భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే కార్ బ్రాండ్లలో ఒకటైన 'మారుతి సుజుకి' దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, అప్డేటెడ్ ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. CNG విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ త్వరలో తన బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యువిని ఈ విభాగంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.
బుకింగ్ ప్రైస్ & డెలివరీలు:
మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త బ్రెజ్జా సిఎన్‌జి కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తే ఇది మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా డెలివరీలు ప్రారంభం కావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 2023 Royal Enfield 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా)
వేరియంట్స్:
మొదటి సారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ సిఎన్‌జి వెర్షన్ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విడుదల కానుంది అవి LXI, VXI, ZXI, ZXI+. ఈ మోడల్ ఇతర మారుతి సిఎన్‌జి కార్ల మాదిరిగా కాకుండా.. ICE బేస్డ్ వెర్షన్ మాదిరిగా అన్ని ట్రిమ్‌లలో అందుబటులో ఉంటుంది. కాగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలయ్యే మొదటి సిఎన్‌జి బ్రెజ్జా కావడం విశేషం.
డిజైన్ & ఫీచర్స్:
మారుతి బ్రెజ్జా సిఎన్‌జి చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది సిఎన్‌జి అని గుర్తించడానికి ఇందులో S-CNG బ్యాడ్జ్ చూడవచ్చు. బూట్‌లో సిఎన్‌జి ట్యాంక్ అమర్చబడి ఉండటం వల్ల స్పేస్ తక్కువగా ఉంటుంది.
ఇక ఫీచర్స్ విషయానికీ వస్తే, ఇందులో స్మార్ట్‌ప్లే ప్రో+తో కూడిన 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌డేట్‌లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టార్ట్/స్టాప్ బటన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్:
కంపెనీ బ్రెజ్జా సిఎన్‌జి గురించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు, కానీ ఇది ఇప్పటికే విక్రయించబడుతున్న ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగా 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 100 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్‌జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.
(ఇదీ చదవండి: NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!)
ధర & ప్రత్యర్థులు:
మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా సిఎన్‌జి ధరలను అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది దాని పెట్రోల్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. కావున దీని ధర రూ. 8.19 లక్షల నుంచి రూ. 13.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది.
భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో విక్రయాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment