
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్న సమయంలో CNG, PNG ధరలు తగ్గడం నిజంగా హర్షించదగ్గ విషయం. సీఎన్‌జీ, పీఎన్‌జీ కొత్త ధరలు రేపు (ఏప్రిల్ 09) ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి.
ధరల తగ్గుదల తరువాత నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.
ఢిల్లీ:
సీఎన్‌జీ: కేజీ రూ. 73.59
పీఎన్‌జీ : ఎస్‌సిఎమ్ (స్టాండర్డ్ పర్ క్యూబిక్ మీటర్) రూ. 48.59
నోయిడా:
సీఎన్‌జీ: కేజీ రూ. 77.20
పీఎన్‌జీ: ఎస్‌సిఎమ్ రూ. 48.46
ఘజియాబాద్:
సీఎన్‌జీ: కేజీ రూ. 77.20
పీఎన్‌జీ: ఎస్‌సిఎమ్ రూ. 48.46
గురుగ్రామ్:
సీఎన్‌జీ: కేజీ రూ. 82.62
పీఎన్‌జీ: ఎస్‌సిఎమ్ రూ. 47.40
కొన్ని నివేదికల ప్రకారం, రానున్న రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్‌జీ వాహనాలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి విముక్తి పొందటానికి సీఎన్‌జీ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పాలి.
(ఇదీ చదవండి: రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?)
దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి, టయోటా వంటి వాహన తయారీ సంస్థలు కూడా సీఎన్‌జీ వాహనాలను విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే సీఎన్‌జీ వాహనాలు అధిక మైలేజ్ అందించడం వల్ల ఎక్కువ మంది ఈ కార్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment