11వేలతో ఈ కారును బుక్ చేసుకోండి! | Maruti Suzuki opens bookings for all-new Dzire | Sakshi
Sakshi News home page

11వేలతో ఈ కారును బుక్ చేసుకోండి!

Published Fri, May 5 2017 7:35 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

11వేలతో ఈ కారును బుక్ చేసుకోండి!

11వేలతో ఈ కారును బుక్ చేసుకోండి!

ఎప్పటినుంచో వేచిచూస్తున్న మారుతీ సుజుకీ తనకొత్త సెడాన్ 2017డిజైర్ ను మే 16న మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది.

న్యూఢిల్లీ : ఎప్పటినుంచో వేచిచూస్తున్న మారుతీ సుజుకీ తనకొత్త సెడాన్ 2017 డిజైర్ ను మే 16న మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది. గతవారం ఆవిష్కరించిన ఈ కొత్త సెడాన్ ప్రీ-బుకింగ్స్ ను ఈ కంపెనీ ప్రారంభించేసింది. లాంచింగ్ కు రాబోతున్న 2017 డిజైర్ వాహనాన్ని ముందస్తు పేమెంట్ కింద 11వేల రూపాయలు కట్టి బుకింగ్ చేసుకోవచ్చని మారుతీసుజుకీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 2000 డీలర్ షిప్ లలో ఈ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో రాబోతున్న నాలుగు వేరియంట్లలో పలు రకాల కాస్మోటిక్, స్టైలింగ్, ఫీచర్లను మారుతీ సుజుకీ మార్చింది.  
లుక్స్...
ఈ కొత్త డిజైర్ పూర్తిగా న్యూ, ప్రెష్ లుక్లో వస్తోంది. హెక్సాగోనల్ గ్రిల్ తో దీన్ని కంపెనీ రీడిజైన్ చేసింది. ఈ కొత్త డిజైర్ 40ఎంఎం వైడర్, 20ఎంఎం లాంగర్ వీల్ బేస్తో ఉంది. అతిపెద్ద ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, కర్వ్డ్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ను, పూర్తిగా రీడిజైన్ చేసిన అలోయ్ వీల్స్ ను ఇది కలిగి ఉండబోతుంది.  
ఇంజిన్..
గరిష్ట పవర్ 83బీహెచ్పీ, 115ఎన్ఎం గరిష్ట టర్క్ ఉత్పత్తిచేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను ఇది కలిగి ఉందట. అదేవిధంగా 74బీహెచ్పీ పీక్ పవర్, 190ఎన్ఎం పీక్ టర్క్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ మల్టి-జెట్ ఇంజిన్ తో దీన్ని రూపొందించిందని తెలిసింది
ట్రాన్స్మిషన్..
ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది కలిగి ఉందట. 
ఫీచర్లు..
టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే/  ఆండ్రాయిడ్ ఆటో బ్లూటూత్, యూఎస్బీ, అక్స్-ఇన్. 
ధర.. బేస్ ధర ఆరు లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ధర తొమ్మిది లక్షల వరకు ఉండొచ్చని  అంచనాలు వెలువడుతున్నాయి. హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్లిప్ట్, న్యూ టాటా టిగోర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, ఫోక్స్ వాగన్ అమియోలకు గట్టిపోటీనే ఇచ్చేందుకు ఇది లాంచింగ్ కు సిద్ధమైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement