కర్ణాటక) 7. జైసల్మేర్ (రాజస్తాన్) 8. ముంబై (మహారాష్ట్ర) 9. ఉదయ్‌పూర్ (రాజస్తాన్) 10. ఆగ్రా (ఉత్తర్‌ప్రదేశ్) ఆసియాలో టాప్10 డెస్టినేషన్స్... 1. బాలి (ఇండోనేషియా) 2. ఫుకెట్ (థాయిలాండ్) 3. సీమ్‌రీప్ (కంబోడియా) 4. హనోయ్ (వియత్నాం) 5. టోక్యో (జపాన్) 6. ఖాట్మండు (నేపాల్) 7. జైపూర్ (భారత్) 8. హాంగ్‌కాంగ్ (చైనా) 9. సియోల్ (దక్షిణ కొరియా) 10. గోవా (భారత్) అంతర్జాతీయంగా టాప్ ఇవీ... 1. లండన్ (ఇంగ్లండ్) 2. పారిస్ (ఫ్రాన్స్) 3. రోమ్ (ఇటలీ) 4. క్రెటే (గ్రీస్) 5. బాలి (ఇండోనేషియా) 6. ఫుకెట్ (థాయిలాండ్) 7. బార్సెలోనా (స్పెయిన్) 8. ఇస్తాంబుల్ (టర్కీ) 9. మర్రాకెచ్ (మొరాకో) 10. దుబాయి (యూఏఈ) రూ.2–3 లక్షల బడ్జెట్ అయితే ప్రాంతం బడ్జెట్(రూ.లక్షల్లో) సీషెల్స్ 2 ప్రాగ్ 2 ఇటలీ 3 హాంకాంగ్ 2.75 గ్రీస్ 3 -
జావా బుకింగ్స్... టాప్–5లో హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జావా మోటార్‌సైకిళ్ల బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్–5లో నిలిచింది. దేశంలో దక్షిణాది నుంచే అత్యధిక బుకింగ్‌లు వచ్చినట్లు జావాను ప్రమోట్ చేస్తున్న క్లాసిక్ లెజెండ్స్ కో–ఫౌండర్ అనుపమ్ థరేజా వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడు షోరూంలను ప్రారంభించిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆన్లైన్ బుకింగ్స్ క్లోజ్ చేశాం. ఊహించిన దాని కంటే ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. బ్రాండ్ న్యూ ఇంజిన్‌తో మోడళ్లకు రూపకల్పన చేశాం. బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. లైఫ్‌స్టైల్, క్లాసిక్ బైక్‌లు ఇవి. ఎవరైనా సులువుగా రైడ్ చేయవచ్చు. బైక్‌ల తయారీకై 700 మంది వెండార్ల నుంచి విడిభాగాలను కొనుగోలు చేస్తున్నాం. వీరంతా కొత్త ప్లాంట్లు, యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకే డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. తెలంగాణలో 9, ఏపీలో 16 ఔట్లెట్లు రానున్నాయి. మొత్తం 86 నగరాల్లో మార్చికల్లా 105 షోరూంలు తెరుచుకుంటాయి. ఇవి ప్రారంభం అయిన తర్వాతే డెలివరీలు ప్రారంభిస్తాం’ అన్నారు. -
మారుతి ఎర్టిగా బుకింగ్స్ నేటి నుంచే
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఎర్టిగాను న్యూ అవతార్‌లో లాంచ్ చేయనుంది. సెవన్ సీటర్ మల్టీ పర్సస్ వెహికల్ (ఎంపీవీ) కొత్త ఎర్టిగా 2018ను నవంబరు 21ల లాంచ్ చేయనున్నామని మారుతి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ న్యూ ఎర్టిగా ఎల్, వీ, జెడ్, జెడ్ + అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో ఈనెల 21న లాంచ్ చేయనుంది. అలాగే ఈ వాహనాల ప్రీ బుకింగ్స్‌ను నేటి (నవంబరు 14, బుధవారం) నుంచి ప్రారంభించింది. కేవలం రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే లాంచింగ్ సందర్భంగా మారుతి వెల్లడించనుంది. అయితే పాత మోడల్ ఎర్టిగాతో పోలిస్తే కొత్త ఎర్టిగా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. రూ 6.34- 10.69 లక్షలు (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎర్టిగా 2018 ( ఎంపీవీ) 1.5 లీటర్ పెట్రోలు ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ రెండు వెర్షన్లలో, అయిదు రంగుల్లో లభ్యంకానుంది. -
యాప్‌లో అన్‌రిజర్వ్ సీట్లు అందుబాటులోకి
న్యూఢిల్లీ: రైళ్లలో రిజర్వుకాని టికెట్లను సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని గురువారం నుంచి దేశమంతటా అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. అన్ని రైల్వే జోన్లలోని అన్ని సబర్బన్ రైళ్లలో అన్‌రిజర్వుడు టికెట్లను ‘యూటీఎస్ మొబైల్ యాప్’ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన ధ్రువీకరణలను సమకూరిస్తే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందుతాయి. వీటిద్వారా లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మార్చి నుంచి రైల్వే ఫ్లెక్సీ–ఫేర్ అమలు రైల్వే శాఖ ప్రతిపాదించిన ఫ్లెక్సీ–ఫేర్ మార్పులు 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్నాయి. నూతన ఫ్లెక్సీ–ఫేర్ విధానం ద్వారా రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఖరీదైన రైళ్లలో వచ్చే మార్చిలో ప్రయాణించే వారు మొదటిసారిగా లబ్ధి పొందనున్నారు. -
దూసుకుపోతున్న సరికొత్త శాంత్రో
సాక్షి, ముంబై: సరికొత్తగా ముస్తాబై మార్కెట్లో రీలాంచ్ అయిన హ్యుందాయ్ శాంత్రో (2018) దూసుకుపోతోంది. కస్టమర్ల విశేష ఆదరణతో తన ప్రాభవాన్ని మరోసారి చాటుకుంటోంది. కేవలం 12రోజుల్లో 23,500 బుకింగ్‌లను సాధించింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత స్మాల్ కార్ సెగ్మెంట్లో తొలిసారిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కారుగా శాంత్రో ఎహెచ్-2 ను లాంచ్ చేసింది శాంత్రో కారుకు ప్రీ బుకింగ్‌లు అక్టోబర్ 10, 2018న ప్రారంభం కాగా ఇప్పటికే 23500 బుకింగ్‌లు వచ్చాయని హ్యుందాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ల ఆదరణను తాము తిరిగి సంపాదించడం సంతోషంగా ఉందని హ్యుందాయ్ ఇండియా ఎండీ వెల్లడించారు. భారీ సంఖ్యలో బుకింగ్‌లతో 3నెలలకు సరిపడా ఉత్పత్తి వాల్యూమ్‌ను పొందామంటూ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీ-బుకింగ్‌లు నిన్నటితో నిలిచిపోయాయన్నారు. హ్యుందాయ్ కొత్త శాంత్రో ఒక గ్లోబల్ ప్రొడక్ట్ అని స్పష్టం చేసిన కంపెనీ దేశీయంగా డిమాండ్ లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం ఇతర మార్కెట్లకు కూడా విస్తరిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ కొత్త ఆల్ న్యూ శాంత్రో ప్రారంభ ధర 3.89 లక్షల రూపాయలు. 5 వేరియంట్లలో 7కలర్ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది. డ్లైట్ , ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్టా పేర్లతో లభ్యమవుతున్నాయి. మ్యాగ్నా, స్పోర్ట్స్ లో సీఎన్ జీ వెర్షన్ కూడా ఉంది. శాంత్రో వివిధ మోడళ్ల ధరలు డ్లైట్ (ఎంటీ) : రూ .3,89,900 ఎరా (ఎంటీ) : రూ .4,24,900 మాగ్నా (ఎంటీ): రూ .4,57,900 మాగ్నా (ఏటీ): రూ .5,18,900 మాగ్నా (సీఎన్జీ): 5,23,900 ఆస్టా ఎంటీ : రూ. 5,45,900 స్పోర్ట్స్ (ఎంటీ): రూ. 4,99,900 స్పోర్ట్స్ (ఎటీ): రూ .5,46,900 స్పోర్ట్స్ (సీఎన్జీ): రూ. 5,64,900 Hyundai presents India’s Favourite Family Car – The #AllNewSANTRO. Introductory price starting at 3.89 Lacs for first 50,000 bookings only. Visit your nearest dealership and Test Drive today. For more details visit https://t.co/ckJk0l4ICp pic.twitter.com/Bid7fI93r7 — Hyundai India (@HyundaiIndia) October 23, 2018 -
రూ.11వేలకే డాట్సన్ గో, గో ప్లస్ బుకింగ్
సరికొత్త డాట్సన్ గో, గో ప్లస్ ఎంపీవీ కార్లను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది డాట్సన్ ఇండియా. ఈ కొత్త అప్డేటెడ్ మోడల్స్ బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్న డాట్సన్ డీలర్‌షిప్‌ల వద్ద కంపెనీ ప్రారంభించింది. 11 వేల రూపాయలకు వీటిని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అప్డేట్ చేసిన డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ మోడల్ పలు అప్డేట్లతో కంపెనీ లాంచ్ చేస్తోంది. వెర్టికల్ హౌజింగ్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్తో కొత్త బంపర్స్‌ను ముందు వైపు ఇది కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్స్‌ను, ఫ్రంట్ గ్రిల్‌ను రీడిజైన్ చేశారు. వెనుక వైపు బంపర్‌ను కూడా రీడిజైన్ చేసింది డాట్సన్ కంపెనీ. వెనుక వైపు కూడా వాషర్, వైపర్ ఉన్నాయి. కారు లోపల, పునరుద్ధరించిన డ్యాష్‌బోర్డు, 6.75 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఆపిల్ కారుప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనుకూలంగా ఉంది. నాలుగు డోర్లకు కూడా పవర్ విండోస్‌ను కలిగి ఉండటం ఈ మోడల్స్ ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్ కేవలం టాప్ స్పెషిఫికేషన్ మోడల్స్‌కు మాత్రమే ఉంది. గో, గో ప్లస్ మోడల్స్ రెండూ అంతకముందు మాదిరే 1.2 లీటరు పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి మార్కెట్లోకి వచ్చాక, మారుతీ సుజుకీ ఆల్టో కే10కు, అప్‌కమింగ్ హ్యుందాయ్ శాంట్రోకు, అప్‌కమింగ్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అప్డేట్ చేసిన ఈ మోడల్స్ ధరను డాట్సన్ పాత వాటి కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు అదనంగా పెంచింది. డాట్సన్ గో ప్రస్తుతం మార్కెట్లో రూ.3.38 లక్షల నుంచి రూ.4.41 లక్షల మధ్యలో లభ్యమవుతుండగా.. గో ప్లస్ మోడల్ రూ.3.95 లక్షల నుంచి రూ.5.25 లక్షలకు విక్రయిస్తోంది. అంటే కొత్త మోడల్స్, పాత మోడల్స్ కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు ఎక్కువగా పలుకనున్నాయి.