Maruti suzuki
-
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్‌తో కూడిన డిజిటల్ కాక్‌పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్డ్ గ్లాస్ సన్‌రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్‌తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025 -
మారుతి సుజుకి 'ఈ ఫర్ మీ' స్ట్రాటజీ: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు అదే
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' (MSIL) తన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్ట్రాటజీ 'ఈ ఫర్ మీ' (e For Me) ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా.. ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి కూడా తీసుకురానుంది. ఇందులో భాగంగానే సంస్థ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విటారా (e Vitara) ప్రారంభించనుంది.కంపెనీ లాంచ్ చేయనున్న మారుతి గ్రాండ్ ఈ విటారా.. 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025' ((Bharat Mobility Global Auto Show 2025)) లో కనిపించనుంది. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. దీని ఉత్పత్తిని సంస్థ తన గుజరాత్ ప్లాంట్‌లో 2025 మార్చి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏడాది తరువాత మారుతి సుజుకి.. తన ఎలక్ట్రిక్ విటారాను యూరప్, జపాన్లలో కూడా ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇ ఫర్ మీ అనేది భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ పరివర్తనలో ఒక గొప్ప క్షణాన్ని సూచిస్తుంది. మారుతి సుజుకి నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశానికి విశ్వసనీయ మొబిలిటీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, నేడు.. కస్టమర్ల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీకి విప్లవాత్మక విధానాన్ని పరిచయం చేస్తున్నామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ అన్నారు.మారుతి ఈ విటారాప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విభాగంలో ఇప్పటి వరకు కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు మొదటిసారి.. గ్రాండ్ విటారాను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?ఈ విటారా భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో భారత్‌లోకి అరంగేట్రం చేస్తుందని, కొంతకాలం తర్వాత దాని లాంచ్ అవుతుందని సమాచారం. కాజీ ఈ కారు 49 కిలోవాట్, 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది. ఈ కార్ల ఉత్పత్తి భారతదేశంలో జరిగినప్పటికీ.. ఎగుమతులు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతాయి. మారుతి సుజుకి న్యూఢిల్లీలోని భారత్ మండపం, హాల్ నంబర్ 5 వద్ద తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇది మాత్రమే కాకుండా.. సంస్థ డిజైర్, స్విఫ్ట్, ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బ్రెజ్జా వంటి లేటెస్ట్ మోడల్స్ కూడా ప్రదర్శించనుంది. రెండేళ్లకో సారి జరిగే ఈ ఆటో షోలో.. దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా విదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఇందులో బీవైడీ వంటి చైనా కంపెనీలు, జపాన్, జర్మనీ కంపెనీలు.. భారతీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలన్నీ కనిపించనున్నాయి. వాహన ప్రేమికులను ఆకర్శించనున్నాయి. -
2025 ఆటో ఎక్స్‌పోలో ‘ఈ–విటారా’
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది (2025) జరగబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారాను ప్రదర్శించే ప్రణాళికల్లో ఉంది. ఇటీవలే దీన్ని ఇటలీలో ఆవిష్కరించింది. వాహన రంగంలో దశాబ్దాల అనుభవంతో అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. మరోవైపు, సమగ్రమైన ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ డీలర్íÙప్లు, సరీ్వస్ టచ్ పాయింట్లలో ఫాస్ట్ చార్జర్ల నెట్వర్క్, హోమ్ చార్జింగ్ సొల్యూషన్స్ మొదలైనవి వీటిలో ఉంటాయని వివరించారు. సరైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్ద అవరోధంగా ఉంటోందని బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈవీలను మ రింత అదుబాటులోకి తెచ్చేందు కు, విస్తృత స్థాయిలో కస్టమర్లకు ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
8 వేల మారుతీ సుజుకీ సర్వీసింగ్ కేంద్రాలు
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్ పాయింట్‌ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్ టచ్పాయింట్ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్ సెంటర్‌ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్ టచ్పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్ టచ్పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది. -
జిమ్నీ కార్లు వెనక్కి.. మారుతి సుజుకి కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన జిమ్నీ ఆఫ్-రోడర్ కారుకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయించిన అన్ని వేరియంట్లు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి.మారుతి సుజుకి జిమ్నీ కారు 80 కిమీ వేగంతో వెళ్తున్న సమయంలో బ్రేక్ వేస్తే వైబ్రేషన్స్ వస్తున్నట్లు, వేగం 60 కిమీకి తగ్గితే ఈ వైబ్రేషన్ పోతుందని చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ ఈ సమస్యను పరిష్కరించుడనికి రీకాల్ ప్రకటించింది. కారులో సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది.మారుతి సుజుకి దేశీయ విఫణిలో.. ఆఫ్-రోడ్ విభాగంలో కూడా తన హవాను చాటుకోవడానికి, 'మహీంద్రా థార్'కు ప్రత్యర్థిగా నిలువడానికి జిమ్నీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ప్రారంభంలో ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందినప్పటికీ.. క్రమంగా అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కారు కొంత చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే కూడా ధర కొంత ఎక్కువగా ఉండటం అనే తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..మారుతి జిమ్నీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్.. 104.8 పీఎస్ పవర్, 134.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' జనవరి 2025లో తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు.. నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోడల్ వారీగా ధర పెరుగుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.మారుతి తన కొత్త కార్లను నెక్సా & అరేనా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా అవుట్లెట్లలో ఇగ్నీస్, బాలెనొ, సియాజ్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఇన్విక్టో కార్లను విక్రయిస్తోంది. అరేనా అవుట్లెట్ల ద్వారా ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, ఈకో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా కార్లను విక్రయిస్తోంది.మారుతి సుజుకి కొత్త ధరలను 2025 జనవరి నుంచే ప్రారంభించనుంది. ధరల పెరుగుదల.. కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సేల్స్ వచ్చే ఏడాదిలో ఎలా ఉండనున్నాయనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.వాహనాల ధరలను పెంచిన సంస్థల జాబితాలో ఇప్పటికే హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, నిస్సాన్ మోటార్ వంటి కంపెనీలు చేరాయి. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి కూడా ఈ జాబితాలోకి చేరింది. -
రోజుకు 1000 మంది కొన్న కారు ఇదే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన 4వ తరం డిజైర్ కోసం రోజుకు 1,000 బుకింగ్స్ పొందుతోంది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది కస్టమర్లు మొదటి రెండు వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు సమాచారం.నవంబర్ 11న డిజైర్ బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి.. మొత్తం 30వేల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా సంస్థ 5000 మందికి ఈ కొత్త కారును డెలివరీ చేసింది.LXi, VXi, ZXi & ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి డిజైర్ ధరలు రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉన్నాయి. ఎక్కువమంది జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ కార్లను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో 61% వాటాను కలిగి ఉంది.అమ్మకాల్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్, సుజుకి కనెక్ట్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. -
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్‌లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్‌లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్‌లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఎస్‌యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
30 లక్షల యూనిట్లు ఎగుమతి!
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్లలో మూడు రెట్లు..భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్ డిమాండ్ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతిప్రస్తుతం కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్‌లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్గా నిలవడం విశేషం. -
100 దేశాలు 17 కార్లు.. అగ్రరాజ్యాల్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' ఎట్టకేలకు 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసింది. భారతదేశంలో ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన ఏకైక కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.1986 నుంచి తమ వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించిన మారుతి సుజుకి.. ప్రారంభంలో 500 కార్లను ఎగుమతి చేసింది. 2013 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 లక్షల యూనిట్లను విజయవంతంగా ఎగుమతి చేయగలిగింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు (FY21) మరో 10 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయి. మరో 10 లక్షల కార్లను కంపెనీ ఎగుమతి చేయడానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా మారుతి సుజుకి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు స్పష్టమైంది.కంపెనీ ఎగుమతి చేసిన కార్లలో సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో మొదలైన కార్లు ఉన్నాయి. నేడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం వాహనాల్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ వంటివి కంపెనీకి ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఎగుమతుల్లో కంపెనీ సాధించిన విజయానికి మారుతి సుజుకి ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
మారుతి సుజుకి డిజైర్ కారును ఆవిష్కరించిన జబర్దస్త్ వర్ష (ఫొటోలు)
-
వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..
మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గవ తరం 'డిజైర్' కారును భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును నాలుగు ట్రిమ్‌లలో రూ.6.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. ఇప్పటికే సంస్థ ఈ సెడాన్ కోసం రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది.2024 డిజైర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇతర మారుతి కార్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా ఇప్పటికే మారుతి డిజైర్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్కొత్త డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ పొందిన ఈ మారుతి డిజైర్ కారు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా ఇది 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే..
భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా అగ్రగామిగా ఉన్న 'మారుతి సుజుకి' ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ టయోటాతో కలిసి 'ఈవీఎక్స్' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.టయోటా కిర్లోస్కర్ మోటార్, మారుతి సుజుకి ఇండియా రెండూ కలిసి మొదటి ఎలక్ట్రిక్ కారును 2025లో ఈవీఎక్స్ కారును లాంచ్ చేయనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును గుజరాత్‌లోని తయారీ కర్మాగారంలో ఉత్పత్తి చేయనుంది.మారుతి సుజుకి తయారీ కర్మాగారం.. గుజరాత్ హన్సల్పూర్లో ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ప్రస్తుతం ఇక్కడ బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్ వంటి మోడల్‌లు తయారవుతున్నాయి. ఈ కార్లను సంస్థ దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలుమారుతి సుజుకి లాంచ్ చేయనున్న కొత్త ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ నుంచి 550 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈవీఎక్స్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందనున్నట్లు సమాచారం. లాంచ్‌కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. -
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్‌మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్‌టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
ఒకేచోట కోటి కార్లు: మారుతి సుజుకి సరికొత్త రికార్డ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్‌లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్‌లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్‌లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పుజపాన్కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం. -
అమ్మకాల్లో అరుదైన రికార్డ్!.. అప్పుడే 2 లక్షల మంది కొనేశారు
ఏప్రిల్ 2023లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కేవలం 17 నెలల్లో రెండు లక్షల అమ్మకాలను చేరుకుంది. మార్కెట్లో అడుగుపెట్టిన మొదటి 10 నెలల్లో 100000 యూనిట్లు.. మరో నాలుగు నెలల్లో 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 14 నెలల్లోనే 1.50 లక్షల సేల్స్ మైలురాయిని చేరుకుంది.1.50 లక్షల సేల్స్ సాధించిన తరువాత.. మరో మూడు నెలల్లో 50వేల విక్రయాలను పొందింది. అంటే మొత్తం 17 నెలల్లో రెండు లక్షలమంది కస్టమర్లను ఆకర్శించి అమ్మకాల్లో అరుదైన ఘనతను సాధించింది.ఇదీ చదవండి: కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయంమారుతి ఫ్రాంక్స్ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న మారుతి ఫ్రాంక్స్.. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ (ఓ), జీటా, ఆల్ఫా అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ CNG, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇవన్నీ ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ వచ్చేసింది: ధర ఎంతంటే?
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన 14వ సీఎన్జీ కారుగా 'స్విఫ్ట్'ను లాంచ్ చేసింది. దీంతో స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరలు రూ. 8.20 లక్షలు. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 90వేలు ఎక్కువ కావడం గమనార్హం.మారుతి స్విఫ్ట్ సీఎన్జీ కారు 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్జీలో ప్రయాణించేటప్పుడు 69 బీహెచ్పీ, 102 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోలుతో నడిచేటప్పుడు 80.4 బీహెచ్పీ, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!చూడటానికి సాధారణ స్విఫ్ట్ మాదిరిగా కనిపించే ఈ కొత్త సీఎన్జీ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 60:10 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది. కాబట్టి లగేజ్ కొంత ఎక్కువగా తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. -
మారుతీ ఈవీ రేంజ్ 500 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తొలి ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రోడ్లపై పరుగుతీయనుంది. ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో ఈ కారును రూపొందిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీని పొందుపరుస్తున్నట్టు సియామ్ సమావేశంలో చెప్పారు. ఇలాంటి పలు ఈవీ మోడళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. యూరప్, జపాన్ తదితర దేశాలకు ఈ ఈవీని ఎగుమతి చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ విపణిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతోపాటు మారుతీ తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని భావిస్తోంది. 2030 నాటికి ఎగుమతులను మూడు రెట్లు పెంచుకునే యోచనలో ఉన్నట్లు టాకేయూచీ తెలిపారు. కంపెనీ ఇప్పటికే కొన్ని వాహనాలను జపాన్‌కి కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ షో సందర్భంగా తొలి ఈవీని ఆవిష్కరిస్తామని మారుతీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక వసతుల ఏ ర్పాటు, రీసేల్ మార్గాలను కలిగి ఉండటం వంటి ఇతర కీలక అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు. -
మారుతి సుజుకి చిన్న కార్ల ధరలు తగ్గింపు
మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మోడళ్లలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా ఉన్న మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ (S-Presso LXI) పెట్రోల్ మోడల్‌పై రూ.2,000, ఆల్టో కే10 వీఎక్స్ఐ (Alto K10 VXI) పెట్రోల్ వేరియంట్‌పై రూ. 6500 మారుతి సుజుకి తగ్గించింది.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్‌షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఇక మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.తగ్గిన విక్రయాలుఈ ఏడాది ఆగస్ట్‌లో మారుతి సుజుకి మొత్తం వాహన విక్రయాలు 3.9 శాతం తగ్గాయి. ఈ ఆగస్టు నెలలో 181,782 యూనిట్లను విక్రయించగా గతేడాది ఇదే నెలలో 189,082 యూనిట్లను విక్రయించింది. వీటిలో స్థానిక మార్కెట్ విక్రయాలు 145,570 యూనిట్లు కాగా, ఎగుమతులు 26,003 యూనిట్లుగా ఉన్నాయి.ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో అమ్మకాలు గతేడాది ఆగస్ట్‌లో 84,660 ఉండగా ఈ ఆగస్ట్‌లో 68,699కి తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20% తగ్గి 58,051 యూనిట్లకు పడిపోయాయి.గత సంవత్సరం ఇదే నెలలో ఇవి 72,451 యూనిట్లుగా ఉన్నాయి. -
భారత్‌లో ఎప్పటికీ చిన్నకార్లదే హవా
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో చిన్న కార్లకు డిమాండ్ పుంజుకుంటుందని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. భారత ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తక్కువ ధరకు లభించే చిన్న కార్లు అవసరమని విశ్వసిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘చిన్న కార్ల డిమాండ్‌లో తాత్కాలికంగా ప్రస్తుతం డిమాండ్ తగ్గింది. అయితే ఇది కంపెనీ వ్యూహాన్ని మార్చబోదు. స్కూటర్ వాడుతున్న వారు దేశంలో భారీ సంఖ్యలో ఉన్నారు. సమీప భవిష్యత్తులో వీరు కార్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సురక్షిత, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను వారు కోరుకుంటున్నారు. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండే చిన్న కార్లకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. భారత్‌లో పెద్ద, విలాసవంత వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో విక్రయాలు, సేవా నెట్‌వర్క్‌ను కంపెనీ మరింత బలోపేతం చేస్తోంది’ అని తెలిపారు.ఆరు ఈవీ మోడళ్లు..కంపెనీ నుంచి ఆరు ఎలక్ట్రిక్ మోడళ్లు 2030–31 నాటికి భారత్‌లో రంగ ప్రవేశం చేస్తాయని భార్గవ వెల్లడించారు. ‘కొన్ని నెలల్లోనే భారత్‌లో మారుతీ సుజుకీ తొలి ఈవీ రానుంది. ఈ కార్లను యూరప్, జపాన్‌కు ఎగుమతి చేస్తాం. 2030–31 నాటికి 40 లక్షల యూనిట్లకు తయారీ సామర్థ్యం పెంచుకుంటాం. 7.5–8 లక్షల యూనిట్లు ఎగుమతి చేస్తాం. 2024–25లో 3 లక్షల యూనిట్లు ఎగుమతులు జరగొచ్చు. హరియాణాలో 10 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రూ.18,000 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంటులో 2025–26లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. -
మారుతీ సుజుకీ నెక్సా విస్తరణ
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నెక్సా ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెంగళూరులో 500వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో 100 కేంద్రాలు చిన్న నగరాల్లో రానున్నాయని వెల్లడించింది. నెక్సా సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు చాలా దూకుడుగా ప్లాన్ చేశామని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెద్ద ఎత్తున వెళ్లాలన్నది తమ ప్రణాళిక అని వెల్లడించారు. నెక్సాలో లభించే మోడళ్లకు ఈ నగరాల నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నొబుటాకో సుజుకీ కూడా పాల్గొన్నారు.నెక్సా వాటా 37 శాతం.. మారుతీ సుజుకీ 2015 జూలైలో నెక్సా ఔట్లెట్లకు శ్రీకారం చుట్టింది. ఏడాదిలోనే 94 నగరాల్లో 100 నెక్సా షోరూంలను నెలకొలి్పంది. ప్రస్తుతం ఇగ్నిస్, బలీనో, ఫ్రాంక్స్, సియాజ్, జిమ్నీ, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా, ఇని్వక్టో మోడళ్లను నెక్సా షోరూంలలో కంపెనీ విక్రయిస్తోంది. సంస్థ మొత్తం విక్రయాల్లో నెక్సా వాటా 37 శాతం ఉంది. 2023–24లో 54 శాతం వృద్ధితో నెక్సా షోరూంల ద్వారా 5.61 లక్షల కార్లు రోడ్డెక్కాయి. నెక్సా స్టూడియో పేరుతో చిన్న కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సంస్థ ఖాతాలో అరీనా, నెక్సా, కమర్షియల్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం 3,925కు చేరుకుంది. ఇవి దేశవ్యాప్తంగా 2,577 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. -
మారుతి సుజుకి ఇండియాకు షోకాజ్ నోటీసు
ప్రముఖ వాహన తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి' రూ.3.81 కోట్లకు పైగా డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కస్టమ్స్ అథారిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కంపెనీ ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ కస్టమ్స్ (దిగుమతి), కమీషనర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసును అందుకుంది.ఈ షోకాజ్ నోటీసులో.. నిర్దిష్ట కేటగిరీ వస్తువుల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి & వడ్డీ, జరిమానాతో పాటు రూ.3,81,37,748 డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించడానికి గల కారణాలను అందించాల్సిందిగా అధికార యంత్రాంగం కంపెనీని కోరింది. -
ఆల్టో కే10 కార్లకు రీకాల్.. మారుతి సుజుకి కీలక నిర్ణయం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకి) 2,555 యూనిట్ల ఆల్టో కే10 కార్లకు రీకాల్ ప్రకటించచింది. స్టీరింగ్ గేర్ బాక్స్‌లో లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.స్టీరింగ్ గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్య వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కంపెనీ భావిస్తోంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేసేవరకు వాహనదారులు కార్లను డ్రైవ్ చేయవద్దని సంస్థ ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బాధిత వాహన యజమానులను మారుతి సుజుకి అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లు సంప్రదిస్తాయని కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో & 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్లను మార్చిలో రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఇప్పుడు ఆల్టో కే10 కోసం రీకాల్ ప్రకటించింది. -
తక్కువ ధరలో కార్లు.. దిగ్గజ కంపెనీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కువమంది ప్రజలు సరసమైన కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇండియా బడ్జెట్ కార్లను తయారు చేయడానికి సన్నద్ధమవుతోందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.మార్కెట్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది. దేశ ఆర్థిక స్థితిని తీర్చడానికి.. పౌరులు సురక్షితమైన & సౌకర్యవంతమైన కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో తక్కువ ధరలో చిన్న కార్లను తయారు చేయడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుందని భార్గవ పేర్కొన్నారు.ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ ప్రస్తుతం మంచి వృద్ధిని కనపరిచింది. అయినప్పటికీ ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో మారుతి సుజుకి విక్రయాలు 2,22,193 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన కార్లు 2,54,973 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు 12.8 శాతం తగ్గుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నట్లు భార్గవ పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలకు చేరుకోవడంలో మారుతి సుజుకి గణనీయమైన వృద్ధి సాధించింది. కంపెనీ సర్వీస్ కూడా అద్భుతంగా ఉందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. మా అమ్మకాలు మొత్తంలో 46 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయని అన్నారు.మారుతి సుజుకి ఇప్పటి వరకు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు. కానీ త్వరలోనే కంపెనీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ విభాగంలో కూడా సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ విభాగంలో లాంఛ్ అయ్యే మొదటికారు ఈవీఎక్స్ (eVX) అని తెలుస్తోంది.