new prices
-
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
చమురు కంపెనీలు ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను సవరిస్తాయి. అందులో భాగంగా కొత్త ధరలు నేడు విడుదలయ్యాయి.జూలైలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను రూ .30 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా మూడో నెల. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.వాణిజ్య సిలిండర్ల తాజా రేట్లుదేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676గా ఉండగా నేటి నుంచి రూ.1646కు చేరింది. కోల్‌కతాలో రూ.1756, ముంబైలో రూ.1598, చెన్నైలో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1809.50లకు ఎగిసింది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803లుగా ఉంది. -
పెరగనున్న పాల ధరలు.. ఆగష్టు 01 నుంచే..
టమాట ధరల పెరుగుదల మిగతా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపుతోంది. కర్ణాటకలో పాల ధరలు కూడా 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్ఎఫ్) బృందం & ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య జరిగిన సమావేశం తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని (Nandini) ధరలు లీటరుకు రూ. 3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కారణంగా పాల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కెఎమ్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. కెఎమ్ఎఫ్ చైర్మన్ భీమా నాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను ఆమోదించింది. కావున కొత్త ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ధరల పెరుగుదల కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని.. పెరుగు, ఇతర పాల పదార్థాలు వర్తించే అవకాశం లేదని తెలిపారు. (ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 సన్‌రూఫ్ ఫీచర్ కార్లు - వివరాలు) ప్రస్తుతం మార్కెట్లో నందిని టోన్డ్ మిల్క్ ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కి చేరుతుంది. పాల పొడి ధరలు కూడా పెంచాలన్న బృందం విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియంత్రణలో నడిచే నందిని ఇప్పుడు పాల ధరను పెంచనుండడంతో మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. నందిని రూ.3 పెంచితే ప్రైవేట్ కంపెనీలు కనీసం రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి. -
బైక్ ప్రేమికులకు షాక్.. మళ్ళీ పెరిగిన హీరో మోటోకార్ప్ ధరలు!
Hero MotoCorp Price Hike: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ' హీరోమోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు తమ వాహనాల ధరలను మరో సారి పెంచింది. పెరిగిన ధరలు జులై 03 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, హీరో మోటోకార్ప్ ఈ సారి సగటున 1.5 శాతం ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల వేరియంట్, మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ మోడల్ మీద ఎంత పెరిగింది అనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. గతంలో.. హీరో మోటోకార్ప్ మూడు నెలలకు ముందు కూడా తమ వాహనాల ధరలను పెంచింది. కాగా మళ్ళీ ఇప్పుడు మరో సారి పెంచినట్లు ప్రకటించింది. ముడి సరకుల ఖర్చులతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ధరల పెరుగుల జరిగినట్లు తెలిసింది. అయితే కొనుగోలుదారులకు ధరల పెరుగుదల నుంచి కొంత ఉపశమనం కలిగించడానికి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ప్రొగ్రామ్‌లను అందించనుంది. (ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం!) రానున్న పండుగ సీజన్లో వాహనాల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆఫర్స్ అందించడం జరుగుతుంది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఎక్స్ట్రీమ్, స్ప్లెండర్ మొదలైన వెహికల్ ధరలు మరో రెండు రోజుల్లో పెరగనున్నాయి. -
మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?
LPG Cylinder Price: పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు 'ఎల్పీజీ' (LPG) ధరలు కూడా మారుతూ ఉంటాయి. తాజాగా మరో సారి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఎల్పీజీ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు (2023 జూన్ 01) నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు భారీ ఊరటను కలిగించనున్నాయి. ప్రస్తుతం తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్‌కి మాత్రమే వర్తిస్తాయి. కాగా డొమెస్టిక్ గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) 14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కావున దీని ధర రూ. 1133 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1856.50 వద్ద నుంచి రూ. 1773 కి తగ్గింది. అంటే ఈ ధరలు మునుపటి కంటే రూ. 83 తగ్గినట్లు తెలుస్తోంది. 2023 మే 1న కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు ఏకంగా రూ. 171.50 తగ్గాయి. అప్పుడు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గి, డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు కొంత నిరాశ చెందుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సూపర్ మీటియోర్ 650 ధరలు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే తన 'సూపర్ మీటియోర్ 650' బైకుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ బైక్ ధరలను ఇప్పుడు ఒక్క సారిగా రూ. 5000 వరకు పెంచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ ఈ సూపర్ మీటియోర్ 650 ధరలను పెంచిన తరువాత ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.54 లక్షలు. ఇది ఆస్ట్రల్, ఇంటర్స్టెల్లార్, సెలెస్టియన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు కూడా రూ. 5వేలు పెరిగాయి. కావున ఈ బైక్స్ కొనాలనుకునే కస్టమర్లు కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బేస్ వేరియంట్ అయిన ఆస్ట్రల్ మూడు సింగిల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్స్. ఇక మిడ్ స్పెక్ వేరియంట్ ఇంటర్స్టెల్లార్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి గ్రే, గ్రీన్ అనే డ్యూయెల్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే మొదటి రెండు వేరియంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే టాప్ వేరియంట్లో మాత్రం పెద్ద ఫ్రంట్ స్క్రీన్, టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్ వంటి అదనపు యాక్ససరీస్ లభిస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైకులో 648 సిసి ప్యారలల్ ట్విన్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 bhp పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున పనితీరుపరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్, బ్లూ టూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు భూమి నుంచి 650 మిమీ. 241 కేజీల బరువు కలిగిన ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్లు. కావున లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ రోజు నుంచి (2023 మే 1) కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ పెట్రోలియం అండ్ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీని ఫలితంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ మీద ఇప్పుడు రూ. 171.50 తగ్గింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ LPG గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పులు లేదు. సాధారణంగా కమర్షియల్ సిలిండర్లు హోటల్ వంటి వాణిజ్య వినియోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. కాగా డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ధరల తగ్గింపుల తరువాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1856.50. అదే సమయంలో కలకత్తాలో దీని ధర రూ. 1960.50కి చేరింది. ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఈ ధరలు వరుసగా రూ. 1808 & రూ. 2021కి చేరాయి. నిజానికి డొమెస్టిక్ సిలిండర్ ధరల కంటే కమర్షియల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉంటాయి. 2022లో ఎల్పీజీ ధరలు నాలుగు సార్లు పెరిగాయి, మూడు సార్లు తగ్గాయి. ఆంటే ఓకే సంవత్సరంలో మొత్తం ఏడు సార్లు ధరలలో మార్పులు జరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం నిజంగానే హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. -
భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్న సమయంలో CNG, PNG ధరలు తగ్గడం నిజంగా హర్షించదగ్గ విషయం. సీఎన్జీ, పీఎన్జీ కొత్త ధరలు రేపు (ఏప్రిల్ 09) ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. ధరల తగ్గుదల తరువాత నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు. ఢిల్లీ: సీఎన్జీ: కేజీ రూ. 73.59 పీఎన్జీ : ఎస్సిఎమ్ (స్టాండర్డ్ పర్ క్యూబిక్ మీటర్) రూ. 48.59 నోయిడా: సీఎన్జీ: కేజీ రూ. 77.20 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 48.46 ఘజియాబాద్: సీఎన్జీ: కేజీ రూ. 77.20 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 48.46 గురుగ్రామ్: సీఎన్జీ: కేజీ రూ. 82.62 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 47.40 కొన్ని నివేదికల ప్రకారం, రానున్న రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ వాహనాలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి విముక్తి పొందటానికి సీఎన్జీ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పాలి. (ఇదీ చదవండి: రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?) దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి, టయోటా వంటి వాహన తయారీ సంస్థలు కూడా సీఎన్జీ వాహనాలను విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాలు అధిక మైలేజ్ అందించడం వల్ల ఎక్కువ మంది ఈ కార్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. -
ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి
భారతదేశంలో 2023 ఏప్రిల్ 1నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి, అదే సమయంలో మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దేశీయ పరిశ్రమలకు మద్దతుగా దిగుమతి సుంకాలను పెంచాలను కేంద్రం యోచిస్తోంది. ఈ కారణంగా ధరలలో కొత్త పరిణామాలు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, జ్యువలరీకి సంబంధించిన వస్తువులు, హై-గ్లోస్ పేపర్ వంటి వాటితో పాటు ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు ధరలు తారా స్థాయికి చేరుకోనున్నాయి. కెమెరా లెన్స్, స్మార్ట్‌ఫోన్, సైకిళ్ళు, బొమ్మలు ధరలు తగ్గనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఈ కార్ల ఉత్పత్తికి హోండా మంగళం: ఏప్రిల్ నుంచే షురూ!) బడ్జెట్ ప్రజెంటేషన్‌లో బట్టలు, ఫ్రోజెన్ మస్సెల్స్, ఫ్రోజెన్ స్క్విడ్, ఇంగువ, కోకో గింజలపై కస్టమ్స్ పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఎసిటిక్ యాసిడ్, కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కెమెరా లెన్స్‌లపై దిగుమతి పన్నులు తగ్గాయి. ఖరీదైనవిగా మారే వస్తువులు: ఎలక్ట్రానిక్ చిమ్నీలు జ్యువెలరీ వస్తువులు బంగారం ప్లాటినం వెండి పాత్రలు దిగుమతి చేసుకున్న వస్తువులు ధరలు తగ్గే వస్తువులు: బొమ్మలు సైకిళ్ళు టీవీ మొబైల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎల్ఈడీ టీవీలు కెమెరా లెన్సులు -
Mahindra Thar RWD: మొన్న విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు
అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ ఇటీవల ఆర్‌డబ్ల్యుడి వెర్షన్‌గా పుట్టుకొచ్చింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు, అప్పుడే దీని ధరలు భారీగా పెరిగాయి. మహీంద్రా థార్ RWD (రియర్-వీల్-డ్రైవ్) ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ప్రారంభంలో కేవలం మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. థార్ ఆర్‌డబ్ల్యుడి AX(O) డీజిల్ MT, LX డీజిల్ MT, LX పెట్రోల్ AT వేరియంట్లలో అందుబాటులో ఉంది. మహీంద్రా థార్ ఎల్ఎక్స్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధరలను మాత్రమే కంపెనీ రూ. 50,000 పెంచింది. కావున ఈ SUV ధరలు ఇప్పుడు రూ. 11.49 లక్షలకు చేరింది. మిగిలిన రెండు వేరియంట్ ధరలు మునుపటి మాదిరిగానే ఉన్నాయి. సరికొత్త మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యుడిలో ఉన్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ దాని 4డబ్ల్యుడి వేరియంట్ మాదిరిగా అదే పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 150 బిహెచ్పి పవర్, 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, థార్ ఆర్‌డబ్ల్యుడి మోడల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇది 117 బిహెచ్పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే ఈ డీజిల్ ఇంజిన్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఇందులో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ అందుబాటులో లేదు. మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యుడి బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. ఈ కొత్త ఆఫ్ రోడర్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి వాటికి సపోర్ట్ చేసే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి కూడా ఇందులో ఉంటాయి. -
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్‌గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్‌పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్‌లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పైపైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం.. 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రైవేట్ కార్లకు ప్రీమియం రూ.2,094గా నిర్ణయించారు. 2019–20లో ఇది రూ.2,072 వసూలు చేశారు. 1,500 సీసీ వరకు రూ.3,416 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.3,221 వసూలు చేశారు. 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కు వచ్చి చేరింది. 150–350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 ఉంది. ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు 30 కిలోవాట్ అవర్ లోపు రూ.1,780, అలాగే 30–65 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉంటే రూ.2,904 చెల్లించాలి. ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. 12–30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి చేరింది. 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242కు సవరించారు. సాధారణంగా థర్డ్ పార్టీ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ప్రకటించేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలను నోటిఫై చేసింది. -
డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడింది: ఏపీఎస్ఆర్టీసీ ఎండి
-
పాత సరుకు..కొత్త ధర
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పాత సరుకును కొత్త ధరలకు అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సిగ రెట్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతే ఇక ఇదే అదనుగా వ్యాపారులు ధరలను పెంచేశారు. కర్నూలుకు చెందిన రాజేష్ రోజూ పాకెట్ సిగరెట్లు తాగే అలవాటు ఉంది. పెద్ద గోల్డ్ సిగరెట్ల ప్యాకెట్‌ను రూ.85కు కొనుగోలు చేసేవాడు. అయితే రెండు రోజులుగా దీని ధర రూ. 130 అయింది. రాజేష్ అలవాటును మానుకోలేక తప్పనిసరిగా అదనంగా ఖర్చు చేస్తున్నాడు. చిన్నగోల్డ్ ప్యాకెట్‌పై రూ.41, బ్రిస్టల్ ప్యాకెట్‌పై రూ.20 ధర పెంచేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు సిగరెట్ వ్యాపారులు అవకాశం వచ్చినప్పుడే సొమ్ము చేసుకొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న పొగరాయుళ్లను లెక్కలోకి తీసుకోవటం లేదు. ‘ఇష్టమైతే తీసుకో.. లేదంటే వెళ్లు’ అని గదమాయించి పంపేస్తున్నారు. అధికారుల అండదండలతోనే వ్యాపారులు ధరలు పెంచారని పొగరాయుళ్లు వాపోతున్నారు. మామూళ్లకు అలవాటుపడిన అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు. కోట్ల రూపాయలను తాగి వదిలేస్తున్నారు జిల్లాలో రెండు సిగరెట్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటి కింద మరికొన్ని సబ్ ఏజెన్సీల ద్వారా సిగరెట్లను సరఫరా చేస్తున్నారు. ఒక్క కర్నూలు నగరంలోనే సిగరెట్లను అమ్మే దుకాణాలు 700కుపైనే ఉన్నట్లు సమాచారం. వారానికి 3 లోడ్ల సిగరెట్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. సిగరెట్ల సరఫరాను బట్టి జిల్లాలో రోజుకు రూ.కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క కర్నూలు నగరంలోనే రోజుకు రూ.కోటికిపైగా సిగరెట్లను పొగరాయుళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతున్నట్లు అనధికారిక సమాచారం. సిగరెట్‌కు అలవాటు పడిన వారు మానేయలేక ధర ఎక్కువైనా తప్పని పరిస్థితుల్లో సిగరెట్లను కాల్చుతూ జేబులను కాల్చుకుంటున్నారు.