CNG
-
ఎక్కువ మైలేజ్ కోసం.. ఇవిగో బెస్ట్ సీఎన్జీ కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్ కారు కంటే సీఎన్జీ కారు కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. తమ వాహనాలను సీఎన్జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 9 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ (Maruti Suzuki Fronx CNG)మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే.. కంపెనీ తన ఫ్రాంక్స్ కారును సీఎన్జీ రూపంలో లాంచ్ చేసింది. చూడటానికి సాధారణ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఈ కారు ధర రూ. 8.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1197 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది 28.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG)భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటి, ఎక్కువ అమ్ముడైన మైక్రో ఎస్యూవీ టాటా పంచ్. ఇది మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ టాటా పంచ్ సీఎన్జీ 26.99 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర అనేది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ (Hyundai Exter S CNG)రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ సీఎన్జీ కార్లలో.. హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ కూడా ఉంది. దీని ధర రూ. 8.43 లక్షలు. ఇది 27.1 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. మైలేజ్ సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువ. -
ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ స్కూటర్ (ఫొటోలు)
-
ప్రపంచంలోనే.. మొట్ట మొదటి సీఎన్జీ స్కూటర్ ఇదే
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ (ఫ్రీడమ్ 125) లాంచ్ చేస్తే.. టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ మొదటి సీఎన్జీ స్కూటర్(జూపిటర్)ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. ఇది ఫ్రీడమ్ 125 మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీలతో నడుస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ (TVS Jupiter CNG) స్కూటర్ చూడటానికి జుపీటర్ 125 మాదిరిగా ఉన్నప్పటికీ.. ముందుభాగంలో కనిపించే CNG స్టిక్కర్ దానిని సీఎన్జీ స్కూటర్‌గా గుర్తించడానికి సహాయపడుతుంది. 1.4 కేజీ కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్.. స్కూటర్ సీటు కింద ఉంటుంది. కాగా ఇందులోని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6000 rpm వద్ద 7.2 హార్స్ పవర్, 5500 rpm వద్ద 9.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ 226 కిమీ మైలేజ్ (సీఎన్జీ + పెట్రోల్) ఇస్తుందని సమాచారం. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80.5 కిమీ కావడం గమనార్హం. స్టాండర్డ్ జూపిటర్ మాదిరిగానే.. సీఎన్జీ స్కూటర్ కూడా డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, యూఎస్బీ ఛార్జర్, స్టార్ట్ / స్టాప్ టెక్ వంటివన్నీ పొందుతుంది. కంపెనీ తన సీఎన్జీ స్కూటర్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది సాధారణ జూపిటర్ ధర కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థలు, తమ కార్లను సీఎన్జీ విభాగంలో లాంచ్ చేశాయి. ఈ కథనంలో రూ.8 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం.టాటా పంచ్అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచిన టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ విభాగంలో.. ఓ సరసమైన కారుగా లభిస్తోంది. ఇది ప్యూర్, అడ్వెంచర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 7.22 లక్షలు, రూ. 7.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఫ్యూయెల్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో సీఎన్జీ బ్యాడ్జెస్ చూడవచ్చు.టాటా పంచ్ సీఎన్జీ కారులో 3.5 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫోర్ స్పీకర్ ఆడియో సెటప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ సీఎన్జీ కారు 6000 rpm వద్ద 72.4 Bhp పవర్, 3250 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఇది పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ కారు ప్రారంభ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ (రూ. 5.92) వేరియంట్ ప్రారంభ ధర కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇది 68 బీహెచ్పీ పవర్, 95.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్ 6000 rpm వద్ద 72.4 Bhp, 3500 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో 4 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.హ్యుందాయ్ ఆరాహ్యుందాయ్ ఆరా సీఎన్జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ రెండు కలర్ ఆప్షన్స్ పొందుతాయి. ఇందులోని ఇంజిన్ 68 Bhp, 95.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ రియర్ సీటు హెడ్రెస్ట్ వంటివి ఉన్నాయి.మారుతి సుజుకి సెలెరియోమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.73 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 5300 rpm వద్ద 55.9 Bhp పవర్.. 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. -
ఒక్కసారిగా పెరిగిన సీఎన్జీ ధరలు..
సాధారణంగా పెట్రోల్, డీజల్ ధరలే ప్రజలకు షాకిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. కేజీ సీఎన్జీ ధర ఉన్నట్టుండి.. ఏకంగా రెండు రూపాయల పెరిగింది.ముంబైతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు పెరిగాయి. అయితే ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరగలేదని సమాచారం. దీనికి కారణం దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే అని తెలుస్తోంది. కాబట్టి ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ. 75.09 వద్ద ఉంది.ధరల పెరుగుదల తరువాత ముంబైలో కేజీ సీఎన్జీ 77 రూపాయలు దాటేసింది. నోయిడా, ఘజియాబాద్‌లలో కేజీ సీఎన్జీ ధరలు వరుసగా రూ. 81.70, రూ. 82.12గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోలిస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సీఎన్జీ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికఎన్నికలు ముగియడంతో.. ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) ముంబై, పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలను కిలోపై రూ. 2 చొప్పున పెంచినట్లు వెల్లడించింది. గత రెండు నెలలుగా ధరలను పెంచని అదానీ టోటన్ గ్యాస్ కూడా సీఎన్జీ రేటును పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ ధర రూ. 96వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్‌లోనే సీఎన్జీ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
1974 మందికి మాత్రమే ఈ కారు: దీని రేటెంతో తెలుసా?
పోర్స్చే 911 టర్బో 50 ఇయర్స్ ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి వచ్చేసింది. దీని ధర రూ. 4.05 కోట్లు (ఎక్స్ షోరూమ్). పేరుకు తగినట్లుగా ఈ కారు 50వ యానివెర్సరీ సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం 1974 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి, కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో విక్రయించడానికి సిద్ధమైంది.కొత్త పోర్స్చే టర్బో 50 ఇయర్స్ అనేది టర్బో ఎస్ కంటే రూ.7 లక్షలు ఎక్కువ. ఇది కేవలం టూ డోర్స్ మోడల్. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డయల్‌లు పొందుతుంది. బయట, లోపల భాగాలూ చాలా వరకు ఒకేరంగులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజంపోర్స్చే టర్బో 50 ఇయర్స్ 3.7 లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 650 హార్స్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.7 సెకన్లలో ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిమీ వరకు ఉంది. ఈ కారు 1974లో ప్రారంభించిన ఒరిజినల్ 930 టర్బో కంటే రెండు రేట్లు ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
రెనో సీఎన్జీ వేరియంట్స్ వస్తున్నాయ్..
చెన్నై: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో సీఎన్జీ వేరియంట్లను త్వరలో పరిచయం చేయనుంది. తొలుత ట్రైబర్, కైగర్ ఆ తర్వాత క్విడ్ సీఎన్జీ రానున్నాయి. కొన్ని నెలల్లో కంపెనీ ప్రవేశపెట్టదలచిన ఆరు కొత్త మోడళ్ల కంటే ముందే ఈ సీఎన్జీ వేరియంట్లు దర్శనమీయనున్నాయని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు.భారత్‌లో 2023లో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వెహికిల్స్ 5.24 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ సంఖ్య 4.8 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. కాగా, కంపెనీ విడుదల చేయనున్న మోడళ్లలో సరికొత్త బి–సెగ్మెంట్ ఎస్యూవీ, సి–సెగ్మెంట్ ఎస్యూవీ, రెండు ఈవీలతోపాటు ఆధునీకరించిన ట్రైబర్, కైగర్ ఉన్నాయి.రెనో ఇండియా ప్రత్యేక ఫీచర్లతో ట్రైబర్, కైగర్, క్విడ్ మోడళ్లలో నైట్ అండ్ డే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను బుధవారం ప్రవేశపెట్టింది. లిమిటెడ్ ఎడిషన్‌లో 1,600 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచామని వెంకట్రామ్ తెలిపారు. గతేడాది మాదిరిగానే 2024లో 53,000 యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని రెనో ఇండియా అంచనా వేస్తోంది. -
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ వచ్చేసింది: ధర ఎంతంటే?
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన 14వ సీఎన్జీ కారుగా 'స్విఫ్ట్'ను లాంచ్ చేసింది. దీంతో స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరలు రూ. 8.20 లక్షలు. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 90వేలు ఎక్కువ కావడం గమనార్హం.మారుతి స్విఫ్ట్ సీఎన్జీ కారు 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్జీలో ప్రయాణించేటప్పుడు 69 బీహెచ్పీ, 102 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోలుతో నడిచేటప్పుడు 80.4 బీహెచ్పీ, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!చూడటానికి సాధారణ స్విఫ్ట్ మాదిరిగా కనిపించే ఈ కొత్త సీఎన్జీ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 60:10 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది. కాబట్టి లగేజ్ కొంత ఎక్కువగా తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. -
సీఎన్జీ విభాగంలోకి మరో వెహికల్!.. లాంచ్ ఎప్పుడంటే?
ఇటీవల బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసింది. ఈ తరుణంలో టీవీఎస్ కంపెనీ కూడా ఈ విభాగంలో స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ 2025 నాటికి మార్కెట్లో జుపిటర్ సీఎన్జీ స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.టీవీఎస్ కంపెనీ తన జుపిటర్ స్కూటర్‌ను సీఎన్జీ రూపంలో లాంచ్ చేయడానికి యూ740 పేరుతో ఓ ప్రాజెక్ట్ ప్రారంభించింది. రాబోయే ఈ స్కూటర్ 125 సీసీ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. టీవీఎస్ జుపిటర్ సీఎన్జీ ఈ ఏడాది చివరినాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.టీవీఎస్ సీఎన్జీ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత నెలకు సుమారు 1000 యూనిట్లను విక్రయించనున్నట్లు సమాచారం. వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ లాంచ్ చేయనున్న ఈ సీఎన్జీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వాహనదారులకు షాక్.. సీఎన్జీ ధరలు పెంపు
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన రేట్లు జూన్ 22 ఉదయం 6 గంటలకు అమల్లోకి వచ్చాయి. సీఎన్జీ ధర కేజీకి ఒక్క రూపాయి పెరిగింది. ఈ పెరుగుదల తరువాత, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎన్జీ కేజీ ధర రూ .75.09 కు చేరింది.ఈ పెరుగుదల ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో సీఎన్జీ రిటైల్ ధరలను ప్రభావితం చేయనుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సీఎన్జీ ధరలు ఒక్క రూపాయి పెరిగాయి. ఈ నగరాల్లో ఇప్పటి వరకు రూ.78.70 ఉన్న కేజీ సీఎన్జీ ధర ఇప్పుడు రూ.79.70కి చేరింది. ఇక ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో సీఎన్జీ రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతోపాటు కర్నాల్, కైతాల్లలో కూడా సీఎన్జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇతర నగరాల్లో ధరలుహర్యానాలోని రేవారీ, మీరట్, ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ, రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో కూడా నేటి నుంచి సీఎన్ జీ ధరలు పెరిగాయి. రేవారీలో సీఎన్జీ ధరలు కేజీకి రూ .78.70 నుంచి రూ .79.70 కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్, ముజఫర్ నగర్, షామ్లీలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది. రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో ఇప్పుడు సీఎన్జీ ధర ఒక రూపాయి పెరిగింది. ఇక్కడ రూ.81.94 ఉన్న కేజీ సీఎన్జీ ధర రూ.82.94కు పెరిగింది. -
సీఎన్జీ బైక్‌పై బజాజ్ ఆటో కసరత్తు
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పెట్రోల్‌తో నడిచే మోటర్‌సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్‌నకు చెందిన అన్ని సీఎస్ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది. -
పర్యావరణ హితం ప్రధానం! నాలుగేళ్లలో సగానికిపైగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 46 శాతం వృద్ధితో 48,714 యూనిట్లు రోడ్డెక్కాయి. 2023 జనవరిలో ఈ సంఖ్య 33,334 యూనిట్లు నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య దేశవ్యాప్తంగా రిటైల్‌లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు 3,64,528 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 4,75,000 యూని ట్లు దాటవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2022– 23లో 39 శాతం వృద్ధితో 3,27,820 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. తొలి స్థానంలో మారుతి.. దేశంలో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకి 69 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ ఏకంగా 13 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,51,620 యూనిట్లను విక్రయించింది. 14 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్‌కు నాలుగు సీఎన్జీ మోడళ్లు ఉన్నాయి. 2023–24 ఏప్రిల్–జనవరిలో 64,972 యూనిట్లు కస్టమర్లకు చేరాయి. మూడు సీఎన్జీ మోడళ్లతో హ్యుండై మోటార్ ఇండియా 41,806 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రస్తుతం మూడు మోడళ్లలో సీఎన్జీని ఆఫర్ చేస్తోంది. జనవరితో ముగిసిన 10 నెలల కాలంలో ఈ కంపెనీ 6,064 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నాలుగేళ్లలో సగానికిపైగా.. 2014–15లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు దేశవ్యాప్తంగా 1,48,683 యూనిట్లు పరుగుతీశాయి. 2019– 20లో కరోనా కారణంగా పరిశ్రమ 7 శాతం క్షీణించింది. 2021–22 నుంచి వీటి అమ్మకాల్లో 30 శాతంపైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇప్పటి వరకు 21,16,629 యూనిట్ల సీఎన్జీ ఆధారిత కార్లు, ఎస్‌యూవీలు కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. ఇందులో గడిచిన నాలుగేళ్లలో 52 శాతం యూనిట్లు రోడ్డెక్కాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్జీ వాహనాలతో ఖర్చు తక్కువ కాబట్టే వినియోగదార్లు వీటికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లలో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 4,500 నుంచి 8,000 కేంద్రాలకు చేర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. టాటా నుంచి పోటీ.. సీఎన్జీకి ఊతమిచ్చేలా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్ జీ వేరియంట్లను టాటా మోటార్స్ జనవరి 24న పరిచయం చేసింది. ఫ్యాక్టరీలో ఫిట్ అయిన కిట్‌తో సీఎన్ జీ వాహనాలు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో రావడం దేశంలో ఇదే తొలిసారి. సంస్థ మొత్తం అమ్మకాల్లో సీఎన్జీ వాటా 2026 నాటికి 25 శాతానికి చేర్చాలని టాటా లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా నెక్సన్ సీఎన్జీ వేరియంట్ తీసుకొస్తోంది. 2022–23 ఏప్రిల్–జనవరిలో టాటా మోటార్స్ 36,963 యూని ట్ల అమ్మకాలను సాధించి మూడవ స్థానంలో ఉంది. 2024 జనవరితో ముగిసిన 10 నెలల్లో 64,972 యూనిట్లతో రెండవ స్థానానికి దూసుకు వచ్చింది. పర్యావరణహిత వాహనాలపై కంపెనీల దృష్టి భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో వెల్లడి దేశీయంగా ఆటోమొబైల్ దిగ్గజాలు పర్యావరణహిత వాహనాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఎగ్జిబిషన్లో పలు వాహనాలను ప్రదర్శించాయి. వీటిలో సీఎన్జీ, హైబ్రిడ్స్ మొదలుకుని ఎలక్ట్రిక్ వరకు వివిధ రకాల వాహనా లు ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోట ర్ ఇండియా, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, బీఎండబ్ల్యూ మొదలైన దిగ్గజాలు వీటిని ప్రదర్శించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీఎక్స్, ఫ్లెక్స్–ఫ్యూయల్ వ్యాగన్ఆర్, హైబ్రీడ్ గ్రాండ్ విటారా.. జిమ్నీ, స్కైడ్రైవ్ ఈ–ఫ్లయింగ్ కారు మొదలైనవి ప్రదర్శించింది. ఈ ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్ ఈవీఎక్స్ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ రాహుల్ భారతి తెలిపారు. భారతీయ మొబిలిటీ రంగ ప్రాధాన్యాన్ని మొబిలిటీ ఎక్స్పో తెలియజేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఎక్స్పో విశేషాలు.. మెర్సిడెస్ బెంజ్ తమ ఆఫ్ రోడ్ జీ వాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ’కాన్సెప్ట్ ఈక్యూజీ’, జీఎల్ఏ, ఏఎంజీ జీఎల్ఈ 53 కూపే వాహనాలను ప్రదర్శించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ర్యాల్–ఈ, ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400, ఎలక్ట్రిక్ 3 వీలర్ ట్రియో మొదలైనవి ప్రదర్శనకు ఉంచింది. ఫోర్స్ మోటర్స్ .. ట్రావెలర్ ఎలక్ట్రిక్, అర్బానియా డీజిల్, ట్రావెలర్ సీఎన్జీల వాహనాలను ప్రదర్శించింది. ప్రదర్శనలో టాటా మోటార్స్ 18 ‘ఫ్యూచర్ రెడీ‘ కమర్షియల్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూ తమ ఈవీలు, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ4, మినీ 3–డోర్ కూపర్ ఎస్ఈలను ప్రదర్శనకు ఉంచింది. -
2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే!
దేశీయ విఫణిలో కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను CNG కార్లుగా రూపొందించి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ కథనంలో 2023లో లాంచ్ అయిన బెస్ట్ సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం. మారుతి గ్రాండ్ విటారా సీఎన్జీ (Maruti Grand Vitara CNG) ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 'సుజుకి గ్రాండ్ వితారా'.. ఏప్రిల్ 2023న సీఎన్జీ కారుగా అడుగుపెట్టింది. 1.5 లీటర్ కె15సీ ఇంజిన్ కలిగిన ఈ కారు 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ మోడల్ కేవలం సిటీ డ్రైవింగ్‌కు మాత్రమే కాకుండా హైవేలలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి బ్రెజ్జా సీఎన్జీ (Maruti Brezza CNG) దేశీయ విఫణిలో లాంచ్ అయిన మరో మారుతి CNG కారు బ్రెజ్జా. 2023 'మే'లో విడుదలైన ఈ కారు డిజైర్ సీఎన్జీ మాదిరిగానే 1.5 లీటర్ కె12సీ ఇంజిన్ కలిగి 20.15 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సరసమైన ధర వద్ద లభిస్తున్న బెస్ట్ CNG కార్లలో ఒకటిగా ఉంది. టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG) దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 'పంచ్' మైక్రో SUV కూడా జూన్ 2023న CNG కారుగా లాంచ్ అయింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు 73 పీఎస్ పవర్, 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.2 లీటర్ 3 సిలినార్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.5 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ (Hyundai Exter CNG) 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన 'హ్యుందాయ్ ఎక్స్టర్' 2023 జులైలో CNG కారుగా మార్కెట్లో లాంచ్ అయింది. 1.2 లీటర్ ఫోర్ సిలినార్ ఇంజిన్ కలిగిన ఈ కారు 74 పీఎస్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోడల్ 21 కిమీ?కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ (Tata Altroz CNG) టాటా ఆల్ట్రోజ్ కూడా ఇప్పుడు మార్కెట్లో CNG కారుగా అందుబాటులో ఉంది. దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా మార్పు పొందినప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 74 పీఎస్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 25.15 కిమీ/కేజీ మైలేజ్ అందించే ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. -
జోరందుకున్న సీఎన్జీ వాహనాల అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్ రంగంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరి–సెప్టెంబర్ మధ్య 6,66,384 యూనిట్ల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 32 శాతం పెరుగుదల. 2022 జనవరి–సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 5,04,003 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో సీఎన్జీతో నడిచే త్రిచక్ర వాహనాల విక్రయాలు 81 శాతం అధికమై 2,48,541 యూనిట్లు నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాలు 9 శాతం పెరిగి 2,65,815 యూనిట్లకు చేరుకున్నాయి. సరుకు రవాణా వాహనాలు 26 శాతం క్షీణించి 60,531 యూనిట్లకు వచ్చి చేరాయి. బస్‌లు, వ్యాన్స్ 125 శాతం ఎగసి 91,497 యూనిట్లను తాకాయి. తక్కువ వ్యయం కాబట్టే.. సీఎన్జీ కేజీ ధర ప్రస్తుతం రూ.76 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82 ఉంది. డీజిల్, పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ చవకగా దొరుకుతుంది కాబట్టే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. సీఎన్జీ ఆధారిత త్రీవీలర్లు, ప్యాసింజర్ వెహికిల్స్, సరుకు రవాణా వాహనాలతోపాటు బస్‌లు, వ్యాన్స్ అన్నీ కలిపి 2022–23లో తొలిసారిగా పరిశ్రమలో 6,50,000 యూనిట్ల అమ్మకాలను దాటాయి. 2021–22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సీఎన్జీ వెహికిల్స్ విక్రయాల్లో 46 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–సెప్టెంబర్‌లో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో సీఎన్జీ ఆధారిత వాహనాల వాటా 8.8 శాతం ఉంది. ఇక సీఎన్జీ విభాగంలో ప్యాసింజర్ వెహికిల్స్ వాటా 40 శాతం, త్రిచక్ర వాహనాలు 37 శాతం కైవసం చేసుకున్నాయి. తొలి స్థానంలో మారుతీ.. సీఎన్జీ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 72 శాతం వాటాతో మారుతీ సుజుకీ ఇండియా హవా కొనసాగుతోంది. 15 మోడళ్లలో ఈ కంపెనీ సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. భారత్‌లో ఈ స్థాయిలో సీఎన్జీ వేరియంట్లు కలిగిన కంపెనీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. మారుతీ సుజుకీ 2023 జనవరి–సెప్టెంబర్‌లో 10.85 శాతం వృద్ధితో 1,91,013 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. 2020 ఏప్రిల్‌లో డీజిల్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ సంస్థ సీఎన్జీని ప్రధాన్యతగా తీసుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో హుందాయ్ మోటార్ సీఎన్జీ విక్రయాలు 10.67 శాతం క్షీణించి 35,513 యూనిట్లకు పరిమితమైంది. టాటా మోటార్స్ 13.77 శాతం ఎగసి 34,224 యూనిట్లను సాధించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 52 యూనిట్ల నుంచి ఏకంగా 4,679 యూనిట్ల అమ్మకాలను అందుకుంది. సీఎన్జీ త్రిచక్ర వాహనాల్లో బజాజ్ ఆటో 87 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉంది. పియాజియో, టీవీఎస్ మోటార్ కో, అతుల్ ఆటో, మహీంద్రా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సీఎన్జీ గూడ్స్ క్యారియర్స్ విభాగంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా, వీఈ కమర్షియల్ వెహికిల్స్, అశోక్ లేలాండ్, ఎస్ఎంఎల్ సుజుకీ వరుసగా పోటీపడుతున్నాయి. -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్‌కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్‌తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్‌తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్‌బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్‌తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్‌తో బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!
Tata CNG Cars: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పండుగ సీజన్ సందడిని స్టార్ట్ చేసింది. కొత్త కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమై పోయింది. టాటా ఒకటి కాదు ఏకంగా మూడు సీఎన్జీ కార్లను లాంచ్ చేసింది. పంచ్ i-CNG లాంచ్తోపాటు, ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టిగోర్, టియాగో సీఎన్జీని కూడా అప్డేట్ చేసింది. టాటా పంచ్ ఐ-సీఎన్జీ మైక్రో ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.7,09,900 మొదలకుని రూ.9,67,900 వరకు ఉంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో 1.2 లీటర్ రివొట్రాన్ సీఎన్జీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. పెట్రోల్, సీఎన్జీతో నడుస్తుంది. 37 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల సీఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ ఏర్పాటు ఉంది. సీఎన్జీ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్, 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కొత్త టాటా సీఎన్జీ కార్లు టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టియాగో ఐ-సీఎన్జీని విడుదల చేసింది. ధరల వారీగా, కొత్త టియాగో సిఎన్జి రూ. 7.46 లక్షలలు- రూ. 9.32 లక్షల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టాటా మునుపటి సీఎన్జీ మోడల్‌తో పోలిస్తే కేవలం 5వేలు మాత్రమే ధరను పెంచింది. -
హైదరాబాద్ మార్కెట్లో టాటా అల్ట్రోజ్ ఐసీఎన్జీ.. ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అల్ట్రోజ్ ఐసీఎన్జీ వర్షన్‌ను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్ ధర ఎక్స్‌షోరూంలో రూ.7.55 లక్షల నుంచి రూ.10.55 లక్షల వరకు ఉంది. ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో ఆరు వేరియంట్లలో ఇది రూపుదిద్దుకుంది. ట్విన్ సిలిండర్లను భద్రతా కారణాల దృష్ట్యా లగేజ్ ఏరియా కింద ఏర్పాటు చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇంధనం నింపే సమయంలో ఇంజన్ ఆఫ్ అవుతుంది. నిర్దిష్ట స్థాయిని మించి ఇంజన్ వేడెక్కితే సీఎన్జీ సరఫరా నిలిచిపోవడమేగాక గ్యాస్‌ను గాలిలోకి వదులుతుంది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఎనమిది స్పీకర్లతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆన్‌డ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. -
కార్ల అమ్మకాల వృద్ధి 7 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ: డిమాండ్ మందగించిన కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగం విక్రయాల వృద్ధి 5–7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికల్స్) శైలేష్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీపరంగా సీఎన్జీ, ఎలక్ట్రిక్ మోడల్స్‌తో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న వాహనాలను సరికొత్తగా తీర్చిదిద్దడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. కోవిడ్‌పరమైన పరిణామాలతో డిమాండ్ భారీగా పేరుకుపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో పీవీల అమ్మకాలు 27 శాతం వృద్ధి నమోదు చేశాయి. కానీ ప్రస్తుతం కొన్ని స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు తప్ప మిగతావాటికి డిమాండ్ తగ్గిందని చంద్ర పేర్కొన్నారు. కొత్త ఉద్గార ప్రమాణాలకు మారే క్రమంలో వాహనాల రేట్ల పెరుగుదల కూడా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన చెప్పారు. అయితే, రాబోయే రోజుల్లో వృద్ధి తిరిగి రెండంకెల స్థాయికి చేరగలదని ఆయన వివరించారు. తమ సంస్థ విషయానికొస్తే పంచ్‌లో సీఎన్జీ వేరియంట్‌ను తేబోతున్నామని .. కర్వ్, సియెరా వంటి వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చంద్ర చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరగబోతున్నాయని పేర్కొన్నారు. టాటా మోటర్స్ ఈ మధ్యే తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో సీఎన్జీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో డీలర్లకు రికార్డు స్థాయిలో 5.4 లక్షల వాహనాలను సరఫరా చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే హోల్‌సేల్ అమ్మకాలు 45 శాతం పెరిగాయి. -
రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహన విభాగంలోకి ప్రవేశించింది. సుప్రో సీఎన్జీ డువో పేరుతో మోడల్‌ను విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.32 లక్షలు. ఈ తేలికపాటి వాణిజ్య వాహనం సీఎన్జీ, పెట్రోల్‌తో నడుస్తుంది. 750 కిలోల బరువు మోయగలదు. 75 లీటర్ల సీఎన్జీ ట్యాంక్, 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మైలేజీ కిలోకు 23.35 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ‘సీఎన్జీ వాహనాల డిమాండ్ నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. సీఎన్జీ అవసరాన్ని ఇది సూచిస్తుంది. దేశవ్యాప్తంగా 2 టన్నులలోపు సామర్థ్యం గల తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు నెలకు 16,000 యూనిట్లు. ఇందులో సీఎన్జీ వాటా సుమారు 5,000 యూనిట్లు’ అని మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ బానేశ్వర్ బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రో సీఎన్జీ డువో రాకతో నెలవారీ అమ్మకాలు రెండింతలు అవుతాయని సంస్థ భావిస్తోంది. 1.5తోపాటు 2 టన్నుల విభాగంలోనూ రెండు రకాల ఇంధనాలతో నడిచే మోడళ్లను తేనున్నట్టు వెల్లడించింది. -
భారత్‌లో మరో సిఎన్జి కారు లాంచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్
Tata Altroz CNG: ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సిఎన్జి కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఆల్ట్రోజ్ సిఎన్జి (Altroz CNG) విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిఎన్జి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & వేరియంట్స్ టాటా మోటార్స్ విడుదల చేసిన ఆల్ట్రోజ్ సిఎన్జి ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM+, XM+ (S), XZ, XZ+ (S), XZ+ O (S) వేరియంట్లు. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 7.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.55 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). దేశీయ విఫణిలో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి సన్‌రూఫ్ కలిగిన మొదటి CNG బేస్డ్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో డ్యూయెల్ సిలిండర్ సెటప్ కలిగి ఉంటుంది, కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ఆల్ట్రోజ్ బూట్ స్పేస్ 345 లీటర్లు. డిజైన్ & ఫీచర్స్ ఆల్ట్రోజ్ CNG కారు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ దీని టెయిల్‌గేట్‌పై 'iCNG' బ్యాడ్జ్ ఇది కొత్త మోడల్ అని చెప్పకనే చెబుతుంది. బూట్ ప్లోర్ కింద రెండు సిఎన్జి ట్యాంకులు ఉంటాయి. సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ దాదాపు పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. కావున అదే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వారికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ కూడా లభిస్తాయి. XM+ (S), XZ+ (S), XZ+ O (S) వేరియంట్లలో వాయిస్ యాక్టివేటెడ్ సింగిల్-పేన్ సన్‌రూఫ్ లభిస్తుంది. కావున ఇది దాని ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో 5 డోర్ జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే) పవర్‌ట్రెయిన్ ఆల్ట్రోజ్ సిఎన్జి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 88 హార్స్ పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక సిఎన్జి మోడ్‌లో 77 hp పవర్, 103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) ప్రత్యర్థులు ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి ఇప్పటికే అమ్ముడవుతున్న మారుతి బాలెనొ సిఎన్జి, టయోటా గ్లాంజా సిఎన్జి వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఆటో ఎల్పీజీ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ మార్కెట్ క్రమంగా పర్యావరణ అనుకూల పరిష్కారాల వైపు అడుగులు వేస్తోంది. ఎక్కువ మంది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో.. ఆటోమొబైల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తర్వాత సీఎన్జీ వాహనాలకే ఎక్కువ డిమాండ్ నెలకొంది. దీంతో ఎల్పీజీ కార్ల విక్రయాలు ఐదేళ్ల కాలంలో (2018–19 నుంచి చూస్తే) 82 శాతం తగ్గిపోయాయి. 2022–23లో కేవలం 23,618 ఎల్పీజీ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ, 2018–19లో 1,28,144 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. కేంద్ర రవాణా శాఖ పరిధిలోని వాహన్ పోర్టల్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 2,22,24,702 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోతే, ఇందులో ఎల్పీజీ వాహనాలు కేవలం 0.11 శాతంగా ఉండడం వినియోగదారులు వీటి పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అదే సమయంలో సీఎన్జీ వాహన విక్రయాలు ఇందులో 3 శాతంగా ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతంగా ఉండడం, కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు తెలియజేస్తోంది. ఎగసి పడిన డిమాండ్ ఎల్పీజీ పుష్కలంగా అందుబాటులో ఉండడమే కాదు, ఎక్కువ ఆక్టేన్ కలిగి, చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఇంధనం కావడంతో.. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయ ఇంధనంగా లోగడ భావించారు. దీంతో ఎల్పీజీ కార్లు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు 2019లో ఎక్కువగా అమ్ముడుపోయాయి. కానీ, దేశంలో ఎల్పీజీ వాహనాల వినియోగం చట్టబద్ధంగా అమల్లోకి వచ్చిం ది మాత్రం 2020 ఏప్రిల్ నుంచి కావడం గమనార్హం. నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలకుతోడు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు (80 శాతానికి పైగా) 2019లో రికార్డు స్థాయి ఎల్పీజీ వాహన అమ్మకాలకు దోహదపడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ, 2022–23 సంవత్సరంలో ఎల్పీజీ వాహనాల డిమాండ్ 14 శాతానికి పరిమితమైంది. 2018–19లో ఇది 18 శాతంగా ఉంది. 2022–23లో కేవలం 3,495 ఎల్పీజీ నాలుగు చక్రాల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2018–19లో ఇలా రిజిస్టర్ అయిన నాలుగు చక్రాల వాహనాలు 23,965 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ‘‘విక్రయానంతరం ప్యాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ ఇది. 2018 నుంచి 2020 వరకు ప్యాసింజర్ వాహన విభాగమే ఎల్పీజీకి పెద్ద మద్దతుగా నిలిచింది. నిబంధనలు అనుకూలంగా లేకపోవడం, కిట్ ఆధారిత అనుమతులకు అధిక వ్యయాలు చేయాల్సి రావడం, ప్రతి మూడేళ్లకోసారి తిరిగి సరి్టఫై చేయించుకోవాల్సి రావడం, ఎల్పీజీ మోడళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆసక్తి ఆవిరైపోవడానికి కారణం’’అని ఇండియన్ ఆటో ఎల్పీజీ కొయిలిషన్ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా వివరించారు. వసతులు కూడా తక్కువే.. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కేవలం 1,177 ఎల్పీజీ స్టేషన్లే ఉన్నాయి. అదే సీఎన్జీ స్టేషన్లు అయితే 4,600 ఉంటే, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు 5,200 ఉన్నాయి. పెట్రోల్ పంపులు 80,000 పైగా ఉన్నాయి. అంటే ఎల్పీజీ విషయంలో సరైన రీఫిల్లింగ్ వసతులు కూడా లేవని తెలుస్తోంది. మరోవైపు ధరలు కూడా అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో కిలో ఎల్పీజీ ధర లీటర్‌కు రూ.68కి చేరుకోగా, 2019లో రూ.40 మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల్లో దీని ధర ఇంకా ఎక్కువే. ‘‘ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కొరవడడంతో వాహన తయారీదారులు ఎల్పీజీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేడు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అయితే ఎల్పీజీ కార్ల తయారీని నిలిపివేసింది. ప్రజలు సీఎన్జీ, ఈవీల పట్ల ఆసక్తి చూపిస్తుండడం దేశంలో ఎల్పీజీ వాహన రంగానికి గొడ్డలి పెట్టుగా మారింది’’అని పరిశ్రమకు చెందిన నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఈవీ, సీఎన్జీ వాహనాలను కేంద్రం సబ్సిడీలతో ప్రోత్సాహిస్తుండడాన్ని పరిశ్రమ ప్రస్తావిస్తోంది. -
అప్పుడే మొదలైన 'టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ' బుకింగ్స్ - పూర్తి వివరాలు
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు తన ఆల్ట్రోజ్ సిఎన్జీ కోసం రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా డెలివరీలు 2023 మే నాటికి ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & డిజైన్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి XE, XM+, XZ , XZ+. ఇది మొదటిసారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండే ఈ మోడల్ 'iCNG' బ్యాడ్జ్ పొందుతుంది. తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్లో సిఎన్జి ట్యాంక్స్ ఉంటాయి. ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథెరెట్ సీట్లు, రియర్ AC వెంట్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటివి ఉంటాయి. అంచనా ధర: దేశీయ విఫణిలో ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ప్రస్తుతం పెట్రోల్ మాన్యువల్ ధరలు రూ. 6.45 లక్షల నుంచి రూ. 9.10 లక్షల మధ్య ఉన్నాయి. కావున ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు దాని కంటే రూ. 90వేలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నాము. పవర్‌ట్రెయిన్: ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్, త్రీ-సిలిండర్ ఇంజన్ కలిగి సిఎన్జీ మోడ్‌లో 77 హెచ్‌పి పవర్ 97 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 86 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము. సేఫ్టీ ఫీచర్స్: టాటా మోటార్స్ ఇతర వాహనాలలో మాదిరిగానే ఆల్ట్రోజ్ సిఎన్జీలో కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. కావున ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్న సమయంలో CNG, PNG ధరలు తగ్గడం నిజంగా హర్షించదగ్గ విషయం. సీఎన్జీ, పీఎన్జీ కొత్త ధరలు రేపు (ఏప్రిల్ 09) ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. ధరల తగ్గుదల తరువాత నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు. ఢిల్లీ: సీఎన్జీ: కేజీ రూ. 73.59 పీఎన్జీ : ఎస్సిఎమ్ (స్టాండర్డ్ పర్ క్యూబిక్ మీటర్) రూ. 48.59 నోయిడా: సీఎన్జీ: కేజీ రూ. 77.20 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 48.46 ఘజియాబాద్: సీఎన్జీ: కేజీ రూ. 77.20 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 48.46 గురుగ్రామ్: సీఎన్జీ: కేజీ రూ. 82.62 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 47.40 కొన్ని నివేదికల ప్రకారం, రానున్న రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ వాహనాలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి విముక్తి పొందటానికి సీఎన్జీ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పాలి. (ఇదీ చదవండి: రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?) దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి, టయోటా వంటి వాహన తయారీ సంస్థలు కూడా సీఎన్జీ వాహనాలను విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాలు అధిక మైలేజ్ అందించడం వల్ల ఎక్కువ మంది ఈ కార్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న పీఎన్జీ,సీఎన్జీ గ్యాస్ ధరలు!
సహజ వాయివు (నేచురల్ గ్యాస్) ధరల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్దతిని అమలు చేసింది. చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో పీఎన్జీ, సీఎన్జీ గ్యాస్ ధరలు మరింత తగ్గన్నాయి. సాధారణంగా కేంద్రం యూఎస్, కెనడా, రష్యాతో పాటు మిగిలిన దేశాల్లో గ్యాస్ ట్రేడింగ్ హబ్ల్లోని ధరలకు అనుగుణంగా సహజ వాయివు ధరల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుతూ వచ్చేది. కానీ ఇంధనం ధరల్ని ముడిచమురు ధరలతో అనుసంధానం చేయడంతో.. ధరల్లో ప్రతినెలా మార్పులు ఉండబోతున్నాయి.. #Cabinet approves revised domestic gas pricing guidelines price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly Move to ensure stable pricing in regime and provide adequate protection to producers from adverse market fluctuation pic.twitter.com/NRONPAOzzK — Rajesh Malhotra (@DG_PIB) April 6, 2023 తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) 10 శాతం చౌకగా మారుతుందని, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర 6 శాతం నుండి 9 శాతానికి తగ్గుతుందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదంపై శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. -
భారత్‌లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు
సిఎన్జి విభాగంలో జోరుగా ముందుకు సాగుతున్న మారుతి సుజుకి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన 'బ్రెజ్జా సిఎన్జి' విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. బుకింగ్స్ & ధరలు: మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 9.14 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ఇప్పటికే అమ్మకానికి ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే రూ. 95,000 ఎక్కువ. వేరియంట్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి LXi, VXi, ZXi. వీటి ధరలు వరుసగా రూ. 9.14 లక్షలు, రూ. 10.50 లక్షలు, రూ. 11.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). టాప్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. దీని కోసం రూ. 16,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ & ఫీచర్స్: బ్రెజ్జా సిఎన్జి డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బూట్ స్పేస్‌లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటమే. ఇంటీరియర్ చాలా వరకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: 2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) పవర్‌ట్రెయిన్: కొత్త మారుతి బ్రెజ్జా సిఎన్జి అదే 1.5-లీటర్ K15C డ్యూయల్‌జెట్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 101 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఇది 25.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!) ప్రత్యర్థులు: మారుతి సిఎన్జి దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రాబోయే మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కాంపాక్ట్ SUV విభాగంలో సిఎన్జి పవర్‌ట్రెయిన్ పొందిన మొదటి కారు మారుతి బ్రెజ్జా. -
Maruti Suzuki Brezza CNG.. ఇప్పుడే బుక్ చేసుకోండి!
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే కార్ బ్రాండ్లలో ఒకటైన 'మారుతి సుజుకి' దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, అప్డేటెడ్ ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. CNG విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ త్వరలో తన బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యువిని ఈ విభాగంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బుకింగ్ ప్రైస్ & డెలివరీలు: మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త బ్రెజ్జా సిఎన్జి కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తే ఇది మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా డెలివరీలు ప్రారంభం కావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందనిపిస్తుంది. (ఇదీ చదవండి: 2023 Royal Enfield 650: రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా) వేరియంట్స్: మొదటి సారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ సిఎన్జి వెర్షన్ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విడుదల కానుంది అవి LXI, VXI, ZXI, ZXI+. ఈ మోడల్ ఇతర మారుతి సిఎన్జి కార్ల మాదిరిగా కాకుండా.. ICE బేస్డ్ వెర్షన్ మాదిరిగా అన్ని ట్రిమ్‌లలో అందుబటులో ఉంటుంది. కాగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలయ్యే మొదటి సిఎన్జి బ్రెజ్జా కావడం విశేషం. డిజైన్ & ఫీచర్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది సిఎన్జి అని గుర్తించడానికి ఇందులో S-CNG బ్యాడ్జ్ చూడవచ్చు. బూట్లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటం వల్ల స్పేస్ తక్కువగా ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికీ వస్తే, ఇందులో స్మార్ట్‌ప్లే ప్రో+తో కూడిన 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టార్ట్/స్టాప్ బటన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. పవర్‌ట్రెయిన్: కంపెనీ బ్రెజ్జా సిఎన్జి గురించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు, కానీ ఇది ఇప్పటికే విక్రయించబడుతున్న ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగా 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 100 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. (ఇదీ చదవండి: NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!) ధర & ప్రత్యర్థులు: మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా సిఎన్జి ధరలను అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది దాని పెట్రోల్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. కావున దీని ధర రూ. 8.19 లక్షల నుంచి రూ. 13.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో విక్రయాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. -
2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు నెక్ట్స్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్‌తో లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల ప్రకారం కొత్త డిజైన్, కొత్త అప్డేట్స్తో 2024 మారుతి సుజుకి డిజైర్‌ను లాంచ్ చేయనుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ చేయనున్న బ్రాండ్ లైనప్‌లో డిజైర్ మొదటి కాంపాక్ట్ సెడాన్ కానుంది. 2024 ప్రథమార్థంలో భారత మార్కెట్లో కొత్త డిజైర్‌ను విడుదల చేయాలని భావిస్తోంది కంపెనీ. రానున్న న్యూజెన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ఉంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టిపోటీగా మార్కట్లోకి ప్రవేశించనుంది. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ లీటరుకు 35కి.మీకంటే ఎక్కువ ఇంధన సామర్థ్యంతో దేశంలో అతి తక్కువ ఖరీదుతో బలమైన-హైబ్రిడ్ వాహనం డిజైర్ కానుందని అంచనా. మూడు ఇంజీన్ వేరియంట్లు 2024 డిజైర్ మూడు ఇంజన్ ఎంపికలతో లాంచ్ కానుంది. 1.2L NA పెట్రోల్ ఇంజీన్, 1.2L స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజీన్ , 1.2 లీటర్ల సీఎన్జీ (Z12E)ఇంజీన్ ఉన్నాయి. ఫీచర్లు ఎక్స్టీరియర్గా పునర్నిర్మించిన ఫ్రంట్ ఫాసియాతో పాటు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, భారీ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, మెషిన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే సౌకర్యవంతమైన క్యాబిన్, బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ కూల్డ్ స్టోరేజ్ కన్సోల్ ప్రధానంగా ఉండనున్నాయి.మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సరికొత్త సుజుకి కనెక్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపర్చనుంది. మారుతి అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి రానున్న ఈ కారు ప్రస్తుత మోడల్ పోలిస్తే రూ. 80వేలు లేదా రూ. 1 లక్ష ఎఎక్కువ ధరనిర్ణయించవచ్చని భావిస్తున్నారు. మారుతి డిజైర్ బేస్ మోడల్ ధర రూ. 6.44 లక్షలు -
సీఎన్జీ కార్ వినియోగిస్తున్నారా..? డబ్బు ఇలా ఆదా చేయండి
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సిఎన్జి, ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు. సీఎన్జీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. సీఎన్జీ కార్ వినియోగదారుడు ఖర్చుని తగ్గించి డబ్బుని ఆదా చేయడానికి ఈ కింది చిట్కాలను పాటించాలి. నీడలో పార్క్ చేయడం: ఎండలు రోజురోజుకి అధికమవుతున్నాయి, ఇలాంటి సమయంలో మీ కారుని తప్పకుండా నీడలో పార్క్ చేయాలి. సీఎన్జీ కారుని ఎండలో పార్క్ చేసినప్పుడు వేడి తీవ్రతకు కొంత సీఎన్జీ గ్యాస్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. సీఎన్జీ ఆదా చేయడానికి తప్పకుండా ఈ నియమం పాటించాలి. ఓవర్‌ఫిల్ చేయడం మానుకోవాలి: కేవలం పెట్రోల్ కార్లలో మాత్రమే కాకుండా సిఎన్జి కార్లలో కూడా ఓవర్‌ఫిల్ చేయడం మంచిది కాదు. సీఎన్జీ కారుని ఉపయోగించేటప్పుడు ట్యాంక్‌లో అదనపు సీఎన్జీ విడుదలవుతుంది. ఆ సమయంలో ఓవర్‌ఫిల్ కారణంగా కొంత నష్టం జరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవాలి: కారులో ఎయిర్ ఫిల్టర్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్స్ తనిఖీ చేస్తూ క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. ఇది ఇంజిన్ జీవిత కాలాన్ని పెంచుతుంది. (ఇదీ చదవండి: Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?) టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండండి: కారులో టైర్ ప్రెజర్ ఉండవల్సిన దాని కంటే తక్కువ వుంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. కనీసం వారంలో ఒక సారైనా తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. సరైన టైర్ ప్రెజర్ ఇంధనం ఆదా చేయడమే కాదు, టైర్ జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది. సీఎన్జీ లీకేజీ లేకుండా చూసుకోవాలి: కారులో సీఎన్జీ లీకేజి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సీఎన్జీ కారు ధరలు భారీగా ఉండటం వల్ల వినియోగదారుడు లీకేజీల గురించి తప్పకుండా తనిఖీ చేయాలి. అలాంటి సీఎన్జీ లీకేజి ఉన్నప్పుడు సమీపంలో ఉన్న మెకానిక్‌లకు వద్ద కాకుండా.. ప్రొఫెషనల్స్ ద్వారా టెస్ట్ చేసుకోవాలి. -
సీఎన్జీ వేరియంట్, అదిరిపోయే లుక్‌తో ఎస్యూవీ గ్రాండ్ విటారా విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మధ్యస్థాయి ఎస్యూవీ గ్రాండ్ విటారా మోడల్లో రెండు రకాల సీఎన్జీ వేరియంట్లను పరిచయం చేసింది. ధర రూ.12.85 లక్షల నుంచి ప్రారంభం. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 26.6 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ధర వేరియంట్‌ను బట్టి రూ.10.45–19.49 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ శ్రేణిలో గ్రాండ్ విటారాతో కలిపి మొత్తం 14 మోడళ్లు ఉన్నాయని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలో నెల ఫీజు రూ.30,723 మొదలుకుని ఈ కారును సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
వాహనాలకు స్పీడ్ బ్రేకర్లుగా సీఎన్జీ ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది. మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్జీ, డీజిల్ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్ ఇంధనంపైనా ఫోకస్ చేస్తున్నాయి. సీఎన్జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు.. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది. -
సీఎన్జీపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలి
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన సీఎన్జీని జీఎస్టీలో చేర్చే వరకు దీనిపై ప్రస్తుతమున్న ఎక్సైజ్ డ్యూటీని మోస్తరు స్థాయికి తగ్గించాలని కిరీట్ పారిఖ్ కమిటీ సూచించింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండడం తెలిసిందే. ప్రస్తుతం సీఎన్జీపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల స్థాయిలో వ్యాట్, సేల్స్ ట్యాక్స్ అమల్లో ఉన్నాయి. సహజ వాయువును గ్యాసియస్ రూపంలో విక్రయిస్తే దానిపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధించడం లేదు. సీఎన్జీగా మార్చి విక్రయిస్తే 14.5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తోంది. దీనిపై రాష్ట్రాల స్థాయిలో 24.5 శాతం వరకు వ్యాట్ అమలవుతోంది. వినియోగదారుడికి ప్రయోజనం కలిగించే, మార్కెట్ ఆధారిత, పారదర్శక ధరల విధానం సిఫారసు చేసేందుకు ఏర్పాటైనదే కిరీట్ పారిఖ్ కమిటీ. పూర్తి అధ్యయనం, సంప్రదింపుల తర్వాత ఇటీవలే ఈ కమిటీ కేంద్రానికి తన సిఫారసులు అందజేయడం గమనార్హం. జీఎస్టీ కిందకు తేవాలి.. : సహజ వాయువు, సీఎన్జీని జీఎస్టీ కిందకు తీసుకురావాలని ఈ కమిటీ ముఖ్యమైన సూచన చేయడం గమనించాలి. ఇందుకు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడింది. ‘‘ఏకాభిప్రాయం సాధించేందుకు అవసరమైతే రాష్ట్రాలకు ఐదేళ్లపాటు ఆదాయంలో అంతరాన్ని సర్దుబాటు చేయాలి. అవసరమైన ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రక్రియను ఇప్పుడే ఆరంభించాలి’’అని కిరీట్ పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. గ్యాస్‌ను జీఎస్టీ కిందకు తెస్తే పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనతో, గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలు ఉన్న విషయం గమనార్హం. రాష్ట్రాల అంగీకారంతో సీఎన్జీని జీఎస్టీ కిందకు తెచ్చే వరకు.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా తుది వినియోగదారుడిపై పడే భారాన్ని తగ్గించాలని కమిటీ సూచించింది. భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు దీన్ని దీర్ఘకాలిక పరిష్కారంగా పేర్కొంది. జీఎస్టీ కిందకు గ్యాస్‌ను తీసుకురావడం అన్నది.. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా 6.2 శాతంగా ఉంటే, 2030 నాటికి 15 శాతానికి పెంచాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా కావడం గమనించాలి. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు సంబంధించిన దేశీ లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే సహజ వాయువు ధరలపై పరిమితులను పారిఖ్ కమిటీ సిఫారసు చేయడం తెలిసిందే. -
ఆల్టోకే10 సీఎన్జీ కారు వచ్చేసింది... అందుబాటు ధరలో
సాక్షి, ముంబై: దేశీయఆటోమేకర్ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఆల్టోకె10లో సీఎన్జీ మోడల్న లాంచ్ చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ ద్వారా తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది. సీఎన్జీ వర్షెన్ ధర రూ. రూ.5,94,500 ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. వీఎక్స్ఐ అనే ఒక వేరియంట్లోనే మారుతీ ఆల్టో కే10 సీఎన్జీ అందుబాటులోకి ఇచ్చింది. ఇటీవల తమ మోడల్స్‌లో మరిన్ని సీఎన్జీ వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఎస్- సీఎన్జీ వాహనాలను విక్రయించామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఆల్టో కే10 సీఎన్జీ ఇంజీన్ డ్యూయల్ జెట్ , డ్యూయల్ VVTతో 1.0లీటర్ ఇంజీన్ అందిస్తోంది.5300 RPM వద్ద 56 hp ,3400 RPM వద్ద 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ 33.85కి.మీ/కేజీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. డిజైన్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా థర్డ్-జెన్ ఆల్టో కే 10 మాదిరి డిజైన్‌ను కలిగి ఉంది. అయితే కొత్త పవర్ ట్రెయిన్‌కు అనుగుణంగా రైడ్ నాణ్యత, సౌకర్యం, భద్రతకు అనుగుణంగా క్యాలిబ్రేట్ చేసిందని పేర్కొంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ ఫిల్టర్స్ హీటర్‌తో కూడిన ఎయిర్ కండీషనర్తోపాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన SmartPlay డాక్, ఫ్యూయల్ అలర్ట్, డోర్ అజార్ వార్నింగ్, డిజిటల్ స్పీడోమీటర్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం పోర్ట్‌ఫోలియోలో 13 ఎస్- సీఎన్సీ మోడళ్లను కలిగి ఉంది. వీటిలో ఆల్టో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బాలెనో, ఎక్స్ఎల్6, సూపర్ క్యారీ,టూర్ ఎస్ ఉన్నాయి. మరోవైపు రెనాల్ట్ క్విడ్‌కి గట్టిగా పోటీ ఇచ్చిన ఆల్టో కే10 సీఎన్జీ వెర్షన్ మరింత పోటీగా నిలవనుంది.రెనాల్ట్ క్విడ్‌లో ఇంకా సీఎన్జీ వేరియంట్ రాలేదు. -
టయోటా నుంచి సీఎన్జీ వేరియంట్లు, బుకింగ్స్ షురూ
హైదరాబాద్: వాహన తయా రీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజా గా సీఎన్జీ విభాగంలోకి ప్రవేశించింది. గ్లాంజా, అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడళ్లలో సీఎన్ జీ వేరియంట్లను పరిచయం చేసింది. గ్లాంజా ధర రూ.8.43 లక్షల నుంచి ప్రారంభం. అర్బన్ క్రూజర్ హైరైడర్ ధరను ప్రకటించాల్సి ఉంది. బ్రాండ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఆన్లైన్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. రూ. 11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. గ్లాంజా ఎస్ ట్రిమ్‌కు రూ. 8.43 లక్షలు, జీ ట్రిమ్‌కి రూ. 9.46 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది.పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే, గ్లాంజా సీఎన్జీ ధర రూ. 95,000 ఎక్కువ. ఇంజీన్, ఫీచర్లు 55 లీటర్ సీఎన్జీ ట్యాంక్‌ను అమర్చింది. ఇంటీరియర్ ఎలాంటి మార్పులు లేవు. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ , ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన బాలెనో సీఎన్జీతో ఇది పోటీ పడనుందని అంచనా. -
పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం కోసం మన దైనందిన జీవితంలో అలవరుచుకోవలసిన, మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను పై నాలుగు అంశాలూ సుస్పష్టం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంత మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ మూడు దశల కార్యాచరణను సిఫారసు చేసింది. 2022–23 నుంచి 2027–28 మధ్య కాలంలో దేశంలోని 80 శాతం మంది ప్రజలను పర్యావరణ హితులుగా మార్చడమే లక్ష్యంగా ‘మిషన్ లైఫ్’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (పర్యావరణ హిత జీవన విధానం (లైఫ్) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. గత వారంలోనే వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటిదశలో భాగంగా 2022–23లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హిత వ్యక్తిగత జీవనాన్ని అలవర్చుకునేలా పలు సూచనలు చేసింది. ఇంధనం, నీరు పొదుపు చేయడం, ప్లాసిక్ నియంత్రణ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, వ్యర్ధాలను తగ్గించడం, ఆరోగ్యకర జీవనాన్ని అలవరుచుకోవడం, ఈ–వ్యర్థాలను తగ్గించడం అనే ఏడు కేటగిరీల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 75 జీవన సూత్రాలను పేర్కొంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల డిమాండ్‌లో మార్పు వస్తుందని వెల్లడించింది. దైనందిన జీవితంలో అలవరుచుకోవాల్సిన కొన్ని ప్రధాన సూచనలు, చేసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే.. ►ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వాడాలి ►వీలున్న ప్రతి చోటా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి ►స్నేహితులు, సహచరులతో కార్ పూలింగ్ (ఒక కారులో కలిసి వెళ్లడం) అలవరుచుకోవాలి ►ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైల్వే గేట్ల వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజన్ ఆపేయాలి ►స్థానికంగా తిరిగేటప్పుడు, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లాలి ►అవసరం లేనప్పుడు సాగునీటి పంపులను నిలిపివేయాలి ►పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి ►వంటలో ప్రెషర్ కుక్కర్లకు ప్రాధాన్యమివ్వాలి ►పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. తక్కువ నీటిని తీసుకునే చిరుధాన్యాల పంటలను సాగుచేయాలి ►ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో వర్షపు నీటిని పొదుపు చేసే ఏర్పాట్లు చేసుకోవాలి ►కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవాలి ►చెట్లకు నీరు పోసేటప్పు డు, వాహనాలు, ఇళ్లు కడిగేటప్పుడు పైపులకు బదులుగా బకెట్లలో నీటిని ఉపయోగించాలి ►రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రతి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి ►ప్లాస్టిక్ సంచులకు బదులు నేత సంచులు వాడాలి ►వెదురు దువ్వెనలు, వేప బ్రష్‌లు ఉపయోగించాలి ►ఆహారం తీసుకునే సమయంలో చిన్న ప్లేట్లను ఉపయోగించాలి ►పాత దుస్తులు, పుస్తకాలను దానం చేయాలి ►రెండువైపులా ప్రింట్ వచ్చేలా ప్రింటర్‌ను సెట్ చేసుకోవాలి ►ఎలక్ట్రానిక్ పరికరాలను మరమ్మతు చేసి ఉపయోగించుకోవాలే తప్ప పడేయకూడదు. -
బాబోయ్ షాక్: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు రేట్లను ఏకంగా 40 శాతం పెంచుతూ చమురు శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) సమీక్షిస్తుంది. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
గాడి తప్పిన ‘గ్యాస్’!
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా చేయాలనే ప్రభుత్వం లక్ష్యం నీరుగారింది. ప్రాజెక్టు అమలు బాధ్యతలను నెత్తినెత్తుకున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ గ్యాస్ పంపిణీలో చేతులెత్తేసింది. ప్రాజెక్టును ప్రారంభించి పన్నెండేళ్లయినా 28% పనులు కూడా పూర్తికాకపోవడంతో పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ ఇప్పట్లో అందడం కలగానే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అనాలోచిత నిర్ణయాలు, అంతర్గత కుమ్ములాటల ఫలితంగా ఈ ప్రాజెక్టు మొదటి విడత తొలి అయిదేళ్ల లక్ష్యమే ఇప్పటివరకు పూర్తి కాకపోగా, కాలపరిమితి పొడిగింపుతో అంచనా వ్యయం తడిసిమోపెడవుతోంది. ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, కాకినాడ నగరాల్లో గత పన్నెండేళ్లలో 2,44,469 గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, 209 వాణిజ్య కనెక్షన్లు, 47 పరిశ్రమలకు ఇండస్ట్రీ గ్యాస్ కనెక్షన్లను జారీ చేసినట్లు బీజీఎల్ వార్షిక నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక సీఎన్జీ పురోగతిని పరిశీలిస్తే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) పరిధిలో 116, ఆర్టీసీ పరిధిలో 6, ఎంఎస్ అండ్ కోకో పరిధిలో 4 సీఎన్జీ స్టేషన్లు వాహనాలకు వాయువును సరఫరా చేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సీఎన్జీతో నడిచే వాహనాల్లో కార్లు 30,894, ఆటోలు 38,367, బస్సులు 1,092 ఉన్నట్లు లెక్కలు స్పష్టం చేసున్నాయి. మొక్కుబడిగా విస్తరణ.. ►నగర శివారులోని శామీర్‌పేట్‌లో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన బీజీఎల్.. 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలి అయిదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా వాహనాలకు సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తొలుత మదర్‌స్టేషన్ సమీపంలోని నల్సార్ వర్సిటీ క్యాంపస్‌లోని 30 ఫ్లాట్లకు పీఎన్జీ కనెక్షన్లు జారీ చేసింది. అనంతరం మేడ్చల్‌లో సుమారు 410 కుటుంబాలకూ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చింది. ►ఇప్పటికే కనెక్షన్లు పొందిన వినియోగదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది. 20 ఏళ్లలో రూ.3,166 కోట్ల అంచనా వ్యయంతో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాలని బీజీఎల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు తొలి దశలో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు సుమారు రూ.733 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పనులు గాడిలో పడకపోవడంతో కాలపరిమితి పొడిగింపునకు బీజీఎల్ సంస్థ మొగ్గు చూపుతోంది. మరోవైపు గ్రిడ్ నుంచి తగినంత గ్యాస్ సరఫరా లేక, ప్రతిపాదిత పైప్‌లైన్ మార్గంలో క్లియరెన్సుల జారీలో జాప్యం కూడా ప్రాజెక్టుపై ప్రభావం చూపుతోంది. సీఎన్జీ కూడా అంతంతే ►హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. శామీర్‌పేట్ మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. పన్నెండేళ్ల క్రితం గ్రేటర్లో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది. ►తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసినా ప్రస్తుతం ఈ సంఖ్య 135కు పడిపోయింది. దీంతో 215 సీఎన్జీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా కూడా గ్యాస్ సరఫరా అంతంత మాత్రంగా మారింది. ప్రతిరోజూ డిమాండ్‌కు తగినట్లు సీఎన్జీ సరఫరా కావడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్మార్ట్ గ్యాస్ నగరం.. ఆమడదూరం.. ►ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో స్మార్ట్ గ్యాస్ నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలనే లక్ష్యం కూడా అమడ దూరంగా తయారైంది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ల పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ముందుగా 200 కిలోమీటర్ విస్తరించి నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పుష్కర కాలమైనా కనెక్షన్ల సంఖ్య 43వేలకు దాటలేదు. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు ప్రధాన లైన్ పనులు ఆంతంత మాత్రంగా మారాయి. ►పైప్లైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించినా.. పనులు మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇక సీఎన్జీ పరిస్థితి కూడా మరింత అధ్వానంగా తయారైంది. ఇప్పటివరకు సీఎన్జీ వాహనాల సంఖ్య 25,923 కూడా దాటలేదు. ►కాకినాడలో సైతం బీజేఎల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ మొదటి విడతగా 93 వేల గృహాలకు వంటగ్యాస్ సరఫరాకు మదర్ స్టేషన్ ఏర్పాటు చేసినా గృహోపయోగ కనెక్షన్ల సంఖ్య 58 వేలు దాటలేదు. వివిధ ప్రాంతాలకు పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో విపరీతమైన జాప్యం, మరోవైపు వరుస అడ్డంకులు ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. వాహనాలకు వాయువు అందించే సీఎన్జీ స్టేషన్ల సంఖ్య డజను కూడా దాటకపోగా.. సీఎన్జీ వాహనాల సంఖ్య 1,728 మాత్రమే ఉంది. -
మూణ్నెళ్లలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా: ఏజీ అండ్ పీ ప్రథాన్
వచ్చే సెప్టెంబరు నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తరూ జిల్లా సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ రీజనల్ హెడ్ చిరాగ్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే కేంద్ర పెట్రోలియం బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొంది ఇంధన సరఫరా ప్రారంభించనుంది. భవిష్యత్తులో పోర్టబుల్ జనరేటర్స్, ఎయిర్ కంటిషనర్స్ కూడా గ్యాస్‌తో వినియోగించుకునే పరిస్థితి రానుందంటున్న ఆయన సాక్షితో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... ‘ఆదా’కు ఆదా... భధ్రతకు భరోసా ఈ పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలోనే వస్తుంది. అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. పైప్‌లైన్ ద్వారా ఒక కిచెన్ పాయింట్ అందిస్తాం. అవసరాన్ని బట్టి ఓ అడిషనల్ పాయింట్ కూడా అదే కిచెన్‌లో తీసుకోవచ్చు. బాత్ రూమ్ కోసం కావాలంటే మరో అదనపు పాయింట్ ఇస్తాం. మునిసిపల్ వాటర్ నీటి పంపు తిప్పితే నీళ్లొచ్చినట్టే ఈ గ్యాస్ కూడా వస్తుంది. వినియోగించిన ఇంధనాన్ని లెక్కించేందుకు మీటర్ ఏర్పాటు ఉంటుంది. మీటర్‌ను బట్టి వాడుకున్న ఇంధనానికి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లుల్లానే కాకపోతే అందులోలా ఇందులో స్లాబ్స్ ఉండవు. ఇక గ్యాస్ వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీస్ అందిస్తున్నాం. దీని కోసం ఒక పూర్తిస్థాయి టీమ్ పనిచేస్తుంది. రెస్టారెంట్స్‌కు మరింత మేలు... నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఇది వారి లాభాలను బాగా పెంచుతుంది. వారాంతాల్లో హోటల్స్ దాబాలు వంటి చోట్ల డిమాండ్ కారణంగా అధిక ఇంధనం కోసం అదనపు సిలిండర్లు మీద ఆధారపడతారు. అయితే ఇక్కడ ఆ కొరత ఉండదు. ఎంత కావాలంటే అంత గ్యాస్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ప్రయోజనం కారణంగా భవిష్యత్తులో తిరుపతిలో అన్ని రెస్టారెంట్స్ పైప్డ్ గ్యాస్‌కి కనెక్ట్ అవుతాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు కూడా అందించడానికి తితిదేతో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. స్పందన బాగుంది... ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కోరుతూ ప్రజల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుకున్నాం. కేవలం 4 నెలల్లోనే 2వేల 500 కంటే పైగా అప్లికేషన్స్ వచ్చాయి. స్థానిక సంస్థలు మాకు అవసరమైన విధంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారి చేసింది గూడూరు మునిసిపల్ కార్పొరేషన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, నాయుడు పేట మునిసిపల్ కార్పొరేషన్.. ల నుంచి పైప్‌లైన్ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. ఇన్స్టలేషన్ ప్రారంభించాం... తిరుపతి టౌన్లో కూడా శ్రీనివాసపురం, రోడ్‌నెం 15, 16లలో డొమెస్టిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం. 300 నివాస గృహాల్లో ఇన్స్టలేషన్ పూర్తయింది. నెల్లూరులో కూడా 450 ఇళ్లకి డొమెస్టిక్ ఇన్స్టలేషన్ పూర్తయింది. పైప్‌లైన్ ప్రోగ్రెస్‌లో ఉంది. వచ్చే 2నెలల్లో పూర్తి అవుతుంది. స్థానిక సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ని నాయుడపేట టౌన్, ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్రారంభించాం. ప్రభుత్వం చెప్పినట్టుగా రిఫండబుల్ డిపాజిట్ రూ.6వేలు తీసుకోవచ్చు కానీ మేం అది తీసుకోకుండానే ప్రస్తుతం కనెక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాం. వాహనాల కోసం సీఎన్జీ పెట్రోల్, డీజిల్ వాహనాలను పిఎన్జి వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్మెంట్ సెంటర్స్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నాం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కడప లాంటి చోట్ల డీజిల్ ఆటోలు బాగా ఎక్కువ వాటిని సీఎన్జీ ఆటోలుగా మార్చవచ్చు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయక్తం. అంతేకాక ఈ మార్పిడి కోసం అయ్యే ఖర్చు వాహన యజమానులకు కేవలం 6 నెలల్లో రికవరీ చేసుకోవచ్చు. డీజిల్‌తో పోలిస్తే సిఎన్జి వల్ల 30 నుంచి 50శాతం ఇంధన ఖర్చు అంటే కనీసం నెలకు రూ.5వేలు ఆదా అవుతుంది. ఇక భారీ వాహనాలు, ఎక్కువ దూరాలు నడిపేవారికి ఒక్క రోజులోనే భారీ మొత్తంలో ప్రయోజనం కలుగుతుంది. ఇంధనాన్ని నింపుకోవడంలో ఇబ్బందులు రాకుండా ప్రతీ 60 నుంచి 100 కి.మీ లోపు సిఎన్జి స్టేషన్స్ ఉండేలా చూస్తున్నాం. -
గ్యాస్ బండి.. బాగుందండి..
ఆరిలోవ(విశాఖ తూర్పు): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎన్జీ బస్సులు నడుపుతూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది విశాఖ వ్యాలీ స్కూల్. ఇటీవల పాఠశాల యాజమాన్యం కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)తో నడిచే ఆరు బస్సులను కొనుగోలు చేసింది. పాఠశాల విద్యార్థుల కోసం ఈ బస్సులను నడుపుతోంది. కొన్నేళ్లుగా నడుస్తున్న బస్సులు మరమ్మతులకు గురి కావడంతో.. వాటి స్థానంలో డీజిల్‌తో నడిచేవి కాకుండా సీఎన్జీ బస్సులు కొనుగోలు చేసింది. డీజిల్‌తో నడిచే బస్సుల కారణంగా అధిక శాతం నల్లని పొగ బయటకు వస్తుంది. దీని వల్ల పర్యావరణానికి చాలా నష్టం. అదే సీఎన్జీ బస్సులతో నగరానికి కాలుష్య ముప్పు తక్కువ. అందులో భాగంగానే విశాఖ వ్యాలీ పాఠశాల యాజమాన్యం సీఎన్జీ బస్సులను కొనుగోలు చేసి.. ప్రైవేట్ పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా డీజిల్‌తో నడిచే బస్సుల కంటే ఈ బస్సులు ఎక్కువ మైలేజీ ఇస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు. డీజిల్ బస్సులు లీటర్‌కు 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తాయి. అదే సీఎన్జీ బస్సులు ఓ కిలో గ్రాము గ్యాస్‌తో 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం నడుస్తాయని చెబుతున్నారు. వీటి వల్ల కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువగా వెలువడుతుంది. వాతావరణం కాలుష్యం కాకుండా తమ వంతు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని ఇక్కడ యాజమాన్యం చెబుతోంది. ఇటీవల కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఈ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులను పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. ఎక్కువ మైలేజీతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తంగా ఉండటంతో.. వీటిని నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బస్సులో సౌకర్యాలు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఈ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇద్దరు విద్యార్థులకు ఒక సీటు చొప్పున కేటాయించారు. ప్రతి బస్‌లో 40 మంది విద్యార్థులు ప్రయాణించవచ్చు. ఇందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ సిద్ధం చేశారు. బస్ వెనుక భాగం కిందన సీఎన్జీ సిలిండర్ల క్యాబిన్ ఉంటుంది. అన్ని బస్‌లు సీఎన్‌జీవే నడుపుతాం భవిష్యత్‌లో అన్నీ సీఎన్జీ బస్సులు నడపాలనే ఆలోచనలో ఉన్నాం. ఇక్క డ విద్యార్థుల అవసరానికి తగినట్లు 13 బస్సులున్నాయి. వాటిలో ఆరు మరమ్మతులకు గురయ్యాయి. వాటి స్థానంలో సీఎన్జీ బస్సులు కొనుగోలు చేశాం. వీటి వల్ల కాలుష్యం ఉండదు. అతి తక్కువగా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. పర్యావరణం పరిరక్షణ కోసం మా వంతు కృషి చేస్తున్నాం. – ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, విశాఖ వ్యాలీ స్కూల్ -
సీఎన్జీ వాహనాలకు డిమాండ్..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో, వాటితో పోలిస్తే చౌక ఇంధనమైన సీఎన్జీతో (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో సీఎన్జీ వాహనాల వాటా దాదాపు అయిదో వంతుకు చేరింది. సరఫరాపరమైన సమస్యలు లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వాహన విక్రయాల గరిష్ట స్థాయిని (4,74,953) సీఎన్జీ విభాగం దాటేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 1,30,000 పైచిలుకు సీఎన్జీ వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎర్టిగా మోడల్ కోసం 8–9 నెలల పైగా వెయిటింగ్ పీరియడ్ ఉంటోందని సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ అమ్మకాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఈ ఏడాది సగటున నెలవారీగా చూస్తే సీఎన్జీ వాహనాల అమ్మకాలు 58 శాతం పెరిగాయి. రాబోయే నెలల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చని సంస్థ ఆశిస్తోంది. గతేడాది మొత్తం మీద 37,584 సీఎన్జీ వాహనాలను అమ్మిన హ్యుందాయ్ ఈ ఏడాది తొలి అయిదు నెలల్లో ఇప్పటికే 24,730 పైగా సీఎన్జీ వాహనాలను విక్రయించింది. మూడు దిగ్గజాలు.. గతేడాది ఆగస్టులో జరిగిన భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 61వ వార్షిక సదస్సు సందర్భంగా.. డీజిల్ వాహనాలను తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ సూచించారు. తద్వారా ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. తదనుగుణంగానే దేశీ ఆటొమొబైల్ సంస్థలు తమ వంతు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ కలిసి సీఎన్జీకి సంబంధించి 14 వాహనాలను అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సీఎన్జీ వాహన విక్రయాలు 2,61,000 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటర్స్ ఈ ఏడాది తొలినాళ్లలోనే ఈ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టిగోర్, టియాగో వాహనాలకు సంబంధించి ఈ వేరియంట్ అమ్మకాలు 52 శాతానికి చేరినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో సీఎన్జీ వాహన శ్రేణి వాటా 10 శాతం దాకా ఉంటుందని వివరించాయి. నిర్వహణ వ్యయాలు తక్కువ.. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాలను నడిపే వ్యయాలు తక్కువగా ఉంటున్నాయి. ద్రవ ఇంధనాలతో నడిచే వాహనాలకు సంబంధించిన ఖర్చు ప్రతి కిలోమీటరుకు రూ. 5.30–5.45గా ఉంటోంది. అదే సీఎన్జీ వాహనాల వ్యయం అందులో సగానికన్నా తక్కువగా ప్రతి కిలోమీటరుకు రూ. 2.1–2.2 స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కూడా ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా సీఎన్జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సీఎన్జీ డిస్ట్రిబ్యూషన్ అవుట్లెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 3–4 ఏళ్ల క్రితం 1,400 అవుట్లెట్లు ఉండగా ప్రస్తుతం 3,700కు చేరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
పెట్రో షాక్‌తో సీఎన్జీ వాహనాలకు గిరాకీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలేమో ఖరీదు ఎక్కువ. ఈ నేపథ్యంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో (సీఎన్జీ) నడిచే వాహనాలు వినియోగదార్లకు ప్రత్యామ్నాయం అయ్యాయని ఎన్ఆర్ఐ (నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్) కన్సల్టింగ్, సొల్యూషన్స్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2021-22లో దేశంలో సీఎన్జీ వాహనాలు 2,65,383 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ. 2018 నాటికి దేశవ్యాప్తంగా 30.9 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ ఉంటే.. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య 37.97 లక్షల యూనిట్లకు చేరుకుంది. బీఎస్-6 ఇంధన ప్రమాణాలు అమలయ్యాక యాజమాన్య ఖర్చులు తక్కువగా ఉండడంతో సీఎన్జీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక ఇంధన సామర్థ్యంతో.. సాంకేతికత అందిపుచ్చుకున్న ఇక్కడి తయారీ కంపెనీలు తక్కువ ధరలో అధిక ఇంధన సామర్థ్యం ఉన్న సీఎన్జీ వేరియంట్లను ప్రవేశ పెడుతున్నాయి. సీఎన్జీ విక్రయ కేంద్రాలు విస్తరించడం, నియంత్రణ వ్యవస్థ మద్దతు ఈ విభాగం వృద్ధికి తోడ్పడుతోంది. మరోవైపు అధిక గ్యాస్ ధరలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పరిశ్రమల నెట్వర్క్ విస్తరణను పరిమితం చేస్తాయి. వినియోగదారు అనుభవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. బయో సీఎన్జీ పర్యావరణ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. భారత బయో సీఎన్జీ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా చేరుకున్నట్లయితే.. దేశంలోని ప్రస్తుత సహజ వాయువు డిమాండ్‌ను తీర్చగలదు. 54 లక్షల అదనపు వాహనాలకు శక్తినివ్వగలదని అంచనా. -
ఏడాది కాలంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు..ఎందుకంటే!
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ గ్యాస్ వినియోగ ధోరణులపై సిటీ గ్యాస్ పంపిణీదారుల (సీజీడీ) నుంచి డేటా కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాక కేటాయింపులు జరుపుతామని కేంద్ర చమురు శాఖ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా డిమాండ్‌ను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి (ఏటా ఏప్రిల్, అక్టోబర్‌లో) కేంద్రం గ్యాస్ కేటాయింపులు చేస్తుంది. కానీ 2021 మార్చి నుంచి ఇప్పటివరకూ కేటాయించలేదు. దీనితో కొరతను అధిగమించేందుకు సిటీ గ్యాస్ ఆఫరేటర్లు ..దిగుమతి చేసుకున్న ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను అధిక రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా సీఎన్జీ రేటు కేజీకి రూ. 28 పైగా, పీఎన్జీ ధర మూడో వంతు మేర పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీజీడీ సంస్థలు తమకు త్రైమాసికాలవారీగా కేటాయించాలంటూ అభ్యర్ధించాయని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చమురు శాఖ ప్రతినిధి తెలిపారు. సీజీడీ అదనపు కేటాయింపులు జరపాలంటే .. ఎరువులు, విద్యుత్, ఎల్పీజీ ప్లాంట్లు మొదలైన వాటికి సరఫరాలో కోత పెట్టాల్సి వస్తుందని వివరించారు. -
మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్ వేరియంట్ రూ.18,600, సీఎన్జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను ఈ కారుకు పొందుపరిచారు. సీఎన్జీ వేరియంట్లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్‌తో అత్యాధునిక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్.. ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలాఖరులో ఎక్స్ఎల్6 కొత్త వర్షన్ రానుందని ఆయన చెప్పారు. -
మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ సరికొత్త రికార్డు..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎస్-సీఎన్జీ వేరియంట్ వాహనాల అమ్మకాలు సరికొత్త మైలురాయిను తాకింది. భారత్‌లో ఏకంగా 10 లక్షల యూనిట్లకు పైగా ఎస్-సీఎన్జీ వేరియంట్ వాహనాలు అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రీన్ మొబిలిటీ లక్ష్యంగా..! గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తూ మారుతి సుజుకి కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు మోడళ్లను సీఎన్జీ వేరియంట్స్‌గా మార్చింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ , టూర్-ఎస్ మోడళ్లను సీఎన్జీ వేరియంట్స్‌గా కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. మారుతి సుజుకి ఎస్-సీఎన్జీ కార్లు మైలేజ్‌లో రారాజుగా నిలుస్తూ కొనుగోలుదారుల నుంచి భారీ ఆదరణను పొందాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అత్యధిక సీఎన్జీ మోడల్స్‌ను ఉత్పత్తి చేసిన కంపెనీగా మారుతి సుజుకీ నిలుస్తోందని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అండ్ సీఈవో కెనిచీ అయుకవా అన్నారు. అంతేకాకుండా గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా, సురక్షితమైన, విశ్వసనీయమైన, మన్నికైన వాహనాలను అందించేందుకు సిద్దంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. 2016-17లో మారుతీ సుజుకి 3.5 లక్షల S-CNG విక్రయాల మైలురాయిని చేరుకుంది సీఎన్జీ విస్తరణతో తక్కువ వ్యవధిలోనే 10 లక్షల మైలురాయిని అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఎస్-సీఎన్జీ పోర్ట్‌ఫోలియో భాగంగా న్యూ డిజైర్ మోడల్‌ను కంపెనీ లాంచ్ చేసింది. సీఎన్జీ మోడళ్లలో సెలెరియో 35. 60 కిమీ/కేజీ, వ్యాగనఆర్ 34.05 కిమీ/కేజీ, ఆల్టో 31.59 కిమీ/కేజీ, ఎస్ ప్రెస్సో 31.20 కిమీ/కేజీ, డిజైర్ 31.12 కిమీ/కేజీ, ఎర్టిగా 26.08 కిమీ/కేజీ, ఈకో 20.88 కిమీ/కేజీ మేర మైలేజ్‌ను అందిస్తున్నాయి. చదవండి: అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..! -
బీఎస్– 6 కార్లకు ఇక సీఎన్జీ
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో సంతోషంగా కొనుగోలు చేసిన కొత్తకారు బయటకు తీసేందుకు వెనకడుగు వేస్తున్నారా? ఇంటిల్లిపాదీ కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇంధన భారం బెంబేలెత్తిస్తుందా? మరేం ఫర్వాలేదు. త్వరలోనే మీ వాహనంలో ఇంధన వినియోగానికి అనుగుణమైన మార్పులు చేసుకోవచ్చు. పెట్రోల్‌తో నడిచే భారత్ స్టేజ్– 6 వాహనాల్లో ఇక సీఎన్జీ కిట్లను అమర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై కేంద్రం దృష్టి సారించింది. త్వరలోనే అన్ని చోట్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే వాహనాలు సీఎన్జీ వినియోగంలో మారడం వల్ల వాహనదారులకు ఇంధనంపై ఖర్చు 40 నుంచి 50 శాతం వరకు ఆదా అవుతుంది. గ్రేటర్లో సుమారు 1.5 లక్షల బీఎస్–6 వాహనాలకు ఊరట లభించనుందని రవాణా వర్గాలు చెబుతున్నాయి. బీఎస్– 6 శ్రేణికి చెందిన వాహనాలను కొనుగోలు చేసిన చాలా మంది సీఎన్జీకి మార్చుకోవాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ అవకాశం లేకపోవడంతో ఇంధనం కోసం భారీగా ఖర్చు చేయాల్సివస్తోంది. పర్యావరణ పరిరక్షణ.. సహజ ఇంధన వాహనదారులకు ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైతం దోహదం చేస్తుంది. ఈ మేరకు బీఎస్– 4 వాహనాల వరకు ప్రభుత్వం సీఎన్జీ కిట్లను ఏర్పాటు చేసుకొనేందుకు గతంలోనే అనుమతులను ఇచి్చంది. కానీ కొత్తగా వచ్చిన బీఎస్–6 వాహనాలకు మాత్రం ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. తాజాగా అన్ని రకాల కార్లకు సీఎన్జీ కిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది. ఎస్యూవీ వాహనాలకు కూడా ఈ మార్పు వర్తించనుంది. 1.5 లక్షల వాహనాలకు ఊరట... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.5 లక్షల బీఎస్–6 వాహనాలకు ఈ మార్పు వల్ల ఊరట లభించనుంది. సీఎన్జీ కిట్లను అమర్చుకోవడం వల్ల వాహనదారులు ఆ ఇంధనం అందుబాటులో లేని సమయాల్లో సాధారణ పెట్రోల్ వాహనాలుగా కూడా వినియోగించుకోవచ్చు. వాహనాల భద్రత దృష్ట్యా ప్రతి మూడేళ్లకోసారి సీఎన్జీ కిట్లను రిట్రోఫిట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. -
చెత్త.. వేస్ట్ కాదు వనరు!
సాక్షి, సిద్దిపేట: ప్రజల భాగస్వామ్యం, పారిశుధ్య కార్మికుల పనితనంతో స్వచ్ఛతలో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన బయో–సీఎన్జీ ప్లాంట్‌ను సోమవారం ఆయన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి ప్రారంభించారు. తడి చెత్తతో ఈ ప్లాంట్‌లో బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బయో–సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట పుర ప్రజలేనని పేర్కొన్నారు. భారీగా పోగవుతున్న చెత్త కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోందని, భూమి, నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు. సిద్దిపేట పట్టణంలో రోజుకు 55 వేల కిలోల చెత్త పోగవుతోందని, అయితే సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా ప్రజల భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో సిద్దిపేట స్వచ్ఛ పట్టణంగా రూపుదిద్దుకుందని వివరించారు. తాము చెత్తను ఆదాయ వనరుగా మార్చామన్నారు. బయో –సీఎన్జీ ప్లాంట్‌లో త యారయ్యే గ్యాస్‌ను పట్టణంలో హోటళ్లకు సరఫరా చేస్తామ ని చెప్పారు. అలాగే మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా ఈ సీఎన్జీ గ్యాస్‌ను ఉపయోగిస్తామని మంత్రి వెల్లడించారు. స్వచ్ఛతలో రాష్ట్రానికి ఆదర్శం సిద్దిపేట.. స్వచ్ఛత విషయంలో సిద్దిపేట జిల్లా తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు.« నాయకుల ధృడ సంకల్పం, దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం గొప్ప విషయం అన్నారు. ప్రసంగం ప్రారం భంలో ఆయన సభకు నమస్కారం.. అని తెలుగులో మాట్లా డి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం ప్లాంట్‌లో తిరు గుతూ ఫొటోలు తీసుకున్నారు. చెత్త రహిత వార్డుకు తులం బంగారం సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో చెత్త రహిత వార్డు.. ఘనత సాధించే కౌన్సిలర్‌కు తులం బంగారం, వార్డు రిసో ర్స్ పర్సన్‌కు ఒక పట్టుచీరను బహుమతిగా ఇస్తా మని మం త్రి హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తో ఆయన సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పూట కొందరు రోడ్లపై చెత్త వేయడం వల్ల రోడ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయని, అలాంటి ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. బయో సీఎన్జీ తయారీ ఇలా.. ఇంటింటా సేకరించిన తడిచెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం పైప్ ద్వారా ప్రి–డిజాస్టర్ ట్యాంక్‌లోకి పంపిస్తారు. దాన్ని మూడ్రోజులు నిల్వ ఉంచు తారు. అది ద్రావణంగా మారాక మరో ట్యాంక్‌లోకి పం పిస్తారు. అనంతరం అందులో మైక్రో ఆర్గాన్లు కలుపుతారు. ఆ సమయంలో విడుదలయ్యే మీథేన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరుచేసి సిలిండర్లలో నింపుతారు. -
పెట్రోలు ధరలకు పరిష్కారం.. సీఎన్జీ వైపు మారుతి చూపు
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇండియాలో నంబర్ వన్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి భిన్నమైన మార్గం ఎంచుకుంది. సీఎన్జీకే మొగ్గు సీఎన్జీ మోడళ్ల సంఖ్యను పెంచాలని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ మోడళ్లకు గిరాకీ రావడంతో కంపెనీ సీఎన్జీ వైపు మళ్లింది. మరిన్ని మోడల్స్ త్వరలో కొత్తగా మరో నాలుగు మోడళ్లకు సీఎన్జీ శ్రేణిని విస్తరించనున్నట్టు సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎనిమిది మోడళ్లకు సీఎన్జీ వేరియంట్స్ ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని సీఎన్జీ మోడల్స్ అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం పెండింగ్‌లో 2.8 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఇందులో 1.1 లక్షల యూనిట్లు సీఎన్జీ వేరియంట్లే. ఒక్కో కిలోమీటర్‌కు పెట్రోల్, డీజిల్ వాహనమైతే రూ.5 ఖర్చు అవుతోంది. అదే సీఎన్జీ అయితే రూ.1.7 మాత్రమే. దేశవ్యాప్తంగా 260 నగరాలు, పట్టణాల్లో 3,400 సీఎన్జీ స్టేషన్స్ ఉన్నాయి’ అని వివరించారు. -
మార్కెట్లో టాటా కమర్షియల్ వెహికల్, ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. తేలికపాటి వాణిజ్య వాహనం టాటా 407 సీఎన్జీ వర్షన్‌ను విడుదల చేసింది. ధర పుణే ఎక్స్‌షోరూంలో రూ.12.07 లక్షలు. డీజిల్ వేరియంట్‌తో పోలిస్తే ఇది 35 శాతం వరకు అధిక లాభాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. డీజిల్ ధర పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ శ్రేణిని విస్తరిస్తున్నట్టు వివరించింది. 35 ఏళ్లలో టాటా 407 మోడల్ వాహనాలు ఇప్పటి వరకు 12 లక్షల పైచిలుకు యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ విభాగంలో అత్యధిక అమ్మకాలు సాధించిన మోడల్ ఇదేనని టాటా మో టార్స్ వెల్లడించింది. 3.8 లీటర్ సీఎన్జీ ఇంజన్, 85 పీఎస్ పవర్, 285 ఎన్ఎం టార్క్, 10 అడుగుల లోడ్ డెక్, 180 లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉంది. గరిష్టంగా మోయగలిగే సరుకుతో కలిపి మొత్తం వాహన బరువు 4,995 కిలోలు. -
గ్యాస్ షేర్లు గెలాప్!
దేశీయంగా పెరగనున్న గ్యాస్ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్ తదితర అంశాలు ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్ రవాణాకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్ ఓస్వాల్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్లో బావుల నుంచి గ్యాస్ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది. ఆర్ఐఎల్ రెడీ రెండేళ్లలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్ కనిపించనున్నట్లు అంచనా వేసింది. తాజాగా పెరిగిన జోరు... రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ లభ్యత చేరింది. ఆర్ఐఎల్–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్ఎన్జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్ మెట్రిక్ టన్నులకు డిమాండ్ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (జీఎస్పీఎల్), గెయిల్ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. సామర్థ్యం ఇలా... ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్పీఎల్ కొన్ని కీలక పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్–భాధుట్, అంజార్–చోటిల్లా, అంజార్–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్ వల్ల గుజరాత్ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. -
వాహనదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులకు ఊరటనిచ్చేలా పెట్రోలు కూడా ఇకపై డోర్ డెలివరీ కానుంది. ప్రజల సహాయార్ధం పెట్రోల్ సీఎన్జీని ఇంటివద్దకే పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చమురు కంపెనీలకు త్వరలోనే అనుమతినివ్వనుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నలాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న (శుక్రవారం) తెలిపారు. డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కాగా భారతదేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 2018లో భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా డీజిల్‌ను ఇంటికి పంపిణీ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు కొనుగోలుదారు ఇండియాలో కరోనా కారణంగా డిమాండ్ భారీగా పడిపోయింది. ఇంధన వినియోగం ఏప్రిల్‌లో దాదాపు 70 శాతం తగ్గింది. మరోవైపు రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ, మొబైల్ పెట్రోల్ పంపుల సాయంతో ఇంటి వద్దకే పెట్రోలు అందించనున్నామని ఇటీవల ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూణేకు చెందిన సంస్థ తెలిపింది. చదవండి : రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు -
ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్జీ: ప్రధాన్
న్యూఢిల్లీ: డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. -
ఆహార వ్యర్ధాల నుంచి ఇంధనం..
సాక్షి, న్యూఢిల్లీ : మటన్,న ఫిష్ వ్యర్ధాలతో సీఎన్జీ తయారుచేసి బస్సులు, వాహనాలను నడిపించవచ్చని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల స్ధానంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆయన పునరుద్ఘాటించారు. పంట వ్యర్దాలను తగులబెట్టకుండా సీఎన్జీ తయారీకి ఉపయోగించే ప్రకియ లుధియానాలో ప్రారంభమైందని, ఇక మటన్, చేపలు, పండ్లు, కూరగాయల వ్యర్ధాలను బయో ఇంధనంగా మార్చే ప్రక్రియను మరో రెండు నెలల్లో మహారాష్ట్రలో ప్రారంభిస్తామని చెప్పారు. మెథనాల్, కార్బన్ డయాక్సైడ్ను విడతీయడం ద్వారా లభ్యమయ్యే సీఎన్జీతో బస్సులు, వాహనాలను నడిపించవచ్చని తెలిపారు. పంట వ్యర్ధాలను సీఎన్జీగా మార్చే లుథియానా ప్లాంట్‌కు చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుందని చెప్పారు. వస్తువులు, ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ ఇచ్చే ప్రక్రియలో త్వరలో మార్పులు చేపడతామని వెల్లడించారు. నిర్ధిష్ట పరిమితికి మించి విద్యుత్‌ను వినియోగించే పరికరాలకు ఐఎస్ఐ మార్క్ కేటాయించరని స్పష్టం చేశారు. -
మారుతీ చిన్న కార్లు ఇక నుంచి సీఎన్జీతోనే..
న్యూఢిల్లీ: దేశీ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) చిన్న కార్ల విషయంలో పెద్ద వ్యూహాన్నే రచించింది. విక్రయాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో మళ్లీ డిమాండ్‌ను పెంచే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇక నుంచి కంపెనీ విడుదలచేసే అన్ని చిన్న కార్లు సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మోడల్‌తోనే ఉండనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై మాట్లాడిన కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ.. ‘మారుతీ చిన్న కార్ల పోర్ట్‌ఫోలియోలోని మొత్తం వాహనాలు ఇక నుంచి సీఎన్జీలోకి మారనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ ఇంధనాన్ని పర్యావరణ అనుకూలంగా, రవాణాకు సరిపడేదిగా గుర్తించింది. ఈ తరహా కార్ల వినియోగం పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000 సీఎన్జీ డిస్ట్రబ్యూషన్ అవుట్లెట్లను ఏర్పాటుచేయనున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంపెనీ ఎనిమిది మోడళ్లలో సీఎన్జీ ఆప్షన్ అందిస్తోంది. ఆల్టో, ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలిరీయో, డిజైర్, టూర్ ఎస్, ఈకో, సూపర్ క్యారీ మినీ మోడళ్లలో సీఎన్జీ ఆప్షన్ ఉండగా.. మొత్తం 16 మోడళ్లను విక్రయిస్తోంది. ఉత్పత్తిలో కోత విధించిన మారుతీ కార్ల విక్రయాలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో మారుతీ సుజుకీ ఇండియా వరుసగా ఏడవ నెల్లోనూ ఉత్పత్తిలో కోత విధించింది. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు అందించిన సమాచారం ప్రకారం.. ఆగస్టులో మొత్తం 1,11,370 యూనిట్లను ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదేకాలంలో 1,68,725 యూనిట్లను ఉత్పత్తిచేసింది. ప్యాసింజర్ వాహన ఉత్పత్తి గతేడాది ఆగస్టులో 1,66,161 యూనిట్లు కాగా, ఈసారి 1,10,214 యూనిట్లకే పరిమితమైంది. ఈ విభాగంలో కంపెనీ అమ్మకాలు గతనెల్లో 33 శాతం క్షీణించాయి. ఆటో రంగానికి తక్షణ చర్యలు: సియామ్ సంక్షోభంలో కూరుకుపోయిన ఆటో రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) అంటోంది. వస్తు, సేవల పన్ను తగ్గింపు, స్క్రాపేజ్ పాలసీ వంటి నిర్ణయాలను సత్వరం తీసుకుని పరిశ్రమను ఆదుకోవాలని కోరింది. ‘జీఎస్టీ రేటును ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని గతంలోనే కోరగా.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ రేటు తగ్గితే వాహన ధరలు తగ్గి డిమాండ్ పెరిగేందుకు అవకాశం ఉందని భావిస్తునాం’ అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. -
‘డీజిల్ కార్లు’ కొనసాగుతాయి: మారుతి
న్యూఢిల్లీ: సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తి ఇక మీదట కూడా కొనసాగుతుందని దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి బీఎస్–6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో ఈ తరహా కార్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుందనే అనుమానాలకు సమాధానంగా సంస్థ చైర్మన్ ఆర్.సి భార్గవ ఈ మేరకు ప్రకటనచేశారు. ఉత్పత్తి నిలిపివేత అంశంపై బదులిచ్చిన ఆయన.. ‘డీజిల్ కార్ల ఉత్పత్తి ఆపేస్తామని ఎన్నడూ చెప్పలేదు. రానున్న రోజుల్లో చిన్నపాటి డీజిల్ ఇంజిన్ కార్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి కనుక.. ఎంట్రీ లెవెల్ విభాగంలో వినియోగదారులు కొనుగోలు చేయదగిన వాటిని మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రణాళిక రూపొందించాం. ఈ క్యాటగిరీలో మార్కెట్ సీఎన్జీ వైపు మారుతోంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 51 శాతం వాటా ఉన్న మా సంస్థ.. ఉత్పత్తి పూర్తిగా ఆపివేస్తే వాటా తగ్గిపోతుంది. కేవలం మా సంస్థ కార్లు మాత్రమే కాకుండా.. అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుంది’ అని వివరించారు. -
కాలుష్యాన్ని ‘కలిపి’ కొట్టేద్దాం..!
బస్సులేమో కాలుష్య భూతాలు. విద్యుత్ వాహనాలు వాడదామంటే ఖరీదెక్కువ. అమ్మబోతే అడవి... కొనబోతే కొరివిలాగా అన్నమాట. ఇక పెట్రోల్, డీజిల్ వాహనాలతో కాలుష్యం ఎక్కువని గ్యాస్ వాహనాలు వాడుతున్న విషయం తెలిసిందే. ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాలతోనూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి తరుణోపాయం? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పరిశోధనల పుణ్యమాని ఇప్పుడు ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం దొరికింది. దాని పేరు.. హెచ్ సీఎన్జీ. ఏమిటది? మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఐవోసీ పరిశోధనల్లో అన్ని ఇంధనాల కంటే మెరుగైనదిగా రుజువైన హైడ్రోజన్‌ను సీఎన్జీతో తగు మోతాదులో కలిపితే కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఐవోసీ గుర్తించింది. విస్తృత పరిశోధనల తర్వాత 18 శాతం హైడ్రోజన్, 82 శాతం సీఎన్జీ మిశ్రమంతో గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని నిర్ధారణకు వచ్చింది. ఇవీ లాభాలు... హెచ్ సీఎన్జీ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందని ముందే చెప్పుకున్నాం. కొంచెం వివరంగా చూస్తే.. ఈ కొత్తతరం ఇంధనం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 70 శాతం (సీఎన్జీతో పోలిస్తే) తగ్గిపోతాయి. అంతేకాదు మైలేజీ 3 నుంచి 4 శాతం పెరుగుతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న బస్సుల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకపోవడం, సీఎన్జీ స్టేషన్లలో హైడ్రోజన్ ఉత్పత్తికి స్టీమ్ మీథేన్ రిఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటే సరిపోవడం దీంతో వచ్చే అదనపు ప్రయోజనాలు. అయితే కాలుష్య కారక వాయువుల్లో ఒకటైన నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాల్లో మాత్రం తేడా ఉండదు. పరీక్షలు పూర్తి హెచ్ సీఎన్జీ ఇంధనంతో ఐవోసీ ఇప్పటికే ప్రయోగాలు పూర్తి చేసింది. ఫరిదాబాద్, హర్యానాల్లో 2 బస్సులపై చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి కూడా. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఐవోసీ సాధించిన ఫలితాలను నిర్ధారించింది. మరిన్ని పరీక్షల కోసం ఐవోసీ మూడేళ్లపాటు ప్రయత్నాలు చేసింది. చివరకు ఢిల్లీలోని 2 బస్సు డిపోల్లో సుమారు 50 బస్సుల్లో హెచ్ సీఎన్జీ ఇంధనం వాడటానికి అవకాశం లభించింది. వీటిని రానున్న ఆరేడు నెలలు పరీక్షించి చూస్తారు. ఫలితాలను బట్టి తగిన మార్పులు చేర్పులు చేసి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఐవోసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కిలో హైడ్రోజన్ రూ.840 హెచ్ సీఎన్జీతో ఎన్నో ప్రయోజనాలున్నా.. ప్రస్తుతానికి హైడ్రోజన్ ఉత్పత్తికయ్యే వ్యయం కొంచెం ఎక్కువే. స్టీమ్ మీథేన్ రిఫార్మేషన్ పద్ధతిలో ఒక్కో కిలో హైడ్రోజన్ ఉత్పత్తికి రూ.840 దాకా ఖర్చు అవుతుంది. దీని ఫలితంగా కిలోమీటర్ ప్రయాణానికి 72 పైసలు అధికంగా ఖర్చు అవుతుందని ఐవోసీ ఉన్నతాధికారి ఎస్ఎస్వీ కుమార్ తెలిపారు. కానీ దీన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలు చేస్తే మాత్రం ఈ అదనపు ఖర్చు ఉండదని అన్నారు. హెచ్ సీఎన్జీ సాంకేతికతను ప్రపంచంలో దేశంలోనే తొలిసారి ఉపయోగిస్తున్నారు. దీనిపై పేటెంట్ కూడా మనదే. ఢిల్లీ పరీక్షలు విజయవంతమైతే ఐవోసీ దీన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. నగరాల్లో గ్యాస్ పంపిణీకి మేము ఇప్పటికే కొన్ని టెండర్లు దక్కించుకున్నాం. ఆయా నగరాల్లో ఈ టెక్నాలజీ వాడతాం. – ఎస్ఎస్వీ కుమార్ -
జగిత్యాలలో సీఎన్జీ సరఫరా హక్కులు ఐఓసీకి
న్యూఢిల్లీ: తెలంగాణలోని జగిత్యాలలో సీఎన్జీ సరఫరా లైసెన్స్ ఐఓసీకి దక్కింది. జగిత్యాలతో పాటు ఔరంగాబాద్(బిహర్), రేవా (మధ్య ప్రదేశ్)ల్లో ఈ కంపెనీ వాహనాలకు సీఎన్జీని, గృహాలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేసే హక్కులను పొందింది. పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్...48 నగరాల్లో సీఎన్జీ గ్యాస్ సరఫరా బిడ్ల వివరాలను వెల్లడించింది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ గ్యాస్‌కు 11 నగరాల్లో సీఎన్జీ సరఫరా లైసెన్స్‌లు లభించాయి. అలహాబాద్ సహా మొత్తం 11 నగరాల్లో సీఎన్జీని సరఫరా చేసే హక్కులను అదానీ గ్రూప్ సాధించింది. దీంట్లో ఆరు నగరాల్లో సొంతంగానూ, ఇతర నగరాల్లో ఐఓసీతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌తో అదానీ సీఎన్జీని సరఫరా చేస్తుంది. బీపీసీఎల్‌కు చెందిన భారత్ గ్యాస్ రీసోర్సెస్ సంస్థకు ఆరు నగరాల్లో లైసెన్స్‌లు లభించాయి. టొరంట్ గ్యాస్ కంపెనీకి కూడా ఆరు నగరాల్లో గ్యాస్ సరఫరా చేయడానికి లైసెన్స్‌లు వచ్చాయి. గెయిల్‌కు చెందిన గెయిల్ గ్యాస్ మూడు నగరాల్లో గ్యాస్ రిటైలింగ్ లైసెన్స్‌లు పొందింది. -
రెండేళ్ల గరిష్టానికి గ్యాస్ ధరలు పెంపు
న్యూఢిల్లీ : దేశీయంగా నేచురల్ గ్యాస్ ధర రెండేళ్ల గరిష్టానికి పెరుగబోతోంది. వచ్చే వారంలో ప్రభుత్వం ఈ పెంపుపై నిర్ణయం ప్రకటించబోతుంది. ఈ ప్రభావం సీఎన్జీ ధర, ఎలక్ట్రిసిటీ, యూరియా ఉత్పత్తి వ్యయాలపై కూడా పడనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి అయ్యే నేచురల్ గ్యాస్ ధర ఒక్కో మిలియన్ బ్రిటన్ థర్మల్ యూనిట్‌కు 3.06 డాలర్లకు పెరుగనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ ధర 2.89 డాలర్లుగా ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ధరలను నిర్ణయిస్తారు. దేశీయ రేటు కంటే కూడా భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్‌పైనే ఎక్కువగా వ్యయమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు ఒక్కో ఎంఎంబీటీయూ రేటు 3.06 డాలర్లుగా ఉండబోతుంది. 2016 ఏప్రిల్-సెప్టెంబర్ నుంచి ఇదే అత్యధిక స్థాయి. ఈ ధరల పెంపుతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రొడ్యూసర్లకు భారీగా రెవెన్యూలు రానున్నాయి. దీంతో సీఎన్జీ ధర పెరగడంతో నాటు, యూరియ, పవర్ ఉత్పత్తి వ్యయాలను పెంపుకు దోహదం చేయనుంది. గత ఆరు నెలల కాలం 2017 అక్టోబర్ నుంచి 2018 మార్చి వరకు ఒక్కో ఎంఎంబీటీయూ ధర 2.89 డాలర్లుగా ఉంది. 2.48 డాలర్ల నుంచి అక్టోబర్‌లో ఈ మేరకు పెంచారు. ఐదు సార్లు తగ్గింపు అనంతరం అక్టోబర్‌లో ఈ పెంపు చేపట్టారు. -
ఎల్ఎంవో అనుమతి లేకపోతే జరిమానా
సాక్షి, ముంబై : ఎలాంటి ఆధారం లేకుండా సీఎన్జీని సరఫరా చేస్తున్న నగరంలోని పెట్రోల్ బంక్‌లకు ‘ద లీగల్ మెట్రాలజీ ఆర్గనైజేషన్’ (ఎల్ఎంవో) జరిమానా విధించింది. కాగా, నగరంలోని 128 పెట్రోల్ బంక్‌లకు జరిమానా విధించగా, ఠాణేలో 47, పుణేలో 68 పెట్రోల్ బంక్‌లకు జరిమానా విధించి రూ.మూడు కోట్లను వసూలు చేసింది. ఇదిలా వుండగా, సదరు పెట్రోల్ బంక్‌లు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ను ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే సరఫరా చేస్తున్నాయని చాలా ఫిర్యాదులు అందాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఈ పెట్రోల్ బంక్‌లు వినియోగదారులకు చాలా తక్కువ పరిమాణంలో సీఎన్జీని సరఫరా చేస్తున్నారని ఆర్గనైజేషన్ పేర్కొంది. ఈ సందర్భంగా ఎల్ఎంవో కంట్రోలర్ అండ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ పాండే మాట్లాడుతూ.. తాము నగరంలో 128 సీఎన్జీ పంప్‌లపై చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా ఠాణేలోని 47, పుణేలోని 68 పంపింగ్ స్టేషన్లపై కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మహానగర్ గ్యాస్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియమ్, భారత్ గ్యాస్, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ ఇవే కాకుండా ప్రైవేట్ డీడర్స్ కూడా వీరిలో ఉన్నారని ఆయన తెలిపారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా సీఎన్జీని సరఫరా చేస్తుండడంతో వీరికి జరిమానా విధించగా రూ.మూడు కోట్లు చేకూరాయన్నారు. అయితే సీఎన్జీకి కూడా లీగల్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ ధ్రువీకరణ పత్రం అవసరమని తమకు తెలియదని పెట్రోల్ బంక్ యాజమాన్యం పేర్కొందని పాండే తెలిపారు. ఒక వేళ పంప్ ధ్రువీకరణ పత్రం పొందనట్లయితే సదరు పంప్‌లు వినియోగదారులను మోసం చేస్తున్నాయనే భావించాల్సి ఉంటుందన్నారు. పెట్రోల్ పంప్‌లు కూడా ఆర్గనైజేషన్ ధ్రువీకరణ పత్రం పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా వాహనాలకు గ్యాస్ సరఫరా చేసేవారు ఈ ధ్రువీకరణ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందన్నారు. గత నెల రోజుల నుంచి వీరిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. దీంతో చాలా సీఎన్జీ పంప్‌లు ధ్రువీకరణ పొందలేదని నిర్ధారణ అయిందని పాండే తెలిపారు. -
సీఎన్జీ.. నో స్టాక్
మహా నగరానికి సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) సరఫరా నిలిచి పోయింది. దీంతో నగరంలోని సుమారు 25 వేల సీఎన్జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం (గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాక్షి, హైదరాబాద్: మహా నగరానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నగర శివారులోని శామీర్పేటలోగల మదర్స్టేషన్కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ఆగిపోయింది. ఫలితంగా మదర్ స్టేషన్‌కు సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 30 ఫ్లాట్లతో పాటు మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు వంటగ్యాస్(పీఎన్జీ), నగరంలోని 15 ఫిల్లింగ్ స్టేషన్లకు సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన గెయిల్ పైప్‌లైన్ ఘటన ప్రభావం పైప్‌లైన్ గ్యాస్ సరఫరాపై పడినట్లయింది. ఆగిన సీఎన్జీ వాహనాలు: నగరంలోని సుమారు 25వేల సీఎన్జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం(గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సీఎన్జీ సరఫరా లేకపోవడంతో పెట్రోల్ బంకుల్లోని స్టేషన్లను మూసివేసి నో స్టాక్ అని బోర్డులను ప్రదర్శించారు. దీంతో మంగళవారం రాత్రి పలు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. వాస్తవంగా నగరంలోని ఒక్కో స్టేషన్‌కు ప్రతి రోజూ 1000 ఆటోలు, 200 కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలుకాగా 4 కిలోల వరకు, కార్ల సామర్థ్యం పదికిలోలు కాగా ఎనిమిది కిలోల వరకు నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. అంటే సగటున ప్రతిరోజూ మొత్తం స్టేషన్లకు 90 వేల కిలోల గ్యాస్ సరఫరా అవసరం. వారం వరకు సరఫరా బంద్: గెయిల్ దుర్ఘటన దృష్ట్యా పైప్‌లైన్ పనుల మరమ్మతులకు వారం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పలు సీఎన్జీ వాహనాలకు ప్రత్యాయ్నాయం లేకుండా పోయింది. ఆటోడ్రైవర్ల ఆందోళన: సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆటో్రైడె వర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఆటోలను నడిపితే రాయితీలతో పాటు ఐదేళ్ల పాటు రోడ్డు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో వేల రూపాయలు ఖర్చు చేసి సీఎన్జీ కిట్స్ అమర్చుకున్న ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం స్టేషన్ల ముందు పడిగాపులు గాస్తున్నారు. -
సీఎన్జీపై రూ.15 తగ్గింపు
న్యూఢిల్లీ: కంప్రెష్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైపుల్లో సరఫరా అయ్యే వంటగ్యాస్(పీఎన్జీ) ధరలు తగ్గనున్నాయి. ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, సూరత్ తదితర నగరాలకు గ్యాస్ కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సీఎన్జీ ధర కేజీకి ఏకంగా రూ.15, పీఎన్జీ ధర రూ. 5 తగ్గనున్నాయి. ఢిల్లీలో రూ.50గా సీఎన్జీ ధర రూ.15(30 శాతం), పీఎన్జీ ధర ఘనపు మీటరుకు రూ.5(20 శాతం) తగ్గుతాయని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ సోమవారమిక్కడ చెప్పారు. సీఎన్జీ, పీఎన్జీ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెస్తామని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బీసీ త్రిపాఠీ తెలిపారు. సీఎన్జీ ధర ఢిల్లీలో గత నెల రూ.4.50 పెరిగి రూ.50.10కి చేరడంతో రిటైలర్లు మూడు రెట్ల అధిక ధరతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపింది. ఆటో డ్రైవర్లు సమ్మెకు దిగుతామని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. దేశీయ గ్యాస్ క్షేత్రాల నుంచి నగరాల్లోకి గ్యాస్ సంస్థలకు కేటాయింపులను 80 శాతం నుంచి వంద శాతానికి పెంచామని మొయిలీ తెలిపారు. -
మళ్లీ పెరగనున్న సీఎన్జీ ధర
న్యూఢిల్లీ: ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. ఏప్రిల్‌లో కిలోకి ఏకంగా రూ.8.2 పెరగవచ్చని సం బంధిత వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో సీఎన్జీ సరఫరా చేస్తున్న ఇంద్రపస్థాన్ లిమిడెట్ గత నెలలో కిలోకి రూ.4.50లు పెంచడంతో కిలో ధర రూ.50.10కి పెరిగింది. దీనిపై నగరవ్యాప్తంగా ఆందోళనలు రావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలుగుజేసుకొని ధరలు ఎం దుకు పెంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఐజీఎల్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. అయితే ప్రపంచ మార్కెట్లో వీటి ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెంచక తప్పల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆ సంస్థ తెలిపింది. -
ఆప్ ఆమోదంతోనే పెరిగాయి : బీజేపీ
సీఎన్జీ ధరల పెంపులో ఆప్ హస్తం కూడా ఉందని బీజేపీ ఆరోపించింది. వీలైనంత త్వరగా పెంపును వెనక్కి తీసుకోకుంటే భారీ ఉద్యమం చేపడుతామని హెచ్చరించింది. ‘కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే అధికారులు సీఎన్జీ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని నమ్మకం కష్టం. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించకముందే సీఎన్జీ ధరల ఉపసంహరణపై ప్రకటన చేయాలి. లేకపోతే మా పార్టీ భారీ ఆందోళనకు దిగుతుంది’ అని విధానసభ పక్ష నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలతో శుక్రవారం విధానసభలో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. సీఎన్జీ ధరల పెంపు వల్ల సామాన్యులపై తీవ్రభారం పడుతుందని, ద్రవ్యోల్బణమూ పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న దిల్లీవాలాలకు ఈ భారాన్ని తట్టుకునే శక్తి లేదని హర్షవర్ధన్ అన్నారు. -
టాటా ఇండిగో, ఇండికా సీఎన్జీ వేరియంట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ ఇండిగో, ఇండికా కార్లలో ఇమ్యాక్స్ సిరీస్ వేరియంట్లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇమ్యాక్స్ సిరీస్‌లో సీఎన్జీ, పెట్రోల్-బై ఫ్యూయల్ సిస్టమ్ ఆప్షన్ ఉంటుందని కంపెనీ వివరించింది. టాటా ఇండిగో ఇమ్యాక్స్ వేరియంట్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.5.27 లక్షలు, టాటా ఇండికా ఇమాక్స్ వేరియంట్ ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.4.26 లక్షల రేంజ్లో ఉన్నాయని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ పేర్కొంది. సీఎన్జీ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే సీఎన్జీ మోడళ్లను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్(కమర్షియల్)) అంకుష్ అరోరా చెప్పారు. ఈ కొత్త వేరియంట్లు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. టాటా మోటార్స్ కంపెనీ ఈ ఏడాది జూన్‌లో హొరెజెనైక్స్ట్ ఈవెంట్ సందర్భంగా ఇమ్యాక్స్ రేంజ్‌ను ప్రదర్శించింది. మొదటగా నానో ఇమాక్స్ను అందుబాటులోకి తెచ్చింది. -
మరోసారి వడ్డన
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే సంస్థలు (డిస్కమ్‌లు) ‘మహానిర్మితి’, ‘మహాపారేషణ్’ 2010 నుంచి విద్యుత్‌శాఖకు (మహావితరణ) చెల్లించాల్సిన బకాయిలు వసూలు చేసేందుకు మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎంవీఆర్సీ) అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రెండు డిస్కమ్‌ల అధీనంలో ప్రాంతాల వినియోగదారులపై అదనపు భారం తప్పకపోవచ్చు. మహానిర్మితి, మహాపారేషణ్ విద్యుత్‌శాఖకు సుమారు రూ.3,686 కోట్లు బకాయి పడ్డాయి. వీటిని వసూలు చేసేందుకు అనుమతి లభించడంతో ఈ మొత్తాన్ని వినియోగదారుల ద్వారా రాబట్టనుంది. ఫలితంగా ఇక నుంచి యూనిట్‌కు 80-90 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ముంైబె కర్లకు విద్యుత్ సరఫరాచేస్తున్న ‘బెస్ట్’ సంస్థ సెప్టెంబరు నుంచి చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహావితరణ రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులపై చార్జీల భారం మోపుతోంది. ఇందులో దాదాపు 1.20 కోట్ల మందికిపైగా వినియోగదారులు 100-300 యూనిట్లు వాడేవారున్నారు. పెరిగిన చార్జీల వల్ల 100 యూనిట్లు వాడే వారికి నెలకు అదనంగా రూ.90 భారం పడనుంది. మహానిర్మితి, మహాపారేషణ్కు బకాయిలు వసూలు చేసేందుకు మొదట్లోనే అనుమతి ఇచ్చినట్లయితే వినియోగదారులపై ఇప్పుడు ఈ భారం పడేది కాదని అంటున్నారు. సదరు కంపెనీలు ఏళ్ల తరబడి విద్యుత్ చార్జీలు పెంచడం లేదు. ఎంవీఆర్సీ అనుమతివ్వడంతో చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో వినియోగదారులపై ఒకేసారి పెద్ద ఎత్తున అదనపు భారం పడుతుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీలు పెంచితే యూనిట్‌కు 20-30 పైసల చొప్పున భారం పడేది. కాని ఏకంగా యూనిట్‌కు 90 పైసలు పెంచడంతో 200-300 యూనిట్లు వాడేవారికి ఏకంగా నెలకు అదనంగా రూ.250 వరకు బిల్లు వచ్చే ఆస్కారం ఏర్పడింది. సీఎన్జీ ధరలు కూడా విద్యుత్ చార్జీలకు సీఎన్జీ తోడయింది. ఇటీవలే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫలితంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎన్జీ ధరలు పెరిగాయి. కిలో సీఎన్జీ ధరను రూ.మూడు చొప్పున పెంచుతున్నట్టు సంబంధిత అధికారులు శుక్రవారం ప్రకటించారు. కొత్త ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబై: రూ. 38.95 ఠాణే: రూ. 39.69 నవీముంబై: రూ. 39.44